Sunday, 20 February 2022

109. చదివితిఁ దొల్లి కొంతచదివే నింకాఁ గొంత (chadiviti dolli koMtachadivE niMkA goMta)

                                                           ANNAMACHARYA 

109. చదివితిఁ దొల్లి కొంతచదివే నింకాఁ గొంత 

(chadiviti dolli koMtachadivE niMkA goMta)

 

Introduction: In this yet another gem of poetry, Annamacharya says man sees the world in others. But the same man is oblivious to the fact that what he sees is his own reflection. Annamacharya says this is the fundamental wrong step taken by man.

He finds faults in others with no compunction. When time comes to judge himself, he invents thousands of ways to justify his action and extracts solace in his intentions and thus builds the house of falsehood. Therefore, man derives immense indemnity out of each judgement.

He abhors faults in others. But does not loathe his own infirmities. Without knowing the basis, man goes on the adventures of this demarcation of Self and Others. Man’s duty is to keep his heart open. Instead, he is inquisitive whether God will bless him?

ఉపోద్ఘాతము: రో అద్భుతమైన, మాటిమటికి వినాలనిపించే కీర్తనలో అన్నమాచార్యులు మనిషి ఇతరులలో ప్రపంచాన్ని చూస్తాడని చెప్పారు. ‘యెదిరి నన్నెఱఁగను యెంతైనా నయ్యో అంటూ అదే మనిషి తాను చూసేది తన సొంత ప్రతిబింబం అని అర్థం చేసుకోలేడన్నారు. 

అన్నమాచార్యులు ఇది మనిషి వేయు ప్రాథమికమైన తప్పుటడుగు అన్నారు. అతను ఇతరులలో తప్పులు వెతుకుతాడు. తనకు తాను తీర్పు యిచ్చుకునే సమయం వచ్చినప్పుడు, అతను తన చర్యలను సమర్థించుకోవడానికి వేలాది మార్గాలను కనిపెడతాడు. సత్యమును గ్రహించుటకు బదులు తన ఉద్దేశ్యము సరియైనదని, ఈ ఒక్క తప్పు భవిష్యత్తులో సరిదిద్దుకోగలననీ సర్దిచెప్పుకుని, ఓదార్పుని పొంది, అబద్ధాల కోటల​ వెనుక దాక్కోబోతాడు. అప్రయోజనకమరగు తృప్తిని సాధిస్తాడు.  

మానవుడు ఇతరులలోని దుర్గణములను అసహ్యించుకుంటాడు. కానీ తన స్వంత బలహీనతలను కొంతైనా ఏవగించుకోడు. మనిషి తనకు, పరులకు మధ్య ఆధారమే లేని వివక్షతకు హద్దులేమిటో నిర్ణయిస్తాడు. మనిషి కర్తవ్యం తన హృదయాన్ని తెరిచి ఉంచడం మాత్రమే. దానికి బదులుగా, దేవుడు తనకు ముక్తినిస్తాడా?' అని ఆదుర్దా పడతాడు! అనుమానిస్తాడు! 

 

కీర్తన:

చదివితిఁ దొల్లి కొంతచదివే నింకాఁ గొంత

యెదిరి నన్నెఱఁగను యెంతైనా నయ్యో ॥పల్లవి॥ 

వొరుల దూషింతుఁగాని వొకమారైన నా-

దురితకర్మములను దూషించను
పరుల నవ్వుదుఁగాని పలుయోని కూపముల
నరకపు నామేను నవ్వుకోను ॥చది॥ 

లోకులఁ గోపింతుఁగాని లోని కామాదులనేటి-

కాకరి శత్రులమీఁదఁ గడుఁ గోపించ
ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుఁగాని
తేకువ నాలోని హరిఁ దెలుసుకోలేను ॥చది॥ 

యితరుల దుర్గణము లెంచి యెంచి రోతుఁగాని

మతిలో నా యాసలు మానలేను
గతిగా శ్రీవేంకటేశుఁ గని బ్రదికితిఁగాని
తతి నిన్నాళ్లదాఁకా దలపోయ లేను ॥చది॥

