తాళ్లపాక అన్నమాచార్యులు
236 ఎఱిఁగినవారికి హింస లిన్నియు మాని
For English version press here
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు కీర్తనలు కవిత్వంలా చెప్పలేదు.
ఆ అనిర్వచనీయమైన యోగస్థితిలో వారికి
అప్రయత్నముగా లోక కల్యాణమునకై పొంగివచ్చిన
అపూర్వ వరదానములు.
మానవుని ఆదిమూలము నుంచి త్రవ్వి చూసి
ఆ తలకిందుల అశ్వత్థవృక్షము
కొమ్మ కొమ్మ ఎక్కి
జీవితమను పట్టణమున సందు సందు తిరిగి
మార్గములేని రహదారిలో నక్కి నక్కి వెళ్ళి
చెప్పరాని, చెప్పుకోలేని మలినములను వెలికితీసి
కుళ్ళును, క్రూరతను, ఈర్ష్యను, ఈసడింపులను
ఒక శాస్త్రవేత్తలా, ఒక గురువులా, ఒక తల్లిలా, ఒక మంత్రసానిలా
మన కనులెదుట కనిపింప చేసారు- చూడు నువ్వేమిటో అంటారు
కుదుట పడుటకు కాదు కవిత్వం మనసు చిలుకుటకు.
మనల్ని మనకు చూపించే అద్దం అన్నమయ్య.
అధ్యాత్మ కీర్తన |
రేకు: 173-1 సంపుటము: 2-356 |
ఎఱిఁగినవారికి హింస లిన్నియు
మాని మఱి సత్యమాడితేను మాధవుఁడే
దిక్కు ॥పల్లవి॥ కలుగుఁ గారణములు కామక్రోధములు
రేఁగ వెలసిన మాయవికార మది కలఁగఁగ వలనదు కర్త లెవ్వరుఁ
గారు తెలిసి వోరుచుకొంటే దేవుఁడే
దిక్కు ॥ఎఱిఁ॥ పదార్థా లెదుట నిలుచుఁ బంచేంద్రియాలు
రేఁగ వెదచల్లేటి మాయావికార మది పదరి పైకొనవద్దు పట్టితేఁ
బసలేదు చెదరక వోరిచితే శ్రీపతే దిక్కు ॥ఎఱిఁ॥ సిరులు తానే వచ్చే చిత్తాన
నాసలు రేఁగ విరసపు మాయావికారమది పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు శరణంటే నితని చరణాలే దిక్కు ॥ఎఱిఁ॥ |
Details
and Explanations:
పల్లవి:
ఎఱిఁగినవారికి హింస లిన్నియు మాని
మఱి సత్యమాడితేను మాధవుఁడే దిక్కు ॥పల్లవి॥
పదబంధం |
అర్థం |
ఎఱిఁగినవారికి |
తెలుసుకున్నవారికి |
హింస లిన్నియు
మాని |
పలురకాల హింసలు మాని |
మఱి |
ఒకసారి |
సత్యమాడితేను |
సత్యము పలికితేను |
మాధవుఁడే
దిక్కు |
మాధవుఁడే దిక్కు |
ప్రత్యక్ష భావము
తన
చర్యల ఫలితాలు బోధపడినవాడు
హింస యొక్క అన్ని రూపాలనూ పూర్తిగా విడిచిపెట్టి—
తరువాత
సత్యమును పలుక నేర్చితే —
మాధవుడు
(విష్ణువు) దిక్కుగా నిలుస్తాడు
వ్యాఖ్యానం:
అన్నమయ్య
ఆశయాలు వల్లె వేయలేదు,
ఆశల సౌధాల నిర్మించలేదు.
కుండ బద్దలైనట్టు —
ఉన్నదాన్ని ఉన్నట్టే చెప్పారు.
మనుషుల్లోని కల్మషాన్ని
తట్టి ఉలిక్కిపడేలా —
వెలికి చూపారు
దేహమనే చెట్టులో
ప్రాణమనే ఏరు పారు —
కాలమనే కొమ్మలకు
ఎక్కు నీరు.
