Tuesday, 18 May 2021

51 ఇతరము లిన్నియు నేమిటికి (itaramu linniyu nEmiTiki)

ANNAMACHARYA

51 ఇతరము లిన్నియు నేమిటికి 

Introduction: In this verse, Annamacharya raises a series of questions for the reader /listener to ponder. Though they appear to be trivial, they do carry deeper sense. Let us see. 

ఉపోద్ఘాతము: కీర్తనలో అన్నమయ్య కొన్ని మౌలిక ప్రశ్నలు లేవనెత్తారు. ఇవి పైకి కనబడ్డంత సులభమైనవేనా? వాటికి ఇంకా లోతైన అర్ధాలున్నయా? చూద్దాం. 

ఇతరము లిన్నియు నేమిటికి

మతిచంచలమే మానుట పరము ॥పల్లవి॥

 

itaramu linniyu nEmiTiki

matichaMchalamE mAnuTa paramu        pallavi 

Word to Word Meaningఇతరములు (itaramulu) = Others;  ఇన్నియు (inniyu) = so many; నేమిటికి (nEmiTiki) = why? What for? మతిచంచలమే (matichaMchalamE) = wavering in mind; మానుట (mAnuTa) = stopping;  పరము (paramu) = other, unknown. 

Literal Meaning and Explanation: Why pursue many other things. Single reason preventing man from achieving liberation is the wavering mind. 

In this emphatic statement, Annamacharya is clear that man goes after many things. He is unable to decide which way to go 

I am reminded one chandamama story: A fox and a cat are discussing in a forest. Fox asks Cat, “if lion appears all of a sudden, what will you do?” The Cat says, “I have only one trick, I can climb the tree faster than any one.” It’s the turn of Cat and it asks the same question. The Fox says “I have about a dozen tricks under my hat.” Lo! Lion appeared from nowhere. The cat climbed the tree moment it sensed the danger. Fox, unable decide which trick to apply gets caught. Thus for the fox, all the dozen tricks are of no avail.  

Indecisive man is similar to the fox. He gets caught up with the thing called karma. He is always in the thick of it. 

భావము & వివరణము : ఇవన్నీ యేమో? వాటి వెంట పడటమెందుకో? మానవుడా ఏకమైన స్థిరమైన మనస్సే మోక్షము. 

నిశ్చయాత్మకమైన సందేశములో మనిషి అనేక విషయాలను సొంతము చేసుకోవాలనే కాంక్షతో యెటు పోవాలో నిర్ణయించుకో లేకపొతాడన్నారు. 

ఒక  పాత చందమామ కధ అన్నమయ్య చెప్పినదాన్ని అర్ధము చేసుకునేందుకు ఉపయోగ పడుతుంది. ఒక అడవిలో నక్క​, పిల్లి మాట్లాడు కుంటున్నాయి. నక్క పిల్లిని "అకస్మాత్తుగా సింహము వస్తే ఏం చెస్తావు?" అని అడిగింది. పిల్లి "నాకు చెట్లెక్కడమే బాగా వచ్చు. అంతే చేట్టెక్కేస్తాను" అంది. నువ్వైతే యేంచేస్తావని పిల్లి అడిగింది. నక్క "నా దగ్గర  చాలా విద్యలున్నాయి. నీ లాగ ఒక్కటే కాదు సుమా!!" అంది. హటాత్తుగా సింహము రానే వచ్చింది. పిల్లి గబాలున చెట్టెక్కేసిందినక్క జిత్తు వేయాలో తెల్చుకోలేక పొయింది. సింహము దాన్ని పట్టేసింది 

నిశ్చయించుకో లేనివాడు పై కధ లోని నక్క వలె యేమి చెయ్యాలో పాలుపోకుండా ఉంటే అతడిననేకా విషయాలు చుట్టుముట్టి చీకాకు పరచడంతో జీవితము వ్యర్ధమైపోతుంది. 

