ANNAMACHARYA
98 ఇట్టిజీవుల కింక నేది వాటి
(iTTijIvula kiMka nEdi vATi)
Introduction: This apparently plain worded verse has deeper philosophical connotations. Annamacharya clearly demonstrates the perversive nature of man. It is said that the God is there in the heart of the man. Hence, God is aware of the true feelings of the man. Yet, man out of his vanity, tries to exhibit the faith not there in his heart.
Man misreads movement as change. Movement is physical action. Change is transformation or movement of the heart. Therefore, movement is not a measure of transformation of heart. The gist of the poem is that man squanders the opportunity of life, by attempting many movements.
ఉపోద్ఘాతము: సాదాసీదా పదాలతో కూడిన కీర్తన లోతైన తాత్విక అర్థాలను
పలికిస్తోంది. అన్నమాచార్యులు మనిషి యొక్క వికృత స్వభావాన్ని స్పష్టంగా మన
కళ్ళముందుంచుతాడు. మనిషి గుండెల్లో శ్రీవేంకటేశుడే వున్నాడని (అనగా, ఆయనకు మానవుని హృదయము తెలుసునని) అయినా వ్యర్థముగా మానవుడు దేవునిపై తనకు లేని
నమ్మకమును ప్రదర్శించబోతాడని చెప్పిరి.
మనిషి, కదలికను మార్పుగా పొరబడతాడు. కదలిక భౌతిక చర్య. మార్పు అనేది గుండె యొక్క పరివర్తన లేదా కదలిక. కాబట్టి కదలిక అనేది హృదయ పరివర్తనకు కొలమానం కాదు. అయినప్పటికీ, మనిషి తన జీవిత కాలములో అనేకానేక మర్పులకు కదలికలకు ప్రయత్నించి చతికిలబడతాడు అన్నది ఈ కీర్తన సారాంశం.
కీర్తన:
ఇట్టిజీవుల కింక నేది వాటి దట్టమై దేవుఁడ నీవే దయఁజూతు గాకా ॥పల్లవి॥
తనజన్మవిధు లనుఁ దలఁచు నొక్కొకవేళ వొనర మఱచునట్టె వొక్కొకవేళ
వినుఁ బురాణకథలు వివరించి యొకవేళ
పెనచి సందేహములె పెంచు నొకవేళ ॥ఇట్టి॥
విసిగి సంసారమందు విరతుఁడౌ నొకవేళ వొఁసగి యందె మత్తుఁడౌ నొకవేళ
పసిగొని యింద్రియాల బంటై వుండు నొకవేళ
ముసిపితో దైవానకు మొక్కు నొక్కవేళ ॥ఇట్టి॥
కోరి తపములు చేసి గుణియౌ తా నొకవేళ వూరకే అలసి వుండు నొక్కవేళ
యీరీతి శ్రీవేంకటేశ యెదలో నీవుండఁగాను
బీరాన నీకే మొఱవెట్టు నొకవేళ ॥ఇట్టి॥
|
iTTijIvula kiMka nEdi vATi daTTamai dEvuDa nIvE dayajUtu gAkA ॥pallavi॥
tanajanmavidhulanu dalachu nokkokavELa vonara ma~rachunaTTe vokkokavELa
vinu burANakathalu vivariMchi yokavELa
penachi saMdEhamule peMchu nokavELa ॥iTTi॥
visigi saMsAramaMdu viratuDau nokavELa vosagi yaMde mattuDau nokavELa
pasigoni yiMdriyAla baMTai vuMDu nokavELa
musipitO daivAnaku mokku nokkavELa ॥iTTi॥
kOri tapamulu chEsi guNiyau tA nokavELa vUrakE alasi vuMDu nokkavELa
yIrIti SrIvEMkaTESa yedalO nIvuMDagAnu
bIrAna nIkE mo~raveTTu nokavELa ॥iTTi॥
|
Details and Explanations:
ఇట్టిజీవుల కింక నేది వాటి
iTTijIvula kiMka nEdi vATi
Word to Word meaning: ఇట్టి (iTTi) = this type of; జీవుల (jIvula) = beings; కింక (kiMka) = here after; నేది (nEdi) = nowhere; వాటి (vATi) = a plot for a house, here implying a shelter; దట్టమై (daTTamai)= thick, strong; దేవుఁడ (dEvuDa) = god; నీవే (nIvE) = you only; దయఁజూతు గాకా (dayajUtu gAkA) = take compassionate view;
Literal meaning: O Almighty! Unless you take compassionate view, where is the shelter for this type of (human) beings.
