ANNAMACHARYA
57. చలువకు వేఁడికి సరికి సరి
Introduction: In this wonderful verse,
Annamcharya says “do not wait for the good season to start contemplating god. Do
not wait for present engagement with senses to get over. Do not wait to arrange
all the security to ponder over god. Don’t theorise, for it does not solve your
problems”. As always, he is sceptical of education in approaching the god.
ఉపోద్ఘాతము: ఈ అద్భుతమైన కీర్తనలో అన్నమాచార్యులు “భగవంతుని గురించి ఆలోచించడం కోసం మంచి కాలము కొరకు చూడవద్దు. ఇంద్రియాలతో కార్యకలపాలు సాగుతూనే వుంటాయి. భద్రతలను ఏర్పాటు చేయడానికి వేచి ఉండకండి. సిద్ధాంతీకరించవద్దు, ఎందుకంటే ఇది మీ సమస్యలను పరిష్కరించదు”అంటారు. ఎప్పటిలాగే, భగవద్ప్రాప్తికి విద్య సాయపడదనే చెబుతారు.
కీర్తన
చలువకు వేఁడికి సరికి సరి
కాయము గలిగినఁ గలుగుఁ దోడనే
కడుపు నిండితే ఘనమై నిండును
పెక్కులు చదివిన పెనఁగుఁ దోడనే
Details and Explanations:
చలువకు వేఁడికి సరికి సరి
chaluvaku
vEDiki sariki sari
Word to Word Meaning: చలువకు (chaluvaku) = winter season; వేఁడికి (vEDiki) = summer season; సరికి సరి (sariki sari) = even out each other; కలదు (kaladu) = exists, available; ఇక (ika) = here after; హరి నీ (hari nI) = God Sri Hari; కరుణే = your belssings only; మాకు (karuNE mAku) = for us.
Literal Meaning and Explanation: The seasons keep changing evenly. Here after we have only Hari ( the god) your blessings.
Annamacharya meant that the happenings of life, like seasons,
keep happenings not waiting for our consent. We only lose time, but nothing
else will happen. That is the reason he says, we are left with only one avenue
of seeking the blessings of God.
భావము & వివరణము : ఋతువులు వరుసగా మారుతూనే ఉంటాయి. ఇక మాకు హరి నీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయి.
అన్నమాచార్యులు ఋతువుల మాదిరిగా జీవితంలోని సంఘటనలు మన సమ్మతి కోసం ఎదురుచూడకుండా జరిగిపొతూ ఉంటాయి. మన సమయము వృధా అగును. కానీ మరేమీ జరగదు అంటున్నారు. కావున మనిషికి దేవుని ఆశీర్వాదం కోరే ఒకే ఒక మార్గమే మిగిలింది అంటున్నారు.
కాయము గలిగినఁ గలుగుఁ దోడనే
పాయపుమదములు పైపైనే
రోయదు తనుఁ గని రుచులే వెదకును
యేయెడ హరి నిను నెరుఁగుట యెపుడో ॥చలు॥
kAyamu galigina galugu dODanE
pAyapumadamulu paipainE
rOyadu tanu gani ruchulE vedakunu
yEyeDa hari ninu neruguTa yepuDO ॥chalu॥
Word to Word Meaning: కాయము (kAyamu) = body; గలిగినఁ(galigina) = on getting; గలుగుఁ (galugu) = having got; దోడనే (dODanE) = immediately; పాయపుమదములు (pAyapumadamulu) = age induced pride/ arrogance; పైపైనే (paipainE) = stay on top; రోయదు (rOyadu) = does not get shame; తనుఁ (tanu) = self; గని (gani) = having observed; రుచులే (ruchulE) = looks for new tastes; వెదకును (vedakunu) = seatches; యేయెడ (yEyeDa) = Where is the chance; హరి (hari) = Hari the God; నిను (ninu) = you; నెరుఁగుట (neruguTa) = know, be aware of; యెపుడో? (yepuDO) = (know not) when?
Literal Meaning and Explanation: Man upon taking birth, immediately the age induced arrogance takes control (of his thinking). Somehow, Man do not loathe himself (however ugly/useless he may be), but looks for new tastes every passing moment. God!! Where is the chance for being aware of you? When will I know you?
