తాళ్లపాక అన్నమాచార్యులు
242 చెడ్డ చెడ్డ మనసుల చెంచువారము
(ఓ ప్రేమికురాలి
స్వగతం)
For English version press here
ఉపోద్ఘాతము
మనసున్న మనిషికి సుఖములేదంటే
మనసులేని మనిషిని చూపించమంటే
అటునిటు కాని హృదయము లింతే
దైవపు కోవెలకు మెట్లు లేవంటే
సత్యము చేయలేని వ్యవసాయం అంతే!
మనసు మాటల మూట,
అది విను చెప్పుడు మాట.
అందుకు పెట్టని కోట,
దాటరాని ఆశల పుట్ట.
వినదేం? అంతరంగపు మాట!
శృంగార కీర్తన
|
రేకు: 10-3 సంపుటము: 5-58
|
చెడ్డ చెడ్డ మనసుల చెంచువారము
- ఆల-
దొడ్డివాఁడ పోవయ్య దూళికాళ్ల
రాక ॥పల్లవి॥
ఏఁటి దాననైతినేమి యెవ్వతె
నేనైతినేమి
ఆఁటదాని నన్ను నీకు నడుగనేలా
మూఁట మాఁటలనె కడు మోవనాడవద్దు
లేటి-
వేఁటకాఁడ పోవయ్య వెంటవెంట
రాక ॥చెడ్డ॥
ఎవ్వరి వారైరేమి యేడనేడ నుండిరేమి
దవ్వుచేరువలు నీకు దడవనేలా
నవ్వకుండఁగానె వట్టి నవ్వునవ్వేవెవ్వరైన
పువ్వక పూచెననేరు పోవయ్య
రాక ॥చెడ్డ॥
ఎక్కువ కొప్పయిననేమి యెంత
గుబ్బలైన నేమి
చక్కఁదనము వొగడ సారె నీకేలా
వెక్కసాలు మాని మాతో వేంకటేశ
మాయింటి-
యిక్కువకే పోవయ్య యింతనంత
రాక ॥చెడ్డ॥
|
Details
and Explanations:
పల్లవి:
చెడ్డ
చెడ్డ మనసుల చెంచువారము - ఆల-
దొడ్డివాఁడ
పోవయ్య దూళికాళ్ల రాక ॥పల్లవి॥
పదబంధం
|
అర్థం
|
చెడ్డ
చెడ్డ మనసుల
|
చెడ్డ
చెడ్డ మనసులతో
|
చెంచువారము
|
నిలకడలేని
వారము
|
ఆల-దొడ్డివాఁడ
|
ఆలమందల
పసులకాపరి (శ్రీకృష్ణుడు)
|
దూళికాళ్ల
రాక
|
నీ దూళికాళ్ల రామాక
|
ప్రత్యక్ష భావము:
(ఈ కీర్తన
వేంకటేశ్వరుని
పట్ల
ముగ్ధ
ప్రేమలో మునిగిపోయిన
ఒక
స్త్రీ హృదయంలో సుళ్ళు తిరిగే
ఆంతరంగ
ఆలోచనలు).
చెడ్డ
చెడ్డ మనసులతో నిలకడలేని వారము.
ఓ ముత్తెపు చిప్పవంటి పసులకాపరి
“నీ దూళికాళ్ల రామాక”
మా
ఇంటిలోకి
వ్యాఖ్యానం:
ఆల-దొడ్డివాఁడ
= ఆలమందల పసులకాపరి (శ్రీకృష్ణుడు)
అనగా
సత్యము అభము శుభము తెలియని అమాయకము వంటిదని,
సహజముగా
వుండునదని అర్ధము.
అత్యంత
సహజము
మన
వూహలకు, మన ఆపేక్షలకు, మన అవగానకు
అతీతముగా
వుండి గుర్తించలేనిదగును.
ఆ
స్థితిలోని సత్యమును పనికిరానిదని
దీనితో మాకేమి
పని అని చీదరించుకొందుము.
ఏ
రూపంలో వస్తాడో దేవుడు?
రూపమే
లేని ఆయనకు రూపమెలా ఆపాదిస్తాం?
మన
అంతరంగం మురికితో నిండిపోయి,
మనసు
చెడుతో కలుషితమై ఉంటే
కనబడే
దాంట్లో దైవత్వం గుర్తించగలమా?
