Friday 27 October 2023

T-186 అలరఁ జంచలమైన ఆత్మలందుండ

 అన్నమాచార్యులు

186 అలరఁ జంచలమైన ఆత్మలందుండ

For English Version Press Here

క్లుప్తముగా: మార్పును మనస్ఫూర్తిగా అంగికరింపలేక బాధలు పడతాము.- షున్రియు సుజుకి

 

కీర్తన సారాంశం:

పల్లవి: చంచలస్వభావము కలిగిన జీవాత్మలకు ఈ ఉయ్యాలవలె అటునిటు (జీవన్మరణములలో) వూగుట అలవాటైనది. అనేక మార్లు ప్రాణములనిచ్చు ఉఛ్ఛ్వాస పవనములలో నీభావము (దైవము) దాగివుంది.

చరణం 1: ఓక వైపు వుదయము (పుట్టుట​), ఇంకో వైపు అస్తమయము (మరణించుట​) అనే స్తంబములు మేరలు గాను నేల నుండి నక్షత్రమండలము వరకు మితిమీఱుచున్న దిఙ్మండలములలో శాఖలువాఱుతున్నదీ ఉద్యమము. ఆ ఉయ్యాలకు ఎంతో అనువుగా, జాగ్రత్తగా అల్లి వుంచిన నాలుగు వేదములను బంగారు గొలుసులు నిలుపలేవేమో అనిపించుచున్నది. (సత్యమును ఎంత విద్వత్తు కూడా పట్టి వుంచలేదని భావము). తనంతటతాను నిలబడగలుగు ఆ ధర్మదేవత పీఠము వర్ణింపనలవికానిది.

చరణం 2:  మేఘమండలము మేలు కట్లుగా (అంబరముగా) ఈ ఉయ్యాల మెరుగుకు మెరుగై మేలయినది. (ధగధగా మెరిసిపోతుంటే చూడలేకున్నాము). నల్లని కొండలవంటి నీ మేని కాంతికిది నిజమైన కవచము లేదా తొడుగు వంటిదాయె. స్వామిని చూచుటకు వీలు కాదు అన్న అర్ధములో వాడారు. (ఇక్కడ నుంచి భూలోక విషయములు). ఇక స్తనములు లయబద్ధముగా కదులుచుండగా, పైటకొంగులు రాచుకొనుచుండగా స్త్రీలు  నీలో దాగి వున్న జగముల క్రమక్రమంగా ప్రక్కకు ఒరగిపోకుండా నెమ్మదిగా అనునయముగా ఊపే ఉయ్యాల ఇది.

చరణం 3: ఈ ఉయ్యాలలో నున్న శ్రీదేవులకు భూదేవి ప్రతి ఊయల కదలికకు నిన్ను కౌగిలించుకొను భాగ్యము కలుగుతున్నది కదా!  స్వామీ! ఈ  దేవతా స్త్రీలకు ఈ ఉయ్యాలలోనే అప్పటికప్పుడే నీ హావభావ విలాసములు తెలుస్తాయి! దివ్యకాంతులకు నీ హావభావ విలాసమంతా మందంగా సాగే ఈ ఊయలలో ఘనంగా కనువిందు చేస్తోంది. ఇటువంటి నీ ఉయ్యాల సేవావైభవం బ్రహ్మాది దేవతలకు కన్నుల పండువగా, మా బోటి సామాన్యులకు ఊహాతీతంగా సాగుతోంది. కానీ ఓ తిరువేంకట విభుడవైన వెంకటపతీ! నీకు మాత్రం ఇదంతా చాలా వేడుకగా ఉన్నది సుమా! 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: ఈ పదము అన్నమయ్య గారి భావుకతకు నిదర్శనము. వారు తన మనసులో మెలుగు భావములను అలవోకగా కీర్తనలలోకి మార్చివేసినట్లు అనిపిస్తుంది. కానీ దాని వెనుక  కఠోరమైన శ్రమ దాగి వున్నదని గుర్తించము. 

అన్నమాచార్యులు ప్రపంచము​ ఊయలలా ఊగడము అనగా ఒక కొస నుండి మరొక కొసకు, ఒక స్థితి నుండి దానికి వ్యతిరేకమగు స్థితికి, ఒక భావము నుండి అభావమునకు కదలుటను ప్రకృతి సహజ నియమము అన్నారు.   ప్రపంచము నందలి జీవులును అటులే ఆయా స్థాయిలను అనుభవింతురని అన్నారనుకోవచ్చును. 

