Thursday 31 August 2023

T-180 పడఁతి నినుఁ దలచి పో పలుకఁడతఁడు

 అన్నమాచార్యులు

180 పడఁతి నినుఁ దలచి పో పలుకఁడతఁడు

for English version press here

సారాంశం: "ఏకమే కానీ అనేకము"

ఒకే దైవము. అనేక వదనములు.
ఒకే కుటుంబం, అనేక జాతులు.

ఒకే సత్యం, అనేక మార్గాలు.

ఒకే హృదయం, ఎన్నో ఛాయలు.

ఒకే వెలుగు, అనేక ప్రతిబింబాలు.

ఒకే లోకం, ఎన్నో లోపాలు.

ఒక్కటే

మనమంతా ఒక్కటే.

కానీ పెక్కులం."

సుజీ కాస్సెమ్, Rise Up and Salute the Sun: 

కీర్తన సారాంశం:

పల్లవి: అమ్మాయి అతడు పలుకకున్నది నిను తలచి కాదు. నీ ఎడబాటుకు కూడా కాదు. ప్రాణములు సైతము అతనికి అశాశ్వతమే. అన్వయార్ధము: మానవులారా భగవంతుని ప్రేమ మన ప్రస్తుత చేతనావస్థకు చెందినది కాదు. మాటలకందని అతని కరుణాంతరంగము ఎడబాటులను, దేహములను, ప్రాణములను, కాలములను మించి ఆవల నిలిచి వున్న పవిత్ర హృదయములకే అనుభవమునకు వచ్చునది.

చరణం 1: ఓ సుదతీ! "చంద్రుని వంటి నీ ముఖము వెన్నెలలను వెదజల్లుతుంటే- బయటనున్న వెన్నెల వెలుగులో తిరగటానికి అతడిష్టపడటం లేదేమో. ఓ ముదితా! నల్లని వెండ్రుకలతో నీకొప్పును తుమ్మెదల దండుగా తలచి అతని గుండె ఝల్లుమనునేమో!" అని భావించకు.

చరణం 2: ఓ లలితాంగీ! స్వామి నీ దేహలతను తలపింప జేసే లతలను ఉద్యానవనమున చూసిన నువ్వు గుర్తుకు వస్తావని అచటికి పోవటాని కిష్టపడటం లేదని; ఓ తెల్లనిదానా! స్వామి చివురుటాకులను చూసి ఆతనికి నీ లేత పెదవులు  గుర్తుకు వచ్చి గుండె తల్లడిల్లి పోతుంటాడని" అని వూహించకు.

చరణం 3: ఓ కోమలీ! స్వామి నీతో కూడిన సమయములను తలపోసుకొంటూ కాదు; యుక్తి, ఉపాయము, ప్రజ్ఞ, ఆలోచన, నైపుణ్యము గల శ్రీ వేంకటాధిపుని ప్రేమ, యాతని దృష్టి ఈ సామాన్య సరసములపైన, రసవంతమగు చర్చలపైన వుండదు.  

విపులాత్మక వివరణము

 

ఉపోద్ఘాతము: ఈ కీర్తన ఒక కల వంటిది. ఇందులో అన్నమాచార్యులు ఒక స్త్రీ పాత్రను వర్ణిస్తున్నారు. ఆ అమ్మాయి దైవము తన అందాలకు, తన నిష్కపట ప్రేమకు,  మాటలలో చెప్పలేని తమ మధ్యవున్న బాంధవ్యమునకు కట్టుబడి వుండునని తలచి, స్వప్నలోకములలో విహరిస్తూవుంటుంది. ఆ యువతిని సంబోధిస్తూ తయారు చేసిన పాట. 

అన్నమాచార్యులు అనేక విధములుగా మానవుని మనస్సులోని విషయాలను వెలికి తీయ ప్రయత్నించారు. ఓ వనితా నీవు ప్రేమించినవాడు నీ ఎడబాటు అను విరహా తాపములో కొట్టుకొని పోవుటలేదు. అసలు నీ పైన ధ్యాస వున్నదీ తెలియదు. ఉలకడు. పలకడు. చివరికి నీ ప్రాణాలను సైతం లక్ష్యపెట్టడు అని అంటారు. వానికేమి కావలెనో చెప్పకపోతే ఎవరు మాత్రము ఏమి చేయగలరు? 

