తాళ్లపాక అన్నమాచార్యులు
287 ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను
For English version press here
“నేను” అను శిల్ప నిర్మాణ పునాదులు
ఉపోద్ఘాతము
ఇది భక్తి గీతం
కాదు,
జాగృతి గీతం కానే కాదు,
ఉద్వేగ గీతం మరీ కాదు.
జీవమునకు సత్యమునకు మధ్యనున్న
అదృశ్య సంబంధాన్ని ప్రత్యక్షం చేస్తున్న అలౌకిక వ్యక్తీకరణ.
కీర్తన సంక్షిప్త
చిత్రం
పల్లవి:
దైవీక
భద్రత నిలిచియే ఉంది; పనిలేని మానవ జోక్యం ఏలయో?
చరణం 1:
అసురక్షిత
భావంతో మనిషి తన గతాన్ని తిరిగి రాస్తాడు.
చరణం 2:
శక్తివంతులు, ధనవంతుల అనుకరణలో సత్యం
మరుగున పడుతుంది.
చరణం 3:
బుద్ధిచాతుర్యపు
కలయికలు శక్తిని ఇవ్వొచ్చు—
|
అధ్యాత్మ కీర్తన
|
|
రేకు: 240-1
సంపుటము: 3-227
|
|
ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను యిరవుగ నెవ్వరూ వహించుకోనేమిటికి ॥పల్లవి॥ పుట్టిన జీవులు తొల్లి భువిపై ననేకులు అట్టె వారి చరితలు ననేకములు వట్టిజాలిఁ దమతమవారలంటాఁ దలఁచుక బట్టబయలే నానాభావాలఁ బొందుదురు ॥ధర॥ సరవి నందరుఁ జేసే సంసారములు పెక్కు సిరులవారి గుణాలు చేష్టలు పెక్కు అరసి తమవారితో నవి యెల్లాఁ జెప్పుకొంటా దరినుండే వగరించి తమకింపుచుందురు ॥ధర॥ వడినెన్నైవాఁ గలవు వావు లెంచి చూచుకొంటే గడియించే పదార్థాలు కలవెన్నైనా యెడయక శ్రీవేంకటేశ నీదయ గలిగితే జడియక నీదాసులు సంతసమందుదురు ॥ధర॥
|
|
Telugu Phrase
|
Meaning
|
|
ధర నీవే
తల్లియును దండ్రియువై యుండఁగాను
|
దైవమా
నీవు ఈ విశ్వానికే తల్లియును దండ్రియువై యుండఁగాను |
|
యిరవుగ
నెవ్వరూ వహించుకోనేమిటికి
|
మరి మేము ఆ స్థానాన్ని ఎందుకు వహించుకోవాలి? అవసరమేమి?
|
భావము: “అనంతకాలంగా నడిచిన దైవ క్రమముండగా —
మనుజుల జోక్యమేలా?"
అన్వయార్థము: మానవుడు తన కల్పిత అవసరాల కోసం సృష్టిలోని
సమత్వాన్ని అంచులకు నెట్టేస్తున్నాడు.
|
Telugu Phrase
|
Meaning
|
|
పుట్టిన జీవులు తొల్లి భువిపై ననేకులు
|
చిరకాలముగా
జీవులు భూమిపై పుంఖానుపుంఖముగా పుడుతూనే
వున్నారు.
|
|
అట్టె వారి చరితలు ననేకములు
|
అలాగే
వారి చరితలు అనేకములు
|
|
వట్టిజాలిఁ దమతమవారలంటాఁ దలఁచుక
|
(వట్టి = శూన్యము; వట్టిజాలిఁ = లేని జాలిని పొందు) వారందరూ తమ తమ వారలనుకొని లేని జాలిని
|
|
బట్టబయలే
నానాభావాలఁ బొందుదురు
|
మిక్కిలిగా
బాహటముగా అనేకానేక భావములను మానవులు పొందుదురు.
|
భావము:
(అన్నమాచార్యులు ఇక్కడ అయా అనుచిత స్వేచ్ఛలతో కలుగు మనో వికారములను తెలుపుతున్నారు). చిరకాలముగా జీవులు భూమిపై పుంఖానుపుంఖముగా పుడుతూనే వున్నారు. అలాగే వారి చరితలు అనేకములు. అయా జాతులవారు,
అయా ప్రాంతముల వారు, అయా దేశములవారు తమ తోటి వారిని
తగిన అధారము లేకున్నను తమ వారలనుకొని లేని
జాలిని మిక్కిలిగా బాహటముగా ప్రదర్శించి అనేకానేక భావములను మానవులు పొందుదురు.
