Monday 26 February 2024

T-197. తనవారలు పెరవారలు

 అన్నమాచార్యులు

197. తనవారలు పెరవారలుఁ

 

వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్

 

ఉపోద్ఘాతము: చాలా సాధారణముగా కనబడు ఈ కీర్తనలో అన్నమాచార్యులు అనేక విషయములు ప్రస్తావించిరి. ఇందులో “జూపులఁ జురుచూండ్ల కెడమియ్యని” అను పదబంధమును వాడారు. ఇది మనము సర్వ సాధారణముగా, నిజ జీవితములో క్షణము కూడా చేయు పనిమీద విను దానిమీద ధారణమును,  బుద్ధిని లగ్నము చేయలేని మన అశక్తతతను చూపుచున్నది. 

 

అధ్యాత్మ సంకీర్తన

రాగిరేకు:  37-3 సంపుటము: 1-229

తనవారలు పెరవారలుఁ దాననియెడివాఁ డెవ్వఁడు

తనుగుణముల దిగవిడిచిన ధన్యుం డాతఁడె పో         ॥తన॥

 

తెగఁబడి మదనసముద్రము దేహముతోడనె దాఁటిన

విగత భయుం డతఁ డెవ్వఁడు వీరుం డెవ్వఁడొకో

పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి

జగదేకప్రీతుండగు చతురుం డాతఁడెపో         ॥తన॥

 

యేచిన పరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన

ధీచతురుం డతఁడెవ్వఁడు ధీరుం డెవ్వఁడొకో

చూచిన మోహపుఁ జూపులఁ జురుచూండ్ల కెడమియ్యని

రాచఱికపు నెరజాణఁడు రసికుం డాతఁడెపో    ॥తన॥

 

చావుకు సరియగు ద్రవ్యవిచారపు తగులులఁ బాసిన

పావనుఁ డెవ్వఁడు బహుజనబాంధవుఁ డెవ్వఁడొకో

శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన

దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో  ॥తన॥

 

తనవారలు పెరవారలుఁ దాననియెడివాఁ డెవ్వఁడు

తనుగుణముల దిగవిడిచిన ధన్యుం డాతఁడె పో       ॥తన॥

 

ముఖ్యపదములకు అర్ధములు: పెరవారలుఁ = పరులు; దిగవిడిచి= త్యజించి, విసర్జించి.

భావము: తన వారెవ్వరు? పరులెవ్వరు? నేను అనువాడెవ్వడు? ఈ తనువు గుణములను త్యజించిన వాడే ధన్యుడు.

వివరణము: ఈ పల్లవిని చూస్తే మనిషికి తనకు పరులకు వ్యత్యాసము లేక చూడవలెనని బోధించు చున్నట్లు అనిపించవచ్చును. ఈ రకముగా బోధనలతో ప్రజలు బాగు పడిన, ఈ ప్రపంచమున బాధలేమియు వుండెడివి కాదు. ​ కానీ నిజ జీవితములో మనమెంతయు భాధల ద్వారా ప్రయాణమునకు అలవాటుపడి, అవి లేక జీవనము లేదు అను నిశ్చయమునకు వచ్చుదుము. మన అవగాహన సరియైనదేనా?’ అని తిరిగి పరీక్షించుకోవలెను. బోధనల ప్రభావము కాలముతో తగ్గి మనిషి మరలా వెనకకు వచ్చును. అందువల్ల బోధనలతో నిమిత్తములేని దానిని అన్నమాచార్యులు తెలియజేయుచున్నారు.

నేను అనునది మనసులో గాఢముగా నాటుకున్న అభిప్రాయము. మనిషి నేను అను  తెర వెనుక నుండి ఈ ప్రపంచము చూచుటకు ప్రయత్నం చేస్తాడు. నేను అనునది అనేక అభిప్రాయాల సమాహారం. వయసుతో పాటు వ్యక్తికి  ఈ అభిప్రాయం బలపడుతుంది. ఇది మనము ప్రత్యక్షముగా పరీక్షగా చూసి గ్రహించవచ్చు.

నేను వేరు ప్రపంచం వేరు అనే భావన తొలిదశలోనే రూపుదిద్దుకున్నది.  కాబట్టి దీనిని సులువుగా సులభముగా కొట్టి వేయలేము.  'నేను'ను 'ౘుట్టుకొనియుండు ఆవరణము' నుండి 'ప్రపంచము'ను వేరు చేయి ప్రవృత్తియే మానవుని అన్ని బాధలకు మూలము. దీనిని ఇంకను పరిశీలించిన ఇది ఒక సెక్యూరిటీ నెట్ లాంటిది. ఆ రక్షణ కవచం వెనుక బాధలను ఎలాగో భరిస్తూ తనకంటూ తను కొన్ని హద్దులను నిర్మించుకుని, నిశ్చితమైన అభిప్రాయములతో మనిషి జీవనం సాగిస్తాడు.