అయినా
మనం—
సత్యం, పవిత్రతకు ప్రతీకైన
మహోపకారి
ప్రభువును
‘పాదాలు
అపవిత్రం’ అని
మన
గడపలోకి రాకుండా తిప్పికొడతాం!
పచ్చకామెర్ల
వానికి
ప్రపంచమంతా
పచ్చగా కనబడునట్లు,
మన
కలుషిత హృదయం
మనకింకా
ఏమి చూపగలదు?
ఇదే
మన వాస్తవ రూపం—
అన్నమాచార్యుల
వ్యంగ్య అద్దంలో
తేలికగా
బయటపడే అంతర్ముఖం!
మంచి–చెడుల
గమనం
బండి
చక్రాల ఊచలు—
ఒకప్పుడు
మంచి చెడవుతుంది,
మరొకప్పుడు
చెడు మంచవుతుంది,
మనసుని
మెలికలు తిప్పి
మాయలో
ముంచుతాయి.
చెడు
నుంచి మంచికి సాగడం
జీవితం
అంటాం.
కాని
నిజానికి—
అది
ఎండమావుల్లోని నీరు,
తాకలేని
దారి,
అగమ్యమైన
నిశ్శబ్దం!
మొదటి చరణం:
ఏఁటి
దాననైతినేమి యెవ్వతె నేనైతినేమి
ఆఁటదాని
నన్ను నీకు నడుగనేలా
మూఁట
మాఁటలనె కడు మోవనాడవద్దు లేటి-
వేఁటకాఁడ
పోవయ్య వెంటవెంట రాక ॥చెడ్డ॥
పదబంధం
|
అర్ధము
|
ఏఁటి దాననైతినేమి
యెవ్వతె నేనైతినేమి
|
ఏ వయసు దాననైతేనేమి? (ఏ కాలము దాననైతేనేమి?) నేనెవ్వరి దాననైననేమి?
|
ఆఁటదాని
నన్ను నీకు నడుగనేలా
|
నేను నీకొక ఆటబొమ్మను. నువ్వడగడం దేనికి?
|
మూఁట మాఁటలనె కడు మోవనాడవద్దు
|
మాటల మూటల మోపుతో ఆడుకోవద్దయ్య!
|
లేటి-వేఁటకాఁడ పోవయ్య వెంటవెంట రాక
|
(లేటి = జింక; లేటి వేఁటకాఁడ = శ్రీరాముడా!) వేటగాడిలా మా వెంటవెంట రాకయ్య
|
ప్రత్యక్ష భావము
ఏ
కాలమైతే నేమి
ఏ
వయసైతే నేమి?
ఎవ్వరిదాననైనా
నేమి?
నేను
నీ భావములో ఒక ఆటదానినే,
ఓ
నాట్యకత్తెనే—
అంతకు
మించి ప్రశ్నలెందుకు?
మాటలు
మోపులు పేరబెట్టి
నన్ను
ఉత్సాహపెట్టకు.
ఓ
గొప్ప వేటగాడా,
నన్ను
మళ్ళీ మళ్ళీ వెంటాడ కోయ్!
వ్యాఖ్యానం:
ఇక్కడ అన్నమాచార్యులు
జీవితం అనే నాటకానికి ఎన్నో రంగులు అద్దారు.
ఏ యుగమైనా, ఏ కాలమైనా
జీవితం అదే మాయాగానం.
“నీ తాళాలకు నేను నర్తకిని మాత్రమే.
నువ్వు మమ్మల్ని మాయలతో రెచ్చగొట్టి,
ఎదురు చూపులు చూపించి,
ఆశలు పెంచి మళ్లీ నిరాశలో తోసేస్తావు.
వేటగాడిలా వెంబడిస్తావు,
నీపై నమ్మకం ఎలా వుంచాలి?
అందుకే…
పోవయ్య వెంట వెంట రాక!”.
