Friday 28 May 2021

53 అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే (aMtaraMgamellA SrIhari koppiMchakuMDitE)

 ANNAMACHARYA

53 అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే 

Introduction: In this pleasing verse, Annamacharya is commenting on many of the life positions taken by us. Of course they are as relevant as tomorrow is for all of us. He questioned futility of disjointed life. First, there is body and mind disconnect. Then mind and god disconnect. We try to deal with them separately. Annamacharya is asking us to adapt to the wholeness of life, not in fragments. Now you can appreciate pertinence of the chorus. 

ఉపోద్ఘాతము: అందమైన కీర్తనలో మానవుడు జీవితములో బాహ్య, అంతర్గత సమతుల్యము లేక  సమైక్య జీవనానికి దూరమౌతున్నాడన్నారు. సమస్యలను తనకంటే వేరుగా చూస్తూ భ్రాంతికి లోనై మదిలోలేని దేవుని తలచుట వలన శాంతి లభించదన్నారు అన్నమాచార్యులు.

 

అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే

వింతవింత విధముల వీడునా బంధములు   ॥పల్లవి॥

 

aMtaraMgamellA SrIhari koppiMchakuMDitE
viMtaviMta vidhamula vIDunA baMdhamulu
pallavi 

Word to Word Meaning:   అంతరంగమెల్లా (aMtaraMgamellA) = entire inner space; శ్రీహరికి (SrIhari ki) = to god Srihari; ఒప్పించకుండితే (oppiMchakuMDitE) = without submitting/ entrusting;  వింతవింత (viMtaviMta) = strange, eccentric; విధముల (vidhamula) = ways; వీడునా (vIDunA) = get unlocked?;  బంధములు (baMdhamulu) = bondages? 

Literal Meaning and Explanation: Without entrusting the entire inner space to God Srihari, there is no (other strange) way the bondages get removed. 

Here Annamacharya is emphatic that there is no other way to live wholesome life, except accepting the will of god as it is. This may appear hackneyed phrase to shod-over detailed explanation. However, request you treat it as it is. 

Obviously will of god is not what one feels. Not what the society teaches; not what scriptures propagate. Being the living present, that cannot be captured in books, pictures and visual media. That is the crux of the issue. 

భావము & వివరణము : మానవులారా మనస్సును పూర్తిగా శ్రీహరి పాలు చేయకుంటే యింకే రకంగాను బంధములు తెగవు.

పరిపూర్ణమైన జీవితానికి జీవనానికి శ్రీహరి తప్పా వేరు దారి లేదని సెలవిచ్చారు. సోది వింటున్నదే కదా, యిందులో కొత్తేముందీ అనుకొవచ్చు. ఐనప్పటికీ అందులోని సత్యమును గ్రహించమని ప్రార్ధన. 

దైవము మనమూహించిన దాని కన్నా వేరుగా, సమాజము మనకు నేర్పించిన దానికంటే భిన్నముగా, వేదములు/భగవద్గ్రంధములు చెప్పు దానికి మించి వింతగా ఉండుననీ తెలియండి. అద్దానిని  పుస్తకములలో, చిత్రములలో, దృశ్య మాధ్యమములలో ఒడిసి పట్టుట అసాధ్యమని గ్రహించిన చాలును. 

మనుజుఁడై ఫలమేది మఱి జ్ఞానియౌదాఁక

తనువెత్తి ఫలమేది దయగలుగుదాఁక

ధనికుఁడై ఫలమేది ధర్మము సేయుదాఁకా

పనిమాలి ముదిసితే పాసెనా భవము   ॥అంత॥

 

manujuDai phalamEdi ma~ri j~nAniyaudAka
tanuvetti phalamEdi dayagalugudAka
dhanikuDai phalamEdi dharmamu sEyudAkA
panimAli mudisitE pAsenA bhavamu
aMta 

Word to Word Meaning:  మనుజుఁడై (manujuDai ) = being human; ఫలమేది (phalamEdi)= what purpose/utility; మఱి (ma~ri) = unless;  జ్ఞానియౌదాఁక (j~nAniyaudAka)= becomes aware of himself ( do not mistake it with worldly knowledge);   తనువెత్తి (tanuvetti) = being in body ( having come to this earth);  ఫలమేది (phalamEdi) = what purpose/utility; దయగలుగుదాఁక (dayagalugudAka) = without compassion or without love; ధనికుఁడై (dhanikuDai)  = being rich;  ఫలమేది (phalamEdi ) = what purpose/utility; ధర్మము (dharmamu) = prescribed course of conduct, charity;  సేయుదాఁకా (sEyudAkA) = unless performed;   పనిమాలి (panimAli) = without doing anything; ముదిసితే (mudisitE) = become old; పాసెనా (pAsenA) = transcend; భవము (bhavamu) = existence. 

