Sunday 19 December 2021

100. కలిగె నిదె నాకు కైవల్యము (kalige nide nAku kaivalyamu)

 ANNAMACHARYA

100. కలిగె నిదె నాకు కైవల్యము

(kalige nide nAku kaivalyamu) 

Introduction: In this my 100th commentary, presenting something special on Annamacharya. This extraordinary Philosopher in this poem announced that he has been liberated. Annamacharya attained a rare position like that of Sanakadi rishis (सनकादि ऋषि). India shall be proud of producing many such great sages. We must take this as a matter-of-fact statement like the one made by Jiddu Krishnamurti below.

“I do not want you to accept what I say because I assert that I have found and attained to that harmony. I assert it only as I assert that it is a lovely day, and because it is within the reach of every individual and every individual must attain to that fulfilment.” (Early writings, Benares, India, 1929) 

Let me put a string of statements of Annamacharya to highlight his efforts to bring objective outlook in his fellow men in achieving the stated harmony between what constitutes inside and outside. Each and every life that is delivered into this world is precious and has a purpose. And treat it the same way (Implied meaning of dibbalu veTTuchu dElina didivO ubbu nITipai noka haMsA = దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో /ఉబ్బు నీటిపై నొక హంస) Why so many people undertake to become rich.  These riches, when observed dispassionately are truly mischievous (ETiki dalakeda riMdarunu / gATapu sirulivi kAnaro prajalu =ఏఁటికి దలఁకెద రిందరును / గాఁటపు సిరులివి కానరొ ప్రజలు). What is the use of living a life with great effort; how is it different from death? Is it not better to dissolve/reduce one’s own ego? (chAla novvi sEyunaTTi janmamEmi maraNamEmi / mAlugalapi doratanaMbu mAnpu TiMta chAladA  = చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి / మాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా?)

What is a sinful act? What is virtuous act? Aren’t  both these causing myriad bonds? It doesn't matter, whether the chains are made of gold or iron as long as they are preventing from seeing upwards. (పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు / కడపరానిబంధములకుఁ గారణంబులైనవి యెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమి / మెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి puDami bApakarmamEmi puNyakarmamEmi tanaku / kaDaparAni baMdhamulaku AraNaMbulainavi yeDapakunna pasiDi saMkelEmi yinupasaMkelEmi / meDaku dagiliyuMDi yepuDu mIduchUDarAnivi) While our life itself is an enchantment, it’s paradoxical that we attend Magic shows. While our own bondages are very many, it’s ironical that we keep enjoying performances of a person enacting many faces in the same breath. (యీడనే సంసార మిదె యింద్రజాలమై యుండఁగ / యేడకైనాఁ జూడఁ బోయే మింద్రజాలము / పాడితో నా పట్టుగులే బహురూపాలై యుండఁగ వేడుకయ్యీ బహురూపవిద్యలు చూడఁగను yIDanE saMsAra mide yiMdrajAlamai yuMDaga / yEDakainA jUDa bOyE miMdrajAlamu / pADitO nA paTTugulE bahurUpAlai yuMDaga / vEDukayyI bahurUpavidyalu chUDaganu )

You always approve and enjoy what you should not; you always hoodwink; Disregarding the true devotees here, why do you look elsewhere? (kAnide mechchEvu kapaTAlE yichchEvu /kAnIlE kAnIlE kaliyugamA /painidE vEMkaTapati dAsuluMDaga / kAnavA nI vidEmi kaliyugamA       కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు / కానీలే కానీలే కలియుగమా / పైనిదే వేంకటపతి దాసులుండఁగ / కానవా నీ విదేమి కలియుగమా )   

The ‘other’ state is beyond the pretty imagination, beyond the methods of sacrifice, not a comforting theory to your heart. (adigAka nijamataM badigAka yAjakaM / badigAka hRdayasukha madigAka paramupallavi అదిగాక నిజమతం బదిగాక యాజకం- బదిగాక హృదయసుఖ మదిగాక పరము )   The cruel mind can’t be polished or made to behave as you want. Neither we can judge its depth nor share what’s going on in the mind. (kaMchUM gAdu peMchU gAdu kaDubeluchu manasu / yeMcharAdu paMcharAdu yeTTidO yImanasupallavi కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు / యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు). So many saints have moved the mountains and the sky. Yet they are unable to break the barrier of chores (తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ / గగనము మోచియుఁ గర్మము దెగదా tagu munulu^ Rshulu tapamulu sEyaga / gaganamu mOchiyu garmamu degadA) 