చిగురులై, చెట్లై, ఘనమై
ఊహల తీగలు ఎగబాకి,
మొదలు మరుపై
అసలు వెనకై
మనసు కోతియై
మత్తెక్కి కొమ్మెక్కినట్టై
హింసకు రూపాలు — అనేకం
అన్నమాచార్యులు చెప్పే “హింస”
కత్తులతో, తుపాకులతో చేసే హింస కాదు.
అది నిత్య జీవితపు నవ్వుల మధ్య దాగి ఉంటుంది,
అంచనాల ముసుగులో తలదాచుకుంటుంది,
మాటల వెనక పొంచి ఉంటుంది,
తేనె పూసిన కత్తిలా, ఊపిరి తీసేలా దాచిన అన్యాయం.
ఈ హింసలు మన జీవితంలో
కనబడని ధూళిలాగ చొరబడతాయి.
ఈ పట్టికలో...వాటిలో కొన్నిటి ముఖచిత్రాలు మాత్రమే చూపించాను.
నిత్య
జీవితంలో హింస పలురకాలు |
|
1 |
మన అభిలాషలకు అనుగుణంగా ఇతరులను మార్చాలనే ప్రయత్నం ·
పిల్లలు
తమకు నచ్చిన పనులు చెయ్యాలి అనిపించకుండా, తామేం కావాలో చెబుతాం. ·
భార్యభర్తల
మధ్య — "నువ్విలా మాట్లాడకూడదు", "ఇలా ఉండకూడదు" అన్న నియంత్రణలు ·
ఇది
శారీరకంగా కాదు. కానీ ఒక మనిషి స్వతంత్రతను కట్టేస్తుంది |
2 |
వ్యంగ్యం, ఎత్తిపొడుపుమాటలు, ఎగతాళి మాటలు, ఆక్షేపణ, నింద ·
“ఇంకా నీకు ఉద్యోగం రాలేదా?” ·
“నీ లాంటి వాళ్లకి దీన్ని అర్థం
చేసుకోవడం ఎలా సాధ్యం?” ·
ఇవి వినగానే
నవ్వొస్తుంది. కానీ ఇవి మానసికంగా దెబ్బతీసే మాటలు. |
3 |
భావావేశబెదిరింపులు ·
ప్రేమను, దయను ఉపసంహరించటం — శిక్షగా ·
ఊదారంగా
మాట్లాడకుండా, గట్టిగా దూరంగా ఉండటం ·
"నువ్వు అది చెయ్యకపోతే నేను
నీతో మాట్లాడను" అన్న శైలి. |
4 |
మాటలతో, గుసగుసలతో, చెవులు కొరుక్కోవడంతో వ్యక్తిత్వాన్ని
హరించటం ఇది 100% హింస. ఎదుటివారికి శాపంగా మారుతుంది |
5 |
కోపాన్ని నియంత్రించకుండా, పదే పదే అరవడం పిల్లల మీద కేకలు వేయడం పనివాళ్ళను అవమానించడం ట్రాఫిక్ లో ఎదుటివాళ్లను తిడటం |
6 |
సహాయం చేసిన తరువాత మనం బాధ్యత వేయడం
|
7 |
తక్కువ చేసి చూపడం: ·
తక్కువగా
చూడటం, కులం/లింగం/పేదరికం వల్ల
ద్వేషించటం ఇది హింస — మనకు తెలియకుండానే మన లోపల గల విభజన. |
8 |
కిందపరచటం:
|
9 |
పోటీ తత్వం:
|
10 |
ఆత్మ హింస:
|
11 |
విమర్శ, అభాసం: విమర్శ రూపంలో అహంకారం ఆసక్తిలేని నటన కనిపించని అవమానం |
మఱి
సత్యమాడితేను మాధవుఁడే దిక్కు
అంటే
మన జీవితములలో సత్యము శూన్యమని
మాధవుని
అసత్య మార్గముద్వారా పొందలేమని
సత్యమొక్కటియే
దిక్కని నమ్మితే
మాధవుఁడే
దిక్కై నిలుస్తాడు.
