Saturday, 1 March 2025

211. komma tana mutyAla koMgu jAraga bagaTu (కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు)

 అన్నమాచార్యులు

211. కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు

komma tana mutyAla koMgu jAraga bagaTu

for commentary in Telugu Press here

Introduction: 

This composition by Annamacharya is an extraordinary piece of poetry, blending layered symbolism with deep philosophical insight. At first glance, it seems to describe an external event—a woman’s sari covering frontal parts slipping, revealing an emotion or sentiment she normally conceals. But as with much of Annamacharya’s poetry, this imagery is not merely about physical appearance or human emotion; it is a metaphor for spiritual transformation and the unravelling of illusion. 

Annamacharya did not compose these kirtanas as structured lessons for us to learn step by step. For, there is no known path to the truth. Instead, he shared his direct experiences for the benefit of the world. These songs, written from a deeply realized state, serve to open new vistas to liberation for those who read or listen with sincerity. 

With remarkable ease, Annamacharya hides profound truths behind words that may seem like romantic expressions, challenging us to look deeper. This kirtana is a perfect example of how the simplest words can be made to carry immense wisdom yet remaining captivating from beginning to end. 

His words feel as if they were dipped in honey, or like a radiant pearl revealed when a delicate veil slips away. Even the most graceful heavenly dances cannot match the beauty of this composition. Nor can it be compared to a fleeting lightning flash in a clouded sky—its brilliance is something far greater. 

Yet beneath this poetic sweetness, Annamacharya delivers sharp and direct truths—like hammer blows that strike straight into the heart. If, even for a moment, we truly feel their impact—if the veils covering our minds are lifted, allowing us to see the world as it truly is, raw and unembellished—then our very life would be fulfilled. 

Annamacharya’s mastery lies in his ability to encode profound spiritual truths into everyday imagery. The poem speaks of the gradual shedding of illusions, the resistance to change, and the eventual moment of surrender, where one becomes one with the divine. The use of sensory metaphors (pearled garment slipping, perfumed water, swaying in delight) keeps the poem grounded in experience, making its spiritual insights more tangible. 

This composition aligns beautifully with the Bhagavad Gita—that inner and outer realities are not separate, but reflections of one another. Here, too, the external slipping of an ornament mirrors the internal unravelling of self-created illusions. The poem does not just describe a transformation—it invites the reader to undergo it. 

The Summary of the Poem:

Chorus: "As her pearl-studded veil slips away, she is confronted with the bare truth." Deeper Significance: "O humans! The love, attachment, and emotions you cherish are shaped by endless conditioning. Like a veil slipping away, only when these layers dissolve can we understand love—not as something to acquire, but as a state of being beyond attachment."

 

Stanza 1: "Blinded by the pride of her beauty and the belief that she can captivate the divine through her own allure, she waits eagerly, forgetting even to blink, as if preparing for a battle-like union. Yet, she fails to see that love and attachment, as we perceive them, are mere illusions shaped by our own stubborn pursuits—considerations that hold no place in the divine realm." Deeper Significance: Humans, led by their own perceptions, craft beauty, shape divine forms, and seek to please God through music and art. Urged by the need to act, they believe these efforts will draw them closer to the divine, yet they overlook the stillness essential for true experience. Consumed by restless striving, they fail to see that the deepest truth reveals itself only in quiet surrender.

Stanza2: “Drawn by its fragrance, she eagerly reaches for the scented rosewater—sweet to the senses but bitter in consequence. Her companions caution her, yet she dismisses their words. As her restless yearning deepens, her eyes flare with frustration, and she unknowingly invites the very turmoil she seeks to escape.” 

Stanza 3: “A devotee of the Lord reminded Annamacharya that the disguises we hide behind cannot stand before God. The love and affection she once believed to be true were now revealed as mere outward coverings, fleeting and temporary. Realizing this, she found quiet joy within herself. As she let go of these illusions, she merged with Lord Venkateswara. In that moment, a deeper truth became clear—she and the Lord had always been one.” 

