ANNAMACHARYA
111. కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు
(koMdari kivi sammatiyaitE koMdari kavi gAvu)
Introduction: Annamacharya’s
razor sharp observations make you ponder. He leaves you to wonder “how can a
traditional (sanyasi) monk can be so radical?”. Its absolute bliss to listen his
great revelations through these beautiful poems. Annamacharya, like Buddha questioned the very
basis of our existence, our ideas.
Can you clearly see incompatibility between
the intelligence and daily grind? Are you able to differentiate this world and
the unworldliness? Do you think this dissociation is last phase of the (family)
life? O Man, go beyond the appearances and its uncountable wings.
O man! setting aside conflicting things within
you and find the truth thinly dispersed all around.
ఉపోద్ఘాతము: భగవంతుడిని చేరుకోవడానికి సంప్రదాయబద్ధమైన ఆలోచనలు పనికిరావని, ఉద్ఘాటిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రపంచము, దాని ఆధారభూతములైన నిర్మాణములన్నింటినీ తిరస్కరించడమే మొదటి మెట్టు అన్నారు అన్నమాచార్యులు.
జ్ఞానమునకు మరియు రోజువారీ
జీవితానికి మధ్య వ్యత్యాసం నీవు స్పష్టంగా చూడగలవా? ఈ ప్రపంచాన్ని మరియు పరమును ఒకే
కోణంలో చూస్తున్నావా? విరక్తి అనేది ఈ కుటుంబ జీవితానికి చరమ దశ అని అనుకుంటున్నావా?
ఓ మానవుడా, ప్రపంచము, దాని రూపురేఖలు, దాని లెక్కించలేని తీరాలను దాటి వెళ్ళు అంటూ
మనలో ఆలోచనలు రేకెక్తిస్తారు.
నీలో ఘర్షణపడుచున్న వ్యతిరేకములను పక్కనపెట్టి, నీ చుట్టూ వ్యాపించియున్న సత్యాన్ని కనుక్కోమని సవాలు విసిరారు.
కీర్తన:
కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు యిందరిలోపల నీ వెడమాయలు యేగతిఁ దెలిసే నేనయ్యా ॥పల్లవి॥
దూరము కర్మమునకు జ్ఞానము తోడనే వొండకటికిని దూరము పరమునకు బ్రపంచము తొలుత విరుద్ధంబు;
దూరము విరతికి సంసారము; తుదమొదలే లేదు;
యీరీతుల నీ వెడమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా॥కొంద॥
కూడదు దేహమునకు నాత్మకు గోత్రవిరోధం; బెన్నఁడును కూడదు కోపమునకు శాంతము గుణావగుణములను;
కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన;
యేడ గొలఁదిగా శ్రీహరిమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా॥కొంద॥
శ్రీ వేంకటపతి నన్నీ గతిఁ జిక్కించితి వీజగమునను; భావింపఁగరాదు నీమహిమ బహుముఖములయర్ధముగాన;
యేవిధమును నేఁటికి నాకిఁక యెందెందని తగిలెద నేను
దైవికమగు నీదాసానుదాస్యము దక్కినదే నాకు॥కొంద॥
|
koMdari kivi sammatiyaitE koMdari kavi gAvu yiMdarilOpala nI veDamAyalu yEgati delisE nEnayyA ॥pallavi॥
dUramu karmamunaku j~nAnamu tODanE voMDakaTikini dUramu paramunaku brapaMchamu toluta viruddhaMbu;
dUramu viratiki saMsAramu; tudamodalE lEdu;
yIrItula nI veDamAyalu yEgati deliseda nEnayyA॥koMda॥
kUDadu dEhamunaku nAtmaku gOtravirOdhaM; bennaDunu kUDadu kOpamunaku SAMtamu guNAvaguNamulanu;
kUDadu baMdhamunaku mOkshamu kOrikalE kaTlugAna;
yEDa goladigA SrIharimAyalu yEgati deliseda nEnayyA॥koMda॥
SrI vEMkaTapati nannI gati jikkiMchiti vIjagamunanu; bhAviMpagarAdu nImahima bahumukhamulayardhamugAna;
yEvidhamunu nETiki nAkika yeMdeMdani tagileda nEnu
daivikamagu nIdAsAnudAsyamu dakkinadE nAku॥koMda॥
|
కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు
యిందరిలోపల నీ వెడమాయలు యేగతిఁ దెలిసే నేనయ్యా ॥పల్లవి॥
koMdari
kivi sammatiyaitE koMdari kavi gAvu
yiMdarilOpala
nI veDamAyalu yEgati delisE nEnayyA ॥pallavi॥
Word to
Word meaning: కొందరికి (koMdariki) = (for)
some; ఇవి (ivi) = these; సమ్మతియైతే (sammatiyaitE) = acceptable; కొందరికి (koMdariki) =for some (others) అవి (avi) = those; గావు (gAvu) = not (acceptable); యిందరిలోపల (yiMdarilOpala) = in so many people; నీ (nI) = your; వెడమాయలు (veDamAyalu) = wicked illusions; యేగతిఁ (yEgati) = in what way; దెలిసే (delisE) = know, understand; నేనయ్యా (nEnayyA) = me, Sir.