భగవంతుణ్ణి వూయలలో వుగించకపొతే లోకము ఒక ప్రక్కకు ఒరిగి పోవునని భామినులు తీరికలేకుండా వూచుచున్నారనె భావములో వ్రాసినారు. దీనిని ఒకరకముగ ప్రపంచము క్రొంగొత్త విషయములులేక పాత దానితో పులిసిపోవుననే భావముతో పొల్చవచ్చు. ఈ జీవితము నిలువవుంచు పదార్ధముగాదని, జీవనమొక ఎడతెరిపిలేని ప్రవాహమని సూచించిరి. 

ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు అనంతమగు సత్యముతో మమేకమై ఒకేపర్యాయములో  బ్రహ్మాండములన్నీ సృష్టి స్థితి లయ కార్యక్రమములలో లయబద్ధముగా మునిగియుండు అత్యద్భుత దృశ్యమును ప్రత్యక్షముగా దర్శించిరని వూహించవచ్చును. 

పదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాలఅని ఎంత ప్రయత్నించిననూ సత్యమును భాషలోను, భావములోను యిమిడ్చి పట్టలేమని సూచించిరి. ఆ ధర్మదేవత పీఠము తనంతటతాను నిలబడగలుగునది అనిరి.  

 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  11-1 సంపుటము: 1-67

అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీయలవాటు సేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాసపవనమందుండ నీ-భావంబు దెలిపె నీవుయ్యాల        పల్లవి॥
 
ఉదయాస్తశైలంబు లొనరఁ గంభములైన వుడుమండలము మోఁచె నుయ్యాల
అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబు నిండె నీవుయ్యాల
పదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయ నుయ్యాల  ॥అలర॥
 
మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీలశైలమువంటి నీమేనికాంతికిని నిజమైన తొడవాయె నుయ్యాల
పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల ॥అలర॥
 
కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ముఁ గౌఁగిలింపఁగఁ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావభావ విలాసమందంద చూపె నీవుయ్యాల
కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల
కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె నుయ్యాల     ॥అలర॥ 

 

Details and explanations: 

అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీయలవాటు సేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాసపవనమందుండ నీ-భావంబు దెలిపె నీవుయ్యాల పల్లవి॥

ముఖ్య పదములకు అర్ధములు: వుయ్యాల = అటునిటు వూగు.
 

భావము: చంచలస్వభావము కలిగిన జీవాత్మలకు ఈ ఉయ్యాలవలె అటునిటు (జీవన్మరణములలో) వూగుట అలవాటైనది. అనేక మార్లు ప్రాణములనిచ్చు ఉఛ్ఛ్వాస పవనములలో నీభావము (దైవము) దాగివుంది.

వివరణము: మొదటి పంక్తిలో ఉయ్యాలవలె అటునిటు (జీవన్మరణములలో) వూగుట అనగా మానవుడు తాను వున్న స్థితిని ముఖ్యముగా క్షణభంగురమగు భావనలను అలోచనలను ఎప్పటికీ వుండి పోవాలని భావించుచూ దానినే కొనసాగించవలెనని చూచుటను అసహజ భావమని తెలియమనిరి.

రెండవ పంక్తిలో పలుమార్లు ప్రాణములనిచ్చు ఉఛ్ఛ్వాస పవనములలో దైవము దాగివుంది అని; మన ఇప్పటి ఆధారములేని భావనలను వదలి నిరంతరము మారుచున్న అలౌకికమగు దానిని తెలియమనిరి. ఉఛ్ఛ్వాసనిశ్వాసములను నిలుపుట (కాపాడుకొనుట) యందలి ఆసక్తిని వదలి చూడమనిరి.

మొదటి చరణములో కూడా ఈ సమస్త దిశలలోనూ వ్యాపించియున్న దృశ్య ప్రపంచము ఇటువంటి నాశమగు పదార్థములతోనే చేయబడి వున్నదని, అందుచేత​ క్షరము నందుండి అక్షరమును కానలేమనిరి. కావున వీనితో ఎటువంటి సంబంధములేని దానిని కనుగొనమనిరి.