 

కీర్తన POEM 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు 13-1 సంపుటము: 5-74

Philosophical Poem

Copper Plate: 13-1  Vol: 5-74

కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు      ॥పల్లవి॥
 
ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక మహ మురిపెమునను
కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు      ॥కొమ్మ॥
 
పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు-
తాపమవునని చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు           ॥కొమ్మ॥
 
ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు
ఒప్పదని చెలి గోర నొత్తఁగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు     ॥కొమ్మ॥
komma tana mutyAla koMgu jAraga bagaTu
kummariMpuchu dechchukonnadI valapu pallavi
 
oyyAramuna vibhuni vorapu ganugoni reppa
muyyanEraka maha muripemunanu
kayyaMpu gUTamiki gAluduvvuchu neMte
koyyatanamuna dechchukonnadIvalapu komma
 
paipaine AragiMpakumu pannIru gaDu-
tApamavunani chelulu dalakagAnE
tOpu sEyuchu geMpu dolaku gannula konala
kOpagiMpuchu dechchukonnadIvalapu komma 
eppuDunu batitODa niMtEsi mElumulu
oppadani cheli gOra nottagAnE
yeppuDO tiruvEMkaTESu kaugiTa gUDi
koppugulukuchu dechchukonnadIvalapu komma 

 

Details and explanations:

కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు ॥పల్లవి॥
         
komma tana mutyAla koMgu jAraga bagaTu
kummariMpuchu dechchukonnadI valapu pallavi 

Word to word meaning:  కొమ్మ (komma) = That Girl, That Lady; తన (tana = her; ముత్యాల (mutyAla) = adorn with pearls; కొంగు (koMgu) = part of the sari covering breast, here used in the sense of a veil; జారఁగఁ (jAraga) =slipped away; బగటు (bagaTu)= got exposed, came in clear sight; కుమ్మరింపుచుఁ (kummariMpuchu) = pouring out; దెచ్చుకొన్నదీ (dechchukonnadI) = brought (this).; వలపు (valapu)= Love, compassion, kindness;    

Literal Meaning: "As her pearl-studded veil slips away, she is confronted with the bare truth."

ExplanationAnnamacharya, through the word కొమ్మ (komma), embodies the seeker—suggesting that the human experience itself is veiled in illusions.

The phrase "ముత్యాల కొంగు జారఁగఁ" ("mutyAla koMgu jAraga"), meaning "as the pearl-studded veil slips away," signifies the dissolution of external embellishments—our cultivated modesty, social conditioning, and self-imposed perceptions. The pearls symbolize the beauty and grace we construct to mask our unfiltered self.

The line "బగటు కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు" ("openly displays the affection she has gathered") suggests that what we perceive as love and attachment is not innate but something accumulated over time—displayed, rather than naturally arising. Love, as we know it, is often shaped by conditioning and expectation rather than pure, untainted experience.

Deeper Significance: "O humans! The love, attachment, and emotions you cherish are shaped by endless conditioning. Like a veil slipping away, only when these layers dissolve can we understand love—not as something to acquire, but as a state of being beyond attachment."

ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక మహ మురిపెమునను
కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు కొమ్మ

 

oyyAramuna vibhuni vorapu ganugoni reppa
muyyanEraka maha muripemunanu
kayyaMpu gUTamiki gAluduvvuchu neMte
koyyatanamuna dechchukonnadIvalapu komma

 

Word to word meaning:   ఒయ్యారమున (oyyAramuna) = సౌందర్యగర్వముతో, titillation and pride (born of her) beauty; విభుని (vibhuni) = of the God, of the Husband; వొరపు (vorapu) = a beautiful method, a suitable thing; గనుఁగొని (ganugoni) = having found; రెప్పముయ్యనేరక (reppa muyyanEraka) = forgetting even to wink eyelids; మహ మురిపెమునను (maha muripemunanu) = invigorated with great enthusiasm; కయ్యంపుఁ గూటమికిఁ (kayyaMpu gUTamiki) = conflict like union with (the Lord); గాలుదువ్వుచును (gAluduvvuchunu) =  braving and challenging; ఇంతె (imte)= That lady; కొయ్యతనమునఁ (koyyatanamuna) = by the stubbornness; దెచ్చుకొన్నదీవలపు (dechchukonnadI valapu) = this love, this affection are born out of stubbornness. 

Literal Meaning: "Blinded by the pride of her beauty and the belief that she can captivate the divine through her own allure, she waits eagerly, forgetting even to blink, as if preparing for a battle-like union. Yet, she fails to see that love and attachment, as we perceive them, are mere illusions shaped by our own stubborn pursuits—considerations that hold no place in the divine realm."