ఇది శృంగార కీర్తన అని నిర్ణయించుట కష్టమే. అటులని ఆధ్యాత్మ కీర్తన అని చెప్పుటకు లేదు. పాఠకులే దీనికి పరిష్కారము చూపగలరు. ఐదువందల సంవత్సరాల క్రితమే స్కిట్ వంటి కీర్తనను వ్రాయడం అన్నమాచార్యుల సృజనా శక్తికి నిదర్శనము. 

కీర్తన:
రాగిరేకు:  85-1 సంపుటము: 5-320
పడఁతి నినుఁ దలచి పో పలుకఁడతఁడు, నీ-
వెడసినను బ్రాణంబు లెరవులాతనికి ॥పల్లవి॥
 
వెదచల్లు నీ మోమువెన్నెలలఁ దలఁచిపో
పొదలు వెన్నెలబయటఁ బొలయఁడతఁడు
ముదిత నీ నెరులు దురుమును దలఁచిపో యతఁడు
కొదమతేంట్ల గనిన గుండె జల్లనును ॥పడఁతి॥
 
లలితాంగి నీ దేహలత దలఁచి పో యిపుడు
చెలఁగి వనమునకు విచ్చేయఁడతఁడు
వెలఁది నీమోవికావిరి దలఁచి పో యతఁడు
తలిరాకు గని గుండె తల్లడంబౌను ॥పడఁతి॥
 
కోమలిరో నీ యిట్ల కూటములు దలఁచిపో
ప్రేమమితరములపైఁ బెట్టఁడతఁడు
దీమసపు వేంకటాధిపుఁడుగన యాతనికి
సామాన్యసరసతలు సరుకుగావరయ ॥పడఁతి॥ 

 

Details and Explanations: 

పడఁతి నినుఁ దలచి పో పలుకఁడతఁడు, నీ-
వెడసినను బ్రాణంబు లెరవులాతనికి ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఎడసినను=ఎడబాసినప్పటికి; ఎరవులు=అన్యము, ఇతరము, అశాశ్వతము;

భావము: అమ్మాయి అతడు పలుకకున్నది నిను తలచి కాదు. నీ ఎడబాటుకు కూడా కాదు. ప్రాణములు సైతము అతనికి అశాశ్వతమే.

వివరణము: ప్రేమ అనునది ఇరువురి మధ్య వుదయించు రసాయనిక చర్య కాదు. అది కామకేళికి ఒక మార్గమూ కాదు. అది సమయము వృధా చేసుకొను సాధనమూ కాదు. అది ఇంద్రియముల ద్వారా మనము గ్రహించగల విషయమూ కాదు. ప్రేమ అనునది విశ్వమానవ చైతన్యము నందున్నదే కానీ ఏ ఒక్కరికీ చెందని, ప్రాణికోటిని కలుపు అద్వితీయమైన భగవదేచ్ఛ​.

ఈ పల్లవిని వివరించుట కష్టమే. ఎన్ని సార్లు చదివినా అర్ధమవ్వదు. సాల్వడార్ డాలీ, వాల్ట్ డిస్నీ కలిసి చేసిన "డెస్టినొ" అనే చిన్న యానిమేషన్ వీడియో ద్వారా దీనిని వివరించ బోతాను.



స్పానిష్ భాషలో "విధి" అని అర్థం వచ్చే "డెస్టినో", డాలియా క్రోనోస్ వున్న శిల్పాన్ని సమీపించడంతో ప్రారంభమవుతుంది.  క్రోనోస్ పక్కన పెద్ద గడియారం అతడికి కాలము యొక్క ప్రభావమును తెలుపుతుంటుంది. సినిమా అంతటా, డాలియా చుట్టూ కరిగిపోయే లేదా విరిగిపోయే వస్తువులు ఉంటాయి, అంటే జీవితాన్ని శాశ్వతంగా పంచుకోవడానికి ఎవరినీ కనుగొనే అదృష్టం ఆమెకు కలగదు. దీనిని చక్రవ్యూహములో చిక్కిన జీవితము లేదా స్వచ్ఛమైన ప్రేమను పొందలేని పడతిలా వర్ణించవచ్చును.