అన్నమాచార్యులు చెబుతున్నది ఈ రక్షణ కవచం పూర్తిగా తొలగించు క్రియ. అందుకనే వారు దిగవిడుచు అను పదం వాడారు. అంతేకానీ ఎడమ చేతి జేబులో ఉన్న సరుకు కుడిచేతి వైపు జేబులోకి మార్చుట కాదు.  సరకును పూర్తిగా తొలగించుట.  మహానుభావులుగా ప్రసిద్ధి చెందినవారు తమకు ప్రపంచమునకు మధ్య దగ్గరి సంబంధాలతో జీవించారు. అంతేకానీ వారు ప్రజలనుంచి దూరముగా సౌధములలోను, కోటలలోను నివసించలేదు.

ఈ రకముగా ఆలోచించిన​, మనను, ప్రపంచమును వేరు చేయునది మన వూహలు, అంతరంగములో నిర్మించుకున్న ప్రకృతి ప్రసాదించని నిర్మాణములే. తనుగుణముల దిగవిడిచిన ధన్యుం డాతఁడె పో అని అన్నమాచార్యులు మనము అను వూహను & “తనువు అను దేహమును కలుపువానిని సూచించారు.

అన్నమాచార్యులు ఈ కీర్తనలను వ్రాసినది ప్రతి ఒక్కరు స్వయముగా ప్రత్యక్షముగా సత్యమును దర్శించుట కొరకే. అసలు మన మనస్సులలో ఈ కీర్తనలొ వ్రాసిన భావనలుంటే ఏ దైవమును స్మరించ నక్కరలేదు. ఏ కొండా ఎక్కి శ్రమించ నవసరంలేదు. కాబట్టి, వారు ప్రజలలో చైతన్యము తీసుకుని రావడానికి శతవిధాలుగా ప్రయత్నించారు.

తెగఁబడి మదనసముద్రము దేహముతోడనె దాఁటిన

విగతభయుం డతఁ డెవ్వఁడు వీరుం డెవ్వఁడొకో

పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి

జగదేకప్రీతుండగు చతురుం డాతఁడెపో          ॥తన॥

ముఖ్యపదములకు అర్ధములు: తెగఁబడి = తెగించు, సాహసించు; చతురుండు = నిపుణుఁడు, నేర్పరి

భావము: కోరికల  సముద్రమును ఈ దేహము తోడనే సాహసించి దాటు భయములేని వాడెవ్వడు? ఆవీరుడెవ్వడో? నిరంతరము సాధించు పంచేంద్రియముల తోడనె బతికి జగదేకప్రీతుండగు చతురుం డావీరుడెపో!

వివరణము: అన్నమాచార్యులు చెబుతున్నది చాలా సులభము అనిపించవచ్చును. కానీ కోరికలలో కొట్టుకొనిపోవు మనలాంటి వారికి ఇది దాదాపు అసాధ్యమే. అనేకులు ప్రయత్నించి మరలినారు.అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము’ అను కీర్తనలోని క్రింది చరణం చూడండి.

 

జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు
వొడలిలో జీవునికి నొక్కొక్కవేళ
బడబాగ్ని రేఁగినట్టు పైకొనీ ముంగోపము
వుడికించు మనసెల్ల నొక్కొక్కవేళా అట్టి॥

 

భావము: ఒక్కొక్కవేళ సముద్రములన్నింటి ఉప్పెనలు ఒక్కసారి తాకినట్లు ఇంద్రియములు తత్తఱపెట్టును. ఇంకో సమయంలో బడబాగ్ని రేఁచినట్లు మనస్సును ఓర్పు లేక తటాలున వచ్చు కోపముతో ఉడికించును.

అట్టి పరిస్థితులలో మానవుడు వివేకముతో నుండ లేడన్నది వాస్తవము. ఇక్కడ భయము అనునది యేర్పరచి యెత్తుకోవడము వంటిది. పూర్వానుభవములు కళ్ళముందర నాట్యము చేస్తూ మనలో చెప్పరాని ఉద్విగ్నతను  పుట్టించి తెలిసిన మార్గములోనికి మనసును మళ్ళించును. అట్టి పరిస్థితులలో మనిషి అత్యంత ఒత్తిడికి గురియై తనకు ముందే తెలిసిన మార్గమును ఎంచుకొనుటకు సిద్ధమౌతాడు.