ఉదయాస్తశైలంబు లొనరఁ గంభములైన వుడుమండలము మోఁచె నుయ్యాల
అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబు నిండె నీవుయ్యాల
పదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయ నుయ్యాల        ॥అలర॥


ముఖ్య పదములకు అర్ధములు: వుడుమండలము = నక్షత్రమండలము; అదన = భుజించుట, భక్షించుట; అదన నాకాశపదము = కనబడుచున్న మేర వరకు ఆక్రమించుకొని వున్న (చూపుల వేగముతో కనుచూపుల వరకు విస్తరించుకొని వున్న​)

భావము: లెక్కకు మిక్కిలి నిడివిగల ఆకాశము దూలముగా, ఓక వైపు వుదయము (వెలుగు, పుట్టుట, జ్ఞానము), ఇంకో వైపు అస్తమయము (మరణించుట, చీకటి, అజ్ఞానము) అనే స్తంబములు మేరలు గాను నేల నుండి నక్షత్రమండలము వరకు మితిమీఱుచున్న దిఙ్మండలములలో శాఖలువాఱుతున్నదీ ఉద్యమము. ఆ ఉయ్యాలకు ఎంతో అనువుగా, జాగ్రత్తగా అల్లి వుంచిన నాలుగు వేదములను బంగారు గొలుసులు నిలుపలేవేమో అనిపించుచున్నది. (సత్యమును ఎంత విద్వత్తు కూడా పట్టి వుంచలేదని భావము). తనంతటతాను నిలబడగలుగు ఆ ధర్మదేవత పీఠము వర్ణింపనలవికానిది.

వివరణము: అన్నమయ్య గారు వివరించిన  ఆ ఊయల నిరంతరము ఒక దశ నుండి మరోదానికి మారుతున్న మానవుని అంతరంగము వంటిదే. దానికి గల హద్దులను వూహించ గలమేమో గానీ వీక్షించలేము. కావున వారు కాంచినది అనన్య సామాన్యమగు దృశ్యము.

పదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాల”/ “వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయ నుయ్యాల”తొ ఆ వుయ్యాల బల్లను ధర్మ పీఠముగా భావించితే ఆ పీఠమును ఎంతో అనువుగా, జాగ్రత్తగా అల్లి వుంచిన నాలుగు వేదములను బంగారు గొలుసులు నిలుపలేవేమో అను అనుమానమును వ్యక్తము చేసిరి.

ఈ మాట  అన్నమయ్య గారు ఎందుకన్నారో విచారింతము. క్రింది రెనె మాగ్రిట్ వేసిన సుప్రసిద్ధ చిత్రమును చూడామని ప్రార్థన​. ఇక్కడ ఫ్రెంచి భాషలో వ్రాసినదానికి 'ఇది పైపు కాదు' అని అర్ధము. “The Treachery of Images” అను పేరుగల ఈ చిత్రము ఎంతో అందముగాను, ఎంత స్పష్టముగానూ బొమ్మ గీసినా అది నిజమగు వస్తువు కాజాలదని చెబుతుంది.


రెనె మాగ్రిట్ గారు ఈ చిత్రమును చూపెడుతూ, "నేనెంత ప్రయత్నించినా ఈ పైపులో పొగాకు పొడి నింపి పీల్చలేను కదా?" అని వ్యాఖ్యానించారు. అలాగుననే దైవమును గూర్చి వ్రాసిన కవిత్వమంతా వర్ణనే కానీ దైవము కానేరదు. మనము దైవముయొక్క రూపమును వూహించి హృదయములో పదిలముగా భద్రపరచు కొందము. క్షణక్షణమునకూ మార్పు చెందుతున్న సత్యమును ఆ మదిలోని పటముతో సరిపోల్చుట అవివేకము. కావున మానవులు  వర్ణనలను వదలి నిజమగు ప్రత్యక్ష దైవమును చూడమనిరి.

అన్నమాచార్యులు మన తృప్తి కోసము కీర్తనలను వ్రాయలేదు. వారు ప్రజలను తట్టిలేపుటకు విశ్వప్రయత్నము చేసిరి.

మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీలశైలమువంటి నీమేనికాంతికిని నిజమైన తొడవాయె నుయ్యాల
పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల ॥అలర॥
 

ముఖ్య పదములకు అర్ధములు:   మేలుకట్లయి = forming a canopy, అంబరములై; తొడవాయె = కవచము, గవిసెన, తొడుగు వంటిదాయె; ఓలి = వరుస, క్రమం; ఒయ్యన =  మెల్లన;

భావము: మేఘమండలము మేలు కట్లుగా (అంబరముగా) ఈ ఉయ్యాల మెరుగుకు మెరుగై మేలయినది. (ధగధగా మెరిసిపోతుంటే చూడలేకున్నాము). నల్లని కొండలవంటి నీ మేని కాంతికిది నిజమైన కవచము లేదా తొడుగు వంటిదాయె. స్వామిని చూచుటకు వీలు కాదు అన్న అర్ధములో వాడారు. (ఇక్కడ నుంచి భూలోక విషయములు) ఇక స్తనములు లయబద్ధముగా కదులుచుండగా, పైటకొంగులు రాచుకొనుచుండగా స్త్రీలు నీలో దాగి వున్న జగములు క్రమక్రమంగా ప్రక్కకు ఒరగిపోకుండా నెమ్మదిగా అనునయముగా ఊపే ఉయ్యాల ఇది.

వివరణము: "స్త్రీప్రాయమితరంజగత్ = భగవంతుడొక్కడే స్వతంత్రత కలిగిన పురుషుడు తక్కిన వారందరు భగవంతునకు పరతంత్రులు కనుక స్త్రీలే" అని శాస్త్ర నిర్ణయము. దీనిపై ఆధారపడి వ్రాసినవే అన్నమార్యుల శృంగార కీర్తనలు. జనులంతా ఆ ఉయ్యాల నూపుచున్నరు అని అర్ధము.

ఇక్కడ “పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల”తో స్వామి మానవులకు కామము ఒక విధి క్రింద (జీవమును కొనసాగించుటకు) ఏర్పాటు చేసినారనుకోవచ్చును. కానీ ఆ పదములు రేకెక్తించు భావములలొ మనము తగులుకొందమని భావము.  కావున జరుగుతున్న జన్నాటకమును వీక్షించుటకు బదులు మనసు చూపు కామపు అలోచనలలో చిక్కుకుందుము అన్నారు. 

వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాలమానవులు ఏదో ఒక భీతి ఉసిగొల్పగా పనులు చేయుదురన్నభావమును సూచించారు. కానీ మనమెవరమండి బ్రహ్మాండములు వొరగ కుండా చెయ్యడానికి? మన సామర్థ్యమెంత​? ఐతే అటుల చేయుట ఎంతైననూ ఆవశ్యక మనిపించును.  ఇది మనిషి తీసుకొను అయుక్తమైన చర్య. ఈ కాలములో అమెరికా (USA) వుల్కలు భూమిని తాకకుండా తీసుకొంటున్న చర్యలు ఇటువంటివే. 

కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ముఁ గౌఁగిలింపఁగఁ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావభావ విలాసమందంద చూపె నీవుయ్యాల
కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల
కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె నుయ్యాల            ॥అలర॥
 

ముఖ్య పదములకు అర్ధములు:   కమలకును = శ్రీదేవికి; భూసతికి = భూదేవికి; అందంద = అప్పటికప్పుడే

భావము: ఈ ఉయ్యాలలో నున్న శ్రీదేవి భూదేవులకు లకు ప్రతి ఊయల కదలికకు నిన్ను కౌగిలించుకొను భాగ్యము కలుగుతున్నది కదా!  స్వామీ! ఈ  దేవతా స్త్రీలకు ఈ ఉయ్యాలలోనే అప్పటికప్పుడే నీ హావభావ విలాసములు తెలుస్తాయి! దివ్యకాంతులకు నీ హావభావ విలాసమంతా మందంగా సాగే ఈ ఊయలలో ఘనంగా కనువిందు చేస్తోంది. ఇటువంటి నీ ఉయ్యాల సేవావైభవం బ్రహ్మాది దేవతలకు కన్నుల పండువగా, మా బోటి సామాన్యులకు ఊహాతీతంగా సాగుతోంది. కానీ ఓ తిరువేంకట విభుడవైన వెంకటపతీ! నీకు మాత్రం ఇదంతా చాలా వేడుకగా ఉన్నది సుమా!

