Sunday 4 July 2021

67. ఏడే జేనలు యీదేహంబును (EDE jEnalu yIdEhaMbunu)

 

ANNAMACHARYA

67. ఏడే జేనలు యీదేహంబును 

Introduction: in this yet another marvellous verse, Annamacharya is asking us to find who truly we are? He starts by stating that we don’t know ourselves, though body is only seven hand span lengths long.

Then he parries a question on what your time is? What your age is?  Are they as simple as they appear?  Do we really comprehend these questions?   .

ఉపోద్ఘాతము: ఈ మరో అద్భుతమైన కీర్తనలో, అన్నమాచార్య మనం నిజంగా ఎవరో కనుగొనమని అడుగుతున్నాడు. శరీరం పొడుగు కేవలము యేడే జేనలున్నప్పటీకీ, అదేమిటో మనకు తెలియదంటూ  ప్రారంభిస్తాడు  

అప్పుడు ఆయన నాకాలము ఏమిటి? అనే ప్రశ్నను సంధిస్తాడు. నా  ప్రాయము ఏమిటి? అని అడుగుతాడు! అవి కనిపించినంత సులభమేనా? ఈ ప్రశ్నలలోని ఆంతర్యమును మనం నిజంగా గ్రహించామా? 

కీర్తన

ఏడే జేనలు యీదేహంబును

యేడా నిఁకమరి యెరఁగము నేము  ॥పల్లవి॥

నిండును జలధులు నిమిషమాత్రమున

నిండియు నిండదు నెఱి మనసు
పండును భువిఁగల పంటలన్నియును
పండదు నాలోఁ బాపపు మనసు       ॥ఏడే॥

పట్టవచ్చు నల పారేటి పామును

పట్టరాదు నాపాయము
అట్టే ఆరును అనలము నీటను
యెట్టైన నారదు యీకోపంబు           ॥ఏడే॥ 

కానవచ్చు నదె ఘనపాతాళము

కానరాదు నాకాలము
శ్రీనగవిహార శ్రీవేంకటేశ్వర
సోనలఁ బుట్టిన సుద్దులు నివిగో       ॥ఏడే॥ 

Details and Explanations:


ఏడే జేనలు యీదేహంబును

యేడా నిఁకమరి యెరఁగము నేము ॥పల్లవి॥

 

EDE jEnalu yIdEhaMbunu
yEDA nikamari yeragamu nEmu
pallavi 

Word to Word meaning:  ఏడే (EDE) = only seven;  జేనలు (jEnalu)  = hand spans; యీదేహంబును (yIdEhaMbunu) = this body;  యేడా(yEDA) = where?  నిఁకమరి (nikamari) = yet; యెరఁగము (yeragamu) = not know, not understand;  నేము (nEmu) = we.              

Literal meaning and Explanation: this body is only of seven hand spans long. Yet we don’t understand (this small thing). 

Annamayya did not close his eyes and perform his penance. He is a sage who opened his eyes for the benefit of the public. Can you imagine, how does Annamayya know what we do not know about ourselves?

What do we know about ourselves other than few things we learnt by rote. Do we factually know how much vitamins are required for the body or it is only an advice from the specialists.  If we go like this we find most of our knowledge is secondary or tertiary. 

When we go into these things impartially these likes ( or dislikes) really do not have  a basis, but a feeling loosely or strongly  we associate with. Similarly all our actions, when observed closely, are based on security and ignorance. The logics we keep preaching are merely at the periphery. They are no avail in our journey of life, except to provide few physical comforts.  

Now, I hope you will appreciate the words యేడా నిఁకమరి యెరఁగము నేము (yEDA nikamari yeragamu nEmu) At this juncture let us remember the words of Buddha as below.

He who conquers himself is greater than one who conquers thousands of men in battle. Even Brahma cannot turn that success into defeat when you train yourself.”- Buddha (free translation) 

భావము మరియు వివరణము: శరీరం ఏడు జేనల పొడవు మాత్రమే. ఐనా ( చిన్న విషయం) ఇంకా మనకు అర్థం కాదే. 

