ANNAMACHARYA
99 వెదకినఁ దెలియదు వెనక ముందరలు
(vedakina deliyadu venaka muMdaralu)
Introduction: In this extraordinarily power packed verse
Annamacharya says it’s better to concentrate on shedding what one truly is not.
He appears to be chiding our attitudes with razor sharp observations. Great
philosophers have criticised men, so that people may correct themselves.
Annamacharya clearly
explains the reason behind our present state of mind in very methodical fashion.
As noted already, mere discovery of the causes do not take us out of the “problem
we are entrenched in”. Searching for a
solution is mere waste of effort. Seeking
refuge of the God with pure heart seems the only solution.
ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు ఈ అసాధారణమైన శక్తితో నిండిన సీమ టపాకాయ
లాంటి కీర్తనలో, మానవులు నిజము కాని
వాటిని తొలగించడంపై దృష్టి పెట్టడం మంచిదన్నారు. పదునైన పరిశీలనలతో మన వైఖరులను తీవ్రంగా
విమర్శించినట్లుగా కనిపిస్తాడు. గొప్ప తత్వవేత్తలు అందరూ లోపాలను యెత్తి చూపుట ద్వారా ప్రజలు తమను తాము సరిదిద్దుకుంటారని భావించారు
అన్నమాచార్యులు మన ప్రస్తుత అస్తవ్యస్త (మానసిక) స్థితికి గల కారణాలను చాలా పద్దతిగానూ స్పష్టంగానూ వివరించారు. కేవలం కారణాలను తెలుసుకోవడం ద్వారా "మనలో వేళ్లూనుకున్న సమస్య" నుండి బయటపడము. పరిష్కారం కోసం వెతుకు శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే. స్వచ్ఛమైన హృదయంతో భగవంతుని ఆశ్రయించడం ఒక్కటే పరిష్కారం.
కీర్తన:
వెదకినఁ దెలియదు వెనక ముందరలు పదమున నిలుపవె పరమాత్మా ॥పల్లవి॥
కోరిక లూరక కొనలు సాగఁగా బారలు చాఁచీఁ బ్రపంచము
యీరీతి జీవులు ఇలఁ బొడమఁ బొడమ
దూరంబాయను తొలుతటి రాక ॥వెద॥
కాయపు మదములు కప్పఁగఁ గప్పఁగ ఆయము లంటీనదె మాయ
పాయక ఇందే పనుపడి పనుపడి
చాయలు మరచిరి జంతువులు ॥వెద॥
బలుశరణాగతి ప్రాణులు దలఁచఁగ నెలవున నిలిపెను నీకరుణ
ఇలపై శ్రీవేంకటేశ్వర యిహ పర-
మలవడి దొరకెను అరచేతికిని ॥వెద॥
|
vedakina deliyadu venaka
muMdaralu padamuna nilupave
paramAtmA ॥pallavi॥
kOrika lUraka konalu
sAgagA bAralu chAchI
brapaMchamu
yIrIti jIvulu ila boDama
boDama
dUraMbAyanu tolutaTi
rAka ॥veda॥
kAyapu madamulu kappaga
gappaga Ayamu laMTInade mAya
pAyaka iMdE panupaDi
panupaDi
chAyalu marachiri
jaMtuvulu ॥veda॥
baluSaraNAgati prANulu
dalachaga nelavuna nilipenu
nIkaruNa
ilapai SrIvEMkaTESvara
yiha para-
malavaDi dorakenu
arachEtikini ॥veda॥
|
Details and Explanations:
వెదకినఁ దెలియదు వెనక ముందరలు
vedakina deliyadu venaka
muMdaralu
Word to Word meaning: వెదకినఁ (vedakina) = by searching, దెలియదు (deliyadu) = cannot find (know); వెనక (venaka) = the last ones ( births); ముందరలు (muMdaralu) = the next ones (births); పదమున (padamuna) = ప్రయత్నము, చిహ్నము, An attempt, a sign; నిలుపవె (nilupave) = (ఆ ప్రయత్నమున) నిలుపుము, keep us on stay ( on that attempt); పరమాత్మా (paramAtmA) = O Ultimate!
Literal meaning: O Ultimate! I am unable to find my bearings. I am unable to seeh what was before and what would be next. Keep me on right track.
