Sunday 26 December 2021

101. ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు (idi kallayanarAdu yidi niSchayiMparAdu)

                                                            ANNAMACHARYA

101. ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు 

      (idi kallayanarAdu yidi niSchayiMparAdu) 

Introduction: This is truly one of the best poems of Annamacharya. This extraordinary philosopher talks about our naïve actions.  You may be wondering why these philosophers wrote so many poems, so much literature?

Man is influenced most by the hearing. Hence these great men saw a chance in listening to liberate man. In most cultures particularly in Asia, we see this tradition of listening to scriptures even today. Another thing is listening in groups, so that doubts raised by one may kindle many people at the same time.

I urge readers to listen to the song before reading this explanation. I might not have covered the sweetness, the harmony, the intuition, the depth and the secrets of this poem. Annamacharya assembles words to transform directly into feelings, literally drags us into a state of transcendence, infuses meanings the words themselves may not divulge and make us ponder.

ఉపోద్ఘాతము:  ది నిజంగా అన్నమాచార్యుల రమణీయమైన కీర్తనలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.  ఈ అసాధారణ తత్వవేత్త మన మంచిచెడులను గుర్తించలేని పరిహాసపు  చర్యలను  ఎత్తిచూపెట్టారు. ఈ తత్వవేత్తలు ఇన్ని కవితలు, ఇంత సాహిత్యం ఎందుకు రాశారా? అని మీరు ఆశ్చర్యపోవచ్చు

మనిషి వినికిడి ద్వారా అత్యధికంగా ప్రభావితమవుతాడు. అందుకే ఈ మహానుభావులు వినికిడిలో మనిషిని విముక్తులను చేసే అవకాశం చూసారు. చాలా సంస్కృతులలో, ముఖ్యంగా ఆసియాలో, ఈనాటికీ గ్రంథాలను సమూహాలుగా వినే సంప్రదాయాన్ని మనం చూస్తున్నాం. సముదాయములలో వినడం ద్వారా ఒకరు లేవనెత్తిన సందేహాలు ఒకేసారి చాలా మందిలో అభిరుచి లేదా కుతూహలము రాజుకోవచ్చు. 

ఈ వివరణను చదవడానికి ముందుగా  పాటను వినవలసిందిగా పాఠకులను అభ్యర్థిస్తున్నాను. నేను కీర్తనలోని మాధుర్యమను, సౌహార్దమును, అంతఃప్రకృతినిలోతును మరియు గుట్టును పూర్తిగా ఆవిష్కరించి ఉండకపోవచ్చు. అన్నమాచార్యులు ఆయా పదములు తమంతట తాము వ్యక్తీకరించలేని భావములను వాటి పొందికతో సూటిగా మన గుండెల్లో గుప్పించి, మనల్ని ఆలోచనలో పడేటట్లుభావాతీత స్థితిలోనికి లాగుకుని వెళతాడు.

 

కీర్తన:

ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు

పదిలానఁ గొలువఁగా ప్రత్యక్షమయ్యేవు ॥పల్లవి॥ 

యెదలో నుండుదువని యిన్ని వేదాలు చెప్పగా

వెదకి ధ్యానము సేతు వెస గనుఁగొంట లేదు
చెదర కందే మరి జీవుఁడు నున్నాఁ డందురు
పదిలముగాఁ జూతు భావించరాదు            ॥ఇది॥ 

అంతటా నుందువని ప్రహ్లాదుఁడు చెప్పెననఁగా

చింతించి పట్టఁదలఁతు చేతికిఁ జిక్కుట లేదు
సంతత జ్ఞానాన నీ సాకారమున్నదందురు
మంతనానఁ బిల్తు నొకమాట వినఁబడదు   ॥ఇది॥

రవిలో నుందువని సురలు నిన్నుఁ గొలువఁగా

తవిలి పూజించేనంటే దగ్గరి వచ్చుట లేదు
యివల శ్రీవేంకటాద్రి నిరవై నీవున్నాఁడవు
తివిరి సేవించితిమి ద్రిష్టమాయ మాకు      ॥ఇది॥ 

idi kallayanarAdu yidi niSchayiMparAdu

padilAna goluvagA pratyakshamayyEvu pallavi 

yedalO nuMDuduvani yinni vEdAlu cheppagA

vedaki dhyAnamu sEtu vesa ganugoMTa lEdu
chedara kaMdE mari jIvuDu nunnA DaMduru
padilamugA jUtu bhAviMcharAdu    idi 

aMtaTA nuMduvani prahlAduDu cheppenanagA

chiMtiMchi paTTadalatu chEtiki jikkuTa lEdu
saMtata j~nAnAna nI sAkAramunnadaMduru
maMtanAna biltu nokamATa vinabaDadu      idi 

ravilO nuMduvani suralu ninnu goluvagA

tavili pUjiMchEnaMTE daggari vachchuTa lEdu
yivala SrIvEMkaTAdri niravai nIvunnADavu
tiviri sEviMchitimi drishTamAya mAku             idi