In this stanza Annamacharya said that action of the ignorance is very cunning. It makes man go astray by diverting his attention in awaiting new taste(s). This so true, the entire (world) market strategy is engaged in offering NEW TASTES/NEW EXPERIENCES to people. Entire masses get attracted to it. Where is the chance for deliverance?
Now see the relevance of this stanza to the shloka from the
Bhagavad-Gita.
तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् |
प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत || 14-8||
tamas tv ajñāna-jaṁ viddhi
mohanaṁ sarva-dehinām
pramādālasya-nidrābhis tan nibadhnāti bhārata
Purport: O Arjun, tamo guṇa, which is born of ignorance, is the cause of illusion for the embodied souls. It deludes all living beings through negligence, laziness, and sleep.
భావము & వివరణము : మనిషి జన్మించిన వెంటనే, వయస్సు ప్రేరేపిత అహంకారం అతని ఆలోచనలను నియంత్రణలోకి తీసుకుంటుంది. విచిత్రంగా, మనిషి తానెలా ఉన్నాసరే (ఎంత వికారి / పనికిరానివాడు కానీండి), తనను తాను అసహ్యించుకోడు, కానీ గడిచే ప్రతి క్షణం కొత్త రుచుల కోసం అర్రులు చాస్తాడు. దేవుడా!! నిన్ను తెలుసుకోవడానికి అవకాశం ఎక్కడో? ఎప్పుడు తెలుసుకుంటానో?
ఈ చరణంలో అన్నమాచార్య అజ్ఞానపు చర్య చాలా చాకచక్యంగా పని చేస్తుందని అన్నారు. ఇది కొత్త రుచు(ల) కోసం ఎదురుచూడడంలో దృష్టిని మళ్ళించడం ద్వారా మనిషిని తప్పుదారి పట్టించేలా చేస్తుంది. ఇది చాలా నిజం, మొత్తం ప్రపంచము నందలి మార్కెట్లు వ్యూహాత్మకంగా ప్రజలకు క్రొత్త రుచులు / క్రొత్త అనుభవాలను అందించడంలో నిమగ్నమై ఉంటాయి. మొత్తం ప్రజానీకమంతా వాటికై నిరీక్షిస్తూ కాలము గడుపుతారు. ఇక విమోచనకు అవకాశం ఎక్కడ ఉంది?
ఇప్పుడు భగవద్గీత నుండి క్రింది శ్లోకానికి, యీ చరణానికి సంబంధం చూడండి.
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ।। 14-8 ।।
భావము ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రలచే భ్రమకు గురి చేస్తుంది.
కడుపు నిండితే ఘనమై నిండును
kaDupu niMDitE
ghanamai niMDunu
Word to Word Meaning: కడుపు (kaDupu) = stomach ( appetite); నిండితే (niMDitE)
= when satiated; ఘనమై (ghanamai) = greatly; నిండును (niMDunu)
= filled; బడిఁ (baDi)
= becomes lazy; బంచేంద్రియపదిలములు (baMchEMdriyapadilamulu)
= all the senses feel comfort; విడువను (viDuvanu) = will not
let go; ఆసలును (Asalunu) = my wants; వెలయు (velayu)
= establish; బంధములు (baMdhamulu) = (new) bonds; కడగని (kaDagani) = not seeing the end; మోక్షము (mOkshamu)
= liberation; గైకొనుటెపుడో (gaikonuTepuDO) = when to
take up?
Literal Meaning and Explanation: The body wants the stomach to be satiated. Once this feeling is generated man becomes lazy and acts to keep the sensory organs in safety. This is the true cause of establishment of (unbreakable) bonds. When will the man see the end of this engagement (of ignorance) and when will he train his eyes on liberation?
What Annamcacharya meant by word “పదిలములు” (Security)? For a man standing on the 100th floor of a building, the glass wall separating him from the edge of the building provides security. Imagine, for a moment, that this glass wall is taken away, as long as he does not know, he continues to feel secure. Moment, he knows that the wall is not there, insecurity creeps in his mind. Now understand the question మోక్షము గైకొనుటెపుడో? If the man is looking for security, where is question of getting time to think of liberation?
Now let us move further. Imagine if we were in 1st floor of a building. Then intensity of fear would be reduced to caution even after knowing that wall of protection has been removed.