Explanation: 

Let’s analyse the phrase కయ్యంపుఁ గూటమి"Kayyampu Gootami" in the light of the Bhagavad Gita verse समत्वं योग उच्यते "Samatvam Yoga Uchyate (2.48)"—which defines yoga as the state of equanimity. Here, it refers to the balance a man has to exercise between as person in flesh and blood (on the material side) associated with the physical world, logic, and reason; and the other is connected to the world of emotions, intuition, and spirituality.

This stanza challenges us to get engaged with the truth by understanding that the one forming (perceiver) and the formed (perception) are one and the same.  As long as they are different, there is conflict in this world (refer to Jiidu Krishnamurti’s statements). True yoga is the harmonization of these forces, an experience beyond the grasp of we ordinary men. One sure take away from కయ్యంపుఁ గూటమి"Kayyampu Gootami"   is that there exists mutually opposing forces.

Further, verse 15-1 of Bhagavad Gita also refer to inverse reflection. ऊर्ध्वमूलमध:शाखमश्वत्थं प्राहुरव्ययम् | छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ||15-1||  (ūrdhva-mūlam adha-śhākham aśhvattha prāhur avyayam chhandānsi yasya parṇāni yas ta veda sa veda-vit) Meaning: They speak of an eternal aśhvatth (banyan) tree with its roots above and branches below. Its leaves are the Vedic hymns, and one who knows the secret of this tree is the knower of the Vedas. This inverse reflection is widely accepted phenomenon in many cultures.



This concept of inversion—where the source and its reflection appear paradoxically reversed—resonates deeply across cultures. We see this in the Bhagavad Gita’s depiction of the upside-down Ashvattha tree (15-1), as well as in Hilma af Klint’s Swan series, where two opposing forces converge into a singular metaphysical truth. In Swan No. 24, for example, two swans appear to interfere into one another to form a butterfly like shape (in inverse reflection). The swans remain in delicate (and of course near impossible) balance, in that very state they experience exhilaration unknown to the humans. The Swan No 24 (shown above) illustrates a metaphysical reality beyond human logic, much like the divine union Annamacharya speaks of. Annamacharya describes a state of realization that is both rare and profoundly real—one that transcends human grasp and is seldom attained in history.

This కయ్యంపుఁ గూటమి"Kayyampu Gootami"    may also be compared with a person standing in the muddy waters.  still water allows mud to settle, revealing the objects behind water clearly. Any movement (or action we take) shall disturb the water and mud rises up to obscure the view. Therefore, wisemen say that attempting to grasp truth through effort obscures our vision.

We people firmly believe in our capacity to judge between right and wrong. Whereas Annamacharya does not think so. He affirms it by saying "కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు" (koyyatanamuna dechchu konnadI valapu = this love, this affection are born out of stubbornness). To delve further, first consider the Bhagavad Gita verse (3.38) धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च | यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् || 38|| dhūmenāvriyate vahnir yathādarśho malena cha yatholbenāvito garbhas tathā tenedam āvitam (meaning: "Just as fire is covered by smoke, a mirror by dust, and an embryo by the womb, so too is knowledge obscured by ignorance."  Thus our present actions have origins in ignorance. Ignorance and stubbornness are variations of the same genre.

"Annamacharya does not merely dismiss human love and attachment—he exposes them as constructs of ego and conditioning. Our insistence on defining love through personal effort blinds us to the effortless, unconditional love that can only be realized in surrender."

Deeper Significance: Humans, led by their own perceptions, craft beauty, shape divine forms, and seek to please God through music and art. Urged by the need to act, they believe these efforts will draw them closer to the divine, yet they overlook the stillness essential for true experience. Consumed by restless striving, they fail to see that the deepest truth reveals itself only in quiet surrender.

 

పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు-
తాపమవునని చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు కొమ్మ
 
paipaine AragiMpakumu pannIru gaDu-
tApamavunani chelulu dalakagAnE
tOpu sEyuchu geMpu dolaku gannula konala
kOpagiMpuchu dechchukonnadIvalapu komma 

Word to word meaning:  పైపైనె (paipaine) = on the superficial level, on the surface; ఆరగింపకుము (AragiMpakumu) =  don’t consume (implying don’t get satisfied)  (=విహరించవద్దు); పన్నీరు (pannIru) = Scented Rose Water; గడు-తాపమవునని (gaDu-tApamavunani) = (leads) to much more thirst; చెలులు దలఁకగానే (chelulu dalakagAnE) = shaking companions (implying that the companions do not approve); తోపు సేయుచుఁ (tOpu sEyuchu) = pushing out their objections; గెంపు దొలఁకుఁ గన్నుల కొనల (geMpu dolaku gannula konala) = her eyes brimming in red; కోపగింపుచుఁ (kOpagiMpuchu) = filled with anger; దెచ్చుకొన్నదీవలపు (dechchukonnadI valapu) = this love, this affection (are results of that anger). 