అన్నమాచార్యులు తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ / గగనము మోచియుఁ గర్మము దెగదా           అన్నప్పుడు, విశ్వమును గదలించుట కాదు, తనను తాను ఎంచుకున్నమార్గము నుండి మరలించుకోకుండా చూచుకొనుట ముఖ్యము. ఈ విషయమును గ్రహించలేక అనేకులు వృధాప్రయాసలకు లోనౌతూ దైవ కార్యము నందు నిమ్మగ్నమైయ్యామని చెప్పుకొందురు.

జగదేకప్రీతుండగు చతురుండు: అట్టి స్థితికి చేరుకున్న మాహాత్ములు సర్వులకు శుభమే కోరుకుంటారు. కాబట్టి జగదేకప్రీతుడు అగునని అనుకోవచ్చును. చతురుడు, నిపుణుఁడు, నేర్పరి వంటివి ఎందుకు పేర్కొన్నారు? అట్టి దశకు చేరుకున్నవారికి  ఇప్పటి వ్యక్తిత్వముతో సంబంధముండదు. (‘తనుగుణముల దిగవిడిచిన ధన్యుం డాతఁడె పోఅన్న పల్లవిని గుర్తు చేసుకోండి.) అట్టివాని మనసును దైవమే నడుపును. వారి నైపుణ్యములకు హద్దులేవి?

ఇంత స్పష్టంగా వుంది కదా. ఇకపై శ్రీవేంకటగిరినాథుని పూజింతము అని నిశ్చయము చేసికొన్నను లాభము లేదు. 1926లోనే రెనె మాగ్రిట్ వేసిన ది బ్లడ్ ఆఫ్ ది వరల్డ్ (రక్తసిక్త ప్రపంచం) చూడండి. ఇందులో కాళ్ళు చేతులు చిందవందరగా పడవేసి వుంటాయి. పాక్షికంగా కవర్ చేసిన గుండ్రని రూపాల ఆంతర్యము కనిపెట్టడం కష్టమైనప్పటికి అవి మనలో వికృత కోణాన్ని ఆవిష్కరిస్తాయి.  1926లోనే రెనె మాగ్రిట్ గారు 'మాస్టర్' అనే స్పష్టత వచ్చింది. ఈ బొమ్మ మనిషి అంతరంగము లేదా మనసు వంటిది.



ది బ్లడ్ ఆఫ్ ది వరల్డ్ ప్రేక్షకులకు స్పష్టంగా మరణాన్ని చూపించనప్పటికీ, ఇది మరింత భయంకరమైన రీతిలో మరణం క్రూరమైనదనే ఆలోచనను కల్పించి మనసులో భయన్ని సృష్తిస్తుంది. మరణం మనలో ఉందనే భావనను కలిగిస్తుంది.  బాహ్య ప్రపంచానికి కనిపించని అంతర్గత సమస్యల ఆలోచనకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనితో మనిషి  అంతరంగమున  శాంతియుతంగా ఉండలేడు. శాంతిలేనినాడు జీవితము ఇప్పటిలాగానే కొనసాగుతుంది.

 

యేచిన పరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన
ధీచతురుం డతఁడెవ్వఁడు ధీరుం డెవ్వఁడొకో
చూచిన మోహపుఁ జూపులఁ జురుచూండ్ల కెడమియ్యని

రాచఱికపు నెరజాణఁడు రసికుం డాతఁడెపో   ॥తన॥

ముఖ్యపదములకు అర్ధములు: యేచిన = బాధించు, ఇబ్బందిపెట్టు, ఏడిపించు; జురుచూండ్లకు = పీల్చుకొనుటలో;  ఎడమియ్యని = విరామమియ్యని, తెరపి యియ్యని;

భావము: ఇబ్బందిపెట్టుచున్న పరితాపాగ్నులతో బాధల నందక బయలుపడు ధీరుడు చతురుడు ఎవ్వడో? మోహము తనను అన్ని వైపులనుండి చూపులతో లాగుచున్ననూ, తన  పరిశీలనలకు విరామమియ్యని వాడే రాజు,  రసికుడు, నెరజాణ.

వివరణము: జూపులఁ జురుచూండ్ల కెడమియ్యని ఏకగ్రత, మనసు, బుద్ధి లగ్నము చేయలేని మన బలహీనతను సూచించుచున్నది. దీనిని తీక్షణముగా పరిశీలించవలెను. శాస్త్రములు, వేదములు ఏకాగ్రతను బోధించుచున్నప్పటికీ మనము దాని అసలు రూపమును తెలియము. ఉదాహరణకు "హిమాలయములు" అన్నారనుకోండి. వెంటనే మంచుకొండలు చల్లనిగాలి ఆహ్లాదకరమైన వాతావరణము మన వూహల్లోనికి చొచ్చుకొని వచ్చి "హిమాలయములు" తరువాత పలికిన పదముల మీద లక్ష్యము కొంత తగ్గును.