 

chadiviti dolli koMtachadivE niMkA goMta

yediri nanne~raganu yeMtainA nayyO pallavi
 
vorula dUshiMtu gAni vokamAraina nA-
duritakarmamulanu dUshiMchanu
parula navvudu gAni paluyOni kUpamula
narakapu nAmEnu navvukOnu   chadi 

lOkula gOpiMtu gAni lOni kAmAdulanETi-

kAkari SatrulamIda gaDu gOpiMcha
AkaDa buddulu cheppi anyula bOdhiMtugAni
tEkuva nAlOni hari delusukOlEnu           chadi 

yitarula durgaNamu leMchi yeMchi rOtugAni

matilO nA yAsalu mAnalEnu
gatigA SrIvEMkaTESu gani bradikiti gAni
tati ninnALladAkA dalapOya lEnu           chadi

 

 

Details and Explanations:

 

చదివితిఁ దొల్లి కొంతచదివే నింకాఁ గొంత

యెదిరి నన్నెఱఁగను యెంతైనా నయ్యో ॥పల్లవి॥

 

chadiviti dolli koMtachadivE niMkA goMta

yediri nanne~raganu yeMtainA nayyO pallavi

 

Word to Word meaning: చదివితిఁ (chadiviti) = read, studied;  దొల్లి (dolli = తొల్లి = tolli) = earlier; కొంత (koMta) = some extent; చదివేను (chadivEnu) = will read, will learn; నింకాఁ (= ఇంకాఁ =iMkA) = further;  గొంత (=కొంత = goMta = koMta) = some extent;  యెదిరి (yediri) = the one before me; opponent; నన్నెఱఁగను (nanne~raganu) = I do not know myself; యెంతైనా (yeMtainA) = to any extent; నయ్యో ( = అయ్యో = ayyO)  = alas.

 

Literal meaning: I learnt a bit earlier. I shall learn a bit more. Alas I do not know myself though present all the time in front of me. 

Explanation: Mans pursuit for more knowledge to understand this world is a futile exercise. We have been practicing from time immemorial, did we reach anywhere? Please remember the words of Annamacharya munniTi jagamE munniTi lOkamE (మున్నిటి జగమే మున్నిటి లోకమే) the world all along the ages, elementarily stands the same way. Therefore, there is nothing new to learn in this world. Thus, the pursuit of knowledge (about the self) is pointless exercise, rather a retrograde step. 

Most revelatory things said is yediri nanne~raganu (యెదిరి నన్నెఱఁగను = failed to know my self though present before me). Annamacharya said the world present before every one is the true picutre of oneself. With this he reminds us the Jiddu Krishnamurti’s book “You are the World”. 

Can you find yourself in the mirror called the world in front of you? If not, what is use of the education? O man, you are wasting your energy in the wrong direction. Philosophers say modern education has failed because it is putting us on the wrong scent. Jiddu Krishnamurti and Annamacharya received very little formal education, yet their observations are baffling great minds of modern era. Thus, action to liberate oneself is the only education, all other pursuits are wasteful efforts. 

At this point it would not be out of place to recall Bhagavad-Gita saying एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ||13-12|| etaj jñānam iti proktam ajñānaṁ yad ato ’nyathā (= constancy in spiritual knowledge; and philosophical pursuit of the Absolute Truth—I declare to be knowledge, and what is contrary to it, I call ignorance). 

yeMtainA (యెంతైనా = to any extent) is signifying that very little we know about ourselves. Let us remember previously covered verse, EDE jEnalu yIdEhaMbunu / yEDA nikamari yeragamu nEmupallavi ఏడే జేనలు యీదేహంబును / యేడా నిఁకమరి యెరఁగము నేము this body is only of seven hand spans long. Alas, we don’t understand (this small thing).           

Implied meaning: Do not waste time in pursuit of more knowledge. Can you see yourself in the reflection of this world (within you)? 