Literal Meaning and Explanation: There is no purpose served by being human unless one is aware of himself. Without the benediction of compassion, it is not life. No utility of accumulating money unless it is for charity. None will transcend to the other side just by virtue of age. 

I think, god works only thru compassion. Therefore has been given such prime importance. Annamcahraya is referring to the following shloka from Bhagavad-Gita, which also states that except the knowledge of the God (awareness), all the other worldly pursuits can been termed as ignorance.  

अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्थदर्शनम् |
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा || 13-12||

adhyātma-jñāna-nityatvaṁ tattva-jñānārtha-darśhanam
etaj jñānam iti proktam ajñānaṁ yad ato ’nyathā
(13-12) 

Purport: Accepting the importance of self-realization, and philosophical search for the Absolute Truth- I (the God) declare this to be the knowledge and what is contrary to these is ignorance. 

భావము & వివరణము : మనిషిగా పుట్టి జ్ఞానము కలగక ప్రయోజనము లేదన్నారు. దయలేని బ్రతుకు నిష్ప్రయోజనమన్నారు. ధర్మము చేయక ధనికుఁడయ్యీ విలువ లేదన్నారు. పనిమాలి ఊరకుంటే వయస్సు పెరుగునే తప్ప మోక్షము కలగదన్నారు. 

భగవంతుని చర్యలన్ని దయ​, వాత్సల్యము, కరుణల మాధ్యముగానే సాగును. అందుకనే దానికి పెద్ద పీట వేసిరి. క్రింది భగవద్గీత శ్లోకాన్ని ఉటంకిస్తూ అన్నమచార్యులు యీ చరణము వ్రాసి వుండవచ్చు. 

శ్రీ భగవానువాచ

శ్లో|| అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్
ఏతద్ జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతోఽన్యథా ।। 13-12 ।।

 

భావము: నిరంతరము అధ్యాత్మ జ్ఞానము (స్పృహ / జాగృతి) కలిగియుండుట, తత్వజ్ఞానము (సత్యము) యొక్క ప్రయోజనము తెలియుట అనునవి జ్ఞానమనియు మరియు ఇవి కానివంతయు (వీనికి వ్యతిరేకమైనది) అజ్ఞానమని చెప్పబడును. 

 

చదివియు ఫలమేది శాంతముగలుగుదాఁకా

పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాఁకను

మదిగల్గి ఫలమేది మాధవుఁ దలఁచుదాఁకా

యెదుట తారాజై తే నేలెనా పరము       ॥అంత॥

 

chadiviyu phalamEdi SAMtamugalugudAkA
pedavetti phalamEdi priyamADudAkanu
madigalgi phalamEdi mAdhavu dalachudAkA
yeduTa tArAjai tE nElenA paramu
aMta

 

Word to Word Meaning: చదివియు (chadiviyu) ఫలమేది(phalamEdi) = what purpose/utility; శాంతముగలుగుదాఁకా (SAMtamugalugudAkA) పెదవెత్తి (pedavetti) = by opening the lips; ఫలమేది (phalamEdi) = what purpose/utility; ప్రియమాడుదాఁకను (priyamADudAkanu) = unless they are pleasing words;   మదిగల్గి (madigalgi)  = keeping in memory; ఫలమేది(phalamEdi) = what purpose/utility; మాధవుఁ (mAdhavu) = God; దలఁచుదాఁకా (dalachudAkA) = remember; యెదుట (yeduTa) = in front of us (in this world) తా (tA)=that man; రాజై తే (rAjai tE) = may be king;  నేలెనా (nElenA) = Will he rein; పరము (paramu) = the other world? 

Literal Meaning and Explanation: What use is of education unless one has learnt to be calm? What use is of moving the lips unless it is pleasing to the listeners?  What use is of keeping god in memory, unless he is in your consciousness!! What use is of being a king unless it provides impetus to the other world? 

What education we pursued and pursuing is teaching us to be calm within?  All our present education is to manoeuvre information to one’s advantage. This leads to lot of effort and generates turbulence (in the mind). Annamayya is asserting that it is not education. What a waste of time as it does not serve its purpose! 

Why read, memorise and recite the names of gods, hymns and scriptures, unless one has put god in his consciousness. 

See the following from Bhagavad-Gita on importance of speech. It goes a step forward to state that truthful and beneficial conversation is declared as the meditation in speech. 

अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं यत् |
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते || 17-15||

anudvega-karaṁ vākyaṁ satyaṁ priya-hitaṁ cha yat
svādhyāyābhyasanaṁ chaiva vāṅ-mayaṁ tapa uchyate
(17-15)

Purport: A conversation resulting from regular practice and internal discipline that do not cause distress, truthful and beneficial is declared as the meditation in speech. 