Thus, this thing   కైవల్యము (=Eternal emancipation, liberation) does not have a method, book, or practice. Though Annamacharya brought up in traditional methods, tried his best to be objective and expressed it in many poems so that people could understand what he is arriving at from different perspectives. With this as background, you can imagine how helpful are the poems of Annamacharya in understanding this very complex subject of liberation. 

Annamacharya’s monumental work is a boon to the world. I hope more people will do research and analyse these poems to benefit truth seekers.  I am sure his popularity will rise beyond the borders of India. A day will surely come when he will be referred like we presently do Roman and Greek philosophers.   

ఉపోద్ఘాతము: కీర్తనలో అసాధారణ తత్వవేత్త అన్నమాచార్యులు తాను విముక్తి పొందినట్లు పేర్కొన్నాడు. అన్నమాచార్యులు సనకాది ఋషుల వంటి అరుదైన పదవిని పొందాడు. ఇలాంటి ఎందరో గొప్ప మహర్షులను భారతదేశం ప్రపంచమునకు కానుకగా ఇచ్చింది. దిగువన జిడ్డు కృష్ణమూర్తి చేసిన ప్రకటన లాగా మనం దీనిని యదార్థ ప్రకటనగా తీసుకోవచ్చు. 

నేను చెప్పేది మీరు అంగీకరించాలని నేను కోరుకోవడం లేదు, ఎందుకంటే నేను ఆ సమత్వమును కనుగొన్నాను మరియు సాధించాను. ఇది ఒక మనోహరమైన రోజు అని నేను నొక్కిచెప్పినట్లు మాత్రమే నేను నొక్కి చెబుతున్నాను మరియు ఇది ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటుంది మరియు ప్రతి వ్యక్తి ఆ నెర్పును తప్పక సాధించాలి. (Early writings, Benares, India, 1929). 

అన్నమాచార్యులు తన తోటివారిలో వెలుపల, “లోపల గురించి పారదృశ్య​ దృక్పథాన్ని తీసుకురావడానికి ఆయన చేసిన విశేష ప్రయత్నాలను తెలిపేందుకు అతడి కీర్తనలలోని  కొన్నింటిని మీ ముందు ఉంచుతాను. దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో /ఉబ్బు నీటిపై నొక హంస (ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఈ ప్రపంచంలోకి అడుగిడిన ప్రతి జీవి (జీవితం) విలువైనదే. దాన్ని అపరూపముగా గ్రహించండి) ఏఁటికి దలఁకెద రిందరును / గాఁటపు సిరులివి కానరొ ప్రజలు (ధనముకై ఈ పనులన్నింటినీ ఎందుకు తలకెత్తు కుంటారో? ప్రజలారా! కళ్ళు తెరిచి చూడండి. ఇవి మిమ్మలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.) చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి / మాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా? (ఎంతో శ్రమించి చేయు ప్రస్తుత జీవితానికి, మరణానికి వ్యత్యాసమేమీ? అంతకంటే, కొంత అహంభావం తగ్గించుకోవడం మేలు కాదా?) 

పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు / కడపరానిబంధములకుఁ గారణంబులైనవి యెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమి / మెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి {పాప కర్మమేది; పుణ్య కర్మమేది? రెండూ కూడా బంధాలకు కారణమౌతున్నాయి. తెంపకుండా ఉంటే బంగారు సంకెళ్ళైనా, ఇనుప సంకెళ్ళైనా, నిన్ను పైకి వెళ్ళనివ్వవు. (ఇక్కడే బంధించి ఉంచేస్తాయి).} యీడనే సంసార మిదె యింద్రజాలమై యుండఁగ / యేడకైనాఁ జూడఁ బోయే మింద్రజాలము / పాడితో నా పట్టుగులే బహురూపాలై యుండఁగ వేడుకయ్యీ బహురూపవిద్యలు చూడఁగను {(మన) బ్రతుకే ఇంద్రజాలమయ్యుండగా, అది చాలదనట్లు మనుషులు ఇంద్రజాలము చూడడానికి పొవడము విడ్డూరము కాదా!! మనిషి అనేక రూపాలలో  బంధితుడయ్యుండీ, వేషగాళ్ళు వేసే రూపాలను చూడ్డానికి పొవడము వింత కాదా! }

కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు / కానీలే కానీలే కలియుగమా / పైనిదే వేంకటపతి దాసులుండఁగ / కానవా నీ విదేమి కలియుగమా (ఓ మానవుడా!! మెచ్చరానిది మెచ్చి, కొరగాని కపటాలే  జీవితమని బతుకుతావు. కానీ, ఇక్కడి వేంకటేశుని దాసులను గుర్తించక ఎక్కడెక్కడో తిరుగుతావు.) అదిగాక నిజమతం బదిగాక యాజకం- బదిగాక హృదయసుఖ మదిగాక పరము పరము (మనకు తెలియనిది, అన్యము; మీఁదిది) అనునది మన అభిప్రాయాల (లేదా ఊహల) కంటే వేరుగా, యజ్ఞము/త్యాగముల మీద ఆధారపడకుండా, మానవుని యే చేష్టల మీదా ఆశ్రయించక ఉండి, ఊరట కూడా కలిగించక పోవచ్చు. కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు / యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు (మనిషి మనస్సు కంచూ కాదు, పెంపుడు జంతువులా పెంచడానికీ రాదు, చాలా కఠినమైనది, అది యేమో కూడా తెలియదు, ఇతరులతో పంచడానికీ వీలులేదు)  తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ / గగనము మోచియుఁ గర్మము దెగదా (మునులు‌ ఋషులు తగు విధములుగా తపములు చేసిననూ, పర్వతాలు, అకాశము కదిలించినప్పటికీ కర్మము తెగక ఉండుట తెలియుడీ) 

పైన ఉదాహరణల నుండి, ఈ కైవల్యము సాధించుటకు ఒక పద్ధతి, మార్గము లేదా అభ్యాసము లేదని తెలియును. అన్నమాచార్యులు సంప్రదాయ సిద్ధమైన పద్ధతులలో పెంచబడిన వారైనప్పటికీ, లక్ష్య సాధనలో  ప్రజలకు ఆ అనుభవమునకు అందని స్థితిని (కైవల్యమును) నిష్పాక్షికతతోనూ, వాస్తవికతతోనూ వివరించడానికి వేలాది విధాలుగా ప్రయత్నించారు. అనేక కీర్తనలలో దానిని వ్యక్తపరిచి, వివిధ దృక్పధములలో అందించి సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చేశారు. ఈ నేపథ్యంలో, చాలా సంక్లిష్టమైన  విముక్తి, భక్తి అను అంశాలను అర్థం చేసుకోవడంలో అన్నమాచార్యుల కీర్తనలు  ప్రతీ ఒక్కరికీ ఎంతగా ఉపయోగపడతాయో చెప్పనక్కరలేదు. 

అన్నమాచార్యుల  అసమాన ప్రతిభ ప్రపంచానికే ఒక బహుమతి. సత్యాన్వేషకులకు ప్రయోజనం చేకూర్చేలా ఎక్కువ మంది ఈ కీర్తనలను పరిశోధించి విశ్లేషిస్తారని కోరుకుంటాను. అతని జనాదరణ ఖచ్చితంగా భారతదేశ సరిహద్దులను దాటి పెరుగుతుందని భావిస్తాను. రోమన్ మరియు గ్రీకు తత్వవేత్తలను మన నిత్య జీవితంలో ఉదాహరించు స్థాయికి అన్నమాచార్యులు ఎదుగుతారని ఆశిస్తాను.