భావము: చదివితి తొల్లి కొంత. చదివెద ఇంకా కొంత. అయ్యో! ఎదురుగా ఉన్న నన్నే కొంతైనా ఎఱగనే! 

వివరణము: అన్నమాచార్యులు చెప్పిన 'మున్నిటి జగమే మున్నిటి లోకమే' (= ప్రపంచం ఎప్పటి లానే ఉంది. ఉంటుంది.) అన్నది గుర్తుకు తెచ్చుకుందాం. అనగా ఈ ప్రపంచాన్ని మరింత అర్థం చేసుకోవడానికి మనిషి చేయు ప్రయత్నములన్నీ వ్యర్థములే.  యుగయుగాలుగా సాగుతున్న ఈ సాధన ఇప్పటి వరకు గమ్యమును చేర్చలేదుకదా! ఈ చిన్నిపాటి జీవితములో సాధించగలనను కోవడమూ అవివేకమే. అందుకే ఈ ప్రపంచంలో కొత్తగా నేర్చుకోవలసింది ఏమీ లేదు. అందువల్ల, మనిషి (తన గురించి) అన్వేషించడం, చదవడం అనేవి తిరోగమన చర్యలే. 

అన్నమాచార్యులు ప్రకటించిన అతి ముఖ్యమైన విషయం ​ ‘యెదిరి నన్నెఱఁగను’ {=అనగా ఎదురుగా ఉన్న నన్నే యెరగను, అనగా ఎదురుగా ఉన్న ఈ ప్రపంచమునే (నన్నే) యెరగను.} ప్రతి ఒక్కరి ముందు ఉన్న ప్రపంచమే మనిషి నిజమైన ప్రతిబింబమన్నారు. దీనితో  జిడ్డు కృష్ణమూర్తి వ్రాసిన  "యు ఆర్ ది వరల్డ్" అన్న పుస్తకాన్ని మనకు గుర్తుకు తెప్పిస్తున్నారు.

మీ ముందున్న ప్రపంచం అనే అద్దంలో మిమ్మల్ని మీరు కనుగొనగలరా? లేకపోతే చదివి కూడా ఉపయోగం ఏమిటి? ఓ మానవుడా! నీ శక్తిని అపసవ్య దిశలో వృధా చేసుకోకు. తత్వవేత్తలు ఆధునిక విద్య (చదువు) విఫలమైందని ఎందుకు అన్నారంటే అది మనల్ని తప్పుదారి పట్టించేలా చేస్తోంది కాబట్టి. అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి చాలా తక్కువ విద్యను అభ్యసించారు, అయినప్పటికీ వారి పరిశీలనలు గొప్ప మేధావులను సైతం తికమక పెడుతున్నాయి. ఆ విధంగా, తనను తాను విముక్తం చేసుకునే చర్య ఒక్కటే విద్య, ఇతరములన్నీ వ్యర్థ ప్రయత్నములు. 

ఈ సందర్భంగా భగవద్గీతలోని ఇదే విషయాన్ని చెప్పే శ్లోకాన్ని స్మరిద్దాం "ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా"||12-13|| అర్జునా!! నిరంతరము అధ్యాత్మ జ్ఞానము (ఆత్మ నిష్ఠ)  కలిగి ఉండుట, తత్వ జ్ఞానము  యొక్క      అంతర్దర్శనమును పొందుట (ప్రయోజనమును అనుభవించుట) జ్ఞానమని, తక్కినవన్నీ అజ్ఞానమని తెలియుము. 

యెంతైనా అన్న పదం మన గురించి మనకు చాలా తక్కువ తెలుసు అని సూచిస్తోంది. అన్నమాచార్యుల ‘ఏడే జేనలు యీదేహంబును / యేడా నిఁకమరి యెరఁగము నేము అన్న కీర్తన కూడా ఇదే చెబుతోంది. { శరీరం ఏడు జేనల పొడవు మాత్రమే. ఐనా, ( చిన్న విషయం) ఇంకా మనకు అర్థం కాదే}.