ఆమె సాల్వడార్ డాలీ వేసిన అనేక చిత్రాల నేపథ్యముగా నృత్యం చేస్తూ వివిధ అన్ని సన్నివేశాల లోనూ కనిపిస్తుంది. డాలియా, క్రోనోస్ వేరు వేరు కాలములకు, దేశములకుచెందిన వారై కూడా వుండవచ్చునని దాదాపు అన్ని సన్నివేశాలలోను ఇరువురి నేపద్థ్యము మారుతూ వుంటుంది. ఆ పెయింటింగ్స్ అధివాస్తవికమైనవి; కలలాంటివి మరియు ఆచరణ సాధ్యం కానివి. పైగా అనుచితమైన ఆశలకు ప్రతీకలు.

డాలియా సుడివలెౘుట్టి చుట్టి పైకిపోవునట్టి దారిలో ఎక్కుతుంది. మోసగాళ్ళ బారిన పడుతుంది. పైనుంచి క్రింద పడిపోతుంది. గంటలా మారుతుంది.  పెద్ద పెద్ద ఫోన్ల పైనుంచి నడిపించి అతనిని చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అన్నమాచార్యులు పడతి, ‘ముదిత, ‘వెలది, ‘లతాంగి, ‘కోమలి అని సంభోదించిన వన్నీ డాలియాకు వర్తిస్తాయి.

ఐతే ఆమె యతనములేమీ ఫలించవు. మనమంతా జీవితములో 'డాలియా'లాగే ఎప్పటికీ తృష్ణతో వుండిపోతామని భావము. క్రింద ఇచ్చిన​ చిట్టచివరికి కనబడె దృశ్యం మన వూహలతో అమర్చుకున్నదే నని, అవేవీ వాస్తవము కానవసరములేదని బోధపడుతుంది.

ఈ రకముగా అన్నమాచార్యులు అమ్మాయీ  "నీ వాడైన దైవమును పొందుటకు ఎడబాటుకు విరహతాపము చెందుతూ వుంటే సరిపోదు. వానిని నీ వైపు త్రిప్పుకొనుటకు ఒకే మార్గమున్నది. అదియే స్వచ్ఛమైన హృదయము" అని చెబుతున్నార నుకోవచ్చును.

అన్వయార్ధము: మానవులారా భగవంతుని ప్రేమ మన ప్రస్తుత చేతనావస్థకు చెందినది కాదు. మాటలకందని అతని కరుణాంతరంగము ఎడబాటులను, దేహములను, ప్రాణములను, కాలములను మించి ఆవల నిలిచి వున్న పవిత్ర హృదయములకే అనుభవమునకు వచ్చునది.

వెదచల్లు నీ మోమువెన్నెలలఁ దలఁచిపో
పొదలు వెన్నెలబయటఁ బొలయఁడతఁడు
ముదిత నీ నెరులు దురుమును దలఁచిపో యతఁడు
కొదమతేంట్ల గనిన గుండె జల్లనును ॥పడఁతి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: పొదలు=ప్రకాశించు, పెరుగు, వర్ధిల్లు; పొలయు= తిరుగాడు, సంచరించు.

భావము: ఓ సుదతీ! "చంద్రుని వంటి నీ ముఖము వెన్నెలలను వెదజల్లుతుంటే- బయటనున్న వెన్నెల వెలుగులో తిరగటానికి అతడిష్టపడటం లేదేమో. ఓ ముదితా! నల్లని వెండ్రుకలతో నీకొప్పును తుమ్మెదల దండుగా తలచి అతని గుండె ఝల్లుమనునేమో!" అని భావించకు.

లలితాంగి నీ దేహలత దలఁచి పో యిపుడు
చెలఁగి వనమునకు విచ్చేయఁడతఁడు
వెలఁది నీమోవికావిరి దలఁచి పో యతఁడు
తలిరాకు గని గుండె తల్లడంబౌను ॥పడఁతి॥

ముఖ్య పదములకు అర్ధములు: కావిరి=లేత ఎరుపురంగు; తలిరాకు= చిగురుటాకు; తల్లడం = అలజడి, అంతర్జ్వలనము.

భావము:  ఓ లలితాంగీ! స్వామి నీ దేహలతను తలపింప జేసే లతలను ఉద్యానవనమున చూసిన నువ్వు గుర్తుకు వస్తావని అచటికి పోవటాని కిష్టపడటం లేదని; ఓ తెల్లనిదానా! స్వామి చివురుటాకులను చూసి ఆతనికి నీ లేత పెదవులు  గుర్తుకు వచ్చి గుండె తల్లడిల్లి పోతుంటాడని" అని వూహించకు.