 

ఎక్కడిసురపుర మెక్కడివైభవ-

మెక్కడి విన్నియు నేమిటికి
యిక్కడనే పరహితమునుఁ బుణ్యము
గక్కునఁ జేయఁగఁ గల దిహపరము          ॥ఇత॥

 

ekkaDisurapura mekkaDivaibhava-

mekkaDi vinniyu nEmiTiki

yikkaDanE parahitamunu buNyamu

gakkuna jEyaga gala dihaparamu          ita 

Word to Word Meaningఎక్కడి (ekkaDi) = Where is; సురపురము (surapuramu) = Capital of the gods (Amaravati, Swarga); ఎక్కడి (ekkaDi) = Where is; వైభవము (vaibhavamu) =  splendour? ఎక్కడివి (ekkaDivi) = Where from:  ఇన్నియు (inniyu) = All these;  నేమిటికి (nEmiTiki) = Why do they exist?  యిక్కడనే (yikkaDanE) = Here in this very world; పరహితమునుఁ (parahitamunu) = benevolence;   బుణ్యము (buNyamu)  = virtuous deed;  గక్కునఁ(gakkuna) = immediately, quickly; జేయఁగఁ గల (jEyaga gala) = possible to perform;  దిహపరము (dihaparamu) = This world and the Other. 

Literal Meaning and Explanation: Why people think of Swarga? Why do they cherish splendour? Where do they exist? While you can spontaneously resort to benevolence why do you contemplate of this world and the other? 

No one knows if there is a thing called Swarga or Naraka. Definitely man has made his life hell in pursuit of heaven. Here Annamacharya is stating that the man always fascinated by comforts and glittering things. All he does in this world is in anticipation of them. While he could show his generosity, Can he stop thinking of reaping the benefits of such actions? As long as end is in mind, person cannot get liberated. 

That is the reason, Jiddu Krishnamurti Often said: “freedom from the desire for an answer is essential to understanding of a problem?” 

భావము & వివరణము : స్వర్గము యెక్కడుందో? వైభవమేమిటో? (నన్ను లాగేస్తున్నాయి) ఇవన్నీ యేమిటో? పరోపకారము ఇక్కడే చేయగలిగి నప్పుడు మానవుడు పరము గురించి దేనికి ఆలోచిస్తాడో? 

స్వర్గము నిజముగా ఉందా? ఉందో లేదో తెలియదుకాని, స్వర్గము గురించి తపిస్తూ జీవితాన్ని నరకము చేసుకుంటాడు. తనకున్న సుఖాల కంటే వేరే యేదో సుఖాలున్నాయని మనిషి భ్రమిస్తాడు. తళుకుబెళుకులకు తనకు తెలియకుండానే దాసుడౌతాడులేనిదాన్ని వెతుకుతూ తన జీవితాన్ని వ్యర్ధము చేసుకుంటాడు. 

ఇలాంటి స్వర్గము, సుఖము అనే లక్ష్యాలు లేకుండా మనిషికి మనుగడ లేదా? అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు తరచుగా ఇలా అనేవారు. "సమాధానము తెలుసుకోవలెననే  తపన నుంచి విముక్తి ఉన్నప్పుడే సమస్యను సరిగ్గా అర్ధము చేసుకో గలుగుతాము". 

యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు-

లెవ్వరిందరును నేమిటికి
రవ్వగులక్ష్మీ రమణునిఁ దలఁపుచు
యివ్వలఁ దాఁ సుఖియించుట పరము   ॥ఇత॥

 

yevvaru chuTTamu levvaru baMdhuvu-

levvariMdarunu nEmiTiki

ravvagulakshmI ramaNuni dalapuchu

yivvala dA sukhiyiMchuTa paramu        ita 

Word to Word Meaningయెవ్వరు (yevvaru) = Who are; చుట్టములు (chuTTamulu) = (your) = relations; ఎవ్వరు (evvaru) = who are; బంధువులు (baMdhuvulu) = friends; ఎవ్వరిందరును (evvariMdarunu) = Who all are these?  నేమిటికి (nEmiTiki) = Why do they exist?   రవ్వగులక్ష్మీ రమణునిఁ (ravvagulakshmI ramaNuni) = శ్రేష్ఠుడైన దలఁపుచు (dalapuchu) = thinking and reflecting; యివ్వలఁ (yivvala) = this side; దాఁ (dA) = that person; సుఖియించుట (sukhiyiMchuTa) = remain confortable; పరము  (paramu) = Is it equal to the other ( side). 