అదేవిధముగా మనము చూచుదానిలో ఏదోవొకటి మన మనస్సును ఆకర్షించును లేదా వికర్షించును. వీనిలో ఏది జరిగిననూ ఏకాగ్రత భంగమై  "జూపులఁ జురుచూండ్ల కెడమిచ్చుట జరిగిపోవును. అప్పుడు మనము దారితప్పిన వారమగుదుము. అన్నమాచార్యులు తన కాలములోనే కాదు, అనేక వందల సంవత్సరాల తరువాత కూడా విఙ్ఞానము అభివృద్ధి చెండినదనుకుంటున్న ఈ కాలములో కూడా ఆశ్చర్యము, ఆసక్తి గొలుపు అనేక పరిశోధనములను, విచయములను మనకు అందించినారు.

 

చావుకు సరియగు ద్రవ్యవిచారపు తగులులఁ బాసిన

పావనుఁ డెవ్వఁడు బహుజనబాంధవుఁ డెవ్వఁడొకో

శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన

దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో ॥తన॥

 

భావము: మరణముతో నమానమగు విషయ విచారణకు వుసిగొలుపు  జంఝాటము తప్పించుకున్నవాడే పావనుడు, బహుజనబాంధవుడు. శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపినవాడే దైవసమానుడు, ధీరుఁడు.

వివరణము: చావుకు సరియగు ద్రవ్యవిచారపు తగులులఁ బాసిన / పావనుఁ డెవ్వఁడు”: అన్నమాచార్యులు "ద్రవ్యవిచారపు" అను దానితో Materialistic Thinkingను సూచించారు. తిరిగి (‘తనుగుణముల దిగవిడిచిన ధన్యుం డాతఁడె పో’) అన్నదానిని పరిగణించండి. వీటిని "చావుకు సరియగు' అని వర్ణించి, వాటి దుష్ప్రభావములను చెప్పిరి.  ఐతే, అనుకున్న మాత్రమున వీడలేమన్నది సూచించుచూ "తగులులఁ బాసిన / పావనుఁ డెవ్వఁడు" అన్నారు. ఏక వచనముతో అట్టివారు బహు అరుదుగా పుట్టుదురని తెలియపరిచారు.

శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన / దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో”: అయ్యలారా! మనమెవరమూ నిజముగా శ్రీవేంకటగిరినాథుని చూసి కూడా వుండలేదు. ఇక వారిని చిత్తములో నిలుపు ప్రశ్నయే వుదయించదు.

మన మనస్సులలో శ్రీవేంకటగిరినాథుని చూడవలెననే కోరిక కన్నా, అందుకు మనము చేయవలసిన మన అంతరంగములోని నిర్మాల్యమును తొలగించుకొనుటకు ప్రయత్నము లేక​, మనకు రెండు ప్రపంచములు కనబడును. శ్రీవేంకటగిరినాథుని చూచుట కత్తి మీద సాము వంటిది. రెండు ప్రపంచములలో ఒకటి మిథ్య​. ఒకటి నిజము. మిథ్య వున్న దగ్గర సత్యముండదు. మిథ్యను దిగవిడుచుటకు మనము జంకుదుము. ధీరులైనవారు మిథ్యను పరిగణించక శ్రీవేంకటగిరినాథుని వెంబడింతురు.

అన్నమాచార్యులు అనేక మార్లు రెండు ప్రపంచములు లేవని, వున్నది ఒకటే, మన కళ్ళముందరున్న ప్రపంచమని ఘోషించారు. అనగా శ్రీవేంకటగిరినాథుని జీవించి వుండగానే తెలిసి చిత్తములో నిలుపినవారు సమస్తమును వదలి అటువైపు పయనింతురు.

కానీ అట్టి ప్రయాణము అత్యంత సాహసోపేతమైనది. మానవులకు అసాధ్యము. అందుకే ఆత్మ సమర్పణము చేయవలెను అన్నది సిద్ధాంతాత్మకము కాదు (not a theoretical submission).  నిజముగా, వాస్తవముగా చేయు కార్యము. ఆ అగ్ని పరీక్షకు తాళలేక వెనుదిరుగువారు అనేకులు.

ఇందులో ఇంకొక రహస్యమును కూడా తెలియెజేసారు అన్నమాచార్యులు. ఆ రకముగా శ్రీవేంకటగిరినాథుని దర్శించినవాడు దేవసమానుఁడు అగును. అనగా మానవుని ఎదుట రెండే మార్గములు కలవు. ఒకటి శ్రీవేంకటగిరినాథుని  తెలియుట​. రెండవది మన ఇప్పటి దీన స్థితిని కొనసాగించుట​.