కోమలిరో నీ యిట్ల కూటములు దలఁచిపో
ప్రేమమితరములపైఁ బెట్టఁడతఁడు
దీమసపు వేంకటాధిపుఁడుగన యాతనికి
సామాన్యసరసతలు సరుకుగావరయ ॥పడఁతి॥

ముఖ్య పదములకు అర్ధములు: దీమసపు = యుక్తి, ఉపాయము, ప్రజ్ఞ, ఆలోచన, నైపుణ్యము గల​; సరుకుగావరయ = పరీక్షించి చూచిన ఈ విషయములు ఆయన లెక్కలోనికి రానివి.

భావము: ఓ కోమలీ! స్వామి నీతో కూడిన సమయములను తలపోసుకొంటూ కాదు; యుక్తి, ఉపాయము, ప్రజ్ఞ, ఆలోచన, నైపుణ్యము గల శ్రీ వేంకటాధిపుని ప్రేమ, యాతని దృష్టి ఈ సామాన్య సరసములపైన, రసవంతమగు చర్చలపైన వుండదు.  

వివరణము: దీనిని భవద్గీతలోని 5-15 శ్లోకము ద్వారా విశద పరచుకుందాము. నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః । (భావము: సర్వాంతర్యామియైన భగవంతుడు ఏ ఒక్కని పాపపు లేదా పుణ్య కర్మలను కానీ స్వీకరింపడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు).

భగవంతుని లీలలను గ్రహించలేని అశక్తులము. కానీ, ప్రయత్నములలో మునిగి అది చేసిన ఒప్పు, ఇది చేసిన తప్పు అనే మీమాంసలో కొట్టుకొనిపోతుంటాము. ఆయన అనుగ్రహించిన ప్రేమను హృదయపు వాకిళ్ళు తెరచి ఆహ్వానించలేని అసమర్థులము.

ఆర్భాటములనే కానీ అరమరికలు లేని విశ్వవ్యాప్త కరుణను కొంతైనా వ్యాప్తి చెందించలేని అవిటివారము. శాంతి, ప్రేమ​, కరుణ​, జీవనము మనకు ఆదర్శములు, ధ్యేయములే కానీ వాటియందు జీవించ ఉపక్రమించము.

అటుల జీవన యాత్ర చేయుటలోని కష్టములకు బెదిరి శ్రీశ్రీ గారన్న "అభిప్రాయాల కోసం బాధల్ని లెక్కపెట్టని వారు మాలోకి వస్తారు. అభిప్రాయాలు మర్చుకొని సుఖాలు కామించేవారు మీలోకి పోతారు" మాటలను ఎంతైనా నిజము చేస్తాము.

-x-x-x-

Sunday 27 August 2023

179 alara nutiMcharO harini (అలర నుతించరో హరిని)

 ANNAMACHARYULU

179 అలర నుతించరో హరిని

(alara nutiMcharO harini)

 ఈ వివరణను తెలుగులో చదువుటకు ఇక్కడ నొక్కండి 

Synopsis: “I wish it need not have happened in my time," said Frodo.

"So do I," said Gandalf, "and so do all who live to see such times. But that is not for them to decide. All we have to decide is what to do with the time that is given to us.

― J.R.R. Tolkien, The Fellowship of the Ring 

Summary of this Poem:

Chorus: O people! Time throws a shadow, captivating and deceiving you. So, embrace Lord Hari and sing his praises. 

Stanza 1: O People! Now, at the very least, contemplate upon Lord Hari. Don't let your mind be consumed by thoughts of the food you will eat. This body is temporary, and so is wealth. Time moves steadily forward. Don't be foolish to entrust your destiny to time alone, it shall lead you astray. 

Stanza 2: Listen and enjoy the tales of Lord Hari! Clear away the confusions that arise in your mind. Let go of your desires. The goodness of these blessed matters will always remain.

Stanza 3: O People! Expand your vision to relish the sight of Lord Venkateswara. Delight your ears with the sweetest praises for the Lord. Immerse yourself in the Lord's blessings firsthand. O Stupid, know that indulgence in self creates the time that hides your wisdom. Implied meaning: O Man! Can you grasp the truth in front of you? Can you hear the voice of truth? Are you wrapped in the boundless compassion of the Divine? Or are you held back by the illusion of time, wasting this remarkable chance to live?

