Saturday 26 March 2022

114. ఇదియే బుద్ధి నాకు నింతకంటే మఱిలేదు (idiyE buddhi nAku niMtakaMTE ma~rilEdu)

                                                         ANNAMACHARYA 

114. ఇదియే బుద్ధి నాకు నింతకంటే మఱిలేదు

(idiyE buddhi nAku niMtakaMTE ma~rilEdu)

                                                                                    

Introduction: Annamacharya, questions man's avarice for knowledge and acquisition in this deeply contemplative poem. He observes that man is not independent; despite efforts, continues to be chained. There are no tricks and no special skills required to reach God. The path to freedom does not lie outside, but rather in finding & eliminating deep-seated hypocrisy, insincerity, and falsity. That is the service to God.  

Putting ideas in succinct form is Annamacharya's specialty. He weaves magic in tiny words to transport the true seeker into a world bereft of symbols and cognition.  

ఉపోద్ఘాతము: న్నమాచార్యులు లోతుగా ఆలోచింప చేసే ఈ కీర్తనలో జ్ఞానము మరియు ద్రవ్య సముపార్జన కోసం మనిషి పడు తపనను  ప్రశ్నిస్తాడు. ప్రయత్నములు చేయునప్పటికీ, అంతర్గత అసంబద్ధతతో బంధించబడుతూ ఉండి మనిషి ఈ యత్నము అను మార్గము ద్వారా స్వతంత్రుడు కాలేడని అన్నారు. భగవంతుడిని చేరుకోవడానికి ఎటువంటి ఉపాయాలు మరియు ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు.  స్వతంత్రానికి బయట నుంచి మార్గం లేదు, కానీ లోతుగా వేళ్ళూనుకున్న వంచన, మోసము, కపటము, బూటకములను కనుగొని తొలగించండి. అదే భగవంతుని సేవ అన్నారు అన్నమాచార్యులు.

ఆలోచనలను టూకీగా చెప్పడం అన్నమాచార్యుల ప్రత్యేకత. అతడు నిజమైన అన్వేషిని చిన్న పదాలలో మాయాజాలాన్ని అల్లి చిహ్నాలు లేని,  గుర్తింపనలవి కాని ప్రపంచంలోకి తరలించుతాడు.   

 

కీర్తన:

ఇదియే బుద్ధి నాకు నింతకంటే మఱిలేదు

కదిసి నీబంటనంటే కాతువు నన్నును               ॥పల్లవి॥ 

నేరచి నడచేనంటే నేఁ గాను స్వతంత్రుడఁను

నేరమి చేసేనంటే నిండును దూరు
యీరెంటికిఁ గాక నేను యిట్టె నీకు శరణంటే
గారవించి వహించుక కాతువు నన్నును              ॥ఇది॥ 

వొక్కచో నర్థ మర్జించుకుండితే జన్మాలు పెక్కు

యెక్కేనంటే మోక్షము యేడో యెఱఁగ
యెక్కడి సుద్దులునేల యిచ్చట నీనామము
గక్కనఁ బేర్కొంటేఁ దయఁ గాతువుగా నన్నును ॥ఇది॥ 

తపసినయ్యేనంటేఁ జిత్తము కైవశము గాదు

చపలసంసారినైతే శాంతి యుండదు
ఉపమలేల శ్రీవేంకటోత్తమ నీసేవ చేసి
కపటము మానితేను కాతువు నన్నును               ॥ఇది॥​

 

idiyE buddhi nAku niMtakaMTE ma~rilEdu

kadisi nIbaMTanaMTE kAtuvu nannunu॥pallavi॥ 

nErachi naDachEnaMTE nE gAnu svataMtruDanu

nErami chEsEnaMTE niMDunu dUru
yIreMTiki gAka nEnu yiTTe nIku SaraNaMTE
gAraviMchi vahiMchuka kAtuvu nannunu॥idi॥ 

vokkachO nartha marjiMchukuMDitE janmAlu pekku

yekkEnaMTE mOkshamu yEDO ye~raga
yekkaDi suddulunEla yichchaTa nInAmamu
gakkana bErkoMTE daya gAtuvugA nannunu ॥idi॥ 

tapasinayyEnaMTE jittamu kaivaSamu gAdu

chapalasaMsArinaitE SAMti yuMDadu
upamalEla SrIvEMkaTOttama nIsEva chEsi
kapaTamu mAnitEnu kAtuvu nannunu             ॥idi॥

 

 

Details and Explanations:

 

ఇదియే బుద్ధి నాకు నింతకంటే మఱిలేదు

కదిసి నీబంటనంటే కాతువు నన్నును  ॥పల్లవి॥

 

idiyE buddhi nAku niMtakaMTE ma~rilEdu

kadisi nIbaMTanaMTE kAtuvu nannunu         ॥pallavi॥ 

Word to Word meaning: ఇదియే (idiyE) = this one; బుద్ధి (buddhi) = intelligence; నాకు (nAku) = to me; నింతకంటే మఱిలేదు (niMtakaMTE ma~rilEdu) = beyond this nothing else; కదిసి (kadisi) = దగ్గిరకువచ్చు, సమీపించు, approach or come near; నీబంటనంటే (nIbaMTanaMTE) = claim as your servant; కాతువు (kAtuvu) = you protect us; నన్నును (nannunu) = me as well.