మొదటి చరణం:
పాఠ్యం
|
భావము:
|
కలుగుఁ
గారణములు కామక్రోధములు రేఁగ |
శరీరములో
కామక్రోధములు రేఁగఉచుండగా మనము క్రొత్త క్రొత్త కారణములను కనుగొనబోతాము |
వెలసిన
మాయవికార మది |
అది తిష్టవేసుకున్న మాయవికారము |
కలఁగఁగ
వలనదు కర్త లెవ్వరుఁ గారు |
కలిగేది
కలగక మానదు. వలదన్నా వదలదు. ఈ జగములో కర్త లెవ్వరు లేరు. |
తెలిసి
వోరుచుకొంటే దేవుఁడే దిక్కు |
ఇది
తెలిసి ఓర్చుకుంటే దేవుఁడే దిక్కుగా నిలుస్తాడు. |
భావము:
వ్యాఖ్యానం:
దీనిని
క్రింది బొమ్మను విశదీకరించుకుంటూ తెలుసుకుందాము.
మాగ్రిట్
చిత్రించిన The Banquet — ఒక నిశ్శబ్ద విచ్ఛేదం. ఈ కళాఖండములో
సాయంత్రపు దృశ్యమును చూస్తాం. ఎఱ్ఱటి సూర్యుడు చెట్ల వెనుక ఎఱుపు రంగులో ఆకాశం కనబడుతూ
వుంటాయి. ఐతే అరణ్యం వెనుకన అజ్ఞాతంగా వుండవలసిన సూర్యుడు,
చెట్లను వెనకకు నెట్టి ముందుకొచ్చేశాడు.
ఇది అన్నమాచార్యుల మొదటి చరణంలో కనిపించే అంతర్గత కల్లోలానికి దృశ్యరూపం. సాధారణంగా, మనకు చూచుచున్న దృశ్యమునకు మధ్య ఏమీ వుండదు. అప్పుడు ఆ దృశ్యమును సంపూర్ణముగా చూడ గలుగుదుము. కానీ మనలో కామక్రోధాలు నిరంతరము చెలరేగుతూ దృశ్యమును కలగాపులగం చేయును.
మనము ముఖ్యంగా మన కుటుంబంలోను, బంధువులతొను, సాటి వుద్యోగులతోను సంభాషిస్తున్నప్పుడు మనసు తటస్తంగా వుండదు. పైబొమ్మలో చూపినట్లుగా రంగంలో దిగితుంది. దీనిని మనమంతా గమనించవచ్చును. అప్పుడు కామక్రోధాలు అనియంత్రితముగా ఆకస్మికంగా రేగుతాయి, మనస్సు వాటిని సమర్థించేందుకు కారణాలు సృష్టిస్తుంది.
ఆ బొమ్మలోని సూర్యుని లాగే మన అంతర్గత చైతన్యం కూడా మనకు, ఆ చూచు దృశ్యమునకు మధ్య నిలుచును. ఇక్కడ బొమ్మలో సూర్యుని లాగ, ‘చూచుట’ అను చర్యలోకి చొచ్చుకు వచ్చి ‘చూచు దృశ్యము’ను తారుమారు చేయుచున్నది.
కామక్రోధములు ఉత్ప్రేరకములు. వాని సమీపములో మనసు మాయకు గురియై, ప్రత్యక్ష చర్యకు పూనుకొనును. పై బొమ్మలో మాదిరి అడ్డదిడ్డముగా చూపినది నిత్య జీవితంలో మనము నిజముచేస్తాము. మనము కర్తలు కామన్న విషయమును మరచి ఈ చర్యలలో పాల్గొంటాము.
ఇలా అంధంగా
స్పందించకుండా, ఓర్పుగా భరించగలిగితే, ఒక లోతైన ద్వారం తెరుచుకుంటుంది. ఆ దశలో మాధవుడే ఒక్కటే దిక్కు — శ్రమతో కాదు,
నిశ్శబ్ద దృష్టితో. ఈ కీర్తన, ఆ చిత్రంతో కలిసి
చెబుతున్న సందేశం ఒక్కటే.
