Tuesday, 11 May 2021

48 అప్పుడు చూచేదివో అధికుల నధముల (appuDu chUchEdivO adhikula nadhamula)

 ANNAMACHARYA

48 అప్పుడు చూచేదివో అధికుల నధముల 

Introduction: in this beautiful and seemingly simple verse, he is asking mind to be cautious of all its actions so that it does not slip in to villainy.

There are certain limits we set for ourselves to behave well in the society. As long as others remain within those limits, we behave well. Once those set limits are crossed, instantly intolerance zone starts. Thus most of our behaviour is driven externally. Extending this further, each one of us are a set of reactions to external stimulations.  What Annamacharya is hinting in this verse is that as long as we are working with reactions, there is no possibility for compassion, love and communion. Only on submission of will to God with unwavering mind, there is possibility for liberation. In this verse he is asking us to be aware that we cross those limits often. 

ఉపోద్ఘాతము:  అందమైన, విన సొంపైన కీర్తనలో కాకి, కోకిల ఒకే తీరుననుండును. కాని వసంతకాలమురాగా వాటి భేదము స్పష్టమగు నట్లే'. జ్ఞానులకు అజ్ఞానులకు కల భేదం సందర్భము వచ్చినపుడే తెలుస్తుంది. ఇది హెచ్చరికగా తీసుకుని తగునట్టుగా ప్రవర్తించ మన్నారు.

ప్రతీ మనిషి కొన్ని హద్దులు ఏర్పరచుకొని సమాజములో  జీవిస్తాడు. ఇతరులు ఆయా హద్దుల్లో ఉంటే బాగా ప్రవర్తిస్తాము. లేకపోతే అసహనానికో లేక ఓర్వలేనితనానికో గురియగుదుము. అనగా మన ప్రవర్తన ఎదుటివారి బట్టీ ఉంటుందనవచ్చు. దీన్ని కొంచెము పొడిగిస్తే  మనిషి ఇటువంటి అనేక ప్రతిస్పందనల​/ప్రతిక్రియల/ ప్రతిచర్యల సమాహారమనుకోవచ్చు. ఇక్కడ అన్నమయ్య ప్రతిస్పందనలలోనే మనము తచ్చాడుతుంటే అన్యోన్య సంబంధములు, ఐకమత్యము మరియు ప్రేమ సంభవించవని అన్నారు. మనిషి సంపూర్ణఅత్మార్పణము చేయక స్వేఛ్ఛకు తావు లేదని   పరొక్షముగా చెప్పారు అన్నారు. 

అప్పుడు చూచేదివో అధికుల నధముల

తప్పక యెచ్చరి యిదే తలఁచవో మనసా      ॥పల్లవి॥
 

appuDu chUchEdivO adhikula nadhamula

tappaka yechchari yidE talachavO manasA pallavi 

Word to Word Meaning:  అప్పుడు (appuDu) = ఘటన జరుగు సమయాన​, At that instance;  చూచేదివో (chUchEdivO) = నీ కళ్ళ ముందే జరుగును, you shall witness; అధికుల (adhikula) = గొప్పవాఁడు, greatman; నధముల (nadhamula) = నీచుఁడు, దుష్టుఁడు, ఆతతాయి, wretch, villain;   తప్పక (tappaka)  = certainly; యెచ్చరి (yechchari) = హెచ్చరిక, warning;  యిదే (yidE) this very thing;  తలఁచవో (talachavO) = consider; మనసా (manasA) = O Mind!!

Literal Meaning and Explanation: O Mind this is a warning. At the time of actual occurrence, you shall know, with no uncertainty, what a noble action is and what is not. 

Here Annamayya is talking of an instance not in distant future, but now and here. In fact in every instance, you can find your own state (noble or villain). That’s why he is asking his mind be aware of his own actions so that it does not err.

Just imagine all the infamous dictators in the world. All of them came to power promising better things. They sincerely would have. But continual sycophancy by their immediate subordinates plunged them into a feeling of complacency and finally degraded them to a league of ordinary dictators. Thus one cannot possibly listen to others to correct himself. That is why the need for self-correction.