-X-X  సమాప్తము  X-X-

Friday 23 February 2024

196. vETakADanaMTA nA veMTa bAyavu vOri (వేఁటకాఁడనంటా నా వెంటఁ బాయవు వోరి)

ANNAMACHARYULU

196. వేఁటకాఁడనంటా నా వెంటఁ బాయవు వోరి

(vETakADanaMTA nA veMTa bAyavu vOri)

 

The ego is not master in its own house-Sigmund Freud

 

for Telegu (తెలుగు) Version press here

 

Introduction: This poem resembles a sketch, crafted in an ineffable state of meditation. Attempting to decipher every word is impractical, yet one can discern the central idea. Thus, I refrain from offering a literal interpretation but instead endeavour to convey the meaning of the chorus and each stanza. 

In this poem, he contemplates something akin to a shadow, akin to his own consciousness, which remains persistent. It endures, showing unwavering determination and resilience. It upholds its assertions, offers resistance to change, instils fear, and creates a sense of security. 

The inclusion of this commentary aims to illustrate Annamacharya’s relentless attempts to seek liberation for individuals through direct self-experience. Each of his poems serve as an endeavour to inspire people to explore truth firsthand by comprehending his language and its meaning.  

This exquisite and unparalleled poem is like to an inherently delicate flower, a wonder to admire and transcending the merits of material embrace. Even the slightest breath of air would disturb its beauty. It exists in absolute silence. 

That beauty transcends limitations of time and encompasses everything in it. That beauty, that compassion knows no bounds. This is what Jiddu Krishnamurti had explained during his entire life. 

 

శృంగార కీర్తన:

రాగిరేకు:  68-1 సంపుటము: 5-217

Romantic Verse

Copper Leaf:  68-1 Volume: 5-217

వేఁటకాఁడనంటా నా వెంటఁ బాయవు వోరి
చీటకపు చెంచెత నాచేతి లాగెరఁగవా  ॥పల్లవి॥
 
పొదలో నేనేసిన పులి నీవేసితినని
పెదపెద్ద యెలుగుఁల బెదరించేవు
కుదురుగుబ్బల నిన్నుఁ గుమ్ముదునో వుండేవో మేను
చిదియఁగా మేటిచెంచెత నన్నెఱఁగవా              ॥వేఁట॥
 
చేరువ నామోఁటునఁ జేరిన నామెకముల
నేరుపరినంటా నీవునేసేవు
జీరలుగా కొమ్ము గోరఁ జింతుతో వూరకుండేవో
పేరుకల చెంచెత నాబిరుదులెరఁగవా                ॥వేఁట॥ 

చొల్లెపు చుట్టలతోడ చూపులకు నడ్డాలు
చెల్లునంటా వచ్చి చెట్టవట్టేవు
నొల్లననఁగా గూడేవు వుద్దండపు వేంకటేశ
జల్లివింటి చెంచెత నాచలములెరఁగవా             ॥వేఁట॥
vETakADanaMTA nA veMTa bAyavu vOri
chITakapu cheMcheta nAchEti lAgeragavA pallavi
 
podalO nEnEsina puli nIvEsitinani
pedapedda yelugula bedariMchEvu
kudurugubbala ninnu gummudunO vuMDEvO mEnu
chidiyagA mETicheMcheta nanne~ra@MgavA vETa 
chEruva nAmOTuna jErina nAmekamula
nEruparinaMTA nIvunEsEvu
jIralugA kommu gOra jiMtutO vUrakuMDEvO
pErukala cheMcheta nAbiruduleragavA          vETa
 
chollepu chuTTalatODa chUpulaku naDDAlu
chellunaMTA vachchi cheTTavaTTEvu
nollananagA gUDEvu vuddaMDapu vEMkaTESa
jalliviMTi cheMcheta nAchalamuleragavA      vETa

 

 

Details and explanations: 

వేఁటకాఁడనంటా నా వెంటఁ బాయవు వోరి
చీటకపు చెంచెత నాచేతి లాగెరఁగవా ॥పల్లవి॥
 
vETakADanaMTA nA veMTa bAyavu vOri
chITakapu cheMcheta nAchEti lAgeragavA   pallavi

Word to Word Meaning: వేఁటకాఁడనంటా (vETakADanaMTA) = claiming to be an able shooter; implying that I am capable of finding the Truth;   నా వెంటఁ బాయవు వోరి (nA veMTa bAyavu vOri) = You don’t leave me alone, you continue to hold on to me; చీటకపు (chITakapu) = Play, sport, pastime, diversion, Manner, mode, fashion, way, easily; చెంచెత (cheMcheta)= శబరకాంత, ఇక్కడ మానవుని నీచమైన స్థితిని చూపుటకు వాడినారు; A lady belonging to forest/lower tribes, Here it is indicating lower and undignified position taken by man;  చీటకపు చెంచెత (chITakapu cheMcheta) = సులభముగా అటునిటు వూగిసలాడు; లాగు (lAgu) = pull, నాచేతి లాగెరఁగవా (nAchEti lAgeragavA) = Don’t you know what pulls me? (into the engagements I do at present)  

Meaning:(Annamacharya speaking within himself. The first line is a fact on man’s endeavours, the second line indicates miserable position of man for such a venture) Oh, mind! You stubbornly face every obstacle like a relentless hunter, affirming my pursuits. Why do you, wretched creature, oscillate between extremes?