 

కీర్తన:

కలిగె నిదె నాకు కైవల్యము

తొలుత నెవ్వరికి దొరకనిది           ॥పల్లవి॥ 

జయ పురుషోత్తమ జయ పీతాంబర

జయ జయ కరుణాజలనిధి
దయ యెఱంగ నే ధర్మము నెఱంగ నా-
క్రియ యిది నీ దివ్యకీర్తనమే         ॥కలి॥ 

శరణము గోవింద శరణము కేశవ

శరణు శరణు శ్రీజనార్దన
పరమ మెఱంగను భక్తి యెఱఁగను
నిరతము నాగతి నీ దాస్యమే        ॥కలి॥ 

నమో నారాయణ నమో లక్ష్మీపతి

నమో పుండరీకనయనా
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయింకర్యమే        ॥కలి॥

kalige nide nAku kaivalyamu

toluta nevvariki dorakanidi         pallavi 

jaya purushOttama jaya pItAMbara

jaya jaya karuNAjalanidhi
daya ye~raMga nE dharmamu ne~raMga nA-
kriya yidi nI divyakIrtanamE        kali 

SaraNamu gOviMda SaraNamu kESava

SaraNu SaraNu SrIjanArdana
parama me~raMganu bhakti ye~raganu
niratamu nAgati nI dAsyamE      kali 

namO nArAyaNa namO lakshmIpati

namO puMDarIkanayanA
amita SrIvEMkaTAdhipa yide nA
kramamellanu nIkayiMkaryamE  kali

Details and Explanations: 

కలిగె నిదె నాకు కైవల్యము

తొలుత నెవ్వరికి దొరకనిది    ॥పల్లవి॥ 

kalige nide nAku kaivalyamu

toluta nevvariki dorakanidi   pallavi 

Word to Word meaning: కలిగెను (kaligenu) = Happened;  ఇదె (ide) = this;  నాకు (nAku) = to me;  కైవల్యము (kaivalyamu) = ముక్తి, మోక్షము, Eternal emancipation, liberation;  తొలుత (toluta) = first, from the beginning;   నెవ్వరికి (nevvariki) = none; దొరకనిది (dorakanidi) = received, bestowed; 

Literal meaning: I am a liberated soul. No one was bestowed this before. 

Explanation: As already noted this statement is not out of conceit. The purpose of this song as in దురిత దేహులే తొల్లియును శ్రీ / హరి భజించి నిత్యాధికులైరి is to declare that everyone of us are graced to achieve it. Annamacharya attained a rare position like that of Sanaka Sanandaadi rishis (सनकादि ऋषि). Annamacharya may be considered to have accomplished a state of perfection as mentioned in the below Shloka from Bhagavad-Gita.

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये |
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वत:
||7-3||

manuṣhyāṇāṁ sahasreṣhu kaśhchid yatati siddhaye
yatatām api siddhānāṁ kaśhchin māṁ vetti tattvataḥ

Purport: Amongst thousands of persons, hardly one strives for perfection; and amongst those who have achieved perfection, hardly one knows GOD. 

Further, liberation as often quoted by Jiddu Krishnamurti is a pathless land. Even Bhagavad-Gita verse 15-4 तत: पदं तत्परिमार्गितव्यं (tataḥ padaṁ tat parimārgitavyaṁ = one must search that path) leaves it for the practitioner to find. Thus we may take that Annamacharya truly reached a stage which is remarkable feat for humanity.

Iconoclastic thinker Vemana declared “The one who saw the God is better than the one heard of the God. The one who merged himself entirety into the God is still better. He will reign supreme to shine like the sun in this world” 

This merging of the spirit with God, as noted many times before, is an irrevocable transformation, not a negotiated settlement. That’s why Annamacharya said Go along that dry stream thru that small wicket gate only to transgress into big way. (గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక / దొడ్డతెరువువంక తొలఁగుమీ  = goDDErE chinna diDDiteruvu vOka /doDDa teruvu vaMka tolagumI). As I always asserted that Annamacharya is first and foremost a truth seeker. 

Some of you may question how do we know if Annamacharya has attained liberation. It really does not matter if he had really attained or not. What matters is, such questioner should ascertain truth through his own investigation. He should comprehend the meaning of vedakina deliyadu venaka muMdaralu (వెదకినఁ దెలియదు వెనక ముందరలు ) before proceeding further. 