Literal meaning:  To me this is intelligence. There's nothing else beyond it. When we approach and submit to you, readily save us. 

Explanation: We in general take intelligence is related certain capacity to memorise, capacity to recognise & recall. Here Annamacharya is saying only intelligence is to submit to the God. Everything else, whatever it may constitute, is not equal to it. 

Just consider this Bhagavad Gita verse:   

क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत |
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम
|| 13-3||

kṣhetra-jñaṁ chāpi māṁ viddhi sarva-kṣhetreṣhu bhārata
kṣhetra-kṣhetrajñayor jñānaṁ yat taj jñānaṁ mataṁ mama

Purport: O scion of Bharat, I am also the knower of all the individual fields of activity. The understanding of the body as the field of activities, and the soul and God as the knowers of the field, this I hold to be true knowledge (or intelligence). 

Thus, note that intelligence considered by Bhagavad-Gita is completely different from our conventional methods. That’s the reason, Annamacharya emphasized the same by saying niMtakaMTE ma~rilEdu (నింతకంటే మఱిలేదు) = beyond this nothing else. 

The important thing said is that it's available to any who seeks it from God. While we use intelligence to meet realise or fructify certain objectives. Whereas Annamacharya is indicating the intelligence which is not privy to self but outside the self. That is the reason he said, chUDarevvaru dIni sOdyaMbu parikiMchi / chUDajUDaga gAni sukhame~ragarAdu చూడరెవ్వరు దీని సోద్యంబు పరికించి / చూడఁజూడఁగఁ గాని సుఖమెఱఁగరాదు None takes a careful look at this amazing thing called (self). Without deep understanding, you cannot find comfort in it. 

So, gentlemen! We need an in-depth re-examination of what intelligence is! We often mistakenly confuse agility, speed, linking & pairing of information and slyness with intelligence. Intelligence is definitely not the kind of trickery we call as smartness. 

Implied meaning: The only and True intelligence is to bow to God. Nothing else saves man from degradation. 

భావము: ఇదొక్కటే బుద్ధి. ఇంతకు మించి మరి లేదు. సమీపించి నీ దాసుడిని అంటే కాచెదవు.

వివరణము: సాధారణంగా తెలివితేటలు అంటే గుర్తుపెట్టుకునే నిర్దిష్ట సామర్థ్యానికి; గుర్తించే మరియు గుర్తుచేసుకునే నేర్పరితనమునకు; అన్వయయోగ్యమైన ఉపయోగమునకు వినియోగించు శక్తికి సంబంధించినవి. ఇక్కడ అన్నమాచార్యులు భగవంతునికి సమర్పించుకోవడమే మేధస్సు అని చెప్పారు. మిగిలినవేవీ దానికి సమానం కాదు అన్నారు.

క్రింది భగవద్గీత శ్లోకములోని 'జ్ఞానము'నకు భగవానుడిచ్చిన వివరణ కూడా చదవండి.  

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ।
క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ (13-3)

భావం: అర్జునా!! భగవంతుని సమస్త క్షేత్రము లందున్న క్షేత్రజ్ఞనిగా యెరుగుము. క్షేత్రక్షేత్రజ్ఞులను గురించి ఏ జ్ఞానము కలదో దానినే అసలైన జ్ఞానమని తెలుసుకొనుము.

పరోక్షంగా తక్కిన విషయాలన్నీ అజ్ఞానము లోని భాగమని సూచించారు. కానీ మనిషి  నిజమునకు తన జీవితంలో ఏమిచేయుచున్నాడో మనకందరికీ తెలిసిన విషయమే.

ప్రస్తుతం మనం అభ్యసిస్తున్న విద్య మనిషికి జ్ఞానము నిచ్చి స్వేచ్ఛ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందనడానికి దాదాపు అందరూ విద్యావంతులై వుండి కూడా ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు విప్లవాలు, యుద్ధాలు, ఆందోళనలే తార్కాణం. అనగా పైన పేర్కొన్న జ్ఞానము మనకు తెలిసిన విద్య ద్వారా సాధ్యం కాదని స్పష్టం.

ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది దేవుని నుండి పొందు ఈ మేధస్సు ఎవరికైనా సార్వత్రికముగా అందుబాటులో ఉండునన్నారు. ఎంత విశాలముగానూ, ఉదారముగానూ ఆలోచించి చేసినను మానవుని కార్య కలాపములు ఒకటో, కోన్నియో లక్ష్యముల సాధనకై పరిమితమై స్వార్ధముతో సమ్మిళితమై ఉండును. అవి కొన్ని అవధులకు, హద్దులకు కట్టుబడి ఉండి పరిమితమగు ఫలితములనిచ్చును.

లక్ష్యములను చేరుకోవడానికి మేధస్సును ఉపయోగిస్తాము, అయితే అన్నమాచార్యులు గోప్యత లేని తెలివితేటలను సూచిస్తున్నాడు కానీ స్వీయమునకు పరిమితం కాని దానితో చూడమంటున్నారు. అందుకే 'చూడరెవ్వరు దీని సోద్యంబు పరికించి / చూడఁజూడఁగఁ గాని సుఖమెఱఁగరాదు' {సాధారణంగా దీనిని (తనలోని తనను) పట్టించుకొనక అద్భుతమైన విషయాన్ని మనిషి మరుగున పెడుతున్నడు} అన్నారు.

కాబట్టి, సజ్జనులారా! మేధస్సు అంటే ఏమిటో మనకు లోతైన పునఃపరిశీలన అవసరం! మనం తరచు చురుకుదనము; వడి; ఉల్లాసము; చిక్కులమారితనములను మేధస్సుతో పొరపడుతాము.

అన్వయార్ధము: ఏకైక  మరియు నిజమైన  తెలివి దైవమునకు తనను తాను సమర్పించుకోవడమే. మరేదీ మనిషిని అధోకరణం (క్షీణత) నుండి రక్షించదు.

 

నేరచి నడచేనంటే నేఁ గాను స్వతంత్రుడఁను

నేరమి చేసేనంటే నిండును దూరు

యీరెంటికిఁ గాక నేను యిట్టె నీకు శరణంటే

గారవించి వహించుక కాతువు నన్నును            ॥ఇది॥

 

nErachi naDachEnaMTE nE gAnu svataMtruDanu

nErami chEsEnaMTE niMDunu dUru

yIreMTiki gAka nEnu yiTTe nIku SaraNaMTE

gAraviMchi vahiMchuka kAtuvu nannunu     idi

 

Word to Word meaning: నేరచి (nErachi) = నేర్చి, by learning, by practice; నడచేనంటే (naDachEnaMTE) = I shall proceed, I shall move;  నేఁ (nE)= myself;  గాను (gAnu) = not; స్వతంత్రుడఁను (svataMtruDanu) నేరమి (nErami) = నేర్వక, without learning; చేసేనంటే (chEsEnaMTE) = perform; నిండును (niMDunu) = fill up with;  దూరు (dUru) = నిష్ఠూరము, blame;  యీరెంటికిఁ గాక (yIreMTiki gAka) = beyond these two; నేను (nEnu) = me;  యిట్టె (yiTTe) = very easily;  నీకు (nIku) = to you; శరణంటే (SaraNaMTE)= say submitted;  గారవించి (gAraviMchi) = respecting my decision; వహించుక (vahiMchuka) = take up responsibility;  కాతువు (kAtuvu) = save; నన్నును (nannunu) = me.

Literal meaning:  If I say I shall walk by learning, I am not independent. My ignorant actions, attract censure. Beyond these two, if I seek your refuge, you take up the responsibility and save me easily. 

Explanation: Why is Annamacharya saying he is not independent. When he submitted his will to God, it clearly means, he shall not act out of his own will. What about us? Are we independent? Are we free to act? How can a conditioned man be free? When you have a multitude of things to chase where does the god appear in our list of things? For sure, he is not the most important thing for us. Then, clearly, we are not independent. 

So, what’s the difference in the state of mind of the liberated and we people? No doubt our minds are cluttered with millions of things to do. You may say, Sachin Tendulkar has nothing but cricket in his life. See, what he could do with the same bat while most of us are just staring at it. Dear reader, there is no point in saying Annamacharya, or Jiddu Krishnamurti had no other work but to ponder on God or Truth. 

What is preventing anyone else from doing so? Obviously, when man starts thinking about it, he will find many things in his way! When man knows those obstacles, for sure he will find a way out. The same is stated by the Bhagavad-Gita verse below. 

वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिता: |
बहवो ज्ञानतपसा पूता मद्भावमागता: || 4-10||

vīta-rāga-bhaya-krodhā man-mayā mām upāśhritāḥ
bahavo jñāna-tapasā pūtā mad-bhāvam āgatāḥ

Purport: Many who have forsaken attachment, fear, and anger, who are fully absorbed in ME, who have taken refuge in ME, who have purified themselves with this knowledge, have attained MY WILL (salvation). 

Implied meaning: it’s not the method, it’s not the prayer. It’s about your strong intent to submit that matters. The Almighty is ever willing to lend you helping hand. 

భావము: నేర్చుకొని ఆ ప్రకారముగా నడచుకొనుటకు స్వతంత్రుడఁను గాను. ఏమీ తెలియకుండా (ఉన్నవాడిని ఉన్నట్లుగానే) చేద్దామనుకుంటే నిష్ఠూరములే లభించునది. అలాకాకుండా నిన్ను శరణంటే గౌరవించి, నా భారము వహించి కాతువు నన్ను.

వివరణము: అన్నమాచార్యులు తాను ఎందుకు స్వతంత్రుడు కాదన్నాడో? తన చిత్తాన్ని ఇప్పటికే దేవునికి సమర్పించినప్పుడు, అతడు తన స్వంత ఇష్టానికి అనుగుణంగా వ్యవహరించకూడదనే అర్థం స్పష్టం.

మన సంగతేమిటి? మనం స్వతంత్రులమా? మనకు వ్యవహరించడానికి స్వేచ్ఛ ఉందా? ఎన్నో షరతులతో కూడిన జీవితంలో మనిషి స్వేచ్ఛగా ఎలా వ్యవహరించగలడు?​ మీకు వెంబడించడానికి అనేకానేక విషయాలు ఉన్నప్పుడు, ఆ జాబితాలో దేవుని ప్రాధాన్యత ఏమి? ఖచ్చితంగా, సత్యము (దైవము) మనకు అతి ముఖ్యమైన విషయం కాదు. అప్పుడు, స్పష్టంగా మనం స్వతంత్రులమూ కాము.

కాబట్టి, విముక్తి పొందిన వారి మానసిక స్థితికి మరియు సామాన్య ప్రజల స్థితికి తేడా ఏమిటి? మన మనస్సులు లక్షలాది పనులతో చిందరవందరగా ఉన్నాయనడంలో సందేహం లేదు. సచిన్ టెండూల్కర్ జీవితంలో క్రికెట్ తప్ప మరేమీ లేదని మీరు అనవచ్చు. చూడండి, మనలో చాలా మంది అదే బ్యాట్‌ని చూస్తూ నిల్చొని ఉండగా అతను దానితో ఏమి చేయగలడో నిరూపించాడు. జిడ్డు కృష్ణమూర్తికి, అన్నమాచార్యులకు  భగవంతుని గురించి ఆలోచించడం తప్ప వేరే పని లేదు అనవచ్చు. 

మిత్రమా! అలా చేయకుండా మానవుని  నిరోధించేది ఏమిటి? సహజంగానే, మానవుడు దాని గురించి ఆలోచించడం  ప్రారంభించినప్పుడు,  అతడే మార్గంలో చాలా ప్రతిబంధాలను  కనుగొంటాడు! అడ్డగించు దానిని గుర్తించడమే ముఖ్యము. అడ్డగించున దేదియో తెలిసిన పరిష్కారము మానవుడు కనుగొనగలడు.

క్రింది భగవద్గీత శ్లోకము కూడా అదే తెలియజేయుచున్నది.

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః

బహావో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః (4-10 )

తా:- అనేకులు  అనురాగము, భయము, క్రోధము విడిచినవారును, నాయందే లగ్నమైన చిత్తముగలవారును, నన్నే ఆశ్రయించినవారై, ఇట్టి జ్ఞానమునందే పవిత్రులై నన్నే చిత్తమందు (మోక్షమును)  బొందిరి.

అన్వయార్ధము: పద్ధతి కాదు, ప్రార్థన కాదు నేర్వవలసినది. ఇక్కడ ముఖ్యమైనది తనను తాను సమర్పించు కోవాలనే బలవత్తరమైన ఉద్దేశం. దైవము సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

వొక్కచో నర్థ మర్జించుకుండితే జన్మాలు పెక్కు

యెక్కేనంటే మోక్షము యేడో యెఱఁగ

యెక్కడి సుద్దులునేల యిచ్చట నీనామము

గక్కనఁ బేర్కొంటేఁ దయఁ గాతువుగా నన్నును            ॥ఇది॥

 

vokkachO nartha marjiMchukuMDitE janmAlu pekku

yekkEnaMTE mOkshamu yEDO ye~raga

yekkaDi suddulunEla yichchaTa nInAmamu

gakkana bErkoMTE daya gAtuvugA nannunu          idi

 