Literal Meaning: Drawn by its fragrance, she eagerly reaches for the scented rosewater—sweet to the senses but bitter in consequence. Her companions caution her, yet she dismisses their words. As her restless yearning deepens, her eyes flare with frustration, and she unknowingly invites the very turmoil she seeks to escape. 

Explanation: Annamacharya cautions us against living on the surface of life, mistaking momentary pleasures for true fulfilment. The rosewater, though appealing, is harmful when consumed—just as unchecked desires appear enticing but ultimately lead to distress.

This verse echoes a profound truth from the Bhagavad Gita (2.62): ध्यायतो विषयान्पुंस: सङ्गस्तेषूपजायते | सङ्गात्सञ्जायते काम: कामात्क्रोधोऽभिजायते || 2-62|| dhyāyato viṣhayān puṁsaḥ saṅgas teṣhūpajāyate saṅgāt sañjāyate kāmaḥ kāmāt krodho ’bhijāyate. Meaning: "By contemplating sense objects repeatedly, attachment to them arises. From attachment, desire is born; from desire, anger emerges." 

Here, "companions" (చెలులు) symbolize well-wishers—friends, family, or inner wisdom—that caution against unchecked desires. When ignored, inner wisdom fades, and the restless mind spirals into suffering, proving that true peace is found not in indulgence, but in self-restraint.

 

ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు
ఒప్పదని చెలి గోర నొత్తఁగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు కొమ్మ
 
eppuDunu batitODa niMtEsi mElumulu
oppadani cheli gOra nottagAnE
yeppuDO tiruvEMkaTESu kaugiTa gUDi
koppugulukuchu dechchukonnadIvalapu komma

 

Word to word meaning: ఎప్పుడునుఁ (eppuDunu) = Always; బతితోడ (batitODa) = with the Lord; నింతేసి (niMtEsi) = this much; మేలుములు (mElumulu) = veils or shields; ఒప్పదని (oppadani) =  unsuitable; చెలి (cheli) = a dear friend ( (here implying another servant of the Lord); గోర నొత్తఁగానే (gOra nottagAnE) = encouraged by pinching me; యెప్పుడో (yeppuDO) = from time immemorial; తిరువేంకటేశు (tiruvEMkaTESu) = Lord Venkateswara; కౌఁగిఁట గూడి (kaugiTa gUDi) = into his arms (merging into his consciousness); కొప్పుగులుకుచుఁ (koppugulukuchu) = Slightly tilting the head in joy (a gesture of delight, where one revels in their own happiness); దెచ్చుకొన్నదీ వలపు (dechchukonnadI valapu)= The love she has taken upon herself. 

Meaning: A devotee of the Lord reminded Annamacharya that the disguises we hide behind cannot stand before God. The love and affection she once believed to be true were now revealed as mere outward coverings, fleeting and temporary. Realizing this, she found quiet joy within herself. As she let go of these illusions, she merged with Lord Venkateswara. In that moment, a deeper truth became clear—she and the Lord had always been one.

 

Explanation:

The word "ఎప్పుడో" (some time ago) hints at a realization beyond ordinary time—an awakening that goes beyond our usual way of thinking. Annamacharya beautifully shows how attachments to false identities and fleeting pleasures fade when we see the deeper truth. At first, the ego resists, but once these illusions disappear, merging with the divine becomes effortless, bringing immense inner joy.

 

Overall Impression:

The poem unfolds like a journey of realization. The chorus sets the tone: something once hidden (whether it be love, longing, or realization) is now exposed. The three stanzas develop this idea further, showing how the layers of illusion—whether vanity, superficial desires, or attachments—gradually come undone.

  1. First Stanza: It presents the struggle between external adornment and inner realization.
  2. Second Stanza: It warns against indulging in surface-level pleasures, using the metaphor of fragrant water that seems pleasant but can ultimately be harmful. Society (represented by friends or well-wishers) warns against excessive pride, but the protagonist resists, allowing ego-driven emotions to surface. This connects to the Bhagavad Gita’s idea that repeated indulgence in sensory pleasures leads to attachment and, eventually, suffering.
  3. Third Stanza: The ultimate realization dawns. The false coverings—constructed identities, pride, illusions—are stripped away. What remains is a merging with the divine, where even time (symbolized by ఎప్పుడో) ceases to be relevant. The protagonist sways in joy, having recognized that the love she thought she possessed was always self-created and ultimately dissolved into divine unity.