అన్వయార్ధము: మరింత చదివే బదులు ఈ ప్రపంచం అనే ప్రతిబింబంలో మిమ్మల్ని మీరు తెలియగలరా?

 

వొరుల దూషింతుఁగాని వొకమారైన నా-

దురితకర్మములను దూషించను

పరుల నవ్వుదుఁగాని పలుయోని కూపముల

నరకపు నామేను నవ్వుకోను ॥చది॥

 

vorula dUshiMtu gAni vokamAraina nA-

duritakarmamulanu dUshiMchanu

parula navvudu gAni paluyOni kUpamula

narakapu nAmEnu navvukOnu     chadi

 

Word to Word meaning: వొరుల (vorula) = others; దూషింతుఁ (dUshiMtu) = blame; గాని (gAni) = but; వొకమారైన (vokamAraina) = not even once; నా- (nA-) = my; దురితకర్మములను (duritakarmamulanu) = bad deeds; దూషించను (dUshiMchanu) = I do not censure; పరుల (parula) = others; నవ్వుదుఁ (navvudu) = make fun of; గాని (gAni) = but; పలుయోని కూపముల (paluyOni kUpamula) = multiple births;  నరకపు (narakapu) = hellish;  నామేను (nAmEnu) = my body; నవ్వుకోను (navvukOnu) = do not laugh at; 

Literal meaning: I readily blame others, but not even once, I censure my own bad deeds. I make fun of others. However, I do not laugh at myself who passed thru multiple births. 

Explanation: The wording paluyOni kUpamula narakapu nAmEnu (పలుయోని కూపముల నరకపు నామేను) is signifying the fragmented existence. Thus the true meaning is ‘our present existence is cobbled together by bonds we only created’. 

The said fragmentation occurs due to separation of the self from the world. Thus, the central idea of the chorus gets reinforced by this statement. The true movement of the soul is to align with the world. That journey is called the meditation. That is the unifying force of the world. 

As already has been explained our collective consciousness is the result of thousands of years of human existence. That’s why these philosophers keep saying that there are no new ideas in this world but uncovering of ideas.  

Implied meaning: I am quick to blame others, but I have never once condemned my own bad behaviour. While I make fun of others, I am completely unaware of my own fractured life. 

భావము: నేను ఇతరులను తక్షణమే నిందిస్తాను, కానీ ఒక్కసారి కూడా, నా స్వంత చెడు పనులను నేను నిందించుకోను. నేను ఇతరులను ఎగతాళి చేస్తాను. అయినప్పటికీ, బహుళ జన్మలెత్తిన నన్ను నేను నవ్వుకోను.

వివరణము: పలుయోని కూపముల నరకపు నామేను’ అన్న పదములు తునాతునకలైన జీవితమును సూచించుచున్నవి.   కావున, వీని నిజమైన అర్ధం ఏమిటంటే 'మన ప్రస్తుత (తునకలుగా ఉన్న) ఉనికి మనమే సృష్టించుకున్న బంధాల ద్వారా అతకబడి ఉంది'. 

ప్రపంచం నుండి మనిషి తనను తాను వేరుచేసుకోవడం వల్ల ఖండఖండములైన ఉనికి ఏర్పడింది. అలా చెప్పి, పల్లవిలోని  ప్రకటనకు మరింత పుష్థినిచ్చారు. ఆత్మ యొక్క నిజమైన కదలిక ప్రపంచంతో కలిసిపోవడమే. (ఈ విడి విడి భాగాలను ఏకీకృతం చేయడమే). ఆ ప్రయాణమే ధ్యానం. అదే తపస్సు. అదే విశ్వాన్ని ఏకం చేసే శక్తి.

ఇప్పటికే వివరించినట్లుగా, మన సామూహిక చైతన్యం వేల సంవత్సరాల మానవ ఉనికి యొక్క ఫలితం. అందుకే ఈ తత్వవేత్తలు ఈ ప్రపంచంలో కొత్త ఆలోచనలు లేవని, ఉన్న ఆలోచనలను వెలికితీయడమే కొత్తదనమని చెబుతున్నారు. 

