Tuesday, 29 April 2025

A-220 SWAN No 9 by HILMA Af Klint ( 9వ హంస)

 


హంస నం. 9 చిత్రం: ఆధ్యాత్మిక ప్రయాణం

 

పరిచయం: స్వీడిష్ చిత్రకారిణి హిల్మా ఆఫ్ క్లింట్ (1862-1944) తన సమకాలీన చిత్రకారుల కంటే ముందుగానే భావనాతీత చిత్రలేఖన శైలిని ప్రారంభించారు. ఆమె చిత్రాలు ఎక్కువగా ఆధ్యాత్మిక మరియు తాత్విక భావనలను ప్రతిబింబిస్తాయి. హంస నం. 9 చిత్రం ఆమె "దేవాలయం కోసం చిత్రాలు" అనే ధారావాహికలో భాగం, ఇది మానవ ఉనికి యొక్క వివిధ కోణాలను అన్వేషిస్తుంది. 

చిత్ర వివరణ మరియు విశ్లేషణ:

ఈ చిత్రం ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది. ఈ  ప్రస్థానము ద్వంద్వత్వం నుండి ఏకత్వం వైపు సాగుతుంది. చిత్రంలో కనిపించే వివిధ అంశాలు మనస్సు యొక్క పరివర్తన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. 

  • విభజన: చిత్రంలో స్పష్టంగా లేని సన్నని రేఖ ఉంది. పెయింటింగ్ రేఖకు ఇరువైపులా సౌష్టవంగా ఉంటుంది​.  ఈ రేఖ మొదట్లో జీవితం మరియు మరణం మధ్య విభజనను సూచిస్తుంది, అయితే మనం చిత్రాన్ని లోతుగా చూసేకొద్దీ ఈ విభజన మరుగున పడిపోతుంది.
  • కుడి వైపు: మన ప్రస్తుత స్థితి: కుడి వైపున ఉన్న పెద్ద స్ఫటికాలు మనం సాధారణంగా ఎలా ఉంటామో సూచిస్తాయి - మనకు ఏదీ శాశ్వతం కాదని తెలిసినప్పటికీ, రుజువు మరియు ఖచ్చితత్వం కోరుకోవడం వంటివి. శాశ్వతం కాని దానితో (శరీరంతో) శాశ్వతత్వాన్ని వెతకడం మానవుని అవివేకాన్ని సూచిస్తుంది. ఈ స్థితిలో సమత్వానికి మానవుడు దూరం.
  • మనం ఎడమ వైపు చూసేకొద్దీ, స్ఫటికాలు చిన్నవిగా మారుతాయి, ఇది ఉక్కిరిబిక్కిరి చేయు ఆలోచనల తీవ్రత తగ్గుతుంది, కాని స్థితిలో మార్పు ఉండదు. ఆలోచనలను విడిచిపెట్టడం సత్యాన్ని కనుగొనడానికి కీలకం,
  • ఏకత్వం: ఇంకా ఎడమవైపు వెళ్ళేకొద్దీ స్ఫటికాలు మరింత చిన్నవై చుక్కలుగా మారతాయి. పాత ఆలోచనలు మరియు అహం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇది విముక్తికి  ఆరంభం. జీవనము మరణము రెండు ప్రక్కలు కాంతి పుంజములచేత కలుపబడతాయి. ఆ కిరణ పుంజాల రంగులు తెలుపు నుంచి నలుపుకు  (అలాగే నలుపు నుంచి తెలుపుకు) మారడం కూడా గమనించండి. ఆ రెండూ కలిసిన చోట ప్రకాశవంతమైన పువ్వులాంటి దానిని చూపారు. ఆ బిందువుల తర్వాత ఆ మధ్యస్థ రేఖ కూడా చూప బడలేదు. 
  • సమత్వం: పూర్తి ఎడమవైపు భాగంలో, చర్య మరియు దాని ప్రతిస్పందన ఒకటే అయిన స్థితిని వ్యక్తం చేస్తుంది, నిజమైన చూచూట అంటే విడి విడిగా కనిపిస్తున్న (జనన మరణాలను) ఒకే సత్యమునకు రూపాలని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అని సూచిస్తుంది.
  • స్వేచ్ఛ: విభజన సృష్టించు సంఘర్షణను అధిగమించుట​. ఒక కీలక కౌశలము. మౌనమైన మనస్సు నుండి చూడగలుగుట​. 

హంస నం. 9 చిత్రం చిహ్నాలను ఉపయోగించి, స్పృహలో మార్పు ద్వారా ద్వంద్వత్వం నుండి ఏకత్వం వైపు ఎలా పయనించాలో వివరిస్తుంది. ఈ చిత్రం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, అహంకారం నుండి విముక్తిని, మరియు అంతిమ సత్యాన్ని చేరుకోవడాన్ని సూచిస్తుంది.

Introduction: Swedish artist Hilma af Klint (1862-1944) pioneered abstract painting ahead of her contemporaries. Her paintings largely reflect spiritual and philosophical concepts. Swan No. 9 is part of her "Paintings for the Temple" series, which explores various dimensions of human existence. 

Image Description and Analysis: 

This painting represents a spiritual journey. This journey progresses from duality towards unity. Various elements seen in the painting help in understanding the mind's transformation journey. 

  • Division: There is a subtle, indistinct line in this painting. The painting is symmetrical about this line. This line initially represents the division between life and death, but as we look deeper into the painting, this division fades away. 
  • Right Side: Our Present State: The large crystals on the right side represent how we generally are - seeking proof and certainty, even though we know that nothing is permanent. Seeking permanence in the impermanent (body) indicates human ignorance. In this state, man is far from equilibrium. 
  • Left Side: As we look towards the left side, the crystals become smaller, indicating a shift away from the intensity of overwhelming thoughts, but there is no change in state. Abandoning thoughts is crucial to discovering the truth. 
  • Unity: As we go further towards the left, the crystals become even smaller and turn into dots. Old thoughts and ego are completely wiped out. This is the beginning of liberation. The two sides of life and death are joined by beams of light. Also observe how the colors of those beams of light transition from white to black (and also from black to white). A bright, flower-like shape is shown where the two meet. Also note that the dividing line is not shown after the depiction of the dots.
  • Balance: In the far left part, the painting expresses a state where action and its response are one, true seeing means understanding that what appears separate (birth and death) are forms of the same truth. 
  • Freedom: Overcoming the conflict created by division is a key skill. Being able to see from a silent mind.

Swan No. 9 uses symbols to explain how, through a change in consciousness, we can journey from a divided way of experiencing the world to a unified way. This painting represents the spiritual journey, liberation from the ego, and the attainment of ultimate truth.


No comments:

Post a Comment

235 mollalEle nAku tanne muDuchukommanave (మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె)

  ANNAMACHARYULU 235 మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె mollalEle nAku tanne muDuchukommanave తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. I...