 

 

-X-X-The End-X-X-


 

Wednesday, 12 February 2025

A-211 Notes on Swan No. 24



హిల్మా ఆఫ్ క్లింట్ యొక్క చిత్రములలో, నలుపు మరియు తెలుపు హంసలు నిర్దిష్ట సంకేత అర్థాలను కలిగి ఉంటాయి.


*నల్ల హంస* జీవితపు పదార్థ సంబంధమైన అంశాలను సూచిస్తుంది. ఇది భౌతిక ప్రపంచం, తర్కం మరియు కారణాలతో ముడిపడి ఉంటుంది.


మరోవైపు *తెల్ల హంస* జీవనం యొక్క ఆధ్యాత్మిక మరియు దైవిక అంశాలను సూచిస్తుంది. ఇది భావోద్వేగాలు, అంతర్ దృష్టి మరియు ఆధ్యాత్మికత ప్రపంచానికి అనుసంధానించబడి ఉంటుంది.


తెలుపు నలుపు హంసలు రెండు కలిసి, భౌతిక మరియు ఆధ్యాత్మికం, & తర్కం మరియు అంతర్ దృష్టి వంటి వ్యతిరేక శక్తుల మధ్య ద్వంద్వత్వం మరియు సమతుల్యతను సూచిస్తాయి. ఆఫ్ క్లింట్ యొక్క చిత్రములు తరచుగా ఈ ద్వంద్వతల మధ్య పరస్పర అనుసంధానం మరియు సమతుల్యతను అన్వేషిస్తాయి 


హిల్మా ఆఫ్ క్లింట్ యొక్క పనిలో, హంసలు తరచుగా అస్థిరమైన బ్యాలెన్స్ స్థితిలో చిత్రీకరించబడ్డాయి. పైగా అవి ఆ సమతుల్యత లేకపోతే చెదిరిపోతాయేమో  అనిపిస్తుంది. అస్థిరత మరియు ఉద్రిక్తత యొక్క ఈ ఉద్దేశపూర్వక ప్రాతినిధ్యం అనేక సంకేత ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది: 


హంసలను దాదాపు అసాధ్యమైన సమతుల్యతతో చూపడం ద్వారా, ఆధ్యాత్మిక ఎదుగుదల, స్వీయ-అవగాహన మరియు వ్యక్తిగత పరివర్తన యొక్క సంక్లిష్టతలను మరియు సవాళ్లను ఆలోచించమని ఆఫ్ క్లింట్ యొక్క కళ వీక్షకులను ఆహ్వానిస్తుంది.


ఆ హంసలు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకొని పోయి, భౌతికంగా సాధ్యము కాని, ఆ కష్టమును విస్మరించి అలౌకిక (యోగ) స్థితిలో సాధారణ కనులు కాంచలేని ఈ లోకములోని అత్యద్భుతమైన క్రమమును కనుగొనునని చూపుతున్నవి.

Saturday, 8 February 2025

T-211 కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు

కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు

For Commentary in English please press here: 

అన్నమాచార్యులు ఈ కీర్తనలను ఒకటొకటిగా మనకు బోధించుట కొరకు వ్రాయలేదు. వారు తమలో తాము అనుభవించిన ప్రత్యక్ష విషయమును లోక హితముకై వెల్లడించారు. అన్నమాచార్యులు తాదాత్మ్య స్థితి చేరుకొని అనుభవించి వ్రాసిన ఈ కీర్తనలు శ్రద్ధతో  పరీక్షగా చదివిన/వినిన వారికి పరమపద సోపానముల నిపించును.

ఆచార్యులవారు అతి లాఘవంగా ఈ కీర్తన ముఖ్య సందేశమును శృంగార వర్ణనలు అనిపించు పదముల వెనుక దాచి మనకు సవాలు విసురుతారు. అత్యంత సులభమైన పదముల  అల్లికతో అనంతమగు గంభీరమైన సందేశమును చెప్పించవచ్చును అనుటకు ఈ కీర్తన ఆద్యంతము ఉదాహరణీయము. ఆసాంతము రమణీయము.