భావసారము
|
అన్నమాచార్యుల భావము బుద్ధుని ప్రతీత్య సముత్పాదనం తులనాత్మక పట్టిక
|
|||
|
అన్నమాచార్యులు ⇒ దైవ క్రమాన్ని కేంద్రంగా ఉంచారు బుద్ధుడు ⇒ కారణ క్రమాన్ని కేంద్రంగా ఉంచాడు కానీ ఇద్దరూ చేరుకున్న బోధ మాత్రం ఒకటే: మనిషి అహంకారమే / అవిజ్జయే ప్రపంచాన్ని గజిబిజి
చేస్తోంది
|
|||
|
అంశం
|
అన్నమాచార్యుల భావము
|
బుద్ధుని “ప్రతీత్య సముత్పాదనం”
|
సాధారణ నిర్ధారణ
|
|
మూల క్రమము
|
“ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను”
దైవ క్రమము నిశ్శబ్దముగా సృష్టిని నడిపిస్తుంది; ఒక్క జీవి కూడా ఒంటరి కాదు.
|
ధమ్మ నియమము / సహజ కారణ క్రమము అన్నిటిని
నడిపిస్తుంది; ఏదీ స్వతంత్రంగా ఉత్పన్నం కాదు.
|
ప్రపంచం పరస్పర ఆధారితమై స్వయంగా నడుస్తుంది.
|
|
తప్పిదాలకు మూలం
|
“యిరవుగ నెవ్వరూ వహించుకోనేమిటికి” అహంకారం వల్ల మనిషి దైవ స్థానంలో తాను నిలబడి
జోక్యం చేస్తాడు.
|
అవిజ్జ (అజ్ఞానం) వల్ల “నిజం” తప్పుగా గ్రహించి తప్పుడు
నిర్మాణాలు చేస్తాడు.
|
అజ్ఞానం / అహంకారమే కల్లోలానికి మూలం.
|
|
మోసం స్వభావం
|
“వట్టిజాలిఁ దమతమవారలంటాఁ దలఁచుక”—తాను
ఒంటరివాడిననే వేదననుంచి కుటుంబ, వర్గ, గోత్ర, ప్రాంత, దేశముల వంటి
గుర్తింపులను సృష్టించి వాటిలో తలదాచుకుంటాడు.
|
“నేనే, నాదే, మా వారు” అనే బంధాలు తణ్హా (తపన), ఉపాదాన
(పట్టుదల) వల్ల ఏర్పడతాయి.
|
గుర్తింపులు మనస్సు
కట్టిన కల్పనలు మాత్రమే.
|
|
భావాల విస్తరణ
|
“బట్టబయలే నానాభావాలఁ బొందుదురు” ఇవే తరువాత కథలు, గుంపులు, విరోధాలు అవుతాయి.
|
కారణ-ఫల శ్రేణులు అసంఖ్యాకమైన మానసిక జన్మలను
సృష్టిస్తాయి. |
దోష గ్రహణం ⇒ సంక్లిష్ట మానసిక నిర్మాణాలు. |
|
సామాజిక ప్రభావం |
ఈ భావాలు చివరకు హింస, విభేదాలు, కల్లోలంగా
పెరుగుతాయి.
|
కారణత వల్లే దుఃఖం (దుక్కం) పెరుగుతుంది; వ్యక్తి–సమాజం రెండూ నష్టపడతాయి.
|
మానసిక మాయ ⇒ సామాజిక బాధ.
|
|
దైవ స్థానం / సహజ స్థానం
|
సృష్టిని కాపాడేది దైవమే; మనిషి జోక్యం అవసరమేలేదు.
|
సృష్టికి కర్త లేడు; ధమ్మ స్వయంగా న్యాయం.
|
సృష్టిని నడిపించేది మనిషి కాదు — లోతైన క్రమమే.