ముక్కు మూసుకుని తపస్సు చేసే ముని కాడు అన్నమయ్య​. కళ్ళుతెరుచుకున్న జ్ఞాని. మనగురించి మనకే తెలియదన్న విషయం అన్నమయ్యకెలా తెలిసిందో? 

బట్టీపట్టి నేర్చుకున్న కొన్ని విషయాలు తప్ప మన గురించి మనకు ఏమి తెలుసు? శరీరానికి ఎంత విటమిన్లు అవసరమో మనకు వాస్తవంగా తెలుసా లేదా అది నిపుణుల సలహా మాత్రమేనా? మనం ఇలా అనుకుంటూ పోతే మన జ్ఞానం చాలావరకు ద్వితీయ లేదా తృతీయ శ్రేణి అని మనకు తెలిసిపోతుంది. 

మనము నిష్పాక్షికంగా ఈ విషయాలలోకి వెళ్ళినప్పుడు ఈ ఇష్టాలు (లేదా అయిష్టాలు) నిజంగా ఒక ఆధారాన్ని కలిగి ఉండవు, అవి మనం వదులుగా లేదా బలంగా అనుబంధించిన భావన లంతే. అదేవిధంగా మన చర్యలన్నీ నిశితంగా గమనించినప్పుడు భద్రత మరియు అజ్ఞానం మీద ఆధారపడి ఉంటాయి. మనము వాడే తర్కమంతా పైపైనే ఊహల్లో ఉంటుంది. అది కొన్ని శారీరక సుఖాలను కల్పించడంలో తప్ప, మన జీవిత గమనానికి  పెద్దగా ప్రయోజనం కలిగించదు. 

ఇప్పుడు, మీరు అన్నమయ్య చెప్పిన "యేడా నిఁకమరి యెరఁగము నేము" అన్నదాన్ని మరింతగా విచారించ​ గలరని అనుకొంటాను. ఈ సందర్భంలో బుద్ధుని క్రింది మాటలను గుర్తుకు తెచ్చుకుందాము. 

"యుద్ధంలో వేలాది మంది మనుషులను జయించే వ్యక్తి కంటే  తన్ను తాను జయించినవాడు గొప్పవాడు. మీనుంచే మీరే శిక్షణ పొందినప్పుడు విజయాన్ని బ్రహ్మ కూడా  తిరిగి ఓటమిగా మార్చలేడు. -గౌతమ బుద్ధుడు (స్వేచ్ఛానువాదం)

 

నిండును జలధులు నిమిషమాత్రమున

నిండియు నిండదు నెఱి మనసు

పండును భువిఁగల పంటలన్నియును

పండదు నాలోఁ బాపపు మనసు     ॥ఏడే॥

 

niMDunu jaladhulu nimishamAtramuna
niMDiyu niMDadu ne~ri manasu
paMDunu bhuvigala paMTalanniyunu
paMDadu nAlO bApapu manasu
EDE

 Word to Word meaning: నిండును (niMDunu) = filled up;  జలధులు (jaladhulu)  = seas; నిమిషమాత్రమున (nimishamAtramuna) = in minutes time; నిండియు (niMDiyu) = even after filling; నిండదు (niMDadu) = do not get filled; నెఱి (ne~ri)  = వక్రత, Crookedness; మనసు (manasu) = mind; పండును (paMDunu) = yield;  భువిఁగల (bhuvigala) = on this earth;  పంటలన్నియును (paMTalanniyunu) = All corps; పండదు (paMDadu) = do not yield; నాలోఁ (nAlO) = in myself;  బాపపు (bApapu)  = sinful; మనసు (manasu) = mind;              

Literal meaning and Explanation: Even the great oceans fill up in a matter of minutes (to the brim); My crooked mind, though filled, always  remain unsatisfied; All the crops on earth will one day yield. Yet this sinful mind, never yielding a result. 