Literal meaning: For some these are acceptable. For others not. How do I recognize when you reflect these wicked illusions in so many people?
Explanation: There will always be people who say God is there. At the same time, there are people negating his existence. Here, Annamacharya is saying that people get bewildered by the multifarious actions (illusions) of God. Each one of us is interpreting truth in their own way based on few observations. Thus, the fact underlined is that man, a believer or not, fails to recognise all the multi-dimensional actions of God. Thus, man’s knowledge remains partial. Making conclusions out of such data is ignorance.
Refer to previous verse Annamacyya said, I do not recognise you (God) though present before me by saying yediri nanne~raganu yeMtainA nayyO యెదిరి నన్నెఱఁగను యెంతైనా నయ్యో. Here in this verse he is saying that, O God, you get reflected in so many, its impossible to recognise you. Thus we may surmise that the truth gets so much dispersed (or diluted) in reality that we fail to recognise it though present before our eyes. Note the great observation power of Annamacharya.
Thus, the
subject called God or truth remains controversial because it cannot be
ascertained in any way. Though it may appear far fetched, to see God you need special vision, like the one Arjun
was granted as described in Verse 8, chaper 11, Bhagavadgita. Similar
transformation of sight also happened to Jiddu Krushnamurti. (read book ‘years of awakening’ by Mary Luytens).
This verse also has indirect reference to the Bhagavad-Gita verse सर्वत: पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् | सर्वत: श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति || 13-14|| sarvataḥ pāṇi-pādaṁ tat sarvato ’kṣhi-śhiro-mukham sarvataḥ śhrutimal loke sarvam āvṛitya tiṣhṭhati Everywhere are His hands and feet, eyes, heads, and faces. His ears too are in all places, for He pervades everything in the universe.
Implied meaning: O
man! setting aside your preferences, find the truth thinly dispersed around
you.
భావము: కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు. యిందరిలోపల నీ వెడమాయలు
(భ్రమలను ప్రతిబింబిస్తున్నప్పుడు) నిన్ను నేను
ఎలా గుర్తించేనయ్య.
వివరణము: దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు, లేడని తిరస్కరించే వాళ్ళు
ఎప్పుడూ ఉంటారు. ఇక్కడ భగవంతుడు అనేక దృష్టి కోణములలో (భ్రమలు) అగపడడంతో, ఒక్కొక్కరు
కొన్ని పరిశీలనల ఆధారంగా తమదైన రీతిలో అన్వయించు కుంటున్నారు. ఈ విధంగా, నమ్మినా నమ్మకపోయినా
భగవంతుని యొక్క వైవిధ్యభరితమైన చర్యలను సమగ్రముగా
గుర్తించడంలో మానవుడు విఫలమవుతాడు. అందువలన, మనిషి యొక్క జ్ఞానం పాక్షికంగా ఉంటుంది.
అటువంటి స్ఠితి నుండి తీర్మానాలు చేయడం అజ్ఞానమే కదా.
