Saturday, 28 February 2026

T-308 సులభమా మనుజులకు హరిభక్తి

 తాళ్లపాక అన్నమాచార్యులు
308 సులభమా మనుజులకు హరిభక్తి
For English version press here

ఉపోద్ఘాతము

చారిత్రాత్మకంగా చూస్తే అన్ని కాలములలోనూ మనుష్యులు తమను ఇతరులకంటే పవిత్రులమని ప్రకటించుకోవడం కనిపిస్తుంది. మన దేశంలోనూ ఈ ప్రవృత్తి కనిపిస్తుంది. ఈ ధోరణిని గమనించిన అన్నమాచార్యులు — సులభమా మనుజులకు హరిభక్తి” అని ప్రశ్నించారు. 

తపస్సులు, యాగయజ్ఞాలు, తీర్థయాత్రలు — ఇవన్నీ మనిషి చేసే ఆధ్యాత్మిక ప్రయత్నాలే. అయితే అవి కాలపరిమితిలో జరిగే క్రియలు. వాటివల్ల కొంత శుద్ధి కలిగినా, అంతర్గత బంధము పూర్తిగా తొలగిపోతుందా అనే ప్రశ్నను కవి మెల్లగా ముందుంచుతున్నారు. అన్నమాచార్యుల పరిశీలనలో భక్తి అనేది బాహ్య ఆచారాల ఫలితం కాదు; అది అంతరంగ సమ్మతి. వలనొంది” అనే పదంలో అదే భావం దాగి ఉంది — ఎలాంటి అడ్డంకి లేకుండా, అంతరంగమంతా ఏక భావముతో ఒప్పుకొని నిలబడే స్థితి. 

అది అంతర్గత పరివర్తన.
అటువంటి సంపూర్ణ తాదాత్మ్య స్థితి — సులభమా?


అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 24-2 సంపుటము: 1-144

సులభమా మనుజులకు హరిభక్తి
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా

కొదలేని తపములు కోటానఁగోటులు
సదన నాచరించి యటమీఁద
పదిలమైన కర్మబంధము లన్నియు
వదలించుకొనికదా వైష్ణవుఁడౌట ॥సులభమా

తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య
అనఘుఁడై చేసిన యటమీఁద
జననములన్నిట జనియించి పరమపా-
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా

తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు
నరలేక సేవించి నటమీఁద
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట ॥సులభమా 

Details and Explanations:
పల్లవి:

సులభమా మనుజులకు హరిభక్తి
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట పల్లవి  

              Telugu Phrase
Meaning
సులభమా మనుజులకు హరిభక్తి
మానవులకు హరిభక్తి అంత సులభమా?
వలనొంది మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా
(వలనొంది = అడ్డంకి లేకుండా సంసిద్ధమగుట) — సంపూర్ణ సమ్మతితోనే కదా వైష్ణవుడగుట?

సూటి భావము:
సంపూర్ణ సమ్మతితో  వైష్ణవుడగు వానికి హరిభక్తి  సులభముకాదా?

గూఢార్థవివరణము:
వైష్ణవుడగుట”
వైష్ణవుడగుట అనేది పేరు కాదు; ఆచారం కాదు; బయటి గుర్తింపు కాదు. పునీతుడగుట​.
“వలనొంది”
“వలనొంది”అనగా ఏ అడ్డంకి లేకుండా, ఏ షరతు లేకుండా, అంతరంగమంతా ఒప్పుకొని నిలబడుట. కాని ఏ అడ్డంకులులేని సమర్పణ సులభమా? అటువంటి సమర్పణకు సిద్ధంగాలేని మనము హరి భక్తి అనే మాటను సులభంగా పలుకుతున్నామా? ప్రతిబంధాలను (అభిలాషలు, భయాలు, ప్రతిష్ఠ, అభిమానాలు)

పూర్తిగా విడిచి పెట్టకుండానే తనను భక్తుడిగా భావించుకోవాలని చూస్తాడు. ఇక్కడ​ మానవుని నైజము స్పష్టము.