To understand some of the verses of Annamacharya needs knowledge of bible and Jiddu Krishnamurti as well. That is the reason, I keep referring to bible often. For those who are curious, may appreciate the condition of man, from the cryptic words taken from chapter 5 of 2nd Corinthians, Bible. They are very similar to the statements made in introduction.

 

For we know that if the earthly tent we live in is destroyed, we have a building from God, an eternal house in heaven, not built by human hands. 2Meanwhile we groan, longing to be clothed instead with our heavenly dwelling, 3because when we are clothed, we will not be found naked. 4 For while we are in this tent, we groan and are burdened, because we do not wish to be unclothed but to be clothed instead with our heavenly dwelling, so that what is mortal may be swallowed up by life. 5Now the one who has fashioned us for this very purpose is God, who has given us the Spirit as a deposit, guaranteeing what is to come.

 

6 Therefore we are always confident and know that as long as we are at home in the body we are away from the Lord. 7For we live by faith, not by sight. 8We are confident, I say, and would prefer to be away from the body and at home with the Lord. 9 So we make it our goal to please him, whether we are at home in the body or away from it. 10 For we must all appear before the judgment seat of Christ, so that each of us may receive what is due us for the things done while in the body, whether good or bad.


భావము: తొలుత నెవ్వరికి దొరకని కైవల్యము నాకు కలిగెను.

వివరణము: ఇప్పటికే అనుకున్నట్లుగా, ఈ ప్రకటన అహంకారంతో చేయలేదు. ఈ కీర్తన ద్వారా అందరికీ ఆ మోక్షమును  సాధించుటకు అవకాశము కలదని ప్రకటించడమే ఉద్దేశ్యము. అన్నమాచార్యులు సనత్కుమారులు లేదా సనకసనందాది ఋషుల వంటి అరుదైన స్థానాన్ని పొందారు. భగవద్గీత నుండి క్రింది శ్లోకంలో పేర్కొన్న విధంగా అన్నమాచార్య పరిపూర్ణ స్థితిని సాధించారు.

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః
।। 7-3 ।। 

భావము: వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ది కోసం ప్రయత్నిస్తారు; మరియు పరిపూర్ణ సిద్ది సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు. 

ఇంకా, జిడ్డు కృష్ణమూర్తి తరచుగా ఉల్లేఖించిన విముక్తి  మార్గమే లేని ప్రదేశము"; భగవద్గీత కూడా సాధకుడు తప్పనిసరిగా ఆ మార్గాన్ని శోధించాలి (శ్లోకం 15-4 తత్: పదం తత్పరిమార్గితవ్యం) అని చెప్పినదీ ఒకే గమ్యమును గురించే. అన్నమాచార్యులు నిజంగా సర్వ మానవాళికి వన్నె తెచ్చు ఆ విశిష్ట​మైన  దశకు చేరితిరని మనం ఆనందించవచ్చు. 

సమాజోద్ధారకులు, సత్యాన్వేషి వేమన గారిట్లనిరి.

. విన్నవానికన్నఁ గన్నవాఁ డధికుండు

కన్నవానికన్నఁ గలియువాఁడు
ఉన్నతోన్నతుఁడయి యుర్విలోపల నుండు
విశ్వదాభిరామ వినురవేమ. 

ఇంతకు మునుపు చాలాసార్లు అనుకున్నట్లుగా, దేవునితో ఆత్మ యొక్క ఈ విలీనము తిరిగి వెనకకు మళ్ళలేని పరివర్తనే కాని సర్దిపుచ్చుకొను పరిష్కారం కాదు. అందుకే అన్నమాచార్యులు గొడ్డేరేచిన్నదిడ్డితెరువువొక / దొడ్డతెరువువంక తొలఁగుమీ అన్నారు. {= అదిగో అక్కడ కనబడుతున్న ఇరుకైన ద్వారం గుండా వెళ్ళు. అక్కడ నీకు దొడ్డ మార్గం కనబడుతుంది.} అన్నమాచార్యులు హిందూ తత్వవేత్త ఐనప్పటికీ ఎక్కువగా సత్యాన్వేషి లాగే నాకు  అగుపించాడు. 