 

Details and Explanations: 

ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు

పదిలానఁ గొలువఁగా ప్రత్యక్షమయ్యేవు     ॥పల్లవి॥ 

idi kallayanarAdu yidi niSchayiMparAdu

padilAna goluvagA pratyakshamayyEvu           pallavi

Word to Word meaning: ఇది (idi) = this (life or god);  కల్లయనరాదు (kallayanarAdu) = should not say it’s a lie; should not mistake as illusion; యిది (yidi) = this (life or god);  నిశ్చయింపరాదు (niSchayiMparAdu) = this cannot be determined; పదిలానఁ (padilAna) = స్థైర్యమ, జాగరూకము, దృఢము, without fear; with awareness; perseverance; గొలువఁగా (goluvagA) = on serving thus; ప్రత్యక్షమయ్యేవు (pratyakshamayyEvu) = appear in front of us. 

Literal meaning: This living thing (or God) should not be mistaken for illusion. However, you cannot determine it with certainty (like day and night). God appears in front of those who serve him with perseverance, awareness and without fear.  

Explanation:  With the word niSchayiMparAdu (నిశ్చయింపరాదు), Annamacharya is indicating that the nature of God or Life Force cannot be determined black and white, as mentioned in Bhagavad-Gita verse न सत्तन्नासदुच्यते || 13-13|| na sat tan nāsad uchyate ( that Brahman or life force may not be comprehendible like  existing or non-existing for the beings.)

 

Kalla (కల్ల) = lie or illusion? We should not mistake the mentioned illusions with optical illusions like mirages. The later one, once we understand, we are fairly free of it. But the illusions of life are more complex and are difficult to extricate from them. This is largely because we are part of the illusion as mentioned in Bhagavadgita verse: न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभु: | न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते || 5-14|| na kartitva na karmāṇi lokasya sijati prabhu na karma-phala-sayoga svabhāvas tu pravartate  Purport: Neither the sense of doership nor the nature of actions comes from God; nor does He create the fruits of actions.. All these are caused by the natural qualities (guṇas) in the physical body.

Let us examine this further. Consider this puzzle: A person gets trapped in strange land where people either tell truth only or lies only. One cannot find out by their facial expressions whether they are telling lies or truth. Our hero has been given chance to escape. There are two gates. Once gate opens to freedom, the other opens to a hungry tiger. There are two gatekeepers, one telling lie and the other truth. This person is allowed to ask only one question to find the gate to freedom. 

We know the answer to this puzzle is to pose a question “If I ask the other gatekeeper ‘the gate to freedom’ what would be his answer” to one of the keepers. It yields the same answer from both the gate keepers. Incidentally, that unique answer is the TIGER GATE. 

What do we learn from this puzzle? We already know that there is a way out, but many find it a bit difficult to answer this puzzle. But to understand the information that has undergone so many transformations in real life, requires the most sensitive intellect and interest to analyse. Therefore, one must assemble all his energies for this endeavour. Such a sharp way of thinking brings about fundamental changes in man. 

From the word niSchayiMparAdu (నిశ్చయింపరాదు), is indicating as the truth may not determined, we need to get to it by eliminating the unreal, like we did in the puzzle.Now consider this poem of Annamacharya: okaTi suj~nAnamu okaTi aj~nAnamu prakaTiMchi vokaTi chEpaTTarO vivEkulu (ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు. = One thing is Proper Knowledge. The other is ignorance. O prudent!! Declare and adapt one of these.) What would be your choice to this question? Most of us would be answering ‘I will take the path of Proper Knowledge (suj~nAnamu సుజ్ఞానము). Considering the above puzzle, the word in chorus, what would be tangible to find? We are ashamed, may be due to public opinion to declare that I will find ignorance (aj~nAnamu అజ్ఞానము) inside me.

The word  pratyakshamayyEvu (ప్రత్యక్షమయ్యేవు= appear in front of us) is indicative that God does not take time to reach-out to the devotee.  From the story of ‘Gajendramokshanam’ once the elephant realises that his efforts are of no avail and it must pray to God, it does not take much time to get liberated from the crocodile.  All the mistakes made by the elephant have been forgiven instantly. Similarly, when we pray to the Lord genuinely, it will be answered.

