Saturday, 8 May 2021

47 ఛీ ఛీ నరుల దేఁటి జీవనము(chI chI narula dEMTi jIvanamu)

ANNAMACHARYA

47 ఛీ ఛీ నరుల దేఁటి జీవనము.

Introduction: No logical thinking person would begin with such a chorus whereas a liberated mind would. Annamacharya wanted to make it absolutely clear that person in meditation is fiercely independent and would not trade it with anything you can imagine. In fact that we are discussing this verse itself proves that he succeeded in putting the message across. This is one of the popular verses.

His asserts that no one can become a devotee by exercise of choice unless one finds it as the only path to tread.

ఉపోద్ఘాతముహేతు బద్ధముగా అలోచించు వాడు ఇలాంటి పల్లవి వ్రాయడు. అత్మానంనదము పొందిన యోగి మాత్రమే ఇటువంటి విపరీతమైన పల్లవి  వాడడానికి చేయడానికి వెనుకాడడు.  ఇటువంటి కీర్తన గురించి చర్చించడమే, దాని సఫలతకు నిదర్శనము. తన స్వతంత్రమును దేనితోను ఎట్టి పరిస్థితులలోను మార్చుకునేందుకు ఇష్టపడనివారే నిజమగు స్వేచ్ఛగల వారు.

ఎవరూ కోరి భక్తులుకాలేరని, భక్తి తప్ప వేరు మార్గము లేదని గ్రహించినవారు తప్పించిఅన్న అన్నమయ్య మాటలు గమనింపతగ్గవి 

ఛీ ఛీ నరుల దేఁటి జీవనము

కాచుకొని హరి నీవే కరుణింతు గాకా ॥పల్లవి॥
 

chI chI narula dEMTi jIvanamu

kAchukoni hari nIvE karuNiMtu gAkA        pallavi

Word to Word Meaningఛీ ఛీ (chI chI) = scornful dismissal; (to indicate extreme displeasure)  నరుల దేఁటి (narula dETi) = these people; జీవనము (jIvanamu) mean and vile Life? కాచుకొని (kAchukoni) = ready to save; హరి నీవే కరుణింతు గాకా (hari nIvE karuNiMtu gAkA)= Oh God please shower kindness on us. 

Literal Meaning and Explanation: boo boo, what vile life men have? Oh God!! Please forgive and save us.

Actually Annamcharya is scornful of life without freedom. He feels we are too easy going to accept our present mean life as true life. He is taking the name of god to show how badly we need him to elevate from the abyss we are in. 

What kind of freedom Annamacharya is hinting at? Is it the freedom, we Indians enjoy after the British have left? Then why all the holy books are stating the man is chained? Please remember one is prison, however decorative that prison may be; a prisoner is free only when he is no longer in the prison.  

On listening to this song, I am reminded of the beautiful poem by William E Henley as given below. 

THE INVICTUS

Out of the night that covers me,

Black as the pit from pole to pole,
I thank whatever gods may be
for my unconquerable soul. 

In the fell clutch of circumstance

I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed. 

Beyond this place of wrath and tears

Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid. 

It matters not how strait the gate,

How charged with punishments the scroll,
I am the master of my fate
I am the captain of my soul.

 

భావము & వివరణము : ఛీఛీ ! మానవుల దెంత హీనమైన బ్రతుకు ! శ్రీహరీ ! నీవే మమ్ము కాచుకొని (కనిపెట్టుకుని) దయజూతువు గాక !

మన ఇప్పటి  స్వతంత్రము లేని బ్రతుకును జుగుప్సాకరమైనదని నీరసించారు. మనము పాప పంకిలములో పడి అదే జీవితమనే అపోహలో ఉన్నామని అరోపించారు. అందుకే దైవమును మనమీద కరుణ చూపమన్నారు.

  రకమైన స్వేఛ్ఛ గురించి మట్లాడుతున్నారు?  1947లో భారతదేశానికి వచ్చిన స్వాతంత్రమా? మరి మత గ్రంథాలన్నీ మనిషి బందీగా మరాడంటున్నది దేని గురించి? అన్నమాచార్యులు చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి అనే కీర్తనలోయెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమి/మెడకుఁ  దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి(తెంపకుండా ,  బంగారు సంకెళ్ళైనాఇనుప సంకెళ్ళైనా నిన్ను పైకి వెళ్ళనివ్వవు. (ఇక్కడే బంధించి ఉంచేస్తాయి). అన్న విషయము గుర్తు పెట్టుకో తగినది. 

కీర్తన విన్నప్పుడు హెన్లీ గారి పైన ఇచ్చిన కవిత గుర్తుకు వస్తుంది. కవితలో కూడా కవి తన (భావస్వతంత్రము కాపాడుకోవడానికి యెన్ని బాధలైనా అనుభవించడానికి సిద్ధమౌతాడు. దాని భావము క్రింద ఇచ్చాను. 