Explanation: This plain worded chorus denotes anything but plain ideas. By the words vedakina deliyadu (వెదకినఁ దెలియదు = cannot find by searching) Annamacharya said, it is not possible to grasp the truth, by mere seeking, searching, research, analysis and thinking. He repeated this very often.
Most notable one is వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును (vEsarakumI jIvuDA vedakivedaki
daivamunu = do not get fatigued in search of the God). The simple reason behind
this revolutionary statement is that the search, the analysis takes
considerable time and in the meanwhile we keep wasting time. Another pitfall is
Analysis or search is based on certain assumptions. If the basis is faulty, the
entire work goes in the wrong direction.
Even the demons like Hiranyakasipu, Ravan incessantly searched for God with an intent to catch and kill him. They only ended up wasting their life in this elusive search.
You may be wondering why Annamacharya is repeating the idea venaka muMdaralu (వెనక ముందరలు = what was before and what would be next). Just consider, what is our general disposition? To secure better tomorrow (for self and community if possible). Can anyone predict tomorrow with any certainty? Whence muMdaralu ముందరలు = what would be next is a mere conjecture.
Let us try to understand word venaka (వెనక = what was before), is signifying our past. Like the future, we also dither our time on thinking about the past. We cannot change it, yet the world likes to engross in it.
Thus the wording venaka muMdaralu (వెనక ముందరలు) is indicating the illusions (or futile exercises) we get absorbed with. Thus, the first line means “O Man, do not waste time in pointless search”. Further also review the relevance this chorus has with the Bhagavad-Gita verse below.
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत |
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना || 2-28||
avyaktādīni
bhūtāni vyakta-madhyāni bhārata
avyakta-nidhanānyeva tatra kā paridevanā
O Arjun, all created beings are imperceptible (unmanifest) before birth and again on death. They are perceptible (manifest) in between the birth and death (for a short period of life). So why grieve for such a short lived thing?
(We know not where we come from or where do we go. Our present life, this small aperture, which we experience, is a transitory halt in the journey of life. What purpose does it serve lamenting this?)
The reader may also refer to the detailed text on poem venakEdOmuMdarEdO (వెనకేదో ముందరేదో) for further understanding.
Implied meaning: O Man, do not waste time in pointless search. O Ultimate! Make us see the right path.
భావము: ఓ పరమాత్ముడా! వెనక ముందరలు వెదకి వేసారితిమి. మేము దిక్కులను, స్వభావమును, ఊతమును ఎఱుగకున్నాము. మమ్ము సరియైన పదమున నిలుపవే!
వివరణము: అతి సామాన్యముగా కనిపించే పల్లవి తప్పక అసాధారణమైన
ఆలోచనలు రేకెక్తిస్తోంది. ‘వెదకిన
దెలియదు’ అంటూ అన్నమాచార్యులు కేవలం వెతకడం, శోధించడం, పరిశోధన, విశ్లేషణ, ఆలోచించడం వల్ల సత్యాన్ని గ్రహించడం సాధ్యం కాదు
అన్నారు. అయన తరచుగా ఈ విషయాన్ని పునరావృతం చేశారు.
వీటిలో చాలా ప్రముఖమైనది వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును (భగవంతుడిని వెతుకుతూ వెతుకుతూ అలసిపోవద్దు.) ఈ
విప్లవాత్మక ప్రకటన వెనుక ఉన్న తర్కము
ఏమిటంటే, శోధన, విశ్లేషణ గణనీయమైన సమయం
తీసుకుంటాయి. ఈలోగా మనం అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటాము. మరొక లోపము ఏమిటంటే
విశ్లేషణ లేదా శోధన అనేది కొన్ని ప్రతిపాదనలపై ఆధారపడి చేస్తాము. ఆధారం తప్పుగా
ఉంటే, మొత్తం పరిశోధన
తప్పు దిశలో సాగుతుంది.
భగవంతుడిని పట్టి సంహరించే ఉద్దేశ్యముతో హిరణ్యకశిపుడు, రావణుడు మొదలుగాగల అనేకమంది రాక్షసులు దైవమును వెతుకుతూ వెతుకుతూ సమయాన్ని వ్యర్ధం చేసుకోవటమేకాక చావు కొనితెచ్చుకున్నారు అనికూడా తెలియండి.