ఆ పదములు తేనెలో ముంచి తీసిన అక్షరములతో కూర్చినవో తెలియదు. ఆమె మేలి ముసుగు జారగా తళుక్కుమన్న మేలిముత్యములో నిర్ణయించ లేము.ఈ కీర్తన  లావణ్యమునకు స్వర్గములో మేటి నృత్యమణుల విన్యాసమూ సరిపోలనిది.   మేఘావృతమైన ఆకాశంలో ఇదమిత్థముగా లేని వ్యక్తం చేయలేని విద్యుల్లత లాంటిదనీ చెప్పలేము. 


ఇంత సున్నితమైన పదాలకు విరుద్ధంగా అన్నమాచార్యులు మన మీద కురిపిస్తున్న  విమర్శలు అనే సమ్మెటపోట్లు హృదయంలోకి చొచ్చుకుపోతే, క్షణిక కాలానికైన అవి కల్పించు స్థితిని అనుభవించ గలిగితే, మనసుకు తగులుకొన్న ముసుగులు తొలగిపోతే, ఒక్కసారిగా ఈ ప్రపంచమును దాని నగ్న నృత్యమును, తనను తన నిజ రూపంలో చూచు కోగలిగితే, జన్మ ధన్యమైనట్లే.


కీర్తన 

కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు ॥పల్లవి॥


ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక మహ మురిపెమునను
కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥


పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు-
తాపమవునని చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥


ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు
ఒప్పదని చెలి గోర నొత్తఁగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥



Details and explanation: 

కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు ॥పల్లవి॥


టీకా: కొమ్మ = ఈమె; తన= తన; ముత్యాల కొంగు = ముత్యాల కొంగు; జారఁగఁ = జారిపోగా; బగటు = కనబఱచుచు, త్రవ్వుచు, పైవెట్టుచు, పొడమించుచు, బహిర్గతముచేయుచు; కుమ్మరింపుచుఁ = కుమ్మరించుచు; దెచ్చుకొన్నదీ = కొని తెచ్చుకోన్నదీ; వలపు = ప్రేమ, వలపు, ఆప్యాయత.


భావము: తన ముత్యాల కొంగు జారిపోగా (సిగ్గు లేక) తెచ్చిపెట్టుకున్నఆప్యాయతలన్నీ ఆమెకు అవగతమైనవి.


వివరణము: ఇక్కడ ఈమె అనగా అన్నమాచార్యులు తనను తానే ఒక స్త్రీగా వర్ణించుకున్నారు. 

"ముత్యాల కొంగు జారఁగఁ"తో అప్పటి వరకు తనను కబళించిన తెరలు  (సిగ్గు) తొలగి పోవుటను సూచించారు.

బగటు కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు = వృథా ప్రయాసలకోర్చి తెచ్చిపెట్టుకున్నదీ (మనము) చూపించు మోహము.


అంతరార్థము: మానవులారా మనము కనబరచు ప్రేమ, మోహము, ఆప్యాయత వృథా ప్రయాసలకోర్చి తెచ్చిపెట్టుకున్నది. దీనిని సిగ్గు విడిచి వదిలిన కానీ, భగవానుని అవ్యాజమైన ప్రేమను అనుభవించలేము.


మొదటి చరణం 
ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక మహ మురిపెమునను
కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥


టీకా: ఒయ్యారమున = సౌందర్యగర్వముతో; విభుని= తన మగని, దైవము; వొరపు = ఉపాయము, స్థిరము, సుందరమైన, గొప్ప, యోగ్యము; గనుఁగొని = కనుగొని, తెలుసుకుని; రెప్పముయ్యనేరక = కనురెప్ప మూయడం కూడా మరిచి; మహ మురిపెమునను = అతిశయమైన శృంగార గర్వముతో; కయ్యంపుఁ గూటమికిఁ = యుద్ధము లాంటి  సమాగమమునకు; గాలుదువ్వుచును =  కాలుదువ్వుచును; ఇంతె = ఆ స్త్రీ; కొయ్యతనమునఁ = మొండితనమున; దెచ్చుకొన్నదీవలపు = తెచ్చిపెట్టుకున్నదీ కనబఱచు మోహము; 


భావము: సౌందర్యగర్వముతో, ఆ దైవమును కనుగొనగలనను ఊహలతో, కనురెప్ప మూయడం కూడా మరిచి అతిశయించిన శృంగార గర్వముతో యుద్ధము లాంటి (దైవ) సమాగమమునకు ఆ స్త్రీ కాలుదువ్వుచు మొండితనమున తెచ్చిపెట్టుకున్నదీ కనబఱచు వలపు.