Detailed Presentation

Introduction: Time stands as a crucial conduit for mystics and philosophers to impart the truths they've grasped. It acts as a prosthetic component in the quest for truth. Annamacharya asserted that time subtly infiltrates thoughts, deflecting our attention. 

 

కీర్తన:

రాగిరేకు:  65-5 సంపుటము: 1-338

POEM

Copper Leaf:  65-5 Volume: 1-338

అలర నుతించరో హరిని
యెలయించి మిము భ్రమయించీనిఁ గాలముఅలర 

సేయరో మనుజులార చింత హరి నిఁకనైన
రోయరో మీభుజియించు రుచులమీఁద
కాయ మస్థిరము యీ కలి మధ్రువము చాలఁ
బోయఁబో యెందుకుఁ గాకపోయఁ గాలముఅలర

మెచ్చరో మనుజులార మీరే హరికథలు
పుచ్చరో మీమదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు-
నిచ్చీని శుభములు యివి యెల్లకాలముఅలర 

కనరో వేంకటపతిఁ గన్నులు దనియఁగా
వినరో యీతని స్తుతి వీనులు నిండ
మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు
తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలముఅలర॥ 

alara nutiMcharO harini
yelayiMchi mimu bhramayiMchIni gAlamu alara
 
sEyarO manujulAra chiMta hari nikanaina
rOyarO mIbhujiyiMchu ruchulamIda
kAya masthiramu yI kali madhruvamu chAla
bOyabO yeMduku gAkapOya gAlamu alara
 
mechcharO manujulAra mIrE harikathalu
puchcharO mImadilOni poralellAnu
kochcharO manujulAra kOrikalellanu mIku-
nichchIni Subhamulu yivi yellakAlamu alara
 
kanarO vEMkaTapati gannulu daniyagA
vinarO yItani stuti vInulu niMDa
manarO SrIharichEti mannanalu mIru
tanamIdi madi buddhi dAchIni gAlamu alara

Details and Explanations:

అలర నుతించరో హరిని
యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము
అలర

alara nutiMcharO harini
yelayiMchi mimu bhramayiMchIni gAlamu alara

 

Word to word meaning: అలర (alara) = agreeably, accepting, developing; నుతించరో హరిని (nutiMcharO harini) = praise the Lord Hari; యెలయించి (yelayiMchi) = "gaze of enchantment" or "bewitching glance’; మిము (mimu) = you; భ్రమయించీనిఁ (bhramayiMchIni) = brings under spell of illusion; గాలము (gAlamu) = time. 

Literal meaning: O people! Time throws a shadow, captivating and deceiving you. So, embrace Lord Hari and sing his praises. 

Explanation: యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము (yelayiMchi mimu bhramayiMchIni gAlamu): Let's understand this phrase through deceptively simple painting called "La Résponse Imprévue" (The Unexpected Answer) of year 1933. We see a well-carved, shiny door. This lesser-known masterpiece is the pinnacle of Rene Magritte's artistry. 

We see a cut-out of an unfamiliar shape. Only a small amount of light filters through to the other side of the door. What's beyond it is uncertain - perhaps truth, death, or time? No one knows for sure. However, the shape of the cut-out suggests that attempts to penetrate it by unconventional means have been unsuccessful. 

Even with a large hole, the entire door stands firm and undisturbed. This demonstrates us that we can only know what's on the other side by opening the door. The light passing through the cut-out enters a small area that's much smaller than the size of the cut-out. 

By noticing the dim light on the floor, it becomes evident that both sides are alike. Curiosity often arises from things that are concealed. Therefore, judging by their similar looks, we can infer that the door is merely a deceptive object, serving no actual use. 

"Similar to the door depicted in the image, truth, death, and time are always present. Yet, we can never be certain of their true nature. Nevertheless, humans continue to hold onto the (false) hope that one day they might unravel these mysteries." 

But to anticipate that there is something beyond door, beyond the mountains, beyond death is an illusion. Space (psychological distance) and psychological time are illusions created by the mind. For example, after an agreeable experience (eg: after a good coffee), the mind is excited, waiting, and longing to have it again. Thus, the painting “unexpected answer” and యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము (yelayiMchi mimu bhramayiMchIni gAlamu) are stating one and the same. 