భావసంగ్రహమురాత్రంతటినీ కప్పి వేసిన యీ నల్లని నిశీధి నా జీవితాన్నీ కప్పేస్తోంది. ఐనప్పటికీ తలవంచని ఆత్మ నిచ్చినందుకు భగవంతునికి మొక్కుతాను. 

నన్నావరించిన సమస్యలు నన్ను చిదిమేస్తున్నా మూలగలేదు, బాధతో అరవలేదు. జీవితంలో తగిలిన బండరాళ్ళ దెబ్బలకు రక్తమొచ్చిందేమో కాని విరక్తి కలగలేదు. 

ఇప్పటిదాకా జరిగిన ఘటనలు మదిలో మెదులుతూనే ఉంటాయి. ఐనా అవి నా భవిష్యత్తును ప్రభావితం చేసి భయపెట్టలేవు. 

ముందు దారి యెంత ఇరుకైనదైనా (కష్టమైనదైనా), నా కోసం యెన్ని హింసలు (నరకములో) సిద్ధముగా ఉన్నా, నా భవిష్యత్తుకు నేనే అధికారిని, నా ఆత్మకు నేనే జవాబు దారి. 

అడవిలో మృగజాతియైనాఁ గావచ్చుఁ గాక

వడి నితరులఁ గొలువఁగ వచ్చునా
వుడివోని పక్షియై వుండనైనా వచ్చుఁ గాక
విడువ కెవ్వరినైనా వెఁడవచ్చునా   ఛీ ఛీ

 

aDavilO mRgajAtiyainA gAvachchu gAka

vaDi nitarula goluvaga vachchunA
vuDivOni pakshiyai vuMDanainA vachchu gAka
viDuva kevvarinainA veDavachchunA      chIchI 

Word to Word Meaningఅడవిలో(aDavilO)= in the forest; మృగజాతియైనాఁ (mRgajAtiyainA) = animal family ( any quadruped) ; గావచ్చుఁ గాక (gAvachchu gAka ) = perhaps be; వడిన్ (vaDi) = quickly; ఇతరులఁ(nitarula) = other people; గొలువఁగ వచ్చునా (goluvaga vachchunA) = Should be in service under( another person)? ( should not); వుడివోని (vuDivOni) = permanently; పక్షియై (pakshiyai ) become a bird;  వుండనైనా వచ్చుఁ గాక (vuMDanainA vachchu gAka) = perhaps ( one may) endure such a life; విడువక (viDuvaka)  without intermission; ఎవ్వరినైనా(kevvarinainA) = anyone; వెఁడవచ్చునా (veDavachchunA) = ఇంచుక, అల్పము గావచ్చా? become mean in someone’s view. 

Literal Meaning and Explanation: It’s better to take up the life of an animal  in the forest rather than to serve another man. It’s easier to live the life of a bird to reduce your self-prestige (by begging others for the alms). 

Let us recapitulate the words of Chinnaya Suri from MitraBhedam as below.It’s heinous to sell one's body to others to fill the belly. (Implied meaning: one should not become servant to another man for sustenance) A person in service is mentally dead (because, he is always acting according to his master, not on his own). Yet, if the boss is satisfied servant's services, he may derive certain satisfaction. If neglected by the boss, servant will be inconsolable. Worse, if boss chooses to insult in public, for there are no words to describe such a humiliation." Gruel earned out of own actions are more gratifying than sweet rice pottage (चावल की खीर) got by servitude. Therefore one should be content by what he gets by providence. 

భావము & వివరణము : అడవిలో మృగమై పుట్టి జీవించినను జీవించవచ్చును గాని క్షుద్రమైన బ్రతుకు కొఱకు ఇతర మానవులను సేవించవచ్చునా? (తగదు.) సర్వదా కాకివంటి పక్షిగానైన బ్రదుకవచ్చును గాని ఇతరులను యాచించి తనను తాను తక్కువ చేసుకోవచ్చునా? (తగదు.)

ఇక్కడ స్వతంత్రమును కాపాడుకోవడానికి మృగముగా పుట్టడానికి, పక్షిలా బ్రతకడానికి కూడా సిద్ధమయ్యారు అన్నమయ్య​. సందర్భములో చిన్నయసూరి గారి పలుకులను గుర్తుకు తెచ్చుకుందాము.