 

భావము & వివరణము : మనసా! లోకములో ఆధీకు లెవరో, ఆధము లెవరో సందర్భము వచ్చినప్పుడే గ్రహింపదగును సుమా! ఇదే వీకు హెచ్చరిక! దీనిని చక్కగా భావించుకొమము.

అన్నమయ్య యెప్పుడో జరగబోయే సంఘటనల గురించి మాట్లాడుటలేదు. ఇప్పుడే, యిక్కడే, అనుక్షణము జరుగు సాధారణ ఘటనలే అసలు మనిషిని బయటకు తీస్తాయి అంటున్నారు. ప్రతీక్షణము విలువైనదే అలాగే ప్రతీ ఘటనా కూడా. నిన్ను నీవు ఆయా సందర్భాలలో హెచ్చరికగా గమనించు కుంటే నీవేమిటో నీకే తెలిసిపోతుదని భావము. 

చిన్న పదాలలో పెద్ద అర్ధాలు చొప్పించడం అన్నమయ్య ప్రత్యేకత​. ఇప్పుడు భాగవతములోని చిన్ని పద్యాన్ని మననము చేసుకుందాము. ప్రహ్లాదుడు హిరణ్యకశిపునకు చెప్పిన సమాధానం.

తే. వైరు లెవ్వరు చిత్తంబు వైరి గాఁక?

చిత్తమును నీకు వశముగాఁ జేయవయ్య!
మదయుతాసురభావంబు మానవయ్య!
యయ్య! నీ మ్రోల మేలాడరయ్య! జనులు (7-266.1 భాగవతము) 

భావము : అయ్యా! తండ్రీ! మనస్సుకు సమదృష్టి అలవరచుకో. ధర్మమార్గం తప్పిన మనస్సు కంటె పరమ శత్రువు మరొకరు లేరు. మనస్సును విరోధం చేసుకొనక వశం చేసుకో అంతేకాని నువ్వే చిత్తానికిచిత్తం, చిత్తంఅంటూ దాస్యం చేయకూడదు. మదోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి నీ అనుచరులెవరూ నీ ఎదుట హితం చెప్పటంలేదు. అందరూ నీ మనస్సుకు నచ్చేవే చెప్తున్నారు తప్ప హితమైనది చెప్పటంలేదు.

అనుక్షణము  హెచ్చరికగా యెందుకు ఉండమన్నారంటే,  ప్రహ్లాదుడు ఇచ్చిన సమాధానములో నీ మ్రోల మేలాడరయ్య! జనులు { జనులు నీ ముందర (నీకు భయపడి) హితవు చెప్పరు} అంటాడు. పరిశీలించి చూస్తే, మాట మనందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి, ఇతరుల అభిప్రాయాలు కాకుండా నీకు నీవుగా తెలుసుకోమటున్నారు అన్నమయ్య​,

 

కొండలవంటి పనులు కోరి ముంచుకుంటే నూర-

కుండి కైకొననివాఁడే యోగీంద్రుఁడు
నిండిన కోపములకు నెపముల గలిగితే
దండితోఁ గలఁగని యాతఁడే ధీరుఁడు  ॥అప్పు॥ 

koMDalavaMTi panulu kOri muMchukuMTE nUra-

kuMDi kaikonanivADE yOgIMdruDu
niMDina kOpamulaku nepamula galigitE
daMDitO galagani yAtaDE dhIruDu     appu

Word to Word Meaning:  కొండలవంటి (koMDalavaMTi)  mountains like; పనులు (panulu) = work; కోరి (kOri) = wantingly; ముంచుకుంటే (muMchukuMTE) = పైకొంటే , taken up; నూర-కుండి (nUra-kuMDi) = no reaction;   కైకొననివాఁడే (kaikonanivADE) = not acting thus; యోగీంద్రుఁడు (yOgIMdruDu ) = best among  yogis;  నిండిన (niMDina) = full, multiple;  కోపములకు (kOpamulaku) = anger;  నెపముల (nepamula) = casues; గలిగితే (galigitE) = created; దండితోఁ (daMDitO) = నిబ్బరముతో, ధైర్యముగ స్తిమితముగ నుండు, calm and composed; గలఁగని (galagani) = does not move, do not get agitated; యాతఁడే (yAtaDE) = that person; ధీరుఁడు (dhIruDu) = Brave.