The corporal knowledge and civilisations are like the different stories of the above said building. More you climb on them, the more insecurity feelings and further isolation of the person. Thus the true meaning of the stanza is the more we create rings of security, the more insecure we are.
Friends, please note that these verses were written by a sage, deep in meditation. The simplest thing I would say is that Annamcahrya’s writings are beyond all possible descriptions and comprehension I have tried to put in here.
భావము & వివరణము : శరీరం కడుపు సంతృప్తికరంగా ఉండాలని కోరుకుంటుంది. ఒకసారి ఈ భావన ఏర్పడిన తర్వాత మనిషి సోమరి అవుతాడు మరియు ఇంద్రియాలను భద్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. (విడదీయరాని) బంధాలకు ఇదే నిజమైన కారణం. ఈ స్తబ్ధ కార్యకలాపాలకు ముగింపు ఎన్నడో? మరియు విముక్తిపై కళ్ళు ఎప్పుడు సారిస్తాడో?
అన్నమాచార్యులు "పదిలములు" అనే పదంతో దేన్ని సూచించారు? భద్రత అనేది సురక్షితమైనదిగా భావించు మనస్సు యొక్క స్థితి మాత్రమే! భవనం యొక్క 100వ అంతస్తులో నిలబడి ఉన్న వ్యక్తికి, భవనం అంచు నుండి తనను వేరుచేసే గాజు గోడ భద్రతను అందిస్తుంది. ఒక క్షణం ఆలోచించండి. ఇప్పుడు గాజు గోడ తీసేశారనుకోండి. ఆ విషయము అతనికి తెలియనింతవరకు, అతను సురక్షితంగా ఉన్నాడను కుంటాడు. గోడ లేదని అతనికి తెలిసిన మరు క్షణం, అభద్రత అతని మనస్సులో చిగురిస్తుంది. మనిషి క్షణక్షణం భద్రత కోసం చూస్తున్నట్లయితే, విముక్తి గురించి ఆలోచించడానికి సమయం ఎక్కడ లభిస్తుందో?
మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు భవనం యొక్క ఒకటో అంతస్తులో ఉంటే పరిస్థితి ఊహించుకోండి. రక్షణ గోడ తొలగించబడిందని తెలుసుకున్న తర్వాత కూడా భయము జాగ్రత్తగా మారిపోతుంది.
మన చదువులు, సంస్కారాలు, నాగరికతలు పైన చెప్పిన భవనం యొక్క వివిధ అంతస్తులనుకోండి. ఎంత పైకెక్కితే అంత అభద్రతా బావము. అందువల్ల భద్రతా వలయాలను ఎంత ఎక్కువ సృష్టించుకుంటామో, అంత అసురక్షిత భావనలో ఉన్నామని తెలుసుకోమంటున్నరు అన్నమాచార్యులు..
మిత్రులారా! దయచేసి ఈ కీర్తనలు గంభీరమైన ధ్యానంలో ఉన్న ఒక ఋషి వ్రాసినవని గ్రహించండి. నేను చెప్పే సుక్ష్మమైన విషయం ఏమిటంటే, అన్నమాచార్యుల రచనలు నేను పైపై వ్రాస్తున్న వర్ణనలకు దాటియున్నవే.
పెక్కులు చదివిన పెనఁగుఁ దోడనే
తెక్కుల పలు సందేహములు
యెక్కువ శ్రీవేంకటేశ నీవె మా-
నిక్కపు వేల్పవు నీచిత్త మిఁకను ॥చలు॥
pekkulu chadivina penagu dODanE
tekkula palu saMdEhamulu
yekkuva SrIvEMkaTESa nIve mA-
nikkapu vElpavu nIchitta mikanu ॥chalu॥
Word to Word Meaning: పెక్కులు (pekkulu) = lot of; చదివిన (chadivina) = study; పెనఁగుఁ (penagu) = to wrangle, to get twisted; దోడనే (dODanE) = immediately; తెక్కుల (tekkula) = proud, conceited; పలు (palu) = many; సందేహములు (saMdEhamulu) = doubts; యెక్కువ (yekkuva) = much great; శ్రీవేంకటేశ (SrIvEMkaTESa) = Lord Venkateswara; నీవె (nIve) = you only; మా (mA) = our; నిక్కపు (nikkapu)= true; వేల్పవు (vElpavu) = god; నీచిత్త మిఁకను (nIchitta mikanu) = I leave it to your decision.