 

Tuesday 17 October 2023

185 vananidhi gurisina vAnalivi (వననిధిఁ గురిసిన వానలివి)

 ANNAMACHARYULU

185 వననిధిఁ గురిసిన వానలివి

(vananidhi gurisina vAnalivi)

for Telegu (తెలుగు) Version press here

 

Synopsis: “We are all prisoners of our thoughts” Sam Harris

Summary of this Poem:

Chorus: "As rain   on the sea bears no fruit for the field, so doth humankind waste their lives in fruitless toil, weighed down by burdens of naught." 

Stanza 1: Our lives are frittered away in sorrow and slander just like the moonshine on a desolate forest. We often overlook Lord Hari, who has gifted us with this physical existence, and instead beseech others and circle around illusionary relationships. 

Stanza 2: We merely get attracted by greener grass on the other side. The love and other bonds attract us like those greener pastures only to sink us in anxieties, sorrows and depressions. We set aside the company of God and fall head over heels to everything else. Like rolling stone we bounce from one hardship to another and get dissipated. 

Stanza 3: We tend to evaluate the mysterious, concealed realm through the lens of wealth and grandeur. Unbeknownst to us, our current life is an unceasing effort dissipating without purpose. In contrast, the protection granted by Lord Venkateswara remains enduring and unwavering.

 

Detailed Presentation

 

Introduction: Each one of us endeavours to establish his place within society and family. However, we are inherently a part of society without needing to prove it separately. Annamacharya referred to such efforts as futile and unwise tasks.

 

శృంగార కీర్తన:

రాగిరేకు:  4-4 సంపుటము: 1-24

ROMANTIC POEM

Copper Leaf:  4-4  Volume: 1-24

వననిధిఁ గురిసిన వానలివి మతి-
పనిలేని పనుల భారములు ॥వననిధి॥
 
అడవుల వెన్నెల లారిడిబదుకులు
తడతాఁకుల పరితాపములు
వొడలొసఁగిన హరి నొల్లక యితరుల
బడిబడిఁ దిరిగిన బంధములు        ॥వననిధి॥ 

కొండల నునుపులు కొనకొన మమతలు
అండలఁ కేగిన నదవదలు
పండిన పంటలు పరమాత్ము విడిచి
బండయి తిరిగిన బడలికలు           ॥వననిధి॥ 

బచ్చన రూపులు పచ్చల కొలపులు
నిచ్చల నిచ్చల నెయ్యములు
రచ్చల వేంకటరమణునిఁ గొలువక
చచ్చియుఁ జావని జన్మములు        ॥వననిధి॥ 

 

vananidhi gurisina vAnalivi mati-
panilEni panula bhAramulu         vananidhi
 
aDavula vennela lAriDibadukulu
taDatAkula paritApamulu
voDalosagina hari nollaka yitarula
baDibaDi dirigina baMdhamulu   vananidhi
 
koMDala nunupulu konakona mamatalu
aMDala kEgina nadavadalu
paMDina paMTalu paramAtmu viDichi
baMDayi tirigina baDalikalu        vananidhi
 
bachchana rUpulu pachchala kolapulu
nichchala nichchala neyyamulu
rachchala vEMkaTaramaNuni@M goluvaka
chachchiyu jAvani janmamulu     vananidhi

 

Details and Explanations: 

వననిధిఁ గురిసిన వానలివి మతి-
పనిలేని పనుల భారములు          ॥వననిధి॥

vananidhi gurisina vAnalivi mati-
panilEni panula bhAramulu        vananidhi 

Word to word meaning: వననిధిఁ (vananidhi) = sea; గురిసిన (gurisina)= showered, వానలివి (vAnalivi) = these rains are; మతి పనిలేని పనుల (matipanilEni panula) = we are endowed with thoughtless deeds, we engage in senseless actions; భారములు (bhAramulu) = we carry the weight of such deeds (we suffer).  

Literal meaning: "As rain on the sea bears no fruit for the field, so doth humankind waste their lives in fruitless toil, weighed down by burdens of naught."