భావము & వివరణము : మనశ్శాంతి కలిగించని విద్య కూడా విద్యేనా? ఇతరులకు మేలుచెయ్యని మాటలు పెదవి దాటవచ్చా? నీవు మాధవుని నిలిపేది మనస్సులోనా​? నాలుకమీదా? ప్రపంచములో ఇక్కడ రాజు అవ్వచ్చేమో! అటువైపు (మరణానికి అవతల) రాజు అవుతాడా? ( కాడు). 

ఇక్కడ మనము నేరుస్తున్న యే విద్యలు మనశ్శాంతిని కలిగిస్తున్నాయి? గమనించి చూస్తే ఈనాటి విద్యలన్ని అందుబాటులోని  సమాచారమును  తన మేలు కోసము యుక్తితొ మలచుకొనునట్టివే. అట్టి విద్యలు చాలా శ్రమతో కూడినట్టివి, మనస్సులో గందరగోళము సృష్టించునవీను. అన్నమయ్య అవి విద్యలేనా అని ప్రశ్నిస్తున్నాడు. మానవులు చాలా శ్రమించి నేర్చు విద్యలు కాలాయాపనయే అని భావము. 

మదిలోలేని దేవుని పేరు ఉచ్చరించుట దేనికో? వేలాది నామాలు కంఠతా పట్టుటెందుకో? పురాణాలు చదువుటెందుకో? (వట్టి కంఠ శోష యని అర్ధము) 

ఇక పోతే క్రింది భగవద్గీత శ్లోకములో  మృదు భాషణమును వాచికమైన తపస్సు అనిరి. అంతకుమించి చెప్పనేలా? 

శ్రీ భగవానువాచ

శ్లో|| అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం యత్  
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।। (17-15)।।

భావము: ఇతరులను బాధింపనిదీ, సత్యమూ, ప్రియమునూ, హితమూ అయిన సంభాషణ, అనుశాసనము అభ్యసించడమూ ఇది వాచికమైన తపస్సు. 

 

పావనుఁడై ఫలమేది భక్తిగలిగినదాఁకా

జీవించేటిఫలమేది చింతదీరుదాఁకను

వేవేల ఫలమేది శ్రీవేంకటేశుఁ గన్నదాఁకా

భావించి తా దేవుఁడై తేఁ బ్రత్యక్షమవునా         ॥అంతా॥

 

pAvanuDai phalamEdi bhaktigaliginadAkA
jIviMchETiphalamEdi chiMtadIrudAkanu
vEvEla phalamEdi SrIvEMkaTESu gannadAkA
bhAviMchi tA dEvuDai tE bratyakshamavunA
aMtA 

Word to Word Meaning: పావనుఁడై (pAvanuDai) = by being clean;  ఫలమేది (phalamEdi) = what purpose/utility; భక్తిగలిగినదాఁకా (bhaktigaliginadAkA) = without true devotion (to god); జీవించేటి (jIviMchETi) = continuance of life; ఫలమేది = what purpose/utility;  (phalamEdi) చింతదీరుదాఁకను (chiMtadIrudAkanu) = with no problems, queries, doubts;  వేవేల (vEvEla) = multiple;  ఫలమేది (phalamEdi) = what purpose/utility; శ్రీవేంకటేశుఁ (SrIvEMkaTESu)  గన్నదాఁకా (gannadAkA) = actually feel in your heart;  భావించి (bhAviMchi) = by assuming;  తా (tA) = that person; దేవుఁడై తేఁ (dEvuDai tE) = feels equal to god; బ్రత్యక్షమవునా (bratyakshamavunA) = will he be given audience? (Obviously not). 

Literal Meaning and Explanation: no purpose served by being clean unless it is embraced by devotion; no use of living a life with many problems/queries/doubts; no purpose for the life served without finding the god in your heart. Finally, where is the question of deliverance to those who assume themselves to be equal to god? 

By saying what is cleanliness without matching devotion in the mind?  Annamacharya is asserting direct connection between the body and the mind. He is questioning how one can be clean while the other is not. As I had said, he always advocated the wholeness (body and soul temple) of life. 

Most notable statement is that we live with problems. We feel they shall get solved with time. We wait for the solutions. We wait for god. Annamacharya doubting is it life to live with multitude of problems? 

He is hinting that we are merely continuing existence without actually living. Where do the problems reside? Obviously they are in the memory. Such a co-existence with problems obviously means partial submission to God. This part time employment with GOD is not life but mere subsistence. Thus you can appreciate profound understanding Annamcharya embedded in his verses.   