అన్నమాచార్య ముక్తిని పొందారో లేదో మీకు ఎలా తెలుసునని  కొందరు ప్రశ్నించవచ్చు. అతను నిజంగా సాధించాడా లేదా అన్నది ప్రధానము కాదు. అటువంటి ప్రశ్నించేవారు తన స్వంత విచారణ ద్వారా సత్యాన్ని నిర్ధారించుకోవాలి. వారు తమ సమయాన్ని వెచ్చించే ముందు 'వెదకినఁ దెలియదు వెనక ముందరలు' అను కీర్తనపై వ్యాఖ్యానము చూడవలెనని మనవి. 

అన్నమాచార్యుల యొక్క కొన్ని కీర్తనలను అర్థం చేసుకోవడానికి బైబిల్ మరియు జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రస్తావన తేవలసి ఉంటుంది. అందుకే, నేను తరచుగా బైబిల్‌ను ప్రస్తావిస్తూ ఉంటాను. ఉత్సుకత ఉన్నవారికి, బైబిల్ 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలో,  ఉపోద్ఘాతములో మనిషి పరిస్థితిని గురించి అన్నమాచార్యులు చేసిన ప్రకటనలను ఉపమాన పదముల వెనుక గూఢముగా ఆవిష్కరించబడినట్లు గమనించండి. 

2 కొరింథీయులకు అధ్యాయం 5, బైబిల్‌ 

భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.


మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.


ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.


ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.


దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన ఆత్మను ఒడంబడికగా మన కనుగ్రహించియున్నాడు.


6 (వెలి) చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము.


గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.


ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.


కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. 

జయ పురుషోత్తమ జయ పీతాంబర

జయ జయ కరుణాజలనిధి

దయ యెఱంగ నే ధర్మము నెఱంగ నా-

క్రియ యిది నీ దివ్యకీర్తనమే  ॥కలి॥

 

jaya purushOttama jaya pItAMbara

jaya jaya karuNAjalanidhi

daya ye~raMga nE dharmamu ne~raMga nA-

kriya yidi nI divyakIrtanamE kali 

Word to Word meaning: జయ పురుషోత్తమ (jaya purushOttama) = Glories to the best among the beings! జయ పీతాంబర (jaya pItAMbara) Glories Lord Krishna;  జయ జయ కరుణాజలనిధి (jaya jaya karuNAjalanidhi) = Glories to the sea of kindness; దయ యెఱంగ (daya ye~raMga) = I really donot know what compassion is;    నే ధర్మము నెఱంగ (nE dharmamu ne~raMga) = Neither do I understand righteousness; నా-క్రియ (nA-kriya) = my work is; యిది (yidi) = this;  నీ దివ్యకీర్తనమే (nI divyakIrtanamE) = praising your greatness; 

Literal meaning: Glories to the best among the beings! Glories Lord Krishna! Glories to the sea of kindness! I really donot know what compassion is. Neither do I understand righteousness. My only avocation is praising your greatness. 

Explanation: Annamacharya from that state of oneness with God is declaring that he knows nothing else but praising the lord. He lived 94 years (= 34310 days).  It is said he had composed 32000 poems (of which 14000 are available now). He must have written more than one poem a day throughout his life (after omitting childhood days). Its humanly impossible. But still, he did. With such great devotion, he would not have engaged in any other activity. Thus, we take his statement as true.

Further Consider this shloka from Bhagavad-Gita describing the state of mind of a yogi which matches with what is stated by Annamacharya.

यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया |
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति
|| 6-20||

yatroparamate chitta niruddha yoga-sevayā
yatra chaiv
ātmanātmāna paśhyann ātmani tuhyati

Purport: When the mind, restrained from material activities, becomes still by the practice of Yoga, then the yogi is able to behold the soul through the purified mind, and he rejoices in the inner joy.

