ANNAMACHARYA
49 ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు
Introduction: in this inward looking verse, Annamacharya asserts that there is no use of blaming others. Providence must be endured by the beings. Thus as always, he declared, these bondages are the man’s own creation and therefore, he should unchain himself from the ignorance he acquired.
ఉపోద్ఘాతము: అంతర్ముఖముగా నుండు యీ కీర్తనలో అన్నమయ్య యితరులను నిందించి ప్రయోజనము లేదని అన్నారు. విధి నిర్ణయములు శిరసావహించి తీరవలేను. ముందరెన్నో మార్లు చెప్పినట్లు మనిషి తనను పట్టి వెధించుచున్న అజ్ఞానమనే సంకెళ్ళకు తానే బాధ్యుడని, వాని నుంచి విడిపించుకొనుట (మోక్షము) కూడా అతని చేతిలోనే యున్నదని వివరించారు.
ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు
itarula dUranEla yevvarU nEmi sEturu
mati vArU damavaMTi manujulE kAka ॥pallavi॥
Word to Word Meaning: ఇతరుల (itarula) = others; దూరనేల (dUranEla) =
why blame?; యెవ్వరూ(yevvarU) =
anyone; నేమి(nEmi) = what; సేతురు (sEturu) = can do?; మతి (mati) = mind; వారూఁ (vArU) = they
as well; దమవంటి (damavaMTi) = similar to self; మనుజులే కాక (manujulE kAka)
= humans.
Literal Meaning and
Explanation:
There is no use of blaming others for
all the troubles and travails we face. Understand that “others” are ordinary
people like us.
It is nothing but human tendency to
blame others, Annamayya says root cause does not lie outside, but within us.
Let us remember following words of Shakespeare. “Every man has a bag hanging before him, in which he puts his neighbour's faults, and another behind him in which he stows his own.”
భావము & వివరణము : మన కష్టాలు, చిక్కులకు ఇతరుల నిందించడం వలన ప్రయోజనం లేదు. ఆలోచిస్తే వారు కూడా మనలాంటి సాధారణ మనుషులే కదా.
మనకు కష్టాలు వచ్చినపుడు ఇతరులను నిందించడం మానవ స్వభావము. అన్నమయ్య ఇది తగదని ముందు మన ప్రవర్తన చక్కదిద్దుకోవాలి అని ఈ కీర్తనలో చెప్పారు.
చేరి మేలుసేయఁ గీడుసేయ నెవ్వరు గర్తలు
chEri mElusEya gIDusEya nevvaru gartalu
Word to Word Meaning: చేరి (chEri) = intentionally; మేలుసేయఁ(mElusEya) = do good; గీడుసేయ(gIDusEya) = do harm; నెవ్వరు(nevvaru) = who; గర్తలు (gartalu = kartalu) = cause; ధారుణిలో (dhAruNilO) = on this earth; నరులకు (narulaku) = for humans; దైవమే కాక (daivamE Kaka) = except God; సారెఁ (sAre) = Frequently, often; దనవెంటవెంటఁ జనుదెంచేవారెవ్వరు (danaveMTaveMTa janudeMchEvArevvaru) = who follows you closely; బోరునఁ(bOruna) = వడిగా, quickly; జేసిన (jEsina) = done; పాపపుణ్యాలే కాక (pApapuNyAlE kAka) = only good and bad deeds.
Literal Meaning and Explanation: For the mortals, good or bad befall dues to the acts of God. Other mortal cannot be the causes of such acts. Only things that actually follow the person (after death) are virtue and sin but no living being.
1. There is an apt a story from Mahabharata
narrated by Bhishma to Dharmaraja which fits here to explain the concept of forbearance.
. A lady named Gautami lost her son due
to snake bite. Seeing her condition, a hunter named Arjunaka, goes to forest,
fetches the very serpent and seeks her permission to kill it. She says, will
this act of yours bring back my son (to life)? Thus the hunter was prevented by
the lady to kill the snake. She enunciates her decision as below.
(Purport: Destiny may bring good or bad (things/times) to the
beings. Those mortals, who may praise or castigate such outcome, get engaged in
corporal activities. Those true followers of dharma, shall not give into these
trivial considerations of turbidity to unsettle quietness of their mind.)
(First volume, Anusasana Parva,
Mahabharata)
Please note the lamenting mother says even the
death of her son does not deter her from following the dharma. What do we do in
that situation? What Dhrama/law we follow?
2. Part of this verse is also based on the following Sanskrit
shloka.
अर्था गृहे निवर्तन्ते श्मशाने मित्रबान्धवाः
सुकृतं दुष्कृतं चैव गच्छन्तमनुगच्छति
(Purport: The money you earned will remain in the house. Your
relations and friends will follow you upto burial ground. Beyond that, the results of good and bad
deeds only will follow you. Therefore O man, beware of your conduct.)