Annamacharya said these things many times. For example, పుట్టెడిదొకటే పోయెడిదొకటే (puTTeDidokaTE pOyeDidokaTE) = life is same, death is same; పరమనేదొకటే ప్రపంచమొకటే (paramamanEdokaTE prapaMchamokkaTE) = This world is same and the other world is same; మున్నిటి జగమే మున్నిటి లోకమే (munniTi jagamE munniTi lOkamE) = this world essentially remained same for ever; చిత్తము నాఁటిదే చింతలు నాఁటివే (chittamu nATidE chiMtalu nATivE) = your mind and worries are same as old. Thus, Annamacharya is asking us to find a way out of this quagmire created by the mind. 

సేయరో మనుజులార చింత హరి నిఁకనైన
రోయరో మీభుజియించు రుచులమీఁద
కాయ మస్థిరము యీ కలి మధ్రువము చాలఁ
బోయఁబో యెందుకుఁ గాకపోయఁ గాలము
అలర

sEyarO manujulAra chiMta hari nikanaina
rOyarO mIbhujiyiMchu ruchulamIda
kAya masthiramu yI kali madhruvamu chAla
bOyabO yeMduku gAkapOya gAlamu alara 

Word to word meaning: సేయరో (sEyarO) = perform; మనుజులార (manujulAra) == O people;  చింత (chiMta) = thoughts, concentrate; హరి (hari) = on Lord Hari; నిఁకనైన (nikanaina)= At least now;  రోయరో (rOyarO) = eschew; మీభుజియించు (mIbhujiyiMchu) = consumed  by you; రుచులమీఁద (ruchulamIda) = on the taste; కాయ మస్థిరము (kAya masthiramu) = this body is not stable (meant that it continues to decay); యీ కలి మధ్రువము (yI kali madhruvamu) = this wealth is also uncertain (to stay with you);  చాలఁ (chAla) = very much; బోయఁబో యెందుకుఁ (bOyabO yeMduku) = to move along with it; గాకపోయఁ (gAkapOya) = useless; గాలము (gAlamu) = time. 

Literal meaning: O People! Now, at the very least, contemplate upon Lord Hari. Don't let your mind be consumed by thoughts of the food you will eat. This body is temporary, and so is wealth. Time moves steadily forward. Don't be foolish to entrust your destiny to time alone, it shall lead you astray. 

Explanation:  Time makes us believe it as a reliable support. It entices us to postpone prayers, occupies our attention with ideas of protecting our aging body, and deceives us into thinking we will worship God once we have amassed sufficient wealth. This cunning time infiltrates our thoughts, moulding our actions.

మెచ్చరో మనుజులార మీరే హరికథలు
పుచ్చరో మీమదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు-
నిచ్చీని శుభములు యివి యెల్లకాలము
అలర

mechcharO manujulAra mIrE harikathalu
puchcharO mImadilOni poralellAnu
kochcharO manujulAra kOrikalellanu mIku-
nichchIni Subhamulu yivi yellakAlamu alara 

Word to word meaning: మెచ్చరో (mechcharO) = praise, extol; మనుజులార  (manujulAra) = O people;  మీరే (mIrE) = you; హరికథలు (harikathalu) = stories of the Lord;  పుచ్చరో (puchcharO) = eschew, delete; మీమదిలోని (mImadilOni)= of your mind;  పొరలెల్లాను (poralellAnu)= circling wrong notions; కొచ్చరో (kochcharO) = Leave; మనుజులార (manujulAra) = O People; కోరికలెల్లను (kOrikalellanu) = all the desires; మీకు- (mIku-) = to you; నిచ్చీని (nichchIni)  = provide; శుభములు (Subhamulu) = good luck,  wellbeing; యివి యెల్లకాలము (yivi yellakAlamu) = forever. 

Literal meaning: Listen and enjoy the tales of Lord Hari! Clear away the confusions that arise in your mind. Let go of your desires. The goodness of these blessed matters will always remain. 