వివరణము: We, humans often hold numerous ideals, envisioning themselves walking unique paths that few have ventured upon. They guard these values and aspirations meticulously until the reality of life draws near. However, once ensnared in the whirlwind of existence, they may sacrifice those ideals on the pretext of practicality. Over time, they gradually loosen their principles until they reach their lowest point.

For example, in the story of The Animal Farm, the one of the principles is "No Animal Should Kill Another". Eventually they change it to “No Animal Should Kill Another Without Reason”.

Thus, we may find that most of the ideals are impracticable. Therefore, man finds corruption of those ideals as a necessity to live according to his whims. Nonetheless, since humans are inherently social beings, they frequently struggle to maintain their moral integrity.

Let's delve deeper into the concept of this internal conflict through René Magritte's painting "Les Enfants Trouvés" (The Foundlings). Within the artwork, a jungle-like backdrop sets the stage, where three men are portrayed as integral parts of tree trunks. They seem to be engrossed in a profound conversation, yet they maintain considerable distance from each other.



Like the trees seen in this figure, human beings get stuck in their own feelings, unable to give up their arguments, stubbornly adhere to one ideology and remain separate like those trees. That is, they can see each other but know that they are emotionally distant from each other.

Just like the people in the painting, we humans often hold onto our own feelings and ideas, making it hard to change our minds. It's as if we're like those tree trunks, staying put where we are. We stick to our own way of thinking, keeping our distance from others, even when we understand each other's words and feelings. So, just like the people in the picture, we can be near each other but still feel far apart.

This occurs not just among lovers, spouses, and parents and children, but also in many other relationships. We can clearly see this reality when we examine our own life experiences and read about it in newspapers. While we may act and feel united for a while, the genuine nature of our relationships often becomes evident over time. When we reach such stage, to act (a relationship) also becomes a burden.

Hence, all our endeavours as we journey through life often yield analogous outcomes, resulting in a sense of dissatisfaction. When Annamacharya expresses, "వననిధిఁ గురిసిన వానలివి" (vananidhi gurisina vAnalivi = the rain in the forest bears no fruit for the field), it is a profoundly accurate reflection. We carry burdens on our minds that become increasingly unbearable, causing life to lose its lustre and appeal.

 

అడవుల వెన్నెల లారిడిబదుకులు
తడతాఁకుల పరితాపములు
వొడలొసఁగిన హరి నొల్లక యితరుల
బడిబడిఁ దిరిగిన బంధములు     ॥వననిధి॥
 
aDavula vennela lAriDibadukulu
taDatAkula paritApamulu
voDalosagina hari nollaka yitarula
baDibaDi dirigina baMdhamulu vananidhi

Word to word meaning: అడవుల (aDavula) = wooded areas; వెన్నెల (vennela) = full-moon shine; లారిడిబదుకులు (lAriDibadukulu) = life filled with sorrow and slander;  తడతాఁకుల (taDatAkula) = too many hardships; పరితాపములు (paritApamulu) = grief, affliction; వొడలొసఁగిన (voDalosagina) = who gave your present body/shape; హరి నొల్లక (hari nollaka) = negating the Lord Hari; యితరుల (yitarula) = others; బడిబడిఁ (baDibaDi) = to importune;  దిరిగిన (dirigina) = to move about; బంధములు (baMdhamulu) = the bondage;       

 

Literal meaning: Our lives are frittered away in sorrow and slander just like the moonshine on a desolate forest. We often overlook Lord Hari, who has gifted us with this physical existence, and instead beseech others and circle around illusionary relationships.

 

Explanation: Let's go back to René Magritte's painting. All the people in the picture are connected by the common ground. From the picture we understand the characters are communicating without establishing a relationship with the base. 

We as humans start acting without understanding our roots is the essence of this stanza. It is a well-known fact that one cannot establish his own purity solely through effort. Even the great figures like Jesus Christ and Lord Krishna encountered the same struggle. So, how can we expect any different for ourselves? Thus, we should avoid these. 

Let us recall the words of Jiddu Krishnamurti: As long as there is a division between the "observer" and the "observed" there is conflict. The division, spatial and verbal that comes into the mind with the imagery, the knowledge, the memory of last year's autumnal colours, creates the "observer" and the division from the observed is conflict. Thus, the root cause of our troubles is that we see the world different from ourselves. 