మొదటి చరణం:

కొదలేని తపములు కోటానఁగోటులు
సదన నాచరించి యటమీఁద
పదిలమైన కర్మబంధము లన్నియు
వదలించుకొనికదా వైష్ణవుఁడౌట ॥సులభమా 


Telugu Phrase
Meaning
కొదలేని తపములు కోటానఁగోటులు
అంతులేని తపస్సులు — కోట్లకొలది సాధనలు
సదన నాచరించి యటమీఁద
అవన్నీ క్రమంగా ఆచరించిన తరువాత కూడా
పదిలమైన కర్మబంధము లన్నియు
గట్టిగా పట్టుకున్న కర్మబంధములన్నియు
వదలించుకొనికదా వైష్ణవుఁడౌట
వాటినన్నిటిని విడిపించుకొని గానే కదా వైష్ణవుడగుట
 

సూటి భావము:
కోటానుకోట్లు తపస్సులు ఆచరించినా — గట్టిగా పట్టుకున్న కర్మబంధములు పూర్తిగా విడిపోవాలి. అప్పుడు గానీ నిజమైన వైష్ణవుడగుట సాధ్యం కాదు.

గూఢార్థవివరణము:
“కొదలేని తపములు కోటానఁగోటులు” ఇక్కడ అన్నమాచార్యులు తపస్సును తక్కువ చేయడం లేదు. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎంత సాధన చేసినా అంతం లేదు. ముఖ్యంగా తీరవలసినది కర్మబంధము. అందుకే “పదిలమైన కర్మబంధము” అని కష్టసాధ్యమైన విషయమును సూచించారు.
 
సాధనల పరిణామము కాల పరిమితిలోనిది. కావున అది  విముక్తి కాజాలదు. బంధముల నుండి నిజమైన విముక్తి ఆత్మసాక్షి గుర్తించ లేనిదని ముందటి కీర్తనలో తెలుసుకున్నాం. అనగా “వైష్ణవుడగుట” అంటే —బయటి గుర్తింపు కాదు; తానుకూడా గుర్తించలేని స్థితి. బంధముల నుండి విముక్తి పొందిన అంతర్గత స్థితి.

రెండవ​ చరణం:

తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య
అనఘుఁడై చేసిన యటమీఁద
జననములన్నిట జనియించి పరమపా-
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట ॥సులభమా

Telugu Phrase
Meaning
తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య
లక్షల సంఖ్యలో యాగయజ్ఞాది కర్మలు చేయుట
అనఘుఁడై చేసిన యటమీఁద
అపరాధము లేకుండా, శుద్ధితో చేసినా
జననములన్నిట జనియించి పరమపా-
అనేక జన్మములు అనుభవించి
వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట
పరమపవిత్ర స్థితిని పొంది గాని వైష్ణవుడగుట కాదా?

సూటి భావము:
లక్షలాది యాగయజ్ఞములు చేసినా, అవి ఎంత నిష్ఠతో చేసినా — అనేక జన్మములు గడిచిన తరువాత కదా పరమపవిత్ర స్థితి చేరునది. అపుడు గదా వైష్ణవుడగుట.

గూఢార్థవివరణము:
యజ్ఞాది కర్మలు ఎంత నిష్ఠతో చేసినను అవి కార్య–కారణ సంబంధంలో నిలుస్తాయి. అవి కాలపరిమితిలో జరిగే క్రియలు. అందుచేత అవి మనుష్యుని జీవితాన్ని కొంత శుద్ధి చేయగలిగినా, అంతర్గత బంధాన్ని పూర్తిగా తొలగించగలవా అనే ప్రశ్నను కవి మెల్లగా ముందుంచుతున్నారు.
 
అన్నమాచార్యులు తీవ్రముగా పరిశీలించ వలసిన  విషయాన్ని చెబుతున్నారు. అయ్యలారా లక్షలాది యాగయజ్ఞాది కర్మలు చేసినను అనే జన్మలు ఎత్తవలసి వుండును. తర్వాతి క్షణంపైననే అదుపులేని మనము ఈ జన్మ తరువాత మరు జన్మలో ఏమి జరుగునో ఊహించలేము.  కావున “వైష్ణవుడగుట”కు ఇవి మార్గములు కావని పరోక్షముగా సెలవిచ్చుచున్నారు.

మూడవ​​ చరణం:

తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు
నరలేక సేవించి నటమీఁద
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట ॥సులభమా

Telugu Phrase
Meaning
తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు
అనేక తీర్థస్థలములను మళ్లీ మళ్లీ సందర్శించుట
నరలేక సేవించి నటమీఁద
కష్టపడుతూ, నియమంతో వాటిని సేవించుట
తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ

గజరాజును రక్షించిన తిరువేంకటాచలాధిపతి కృపవలన కాదా 
వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట
అప్పుడు గదా వైష్ణవుడగుట

సూటి భావము:

మానవులు ఎన్నో తీర్థస్థలములను సందర్శించి, వాటిని భక్తితో సేవించినా — చివరకు తిరువేంకటాచలాధిపతి కృపవలన గాని వైష్ణవుడగుట సాధ్యమా?