(మిత్రభేదములో కరటకుడు దమనకునితో  ఇట్లనును) “ఉదరపోషణముకయి పరులకు శరీరమమ్ముకొనుట మిక్కిలి హేయము. పరాయత్త వర్తనుడు మృత కల్పుఁడు. అయినను సేవకుఁడు స్వకృత్యములయందు స్వామి చేత మన్ననం బడసెనా సేవాదుఃఖము కొంత నిస్తరించును. ఉపేక్షితు డయ్యెనా దానికంటె దుఃఖము లేదు. పరాభూతుఁ డయ్యెనేనిఁ జెప్పవలసిన దేమి? సేవావృత్తిచే వచ్చు పాయసము కంటె స్వచ్ఛంద వృత్తిచే లభించు గంజి మేలు. కాఁబట్టి ప్రాప్త లాభముచేఁ దృప్తిపడి సుఖ ముండుదము.”

పసరమై వెతలేని పాటువడవచ్చు గాక

కసటు వొనరులఁ బొగడవచ్చునా
వుసురు మానై పుట్టివుండనైనావచ్చుఁ గాక
దెసల నెక్కడనైనాఁ దిరుగవచ్చునా            ఛీ ఛీ  

pasaramai vetalEni pATuvaDavachchu gAka

kasaTu vonarula bogaDavachchunA
vusuru mAnai puTTivuMDanainAvachchu gAka
desala nekkaDanainA dirugavachchunA chIchI 

Word to Word Meaningపసరమై (pasaramai) = being a domestic animal;  వెతలేని (vetalEni) = painless; fruitless; పాటువడవచ్చు గాక (pATuvaDavachchu gAka) = may perform hardwork; కసటు (kasaTu) = పాపము, sin;  వొనరులఁ (vonarula) = ఇతరులు , others; బొగడవచ్చునా (bogaDavachchunA) = is it fair to praise;  వుసురు మానై (vusuru mAnai) = a tree with full of life; పుట్టివుండనైనావచ్చుఁ గాక (puTTivuMDanainAvachchu gAka)= birth is conceivable;   దెసల (desalan ) = (in all) directions; నెక్కడనైనాఁ(ekkaDanainA) = anywhere; దిరుగవచ్చునా (dirugavachchunA) = move around ( to get benefits). 

Literal Meaning and Explanation: One may do hard labour like a domestic animal rather than committing the sin of praising others (in anticipation of favours). It’s better to be a tree (remain where you are) instead of man going ( and vexing others to gain benefit)

Look at any of the saints. They never begged for alms nor advised for revenge. They simply bear the things. That is the idea Annamacharya. This particular stanza has reference to the following Bhagavad-Gita verse.

 

यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते : |
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो : मे प्रिय: || 12-15||

yasmān nodvijate loko lokān nodvijate cha yaḥ
harṣhāmarṣha-bhayodvegair mukto yaḥ sa cha me priyaḥ

Purport: Those who are not a source of annoyance to anyone and who in turn are not agitated by anyone, who are equal in pleasure and pain, and free from fear and anxiety, such devotees of Mine are very dear to Me.

భావము & వివరణము : పశువై సుఖములేని పాటైన పడవచ్చును గాని లేని పోని మాటలతో పరుల నుంచి (యేదో ఆశించి) పొగడుట తగదు. ఒక చెట్టుగానైన పుట్టి (స్థిరముగా నుండి)జీవించవచ్చును గాని తాను విసుగు జెందక అడ్డమైనవారి గడప​/గట్టు యెక్కుతూ  (లాభాపేక్షతో) విసిగించుట ఉచితము గాదు.

అన్నమయ్య మాటలు పోతన గారి పద్యాన్ని తల్పిస్తున్నాయి. శమీకమహర్షి తన మెడలో పరీక్షిత్తు వేసిన చచ్చిన పామును తొలగించి, శపించిన తన పుత్రుడు శృంగికి ఇలా బుద్ధి చెప్పసాగాడు. పరమభాగవతుల తత్వం నిర్వచించిన మహా అద్భుత పద్య మిది. 

. పొడిచినఁ, దిట్టినఁ, గొట్టినఁ,

బడుచుందురు గాని పరమభాగవతులు; దా
రొడఁబడరు మాఱు సేయఁగఁ
గొడుకా! విభుఁ డెగ్గు సేయఁ గోరఁడు నీకున్. (1-488, భాగవతము) 

భావము : కుమార! కొట్టినా తిట్టినా పరమభక్తులైన వారు, పరమభాగవతులు శాంతంతో భరిస్తారే తప్ప ప్రతీకారం చెయ్యటానికి అంగీకరించరు. మన మహారాజు నీకు కీడు చేయాలనుకొనడు. 

ఇంకా యీ చరణము భగవద్గీతలోని క్రింది శ్లోకమును తలపింప చేయుచున్నది. 

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే యః
హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః మే ప్రియ: ।। 12-15 ।।

తా:- అర్జునా! ఎవనివలన ప్రపంచము (జనులు) భయమును (క్షోభ) బొందదో, లోకమువలన ఎవడు భయమును (ఉద్వేగము) బొందడో, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత - మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు. 

ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక

కమ్మి హరి దాసుఁడు గావచ్చునా
నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమె కాని
దొమ్ముల కర్మము లివి తోయవచ్చునా        ఛీ ఛీ  

yemmela puNyAlu sEsi yila nElavachchu gAka

kammi hari dAsuDu gAvachchunA
nemmadi SrI vEMkaTESa nI chittame kAni
dommula karmamu livi tOyavachchunA   chIchI 

Word to Word Meaningఎమ్మెలఁ (yemmela) plenty of, significant; పుణ్యాలు (puNyAlu) =  pious deeds, సేసి (sEsi)= performing; యిలన్ (yilan) = in this world; ​ఏలవచ్చుఁ గాక (Elavachchu gAka)= perhaps rule/ govern; కమ్మి (kami) = (భక్తిని) క్రమ్మి, వ్యాపించి, విస్తారించు, by extending worship; హరి దాసుఁడు (hari dAsuDu) = a devotee; గావచ్చునా (gAvachchunA) =can become? నెమ్మది (nemmadi) = quiet, silence, calm, stillness, tranquillity, rest, repose;  శ్రీ వేంకటేశ (SrI vEMkaTESa) = Lrd Venkateswara;  నీ (nI)  = your; చిత్తమె (chittame) = decision; కాని (kAni) = but; దొమ్ముల (dommula) = దొమ్మి దొమ్మిగా కూడి పైబడునట్టి, thrust in numerous quantity; కర్మము లివి (karmamu livi) = works/deeds (of past) తోయవచ్చునా (tOyavachchunA) = can be set aside? 

Literal Meaning and Explanation: By doing good work, one may become king. However, we know not how to become a devotee by spreading devotion to you. (Becoming a true devotee is harder than becoming king. Here it is implying that no one can become a devotee by exercise of choice unless one finds it as the only path to tread). O Lord Venkateswara! Without your blessings it’s impossible for the (human) beings to shed the ever increasing burden of the past.

Here Annamacharya is hitting the nail. A devotee must necessarily be free. Must have unwavering faith yet should not seek shelter. From Bhagavad-Gita we hear that to be a devotee is easier. Therefore entire India has been put on this errand. But here Annamacharya is stating becoming a true devotee is harder than becoming an emperor. Is there contradiction? Really not.  A true meditation is not prayer, but it is an act of unification of the person with the god. If one knows why he is in prayer, it only means, he is  still in consious state. History has proved that Man can achieve any thing that is cognisable. Here in becoming HARIDASU, a man can only act to bring himself to the submission of God. Whether he will be blessed is not in the hands of Man. That is what exactly meant by this stanza.

భావము & వివరణము : పెద్ద పెద్ద పుణ్యకార్యములు చేసి చక్రవర్తియై భూమిని పరిపాలించుటైన సులభమే కాని  యే విధముగా భక్తిని పెంచుకొని  హరిదాసుడు కాగలడు? (హరికి దాసుడౌట  సులభసాధ్యమేనా? ఎవరూ కోరి భక్తులుకాలేరని, భక్తి తప్ప వేరు మార్గము లేదని గ్రహించినవారు తప్పించి అని అర్ధము). శ్రీవేంకటేశ్వరా ! నీ చిత్తము చొప్పున నీవే మమ్ము కాపాడవలెను గాని గుంపులు గుంపు లుగా పైబడుచున్న కర్మములను మాకు మేమై తీసివేయ జాలము.  ​

భక్తుడు స్వేఛ్ఛని కాపాడుకుంటూనే, భగవంతునిమీద అచంచల విశ్వాసము చూపుతూనే, అండ కోరకుండానే భక్తిలో మునిగి ఉంటాడుభగవద్గీతలో భక్తి అన్నింటి కంటే సులభమని సెలవిచ్చారు. ఇక్కడ చక్రవర్తి కావడము కంటే,  భక్తుడౌట కష్టతరమని చెప్పారు.  ఇది గీతలో చెప్పినదానికి విరుద్ధంగా ఉన్నదని భావింపరాదు. ఎందుకంటే నిజమైన భక్తి  అనగా భక్తుడు తనను తాను పరమాత్మలో ఐక్యము చేయు కార్యము. ఎవరైనా తన  భక్తిభావనను గుర్తించగలిగితే వారింకా బాహ్యప్రజ్ఞలోనే ఉన్నట్లు. తాదాత్మ్యము చెందు స్థితికి ఎదగలేదన్న మాట. అనగా బాహ్యప్రజ్ఞలోని వన్నింటినీ మానవుడు సాధించగలడని భావము. భక్తుడు తనను భగవంతుని చరణాలకు అర్పింపగలడు. దైవానిగ్రహము అతనిచేతిలో లేదు. సరిగ్గ ఇదే చెప్పారు యీ చరణములో.

 

zadaz

Reference: copper leaf 15-6, volume: 15-86 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...