వివరణము: "కయ్యంపుఁ గూటమికిఁ" అను పద బంధమును"సమత్వం యోగ ఉచ్యతే (2-48)" అన్న గీతా వాక్యాన్ని కలిపి పరిశీలిద్దాము. ఇక్కడ సమత్వం అన్నది తాను అన్నమాచార్యులు అను ఊహగల ఈ దేహము, ఆవల దాని పరిపూరకమగు (కాంప్లిమెంటరీ గా) ఇంకొకటి. పరస్పరము ఇమడని రెండు వ్యతిరేక శక్తుల గురించి తెలుపుచున్నారు.ఆ శక్తులను ఒకచోట చేర్చి ఉంచడమే యోగము. ఇది ఆచార్యులవారు మానవులెవరూ దర్శించని ఆ సమస్థితిని చేరుకొని చెప్పిన విషయం.  దీనిని భగవద్గీతలోని క్రింది శ్లోకము నుండి గ్రహించవచ్చు.


ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ । ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।। 15-1 ।। భావము: వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న అవ్యయమైన అశ్వత్థ వృక్షము యొక్క రూపమును కనుగొనుము. దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు (సమస్త) వేదములను గ్రహించినట్లే. ఈ రకముగా ఈ శ్లోకము విలోమ ప్రతిబింబమును సూచిస్తొంది. 



ఈ విలోమ ప్రతిబింబమే (inverse mirror)  ప్రధాన ఇతివృత్తంగా హిల్మా క్లింటన్ వేసిన హంసల (the swan) శృంఖలలో గమనించ వచ్చును. ఉదాహరణకు Swan No 24లో (పై బొమ్మ చూడండి) ఆ హంసలు ఒక దానిలోకి ఒకటి చొచ్చుకొని పోయి, భౌతికంగా అసాధ్యమనిపించినా కాని, ఆ కష్టమును విస్మరించి అలౌకిక (యోగ) స్థితిలో సాధారణ మానవుల కనులు కాంచలేని ఈ లోకములోని అంతర్లీన అత్యద్భుతమైన క్రమమును కనుగొనునని చూపుతున్నవి. దీనిపై మరింత వివరణ కొరకు ఈ లింక్  Swan No. 24 ద్వారా   తెలియవచ్చును.

అతి జాగ్రత్తగా పరిశీలించిన, పైన ఉదాహరించిన భగవద్గీత శ్లోకము కూడా అన్నమాచార్యులు చెప్పిన "కయ్యంపుఁ గూటమికిఁ" ఊతమిస్తున్నది. ఎలాగంటే  బురద  నీరు కదిలించ కుండా  వదలేస్తే  బురద అడుక్కి వెళ్లి, తేట నీరు నిలిచి స్పష్టంగా చూచుటకు అవకాశం కలుగుతుంది. అయితే, ఏమాత్రం అలజడి కలిగినా (= ప్రయత్నం చేసినా) బురద పైకి లేచి చూడనివ్వదు. కావున ఆ నిశ్చలమైన స్థితిలో అలజడి కలుగజేయట మంటే సమత్వం నుంచి వెడలటమే. కావున దానిని "కయ్యంపుఁ గూటమికిఁ" అని అన్నమాచార్యులు వ్యవహరించారు. 


"కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు" = 'నాకు తప్పొప్పులు నిర్ణయించే శక్తి కలదని' మానవుడు విశ్వసించి దాని నుండి వచ్చు మొండితనమున తెచ్పిపెట్టుకున్నదీ కనబఱచు మోహము. (అయితే, మానవుల జ్ఞానము ఇప్పటి స్థితిలో అజ్ఞానముతో కప్పబడినదని భగవద్గీత  శ్లోకము "ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ । యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। 3-38 ।।" నుండి తెలియవచ్చును.

అంతరార్థము: మానవులు అనేక సౌందర్య సాధనములు ధరించి, తాము తలచిన భగవానునికి రూపు కల్పించి, అలంకరించి తమ తమ కళలతో విభుని మెప్పించుటతోను, సంగీతముతో పారవశ్యము చెందిన స్థితిలో ఆ విభుని చేరుటకు మార్గము కనుగొనెదమని మురిసిపోతూ ఆ అందమైన దేవదేవుని చూచుటకై కనురెప్పలు మూయకుండా వేచి  సమస్థితిలో తాను చేయగల కార్యములు లేకపోయిననూ ఉబలాటము కొలది మొండితనము కొలది ఏదో ఒకటి చేయవలెను ఆతృతతో జీవనము  అను అద్భుతమైన అవకాశం పోగొట్టుకుంటాము అన్న విషయం చెబుతున్నారు. 