కనరో వేంకటపతిఁ గన్నులు దనియఁగా
వినరో యీతని స్తుతి వీనులు నిండ
మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు
తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలము
అలర॥

kanarO vEMkaTapati gannulu daniyagA
vinarO yItani stuti vInulu niMDa
manarO SrIharichEti mannanalu mIru
tanamIdi madi buddhi dAchIni gAlamu alara 

Word to word meaning: కనరో (kanarO) = See (used in the sense of open your eyes and see); వేంకటపతిఁ (vEMkaTapati) = Lord Venkateswara; గన్నులు దనియఁగా (gannulu daniyagA) = like luxury to your eyes; వినరో (vinarO) = Listen; యీతని (yItani) = HIS; స్తుతి (stuti) = praise; వీనులు నిండ (vInulu niMDa) = to the pleasure of your ears;  మనరో (manarO) = experience; శ్రీహరిచేతి (SrIharichEti) = Lord Srihari’s; మన్ననలు మీరు (mannanalu mIru) = blessings to you; తనమీఁది (tanamIdi) = one oneself; మది (madi) = mind; బుద్ధి (buddhi) = intelligence; దాఁచీనిఁ (dAchIni) = hides; గాలము (gAlamu) = the time. 

Literal meaning: Hey folks! Expand your vision to relish the sight of Lord Venkateswara. Delight your ears with the sweetest praises for the Lord. Immerse yourself in the Lord's blessings firsthand. O Stupid, know that indulgence in self creates the time that hides your wisdom. 

Explanation: కనరో వేంకటపతిఁ గన్నులు దనియఁగా (kanarO vEMkaTapati gannulu daniyagA) This is not to say that one should do some praise/sacrifice/penances and to elevate to the holy worlds, but to emphasise that the world that is in front of our eyes is the true nature of the Lord. "వినరో యీతని స్తుతి వీనులు నిండ" (vinarO yItani stuti vInulu niMDa) "మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు" (manarO SrIharichEti mannanalu mIru) also asserting the same. Thus, we understand that Annamacharya believed the very man in this flesh and blood that can directly experience the God. 

Annamacharya was neither a philosopher nor had scholarly family background. He simply shared experiences that touched his awareness. Therefore, his repeated assertion "పరమనేదొకటే ప్రపంచమొకటే" (paramamanEdokaTE prapaMchamokkaTE) = that there's only one world, and whatever exists is right before our eyes. His point is that humans should use their intellect to dispel ignorance in this lifetime.

Hence, God isn't a shore that can be gradually reached step by step. When we closely observe the natural world, even if there's similarity, each living species springs from the Universal Consciousness, not through evolution. Therefore, assuming that the mind matures over time is a mistaken belief stemming from ignorance.

I'll do my best to clarify this topic. Let's begin with Swan No 5 (shown below) by Hilma Af Klint. Just like in all swans, there's a horizontal line separating the visible and hidden parts of consciousness. The dark swan on the lower left represents our position.

The black swan assembles and concentrates its wings, mind, and nose, including its feet, the scattered thoughts that are inside and outside of it at a single point. just like a human being moves to introspection. This is what Annamacharya meant with the words చిత్త మంతర్ముఖము సేసుకొన నేర్చెనా / అత్తల నతఁడు యోగియనఁబడును (chitta maMtarmukhamu sEsukona nErchenA / attala nataDu yOgiyanabaDunu) = When someone endeavours to direct their mind inwards and maintains such a state, on the flip side, they are identified as a yogi. Perhaps, Jiddu Krishnamurti also meant the same during innumerable interactions with people.

The vibrations emanating from that meditative state are the blossoming form that transforms into a white swan flying freely in the air. Let us recall from the biography the Buddha: Siddhartha became enlightened within a few weeks of meditation, after realising that his six years of hard penance had yielded little.

Through the portrayal of a flying white swan and a contemplative black swan in the same artwork, Hilma Af Klint suggested that there's no fundamental distinction between them. This illustrates that time isn't the primary factor in this transformation. Hence, the notion of progressing step by step towards perfection originates from the observable patterns of biological growth, resembling an arithmetic progression. Therefore, the phrase "తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలము" (tanamIdi madi buddhi dAchIni gAlamu), which means time spent in self-centred pursuits obstructs the flowering of wisdom, holds substantial significance.

 

Implied meaning: O Man! Can you grasp the truth in front of you? Can you hear the voice of truth? Are you wrapped in the boundless compassion of the Divine? Or are you held back by the illusion of time, wasting this remarkable chance to live?

 

-x-x-x-

 

 

 

 

 


 

201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు. (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu)

  ANNAMACHARYULU 201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu) Introduction : A nnamacharya is t...