“నా ఎదురుగానే ఉన్న నిన్ను (దేవుని) గుర్తించలేను” (యెదిరి నన్నెఱఁగను యెంతైనా నయ్యో) అని మునుపటి
కీర్తనలో అన్నారు అన్నమయ్య. ఇక్కడ ఈ కీర్తనలో “ఓ దేవా, నీవు అనేకులలో ఒకే సారి ప్రతిబింబించడంతో
ఎటు చూడవలెనో తెలియక తికమక పడుతున్నాము” అని ఇక్కడ చెప్పారు, ఆ విధంగా వాస్తవంలో సత్యము
అతి సూక్ష్మముగా విడగొట్టబడి (లేదా పలచబడి)
ఉండి, అది మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ దానిని గుర్తించడంలో విఫలమవుతాము అన్నారు. అన్నమాచార్యుల
యొక్క గొప్ప పరిశీలనా శక్తిని చూడండి.
ఈ విధంగా, దేవుడు లేదా సత్యం అనే విషయం ఏ విధంగానూ,
ఎప్పటికీ నిర్ధారించబడక వివాదాస్పదంగానే ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు నడిస్తే, ఈ రకముగా అనేకులలో విస్తరించబడిన సత్యమును సాధారణ
కళ్ళతో చూడలేమనీ తెలుస్తుంది. ఇప్పుడు భగవద్గీత 8వ శ్లోకము, 11వ అధ్యాయంలో భగవానుడు
అర్జునునికి ప్రత్యేక దృష్టిని కల్పించిన విషయం ప్రస్తావించడం సందర్భోచిత మనుకుంటున్నాను.
జిడ్డు కృష్ణమూర్తి దృష్టిలో ఇటువంటి రూపాంతరం జరగడం గురించి ‘ఇయర్స్ ఆఫ్ అవేకనింగ్’
అనే పుస్తకములో వర్ణించడింది.
భగవద్గీతలోని ఈ శ్లోకమును “సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షిశిరోముఖమ్
। సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి’ (13-14) {ఎక్కడ చూసినా కాళ్లూ, చేతులూ తలలూ ముఖాలూ చెవులూ కలిగి ఈ విశ్వమంతటా అదే వ్యాపించి
ఉంది} అని పరోక్షముగా ప్రస్తావించిరి.
అన్వయార్ధము: ఓ నరుడా! నీలో ఘర్షణపడుచున్న వ్యతిరేకములను పక్కనపెట్టి, నీ
చుట్టూ వ్యాపించియున్న సత్యాన్ని కనుక్కో.
దూరము కర్మమునకు జ్ఞానము తోడనే వొండకటికిని
దూరము పరమునకు బ్రపంచము తొలుత విరుద్ధంబు;
దూరము విరతికి సంసారము; తుదమొదలే లేదు;
యీరీతుల నీ వెడమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా ॥కొంద॥
dUramu
karmamunaku j~nAnamu tODanE voMDakaTikini
dUramu
paramunaku brapaMchamu toluta viruddhaMbu;
dUramu
viratiki saMsAramu; tudamodalE lEdu;
yIrItula nI veDamAyalu yEgati deliseda nEnayyA ॥koMda॥
Word to Word meaning: దూరము (dUramu) = distant, far-off; కర్మమునకు (karmamunaku) = to action (mostly physical); జ్ఞానము (j~nAnamu) = the intelligence; తోడనే (tODanE) together with; accompanying; వొండకటికిని (voMDakaTikini) = అన్యోన్యము, harmonious; దూరము (dUramu) = distant, far-off; పరమునకు (paramunaku) = the unworldliness; బ్రపంచము (brapaMchamu) = this world; తొలుత (toluta) = (మొదటిది, the first one) here implied meaning is fundamentally; విరుద్ధంబు; (viruddhaMbu) = opposed, unfavourable; {తొలుత విరుద్ధంబు = fundamentally different}; దూరము (dUramu) = distant, far-off; విరతికి (viratiki) = dispassionate; సంసారము; (saMsAramu) = this family life, this world; తుదమొదలే లేదు (tudamodalE lEdu) = there is neither beginning nor end; యీరీతుల (yIrItula) = by these methods, by this manner; నీ (nI) = you; వెడమాయలు (veDamAyalu) = wicked illusions; యేగతిఁ (yEgati) = in what way; దెలిసెద (deliseda) = distinguish or understand; నేనయ్యా (nEnayyA) = me, Sir;
Literal meaning: The intelligence is unrelated to (physical) action, yet they appear harmonious with each other. This world and the Other (=unworldliness) are exclusive to each other. The family life, this world of man has neither beginning nor end. Yet the family life and dissociation appear like strange bedfellows. O! God! How do I comprehend these dreadful illusions when mutually discordant things are passed on like twins?