అన్వయార్ధము: నేను ఇతరులను నిందిచినంత త్వరగా నా స్వంత చెడు ప్రవర్తనను ఖండించనే. ఇతరులను వెక్కిరిస్తూ,  వక్కలువక్కలైన నా స్వంత అవస్థనే తెలియను.

 

లోకులఁ గోపింతుఁగాని లోని కామాదులనేటి-

కాకరి శత్రులమీఁదఁ గడుఁ గోపించ
ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుఁగాని
తేకువ నాలోని హరిఁ దెలుసుకోలేను ॥చది॥ 

lOkula gOpiMtu gAni lOni kAmAdulanETi-

kAkari SatrulamIda gaDu gOpiMcha
AkaDa buddulu cheppi anyula bOdhiMtugAni
tEkuva nAlOni hari delusukOlEnu           chadi

 

Word to Word meaning: లోకులఁ (lOkula) = people; గోపింతుఁ (gOpiMtu) = get angry with; గాని (gAni) = but; లోని (lOni) = inside; కామాదులనేటి- (kAmAdulanETi-) = desires and lust; కాకరి (kAkari) = useless, pointless;  శత్రులమీఁదఁ (SatrulamIda) =on enemies; గడుఁ (gaDu) = much; గోపించ (gOpiMcha) = do not feel indignant; ఆకడ (AkaDa) = that side; బుద్దులు (buddulu) = principles of good living;  చెప్పి (cheppi) = quoting; అన్యుల (anyula) = others;  బోధింతుఁగాని (bOdhiMtugAni) = try to teach others;  తేకువ (tEkuva) = ధైర్యము, bravely, firmly;  నాలోని (nAlOni) = inside me; హరిఁ (hari) = Lord Hari;  దెలుసుకోలేను (delusukOlEnu) = do not know; 

Literal meaning: I get angry with people easily. However, I am not enraged by my internal foes, mainly cravings and lusts. I have this tendency to teach others about living principles, yet I lack the courage to seek out Lord Hari within myself. 

Explanation: This path of liberation is not for the faint hearted. Those who ostracise the world out of fear, are really looking for an asylum. Unfortunately, liberation is not a safe refuge. Its live den of truth. Therefore, the usage of word tEkuva (తేకువ= ధైర్యము, brave). 

Refer to verse adigAka nijamataM badigAka yAjakaM-badigAka hRdayasukha madigAka paramu [అదిగాక నిజమతం బదిగాక యాజకం-బదిగాక హృదయసుఖ మదిగాక పరము] (= other state is beyond the pretty imagination, beyond the methods of sacrifice, not a comforting theory to your heart).

భావము: లోకుల మీద సులభంగా కోపం తెచ్చుకుంటాను. ఐతే, నా అంతర్గత శత్రువులు, ప్రధానంగా కామక్రోధాదులపై,  నాకు కోపం చటుక్కున రాదే. నాలోని హరిని వెతకే ధైర్యం లేకున్నా, ఇటువైపు ఇతరులకు మంచి బోధించబోతాను.

వివరణము: ఈ విముక్తి మార్గం పిరికివారికి పనికిరాదు. భయంతో ప్రపంచాన్ని బహిష్కరించే వారు నిజంగా రక్షణకోసం ఎదురు చూస్తున్నట్లే. దురదృష్టవశాత్తు, ముక్తి సురక్షితమైన ఆశ్రయమే కాదు. ఇది సత్యమే  ప్రత్యక్షంగా నర్తించు రంగము.  అందుకే, తేకువ (= ధైర్యము) అనే  పదం అన్నమాచార్యులు ఉపయోగించారు.  అదిగాక నిజమతం బదిగాక యాజకం-బదిగాక హృదయసుఖ మదిగాక పరము {= పరము (=అన్యము; మీఁదిది) అనునది మన అభిప్రాయాల (/ఊహల)​ కంటే వేరుగా, యజ్ఞము/త్యాగముల మీద ఆధారపడకుండా, మానవుని యే చేష్టల మీదా ఆశ్రయించక​ ఉండి, ఊరట కూడా కలిగించక పోవచ్చు.} అనే కీర్తనలో కూడా ఈ విషయము ప్రస్తావించిరి.