గూఢార్థవివరణము: 

ఈ చరణంలో అన్నమాచార్యులు తీర్థయాత్రలు, పవిత్ర స్నానాలు వంటి ఆచారాలపై దృష్టి సారిస్తారు. పవిత్ర తీర్థాలలో స్నానం చేయడం, అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించడం మనుష్యునికి పవిత్రత​ ఇస్తాయని సాధారణంగా నమ్ముతారు. కవి ఈ ఆచారాలను తిరస్కరించరు. కానీ అవి అంతర్గత పరివర్తనకు సరిపోతాయా? అనే ప్రశ్నను మెల్లగా ముందుకు తెస్తారు. నిజమైన శుద్ధి బాహ్య జలస్నానం వల్ల కాక, అంతరంగ శుద్ధి వల్లనే కలుగుతుంది అని సూచన.
 
ఈ భావం మహాభారతంలోని అనుశాసనికపర్వంలో కూడా కనిపిస్తుంది. ధర్మరాజు పవిత్రతను ఇచ్చే తీర్థాలు ఏవి అని అడగగా భీష్ముడు ఇలా చెప్పాడు: దమము (ఇంద్రియ నియమం), శమము (మనశ్శాంతి), అహింస, తపస్సు ఇవే నిజమైన తీర్థములు. ఇవి లేకుండా కేవలం నీటిలో మునిగితే పవిత్రత​ కలుగదు. 

అందువలన అన్నమాచార్యుల సూచన స్పష్టమవుతుంది: బాహ్య తీర్థయాత్రలు మనస్సును కొంత శుద్ధి చేయవచ్చు. కానీ వైష్ణవత్వము — అంతర్గత పునీత స్థితి — దైవకృపతోనే పూర్ణమగును.

కీర్తన​ సారం
ఈ కీర్తనలో మూడు రకాల ఆధ్యాత్మిక సాధనలను అన్నమాచార్యులు పరిశీలిస్తారు:
తపస్సు
యాగయజ్ఞాదులు
తీర్థయాత్రలు
ఈ మూడు ఆచారాలు గౌరవనీయమైనవే అయినా,
అవి మాత్రమే మనిషిని సంపూర్ణంగా విముక్తుని చేయలేవని సూచన.
అందుకే పల్లవిలో అడిగిన  ప్రశ్నను పరిశీలించవలెను:
సులభమా మనుజులకు హరిభక్తి?”

Bottom of Form


X-X-The END-X-X

Friday, 27 February 2026

307 appaṭi yeṃḍa cemaṭalaṭṭē vuṃḍīnā (అప్పటి యెండ చెమటలట్టే వుండీనా)

307 అప్పటి యెండ చెమటలట్టే వుండీనా
(appai yeṃḍa cemaalaṭṭē vuṃḍīnā)

INTRODUCTION 
Under the guise of romance, this composition questions our honesty. అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా — like applying purchased fragrance upon an unclean body to mask odour and appear refined. O human being, do the coverings you buy and apply truly endure? Annamacharya asks whether borrowed adornments can remain unchanged over time.

నెప్పు దప్ప బొంకేవు నే నెఱంగనా — you justify the condition in which you stand. You do not hesitate to fabricate explanations, even falsehoods, to protect it. Here he exposes our fundamental tendency. What value has practice without inner purity?

Acharya’s central question is this: “Is the fragrance truly arising from within? Or simply the scent of marketplace sandal paste applied from outside?”

శృంగార ​ సంకీర్తన
రేకు: 5-1 సంపుటము: 5-26
అప్పటి యెండ చెమటలట్టే వుండీనా
నెప్పు దప్ప బొంకేవు నే నెఱంగనా పల్లవి॥      

ఆవులఁ గాచిన నాటి యడవికంపల జీర-
లావల నేఁడు మాయక అట్టే వుండీనా
యేవంక నెవ్వతో నిన్ను నెనసి చేసిన చేఁత
నీ వెంత మొఱఁగిన నే నెఱంగనా అప్పటి॥

వెన్నలు ముచ్చిలునాఁడు వేడి పాలారగించిన
అన్నువ నీమోవిపొక్కులట్టే వుండీనా
వన్నెకాడ యెవ్వతెకో వలలఁ జిక్కిన నీ
నిన్న మొన్నటి సుద్దులు నే నెఱంగనా అప్పటి॥