రెండవ చరణం:
పాఠ్యం
|
భావము: |
పదార్థాలెదుట
నిలుచుఁ బంచేంద్రియాలు రేఁగ |
ఐదు
ఇంద్రియాలు చురుకుగా జరిగితే, మన
దృష్టి పదార్థాలపైనే నిలుచుతుంది |
వెదచల్లేటి
మాయావికార మది |
అది
మనస్సుపై వెదజల్లిన మాయా వికారము — ఒక అసత్యపు మబ్బు |
పదరి
పైకొనవద్దు పట్టితేఁ బసలేదు |
వెలిసిన
దానిని పట్టుకోవడానికి తొందరపడకండి; పట్టుకున్నా దానిలో నిలకడలేదు |
చెదరక
వోరిచితే శ్రీపతే దిక్కు |
మనస్సు
చెదరకుండా భరించగలిగితే, శ్రీపతి మాత్రమే శరణ్యం అవుతాడు |
భావము:
ఐదు ఇంద్రియాలు చెలరేగితే,
మన దృష్టి పదార్థాలపైనే నిలుస్తుంది.
అదే మనస్సులో వెదచల్లబడి,
మాయచే మలినమై,
మబ్బుగా — కేంద్రంలేని పొగలా మారుతుంది.
వెలిసిన దానిని పట్టుకోవడానికి తొందరపడకండి —
పట్టుకున్నా, దానిలో సారమేమీ ఉండదు.
కానీ —
ఈ అలజడిని
మనస్సు చెదరనివ్వకుండా భరించగలిగితే —
శ్రీపతి ఒక్కడే మనకు దిక్కుగా నిలుస్తాడు.
వ్యాఖ్యానం:
ఇది మొదటి చరణమును మరింత బలపరచుచున్నది.
మూడవ చరణం:
పదబంధం |
అర్థం |
సిరులు
తానే వచ్చే చిత్తాన నాసలు రేఁగ |
చిత్తములో ఆశలు రేగుతుంటే సంపదలు (జీవితములు) వాటంతట అవే వస్తాయి |
విరసపు
మాయావికారమది |
వక్రీకరించు మాయ అది |
పరగ నలమేల్మంగపతి
శ్రీవేంకటేశ్వరు |
ఒప్పుగా అలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరుని |
శరణంటే నితని చరణాలే దిక్కు |
(శరణంటే చాలు. మానవులకు వేరు దిక్కులేదు. |
భావము & వ్యాఖ్యానం:
మనసులో ఆశల గుత్తి చిగురితే —
సంపదలు తామే వచ్చిపడతాయి,
జీవితపు పొరలై అలముకుంటాయి.
కాని అవి సత్యానికి రంగుల నీడలు —
చెదరని మాయల చిత్తరపు బొమ్మలు.
ఇతర దారులు లేవు —
ఇతర దిక్కులూ లేవు.
వ్యాఖ్యానం:
ఈ
కీర్తనకు భగవద్గీత 13.30 శ్లోకంతో బలమైన అనుబంధం
ఉంది:
ప్రకృత్యైవ
చ కర్మాణి క్రియమాణాని సర్వశః |
యః పశ్యతి తదాత్మానమకర్తారం స పశ్యతి ||
అర్థం:
ఎవడు
కర్మలు అన్నివిధాలా ప్రకృతి స్వభావము చేత
చేయబడుతున్నట్లు తెలియునో
మరియు
ఆత్మను
కర్తగానివానిగా తెలియునో
అతడే
నిజముగా చూచుచున్నవాడని (ద్రష్ట అని) తెలియుము.
గీతా
భావానికి ప్రతిఫలనం అన్నమయ్య పద్యాల్లో
మొదటి
చరణం
కలఁగఁగ
వలనదు కర్త లెవ్వరుఁ గారు
తెలిసి వోరుచుకొంటే దేవుఁడే దిక్కు
రెండవ
చరణం
పదరి
పైకొనవద్దు పట్టితేఁ బసలేదు
చెదరక వోరిచితే శ్రీపతే దిక్కు
మూడవ
చరణం
సిరులు
తానే వచ్చే చిత్తాన నాసలు రేఁగ
విరసపు మాయవికారమది
భగవద్గీత
—
మనకు
ఒక పుస్తకం,
అన్నమయ్యకు
శ్వాస.
కురుక్షేత్రం
—
కనబడే
శత్రువుతో రణం.
మానవ
క్షేత్రం —
నిరంతర
హింసలో,
కనబడని
విరోధితో నిత్య నాటకం
No comments:
Post a Comment