 

యితరుల దుర్గణము లెంచి యెంచి రోతుఁగాని

మతిలో నా యాసలు మానలేను
గతిగా శ్రీవేంకటేశుఁ గని బ్రదికితిఁగాని
తతి నిన్నాళ్లదాఁకా దలపోయ లేను ॥చది॥

 

yitarula durgaNamu leMchi yeMchi rOtugAni

matilO nA yAsalu mAnalEnu
gatigA SrIvEMkaTESu gani bradikiti gAni
tati ninnALladAkA dalapOya lEnu           chadi

 

Word to Word meaning: యితరుల (yitarula) = others;  దుర్గణము (durgaNamu) = faults; లెంచి (leMchi) = count; యెంచి (yeMchi) = count; రోతుఁగాని (rOtugAni) = abhors; మతిలో (matilO) = in my mind; నా (nA) = my own;  యాసలు (yAsalu) = desires; మానలేను (mAnalEnu) = unable to give up; గతిగా (gatigA) = as a way, as a method;  శ్రీవేంకటేశుఁ (SrIvEMkaTESu) = Lord Venkateswara; గని (gani) = found;  బ్రదికితిఁ (bradikiti) = remained alive;  గాని (gAni) = but for; తతి (tati) = proper time; నిన్నాళ్లదాఁకా (ninnALladAkA) = till date; దలపోయ లేను (dalapOya lEnu) = unable to think, unable to determine; 

Literal meaning: Man keeps counting faults in others only to abhor. But fails to loathe his own fallacies. I could live by finding way to Lord Venkateswara, yet unable to determine the proper time. 

Explanation: tati (తతి= proper time) is indicating that whether one will be blessed in this lifetime is not in man’s hand. However, he must keep the doors of his heart open. This is the only  duty of man. 

Another notable point said by Annamacharya is that there is no life without finding the path to God. These philosophers always maintained that the life without the truth is hell. Even Bhagavad-Gita at points mentioned this. 

Implied meaning: Man abhors faults in others. But does not loathe his own infirmities. Man’s duty is to keep his heart open and stay on the path of God.  Instead, he is inquisitive on appropriate time to get liberation.

భావము: మనిషి ఇతరుల దుర్గణములను ఎంచి, ఎంచి అసహ్యించుకుటాడే కానీ తన కోరికలను మాత్రము ఈసడించుకోడు  నేను వేంకటేశ్వరునికి మార్గాన్ని కనుగొనడం ద్వారా జీవించి యున్నాను. ఐనా, సరైన సమయాన్ని నిర్ణయించలేను.  

 

వివరణము: ‘తతి’ (= సరైన సమయం) అనేది ఈ జీవితకాలంలో ఎవరికైనా ముక్తి లభిస్తుందా లేదా అనేది మనిషి చేతిలో లేదని సూచిస్తుంది. అయితే, తన గుండె తలుపులు తెరిచి ఉంచేదొక్కటే మనిషి చేయగలిగినది.

అన్నమాచార్యులు చెప్పిన మరో చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే సత్యమునకు (భగవంతుని) మార్గాన్ని కనుగొనకుండా జీవితమే లేదన్నారు. ఈ తత్వవేత్తలు ఎప్పుడూ సత్యము లేని జీవితం నరకమని అంటారు. భగవద్గీత కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది.

అన్వయార్ధము: మానవుడు ఇతరులలోని దుర్గణములను అసహ్యించుకుంటాడు. కానీ తన స్వంత బలహీనతలను కొంతైనా ఏవగించుకోడు. మనిషి కర్తవ్యం తన హృదయాన్ని తెరిచి భగవంతుని మార్గంలో ఉండడం మాత్రమే. దానికి బదులుగా, 'దేవుడు తనకు ముక్తినిస్తాడా?' అని ఆదుర్దా పడుతూ సమయాన్ని పారవేసు కుంటాడు.