Explanation: Just observe how deep this stanza is. Many of us in order to reach God, go on increasing knowledge, or reading holy books, go in philanthropic work etc. All these actions, fall into the category of Karma or drudgery, are unnecessary says ‘traditionally trained’ Annamacharya.
The route to another world is not connected to this
world. If we are serious, will not pursue the temporal avenues. Further, if one
is really dissociated, why will he get engaged in worldly affairs?
Thus, Sir, by this stanza, Annamacharya is emphasising
that do not go by traditional thinking to reach god. In fact the whole
structure of this world and its related associations must be ostracised
conspicuously.
Implied meaning: Can you clearly see inconsistency between the intelligence and daily grind? Are you able to differentiate this world and the unworldliness? Do you think this dissociation is last phase of family life? O Man, go beyond the appearances and its uncountable wings.
భావము: జ్ఞానమునకు కర్మలతో
సంబంధం లేదే. అకారణంగా అవి ఒకదానికొకటి ఆన్నదమ్ములన్నట్లుగా అనిపింప చేస్తావే? పరస్పరము
విరుద్ధమైన ప్రపంచము మరియు పరములు (=అన్యము = ప్రపంచముతో సంబంధము లేనిది) తగిలియుండున్నట్లుగా
తోస్తుందే? తుదిమొదలులేని సంసార వృక్షమెక్కించి విరక్తికి త్రొవ అదియే అని భావించునట్లు
చేస్తావే. ఓ దేవా! నీ వెడమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా?
వివరణము: ఈ చరణం ఎంత లోతైనదో గమనించండి.
మనమందరం భగవంతుడిని చేరుకోవడానికి, జ్ఞానాన్ని సముపార్జనమో లేదా పవిత్ర గ్రంథములు
చదవడమో, దానాలు చేయడమో చేస్తామని, ఈ చర్యలన్నీ అనవసరం అని ‘పారంపర్య పద్ధతులలో’
పెంచబడిన అన్నమాచార్యులు చెప్పారు.
‘పరము’ అనుదానికి మార్గం ఈ ప్రపంచంతో అనుసంధానించబడలేదు. మనం నిజంగా
పొందాలంటే ఈ లోకపు మార్గాలను అనుసరిస్తామా? ఇంకా, ఒక వ్యక్తి నిజంగా పరాఙ్ముఖుడైతే
అతడు ప్రాపంచిక వ్యవహారాలలో ఎందుకు నిమగ్నమై ఉంటాడు?
కాబట్టి, ఈ చరణం ద్వారా,
అన్నమాచార్యులు భగవంతుడిని చేరుకోవడానికి సంప్రదాయబద్ధమైన ఆలోచనలు
పనికిరావని, ఉద్ఘాటిస్తున్నారు.
వాస్తవానికి ఈ ప్రపంచము, దాని ఆధారభూతములైన నిర్మాణములన్నింటినీ తిరస్కరించడమే
మొదటి మెట్టు.
అన్వయార్ధము: జ్ఞానమునకు మరియు రోజువారీ జీవితానికి మధ్య వ్యత్యాసం నీవు
స్పష్టంగా చూడగలవా? ఈ ప్రపంచాన్ని మరియు పరమును ఒకే కోణంలో చూస్తున్నావా? ఈ
పరిత్యాగము ఈ కుటుంబ జీవితానికి చరమ దశ అని అనుకుంటున్నావా? ఓ మానవుడా, ప్రపంచము,
దాని రూపురేఖలు, దాని లెక్కించలేని తీరాలను దాటి వెళ్ళు.