|
|
విముక్తి మార్గం
|
అహంకారం విడిచి దైవ క్రమాన్ని గుర్తించడం.
|
‘అవిజ్జ’ అంతం చేసి, అనిత్యత–పరిశీలనతో తపన విడువుము.
|
మొదటి అడుగు: మనశ్శాంతియే శరణము
|
|
అంతిమ బోధ
|
“దైవ సంరక్షణలో ఉన్న ప్రపంచాన్ని మనిషి
సరిచేయాలనుకోవడం అహంకారం.”
|
“ప్రపంచం కారణతతో నడుస్తుంది; దానిని అర్థంలేని జోక్యంతో మార్చాలనుకోవడం అవిజ్జ”
|
అహంకారం / అవిజ్జా ఒకటే — కల్లోలానికి మూలం
|
|
Telugu Phrase
|
Meaning
|
|
సరవి నందరుఁ జేసే సంసారములు పెక్కు
|
వరుసన (చూచితే) అందరు చేయు సంసారములు చాల గలవు.
|
|
సిరులవారి గుణాలు చేష్టలు పెక్కు
|
ధనవంతుల గుణాలు, వ్యవహారములు పెక్కు
|
|
అరసి తమవారితో నవి యెల్లాఁ జెప్పుకొంటా
|
జాగ్రత్తగా వానిని చూచి తమ వారితో అవి చెప్పుకొనుచూ
|
|
దరినుండే వగరించి తమకింపుచుందురు
|
దగ్గర నుండి పట్టుదలతో
తెలిసి మోహములో పడుదురు.
|
సూటి భావము:
అన్నమాచార్యులు
గాడితప్పిన మనసు పోకడలను వివరించుచున్నారు. (క్రమముగా చూచితే) మానవులు అనేక తలములలో
ఒకే సమయములో జీవించుదురు. ధనవంతుల గుణాలు, వ్యవహారములు పెక్కులు జాగ్రత్తగా గమనించి,
తమ వారితో చెప్పుకొనుచు, మరింత దగ్గరకు జరిగి,
పట్టుదలతో తెలిసి మోహములో పడుదురు.
గూఢార్థవివరణము:
జిడ్డు
కృష్ణమూర్తి తరచూ “విభజన” గురించి మాట్లాడేవారు.
ఆయన దృష్టిలో, ఈ విభజన —
మనస్సు సృష్టించే భావాలు,
సేకరించుకున్న జ్ఞానపు భారాలు,
మరియు అంతర్లీన భయం కలసి
ఉత్పత్తి చేసే అంతర్గత–బాహ్య అసంబద్ధత.
|
Telugu Phrase
|
Meaning
|
|
వడినెన్నైవాఁ గలవు వావు లెంచి చూచుకొంటే
|
ఒకదానికి మరొకదానితో గల సంబంధము జాగ్రత్తగా బేరీజు వెసుకుంటే త్వరగా సాధించుటకు ఎన్నో గలవు
|
|
గడియించే పదార్థాలు కలవెన్నైనా
|
ఆర్జించుటకు ఎంతో వస్తు సంపద కలదు
|
|
యెడయక శ్రీవేంకటేశ నీదయ గలిగితే
|
(దైవ క్రమమును) వదలక శ్రీవేంకటేశ నీదయ గలిగితే
|
|
జడియక నీదాసులు సంతసమందుదురు
|
భయమందని నీ దాసులు ఎంతో సంతోషించుదురు.
|
(అన్నమాచార్యులు చివరి చరణంలో మానవులు మనమున్న విధముగా వర్తించుటకు కారణామును
తెలిపి, అవి అన్నీ భోగలాలసత లోనివని త్రోసిపుచ్చుచున్నారు.)
ఒకదానికి
మరొకదానితో గల సంబంధము జాగ్రత్తగా బేరీజు వేసుకుంటే వస్తుసంపదను అర్జించుకొనుటకు
ఎన్నో మార్గాలు కలవు. (దైవ క్రమమును) వదలక శ్రీవేంకటేశ నీ దయ గలిగితే
భయమందని నీ దాసులు ఎంతో సంతోషించుదురు.
ఈ కీర్తన ముఖ్య సందేశం
X-X-The
END-X-X