Literal Meaning and Explanation: Who are these relations and friends? Why do they all exist? Is it not better to pray and reflect the god Laxmi Ramana (God Hari) and remain comfortable here (in this world) itself, instead of looking for comfort after death.

Annamacharya is asking us to have a clean review of our relationships in this world, be they are friends or your kith and kin.  You will find real relationship is not bondage, but possessing a thing or a person is. Then we think of life after death. Does it really exist? Or is it our postulation? What would you like to hold onto? The real available opportunity of being in meditation or something that is not clear. 

భావము & వివరణము : మిత్రులు, బంధువులు అనగా నెవ్వరు? వారెందుకు వున్నారీ జీవితములో?  అందమైన లక్ష్మీ రమణునిఁ మదిలో తలచుచు నుంటే, యీ జన్మములోనే సుఖించవచ్చు కదా. (ఏదో తెలియని మరణానంతర జీవితంపై మనిషికెందుకు ఇంత ఉత్కంఠ?)

అన్నమాచార్యులు మనని బాంధ్యవ్యము అనగానేమిటో స్పష్టగా తెలుసుకోమంటున్నారు. బాంధ్యవ్యములో బంధము లేదు, స్వాధీనము లేదా కైవసము చేసుకొనుట యందున్నట్లు. 

అదేమిటో  మరణము తరువాత జీవితము గురించి మనిషి అలోచిస్తాడు. అది ఊందో లేదో యెవరికి తెలుసు? తెలియని లేదా ఊహల్లోని మోక్షము గురించి తపించడము శ్రేష్టమా? ప్రతీ మనిషి అనుసరించగలిగిన​ వాస్తవమైన భక్తిని చేపట్టడము మంచిదా? 

యెందరు దైవము లెందరు వేల్పులు

యెంద రిందురును నేమిటికి
కందు వెఱిఁగి వేంకటగిరిరమణుని
చిందులేక కొలిచిన దిహపరము   ॥ఇత॥

 

yeMdaru daivamu leMdaru vElpulu

yeMda riMdurunu nEmiTiki

kaMdu ve~rigi vEMkaTagiriramaNuni

chiMdulEka kolichina dihaparamu         ita 

యెందరు (yeMdaru) = how many; దైవములు (daivamulu) = god;  ఎందరు (eMdaru) = how many; వేల్పులు (vElpulu) =  demi-gods; యెంద రిందురును (yeMda riMdurunu ) = Who all are these?    నేమిటికి (nEmiTiki) = Why do they exist?   కందువ ( kaMduva) = జాడ, ఆచూకీ, A sign, A path; ఎఱిఁగి (e~rigi) =  knowing; వేంకటగిరిరమణుని (vEMkaTagiriramaNuni) = Lord Venkateswara; చిందులేక (chiMdulEka) = without spillage ( he is hinting single minded devotion)  కొలిచినది (kolichinadi) ఇహపరము (ihaparamu) = This world and the Other. 

Literal Meaning and Explanation: Why there are numerous Gods and demi-gods; why do they all exist? When you  find path to the Lord Venkateswara and follow it as if nothing else exists, where is the need to know whether it is this world or the other? 

Annamacharya, in all his verses made commentaries on what man should do. What people are interested in knowing is what happens after death?  The former is pure action to reach god. The latter is curiosity with no purpose. 

A well-known story from Mahabharata enunciates the meaning of single minded devotion. One day, Drona the teacher calls all the disciples for a test of their archery skills. He arranges an effigy of a tiny bird in faraway place. 

He asks and Dharmaraja, eldest amongst the students to shoot the bird. Before that Drona asks, what Dharmaraja is able see. He says he could see people, buildings between him and the target. He also describes the tree and the bird. Without testing him any further, he gives to chance to others. All of them fail to answer Drona. 