రెండవ చరణం:
ఎవ్వరి
వారైరేమి యేడనేడ నుండిరేమి
దవ్వుచేరువలు
నీకు దడవనేలా
నవ్వకుండఁగానె
వట్టి నవ్వునవ్వేవెవ్వరైన
పువ్వక
పూచెననేరు పోవయ్య రాక ॥చెడ్డ॥
పదబంధం (Phrase)
|
అర్థం (Telugu)
|
ఎవ్వరి వారైరేమి యేడనేడ నుండిరేమి
|
వారు ఎవరివారైనా, వారిది ఏ వంశమైనా, ఎక్కడివారు అయినా ఏమి?
|
దవ్వుచేరువలు నీకు దడవనేలా
|
దగ్గర దూరాలను వాటిలో నువ్వు చిక్కుకోవు కదా
|
నవ్వకుండఁగానె వట్టి నవ్వునవ్వేవెవ్వరైన
|
వారు నకిలీగా, వెకిలిగా, నిజంగా ఆనందం లేకుండానే నవ్వుతారు
|
పువ్వక పూచెననేరు పోవయ్య రాక
|
పువ్వులా సత్యంగా నిష్కల్మషంగా వుండరు, పోవయ్య. మావైపు రాకయ్య.
|
ప్రత్యక్ష భావము
మేమెవరివారమైనా, ఏ వంశమైనా, ఎక్కడివారైనా –
దగ్గరదూరాలను చూసి
నువ్వు
చిక్కుకునే వాడివి కాదుగా.
మేము
నకిలీగా, వెకిలిగా,
నిజమైన
ఆనందం లేకుండానే నవ్వుతాము.
పువ్వులా నిష్కల్మషంగా వికసించము.
అందుకే, ఓ ప్రభూ,
మా వైపు రావద్దు – రాకయ్య!
వ్యాఖ్యానం:
అన్నమాచార్యులు
కొనసాగిస్తున్నారు—
మేమెవ్వరమైనా,
ఏ
వంశస్తులమైనా,
ఎక్కడ
వున్నా…
నువ్వు
దగ్గరే ఉన్నావు
కానీ
తాకలేనింత దూరం.
మా
మాటలు—అన్నీ వంచన సేవలు,
మా
నవ్వులు—ఒక్క వక్ర హాస్యం.
మా
కలల లోకంలో పువ్వులా పూయాలని తపిస్తాం,
కానీ
కుసుమించేది పువ్వు కాదు—
ఒక
మూగ భ్రమ మాత్రమే.
అందుకే
ఓ ప్రభూ,
ప్రయత్నించద్దు,
మాదారికి
రావద్దు.
మూడవ చరణం:
ఎక్కువ
కొప్పయిననేమి యెంత గుబ్బలైన నేమి
చక్కఁదనము
వొగడ సారె నీకేలా
వెక్కసాలు
మాని మాతో వేంకటేశ మాయింటి-
యిక్కువకే
పోవయ్య యింతనంత రాక ॥చెడ్డ॥
Telugu Phrase
|
Meaning
|
ఎక్కువ కొప్పయిననేమి యెంత గుబ్బలైన నేమి
|
ఎంత పెద్ద కొప్పయిననేమి? యెంత
గుబ్బలైన నేమి?
|
చక్కఁదనము వొగడ సారె నీకేలా
|
ఈ అందాలను పొగిడే సారమేమిటి? దేని
కోసం?
|
వెక్కసాలు మాని
|
ఈ అతి మితిమీరిన ప్రవర్తనలు విడిచిపెట్టి
|
మాతో వేంకటేశ మాయింటి యిక్కువకే
|
మాతో కలిసి వేంకటేశుడి ఆలయమనే నిజమైన స్థలానికి
|
పోవయ్య యింతనంత రాక
|
(ప్రేమగా) పోవయ్య
ఈదగ్గరకు రావద్దు (యింతనంత = దగ్గరలో, ఇక్కడే)
|
ప్రత్యక్ష భావము:
ఎంత
పెద్ద జడ వేసుకున్నా, కొప్పు పెట్టినా—నీకేమి?
ఎంత
నిండుగా, ఆకర్షణీయంగా గుబ్బలు ఉన్నా—నీకేమి?
ఈ
క్షణికమైన అందాన్ని
పొగిడితే
దానికేం విలువ?
ఇక
ఈ అతి మాని, ఈ తిప్పలాపు …
మా
వెంట రా,
వేంకటేశుని
అసలైన నిలయానికి.
(ఇప్పుడు
ప్రేమగా, కానీ వ్యంగ్యంగా…)
కానీ—
ఏమోయ్!
ఇక్కడకు మాత్రం రాకయ్యా!