అన్నమాచార్యులు ఎందుకు వెనక ముందరలు అన్న పదాలను
పదేపదే వాడారు? ఆలోచించండి, మన సాధారణ వైఖరి ఏమిటి? మెరుగైన రేపటి కోసం (వీలైతే సమాజం
కోసమూ) ప్రణాలిక వేయడము. ఎవరైనా నిశ్చయంగా
రేపు అనేది ఎలా ఉంటుందో అంచనా వేయగలరా? ముందర అనేది కేవలము ఉజ్జాయీంపే.
నిశ్చితము కాని దాని గురించి శ్రమ పడుట అవివేకమే కదా!
వెనుక (= ఇంతకు ముందు, గతం) అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి
ప్రయత్నిద్దాం. భవిష్యత్తులాగే, మనమంతా గతం
గురించి కూడా ఆలోచిస్తూ సమయాన్ని వెచ్చిస్తాము. మనము దానిని మార్చలేము, అయినప్పటికీ ప్రపంచం దానిలో విహరించటానికే ఇష్టపడుతుంది. అందుకే ‘గతము తలచి వగచే
కన్నా సౌఖ్యమే లేదు / అందరాని పొందుకన్నా అందమే లేదు ఆనందమే లేదు’ అన్నారు సినీకవి సముద్రాల సీనియర్.
పాఠకులు మరింత అవగాహన కోసం వెనకేదో ముందరేదో అను
కీర్తనపై వివరణను కూడా చదవగలరు.
ఆ విధంగా 'వెనక ముందరలు' అనేది పదం మనలను ఇరికించే భ్రమలను సూచిస్తుంది.
కాబట్టి, మొదటి పంక్తి అర్థం "ఓ మనిషి, అర్ధంలేని పరిశోధనలలో సమయాన్ని వృథా చేయకు". దిగువ భగవద్గీత శ్లోకంతో ఈ
పల్లవి పలికించు భావనలతో కలిగి ఉన్న సంబంధాన్ని కూడా విచారించండి.
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత ।
అర్జునా! ప్రాణులన్నియు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు (అవ్యక్తములు). మరణానంతరమున కూడా అవ్యక్తములే. ఈ జనన మరణాల మధ్య మాత్రమే అవి ప్రకటితములు (ఇంద్రియ గోచరములు) అగుచున్నవి. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.
మనకు తెలిసినది మొత్తం కధలో చిన్న భాగం మాత్రమే. మనమెక్కడ నుంచి వచ్చామో, ఎక్కడకు పోయెదమో కూడా తెలియదు అని ఈ శ్లోకం యొక్క భావము. ఈ జీవితం ఒక మజిలీ మాత్రమే. మొత్తం తెలియకుండా, తెలిసిన చిన్ని భాగము గురించి విచారించుట అవివేకమని సూచించారు. విజ్ఞులు మొదలు నుంచి తుది వరకు ఎఱుగుటచేత దుఃఖం పొందరు అని అంతర్లీన భావము.
అన్వయార్ధము: ఓ మనిషి, ప్రయోజనములేని పరిశోధనలలో సమయాన్ని వృథా చేయకు. ఓ అంతరాత్ముడా! మమ్ము సరియైన దారిన నిలుపుము.
కోరిక లూరక కొనలు సాగఁగా
kOrika lUraka konalu
sAgagA
Word to Word meaning: కోరిక లూరక (kOrika lUraka) = desires without cause, కొనలు (konalu)= ends; సాగఁగా (sAgagA) = extended ( indefinitely); బారలు చాఁచీఁ (bAralu chAchI) = రెండు చేతులు బార చాచు (స్వాగతించుటకు), both hands stretched open (to welcome); బ్రపంచము (brapaMchamu) = world; యీరీతి (yIrIti) = this way; జీవులు (jIvulu) = beings; ఇలఁ (ila) = on earth; బొడమఁ బొడమ (boDama boDama) = పుట్టి పుట్టి, take many births; దూరంబాయను (dUraMbAyanu) = distance increased; తొలుతటి (tolutaTi) = the original, earliest; రాక (rAka) = arrival.
Literal meaning: The world (all human beings) stretched both the hands open to welcome extension of desires relentlessly. Many such successive births have ensured distancing ourselves from natural state (the original self).
Explanation: This is what we do normally. We extend the desires limitlessly. This you would have experienced your self. This stanza speaks volumes about the true action of large number of people. We not only welcome extension of desires but rejoice that we invented a new high. No wonder, now most of our homes are inundated by goods from online stores.