Implied meaning: Do not dither in doubt. Setting aside all the confusion (the unreal), pray the God steadfastly. Your prayers will be answered instantly. 

భావము: ఈ జీవమును (లేదా దైవమును) భ్రాంతి అని పొరబడకూడదు. అయినప్పటికీ, అద్దానిని పగలు మరియు రాత్రిలాగ ఖచ్చితంగా నిర్ధారించలేరు. పట్టుదలతో, అవగాహనతో, నిర్భయంగా సేవ చేసే వారికి ముందు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.

వివరణము: నిశ్చయింపరాదు అనే పదంతో అన్నమాచార్యులు భగవద్గీత (13-13) శ్లోకంలో న సత్తన్నాసదుచ్యతే అని పేర్కొన్నట్లుగా, బ్రహ్మమును లేదా జీవతత్వము యొక్క స్వభావాన్ని పగలు రేయిలను తెలియునట్లుగా నిర్ణయించలేమన్నారు.   

ఇక్కడ పేర్కొన్న కల్ల  = అబద్ధము లేదా భ్రమలను మనం ఎండమావుల వంటి దృశ్య భ్రమలతో పొరపడ రాదు. దృశ్య భ్రమలు ఒకసారి అర్థం చేసుకున్న తర్వాతతిరిగి వాటి భ్రాంతిలో పడము. కానీ జీవితం యొక్క భ్రమలు చాలా క్లిష్టంగా ఉంటాయి మరియు వాటి నుండి బయటపడటం కష్టం. భగవద్గీత  శ్లోకంలో పేర్కొన్న విధంగా మనం స్వయంగా భ్రమలలో భాగం కావడమే దీనికి కారణం: ​ 

శ్లో|| న కర్తృత్వం న కర్మాణి  లోకస్య సృజతి ప్రభుః|

న కర్మఫలసంయోగం  స్వభావస్తు ప్రవర్తతే|| (5-14) || 

భావం : కర్తృత్వ భావన కానీ, కర్మలు కానీ భగవంతునిచే సృష్టించబడవు. కర్మ ఫలములతో సంబంధం సృష్టించేది కూడా ఆయన కాదు.  భౌతిక శరీరంలో ప్రకృతి గుణములే వీటన్నిటిని కలుగజేయును.

ఈ చిక్కు ప్రశ్నను పరిగణించండి: ఒక వ్యక్తి వింత చోటులో చిక్కుకుపోతాడు, అక్కడ ప్రజలు నిజమో లేదా అబద్ధామో మాత్రమే చెబుతారు. వారు అబద్ధాలు చెబుతున్నారా లేదా నిజాలు చెబుతున్నారా అనేది వారి ముఖ కవళికలను బట్టి కనిపెట్టలేము. మన హీరో తప్పించుకునే అవకాశం ఇచ్చారు. అక్కడ రెండు ద్వారాలు ఉన్నాయి. ఒకటి స్వేచ్ఛకు ద్వారం, మరొకటి ఆకలితో ఉన్న పులికి ద్వారం. ఇద్దరు ద్వారపాలకులు వాటికి కాపలా ఉన్నారు, ఒకరు అబద్ధాల కోరు.  మరొకడు నిజం చెప్పేవాడు. ఈ వ్యక్తి స్వేచ్ఛకు ద్వారం కనుగొనడానికి ఒకేవొక ప్రశ్న మాత్రమే అడగి బయటపడాలి. ఆ ప్రశ్న ఏమిటో?

ఈ చిక్కు ముడి విప్పడనికి అడగవలసిన ప్రశ్న, ఇద్దరిలో ఎవరో ఒకరిని సమీపించి "ఆ ద్వారపాలకుడిని 'స్వేచ్ఛకు ద్వారం' అని అడిగితే, అతని సమాధానం ఏమిటి?" దీనికి ఇరువురు ద్వారపాలకుల నుండి ఒకే సమాధానం వస్తుంది. యాదృచ్ఛికంగా, ఆ ప్రత్యేకమైన సమాధానం 'పులి వైపు'.