రంగుగ మధురలోని రమణి మెత్తిన నాటి
అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా
చెంగట మొఱగి కలసితివి వేంకటరాయ
నింగి మోచిన చేఁతలు నే నెఱంగనా అప్పటి॥
ROMANTIC POEM
Copper Plate: 5-1 Volume: 5-26
appai yeṃḍa cemaalaṭṭē vuṃḍīnā
neppu dappa bokēvu nē ne\raganā           pallavi

āvulaṃ̐ gācina nāṭi yaavikapala jīra-
lāvala nēṃ̐ḍu māyaka aṭṭē vuṃḍīnā
yēvaka nevvatō ninnu nenasi cēsina cēṃ̐ta
nī veta mo\raṃ̐gina nē ne\raganā              appai

vennalu muccilunāṃ̐ḍu vēḍi pālāragicina
annuva nīmōvipokkulaṭṭē vuṃḍīnā
vannekāḍa yevvatekō valalaṃ̐ jikkina nī-
ninna monnai suddulu nē ne\raganā           appai

raguga madhuralōni ramai mettina nāṭi-
agai gadapuṃ̐ būṃ̐talaṭṭē vuṃḍīnā
cegaa mo\ragi kalasitivi vēṃkaarāya
nigi mōcina cēṃ̐talu nē ne\raganā             appai
Details and Discussions:
Chorus (Pallavi):

పల్లవి:
అప్పటి యెండ చెమటలట్టే వుండీనా
నెప్పు దప్ప బొంకేవు నే నెఱంగనా పల్లవి 
appai yeṃḍa cemaalaṭṭē vuṃḍīnā
neppu dappa bokēvu nē ne\raganā          pallavi
              Telugu Phrase
Meaning
అప్పటి
At that time / earlier
యెండ చెమటలు
Heat and sweat (result of exertion / physical intensity)
అట్టే వుండీనా
Do they still remain like that?
నెప్పు 
Position / stance / excuse / ground
దప్ప బొంకేవు
You argue stubbornly / cling defensively
నే నెఱంగనా
Do you think I do not know?


Surface Level Meaning
Implied Meaning
A lady addressing her lover in playful accusation — intimate teasing, exposure through affection.
An unknown speaker addressing the man — disarming without condemnation, exposing inconsistency.
Though the sweat and heat from that earlier meeting are gone, you now stand here arguing and defending yourself — do you think I don’t know what happened?
Intensity fades. Physical passion diminishes. What has passed cannot be erased. Yet you cling to your present position as if nothing occurred. You attempt to preserve dignity — but concealment does not undo what has been.
She knows intimately that he is “hiding something” She is plain and jealousy is absent.
Suggests that past involvement cannot be denied, and ego moves to protect its image.

Notes:
The poem starts with romantic naughty note. Heat and sweat are indicative of touch and sensory experience. Now dried up beyond trace. The lady keeps the romantic angle live while probing her lover of his past actions. She is also aware her lover in order to hold his self-respect keeps falsifying her observations.

First Stanza:
ఆవులఁ గాచిన నాటి యడవికంపల జీర-
లావల నేఁడు మాయక అట్టే వుండీనా
యేవంక నెవ్వతో నిన్ను నెనసి చేసిన చేఁత
నీ వెంత మొఱఁగిన నే నెఱంగనా అప్పటి॥

āvulaṃ̐ gācina nāṭi yaavikapala jīra-
lāvala nēṃ̐ḍu māyaka aṭṭē vuṃḍīnā
yēvaka nevvatō ninnu nenasi cēsina cēṃ̐ta
nī veta mo\raṃ̐gina nē ne\raganā          appai 
Romantic Surface
Implied Meaning
She refuses to let go. “You went to the forest saying you were grazing the cows. Why then did you wander into the thorny thickets? Didn’t your garments get torn? Are they still the same? Under what pretext, and with whom, did you place someone on par with me? However much you conceal it — do you think I do not know?”
The voice shifts from playful accusation to factual exposure.
 
Under the name of work, duty, or necessity, a person enters the forest of experiences. The thorns of these involvements inevitably leave marks. The garments — symbols of the body and identity — cannot remain untouched. Yet one continues to hide these movements from oneself. Attractions, choices, and emotional entanglements are quietly justified and concealed. But can such things ever remain hidden from the inner witness?
Tone is empathetic revelation. She exposes his hidden movements, but without rage or threat.
The tone is not condemnation. It is quiet unveiling. The Beneath these words lies a steady suggestion: “Why do you refuse to acknowledge what you already know within yourself?”
Notes:
In this stanza lady turns toward experience and avocation of her lover. The image of “torn garments in thorn bushes” is not merely romantic teasing — it quietly introduces the theme of fragmentation.