Explanation: Annamacharya is wondering why man changes colours by the height of the sun. Man, somehow knows he must change. But does not understand how? He keeps wearing different hats. This movement, is merely a reaction.
Man’s materialistic thinking is the true ignorance. As we have seen in previous explanations God is neither materialistic not metaphorical. Man tries to catch God as he could hold a coin in his hand.
The word ఇట్టి (iTTi = this type) is indicative of perversive behaviour of man. Incredulity is the nemesis of man..
భావము: సర్వశక్తిమంతుడా! నీవు దయచూపితే గాని
ఇటువంటి జీవులకు ఆశ్రయమేది?
వివరణము:
గంటగంటకు మనిషి రంగులు ఎందుకు
మారుస్తాడోనని అన్నమాచార్యులు ఆశ్చర్యపోతున్నాడు. మనిషికి ఏదో ఒకవిధంగా అతను
మారాలని తెలుసు. కానీ ఎలాగో తెలియదు. అనేక వేషాలు మారుస్తాడు.
మనిషి భౌతికవాద ఆలోచనే నిజమైన అజ్ఞానం. మనము
మునుపటి వివరణలలో చూసినట్లుగా దేవుడు భౌతికమూ కాదు, వూహాత్మకమూ కాదు. మనిషి చేతిలో రూపాయి బిళ్ళను పట్టుకున్నట్లు దైవమును
పట్టడానికి ప్రయత్నిస్తాడు.
ఇట్టి అనే పదం మనిషి
యొక్క రోఁత కలిగించు ప్రవర్తనను సూచిస్తుంది. శంకే మనిషి ప్రధాన శత్రువు.
తనజన్మవిధు లనుఁ దలఁచు
నొక్కొకవేళ
tanajanmavidhulanu dalachu nokkokavELa
Word to Word meaning: తనజన్మ (tanajanma) = his life; విధులనుఁ (vidhulanu) = duties; దలఁచు (dalachu) = remembers; నొక్కొకవేళ (nokkokavELa) = once a while; వొనర (vonara) = కలుగు, happens; మఱచునట్టె (ma~rachunaTTe) = forgets easily; వొక్కొకవేళ (vokkokavELa) = some other times; వినుఁ (vinu) = Listens; బురాణకథలు (burANakathalu) = stories from the sacred books; వివరించి( vivariMchi) = in detailed form; యొకవేళ (yokavELa) = once a while; పెనచి (penachi) = పెనవేయు, మెలిదిప్ప, to twist, twist together. సందేహములె (saMdEhamule) = only doubts ; పెంచు (peMchu) = increase, surface; నొకవేళ (nokavELa) = at other times.
Literal meaning: Sometimes Man attempts understand his prescribed duties for life; At other times, he acts as if he had not thought about these. On few occasions he listens to stories from sacred books in great details. At other times, gets twisted by a bundle of doubts. And becomes captive to these.
Explanation: Annamacharya describing the wayward nature of man. To understand this stanza, request to you to have deep look at the above picture drawn by legendary artist M C Escher. The left side of the image shows the daylight. It is a small city and the long canal that runs through it is bright. The right side may be taken as night view of the left side picture.
From the centre of picture, notice the white birds moving towards the night and the black birds towards the day. The black and white squares in the centre of the whole image show confusion. It provides the positive and negative aspects of 'day and night' through lines. Think why the birds moving towards the day are black and vice a versa. Now think of the relationship between this painting and Bhagavad-Gita verse below.
कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य: |
स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत् || 4-18||
karmaṇyakarma yaḥ paśhyed akarmaṇi cha karma yaḥ
sa buddhimān manuṣhyeṣhu sa yuktaḥ kṛitsna-karma-kṛit
Purport: Those who discern karma (action) in akarma (inaction) and akarma in karma are the truly intelligent (=yogi). Although they might engage in many sort of activities, still they may be considered as Yogi.
Take for a moment to understand quickly, akarma (wrong action) = night, black; Karma (supposed correct action) = day, white; Assuming that, humans are like the birds in the above picture; Whether the bird (= man) flies towards the night or the day, it stems from our present ignorance, so it is an act of ignorance. Therefore, it is necessary to realize that the true wisdom is not to take any action, but being aware of your true condition.
In order to cut short, reproducing the statement of Jiddu Krishnamurti: “Most of us are inattentive. To become aware of that inattention is attention; but the cultivation of attention is not attention.” (You are the World, Chapter 2, 21st October 1968, 2nd Public Talk at BRANDEIS UNIVERSITY).
Again, go back to the picture. The centre parts of the picture are not very clear. This is like our present understanding of ourselves. Now refer to this Annamacharya verse: avalavennelOne allu nErELliMtE / niviri ninnaTivuniki nETiki galadA? అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే / నివిరి నిన్నటివునికి నేటికి గలదా? (purport: Like the salutation performed in moonlight is not clear to the receivers, today i.e. living present is not as discernible, verifiable as yesterday.)
Now observe unison of the picture by MC Escher, the Bhagavad-Gita verse, the Annamacharya verse, the statement of Jiddu Krishnamurti:
What Annamacharya is saying in this stanza? Movement to either (assumed) good side or (assumed) wrong side is still action of ignorance; stay where you are. Once more, we come back to “sahajAnanUrakunna (సహజాన నూరకున్న from the poem: tahatahalinniTiki tAnE mUlamu gAna (తహతహలిన్నిటికి తానే మూలము గాన).
భావము: మానవుడు ఒక్కొక వేళలలో తన జన్మ విధులనుఁ తలఁచ ప్రయత్నించును.
మరియొకమారు వానిని అట్టే మఱచును. ఒకసారి పురాణకథలు వివరముగా తెలియ గోరును. మరునాడే
సందేహములు పెనవేయగా బందీయగును.
వివరణము: మానవుని విచిత్ర గతులను వివరించుచున్నారు అన్నమాచార్యులు. ఈ చరణమును బాగుగా అర్ధము చేసుకొనుటకు, ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు M C యెశ్చర్ గీసిన ఈ చిత్రమును శ్రద్ధగా చూడమని అభ్యర్థన. చిత్రం యొక్క ఎడమ వైపు పగటి పూటను చూపుతుంది. దానిలో ఒక చిన్న నగరమూ, దాని గుండా ప్రవహించే పొడవైన కాలువ ప్రకాశవంతంగా ఉంటాయి. కుడి వైపుది ఎడమ దాని రాత్రి దృశ్యం అనుకోవచ్చు.
చిత్రం మధ్యలోంచి, తెల్లటి పక్షులు రాత్రి వైపుకు, నల్లటి పక్షులు పగలు వైపుకు వెళ్ళడం గమనించండి. మొత్తం చిత్రం మధ్యలో నలుపు
మరియు తెలుపు చదరములు అయోమయ స్థితిని
చూపుతాయి. కాంతి వైపు కదులుతున్న పక్షులు ఎందుకు నల్లగానూ, మరియు రాత్రివైపువి తెల్లగానూ ఎందుకున్నాయో ఆలోచించండి! పై పటమునకు క్రింది భగవద్గీత శ్లోకమునకు గల సంబంధమును పరిశీలించండి.
కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః ।
స బుద్దిమాన్మనుశ్యేషు స యుక్తః
కృత్స్నకర్మకృత్ ।। 4-18 ।।
(భావము: ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు
మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనేవున్నా, వారు యోగులు మరియు సమస్త కర్మలను ఆచరించిన వారగుదురు.)
త్వరగా అర్ధము చేసుకోనుటకు క్షణ మాత్రమునకు, అకర్మ = రాత్రి, నలుపు; కర్మ = పగలు, తెలుపు; అని భావించుచూ, మనుషులు ఆ బొమ్మలోని పక్షుల వలె; పక్షి (మనిషి) రాత్రి వైపుకు ఎగిరినా పగలు వైపుకు ఎగిరినా అది మన ఇప్పటి అజ్ఞానము
నుంచి వచ్చినది కావున, అజ్ఞానపు చర్యయే అగును. కాబట్టి ఏ చర్యయూ చేపట్టక ఉండుటయే జ్ఞానమని గ్రహించవలె.
మళ్ళీ ఆ చిత్రాన్ని తిరిగి పరిశీలిద్దాం. చిత్రం
యొక్క మధ్య భాగాలు సుస్పష్టంగా లేవు. ఇది ప్రస్తుతం మన గురించి మనకున్న అవగాహన లాంటిది. ఇప్పుడు ఈ అన్నమాచార్యుల
కీర్తనను చూడండి: అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే / నివిరి నిన్నటివునికి
నేటికి గలదా? (భావము: చంద్రకాంతిలో చేసే నమస్కారం ఇతరులకు స్పష్టంగా
తెలియనట్లుగా, ప్రస్తుతము నడుస్తున్న ఈ క్షణములో జీవించడం అంటే
కొంత అస్పష్టంగానూ, సవాళ్ళతోనూ కూడినది. అది నిన్నటిలా నిర్దిష్టమైనదీ; ధృవీకరించదగినదీ కాదు.)
జిడ్డు కృష్ణమూర్తి గారు పదేపదే చెప్పిన విషయం, "మనమున్న స్థితిని గుర్తించ గలిగితే, అది అచేతనమందలిదే." ద్రష్టలైన
మహానుభావులు చేతనావస్థను జీవితంగాను అచేతనత్వమును మరణం గాను భావించెదరు. వారికి
జీవితం నిరంతరం.
ఈ చరణంలో అన్నమాచార్యులు ఏం చెప్తున్నారు? ఊహించుకున్న మంచి లేదా చెడు వైపు కదలిక అను చర్య అజ్ఞాన జనితము కాన నువ్వు
ఉన్న చోటే ఉండు. మరోసారి, మనము 'సహజాన నూరకున్న'కు తిరిగి చేరుకుంటాము. ('తహతహలిన్నికి తానే
మూలము గాన' అను కీర్తన నుండి)
విసిగి సంసారమందు విరతుఁడౌ
నొకవేళ
visigi saMsAramaMdu viratuDau nokavELa
Word to Word meaning: విసిగి (visigi) = to be disgusted, to be vexed, to be sick of, సంసారమందు (saMsAramaMdu) = with the family life, with the world; విరతుఁడౌ (viratuDau) = one in whom attachment to worldly pleasures has ceased; నొకవేళ (nokavELa) = at one time; వొఁసగి (vosagi) = as if awarded gift; యందె (yaMde) = in the same thing; మత్తుఁడౌ (mattuDau) = intoxicated; నొకవేళ (nokavELa) = at other times; పసిగొని (pasigoni) = like the dogs find by the scent; యింద్రియాల (yiMdriyAla) బంటై వుండు (baMTai vuMDu) నొకవేళ (nokavELa) = at one time; ముసిపితో (musipitO) = బొంకుతో, అసత్యముతో, with false sense, feigned; దైవానకు (daivAnaku) = to the God; మొక్కు (mokku) = bow; నొక్కవేళ (nokkavELa) = at one time.