మనకు ముందే తెలుసును బయటకు మార్గముందని, ఐనా చాలామంది దీనికి జవాబు చెప్పడమే కొంత కష్టం. కానీ నిజ జీవితంలో అనేకానేక పరివర్తనములు చెంది వచ్చిన సమాచారమును గ్రహించుటకు అత్యంత సున్నితమైన బుద్ధి, విశ్లేషించుటకు ఆసక్తి అవసరమగును. కాబట్టి, ఈ ప్రయత్నానికి తన శక్తియుక్తులన్నీ సమకూర్చుకోవాలి. అంత తీక్షణమగు ఆలోచనా క్రమముమనిషిలో ప్రాధమిక మార్పులు తెచ్చును. 

నిశ్చయింపరాదు అనే పదం సత్యాన్ని ఇదమిత్థంగా ధృవీకరించలేమని చెబుతోంది. నిజము తెలియుటకు, ఈ చిక్కు ప్రశ్నలో వలె,  వాస్తవం కాని దాన్ని తొలగించాలి. ఇప్పుడు యీ కీర్తనను చూడండి. ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ఈ ప్రశ్నకు మీ ఎంపిక ఏమిటి? మనలో చాలామంది 'నేను సుజ్ఞానము యెంచుకుంటాను అనుకొంటారు. పైన చిక్కు ప్రశ్నను, పల్లవిని పరిగణనలోకి తీసుకుంటే, ఏది కనుగొనడం సులభము? సత్యమునా? ప్రజాభిప్రాయం వల్లనో, సంకోచము వల్లనో  కావచ్చు, 'నాలోని అజ్ఞానము కనిపెడతాను' అని ప్రకటించడానికి సిగ్గుపడుదుము. 

ప్రత్యక్షమయ్యేవు అనే పదం, భగవంతుడు భక్తుడిని చేరుకోవడానికి సమయం తీసుకోడని సూచిస్తుంది. గజేంద్ర మోక్షణం కథలో ఏనుగు తన ప్రయత్నము ద్వారా సాధించలేనని గ్రహించినప్పుడు, దేవుడిని ప్రార్థిస్తుంది. నువ్వు తప్ప వేరెవరూ లేరని అంటుంది. మొసలి నుండి విముక్తి పొందడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అంత వరకూ ఏనుగు చేసిన తప్పులన్నీ ఒకే ఒక ప్రార్ధనతో క్షమించబడ్డాయి.  అదేవిధంగా, మనం దైవమును యథార్థంగా ప్రార్థించినప్పుడు, తప్పక దానికి సమాధానము లభిస్తుంది. ​ 

అన్వయార్ధము: సందేహాలలో కొట్టుకుపోకండి. వాస్తవం కాని దానిని పక్కన పెట్టి, భగవంతుడిని పదిలముగా ప్రార్థించండి. మీ ప్రార్థనలు వ్యర్ధము కావు.

యెదలో నుండుదువని యిన్ని వేదాలు చెప్పగా

వెదకి ధ్యానము సేతు వెస గనుఁగొంట లేదు
చెదర కందే మరి జీవుఁడు నున్నాఁ డందురు
పదిలముగాఁ జూతు భావించరాదు            ॥ఇది॥ 

yedalO nuMDuduvani yinni vEdAlu cheppagA

vedaki dhyAnamu sEtu vesa ganugoMTa lEdu
chedara kaMdE mari jIvuDu nunnA DaMduru
padilamugA jUtu bhAviMcharAdu            idi

 

Word to Word meaning: యెదలో (yedalO) = in the mind;  నుండుదువని (nuMDuduvani) = you are there; యిన్ని (yinni) = all; వేదాలు (vEdAlu) = Vedas;  చెప్పగా (cheppagA)= declare;  వెదకి (vedaki) = try to find; ధ్యానము (dhyAnamu)= prayer, meditate;  సేతు (sEtu) = to do, to perform;  వెస (vesa) = శీఘ్రముగ, quickly; గనుఁగొంట లేదు (ganugoMTa lEdu) =unable to see, unable to find; చెదరక అందే (chedaraka aMdE)  = in that very Order or clarity;  మరి (mari) = again, further;  జీవుఁడు (jIvuDu) =  the living thing (life force); నున్నాఁ డందురు (nunnA DaMduru) = say it exists; పదిలముగాఁ (padilamugA)  with great care; జూతు (jUtu) = try to see, try to find;  భావించరాదు (bhAviMcharAdu) = not possible to conceive;    

Literal meaning: Vedas declare that you (God) are there in the mind. I try to find you there by prayers and meditation. Yet there are no traces of you. We learn that the living thing (life force) exists there in order and clarity. With great care I try to find. Yet you are inconceivable. 