Literal Meaning and Explanation: a wise person will not get bewildered by mountains of works that are landing on his lap time after time. He will only notice them but not get subjected to pressure. The brave man will remain unperturbed despite multitude of reasons to be angry.

Here Annamayya is hinting that mind should be quiet to observe the internal reactions to external stimuli; only in such state possibly it can be free from the deleterious effects of the reactions.

Just observe similarity with statement of Jiddu Krishnamurti. “..In the same way, you may insult me, or flatter me, the insult and the flattery remain as marks of pain and pleasure. So I am accumulating, the mind is accumulating through experience, thickening, coarsening, becoming more and more heavy with thousands of experiences. That is a fact. Now, can I when you insult me, listen with attention and consider your insult, not react to it immediately, but consider it? When you say I am a fool, you may be right, I may be a fool, probably I am. Or when you flatter me, I also watch. Then the insult and the flattery leave no mark. The mind is alert, watchful, whether of your insult or flattery, of the sunset and the beauty of so many things. The mind is all the time alert and therefore all the time free - though receiving a thousand experiences.” (YOU ARE THE WORLD, CHAPTER 3, 22ND OCTOBER 1968 3RD PUBLIC TALK AT BRANDEIS UNIVERSITY)

భావము & వివరణము : కొండల వలె మితిమీరిన పనులు తమకు తాముగా వచ్చి పై బడినను చలించక లెక్కపెట్టనివాడే యోగీంద్రుఁడు. (ధనికులు కానీయండి దరిద్రులు కానీయండి, మనిషి అన్నాక పనులు తప్పవు. పనుల కంటే, అవి కలిగించు మానసిక వత్తిడి గురించి చెబుతున్నారు అన్నమయ్య​.) అనేక రకాల కారణాలతో కోపం వచ్చే పరిస్థితులు నిత్యం కలిగినా, నిండైన హృదయముతో ప్రశాంతంగా వుండేవాడే ధీరుడు.

మనలో చాలా మందికి అకారణంగానే కొపమొస్తుంది. ఇకపోతే కారణముంటే ఇక అసలు పట్టలేము. ఇక్కడ అనేక కారణములున్నా కూడా  ప్రశాంతంగా ఉండ మంటున్నారు. ఇది యెంత కష్టమో!! ముఖ్యంగా అటువంటి విపరీతమైన కోపము లేదా  ప్రతీకారము రగలబోయే సమయములో వివేకముతో శాంతముగా తనలో కలిగే ప్రతిస్పందనలను మనిషి గమనిచవలెనని అన్నమయ్య ఉద్బొధ​. 

ఇక్కడ జిడ్డు క్రిష్ణమూర్తి గారు చెప్పిన మాటలు గుర్తుకుతెచ్చు కుందాము.: “..ఎదుటి వారు నిన్ను పొగడినప్పుడు గాని, తిట్టినప్పుడు గాని అనుభవము  మనసులో ఒక ముద్ర వేస్తుంది. ఇలాంటి ముద్రలు ఎన్నో చేరి మనసును మందకోడిగా తయారు చెస్తాయి. నువ్వు పొగడిన తిట్టినా, వాటికి స్పందిచకుండా,  నిజానిజాలు పరిశీలించ గలనా? నువ్వు నన్ను మూర్ఖుడు అంటే, (నాకు తెలియకుండా) నేను నిజంగా మూర్ఖుడై ఉండ వచ్చు;  పొగడితే అదే రకముగా పరిశీలిస్తే అవి నా మనసు మీద ముద్ర వేయలేవు.  అప్రమత్తత, చురుకుదనం, మెళుకువగల, ఎచ్చరికగల మనస్సుపై పొగడ్తలు, తిట్లు,  అందమైన సూర్యోదయాలు, హృదయాన్ని కళవళపరిచే ఘటనలలాంటి అనుభవాలుఎటవంటి ముద్ర లేకుండా  జారుకుంటాయి.​ అటువంటి మనస్సు వేలాది అనుభవాలకు గురియైనా స్వెఛ్ఛగా ఉంటుందిఅన్నమయ్య, జిడ్డు క్రిష్ణమూర్తి గారలు చెప్పినది ఒకే విధముగా ఉండటము గమనించండి. 