కూడదు దేహమునకు నాత్మకు గోత్రవిరోధం; బెన్నఁడును
కూడదు కోపమునకు శాంతము గుణావగుణములను;
కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన;
యేడ గొలఁదిగా శ్రీహరిమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా ॥కొంద॥
kUDadu
dEhamunaku nAtmaku gOtravirOdhaM; bennaDunu
kUDadu
kOpamunaku SAMtamu guNAvaguNamulanu;
kUDadu
baMdhamunaku mOkshamu kOrikalE kaTlugAna;
yEDa
goladigA SrIharimAyalu yEgati deliseda nEnayyA॥koMda॥
Word to
Word meaning: కూడదు (kUDadu) = not proper; దేహమునకు (dEhamunaku)
= for the body; నాత్మకు (nAtmaku) = for the Atma
(soul); గోత్రవిరోధంబు (gOtravirOdhaMbu) = {గోత్రము (gOtramu) a Hindu
traditional form indicating lineage of a person} Opposing
Lineage here meaning is immiscible; ఎన్నఁడును (ennaDunu) =
always; కూడదు (kUDadu) = not proper; కోపమునకు (kOpamunaku)
= for the anger; శాంతము (SAMtamu) =calmness,
quietness; గుణావగుణములను guNAvaguNamulanu)
= one is good quality and another a deplorable defect; కూడదు (kUDadu) = not proper;
బంధమునకు (baMdhamunaku) = bondage; మోక్షము (mOkshamu) = liberation; కోరికలే (kOrikalE) = desires; కట్లుగాన (kaTlugAna) = because they are binding; యేడ గొలఁదిగా (yEDa goladigA) = plenty; శ్రీహరిమాయలు (SrIharimAyalu) = illusions created by Lord Srihari; యేగతిఁ (yEgati) =
in what way; దెలిసెద (deliseda) = know or
understand; నేనయ్యా (nEnayyA) = me, Sir;
Literal meaning: Though the soul is inside the body, they remain immiscible. You cannot classify calmness as good quality and anger as deplorable defect (because they are different things) Same way, do not put the liberation and bonding in one group, for the desires are the true ropes binding us. Do I ever get to know these uncountable deceptions O Sri Hari!
Explanation: Please understand that being calm is not related anger. On observation you will find that, getting into anger is deviation from being calm. On the other hand, ‘not being in anger’ is not necessarily imply quietness. Therefore, they aren't related.
The soul is absolutely a conceptual issue. Whereas the body is a physical existence. Are they truly different things?
Even wanting to get liberated is a ‘desire’. In liberated state ‘desire to get liberated’ is absent. Therefore, ‘desire to get liberated’ is a direct indication of one’s status.
Adi Sankaracharya in Manisha Pnachakam said सैवाहं न च दृश्य वस्त्विति दृढ प्रज्ञापि
यस्यास्तिचे saiva aham na cha drisya vastwiti drudha prajnaapi yasya asti chaet
It is not a cognizable object in spite of any amount of material intelligence. Similar
meaning is expressed by Annamacharya.
Implied
meaning: O man, can you clearly recognise what constitutes the body
and the soul? Do not equivocate calmness as absence of anger. Recognise that
the ‘desire to be free’ is a
bondage? Where is the tool to deal with these numerous apparitions?
భావము: ఆత్మ శరీరం లోపలనే ఉన్నా, అవి కలవవే? ప్రశాంతతను మంచి గుణముగాను, కోపాన్ని దుర్భరమైన లోపంగాను వర్గీకరించలేమే! అవి
ఒకే కొలబద్దలోని అటుఇటు గల చివరలను సూచించు విషయములు కావే! (అవి సంబంధంలేని వేర్వేరు
విషయాలు.) అలాగే, విముక్తిని మరియు బంధాలతో పోల్చలేమే, ఏలనంటే కోరికలే (మనలను) బంధించే
నిజమైన తాళ్ళు. శ్రీ హరీ! నీ ఈ మోసాలన్ని ఎప్పటికైనా తెలుసుకోగలనా?