Thus, all our present actions lead to conflict and conflagration. Then, what one is expected to do? When, we connect with that common ground, the universal consciousness, there is no need for discussions. Still there will be communion. This is also the meaning of योग: कर्मसु कौशलम् (yogaḥ karmasu kauśhalam Bhagavad Gita 2-50) = art of working skilfully in this world full of problems. 

కొండల నునుపులు కొనకొన మమతలు
అండలఁ కేగిన నదవదలు
పండిన పంటలు పరమాత్ము విడిచి
బండయి తిరిగిన బడలికలు        ॥వననిధి॥

koMDala nunupulu konakona mamatalu
aMDala kEgina nadavadalu
paMDina paMTalu paramAtmu viDichi
baMDayi tirigina baDalikalu        vananidhi

Word to word meaning:      కొండల నునుపులు (koMDala nunupulu) = Hills always look rounder = "The grass is always greener on the other side," meaning that things you don't have, etc. always seem more desirable than what you do have. It also suggests that if you do get to where the grass is greener, it may not be as great as what you imagined it to be; కొనకొన (konakona) = every nook and corner; మమతలు (mamatalu) = bondages of love; అండలఁ కేగిన (aMDala kEgina) = when we go near; నదవదలు (nadavadalu) = Anxieties, sorrows, depressions; పండిన పంటలు (paMDina paMTalu) = the crop born fruit; పరమాత్ము విడిచి (paramAtmu viDichi) = setting aside the God and move elsewhere;  బండయి (baMDayi) = like a hard stone; తిరిగిన బడలికలు (tirigina      baDalikalu) = keeps rolling causing ennui and fatigue. 

Literal meaning: We merely get attracted by greener grass on the other side. The love and other bonds attract us like those greener pastures only to sink us in anxieties, sorrows and depressions. We set aside the company of God and fall head over heels to everything else. Like rolling stone we bounce from one hardship to another and get dissipated. 

Explanation: Annamacharya is clear that anything we do is a deviation from the path of truth, therefore wants us to act radically on our understanding of this world. 

బచ్చన రూపులు పచ్చల కొలపులు
నిచ్చల నిచ్చల నెయ్యములు
రచ్చల వేంకటరమణునిఁ గొలువక
చచ్చియుఁ జావని జన్మములు    ॥వననిధి॥ 

bachchana rUpulu pachchala kolapulu
nichchala nichchala neyyamulu
rachchala vEMkaTaramaNuni goluvaka
chachchiyu jAvani janmamulu   vananidhi

Word to word meaning: బచ్చన రూపులు (bachchana rUpulu) = the true shape hidden (= true nature is hidden); పచ్చల కొలపులు (pachchala kolapulu) = we adore yellow metal (=we are after the wealth); నిచ్చల నిచ్చల నెయ్యములు (nichchala nichchala neyyamulu) = be cock sure of great association; రచ్చల (rachchala = inferior for Raksha = protection) = providing protection; వేంకటరమణునిఁ (vEMkaTaramaNuni) = Lord Venkateswara; గొలువక (goluvaka) = not worshipping; చచ్చియుఁ జావని (chachchiyu jAvani)) = dead, but not  dead completely (= live but not live completely, a wasted effort); జన్మములు (janmamulu) = these lives.   

Literal meaning: We tend to evaluate the mysterious, concealed realm through the lens of wealth and grandeur. Unbeknownst to us, our current life is an unceasing effort dissipating without purpose. In contrast, the protection granted by Lord Venkateswara remains enduring and unwavering.

Explanation: Man lacks a means to access the truth concealed beyond the observable world. Clearly, amassing wealth won't bring him closer to it. The sole action he can undertake is to cast aside all uncertainties and embrace the divine Lord's name. 

"చచ్చియుఁ జావని జన్మములు" (chachchiyu jAvani janmamulu) evokes the spirit of Hebrews 13:3 in the Bible: "Continue to remember those in prison as if you were together with them in prison, and those who are mistreated as if you yourselves were suffering." When a person can truly embody this approach, they will cease to seek solutions, for they will have achieved a sense of unity with the world.

-x-x-x-

201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు. (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu)

  ANNAMACHARYULU 201. ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు (AtaMDE brahmaNyadaiva mAdimUlamainavADu) Introduction : A nnamacharya is t...