Finally it was the turn of Arjun. He asks the same question. What does he see? Anrjun says, Sir, I cannot see anything, other than the eye of the bird. Drona asks what about the people, buildingss etc etc. Arjun still replies, sir, I am aware of the people and buildings, but my mind sees only the eye of the bird.   

We are in similar situation like Arjun. What do we see? Mostly relations, friends, money, comforts, indulgence and possibly at the far end (if at all) something called god. What Annamacharya said is that we might be aware of friends, relations and demi-gods, but do we seek god with single minded devotion?  Do we have single minded concentration of Arjun? 

భావము & వివరణము : ఎంతో మంది దేవతలూ, దేవుళ్ళూ ఉన్నారా? వేంకటగిరిరమణుని పాదాల జాడను, అవి తప్ప వేరేమీ లేవని తెలియ ప్రయత్నము చేసిన, యీ దేవతలెవరు? మోక్షమేమిటి అనే ప్రశ్నలు ఊండవే!!! 

ఇక్కడ చెప్పిన దాన్ని వివరించుటకు మహాభారతములోని చిన్న కధను చదువుదాము. ద్రోణుడు కురుపాండవుల విలువిద్యా నైపుణ్యము పరీక్షిస్తున్న్నడు. దూరంగా ఒక చెట్టు మీద చిన్న పక్షి బొమ్మను అమర్చాడు. ముందుగా, పెద్ద వాడైన ధర్మరాజు వచ్చి నిలబడ్డాడు. 

ద్రోణుడు ఆ పక్షిని బాణముతో కొట్టాలి. నువ్వు నిలబడిన చోటినుంచి ఏమేమి కనబడుతున్నాయి అని అడిగాడు. దానికి ధర్మరాజు, నాకు పక్షికి మధ్య మనుషులు, భవనాలు, చెట్లు, చెట్టుమీద పక్షి కనబడుతున్నాయి అన్నాడు. ధర్మరాజును పరీక్షించకుడానే పంపేశారు ద్రోణాచార్యులు. అలాగే తరవాత వచ్చిన వారు కూడా పరీక్ష లేకుండానే తిరిగి వెళ్ళారు. 

చివరికి ఆర్జునుడి వంతు వచ్చింది. నువ్వు నిలబడిన చోటినుంచి ఏమేమి కనబడుతున్నాయి అని అడిగాడు ద్రోణుడు.  నాకు ఆ పక్షీ కన్ను తప్ప వేరేమీ కనబడటములేదు అన్నాడు ఆర్జునుడు. ఐతే మధ్య మనుషులు, భవనాలు, చెట్లు లేవా? అన్నాడు ద్రోణుడు. "అవి ఉన్న ఆనవాళ్ళు వున్నాయి. కాని నా మనస్సులో పక్షి కన్ను తప్ప మరేమీ లేదు" అన్నాడు ఆర్జునుడు. 

మనుషులందరి స్థితి కూడా పైన చెప్పిన పరీక్ష లాంటిదే. మనకేమి కనబడతాయి? నేను, నావారనువారు, ఆభరణాలు, సంపదలు, భవనాలు, మనుషులు,  నా దేశం తర్వాత ఎక్కడో, చివర్లో (ఉంటే) దేవుడనేవాడు. ఇక్కడ, ఈ కీర్తనలో అన్నమయ్య కూడా అదే అంటున్నాడు. పైన పేర్కొన్న స్వర్గము, వైభవాలు, చుట్టములు, బంధువులు, దేవతలు కూడా వీరెవరు? వీటన్నింటి ఉనికి ఎఱుకలో ఉండవచ్చు గాక​. వీరితో మనకు సంబంధము ఉండ వచ్చు; బంధములుండ వచ్చునా? (ధర్మరాజుకు మనుషులు, భవనాలు, చెట్లు, చెట్టుమీద పక్షి కనబడినట్లు, ఆర్జునుడికి కనబడనట్లు.) దేవుడే తప్ప మరేమీ లేని భక్తి భావన మనకుందా? ఆర్జునుడిలా మనము ఏకాగ్రత చూపగలమా? 

zadaz

Reference: copper leaf 14-4, volume: 1-86 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...