వివరణము: కోపం తెచ్చుకోవడం అనేది ప్రశాంతత
నుండి వైదొలగడం అని తెలుసుస్తుంది. కానీ ‘కోపంలో ఉండకపోవడం’ అనేది ప్రశాంతతను సూచించాల్సిన
అవసరం లేదు. అందువల్ల, కోపము ప్రశాంతతలు సంబంధం లేనివే.
ఆత్మ అనేది పూర్తిగా భావము
నందలిది. అయితే శరీరం భౌతికమైన ఉనికి. అవి నిజంగా ఒకదానితో ఒకటి పొసగని విషయములా?
విముక్తి పొందాలనుకోవడం కూడా ఒక
‘కోరిక’. విముక్త స్థితిలో 'మోక్షము పొందాలనే కోరిక' ఉండదు. కాబట్టి, 'విముక్తి
పొందాలనే కోరిక' అనేది వారివారి స్థితికి ప్రత్యక్ష సూచిక.
ఆదిశంకరులు మనీషాపంచకంలో "సైవాహం న చ దృశ్యవస్త్వితి
దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే" (భౌతికంగా ఎంత మేధస్సు ఉన్నప్పటికీ అది (ఆత్మ)
గుర్తించలేనిదే) అన్నారు.
అన్వయార్ధము: శరీరమేమిటో మరియు ఆత్మ ఏమిటో స్పష్టంగా గుర్తించగలవా? కోపం
లేనంత మాత్రమున ప్రశాంతత ఉందనుకోకు. ‘స్వేచ్ఛగా ఉండాలనే కోరిక’ ఒక బంధమని
గుర్తించావా? శ్రీ హరీ! ఈ దృశ్యాదృశ్యాలను ఎదుర్కోవటానికి సాధనమేదో?
శ్రీ వేంకటపతి నన్నీ గతిఁ జిక్కించితి వీజగమునను;
భావింపఁగరాదు నీమహిమ బహుముఖములయర్ధముగాన;
యేవిధమును నేఁటికి నాకిఁక యెందెందని తగిలెద నేను
దైవికమగు నీదాసానుదాస్యము దక్కినదే నాకు॥కొంద॥
SrI
vEMkaTapati nannI gati jikkiMchiti vIjagamunanu;
bhAviMpagarAdu
nImahima bahumukhamulayardhamugAna;
yEvidhamunu
nETiki nAkika yeMdeMdani tagileda nEnu
daivikamagu
nIdAsAnudAsyamu dakkinadE nAku ॥koMda॥
Word to Word meaning: శ్రీ వేంకటపతి (SrI vEMkaTapati) = Lord Venkateswara; నన్ను (nannu) = me; ఈ గతిఁ (I gati) = this way; జిక్కించితివి (jikkiMchitivi) = trapped; ఈ జగమునను (I jagamunanu) = to this world; భావింపఁగరాదు (bhAviMpagarAdu) = unable to imagine; నీమహిమ (nImahima) = your splendour; బహుముఖముల (bahumukhamula) = many faceted; యర్ధముగాన (yardhamugAna) = significane because; యేవిధమును (yEvidhamunu) = in what way; నేఁటికి (nETiki) = this day; నాకిఁక (nAkika) = for me what else; యెందెందని (yeMdeMdani) = in what all; తగిలెద (tagileda) = get engaged, get hooked; నేను (nEnu) = me; దైవికమగు (daivikamagu) = providential, act of God; నీదాసానుదాస్యము (nIdAsAnudAsyamu) = being servant of your servants; దక్కినదే (dakkinadE) = available; నాకు (nAku)= to me.
Literal meaning: O God! I really do not know what is there. What is here. Yet you trapped me in this world. Its impossible to know your exhaustive multi layered splendour. I would have been swept away in the flood of illusions but for the being servant of your servants.
Explanation: This stanza is based on this bhagavadgita verse दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया | मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते || 7-14|| daivī hyeṣhā guṇa-mayī mama māyā duratyayā mām eva ye prapadyante māyām etāṁ taranti te Purport: Gods divine energy Maya, consisting of the three modes of nature, is very difficult to overcome. But those who surrender unto God cross over it easily.