భావము & వివరణము : భూమి పై మనుషులకు మేలు లేదా కీడు చేసేది దైవము ఒకడే. వేరేవ్వరు కాదు. మనను వదలక వెంటబడి వచ్చునవి తాను వడిగా జేసిన పాపపుణ్యములే గాని మరి పరు లెవ్వరును రారు.
1. మహాభారతములో యీ సందర్భానికి తగిన కథను భీష్ముడు ధర్మరాజుకు చెబుతున్నాడు. గౌతమి (అనే మహిళ) కుమారుడు పాము కరిచి చనిపోయాడు. ఆ తల్లి దుస్థితి చూసిన ఒక బోయ (అర్జునకుడు) ఆ పామును పట్టితెచ్చి ఆమెకు చూపిస్తూ, నీ కొడుకు చావునకు కారణమైన యీ సర్పాన్ని చంపి ప్రతీకారము తీర్చుకుంటావా అని అడుగుతాడు. ఆమె యిలా అంటుంది. ఈ పాముజంప బ్రదుకునె నాపుత్రుడు విడువుమర్జునక అంటూ యిలా అంటుంది.
క. విధివశమున వచ్చిన కీ
డధములు గొనియాడి వ్రేఁగులై విపులభవాం
బుధి మనుగుదురు మునుంగరు
సధర్ములగు నుత్తములు ప్రశాంతి జులకనై. (ఆనుశాసనికపర్వం)
(భావము: విధివశాత్తు జరిగిన దానికి కీడు మేలులెంచి మనుషులు అనేకానేక క్రియలలో ములిగిపోదురు. ధర్మపరులగువారు తమ నిర్మలత్వాన్ని(/ సమచిత్త స్థితిని) భంగపరచు యే విషయాల్లోనూ క్రీడింపరు/ తలదూర్చరు.)
ఆ తరువాత కథలో, బోయ ఎందుకు యీ పసివాడి ప్రాణాలు తీశావు అని పామును అడుగుతాడు. నేరం నాది కాదు, మృత్యువుది అంటుంది. మృత్యువునడిగితే, నేరం నాది కాదు కాలానిది అంటుంది,
ఈ కథలో తన కొడుకు ప్రాణం తీసిన పాముపట్ల కూడా పగ వహించని తల్లిని చూస్తున్నాం… ఆ పరిస్థితులలో మనమేమి చేయుదము? మనమే ధర్మము పాటిస్తాము? మన న్యాయ మేమిటి?
2. ఈ కీర్తన లోని కొంత భాగము క్రింది శ్లోకము నుంచి తీసుకుని వుండవచ్చు.
శ్లో|| అర్థా గృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాః
సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంతమనుగచ్ఛతి
భావము: సంపాదించిన డబ్బు ఇంట్లో ఉంటుంది. బంధు మిత్రాదులు స్మశానం వఱకు వస్తారు. చేసుకున్న మంచి చెడుల ఫలితాలు మాత్రమే మనల్ని అనుసరిస్తాయి. (కాబట్టి మానవుడా నీ నడవడికను మార్చుకో).
తొడఁగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు
toDagi pogaDiMchAnu dUshiMchA mukhyulevvaru
guDikonna tanalOni guNAlE kAka
kaDugIrti napakIrti gaTTeDivArevvaru
naDachETi tanavartanamulE kAka ॥ita॥
Word to Word Meaning: తొడఁగి (toDagi) = to
put on; పొగడించాను (pogaDiMchAnu) = get praised; దూషించా (dUshiMchA) =
get snubbed; ముఖ్యులెవ్వరు (mukhyulevvaru) = what is the chief thing? గుడికొన్న
(guDikonna) = క్రమ్ముకొన్న, చుట్టుకొన్న, encompassing; తనలోని (tanalOni) = in
the self; గుణాలే కాక (guNAlE
kAka) except the qualities; కడుఁగీర్తి (kaDugIrti) =
much of good name; నపకీర్తి (napakIrti) = much of bad name; గట్టెడివారెవ్వరు
(gaTTeDivArevvaru) = to connect, to affix, to attach; నడచేటి తనవర్తనములే కాక (naDachETi
tanavartanamulE kAka) = what else, other than how one behaves.
Literal
Meaning and Explanation: based on your qualities someone may praise you or
denounce you. The reason for good name or disgrace is your behaviour and
conduct, definitely not others.
Just understand that blaming others is just a reaction produced
internally. What else can be more
straightforward than this? Instead of spending hours on social media
criticizing others, society, politicians and other religions, spend few minutes
before the mirror called self. Find out what you actually are?
భావము & వివరణము : ఎవరైనా మనను పొగడటానికి, తిట్టడానికి ముఖ్య కారణం మనలోని గుణ దోషాలే కాని వేరే ఏమి కాదు. అలాగే మనకు కీర్తి గాని అపకీర్తి గాని రావటానికి కారణం మన ప్రవర్తన, నడతలే గాని అన్యులు కాదు.