వ్యాఖ్యానం:
PART1:
ఇక్కడ
అన్నమాచార్యులు,
ప్రేమలో
మునిగిన స్త్రీ స్వరంతో మాట్లాడుతూనే,
ఒక్కసారిగా
అంతరంగం వైపు తిరుగుతారు.
ఈ
క్షణికమైన అందం దేవునికి ఏమి విలువ?
నా
జడ, నా రూపం, నా శరీర సౌందర్యం—ఆయనకు
ఏమి పనికివస్తాయి?
తర్వాత, ఆ దృష్టిని శ్రోతల వైపు తిప్పి,
మన
కపటాన్ని, ద్వంద్వభావాన్ని వ్యంగ్యంగా గమనింపజేస్తారు—
బయటి
అందాన్ని పట్టుకుని బతుకుతాం,
అడుగడుగునా
మాయలతో నిండిపోతాం,
అయినా
అంతరంగంలో మాత్రం దైవం కావాలి అంటాం.
PART2:
ఈ
పరస్పర విరోధభావాన్ని అర్థం చేసుకోవడానికి
రెనే
మాగ్రిట్ గీసిన అధివాస్తవిక చిత్రం
బండరాయి
దివ్యరథము (“ద క్యాసిల్ ఆఫ్ ది పైరనీస్”)
చర్చించుచూ
తెలుసుకుందాం.
పై
చిత్రంలో,
అలలతో
ఉప్పొంగుతున్న సముద్రంపై
ఒక
మహా గ్రావము (బండరాయి) తేలియాడుతూ ఉంటుంది.
ఆ
రాయి మీద ఎత్తైన గోడలతో కట్టిన
ఒక
భవ్యమైన కోట ఉంటుంది.
నేపథ్యంలో
నీలి ఆకాశం,
మృదువైన
మేఘాలు, చూడగానే—
రాయిమీద
కోటకి కూడా ఒక అందమైన రోజు అనిపిస్తుంది.
కానీ
ఆ చిత్రం నిజానికి ఏమి చెబుతోంది?
ఆ
రాయి మన మనసు—
ప్రపంచం
నుంచి వేరై, తేలియాడుతూ ఉంటుంది.
ఆ
కోట
మన
ఊహల్లో కట్టుకున్న భద్రతా ప్రాకారం—
మన
అహంకారపు బురుజు.
కింద
పెద్ద పెద్ద అలలతో అల్లకల్లోల సముద్రం—
మనం
తప్పించుకోవాలని చూసే కఠిన వాస్తవం.
పై
ఉన్న నీలి ఆకాశం—
“ఇదే
సరైన స్థితి, ఇదే శాంతి”
అన్న
మన లోపలి మొండితనం.
అలా
మనిషి ఆ “తేలియాడే దీవి”లో బతుకుతాడు.
ఆ
దీవి కాపలాదారులు ఆరు శత్రువులు—
కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్యాలు.
ఆ
కోటని రక్షించడానికే శక్తిని వెచ్చిస్తాడు.
అయితే
ముక్తికి అవకాశం ఎక్కడ?
అందుకే
అన్నమయ్య చివరగా ప్రేమగా, కానీ వ్యంగ్యంగా చెబుతారు—
“ఏమోయ్!
ఇక్కడికైతే మాత్రం రాకయ్య!
ఎందుకంటే
లోలోతులలో మనం నిజంగా విముక్తికి సిద్ధంగా లేం.
కీర్తన సారాంశం
చెడ్డ
మనసు కలుషితంలో మునిగిన మనిషి,
దైవాన్ని
పాదాలు అపవిత్రమని నిందిస్తాడు.
జీవితం
యుగాలుగా అదే నాటకం—
ఆశ
పెంచి నిరాశలో తోసే మాయ ఆట.
మాటలు
వంచన, నవ్వులు వక్ర హాస్యం,
లోపల
శూన్యం, బయట నటన.
అందం, అలంకారం క్షణికం—దేవుడికి వ్యర్థం,
మంచీ
చెడూ ఎండమావులే.
మనసు
గగనంలో తేలియాడే కోట,
ఆరు
శత్రువుల కాపలాలో బంధిత ద్వీపం.
విముక్తి
తలుపు మనమే మూసేస్తాం,
అందుకే
అన్నమయ్య వ్యంగ్యంగా—
“పోవయ్య!
రాకయ్యా!” అంటాడు.
X-X-The
END-X-X
No comments:
Post a Comment