Explanation: Annamacharya for long declared that any amount of conscious effort to find God is not going to yield any result. Here he is criticising gullible human behaviour. 

important word used in this stanza is vesa ganugoMTa lEdu (వెస గనుఁగొంట లేదు). Is indicating that the transformation, as happened in case of Gajendra, does not take time. 

భావము: భగవంతుడా! నీవు మనస్సులో ఉన్నావని వేదాలు ప్రకటిస్తున్నాయి. ప్రార్థనలు మరియు ధ్యానం ద్వారా  నిన్ను  వెదకుదును.  అయినా అక్కడ నీ జాడ లేదు. జీవుడు (ప్రాణశక్తి) క్రమంలోనూ మరియు స్పష్టతలోనూ ఉందని మనం తెలిసితిని. చాలా జాగ్రత్తగా నేను కనుగొనడానికి ప్రయత్నిస్తాను. అయినా నువ్వు భావించ లేనంత అనూహ్యంగా ఉన్నావు.

వివరణము: ఈ చరణంలో  'వెస గనుఁగొంట లేదు'తో ఒకేఒక మనఃపూర్వక ప్రార్ధనతో తక్షణమే గజేంద్రునిలో  పరివర్తన జరిగినట్లుగా, దైవమును ఆర్ద్రతతో సేవించిన ఎక్కువ సమయం పట్టదని సూచించారు.

అన్నమాచార్యులు అనేక మార్లు భగవంతుడిని వెతకడానికి ఎంతటి చేతనైన ప్రయత్నం చేసినా ఫలితం ఉండదని ప్రకటించారు. ఇక్కడ అతడు ఆత్మ ద్రోహ మానవ ప్రవర్తనను విమర్శిస్తున్నాడు. ​ఈ చరణంలో అన్నమాచార్యులు చెప్పినట్లుగానే మనుషులు వివేకించక చర్యలు తీసుకుందామని అనుకుంటారు. క్రింది కధని చూడండి.

ఒకసారి ఒక గ్రామపంచాయతీలో బహిరంగన్యాయస్థానంలో ఒక సమస్యను పరిష్కరించడానికి పెద్దలు సమావేశమైయ్యారు. కొంత దూరంలో, ఒక సాధువు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పెద్దల న్యాయస్థానం ఏ నిర్ణయానికి రాలేకపోవడం వలనతమ సమస్య పరిష్కారం కోసం సాధువును సంప్రదించమని ఎవరో సూచించారు.

వారంతా సాధువు దగ్గరకు వెళ్లారు. అంతమందిని చూసి సాధువు వాళ్ళని ఏం కావాలని అడిగాడు.

"మహాత్మా, గ్రామంలో ఒకే ఒక బావి ఉంది. మేము ఆ బావిలో నీరు త్రాగలేము." అని గ్రామస్థులు సమాధానమిచ్చారు.

సాధువు, " ఎందుకు, ఏమి జరిగింది? మీరు దాని నుండి నీరు ఎందుకు త్రాగలేరు?" అని అడిగాడు.

"మూడు కుక్కలు ఒకదానితో ఒకటి కొట్టుకుని బావిలో పడ్డాయి. అవి బయటకు రాలేక అందులో మునిగి చనిపోయాయి. ఇప్పుడు నీరు బాగా దుర్వాసన వస్తోంది, ఆ నీరు ఎలా తాగాలి?" అని గ్రామస్తులు అన్నారు.

సాధువు "ఒక పని చేయండి, పవిత్రమైన గంగానది జలాన్నిఆ బావిలో పోయండి" అని చెప్పాడు. అలా ఎనిమిది నుంచి పది బకెట్ల గంగాజలం బావిలో పోసినా సమస్య అలాగే ఉండిపోయింది.

ప్రజలు మళ్లీ సాధువు వద్దకు వెళ్లారు.

సాధువు, "సరే, మీరందరూ సమావేశమై భగవంతుని నామాన్ని జపిస్తూ, ప్రార్ధన చేయండి ," అన్నాడు.

ప్రజలు అలాగే అని, సాధువు సూచించినట్లు చేసారు, అయినప్పటికీ సమస్య అలాగే ఉంది.

ప్రజలు మళ్లీ సాధువు వద్దకు వెళ్లారు. ఈసారి సాధువు "బావిలో కొన్ని సువాసన వచ్చే పదార్ధాలు వేయండి" అన్నాడు. అది కూడా జరిగింది, కానీ సమస్య ఇంకా కొనసాగింది.

ఇప్పుడు ఇంక సాధువు స్వయంగా బావి వద్దకు వచ్చాడు.