What happens in engagement of desires is said in last two lines. We unwittingly and continuously distance ourselves from our natural state. What profit is the artificial state though we may subscribe to Organic foods?
Why Annamacharya stated successive births? We train our children from our present state of mind. We intentionally or unintentionally implant ourselves in their minds. Thus, successively we transmit lineage apart from genes.
What is meaning of this stanza? Our engagement with the web of desires, that are sticky like the cobwebs, not the external forces that are the chief cause. What do we do? We look outside for help, while the problem is inside. Obviously, this is an incorrigible attitude we accept as alternative. However, this is not as easy as said. The main problem is differentiating what is outside and what constitutes inside?
Now observe the picture known as ‘Print Gallery’ (1956) by famous artist MC Escher. The picture depicts a man in a gallery viewing a print of a seaport, and among the buildings in the seaport is the very gallery in which he (the said person) is standing (making use of the Droste effect). This person is not only an onlooker but also, at the same time he is being looked at.
Thus, it is difficult to conclude whether the person is looking at the picture OR he is part of the picture. You may also play the video enclosed to appreciate the confusion created by this picture. Like this picture, we have difficulties in identifying what comprises of inside and what accounts for outside world.
భావము: ప్రపంచం లోని (జీవులందరూ) ఊరకనే (=నిమిత్తము లేకనే) కోరికలకు కొనలు సాగదీస్తూ
(కోరికల విస్తరణను) నిరాటంకంగా రెండు చేతులు బారలు చాచి స్వాగతించారు. ఇటువంటి
ఎన్నో జన్మలు గడవగా, గడవగా మనము మన సహజ స్థితినుండి దూరము జరిగిపోయాము.
వివరణము: ఇదే మనం సాధారణంగా చేసేది. మనము
కోరికల కొనలను అపరిమితంగా విస్తరిస్తాము. ఇది మీరు స్వయంగా గమనించి ఉంటారు. మనము కోరికల పొడిగింపును బారలు చాచి
స్వాగతించడమే కాకుండా, మేము కొత్త మార్గము కనుగొన్నందుకు ఉబ్బుతాము.
ఇప్పుడు మన ఇళ్లలో ఎక్కువ భాగం ఆన్‌లైన్ స్టోర్‌ల నుండి వస్తువులతో నిండిపోవడమే
ఉదాహరణ.
కోరికలతో కూడి సంచరించటంతో ఏమి జరుగుతుందో చివరి
రెండు పంక్తుల్లో చెప్పబడింది. మన సహజ స్థితి నుండి మనకు తెలియకుండానే మరియు
నిరంతరం దూరం అవుతాము. మనం ఈ కృత్రిమ జీవనంలో సేంద్రీయ ఆహారం తీసుకుంటున్నామని
సంతోషించాలా?
అన్నమాచార్యుడు వరుస జన్మలను ఎందుకు పేర్కొన్నాడో? మనము ప్రస్తుత (మానసిక) స్థితి
నుండి మన పిల్లలకు శిక్షణ ఇస్తాము. మనము ఉద్దేశపూర్వకంగానో లేదా అనుకోకుండానో వారి
మనస్సులలో మనల్ని మనం స్థాపించుకుంటాము. అందువలన, మనము జన్యువుల నుండే కాక వేరుగా కూడా వంశాన్ని
ప్రసారం చేస్తాము.
ఈ చరణానికి ఉద్దేశ్యమేమిటి? సాలెపురుగుల గూళ్ళ వలె అంటుకునే కోరికల వలయంలో మనం ఇరుక్కుంటాం. మన ప్రస్తుత
స్థితికి ప్రధాన కారణం బాహ్య శక్తులు
కాదు. మన అంతరంగమే కారణం. కానీ సమస్య లోపల పెట్టుకుని సహాయం కోసం వేరేవారిని
అభ్యర్ధిస్తాం. ఇది మనము ప్రత్యామ్నాయంగా అంగీకరించే సరిదిద్దలేని వైఖరి. అయితే, ఇది చెప్పినంత సులభం కాదు. ప్రధాన సమస్య
తను ఏమిటి? తనది కానిది ఏమిటి? అని గుర్తించడంలో మానవుడు తడబడతాడు.