Second Stanza:
వెన్నలు ముచ్చిలునాఁడు వేడి పాలారగించిన
అన్నువ నీమోవిపొక్కులట్టే వుండీనా
వన్నెకాడ యెవ్వతెకో వలలఁ జిక్కిన నీ
నిన్న మొన్నటి సుద్దులు నే నెఱంగనా అప్పటి॥

vennalu muccilunāṃ̐ḍu vēḍi pālāragicina
annuva nīmōvipokkulaṭṭē vuṃḍīnā
vannekāḍa yevvatekō valalaṃ̐ jikkina nī-
ninna monnai suddulu nē ne\raganā appai 
Romantic Surface
Implied Meaning
She does not withdraw. She does not hesitate. She is not embarrassed. The teasing continues, but now with clearer recollection.
(ముచ్చిలు = to steal; అన్నువ = woman; సుద్దులు = stories, happenings)
The voice now speaks with calm clarity. The exposure is no longer playful accusation; it reveals how experiences leave their traces within consciousness.
“You stole butter and drank the hot milk — do you think the marks left on that woman’s lips simply disappeared?” She is recalling his mischievous intimacy. The marks of those secret moments remain.
One becomes entangled in the nets of attraction — especially in the fascination with sensual pleasure. Such experiences do not vanish. They leave impressions in the mind, continuing as memory, habit, and desire.
“You must have been caught in someone’s snare somewhere,” she says playfully. “Do you think I do not know the stories of what you did just yesterday and the day before?”
Human beings often imagine they can hide their past through silence or denial. But the past persists within consciousness. What has been lived continues as psychological residue. One cannot escape one’s own history by concealing it.
Her tone carries teasing yet also understanding. There is generosity in the way she speaks.
There is no condemnation here. The suggestion is simply to see the subtle self-deception by which one hides from oneself.

Notes:
This stanza turns toward memory. The emphasis is not on the act itself, but on the marks it leaves behind. What is lived does not disappear. It continues as memory, inclination, and identity.

Third Stanza:
రంగుగ మధురలోని రమణి మెత్తిన నాటి
అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా
చెంగట మొఱగి కలసితివి వేంకటరాయ
నింగి మోచిన చేఁతలు నే నెఱంగనా అప్పటి॥

raguga madhuralōni ramai mettina nāṭi-
agai gadapuṃ̐ būṃ̐talaṭṭē vuṃḍīnā
cegaa mo\ragi kalasitivi vēṃkaarāya
nigi mōcina cēṃ̐talu nē ne\raganā          appai
Romantic Surface
Implied Philosophical Meaning
First two lines: Until now she has been speaking through hints. Here she questions him directly.
First two lines: Liberation is not a commodity that can be purchased in the marketplace.
రంగుగ మధురలోని రమణి మెత్తిన నాటి
అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా
“When that beloved in Mathura embraced you, did that feeling last long? Has it not diminished with time like the sandal paste you bought from the market?  she asks playfully, yet firmly.
— If one treats liberation as something obtainable through borrowed teachings, rituals, or external authorities, life simply passes away. Their words and doctrines fade with time — like sandal paste purchased from a market.
Her tone is teasing, but it exposes the truth.
Before the inner witness no disguise can remain. When coverings fall away, a human being encounters his original condition.

Last two lines: The tone suddenly changes. Annamacharya reveals that the questioning voice is none other than himself. Until now he has been questioning his own ego.

Last two lines: The questioning exposes something within him that had remained unnoticed. A sudden awareness arises: the presence of Venkataraya has already touched him and passed through him.
చెంగట మొఱగి కలసితివి వేంకటరాయ
నింగి మోచిన చేఁతలు నే నెఱంగనా
Turning toward Venkataraya he says: “You unite with me without my even knowing it, O Venkataraya! Can I ever know the power of the hands that can lift the very sky?”
“O Venkataraya — before I even know it, you have already merged with me. Can I truly comprehend you? How could I possibly know the power of the hands that can hold up the very sky?”

Closing Insight:
Until this point, the repeated question
“Do you think I do not know?”
appears to belong to the teasing woman.
But by the end it becomes clear:
When the questioning inner witness itself falls silent,
the awareness of the immeasurable power alone remains.
What began as playful romantic teasing quietly
turns into a moment of personal realization.

 X-X-The END-X-X


 

A 309 Tree of Knowledge No.5 (విచారణా వృక్షము – నం. 5)

HILMA af KLINT   “ విచారణా వృక్షము – నం. 5” (Tree of Knowledge No.5) –  వివరణము హిల్మా ఆఫ్ క్లింట్ వేసిన “ విచారణా వృక్షము – నం. 5” అనే...