సూదులవంటి మాటలు సొరిదిఁ జెవి సోఁకితే

వాదులు వెట్టుకొననివాఁడే దేవుఁడు
పాదుకొన్న సంసారబంధము నోరూరించితే
ఆదిగొని మత్తుఁడు గానెట్టివాఁడే పుణ్యుఁడు ॥అప్పు॥

sUdulavaMTi mATalu soridi jevi sOkitE

vAdulu veTTukonanivADE dEvuDu
pAdukonna saMsArabaMdhamu nOrUriMchitE
Adigoni mattuDu gAneTTivADE puNyuDu   appu

Word to Word Meaning:  సూదులవంటి (sUdulavaMTi) = Needle like; మాటలు (mATalu) = words; సొరిదిఁ(soridi) = regularly;  జెవి (jevi) = ear; సోఁకితే (sOkitE) = touch or contact; వాదులు (vAdulu) = arguments; వెట్టుకొననివాఁడే (veTTukonanivADE) = do not engage into; దేవుఁడు (dEvuDu) = god; పాదుకొన్న (pAdukonna) = (deep) rooted;  సంసారబంధము (saMsArabaMdhamu) = family bonds; నోరూరించితే (nOrUriMchitE) = if mouth waters, if desires awaken; ఆదిగొని (Adigoni ) = ఆసక్తి చెంది, దాన్ని గమనించి, having observed, get interested; మత్తుఁడు గానెట్టివాఁడే (mattuDu gAneTTivADE ) = the one who do not get intoxicated;  పుణ్యుఁడు (puNyuDu) = pious man.

Literal Meaning and Explanation: A person may be considered equal to god who remains quiet even after listening to words piercing the heart. The pious man does not get give into the ever luring mouth-watering comforts of family life. 

Normal people on listening to needling words, set aside whatever good conduct they have been taught, gets in to quarrel. After that he will repent and says “I should not have behaved like that”. This is exactly what was described in the verse “ekkaDi mAnushajanmaM bettina phalamE munnadi”. In those very incidents one can know who is noble and who is a wretch. What needs to be noted is that practitioner is not deaf. But even after listening to thorn like words, he remains unmoved. 

Further most compromising thing a person does without knowing its impact is that “just for this day I will spend with my time with my wife. Tomorrow onward I will be away from these”. Will the tomorrow ever dawn on him? 

భావము & వివరణము : సూదుల వంటి సూటిపోటి మాటలు (నిందలు) తన చెవికి గుచ్చుతున్నట్టు వినబడినా, అట్లు తిట్టినవారితో గొడవలు, కొట్లాటకు దిగనివాడే (మనుషుల్లొ) దేవునితో సమానుడు. సంసార బంధాలు నోరూరిస్తూ తనను బంధిస్తున్నా ఆశపడక మత్తుకు లొంగక నిలచినవాడే నిజమైన పుణ్యాత్ముడు.

అన్నమయ్య పల్లవిలో చెప్పిన అంశాలు వివరముగా చెప్పుచున్నాడు. సూదుల వంటి సూటిపోటి మాటలు (నిందలు) తన చెవికి  వినబడిన క్షణములో మామూలు మనిషి తను నేర్చినవన్నీ వదలివేసి వాదులాటకు దిగి,  ఆతర్వాత అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటాడు. (ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది అనే కీర్తన చూడండి). అక్కడే అధికుల నధముల వ్యత్యాసము తెలిసేది. ఇక్కడ గమనింప వలసిన విషయము సాధకుడు బధిరుడు కాదు. (వినలేక మిన్నకుండడానికి). విని కూడా మిన్నకుండువాడే నిజమైన భక్తుడు.