ప్రజలు, "చూడండి స్వామీ, పరిస్థితి అలాగే ఉంది, మేం ప్రతిదీ ప్రయత్నించి చూసాం, పవిత్ర గంగాజలం పోశాం, ప్రార్థనలు, కీర్తనలు చేసాం, ప్రసాదం పంచాము, బావిలో సువాసనగల పువ్వులు, పదార్ధాలు వేసాం - ఇవన్నీ!"

సాధువు అయోమయంగా చూస్తూ అడిగాడు, "అన్నీ చేసారు, కానీ ఈ బావిలో పడిచనిపోయిన మూడు కుక్కలను తొలగించారా?"

గ్రామస్తులు, "అదేంటి, మీరు అలా చేయమని మాకు చెప్పలేదు కదా, మేం వాటిని బయటకు తీయలేదు, మిగిలినవన్నీ చేసాం, కానీ కుక్కలు ఇప్పటికీ బావిలోనే  ఉన్నాయి" అన్నారు.

సాధువు మొదట దిగ్భ్రాంతి చెందాడు, కాని ప్రశాంతంగా గ్రామస్తులకు ఇలా వివరించాడు, "నీటిలో పడి ఉన్న మూడు మృతదేహాలను బయటకు తీసే వరకు, ఎటువంటి బాహ్య చర్యలు ఎటువంటి ప్రభావం చూపవు, ముందుగా మీరు నీటి నుండి ఆ మురికిని బయటకు తీయాలి."

మన జీవిత కథ కూడా అలాంటిదే.  పల్లెటూరి వంటి మన దేహంలో కామం, క్రోధం, లోభం, అసూయ అనే అనేక జంతువులు పోట్లాడుకుని, మనస్సాక్షి అనే బావిలో చెదపురుగుల్లా చిక్కుకుపోయాయి. అవి మెల్లగా మన మనస్సాక్షిని  లోపలి నుండి తినేస్తున్నాయి. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే... ఈ తెగులు నుంచి బయటపడేందుకు మనం ఏం చేస్తున్నాం?

మన జీవితాలను మెరుగుపరచుకోవడానికి బయటి నుండి చాలా కొత్త విషయాలను లోపలికి తీసుకుంటున్నాం, అయితే లోపల ఇప్పటికే కుళ్ళిపోయిన లేదా పేరుకుపోయిన వాటిని తొలగించడానికి మనం ఏమి చేస్తున్నాం?    దీని గురించి ఒకసారి ఆలోచించండి.

అంతటా నుందువని ప్రహ్లాదుఁడు చెప్పెననఁగా

చింతించి పట్టఁదలఁతు చేతికిఁ జిక్కుట లేదు
సంతత జ్ఞానాన నీ సాకారమున్నదందురు
మంతనానఁ బిల్తు నొకమాట వినఁబడదు            ॥ఇది॥ 

aMtaTA nuMduvani prahlAduDu cheppenanagA

chiMtiMchi paTTadalatu chEtiki jikkuTa lEdu
saMtata j~nAnAna nI sAkAramunnadaMduru
maMtanAna biltu nokamATa vinabaDadu         idi 

Word to Word meaning: అంతటా (aMtaTA) = everywhere; నుందువని (nuMduvani) = present; {అంతటా నుందువని (aMtaTA nuMduvani)  =  omnipresent}; ప్రహ్లాదుఁడు (prahlAduDu) = Prahlada; చెప్పెననఁగా (cheppenanagA) = having declared;  చింతించి (chiMtiMchi) = made a plan;  పట్టఁదలఁతు (paTTadalatu) = to take you in possession; చేతికిఁ (chEtiki) = to my hnad; జిక్కుట లేదు (jikkuTa lEdu) = unabvle grab; సంతత (saMtata) = constant, continuous, unceasing;  జ్ఞానాన (j~nAnAna) = knowledge;  నీ (nI) = your;  సాకారమున్నదందురు (sAkAramunnadaMduru)  = heard you are available; మంతనానఁ (maMtanAna) = secretly; బిల్తు (biltu) = call you; నొకమాట (nokamATa) = not even one word; వినఁబడదు (vinabaDadu)=  is heard. 

Literal meaning: We heard from Prahlada that you are omnipresent. I plan to hold you in my hands, yet not possible to grab you. We learn that you are present behind the knowledge. I call you secretly, but not even one word could be heard from you.  