Literal meaning: At one time he gets disgusted with the world and tries to get dissociated with it; At other times, he indulges in worldly affairs as a precious gift awarded to him. At one time like a dog, he finds out by scent, all the possible ways to be subservient to his sense organs. At other times, he feigns to be bowing to the God.
Explanation: the first line says, vexed with
the world, man tries to be dissociated. This is simply reaction to the external
environment. Therefore, such actions tend to be transient and finally mellows
down.
Another
notable word is musipitO (ముసిపితో) is indicating man’s faith is
not complete in the God. Therefore, he may prostrate, may perform penance,
might take the name of the God very often, still, his conviction is incomplete.
However, what is the use of display of faith on the lips truly not there in the
heart?
భావము: ఒక్కొక్కసారి అతడు సంసారముతో విసుగు చెంది విరతుఁడు కావడానికి ప్రయత్నిస్తాడు; ఇతర సమయాల్లో, తనకు దొరికిన అరుదైన
బహుమతులుగా ప్రాపంచిక వ్యవహారాలలో
పారవశ్యంతో మునిగిపోతాడు. ఒకప్పుడు కుక్కలు వాసన పట్టి కనుగొన్నట్లు,
ఇంద్రియాలకు కోరి కోరి బంటులాగ
వ్యవహరిస్తాడు. ఇతర సమయాల్లో, అతను దేవునికి మొక్కుతున్నట్లు నటిస్తాడు.
వివరణము: మొదటి పంక్తిలో
సంసారంతో విసిగిపోయి, మనిషి విడిపోవడానికి ప్రయత్నిస్తాడు అనటం బాహ్య
వాతావరణానికి ప్రతిచర్య చూపుతోంది. అందువల్ల, ఇటువంటి ప్రతిచర్యలు అస్థిరమైనవి మరియు మెల్లగా
చల్ల బడతాయి.
'ముసిపితో దైవానకు మొక్కు' అన్నది భగవంతునిపై మనిషికి పరిపూర్ణమైన విశ్వాసం లేదని సూచిస్తుంది. అందువలన, అతడు సాష్టాంగపడవచ్చు; తపస్సు చేయవచ్చు; తరచుగా దేవుని పేరు
ఉచ్చరించవచ్చు; అయినప్పటికీ, హృదయంలో లేని నమ్మకము, పెదవులపై చూపించి యేమి ప్రయోజనము?
కోరి తపములు చేసి గుణియౌ తా
నొకవేళ
kOri tapamulu chEsi guNiyau tA nokavELa
Word to Word meaning: కోరి (kOri) = willingly; తపములు చేసి (tapamulu chEsi) = performing penance; గుణియౌ (guNiyau) = becomes virtuous; తాను (tAnu) = self; ఒకవేళ (okavELa) = at a time; వూరకే (vUrakE) = spontaneously, voluntarily, causelessly; అలసి వుండు (alasi vuMDu) = get exhausted; నొక్కవేళ (nokkavELa) = at some other time; యీరీతి (yIrIti) = this way; శ్రీవేంకటేశ (SrIvEMkaTESa) = O lord Venteswara; యెదలో (yedalO) = in the heart; నీవుండఁగాను (nIvuMDagAnu) = while you are there; బీరాన (bIrAna) = అహంకారముతో, గర్వముతో, conceit, proud; నీకే (nIkE) = to you only; మొఱవెట్టు (mo~raveTTu) = అర్తధ్వనిచేయు, అన్యాయమునుగూర్చి చెప్పు, wail scream, lament; నొకవేళ (nokavELa) = on another occasion.
Literal meaning: At certain times, he becomes virtuous and
perform penances as per the sacred books. At other times, he remains exhausted.
O Lord Venteswara while you are there in the heart
(unaware of this), out of conceit man laments
and complains about his condition to you.
Explanation: First Annamacharya stated that
god is there in the heart of the man. Hence, God is aware of the true feelings
of the man. Yet in his vanity, he complains to the God.
bIrAna
(బీరాన) is indicating true behaviour exhibited by man.
influence of his environment is complete on man. Therefore, out of this
conditioning he takes actions. Let us examine very interesting anecdote from
Bhagavatam below.