Just understand that .Annamacharya is talking of psychological time. If we have to draw a manual architecture drawing it takes about 2-5 days. The same takes about 5 minutes to print on modern printers. If we are waiting for the printout, it appears that the present day printers are too slow and often we are so impatient in those five minutes. 

What he is arriving at is the mind creates an expectation. Any action/result falling below that expectation, we feel agitated. Even when expectations are met then the aspiration bar will be rise further. That is the reason for man searching for new experiences. In fact these experience(s) we are seeking is not new, but old wine in a new bottle.

You will appreciate the apt word Crooked Mind used by Annamacharya. 

భావము మరియు వివరణము: గొప్ప మహాసముద్రాలు కూడా నిమిషాల వ్యవధిలో (అంచు వరకు) నిండిపోతాయి; నా వక్రపు మనస్సు, నిండినప్పటికీ, ఎల్లప్పుడూ నెరవేరనిదిగా అసంతృప్తిగా ఉంటుందే; భూమిపై పంటలన్నీ ఏదో ఒక రోజు దిగుబడిని ఇస్తాయి. ఐనప్పటికీ ఈ పాపపు మనస్సు, ఎప్పుడూ ఫలితం ఇవ్వదే. 

అన్నమాచార్య మానసిక సమయం గురించి మాట్లాడుతున్నారని అర్థం చేసుకోండి . ఒక ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ గీయవలసి వస్తే 2-5 రోజులు పడుతుంది. ఆధునిక ప్రింటర్లలో ముద్రించడానికి 5 నిమిషాలు పడుతుంది. ప్రింటౌట్ కోసం ఎదురుచూస్తుంటే, ప్రస్తుత ప్రింటర్లు చాలా నెమ్మదిగా ఉన్నాయని తరచుగా మనం అసహనానికి గురవుతాము. అసహనానికి అసలు కారణం రెండు రోజులో ఐదు రోజులో పట్టిన డ్రాయింగు మీద కాదు, 5 నిముషాలు తీసుకున్న ప్రింటరు మీద​. ఈ రకమైన అసహనం మనందరికీ పరిచితమే.

మనస్సు ఒక ఆపేక్షను సృష్టిస్తుంది. ఏదైనా చర్య / ఫలితం ఆపేక్ష అంచనాల కంటే తక్కువగా ఉంటే ఆందోళన చెందుతాము. ఒకవేళ అంచనాలను అందుకున్నా తరువాత ఆపేక్ష ఇంకోమెట్టు పైకెక్కును. ఆపేక్ష వైఫల్యం వరకు దారి తీసి మనిషి కొత్త అనుభవాల కోసం వెతకడానికి కారణం అవుతుంది. మనం కోరుకుంటున్న అనుభవం నిజంగా కొత్తది కాదు, కొత్త సీసాలో పాత సారానే

అన్నమాచార్యులు  ఉపయోగించిన నెఱి మనసు (Crooked Mind) ఎంత ఖచ్ఛితంగా అమరిందో గమనించండి.

 

పట్టవచ్చు నల పారేటి పామును

పట్టరాదు నాపాయము

అట్టే ఆరును అనలము నీటను

యెట్టైన నారదు యీకోపంబు          ॥ఏడే॥

 

paTTavachchu nala pArETi pAmunu
paTTarAdu nApAyamu
aTTE Arunu analamu nITanu
yeTTaina nAradu yIkOpaMbu
EDE 

Word to Word meaning:  పట్టవచ్చును (paTTavachchunu) = possible to catch; అల (ala) = that; పారేటి (pArETi ) = moving; పామును (pAmunu) = (venomous) snake; పట్టరాదు (paTTarAdu) = not possible to hold;   నాపాయము (=నా పాయము = నా  ప్రాయము nApAyamu) = my age;  అట్టే (aTTE)  = simply; ఆరును (Arunu)  = get extinguished; అనలము (analamu) = fire;  నీటను (nITanu) = by water;  యెట్టైన (yeTTaina) =whatever way; నారదు (nAradu) = donot get extinguished; యీకోపంబు (yIkOpaMbu)      = this anger.          