Explanation: In the earlier times, Prahlada’s father Hiranyakasipu  tried to catch hold of God, but wasted his time. Even, Duryodhan felt by eliminating Krishna could have a psychological advantage over Pandavas. He and his friends tried in vain. These scriptures show us that truth cannot be encapsulated.

Umpteen attempts to improve the knowledge has isolated man more than ever before. Iconoclastic thinker Vemana compared man’s situation to “A Dog Trapped in Glass House”. (Gāju yiṇṭa gukka kaavaapaurīti గాజు యింట గుక్క కళవళపడురీతి). This the illusion of knowledge is well explained in Bhagavad-Gita. {सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ( 14-6) sukha-saṅgena badhnāti jñāna-saṅgena chānagha Purport: O Arjun, It binds the soul by creating attachment for a sense of Happiness and Knowledge.} With this folly of knowledge, we foolishly feel that we know God. 

భావము: అంతటా నుందువని ప్రహ్లాదుఁడు చెప్పెననఁగా ఆలోచించి గుప్పెటలో పట్టి జేబులో పెట్ట దలతును, నీవా చేతికిఁ జిక్కుట లేదు. సంతత జ్ఞానాన నీ సాకారమున్నదందురు. మంతనాలు చేసి పిలుతును. ఐనా ఒక్కమాటా వినఁబడదు.

వివరణము: పూర్వ కాలంలో, ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు దేవుడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు, కానీ ఫలితం లేక పోయె. కృష్ణుడిని నిర్మూలించడం ద్వారా పాండవులపై  మానసికంగా పైచేయి పొందవచ్చని దుర్యోధనుడు భావించాడు. ఆ దుష్టచతుష్టయము చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. ఈ  నిత్యనూతనమైన సత్యాన్ని గుప్పెటలో పేట్టుకోవడమంటే అరచేతితో సూర్యుణ్ణి అడ్డగించడమేనని గ్రంథాలు మనకు చూపిస్తున్నాయి.

జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చేసిన అనేక ప్రయత్నాలు మనిషిని మునుపెన్నడూ లేనంతగా ఒంటరిని చేశాయి. చేస్తున్నాయి. దీనినే 'గాజు యింట గుక్క కళవళపడురీతి' అని వేమన గారనిరి. ఈ జ్ఞానం యొక్క భ్రాంతి భగవద్గీతలో చక్కగా వివరించబడింది. సుఖ-సంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ (14-6) (భావము అయినప్పటికీ ఇది ఆనందానుభవముతోను మరియు జ్ఞానపిపాసతోను మనిషిని  (ఆత్మను) బంధిస్తుంది.) ఈ రకంగా జ్ఞానం కలిగించు అజ్ఞానంతో, భగవంతుడు నాకు తెలుసు అని మూర్ఖంగా భావిస్తాము.


రవిలో నుందువని సురలు నిన్నుఁ గొలువఁగా

తవిలి పూజించేనంటే దగ్గరి వచ్చుట లేదు
యివల శ్రీవేంకటాద్రి నిరవై నీవున్నాఁడవు
తివిరి సేవించితిమి ద్రిష్టమాయ మాకు    ॥ఇది॥ 

ravilO nuMduvani suralu ninnu goluvagA

tavili pUjiMchEnaMTE daggari vachchuTa lEdu
yivala SrIvEMkaTAdri niravai nIvunnADavu
tiviri sEviMchitimi drishTamAya mAku  idi

 

Word to Word meaning: రవిలో (ravilO) = in light, in the Sun God; నుందువని (nuMduvani) = we heard you are there; సురలు (suralu) = gods;  నిన్నుఁ (ninnu) = you; గొలువఁగా (goluvagA) = performed prayers;  తవిలి (tavili) = with an intent to hold you; పూజించేనంటే (pUjiMchEnaMTE) = performed prayers;  దగ్గరి వచ్చుట లేదు (daggari vachchuTa lEdu) = not coming near; యివల (yivala) = this side; శ్రీవేంకటాద్రి (SrIvEMkaTAdri) = on the hill called Venkatadri;  నిరవై (niravai) = firm or fixed; నీవున్నాఁడవు (nIvunnADavu) = You are there; తివిరి (tiviri) = by attempting; సేవించితిమి (sEviMchitimi) = we served; ద్రిష్టమాయ (drishTamAya) = optical illusions; మాకు (mAku) = we. 

Literal meaning: We heard You are the brightness in Sun God; With an intent to hold you, we performed prayers. Still, you are no nowhere near. We know you are there on the hill called Venkatadri. Yet, we continue to serve these (optical) illusions. 