Is there a single person (in this world) without problems? If we keep fighting with the problems, we lose time.   Therefore only Annamacharya is professing to set aside all those problems and submit to the god by declaring అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించు aMtaraMgamellA SrIhari koppiMchu. But you may say, first resolve all my problems. I shall submit. Annamayya had explained it in the verse "కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు"kaDaluDipi nIrADagA dalachuvAralaku by stating  (dAhamaNagina venuka tatva merigedananna / dAhamElaNagu tA tatva mE merugu "దాహమణఁగినవెనుక తత్వమెరిఁగెదనన్న / దాహమేలణఁగు తా తత్వ మే మెరుఁగు") Such conditional submission is still partial and therefore not useful. Human life is Not a transaction in which man agree to do something in return of something. Annamayya asserted here that we must see this fact and quickly submit to god.

Jiddu Krishnamurti, in almost all his talks, commented that effort to live is not life at all. He also talked of wholeness of life.

What Annamacharya is arriving at in this beautiful verse? Body, mind and God are one and the same thing. Because of ignorance man treats them separately and lands into problems.

Finally let us remember great words from Buddha: “Better than a thousand hollow words, is one word that brings peace.” 

భావము & వివరణము : బాహ్యముగా ఎంత శుభ్రముగా నున్నప్పటికీ అంతరంగమున భక్తిలేకున్న నేమి ఫలము? చింతాక్రాంతుడై జీవించుచున్ననూ నేమి ప్రయోజనము?  శ్రీవేంకటేశుఁని మదిలో గనుదాకా నిజమైన ఫలమేది? తానే దేవుడినని విర్రవీగినాను బ్రత్యక్షమగునా? (కాడు). 

అంతరంగములో లేని శుభ్రత బహ్యమైన శుభ్రతతో మరుగు పరచవచ్చునా?  అన్నమయ్య బాహ్య నిమ్న సౌందర్యములను, ఒకదానితో నొకటి పెనవేసుకున్నవని చెప్పుచున్నాడు. మానవుడు జీవితములో బాహ్య, అంతర్గత సమతుల్యము లేక  సమైక్య జీవనానికి దూరమౌతున్నాడని సూచించారు. 

సమస్యలతో సతమౌతూ గడుపుటయూ జీవనమేనా? సమస్యలు యెప్పుడు మటుమాయమౌతాయో? కాలమే సమాధానము చెప్పునని ఊరకుండిన తీరునా? భగవంతుడే తీర్చవలేనని మిన్నకుండిన తీర్చునా? సమస్యలుయెప్పటికప్పుడు విడిపించు విద్య యెద్ది? 

నిత్యమూ సమస్యలతో సహ జీవనము చేయుట అలవాటై అవి లేని జీవితాన్ని ఊహింపలెకున్నామా? సమస్యలు యెక్కడ నివసిస్తాయో? మదిలోనే కదా! అంటే అంతరంగము నందు సమస్యలతో పాటు, దేవుణ్ణి కూడా సర్దుకోమంటున్నామా? ఇటువంటి పాక్షికమైన సమర్పణలతో గడుపు  జీవనము కేవలము పొద్దుపుచ్చడమే కానీ జీవించడము కాదని అన్నమయ్య నొక్కి చెబుతున్నారు. 

జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా దాదాపు ప్రతీ ప్రసంగంలోను సమస్యలతో జీవించుట జీవనమే కాదని ప్రకటించేవారు. 

సమస్యలు లేని మనిషి లేడన్నది నిర్వివాదాంశం. సమస్యలతో యుద్ధము చేస్తూ కాలాతీతము చెసుకోకుండా వాటిని పక్కకు నెట్టేసి అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించమంటున్నారు అన్నమయ్య​. ముందు నా సమస్యలు తీర్చెయ్యి. తరవాత నేను సమర్పించుకుంటాను అంటే లాభము లేదని "దాహమణఁగినవెనుక తత్వమెరిఁగెదనన్న / దాహమేలణఁగు తా తత్వ మే మెరుఁగు" అని "కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు" అని ముందే సెలవిచ్చారా మహానుభావులు. 

సమ్యక్దర్శనం (దేహము, మనస్సు, భగవంతుడు ఏకమేనని) మనిషి గ్రహించవలెనని యీ అందమైన కీర్తన సందేశము.  చివరిగా  చిన్నయసూరి గారి యీ వాక్యాన్ని మననము చేసుకుంటూ ముగిద్దాము. "ఏవాఁడు జీవింప ననేకులు జీవింతురు, వాని మనుగడయే సఫలము. వాఁడొకఁడు జీవించువాఁడు."

 

zadaz

Reference: copper leaf 89-3, volume: 1-437

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...