రెండవ చరణం
పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు-
తాపమవునని చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥


టీకా: పైపైనె = మీదిమీదనే; ఆరగింపకుము = తినవద్దు , (=విహరించవద్దు); పన్నీరు = పరిమళపు నీరు; గడు-తాపమవునని = ఎక్కువ విరహ తాపము కలుగునని; చెలులు దలఁకగానే =చెలులు కంపించినా (వద్దని వారించినా); తోపు సేయుచుఁ= కోపగించుచు; గెంపు దొలఁకుఁ గన్నుల కొనల= ఎర్రని కన్నుల కొనలు కంపించగా; కోపగింపుచుఁ =కోపగింపుచుఁ; దెచ్చుకొన్నదీవలపు = స్వయంకృతముగా బయటపడిన కోరిక.


భావము: ఆమె ప్రస్తుతం గడుపుతున్న జీవితం పన్నీరు లాంటిది. పైకి సువాసన వెదజల్లుతూ వున్నా దానిని లోపలికి తీసుకొనవడం ఆరోగ్యానికి హానికరం. అది గమనించి చెలులు కంపించి (వద్దని వారించినా) వినక ఎర్రని కన్నుల కొనలు కంపించగా కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు.


వివరణము: విషయములలో తిరుగు మనసు కోపమునకు గురి అవునని ఈ భగవద్గీత శ్లోకము ద్వారా తెలియును. శ్లో|| ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే । సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ||(2-62)|| భావము: ఇంద్రియ విషయములను పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా వాటి మీద ఆసక్తి మమకారమూ పెరుగుతుంది. ఆసక్తి వలన కోరికలు; దాని నుండి క్రోధము సంభవిస్తాయి.

చెలులు: ఇక్కడ అన్నమాచార్యులు చెలులు అన్న పదంతో పక్క వారు, స్నేహితులు తల్లిదండ్రులు సఖులు అన్న అర్థాలను చూపించారు.


మూడవ చరణం 
ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు
ఒప్పదని చెలి గోర నొత్తఁగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥


టీకా: ఎప్పుడునుఁ = ఎప్పుడునుఁ; బతితోడ = పతి (దైవము) తోడ; నింతేసి = ఇంత ఎక్కువ; మేలుములు = ముసుగులు; ఒప్పదని చెల్లవని ; చెలి = హితులు(దైవదాస్యులు); గోర నొత్తఁగానే = గోరుతో నొక్కి చెప్పగా; యెప్పుడో = యెప్పుడో; తిరువేంకటేశు = తిరువేంకటేశుని; కౌఁగిఁట గూడి = ఐక్యమై; కొప్పుగులుకుచుఁ= తలతో కులకడం (అంటే ఆనందించడం. కులుకు అంటే తనలో తాను ముచ్చటపడుతూ ఆనందిస్తూ ఉండడం); దెచ్చుకొన్నదీ వలపు= తనపై తాను వేసుకున్నది ఈ అనురాగము.


భావము: శ్రీ వేంకటేసు దాసులు ఆ దైవము దగ్గర (మానవులుగా మనం) తెచ్చి పెట్టుకున్న ముసుగులు చెల్లవని గిల్లి చెప్పగా, తనలో తానే ముచ్చటపడుతూ ఆనందిస్తూ, తనపై తాను కురిపిస్తున్న ఈ అనురాగము, ఆప్యాయత కేవలము బాహ్య ఆచ్ఛాదనలని (క్షణికానందములని) తెలిసి వదలివేయగా ఆ వేంకటేశ్వరుని భావనలో ఐక్యమై ఆమెకు (అన్నమాచార్యులకు) వెనుకటి ఎప్పటి నుండో  తామిరువురు ఒకటను భావము ప్రత్యక్షంగా కలిగెను.


వివరణము: యెప్పుడో అను పదముతో, కాలగమనముతో సంబంధము లేని స్థితిని తెలిపారు.
                            x-x-x-x



212. ETi pariNAmamu mammEla yaDigErayya (ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య)

  ANNAMACHARYA 212. ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య ETi pariNAmamu mammEla yaDigErayya Introduction: In this seemingly unassuming comp...