The emperor Bali Chakravarti (बलि चक्रवर्ती) is not only a great warrior, but also staunch
devotee of Srihari (Lord Vishnu). He had dethroned Indra by his valour. When
Srihari comes to him in the human form of Vamana to seek his largesse, Bali’s
guru, Shukracharya forewarned him that Srihari is going to take away his
riches.
At that instant Bali felt that
he is the lord of the wealth all around him. Accordingly, Bali feels that he is
privileged to donate to Srihari and takes pride that he can even donate to the Lord.
Thus, momentarily he loses, his so far unstinting devotion to the lord. There
after he loses all his wealth and bound by the Varuna pasam.
Vindhyavali, his wife reaches the place, finds her husband has been bound. She prostates to Vamana and says.
kka. Nīkuṁ grīḍārthamu lagu
Purport: You had created these three worlds. Yet these people ignorantly take themselves to be the lords. When you are the creator, the upholder and the decimator; under illusion these persons (she even criticised her husband) impishly claim as the true actors. How can such persons donate you (anything)?
భావము: తపములు చేసి గుణవంతుడిగా ఒకసారి, వూరకనే అలసి వుండునట్లు
ఇంకోసారి అగపడతాడు. శ్రీవేంకటేశ హృదయంలో నీవే ఉండగానూ (గ్రహించక), అహంకారముతో, గర్వముతో నీకే మొఱపెట్టుకొనునీ
వింత మానవుడు.
వివరణము: అన్నమాచార్యులు మనిషి గుండెల్లో
శ్రీవేంకటేశుడే వున్నాడని (అనగా, ఆయనకు మానవుని హృదయము తెలుసునని) అయినా
వ్యర్థముగా మానవుడు దేవునికి తనకు లేని నమ్మకమును ప్రదర్శించబోతాడని చెప్పిరి.
‘బీరాన’ అన్న పదము మనిషి ప్రదర్శించే నిజమైన ప్రవర్తనను
సూచిస్తుంది. పరిసరాల ప్రభావం మనిషిపై పూర్తిగా ఉంటుంది. అందువలన, ఈ స్థితివ్యాజం (=కండిషనింగ్ = స్థితి కలిగించు
భ్రమ) నుండి అతను చర్యలు తీసుకుంటాడు.
భాగవతం నుండి చాలా ఆసక్తికరమైన క్రింది వృత్తాంతాన్ని ఆకళించండి.
జగదేకవీరుడు, మహా హరి భక్తుడైన బలి చక్రవర్తి శుక్రాచార్యుని వలన వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని, తన చుట్టూ వున్న సంపదలకు తానే రాజునని భ్రమించి, "ఆహా! ఆ శ్రీహరికి కూడా నేను దానమివ్వగలను" అనుకొనేను. నా చేయి శ్రీహరి చేయి పైన ఉండుననుకొనెను.
శా. ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,
ఒక్క క్షణం చాలు సమబుద్ధి వక్రీకరించుటకు. బలి సమస్తము కోల్పోయెను. బలి వరుణపాశములతో బంధింపబడెను. బలి చక్రవర్తి భార్య వింద్యావళి అక్కడకు చేరుకుని, బలి బంధింపబడి వుండుట చూసి, వామనునికి ప్రణమిల్లి ఇటుల పలికెను.
క. నీకుం గ్రీడార్థము లగు
భావము : ప్రభూ! నీవు నీలీలలను కొనసాగించుట
కొరకు ఈ ముల్లోకాలను సృష్టించితివి. కానీ, మందబుధ్ధులు ఈ జగమ్మునకు తామే
అధిపతులైనట్లు భావింతురు (బలిచక్రవర్తిని కూడా కలిపి విమర్శించింది) . ఈ లోకమునకు
కర్తయు, భర్తయు, సంహర్తయు నీవే ఐనప్పుడు,
నీ మాయకు మోహితులై, సిగ్గు విడిచిన వారు తామే కర్తలమైనటుల భావింతురు .