Explanation: Having recognized the necessity of grappling with the mind, Annamacharya crafted this unparalleled sketch. While it may not depict anything specific, he captivates our focus through skillful wordplay, creating an enigmatic masterpiece that entices our curiosity.

The core message of this chorus lies in the relentless creation of countless obstacles by the mind, hindering our quest to attain divinity. This is why the word "చెంచెత" (cheMcheta) is employed, reflecting the vexingly profound level of difficulty.

Let's delve into "నాచేతి లాగెరఁగవా" (nAchEti lAgeragavA). It's akin to questioning, "Do you not perceive your own reflections?" We possess the capacity to discern through cognition. Anything identifiable is part of the material realm, akin to reflections or shadows. The wording of the preceding poem, "యేనుగఁ దలఁచితే యేనుగై పొడచూపు / మాను దలఁచిన నట్టే మానై పొడచూపు," carries ominous undertones. Also, the chorus “యీ యీ యీరీతి నా గుణము నాయందే తగిలెను” (yI yI yIrIti nA guNamu nAyaMdE tagilenu) is indicating that we get foxed by our thinking.

Let's delve into this concept through the captivating illustration by Hilma Af Klint in Swan No. 13. True to her style, Hilma frequently divides her artworks along the horizontal axis, with one segment depicting the familiar world and the other encapsulating the enigmatic facets of the self. In this piece, the diagram resembles a figure immersed in profound introspection, delving into the depths of the self.


The upper and lower parts indeed seem to mirror each other, suggesting a perpetual presence of these reflections. From this, we may infer that perceiving truth in our conscious state is unattainable. As one transitions from the current state of distraction to focused concentration at the brightly lit centre, where only singularity exists. To embark on a journey deep within the layers of the mind, presently beyond reach. Thus, this passage towards the centre represents a movement from the known to the nothing that is “me is nothing”. Not a conceptual journey, but an actual thing.

Indeed, when the mind encompasses both the known and unknown realms, discerning between mere reflections and truth becomes arduous. To confront this challenge, it is imperative to acknowledge the reflections that the conditioned mind presents to us. This task encompasses the dissolution of all that is known, a feat hindered by the fact that the seeker is inherently part of what is sought. It's akin to a snake devouring its own tail, a circular pursuit entwined with its own essence.

Hence, the words "నాచేతి లాగెరఁగవా" (nAchEti lAgeragavA, = you are incapable of finding your own pulls) signify our inability to grasp the truth. It’s not as easy as trying to keep a mobile phone in a shirt pocket. When we genuinely acknowledge internally that we don't possess knowledge to find; and remain in a state of incapacity to act, there arises the potential to remain free of the disturbance of this way or that way. From the depths of this silence, there exists the possibility to discover the truth.

The subsequent stanzas of the poem delineate our superficial interactions with a world inundated with assertions and rebuttals.

పొదలో నేనేసిన పులి నీవేసితినని
పెదపెద్ద యెలుగుఁల బెదరించేవు
కుదురుగుబ్బల నిన్నుఁ గుమ్ముదునో వుండేవో మేను
చిదియఁగా మేటిచెంచెత నన్నెఱఁగవా ॥వేఁట॥
 
podalO nEnEsina puli nIvEsitinani
pedapedda yelugula bedariMchEvu
kudurugubbala ninnu gummudunO vuMDEvO mEnu
chidiyagA mETicheMcheta nanne~ragavA    vETa  

Word to Word Meaning: పొదలో (podalO) = in the bush; నేనేసిన (nEnEsina) = the one I shot with arrow; పులి (puli) = tiger (implying a great threat); నీవేసితినని (nIvEsitinani) = you claim (as yours); పెదపెద్ద యెలుగుఁల (pedapedda yelugula) = with boisterous sounds; బెదరించేవు (bedariMchEvu) = threaten, bully; కుదురుగుబ్బల (kudurugubbala) = with all the might one has; నిన్నుఁ (ninnu) = you; గుమ్ముదునో వుండేవో (gummudunO vuMDEvO) =  try to gore, try to pierce, (intending that we try in vain all through the life); మేను (mEnu) = the temporal body; చిదియఁగా (chidiyagA) = when gets  smashed, ruptured (implying becomes useless = death); మేటిచెంచెత (mETicheMcheta) = O heinous creature; నన్నెఱఁగవా (nanne~ragavA)= don’t you know me? 