Word to Word meaning: వొక్కచో (vokkachO) = once;  నర్థ (nartha) = money;  మర్జించుకుండితే (marjiMchukuMDitE) = earn; జన్మాలు (janmAlu) = births;  పెక్కు (pekku) = many; యెక్కేనంటే (yekkEnaMTE) = need to take up; మోక్షము (mOkshamu) = liberation;  యేడో (yEDO) = Where; యెఱఁగ (ye~raga) = do not know; యెక్కడి (yekkaDi) = where;  సుద్దులునేల (suddulunEla) = why gossip, rumour mills; ( he meant largely juicy news from grapevine); యిచ్చట (yichchaTa) = here;  నీనామము (nInAmamu) = your name; గక్కనఁ (gakkana) = గ్రక్కున, quickly, immediately;  బేర్కొంటేఁ (bErkoMTE) = To call one by his name; దయఁ (daya) = kindness;  గాతువుగా (gAtuvugA) = truly save;  నన్నును (nannunu) = me as well; 

Literal meaning: Even earning money will make you bound for many births. If I get into this cycle of birth and death, I know not when I will be liberated? (Implying I shall not be liberated.) Why get engaged in news and gossip. If I take your name, you shall save me. 

Explanation: This traditionally raised Hindu monk has said many times before that we cannot achieve liberation through effort. Dear Friend, earning money means some effort. It's movement away from equilibrium. Therefore, it generates corruption in the mind. Annamacharya wrote poetry so that seekers of truth would know what to avoid. 

Interesting word inserted is yekkaDi suddulunEla (యెక్కడి సుద్దులునేల). Just now I got to now there are 392 news channels in India. This is apart from the gossip factories like WHATSAPP and FACEBOOK. All over the world this number would be huge. This just shows how hungry people are about the news. Note that majority just wanted to know what’s happening. This is the favourite time pass for great number of people. 

Have you ever wondered, what can you do with the news? Apart from knowing such and such things are happened, you really cannot make an impact on the events. Still, everyone eager to know the news of the hour. 

Having understood the futility of such news channels, now understand the statement of Annamacharya  yekkaDi suddulunEla యెక్కడి సుద్దులునేల implying that do not waste time in trying to understand the floating news. You cannot draw any tangible conclusions based on such variable things. 

I must remind you, there were no newspapers in the times of Annamacharya.  But by observing the people around, he could foresee futility of such things 500 years back. Annamacharya did not write poetry. He, in that great act of meditation, could feel the world inside himself. You are witnessing its effect in this poem and in many of my previous submissions. 

In this stanza, money and news attract man like a magnet and entrench him in their indulgence. Thus, they stick to the man and push him into their drudgery. 

Implied meaning: O Man! Do not engage in gossip. Do not try even once to earn money. They suck you into their slavery. Instead, immediately take up the name of the lord.

 

భావము: ఒకసారి డబ్బు (అర్థము) సంపాదించు కుందామను కొంటే, అందులోనే పడి జన్మాలు గడిపేస్తాను. ఇక మోక్షము ఎక్కడ​? ( లేదు అని అర్ధము). అక్కడి, ఇక్కడి మాటలు ఎందుకు? గ్రక్కున నీ పేరు తలచుకుంటే దయతో గాతువు.

వివరణము: సాంప్రదాయకంగా పెరిగిన ఈ హిందూ తపసి ప్రయత్నం ద్వారా మనం విముక్తి పొందలేమని ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాడు. సజ్జనులారా! డబ్బు (అర్థము) సంపాదించడం అంటే కొంత శ్రమతో కూడినది. అనగా, అది సమతుల్యతకు వ్యతిరేకముగా ఉండు కదలిక. అందువలన, అది మనస్సులో  అస్థిరత్వాన్ని సృష్టిస్తుంది. సత్యాన్వేషకులు దేని నుండి తప్పించుకోవాలో తెలుసుకునేలా అన్నమాచార్య కవిత్వం రాశాడు.

భారతదేశంలో 392 న్యూస్ ఛానెల్‌లు ఉన్నాయని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇది ఉబుసుపోనిమాటల కర్మాగారములగు WHATSAPP మరియు FACEBOOK వంటి సాంఘీక మాధ్యమములను కలపకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య భారీగానే ఉంటుంది. వార్తల పట్ల ప్రజలు ఎంత ఆకలితో ఉన్నారో ఇది తెలియజేస్తుంది. ఎక్కువమంది ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారని గమనించండి. ఇది చాలా మందికి ఇష్టమైన ప్రొద్దుగడుచు కార్యకలాపము. 