భావము: శ్రీ వేంకటపతి నన్ను అటు యేముందో, ఇటు యేముందో తెలియని ప్రపంచమున
ఇరికించావా? బహుళార్ధమైన నీ మహిమలను తెలియరాదు. అవివేకంతో యెందెందో తగిలి కొట్టాడుతున్న
నాకు దైవికమగు నీదాసానుదాస్యము చిక్కుటవలన ధన్యుడనైతిని.
వివరణము: భగవద్గీతలోని “దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
/ మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే” (7-14) {భావము: ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ
శక్తి, 'మాయ', అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు దానిని
సునాయాసముగా దాటిపోగలరు.} శ్లోకమును ఈ చరణములో అన్నమాచార్యులు
ప్రస్తావించిరి.
Recommendations for further reading:
84. తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను (telisinavADA gAnu teliyanivADA gAnu)
105. కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను (kaninavADA gAnu kAnanivADA gAnu)
Summary of this Keertana:
For some these are acceptable. For others not. How do I recognize when you reflect these wicked illusions in so many people? Implied meaning: O man! setting aside your preferences, find the truth thinly dispersed around you.
The intelligence is unrelated to (physical)
action, yet they appear harmonious with each other. This world and the Other
(=unworldliness) are exclusive to each other. The family life, this world of
man has neither beginning nor end. Yet the family life and dissociation appear
like strange bedfellows. O! God! How do
I comprehend these dreadful illusions when mutually discordant things are passed
on like twins? Implied meaning: Can
you clearly see inconsistency between the intelligence and daily grind? Are you
able to differentiate this world and the unworldliness? Do you think this
dissociation is last phase of family
life? O Man, go beyond the appearances and its uncountable wings.
Though the
soul is inside the body, they remain immiscible. You cannot classify calmness
as good quality and anger as deplorable defect (because they are different
things) Same way, do not put the liberation and bonding in one group, for the
desires are the true ropes binding us. Do I ever get to know these uncountable deceptions
O Sri Hari! Implied meaning: O
man, can you clearly recognise what constitutes the body and the soul? Do not equivocate
calmness as absence of anger. Recognise that the ‘desire to be free’ is a bondage? Where is the tool
to deal with these numerous apparitions?
O God! I really do not know what
is there. What is here. Yet you trapped me in this world. Its impossible to
know your exhaustive multi layered splendour. I would have been swept away in
the flood of illusions but for being the servant of your servants.
కీర్తన సంగ్రహ భావము:
కొందరి కివి సమ్మతియైతే కొందరి
కవి గావు. యిందరిలోపల నీ వెడమాయలు (భ్రమలను ప్రతిబింబిస్తున్నప్పుడు) నిన్ను
నేను ఎలా గుర్తించేనయ్య. అన్వయార్ధము: ఓ నరుడా! నీలో ఘర్షణపడుచున్న వ్యతిరేకములను పక్కనపెట్టి, నీ
చుట్టూ వ్యాపించియున్న సత్యాన్ని కనుక్కో.
జ్ఞానమునకు కర్మలతో సంబంధం లేదే. అకారణంగా అవి ఒకదానికొకటి
ఆన్నదమ్ములన్నట్లుగా అనిపింప చేస్తావే? పరస్పరము విరుద్ధమైన ప్రపంచము మరియు పరములు
(=అన్యము = ప్రపంచముతో సంబంధము లేనిది) తగిలియుండున్నట్లుగా తోస్తుందే? తుదిమొదలులేని
సంసార వృక్షమెక్కించి విరక్తికి త్రొవ అదియే అని భావించునట్లు చేస్తావే. ఓ దేవా!