అట్టివారు నీకేమి సమర్పింపగలరు?
Summary of this Keertana:
O Almighty!
Unless you take compassionate view, where is the shelter for this type of
(human) beings..
Sometimes Man attempts understand his prescribed
duties for life; At other times, he acts as if he had not thought about these.
On few occasions he listens to stories from sacred books in great details. At
other times, gets twisted by a bundle of doubts. And becomes captive to these.
At one time
he gets disgusted with the world and tries to get dissociated with it; At other
times, he indulges in worldly affairs as a precious gift awarded to him. At one
time like a dog, he finds out by scent, all the possible ways to be subservient
to his sense organs. At other times, he feigns to be bowing to the God.
At certain times, he becomes virtuous and perform
penances as per the sacred books. At other times, he remains exhausted. O lord
Venteswara while you are there in the heart (unaware of this), out of conceit
man laments and complains about his
condition to you.
కీర్తన సంగ్రహ భావము:
సర్వశక్తిమంతుడా! నీవు దయచూపితే
గాని ఇటువంటి జీవులకు ఆశ్రయమేది?
మానవుడు ఒక్కొక వేళలలో తన జన్మ విధులనుఁ తలఁచ ప్రయత్నించును.
మరియొకమారు వానిని అట్టే మఱచును. ఒకసారి పురాణకథలు వివరముగా తెలియ గోరును. మరునాడే
సందేహములు పెనవేయగా బందీయగును.
ఒక్కొక్కసారి అతడు సంసారముతో
విసుగు చెంది విరతుఁడు కావడానికి
ప్రయత్నిస్తాడు; ఇతర సమయాల్లో, తనకు దొరికిన అరుదైన బహుమతులుగా ప్రాపంచిక వ్యవహారాలలో పారవశ్యంతో
మునిగిపోతాడు. ఒకప్పుడు కుక్కలు వాసన పట్టి కనుగొన్నట్లు, ఇంద్రియాలకు కోరి కోరి బంటులాగ
వ్యవహరిస్తాడు. ఇతర సమయాల్లో, అతను దేవునికి మొక్కుతున్నట్లు
నటిస్తాడు.
తపములు చేసి గుణవంతుడిగా ఒకసారి, వూరకనే అలసి వుండునట్లు
ఇంకోసారి అగపడతాడు. శ్రీవేంకటేశ హృదయంలో నీవే ఉండగానూ (గ్రహించక), అహంకారముతో, గర్వముతో నీకే మొఱపెట్టుకొనునీ వింత మానవుడు.
Copper Leaf: 117-1 Volume
2-97
Very nice explanation about human nature.How we have to surrender to god with utmost faith on Lord.
ReplyDeleteThis song so nicely depicted the state of our mind in simple words and the confusion generally we undergo in day to day life. Sri Sri Annamacharya is a saint who understood the dichotomy of our minds and given simple solutions through his keertanas. Kudos to our CHSN Srinivasa for nicely bringing out the insights of Annamacharya Keertanas for the benefit of all of us.
ReplyDeleteExcellent explanation on the vagaries if human nature by Sri Ch. N. Srinivas especially for the second stanza quoting the Bhagavad Gita sloka(4-18)relating it to the painting of noted artist MC Escher lucidly explaining it.
ReplyDeleteMC Escher's illustration adds a nice touch to the explanation.
ReplyDeleteVery relevant to most of us.
Only few can quote to connect Bhagvad Gita, Bhagavatam, Jiddu Krishnamurthy and western literature to explain the human nature and philosophy in Annamacharya keerthanalu. Kudos to you. Thanks for introducing Dutch Artist MC Escher and his painting.
ReplyDeleteLast article's photo of cleaning minding is also an excellent illustration to connect with.
See if there is a possibility of tagging for each blog article as well.
The painting and its connection is awesome...
ReplyDelete