 

Recommendations for further reading:

108. గోనెలె కొత్తలు కోడెలెప్పటివి (gOnele kottalu kODeleppaTivi)

39 అదిగాక నిజమతంబది గాక యాజకం (adigAka nijamataM badigAka yAjakaM)


 

Summary of this Keertana:

I learnt a bit earlier. I shall learn a bit more. Alas I do not know myself though present all the time in front of me. Implied meaning: Do not waste time in pursuit of more knowledge. Can you see yourself in the reflection of this world (within you)? 

I readily blame others, but not even once, I censure my own bad deeds. I make fun of others. However, I do not laugh at myself who passed thru multiple births.  Implied meaning: I am quick to blame others, but I have never once condemned my own bad behaviour. While I make fun of others, I am completely unaware of my own fractured life. 

I get angry with people easily. However, I am not enraged by my internal foes, mainly cravings and lusts. I have this tendency to teach others about living principles, yet I lack the courage to seek out Lord Hari within myself. 

Man keeps counting faults in others only to abhor. But fails to loathe his own fallacies. I could live by finding way to Lord Venkateswara, yet unable to determine the proper time. Implied meaning: Man abhors faults in others. But does not loathe his own infirmities. Man’s duty is to keep his heart open and stay on the path of God.  Instead, he is inquisitive on appropriate time to get liberation.

 

 

కీర్తన సంగ్రహ భావము:

చదివితి తొల్లి కొంత. చదివెద ఇంకా కొంత. అయ్యో! ఎదురుగా ఉన్న నన్నే కొంతైనా ఎఱగనే! అన్వయార్ధము: మరింత చదివే బదులు ఈ ప్రపంచం అనే ప్రతిబింబంలో మిమ్మల్ని మీరు తెలియగలరా? 

నేను ఇతరులను తక్షణమే నిందిస్తాను, కానీ ఒక్కసారి కూడా, నా స్వంత చెడు పనులను నిందించుకోను. నేను ఇతరులను ఎగతాళి చేస్తాను. అయినప్పటికీ, బహుళ జన్మలెత్తిన నన్ను నేను నవ్వుకోను. అన్వయార్ధము: నేను ఇతరులను నిందిచినంత త్వరగా నా స్వంత చెడు ప్రవర్తనను ఖండించనే. ఇతరులను వెక్కిరిస్తూ,  వక్కలువక్కలైన నా స్వంత అవస్థనే తెలియను. 

లోకుల మీద సులభంగా కోపం తెచ్చుకుంటాను. ఐతే, నా అంతర్గత శత్రువులు, ప్రధానంగా కామక్రోధాదులపై,  నాకు కోపం చటుక్కున రాదే. నాలోని హరిని వెతకే ధైర్యం లేకున్నా, ఇటువైపు ఇతరులకు మంచి బోధించబోతాను.

మనిషి ఇతరుల దుర్గణములను ఎంచి, ఎంచి అసహ్యించుకుటాడే కానీ తన కోరికలను మాత్రము ఈసడించుకోడు  నేను వేంకటేశ్వరునికి మార్గాన్ని కనుగొనడం ద్వారా జీవించి యున్నాను. ఐనా, సరైన సమయాన్ని నిర్ణయించలేను. అన్వయార్ధము: మానవుడు ఇతరులలోని దుర్గణములను అసహ్యించుకుంటాడు. కానీ తన స్వంత బలహీనతలను కొంతైనా ఏవగించుకోడు. మనిషి కర్తవ్యం తన హృదయాన్ని తెరిచి భగవంతుని మార్గంలో ఉండడం మాత్రమే. దానికి బదులుగా, 'దేవుడు తనకు ముక్తినిస్తాడా?' అని ఆదుర్దా పడుతూ సమయాన్ని పారవేసు కుంటాడు.

 

Copper Leaf: 313-2  Volume 4-74

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...