నీ వెడమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా? అన్వయార్ధము: జ్ఞానమునకు
మరియు రోజువారీ జీవితానికి మధ్య వ్యత్యాసం నీవు స్పష్టంగా చూడగలవా? ఈ ప్రపంచాన్ని
మరియు పరమును ఒకే కోణంలో చూస్తున్నావా? ఈ పరిత్యాగము ఈ కుటుంబ జీవితానికి చరమ దశ
అని అనుకుంటున్నావా? ఓ మానవుడా, ప్రపంచము, దాని రూపురేఖలు, దాని లెక్కించలేని
తీరాలను దాటి వెళ్ళు.
ఆత్మ శరీరం లోపలనే ఉన్నా, అవి
కలవవే? ప్రశాంతతను మంచి గుణముగాను,
కోపాన్ని దుర్భరమైన లోపంగాను వర్గీకరించలేమే! అవి ఒకే కొలబద్దలోని అటుఇటు
గల చివరలను సూచించు విషయములు కావే! (అవి సంబంధంలేని వేర్వేరు విషయాలు.) అలాగే,
విముక్తిని మరియు బంధాలతో పోల్చలేమే, ఏలనంటే కోరికలే (మనలను) బంధించే నిజమైన
తాళ్ళు. శ్రీ హరీ! నీ ఈ మోసాలన్ని ఎప్పటికైనా తెలుసుకోగలనా? అన్వయార్ధము: శరీరమేమిటో మరియు ఆత్మ ఏమిటో స్పష్టంగా గుర్తించగలవా? కోపం
లేనంత మాత్రమున ప్రశాంతత ఉందనుకోకు. ‘స్వేచ్ఛగా ఉండాలనే కోరిక’ ఒక బంధమని
గుర్తించావా? శ్రీ హరీ! ఈ దృశ్యాదృశ్యాలను ఎదుర్కోవటానికి సాధనమేదో?
శ్రీ వేంకటపతి నన్ను అటు
యేముందో, ఇటు యేముందో తెలియని ప్రపంచమున ఇరికించావా? బహుళార్ధమైన నీ మహిమలను
తెలియరాదు. అవివేకంతో యెందెందో తగిలి కొట్టాడుతున్న నాకు దైవికమగు నీదాసానుదాస్యము
చిక్కుటవలన ధన్యుడనైతిని.
Copper Leaf: 80-3 Volume 1-384
కర్మలకు, జ్ఞానానికి సంబంధం లేకపోయినా, సంసారలంపటంలో పడిన మానవుడు ఆ రెండునూ ఒకదానితో నొకటి ముడిపడి ఉన్నవేనన్న భ్రమను కలిగిస్తాడు దేముడు. అట్లాగే ఆత్మ,శరీరం
ReplyDeleteవేరైనా, అవి రెండూ ఒకటేయనే భ్రమను (ఆత్మానాత్మ అభేదం)
కలిగిస్తాడు. విముక్తి యనే కోరిక కూడా బంధానికి కారణం.
అంతటా నీవున్నావని అంటారు కాని, దేవుడున్నాడని కొందరు, లేడని మరికొందరు భిన్నమైన దృక్పథంతో ఉన్నారీ ప్రపంచంలో. ఇన్ని భ్రమలను ప్రతిబింబిస్తున్న ఇందరిలోపల నిన్ను నేనెలా గుర్తించగలనని అంటూనే, అట్టి భ్రమలను అన్నిటినీ తొలగించుకొని సత్యాన్ని కనుగొనాలని అన్నమయ్య ఈ కీర్తనలో అంటున్నాడు.
అజ్ఞానము, జ్ఞానము మధ్య గల అడ్డుతెరను తొలగించికొని, సత్యస్వరూపమును దర్శించుకొమ్మని బోధిస్తున్నాడు
అన్నమయ్య మానవాళికి.
శ్రీనివాస్ గారి వ్యాఖ్యానం, దానికి అనుబంధంగా గీత శ్లోకములు, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పలుకులను చక్కగా వివరించారు.
కృష్ణ మోహన్ 🙏
భగవంతుడి దాసానుదాస్యం కూడా దైవికంగా (దేవుడి సంకల్పంతో) కలిగింది కానీ ఆయన మాయల్ని నేను తెలుసుకొని తరించడం వల్ల కాదు అని చివరిలో కన్క్లూజన్
ReplyDelete