Literal meaning and Explanation: One can catch a moving venomous snake. However, I am unable hold on to my age. Any fire can be extinguished by applying water. Whereas, my anger somehow cannot be put down by any trick/method.  

Anger is one of the major problems of man. It makes man to take impulsive decisions in unforeseen circumstances. The man found medicines for very difficult diseases, but could not find an antidote for anger. The short poem from Sumati Satakam is worth mentioning here. 

Tana kōpame tana śatruvu,

tana śāntame tanaku rakṣa, daya cuṭṭambau
tana santōṣame svargamu,
tana duḥkhame naraka maṇḍru tathyamu sumati! 

(Purport: O Wiseman! For sure, your anger is your enemy; calmness is your security. Compassion is your friend. . Your happiness is equal to heaven. Your grief/misery is hell.) 

భావము మరియు వివరణము: కదిలే విషపూరితమైన పామును పట్టుకోవచ్చును. అయితే, నేను నా వయస్సును అదిమి పట్టలేకున్నానే. నీటిని చిమ్మడం ద్వారా ఏదైనా మంటను చల్లార్చవచ్చు. అయితే, నా కోపాన్ని ఉపాయం / పద్ధతి ద్వారా అణచివేయలేనే. 

మనిషి యొక్క ప్రధాన సమస్యలలో కోపం ఒకటి. అనుకోని పరిస్థితులలో తక్షణ నిర్ణయాలు తీసుకోవటానికి ఇది మనిషిని ప్రేరేపిస్తుంది. మనిషి చాలా కష్టమైన వ్యాధులకు ఔషధాలను కనుగొన్నాడు, విచిత్రంగా  కోపం కోసం విరుగుడు కనిపెట్టలేక పోయాడు. క్రింది సుమతీ శతక పద్యం సందర్భోచితంగా ఉంటుంది.

తన కోపమె తన శత్రువు,

తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతి! 

 

కానవచ్చు నదె ఘనపాతాళము

కానరాదు నాకాలము

శ్రీనగవిహార శ్రీవేంకటేశ్వర

సోనలఁ బుట్టిన సుద్దులు నివిగో      ॥ఏడే॥

 

 

kAnavachchu nade ghanapAtALamu
kAnarAdu nAkAlamu
SrInagavihAra SrIvEMkaTESvara
sOnala buTTina suddulu nivigO
EDE 

Word to Word meaning:  కానవచ్చును (kAnavachchunu)  (By efforts) might see; అదె (ade) = that; ఘనపాతాళము (ghanapAtALamu) = PATALA, the seventh world below the earth.; కానరాదు (kAnarAdu) = but not possible to find;  నాకాలము (nAkAlamu)  = my time; శ్రీనగవిహార (SrInagavihAra;) = O dweller of the mountain called SREE NAGAMU శ్రీవేంకటేశ్వర (SrIvEMkaTESvara) = Lord Venkateswara; సోనలఁ (sOnala) = light drizzle;  బుట్టిన (buTTina) = originated;  సుద్దులు (suddulu) = good words; నివిగో (nivigO) = Here they are!!           

Literal meaning and Explanation: Though difficult, one may be able to dig and find the seventh world ( below earth) called PATALA, but it’s impossible to understand what my time is. O dweller of the mountain called SREE NAGAMU, Lord Venkateswara, we heard your great stories which are showered on us like rain. 

What is the meaning of DO NOT SEE MY TIME(కానరాదు నాకాలము)? He is indicating that no one knows available time at hand (before death). Please consider the small story below. 

One wise person gets imprisoned. Unfortunately he was also sentenced to death. However he would be set free, if he could tell on what day he would be hanged? 

The prisoner replies like this. “Sir, you will not hang me on Friday being holy day. Therefore, you should hang me on Thursday.” 