భావము: జయ పురుషోత్తమ, జయ పీతాంబర, జయ జయ కరుణాజలనిధి. దయాధర్మములు ఎరుగను. నేను చేయగలిగినది నీ దివ్యకీర్తనమే.

వివరణము: అన్నమాచార్యులు భగవానుని స్తుతించడం తప్ప తనకు మరేమీ తెలియదని ఘోషిస్తున్నాడు. ఇది నిజమే అయి ఉండాలి. అతడు 94 సంవత్సరాలు (= 34310 రోజులు) జీవించాడు. అతడు 32000 కీర్తనలు రచించాడని చెబుతారు (వీటిలో 14000 ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి). అతడు బాల్యమును మినహాయించగా, తన జీవితమంతా, రోజుకు ఒకటి కంటే ఎక్కువ కీర్తనలు వ్రాసి ఉండాలి. ఇది మానవులకు అసాధ్యమే. కానీ మన కళ్ళముందరి వాస్తవమును కాదనలేముగా! అంత గొప్ప భక్తిలో నిమగ్నమై, అతడు మరే పనులను ముట్టి ఉండడు. కాబట్టి, మనము అతని మాటలను నిజమని విశ్వసించవచ్చు.

 

అన్నమాచార్యులు చెప్పిన దానితో సరిపోయే యోగి యొక్క మానసిక స్థితిని వివరించే భగవద్గీతలోని క్రింది శ్లోకాన్ని కూడా పరిశీలించండి. 

యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ! 

యాత్ర చైనాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ! (6-20)

భావం : ధ్యాన యోగసాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుటద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో , ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని, యోగి ఆ సచ్చిదానంద ఘనపరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు.  

శరణము గోవింద శరణము కేశవ

శరణు శరణు శ్రీజనార్దన
పరమ మెఱంగను భక్తి యెఱఁగను
నిరతము నాగతి నీ దాస్యమే ॥కలి॥ 

SaraNamu gOviMda SaraNamu kESava

SaraNu SaraNu SrIjanArdana
parama me~raMganu bhakti ye~raganu
niratamu nAgati nI dAsyamE           kali 

Word to Word meaning: శరణము గోవింద (SaraNamu gOviMda) = Seek Protection of Govinda! శరణము కేశవ (SaraNamu kESava) = Seek Protection of Kesava! శరణు శరణు శ్రీజనార్దన (SaraNu SaraNu SrIjanArdana) = Seek Protection of Janardana! పరమ మెఱంగను (parama me~raMganu) = I am not aware of ‘OTHER” state;  భక్తి యెఱఁగను (bhakti ye~raganu) = Neither I know what devotion is; నిరతము (niratamu) = always;  నాగతి (nAgati) = my path is; నీ దాస్యమే (nI dAsyamE) = your service. 

Literal meaning: Seek Protection of Govinda! Kesava! Janardana! I am unaware of my present state. Neither I can confirm I am in Meditation. Yet, I know my path is to remain in service of the ultimate. 

Explanation: Annamacharya is unable to recognise his state. So was Jiddu Krishnamurti. Both wrote profusely. They reached such intractable positions, it’s not possible for them to describe even their own state of mind.

భావము: శరణము గోవిందా! శరణము కేశవా! శరణు శరణు శ్రీజనార్దనా! నా ప్రస్తుత స్థితి ఇది (ఇహమో లేదా పరమో) అని నిర్ధారించలేను. నేను భక్తిలో మునిగి ఉన్నానని కానీ చెప్పలేను. ఏమైనప్పటికీ, నీ సేవలో ఉండటమే నా మార్గమని నాకు తెలుసు.

వివరణము: అన్నమాచార్యులు తన అప్పటి  స్థితి  గుర్తించలేకపోయాడు. జిడ్డు కృష్ణమూర్తి కూడా అంతే. ఇద్దరూ అనేక గ్రంథములు వ్రాశారు. ఐనప్పటికీ, వారు తమ స్వంత మానసిక స్థితిని కూడా నిర్ధారించలేనైరి.