Literal Meaning and Explanation On studying much, instead of the mind becoming clear more doubts get generated. O Lord Venkateswara!! You are the true saviour. I have submitted my will at your disposition.
As man starts the study of god, he of course gets some theoretical knowledge. He starts feeling that he knows something. This generates conceit. This overwhelms him from seeing the truth.
What does it mean to submit your mind to the will of god? Is it a movie dialogue? Or it has been written to eat away precious time? Remember that these are the heartfelt remarks of a great seer. Not a rigmarole uttered by tom, dick and harry!! He is saying that he will give up everything he thinks and walk according to God every moment. Is it possible without true self-sacrifice? For time being assume that it is possible, in waken up state. What happens during sleep? Think about what this means?
Now try to understand the connection of (above) synopsis with Bhagavad-Gita shloka given below.
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी |
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुने: || 69||
yā niśhā sarva-bhūtānāṁ tasyāṁ jāgarti sanyamī
yasyāṁ jāgrati bhūtāni sā niśhā paśhyato muneḥ
Purport: What all beings consider as night (that is not visible to ordinary eyes) is day for the yogi (the introspective sage is awake to that indescribable thing). What all creatures know as day (because they are engaged in material/inertial activity) is night for the sage (for he does not trouble himself in such avocation).
భావము & వివరణము : బాగా చదివి తెలుసుకుందామను కొంటే, అంతరంగము స్పష్టమగుటకు బదులు, ఎక్కువ సందేహాలు ఏర్పడతాయి. దేవుడా!! నీవు నిజమైన రక్షకుడవని తెలుసుకొంటిని. నా మనస్సు నీ ఇష్టానికి సమర్పించాను.
మనిషి దేవుని మీద అధ్యయనాన్ని చేసినప్పుడు, అతనికి కొంత సైద్ధాంతిక జ్ఞానం లభిస్తుంది. దాంతో మనిషి తనకేదో తెలుసునని భావించడం ప్రారంభిస్తాడు. ఇది అహంకారానికి దారి తీస్తుంది. అది సత్యాన్ని చూడకుండా అతన్ని గ్రుడ్డివానిని చేస్తుంది.
నా మనస్సు నీ ఇష్టానికి సమర్పించాను అనగానేమిటి? ఇదేమైనా సినిమా సంభాషణా? ఉబుసుపోవడానికి వ్రాసిందైతే కాదుకదా! ఎంతో ఆవేదన పొంది, హృదయాంతరాళా లోనుంచి వచ్చిన పలుకులివి. మనిషి తాను అనుకున్నదంతా వదలి వైచి, ప్రతీ క్షణమూ దైవానుసారము నడుచుకుంటానని అంటున్నాడు. ఇది నిజమైన ఆత్మసమర్పణ చేయక సాధ్యమా? సరే. లేచి ఉన్నప్పుడు చెయ్యచ్చనుకుందాము. మరి నిద్రలో ఏం చేస్తాడు? దీని అర్ధమేమిటో ఆలోచించండి.
ఇప్పుడు క్రింది భగవద్గీత శ్లోకానికి, ఈ చరణము యొక్క సారాంశమునకు గల సంబంధాన్ని శోధిస్తారని భావిస్తాను.
శ్లో|| యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ।।
2-69 ।।
భావము: సమస్త ప్రాణులకు (అనగా సామాన్య జనులకు) ఏది రాత్రియై దృష్టికి గోచారము కాక ఉన్నదో, దానియందు (ఆ పరమార్ధ తత్వమునందు) ఇంద్రియనిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. (ఆత్మావలోకనం చేయు చుండును). దేనియందు (అనగా ఏ శబ్దాది విషయములందు, అశాశ్వతమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచూ) ప్రాణులు మేలుకొని ఉందురో (ఆసక్తితో ప్రవర్తించుచుందురో) ఆ విషయ జాలము పరమార్ధ తత్వమును దర్శించు మునీంద్రులకు రాత్రితో సమానమై ఉండును (అనగా ఆసక్తి ప్రదర్శించరు).
zadaz
Reference: Copper Leaf 336-6, volume: 4-213