ఆ వార్తలతో ఏమి చేయవచ్చో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి సంఘటనలు జరిగినవి తెలుసుకోవడమే తప్ప నిజంగా ఆయా సంఘటనలపై ప్రభావం చూపలేరు. అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ గంటగంటకు వార్తలను తెలుసుకోవాలని కోరుకుంటారు.

ఇలాంటి వార్తా వ్యవస్థలు వ్యర్థమని అర్థం చేసుకున్న అన్నమాచార్యులు యెక్కడి సుద్దులునేల అన్నారు. అటువంటి నిలకడలేని విషయాల ఆధారంగా మీరు ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేరు.

అన్నమాచార్యులు కాలంలో వార్తాపత్రికలు లేవని మీకు తెలిసే వుండాలి. కానీ చుట్టుపక్కల ప్రజలను గమంచి, అతడు 500 సంవత్సరాల క్రితమే అలాంటివి మనిషిలో ఉత్సుకతను పెంచి ఇంకా, ఇంకా కావాలనుకునేలా చేసి ఊబిలోకి లాగుతాయని చెప్పిరి. అన్నమాచార్యులు కవిత్వమో, భవిష్యత్తో చెప్ప లేదు. అతను, ధ్యానములో నిమ్మగ్నుడై  తనలోనే ప్రపంచాన్ని అనుభూతి చెందాడు. మీరు ఈ కవితలో మరియు నా మునుపటి సమర్పణలలో ఆ అనుభూతి ప్రభావాన్ని చూస్తున్నారు.

ఈ చరణములో డబ్బులు, వార్తలు మనిషిని అయస్కాంతములా ఆకర్షించి వానిలోనే కోట్టుకొని పోవు సంగతిని వివరించారు.

అన్వయార్ధము: ఓ మానవుడా పొక్కుడు వార్తలలో పాలుపంచుకోకు. ఒక్కసారి కూడా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించకు. అవి నిన్ను తమ లోనికి లాగివేసి, బానిసలుగా మార్చుకుంటాయి. బదులుగా, దైవమును తలచుకో. రక్షించును.

తపసినయ్యేనంటేఁ జిత్తము కైవశము గాదు

చపలసంసారినైతే శాంతి యుండదు

ఉపమలేల శ్రీవేంకటోత్తమ నీసేవ చేసి

కపటము మానితేను కాతువు నన్నును  ॥ఇది॥​

 

tapasinayyEnaMTE jittamu kaivaSamu gAdu

chapalasaMsArinaitE SAMti yuMDadu

upamalEla SrIvEMkaTOttama nIsEva chEsi

kapaTamu mAnitEnu kAtuvu nannunu           idi

 

Word to Word meaning: తపసి (Tapasi) = a hermit, an ascetic; నయ్యేనంటేఁ (nayyEnaMTE) = try to become; జిత్తము (jittamu) = mind; కైవశము (kaivaSamu) = control; గాదు (gAdu) = not; చపల (Chapala) = కదులునది, నిలుకడలేనిది,​​ not steady; not having constancy; సంసారినైతే (saMsArinaitE) = become family man; శాంతి (SAMti) = calmness; యుండదు (yuMDadu) = not there;  ఉపమలేల (upamalEla) = ఉపాయము లేలా, నేర్పు లేలా, why skills? Why tricks? (implied meaning: What is the use of skills or tricks); శ్రీవేంకటోత్తమ (SrIvEMkaTOttama) = O greatest of the Lords; నీ (nI) = your; సేవ (sEva) = service; చేసి (chEsi) = performing; కపటము (kapaTamu) = hypocrisy; మానితేను (mAnitEnu) = if eschewed; కాతువు (kAtuvu) = save; నన్నును (nannunu) = me. 

Literal meaning: If I try to meditate, my mind is not in my control. If I get engaged in family, I have no peace of mind. Why do you need skills: O greatest of the Lords, If I serve you by eschewing hypocrisy, you shall save me. 

Explanation: On many occasions, Annamacharya stated about the difficulty in controlling the mind. When one can control the mind there is no use of penance. If you use penance to control your mind you are chasing a mirage.  The one controlled, unfortunately, slips out of control someday. This we all know very well. Therefore, trying to control the mind is not a solution.

Now consider this stanza explaining the difficult nature of the mind, from the earlier submissions:  paTTa basalEdu chUDa bayalugAdImanasu /neTTana bAruchunuMDu nIrU gAdImanasu / chuTTichuTTi pAyakuMDu juTTamU gAdImanasu/ yeTTaneduTanE vuMDu nETidO yImanasu (పట్టఁ బసలేదు చూడ బయలుగాదీమనసు /నెట్టనఁ బారుచునుండు నీరూఁ గాదీమనసు /చుట్టిచుట్టి పాయకుండుఁ జుట్టమూఁ గాదీమనసు /యెట్టనెదుటనే వుండు నేఁటిదో యీమనసు) (meaning: We can't catch it because it doesn't have a home. It refuses to show itself for examination or introspection. It flows here and there and, in all directions, but it’s not a liquid. It circles your thoughts, but there is no relationship. It's right in front of you. But I have no idea what this mind is.) 