ఒక్కసారికి నేను నా భార్యతో ఉంటాను. రేపటి నుండి, ఎప్పటిలా వీటన్నింటికీ దూరంగా ఉంటాను అనుకుంటూ లొంగిపోతాడు. ఐతే రేపు ఎప్పటికైనా వస్తుందా? మనందరిదీ శ్మశాన వైరాగ్యమని నిజమైనది కాదనీ హెచ్చరించారు.

గాలాలవంటి యాసలు కడుఁ దగిలి తీసితే

తాలిమితోఁ గదలనాతఁడే ఘనుఁడు
మేలిమి శ్రీవేంకటేశుమీఁద భారము వేసుక
వీలక తనలో విఱ్ఱవీఁగువాఁడే నిత్యుఁడు         ॥అప్పు॥

 

gAlAlavaMTi yAsalu kaDu dagili tIsitE

tAlimitO gadalanAtaDE ghanuDu

mElimi SrIvEMkaTESumIda bhAramu vEsuka

vIlaka tanalO vi~r~ravIguvADE nityuDu         appu 

Word to Word Meaning: గాలాలవంటి (gAlAlavaMTi ) = hook like; యాసలు (yAsalu) = wants, desires; కడుఁ(kaDu) = much; దగిలి (dagili) = get tangled;  తీసితే(tIsitE) = pulls towards them; తాలిమితోఁ(tAlimitO) = by Endurance, by patience,  గదలనాతఁడే (gadalanAtaDE) = the one that does not move;  ఘనుఁడు (ghanuDu) = great soul; మేలిమి (mElimi) = ఆధిక్యము, ఔత్కృష్ట్యము, fine, excellent;   శ్రీవేంకటేశుమీఁద (SrIvEMkaTESumIda)  = on Lord Venkateswars; భారము(bhAramu) = responsibility; వేసుక(vEsuka)  వీలక(vIlaka) = వ్రీలక​, జంకుగొనక, reamin steadfast, not afraid of  తనలో (tanalO) = within himself;  విఱ్ఱవీఁగువాఁడే (vi~r~ravIguvADE) = to be proud. However, contextual meaning is: remain free; నిత్యుఁడు (nityuDu) = for ever. 

Literal Meaning and Explanation: The one not getting entangled with the ever persecuting desires, who endures and remain steadfast at the feet of the god will be set free of bondage.

Man cannot show any evidence of having experienced the GOD. However he cannot gain physically, psychologically or financially from this episode. Thus ever profit or comfort seeking point of view, this search for god is utterly useless for a SUCCESSFUL MAN. The engagements with senses actually show up their reaction immediately. How can a man, leaving the tangible evidence, pursue something like imperceptible work?

The true seeker, without wavering, puts in complete belief in god. Such noble persons will be set free. 

భావము & వివరణము : గాలాల వంటి ఆశలు మిక్కిలి గా చుట్టుముట్టి లాగుతున్నా, ఓర్పు వహించి కదలక నిలబడిన వాడే ఘనుడు (గొప్పవాడు). ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోక శ్రీవేంకటేశ్వరుని పై భారం వేసి నిలిచివున్న వాడే నిత్యుడు. నిత్యుడైన వాడు భక్తితో తనలో తను ఆనందపడుతూ వుంటాడు బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా.

ఇంద్రియ సుఖాలు వెనువెంటనే  ప్రతిక్రియ చూపుతాయి. అవి అనుభవనీయమైవి, వాస్తవమైనవి.  అనుభవించగలిగినదాన్ని వదిలిపెట్టి, అనుభవము లోనికి రాని భగవంతుని పట్ల నిజానికి సాక్ష్యం లేకుండామామూలు మనిషి నమ్మకం ఉంచగలడా? అటువంటి పరీక్షా సమయాల్లోనూ అనుమానించక నమ్మకము నిలుపువాడే అధికుడు.

 

zadaz

Reference: copper leaf 120-3, volume: 2-117

(With inputs from అన్నమాచార్య సంకీర్తనామృతము by డా. సముద్రాల లక్ష్మణయ్య)

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...