Meaning:       Oh, vile creature! You loudly boast of overcoming significant challenges in life! Furthermore, you attempt to intimidate me, insinuating that it was your triumph. Thus, you persist tirelessly, striving to assert your superiority, squandering precious time. Despite the weariness etched upon your body by the passage of time, you remain confused, grappling with your own identity. 

Explanation: The last two lines indicate how time leaves us weak and inherently shallow. Thus, Annamacharya is indicating that waiting that transformation happens with time is absolutely fallacy. Conversely, he is asking us to leave everything aside and venture into this journey of self-discovery. 

There are no known methods to it. Knowing from the study done on others is not self-discovery. Hence. It must be undertaken directly. Hence, Annamacharya discouraged dependency on books and scriptures by the words ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల (inniyu jaduvanEla yiMtA vedakanEla) (Why read (scriptures) much? Why search much on God? 

We often fail to comprehend divine interventions. Numerous instances of calamity have been averted. Take, for instance, the pivotal contributions of Ms. Katalin Karikó (nobel prize for 2023) in combating the COVID-19 pandemic. Despite her significant efforts, she faced demotion by the University of Pennsylvania during her prime years of groundbreaking work. This illustrates how the world often treats its saviors. True crusaders, however, do not base their actions on external reactions, unlike we mortals. 

The phrase "కుదురుగుబ్బల నిన్నుఁ గుమ్ముదునో వుండేవో మేను (kudurugubbala ninnu gummudunO vuMDEvO mEnu)" suggests our constant struggles to comprehend the truth, which ultimately culminates in the degradation of the physical body. We depart from this world filled with despair and ennui. 

చేరువ నామోఁటునఁ జేరిన నామెకముల
నేరుపరినంటా నీవునేసేవు
జీరలుగా కొమ్ము గోరఁ జింతుతో వూరకుండేవో
పేరుకల చెంచెత నాబిరుదులెరఁగవా   ॥వేఁట॥
 
chEruva nAmOTuna jErina nAmekamula
nEruparinaMTA nIvunEsEvu
jIralugA kommu gOra jiMtutO vUrakuMDEvO
pErukala cheMcheta nAbiruduleragavA          vETa 

Word to Word Meaning: చేరువ (chEruva) = adjacent; నామోఁటునఁ (nAmOTuna) = my coarse life; జేరిన (jErina) = joined; నామెకముల (nAmekamula) = my animal instincts; నేరుపరినంటా (nEruparinaMTA) = claim to be skilled; నీవునేసేవు (nIvunEsEvu) = you continue to weave a web (or a frame) of security; జీరలుగా కొమ్ము గోరఁ జింతుతో వూరకుండేవో (jIralugA kommu gOra jiMtutO vUrakuMDEvO) =  When streaks of times leaves you blood smeared, will you remain Calm?;  పేరుకల చెంచెత (pErukala cheMcheta) = O known  villain; నాబిరుదులెరఁగవా (nAbiruduleragavA) = don’t you know my names? 

Meaning: Oh, gloomy villain! Despite your raw animalistic impulses, you assert skill and persist in constructing a shield of security. When the sands of time stain you with blood, will you maintain silence? Do you not recognize my appellations? 

Explanation: చేరువ నామోఁటునఁ జేరిన నామెకముల (chEruva nAmOTuna jErina nAmekamula) = is highlighting man’s animalistic impulses.  Request readers to have a look at the self-explanatory surrealist picture belonging to the Bloom Series below. this picture is painted by Eric Thor Sandberg.


నేరుపరినంటా నీవునేసేవు nEruparinaMTA nIvunEsEvu):  Despite the historical evidence of countless futile endeavours to uncover truth, humanity continues to engage in such pursuits. Trillions of dollars are allocated towards developing more efficient means of destruction (of other nations). Yet, we speak of compassion, Our intelligence seems akin to the devil's advocacy. Thus, నేరుపరినంటా నీవునేసేవు nEruparinaMTA nIvunEsEvu is indicating our pretentions that we are intelligent enough. 

జీరలుగా కొమ్ము గోరఁ జింతుతో వూరకుండేవో (jIralugA kommu gOra jiMtutO vUrakuMDEvO) This underscores our incapacity to remain inert despite recognizing the fruitlessness of our actions. Any movement away from the truth is wrong action. This means all actions taken are foolish. Can we maintain the inaction shown by Prahlada in the face all the adversities he faced?. 