But sir now that I know it is Thursday, you will neither hang me on Thursday.  Therefore it should be Wednesday. Now by the Way I eliminated Thursday, I have to eliminate Wednesday, Tuesday and  Monday  as well. By this Sir, I feel, you will hang me today”. King was pleased with his answer and sets him free. 

The logic of the prisoner applies to us as well. 

What does this stanza imply? The first two lines indicate he is still in conscious state. It is normal human experience. The meaning of these two lines is quite easy for us to grasp. 

The latter two lines indicate Annamayya slipped into state he does not know what is happening. What he could witness is serene set where the divine shower passed all over his body releasing him into a blissful state. 

భావము మరియు వివరణము: కష్టమే అయినప్పటికీ, పాతాళము అని పిలువబడే ఏడవ దిగువప్రపంచాన్నీ త్రవ్వి కనుగొనవచ్చేమో కాని నా సమయం ఏమిటో అర్థం చేసుకోవడం అసాధ్యం. శ్రీ నగము అని పిలువబడే పర్వత వాసియైన వెంకటేశ్వర!! నీ గొప్ప కథలు వర్షం లాగా మాపై కురుస్తుంటే  విన్నాము. (నీ మహిమలుఅనంతం.) 

కానరాదు నాకాలము యొక్క అర్థం ఏమిటి? ఇంకనూ మిగిలి ఉన్న జీవిత కాలము ఎంతో ఎవరికీ తెలియదని ఆయన సూచిస్తున్నారు. క్రింది చిన్న కధను చూడండి. 

ఒక తెలివైన వ్యక్తి జైలు పాలవుతాడు. దురదృష్టవశాత్తు అతనికి మరణశిక్ష కూడా విధించబడింది. ఏది ఏమైనప్పటికీ అతన్ని   ఎప్పుడూ ఉరితీస్తారో చెప్పగలిగితే విడిచిపెడతామన్నాడు రాజు. 

ఖైదీ ఇలా సమాధానమిస్తాడు. అయ్యా, శుక్రవారం పవిత్ర దినం కావడంతో ఆ రోజు మీరు నన్ను ఉరి తీయరు. అందువల్ల, మీరు నన్ను గురువారం ఉరి తీయాలి.” 

"రాజా! ఇప్పుడు నాకు గురువారం అని తెలుసు కనక, మీరు గురువారం నన్ను ఉరి తీయరు. అందువల్ల అది బుధవారం అవ్వాలి. ఇప్పుడు నేను గురువారం తొలగించినతట్లే బుధవారం, మంగళవారం మరియు సోమవారాల్ని కూడా తొలగించాలి. ఇదంతాచూస్తే అయ్యా!! రోజే నన్ను ఉరితీస్తారని నేను భావిస్తున్నాను" అంటాడు. రాజు అతని సమాధానంతో సంతోషించి అతన్ని విడిపించాడు. 

పైన కధలోని ఖైదీ యొక్క తర్కం మనకూ వర్తిస్తుంది. 

చరణం ఏమి సూచిస్తుందో? మొదటి రెండు పంక్తులు అన్నమాచార్య ఇంకా చేతన స్థితిలో ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఇది సాధారణ మానవ అనుభవం. రెండు పంక్తుల అర్థం మనకు గ్రహించడం చాలా సులభం. 

తరువాతి రెండు పంక్తులు అన్నమయ్య తనకు ఏమి జరుగుతుందో  తెలియని స్థితిలోకి వెళ్ళారని అనుకోవచ్చు.  ప్రశాంతమైన వాతావరణంలో తేలియాడు చున్నాడనీ, వాన చినుకుల  వంటివి అతని శరీరం అంతటా తాకగా ఆనందకరమైన స్థితిలోకి వెళ్ళి ఈ పలుకులను  వినిపిస్తున్నారనీ తెలుస్తోంది.

zadaz

 

 

Reference: Copper Leaf: 256-6, Volume: 3-325

 

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...