 

నమో నారాయణ నమో లక్ష్మీపతి

నమో పుండరీకనయనా
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయింకర్యమే ॥కలి॥ 

namO nArAyaNa namO lakshmIpati

namO puMDarIkanayanA
amita SrIvEMkaTAdhipa yide nA
kramamellanu nIkayiMkaryamE      kali 

Word to Word meaning: నమో నారాయణ (namO nArAyaNa) = Salutations to Narayana! నమో లక్ష్మీపతి (namO lakshmIpati) = Salutations to Laksmipati! నమో పుండరీకనయనా (namO puMDarIkanayanA) = Salutations to Pundarika! అమిత శ్రీవేంకటాధిప (amita SrIvEMkaTAdhipa) = boundless Lord Venkateswara! యిదె (yide) = this;  నా (nA) = mine;  క్రమమెల్లను (kramamellanu) = order, arrangement;  నీకయింకర్యమే (nI kayiMkaryamE) = devine service.  

Literal meaning: Salutations to Narayana! Laksmipati! Pundarika! O boundless Lord Venkateswara! Your divine Order (to me) is your service. 

Explanation: It will not be out of place to state shloka from Bhagavad-Gita below. I feel Annamacharya is the finest example of the single minded devotion mentioned there in. 

व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन |
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम्
|| 2-41||

vyavasāyātmikā buddhir ekeha kuru-nandana
bahu-śhākhā hyanantāśh cha buddhayo ’vyavasāyinām
 

Purport: O Arjun! the intellect of those who are on this path is resolute, and their aim is one-pointed. But the intellect of those who are irresolute is many-branched. 

భావము: నమో నారాయణ! నమో లక్ష్మీపతి! నమో పుండరీకనయనా! ఎల్లలే లేని శ్రీవేంకటాధిపుడా! దైవాజ్ఞ నాకు నీ సేవయే.

వివరణము: అన్నమాచార్యులను నిశ్చలమైన బుద్ధితో భగవంతుని సేవించడానికి అత్యుత్తమ ఉదాహరణగా నేను భావిస్తున్నాను.  భగవద్గీత నుండి దిగువ పేర్కొన్న శ్లోకాన్ని చూడండి.

వ్యవసాయాత్మికా బుద్దిరేకేహ కురునందన
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ।। 2-41
।।

భావము: అర్జునా! ఈ యొగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే యేక కారణంగా ప్రకాశిస్తుంది. నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానము అనేక భేదాలతో అనంత ముఖాలుగా వుంటుంది. ఈ శ్లోకంపై మరిన్ని వివరణలకు లింక్‌పై క్లిక్ చేయండి  

 

Summary of this Keertana:

I am a liberated soul. No one was bestowed this before. 

Glories to the best among the beings! Glories Lord Krishna! Glories to the sea of kindness! I really donot know what compassion is. Neither do I understand righteousness. My only avocation is praising your greatness. 

Seek Protection of Govinda! Kesava! Janardana! I am unaware of my present state. Neither I can confirm I am in Meditation. Yet, I know my path is to remain in service of the ultimate. 

Salutations to Narayana! Laksmipati! Pundarika! O boundless Lord Venkateswara! Your divine Order (to me) is your service 

కీర్తన సంగ్రహ భావము:

తొలుత నెవ్వరికి దొరకని కైవల్యము నాకు కలిగెను.

జయ పురుషోత్తమ, జయ పీతాంబర, జయ జయ కరుణాజలనిధి. దయాధర్మములు ఎరుగను. నేను చేయగలిగినది నీ దివ్యకీర్తనమే.

శరణము గోవిందా! శరణము కేశవా! శరణు శరణు శ్రీజనార్దనా! నా ప్రస్తుత స్థితి ఇది (ఇహమో లేదా పరమో) అని నిర్ధారించలేను. నేను భక్తిలో మునిగి ఉన్నానని కానీ చెప్పలేను. ఏమైనప్పటికీ, నీ సేవలో ఉండటమే నా మార్గమని నాకు తెలుసు.

నమో నారాయణ! నమో లక్ష్మీపతి! నమో పుండరీకనయనా! ఎల్లలే లేని శ్రీవేంకటాధిపుడా! దైవాజ్ఞ నాకు నీ సేవయే.

 

Copper Leaf: 191-5  Volume 2-466

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...