గడనకొరకుఁ జిక్కి కాముకవిద్యలఁ జొక్కి / నిడివి నేమైనాఁ గని నిక్కి నిక్కి/ వొడలిగుణముతోడ వుదుటువిద్యలఁ జాల/వడదాఁకి బడలనివాఁడువో వైష్ణవుఁడు.
ఇంత కంటే స్పష్టంగా ఇంకేమి చెప్పగలరు? నాయనా/ తమ్ముడా/ చెల్లీ కళ్ళు తెరుచుకుని ఇప్పటికైనా పొద్దస్తమాను సోషల్ మీడియాలో ఇతరులను, సమాజాన్ని, రాజకీయ నాయకులను, ఇతర మతస్తులనూ యేకి పారేసే బదులు అద్దములో నిన్ను నువ్వు సరిగ్గా చూసుకో. నువ్వెవరో తెలుసుకో!!
ఘనబంధమోక్షాలకుఁ గారణ మిఁక నెవ్వరు
ghanabaMdhamOkshAlaku gAraNa mika nevvaru
nanichina j~nAnAj~nAnamulE kAka
tanaku SrIvEMkaTESu dalapiMchEvA revvaru
konamoda le~rigina guruDE kAka ॥ita॥
Word to Word Meaning: ఘనబంధమోక్షాలకుఁ (ghanabaMdhamOkshAlaku) = for bondage or liberation; గారణము (gAraNamu) = cause ( read it as ఘన కారణము = solid reason); ఇఁక (ika) = what else; నెవ్వరు (nevvaru) = who; ననిచిన (nanichina) = వృద్ధినొందిన, అతిశయించిన, what got acquired/thrived; జ్ఞానాజ్ఞానములే కాక (j~nAnAj~nAnamulE kAka) = only knowledge or ignorance; తనకు (tanaku) = for the self; శ్రీవేంకటేశుఁ (SrIvEMkaTESu)= Lord venkateswara; దలపించే (dalapiMchE) = To induce, persuade, to put in mind; వారెవ్వరు (vA revvaru) = who? కొన (kona) = End (death); మొదలు (modalu) = Beginning (Birth); ఎఱిఁగిన (e~rigina) == Knowing, aware; గురుఁడే కాక!( guruDE kAka!) who else but the teacher!!
Literal Meaning and Explanation: for the beings, either the bondage or liberation is caused by the knowledge or ignorance acquired during the course of his life. Who else will sow the seeds to reminisce Lord Venkateswara (God) except the teacher knowing the beginning and the end?
Here the meaning of all-knowing teacher is who knows both birth and death. Please remember that no living person knows what death is. It’s only the god OR a liberated person who knows both, only can be guru. . Either approach God or approach such liberated persons. There is no point approaching other mortals.
Another notable point made here is god himself will sow the seeds. Does it mean that man need not do anything? In fact, the work of man has, is to allow these seeds to be planted. IF one keeps the mind open to the light, it is very much easy. If we cover it with thick coat of worldly affairs, family and self; light will not penetrate to the centre that is holding man as he knows himself as. The opaque layer of me as “I know me” is impervious. That needs to be melted to align with GOD.
భావము & వివరణము : మనకు బంధమైనా, మోక్షమైనా కలిగించేవి మనకున్న (మనము గడించిన) జ్ఞానం, అజ్ఞానములే తప్ప వేరే ఏవీ కాదు. మనచేత స్మరింపచేసుకుని మనకు సద్గతి ఇచ్చే గురువు సర్వం తెలిసిన శ్రీవేంకటేశ్వరుడే గాని వేరేవ్వరు లేరు.
గురువును బహు సుందరముగా నిర్వచించిరి. మొదలు(పుట్టుక) నుండి దాకా కొన ( చివర లేదా మరణము) ఎఱిఁగిన వాడు ఎవరూ? జీవించియున్న యే మనిషైనా మరణము నెరుగడు. ఇది వాస్తవము. మరణమునూ, పుట్టుకనూ ఎఱిఁగినవాడనగా చాలా చాలా అరుదైనవారై ఉందురు. అట్టి మహాత్ములు దైవముతో సమానమని అర్ధము. ఎవరినైనా గురువుగా భావించుట తగదని భావము.
దైవమే మనిషి చేత స్మరింపచేసు కుంటాడని అన్నారు కదా. మనిషికి చేయవలసిన పని యేమీ లేదా? దైవస్మరణ మనే విత్తులు మొలకెత్తేందుకు తన మస్తిష్కమును తయారుగా ఉంచాలి. విషయ వాంఛలలోను, సంసార వ్యవహారములలోను కూరుకుపోయి, అవి కలిగించు భ్రమ మస్తిష్కమును మందమైన పొరతో కప్పివేస్తే, కాంతి చొరబడక విత్తులు మొలకెత్తవు.
"నేను, నా అనే అహకారము"
కరిగిపోతేకాని కాంతి చొరబడదు. అది చొరబడక విత్తులు మొలకెత్తవు. దైవముతో ఐక్యము కాలేము.
zadaz
Reference: copper leaf 140-3, volume: 2- 174