Explanation: Let us remember the quote of Voltaire: ‘Illusion is the first of all pleasures’. We indulge in it. Therefore man's effort to extricate from his present position is partial. Hence we continue our journey as it is.

భావము: నీవు సూర్యభగవానునిలో తేజస్సు అని విని నిన్ను తగులుకోవాలనే ఉద్దేశ్యంతో మేము ప్రార్థనలు చేసాము. ఐనా, నువ్వు దగ్గర వచ్చుట లేదు. నువ్వు ఈ వెంకటాద్రి అనే కొండపై ఉన్నావని మాకు తెలుసు. అయినప్పటికీ, మేము ఈ దృశ్య భ్రమలనే సేవించితిమి.

వివరణము: అన్ని ఆనందాలలో భ్రమ మొదటిది’ అన్న వోల్టేర్ చెప్పిన మాటను మనం గుర్తుంచుకుందాం. అందువల్ల దాని నుండి బయటపడటానికి మనిషి ప్రయత్నం పాక్షికమే. ఇక మన జీవిత ప్రయాణం ఎప్పటిలాగే.


Summary of this Keertana:

This living thing (or God) should not be mistaken for illusion. However, you cannot determine it with certainty (like day and night). God appears in front of those who serve him with perseverance, awareness and without fear. (Implied meaning: Do not dither in doubt. Setting aside all the confusion (the unreal), pray the God steadfastly. Your prayers will be answered instantly.) 

Vedas declare that you (God) are there in the mind. I try to find you there by prayers and meditation. Yet there are no traces of you. We learn that the living thing (life force) exists there in order and clarity. With great care I try to find. Yet you are inconceivable. 

We heard from Prahlada that you are omnipresent. I plan to hold you in my hands, yet not possible to grab you. We learn that you are present behind the knowledge. I call you secretly, but not even one word could be heard from you. 

We heard You are the brightness in Sun God; With an intent to hold you, we performed prayers. Still, you are no nowhere near. We know you are there on the hill called Venkatadri. Yet, we continue to serve these (optical) illusions. 

 

కీర్తన సంగ్రహ భావము:

ఈ జీవమును (లేదా దైవమును) భ్రాంతి అని పొరబడకూడదు. అయినప్పటికీ, అద్దానిని పగలు మరియు రాత్రిలాగ ఖచ్చితంగా నిర్ధారించలేరు. పట్టుదలతో, అవగాహనతో, నిర్భయంగా సేవ చేసే వారికి ముందు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. (అన్వయార్ధము: సందేహాలలో కొట్టుకుపోకండి. వాస్తవం కాని దానిని పక్కన పెట్టి, భగవంతుడిని పదిలముగా ప్రార్థించండి. మీ ప్రార్థనలు వ్యర్ధము కావు.) 

భగవంతుడా! నీవు మనస్సులో ఉన్నావని వేదాలు ప్రకటిస్తున్నాయి. ప్రార్థనలు మరియు ధ్యానం ద్వారా  నిన్ను  వెదకుదును.  అయినా అక్కడ నీ జాడ లేదు. జీవుడు (ప్రాణశక్తి) క్రమంలోనూ మరియు స్పష్టతలోనూ ఉందని మనం తెలిసితిని. చాలా జాగ్రత్తగా నేను కనుగొనడానికి ప్రయత్నిస్తాను. అయినా నువ్వు భావించ లేనంత అనూహ్యంగా ఉన్నావు.

అంతటా నుందువని ప్రహ్లాదుఁడు చెప్పెననఁగా ఆలోచించి గుప్పెటలో పట్టి జేబులో పెట్ట దలతును, నీవా చేతికిఁ జిక్కుట లేదు. సంతత జ్ఞానాన నీ సాకారమున్నదందురు. మంతనాలు చేసి పిలుతును. ఐనా ఒక్కమాటా వినఁబడదు. 

నీవు సూర్యభగవానునిలో తేజస్సు అని విని నిన్ను తగులుకోవాలనే ఉద్దేశ్యంతో మేము ప్రార్థనలు చేసాము. ఐనా, నువ్వు దగ్గర వచ్చుట లేదు. నువ్వు ఈ వెంకటాద్రి అనే కొండపై ఉన్నావని మాకు తెలుసు. అయినప్పటికీ, మేము ఈ దృశ్య భ్రమలనే సేవించితిమి.

 

Copper Leaf: 237-1  Volume 3-210

201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు. (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu)

  ANNAMACHARYULU 201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu) Introduction : A nnamacharya is t...