Thus, Annamacharya is not suggesting any control mechanism. He is asking us to find if we have sufficient understanding to ostracise everything else in preference to the truth. 

Therefore, it's not the method, but the ‘intent to be one with God’ which must be the only motive. As we saw in the last submissions, there is no use in the pursuit of virtuous acts as well.  

Can we internally be clear to be deadly honest to reject all hypocrisy within us. This may appear a simple statement of good intention. Please remember the statement “man judges others by their actions and self by intentions”.  Thus, very often even if we find ourselves to be on the wrong side, we are not as hard on ourselves as we are on others. 

Implied meaning: Set aside all immature actions. There are no tricks and no special skills required to reach God. Find and eliminate the insincerity and falsity within you. That is the service to God.  

భావము: తపస్సు చేద్దామంటే చిత్తము కైవశము కాదు. ఇక చపలసంసారినైతే శాంతియే యుండదు. ఉపాయములు, నేర్పు లేలా? శ్రీవేంకటోత్తముడా కపటము మాని నీకు సేవచేసిన రక్షింతువు. 

వివరణము: అన్నమాచార్యులు చాలా సందర్భాలలో మనస్సును అదుపులో ఉంచుకోవడం కష్టమని  చెప్పారు. మనస్సును నియంత్రించగలిగినప్పుడు తపస్సు అవసరం లేదు. మనసును అదుపులో పెట్టుకోవడానికి తపస్సు చేస్తే ఎండమావిని వెంటాడినట్లే. ఇప్పుడు అదుపులో ఉన్నది, తరువాత ఎప్పుడైనా అదుపు తప్పవచ్చు. ఇది మనందరకు విదితమే. అందుచేత మనసును అదుపులో పెట్టుకోవడం అనేది పరిష్కారమే కాదు.

మునుపటి సమర్పణల నుండి మనస్సు యొక్క సంక్లిష్ట స్వభావాన్ని వివరించే ఈ చరణాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందాం. పట్టఁ బసలేదు చూడ బయలుగాదీమనసు” / “నెట్టనఁ బారుచునుండు నీరూఁ గాదీమనసు” / “చుట్టిచుట్టి పాయకుండుఁ జుట్టమూఁ గాదీమనసు” / “యెట్టనెదుటనే వుండు నేఁటిదో యీమనసు” (మనస్సును పట్టుకుందామంటే ఎక్కడ ఉంటుందో తెలియదు. పరీక్షగా చూద్దామంటే బయటపడదు. ఎటుకైనా పరుగిడును (లేదా ఎందైనా దూరును) అయినా అది నీరు కాదు. చుట్లుచుట్లు తిరుగుతుంది కానీ చుట్టము కాదు మనసు. ఎట్టయెదుటనే ఉన్నా ఈ మనసేమో తెలియదే!) 

అందువల్ల, అన్నమాచార్యులు ఎటువంటి నియంత్రణను సూచించడం లేదు. సత్యమునే నమ్ముచూ, అది కాని దానిని చటుక్కున వదిలేసే అంత అవగాహన ఉందో లేదో కనుగొనమని అతను అడుగుతున్నాడు. 

మనము గత సమర్పణలలో చూసినట్లుగా, పుణ్యాల వెనుక పరుగిడడం వల్లనూ ప్రయోజనం లేదు.  "మనస్సును అదుపులో పెట్టుకోవడం" పద్ధతి కానే  కాదు కాబట్టి, కానీ 'దేవునితో ఒకటవ్వాలనే ప్రగాఢ ఉద్దేశ్యం' మాత్రమే మానవునికి గల సాధనము. 

మనలోని అన్ని వంచన, మోసము, కపటములను తిరస్కరించడానికి కనికరము లేని నిజాయితీతో అంతర్గతంగా స్పష్టంగా ఉండగలమా? దయచేసి "మనిషి ఇతరులను వారి చర్యల ద్వారాను మరియు తనను తాను ఉద్దేశాలను బట్టి తీర్పు ఇచ్చుకుంటాడు" అనే వాస్తవాన్ని గుర్తుంచుకోండి. అందువల్ల, చాలా తరచుగా తప్పులున్నప్పటికీ మనపై మనం ఇతరులపై ఉన్నంత కఠినంగా ఉండము. 