పేరుకల చెంచెత నాబిరుదులెరఁగవా (pErukala cheMcheta nAbiruduleragavA): This suggests that we persist in the belief that we can somehow transcend "MAYA," which is an absolute fallacy.  

చొల్లెపు చుట్టలతోడ చూపులకు నడ్డాలు
చెల్లునంటా వచ్చి చెట్టవట్టేవు
నొల్లననఁగా గూడేవు వుద్దండపు వేంకటేశ
జల్లివింటి చెంచెత నాచలములెరఁగవా            ॥వేఁట॥
 
chollepu chuTTalatODa chUpulaku naDDAlu
chellunaMTA vachchi cheTTavaTTEvu
nollananagA gUDEvu vuddaMDapu vEMkaTESa
jalliviMTi cheMcheta nAchalamuleragavA      vETa 

Word to Word Meaning: చొల్లెపు చుట్టలతోడ (chollepu chuTTalatODa) = in the company of relations which salivates you (= here implying we get bonded with what we like); చూపులకు నడ్డాలు (chUpulaku naDDAlu) = you create a web of obstacles to your vision; = you take for granted that it is sufficient (implying foolishly assuming capability); చెట్టవట్టేవు (cheTTavaTTEvu) = run for the marriage;  చెల్లునంటా వచ్చి చెట్టవట్టేవు (chellunaMTA vachchi cheTTavaTTEvu) = (implying you move forward to take up marriage with the Lord without knowing your own credentials); నొల్లననఁగా (nollananagA) గూడేవు (gUDEvu) వుద్దండపు (vuddaMDapu) వేంకటేశ (vEMkaTESa) జల్లివింటి (jalliviMTi) = defective arrow and bow (implying we work with wrong tools, alternatively man can be assumed to be a tool of Manmatha); చెంచెత (cheMcheta) = person of low origin;   నాచలములెరఁగవా (nAchalamuleragavA) = don’t you understand my variations?   

Meaning: In the presence of your beloved ones and cherished possessions, you inadvertently construct barriers. Unaware of what impedes your progress, you yearn for communion with the Divine. You toy with flawed tools, failing to recognize your own inconsistencies. Oh, Lord, despite this, you never abandon anyone, embracing all with boundless love.

Explanation: చొల్లెపు చుట్టలతోడ చూపులకు నడ్డాలు / చెల్లునంటా వచ్చి చెట్టవట్టేవు (chollepu chuTTalatODa chUpulaku naDDAlu / chellunaMTA vachchi cheTTavaTTEvu): Let us understand that we don’t look at the whole picture of our life. We don’t consider wholeness of life. Our partial engagement as shown by Hilma Af Klint is further corroborated by a beautiful surrealistic painting titled "Le regard intérieur" (the inner gaze) by René Magritte. 


Here we clearly see a red screen with a big beautiful green leaf next to it. This leaf occupies the greater share of the large window there. Beautiful birds are perched on the veins of this leaf. Other objects that can be witnessed are non-descript fields and dotted with small trees. A stream can be seen flowing on the right side. These fields and tress appear to be vanishing into the background and appear to be dull.  Nothing else to note.   A partially filled glass can also be seen in that window.

The window, in this analogy, represents our inner space, while the leaf becomes the focal point of our attention. The birds depicted on this expansive leaf serve as symbols, representing the specific nourishment we direct towards a select few important aspects of life. Despite the comprehensive visibility of everything, including the fields, trees, and brook, they seem to exist in a passive state. According to Magritte, akin to the leaf in the picture, only certain aspects are unveiled to us, and what remains is relegated to the background, lying dormant. This concept is further underscored by Magritte's portrayal of the 'half-full glass,' reinforcing the idea that there are concealed elements, prompting contemplation on what lies beyond what is readily apparent.

Thus, Annamacharya is conveying the idea that in our current state of consciousness, we are only aware of a limited portion of reality, with a significant part remaining obscured or forgotten. In this conditioned state, perceiving the truth becomes challenging. This aligns with the concept that our understanding is constrained by our subjective experiences and limitations, preventing us from comprehending the entirety of truth or reality.

Annamacharya's intention is clear: he asserts that the fault lies in humanity's approach. He expresses certainty in God's compassion through the phrase " నొల్లననఁగా గూడేవు వుద్దండపు వేంకటేశ (nollananagA gUDEvu vuddaMDapu vEMkaTESa)". Therefore, it is incumbent upon humans to rectify their actions. జల్లివింటి చెంచెత నాచలములెరఁగవా (jalliviMTi cheMcheta nAchalamuleragavA) is implying that we continuously approach the Lord in the wrong direction.

                                                          ****The End**** 

201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు. (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu)

  ANNAMACHARYULU 201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu) Introduction : A nnamacharya is t...