అన్వయార్ధము: అన్ని అపరిపక్వ చర్యలను పక్కన పెట్టండి. భగవంతుడిని చేరుకోవడానికి ఎటువంటి ఉపాయాలు మరియు ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు. మీలో ఉన్న వంచన, మోసము, కపటము, బూటకములను కనుగొని తొలగించండి. అదే భగవంతుని సేవ.

 

Recommendations for further reading:

15. కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు (kaMchUM gAdu peMchU gAdu kaDubeluchu manasu)

42. చూడరెవ్వరు దీని సోద్యంబు పరికించి (chUDarevvaru dIni sOdyaMbu parikiMchi)

 

Summary of this Keertana:

 

To me this is intelligence. There's nothing else beyond it. When we approach and submit to you, readily save us. Implied meaning: The only and True intelligence is to bow to God. Nothing else saves man from degradation.

 

If I say I shall walk by learning, I am not independent. My ignorant actions, attract censure. Beyond these two, if I seek your refuge, you take up the responsibility and save me easily. Implied meaning: it’s not the method, it’s not the prayer. It’s about your strong intent to submit that matters. The Almighty is ever willing to lend you helping hand.

 

Even earning money will make you bound for many births. If I get into this cycle of birth and death, I know not when I will be liberated? (Implying I shall not be liberated.) Why get engaged in news and gossip. If I take your name, you shall save me. Implied meaning: O Man! Do not engage in gossip. Do not try even once to earn money. They suck you into their slavery. Instead, immediately take up the name of the lord.

 

If I try to meditate, my mind is not in my control. If I get engaged in family, I have no peace of mind. Why do you need skills: O greatest of the Lords, If I serve you by eschewing hypocrisy, you shall save me. Implied meaning: Set aside all immature actions. There are no tricks and no special skills required to reach the God. Find and eliminate the insincerity and falsity with in you. That is the service to God.  

 

కీర్తన సంగ్రహ భావము:

 

ఇదొక్కటే బుద్ధి. ఇంతకు మించి మరి లేదు. సమీపించి నీ దాసుడిని అంటే కాచెదవు. అన్వయార్ధము: ఏకైక  మరియు నిజమైన  తెలివి దైవమునకు తనను తాను సమర్పించుకోవడమే. మరేదీ మనిషిని అధోకరణం (క్షీణత) నుండి రక్షించదు.

నేర్చుకొని ఆ ప్రకారముగా నడచుకొనుటకు స్వతంత్రుడఁను గాను. ఏమీ తెలియకుండా (ఉన్నవాడిని ఉన్నట్లుగానే) చేద్దామనుకుంటే నిష్ఠూరములే లభించునది. అలాకాకుండా నిన్ను శరణంటే గౌరవించి, నా భారము వహించి కాతువు నన్ను. అన్వయార్ధము: పద్ధతి కాదు, ప్రార్థన కాదు నేర్వవలసినది. ఇక్కడ ముఖ్యమైనది తనను తాను సమర్పించు కోవాలనే బలవత్తరమైన ఉద్దేశం. దైవము సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

ఒకసారి డబ్బు (అర్థము) సంపాదించు కుందామను కొంటే, అందులోనే పడి జన్మాలు గడిపేస్తాను. ఇక మోక్షము ఎక్కడ​? ( లేదు అని అర్ధము). అక్కడి, ఇక్కడి మాటలు ఎందుకు? గ్రక్కున నీ పేరు తలచుకుంటే దయతో గాతువు. అన్వయార్ధము: ఓ మానవుడా పొక్కుడు వార్తలలో పాలుపంచుకోకు. ఒక్కసారి కూడా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించకు. అవి నిన్ను తమ లోనికి లాగివేసి,  బానిసలుగా మార్చుకుంటాయి. బదులుగా, దైవమును తలచుకో. రక్షించును.

 

తపస్సు చేద్దామంటే చిత్తము కైవశము కాదు. ఇక చపలసంసారినైతే శాంతియే యుండదు. ఉపాయములు, నేర్పు లేలా? శ్రీవేంకటోత్తముడా కపటము మాని నీకు సేవచేసిన రక్షింతువు. అన్వయార్ధము: అన్ని అపరిపక్వ చర్యలను పక్కన పెట్టండి. భగవంతుడిని చేరుకోవడానికి ఎటువంటి ఉపాయాలు మరియు ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు. మీలో ఉన్న వంచన, మోసము, కపటము, బూటకములను కనుగొని తొలగించండి. అదే భగవంతుని సేవ.

 

 

 

Copper Leaf: 139-6  Volume 2-171

201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు. (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu)

  ANNAMACHARYULU 201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu) Introduction : A nnamacharya is t...