ఇప్పుడు ప్రముఖ కళాకారుడు యెస్చెర్ 'ప్రింట్ గ్యాలరీ' (1956) అని పిలవబడే చిత్రాన్ని గమనించండి. చిత్రం గ్యాలరీలో ఓడరేవు పట్టణం యొక్క పటమును వీక్షిస్తున్న వ్యక్తిని చూపుతుంది మరియు ఓడరేవు పట్టణంలోని భవనాల మధ్య సదరు వ్యక్తి నిలబడి ఉన్న గ్యాలరీ లోనూ ఉంటాడు (డ్రోస్టే ప్రభావాన్ని ఉపయోగించారు). ఈ వ్యక్తి ప్రేక్షకుడు మాత్రమే కాదు, అదే సమయంలో అతడూ చిత్రములో అంతర్భాగమై ఉన్నాడు.
ఇప్పుడు చెప్పండి, పటమును వీక్షిస్తున్న వ్యక్తిని చూస్తున్నారా? లేదా అతను చిత్రంలో అంతర్భాగమా? ఈచిత్రమైన పటము సృష్టించిన గందరగోళాన్ని మరింత అవగాహన
చేసుకొనుటకు మీరు జతచేయబడిన వీడియోను కూడా చూడవచ్చును. ఈ పటము వలెనే, ఏది లోపల? మరియు ఏది వెలుపల? యని గుర్తించడంలో మనిషికి అనేక ఇబ్బందులు ఎదురౌతాయి.
కాయపు మదములు కప్పఁగఁ గప్పఁగ
kAyapu madamulu kappaga
gappaga
Word to Word meaning: కాయపు (kAyapu) = bodily; మదములు (madamulu) = pride and arrogance; కప్పఁగఁ గప్పఁగ (kappaga gappaga) = covered many times; ఆయములు (Ayamulu) = జీవస్థానములు, మర్మములు, vital parts, secret parts; అంటీ నదె (laMTI nade) = that stuck well; మాయ (mAya) = illusion; పాయక (pAyaka constantly, without intermission; ఇందే (iMdE) = in this very thing; (పనుపడి పనుపడి panupaDi panupaDi) వశమగు అధీనమగు, అమ్ముడుపడు, giving in, surrender; sold out; చాయలు (chAyalu) = జాడలు, traces; మరచిరి (marachiri) = forgotten; జంతువులు (jaMtuvulu) = animals ( here meaning the beings)
Literal meaning: The pride and arrogance spreads to the vital parts and they prevailed. With it man is permanently deluded. Thus, mankind forgotten their traces (who they actually are).
Explanation: This stanza has roots in Bhagavad-Gita verse below.
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते |
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् || 3-40||
indriyāṇi mano buddhir asyādhiṣhṭhānam
uchyate
etair vimohayatyeṣha jñānam
āvṛitya
dehinam
Purport: The senses, mind, and intellect are said to be breeding grounds of desire. Through them, it clouds one’s knowledge and deludes the embodied soul.
These senses, the mind, the intellect - are not inherently bad. They can used to assist us in understanding God. But, we ourselves have unwittingly given permission for desires to invade and subdue them. Now the senses may be utilized for realization.
Thus, the engagement of the beings with sense gratification leads them to forget their traces.
The pride mentioned here is not outward flaunt, but all the things put in place to make a thing we call as I or MYSELF
భావము: శరీరం నుంచి పుట్టిన అహంకారం ముఖ్యమైన
జీవస్థానములను కప్పివేసి తిష్టవేసుక్కూర్చుంది. దానితో మానవుడు శాశ్వతంగా
భ్రాంతికి లోనౌతాడు. అందువలన, జీవులు (తాము ఎవరనే) జాడలను మరచిపోయారు.
వివరణము: దిగువ భగవద్గీత శ్లోకాన్ని ఒకసారి పరికించండి.
ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ।
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ।। 3-40 ।।
భావం : ఇంద్రియములు, మనస్సు, బుద్ధి - ఇవి
కోరికలకు మూల స్థానాలు అని చెప్పబడును. వాని ద్వారా కోరికలు జీవుని నిజ జ్ఞానమును
ఆవరించి అతణ్ణి మోహింపజేయును.
ఈ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి - అనే
పరికరములు స్వతహాగా చెడ్డవి కావు. అవి మనకు భగవత్ ప్రాప్తికి సహకరించటానికి వుపయోగబడతాయి. కానీ మనమే
కోరికలకు వాటిపై ముట్టడి చేసి వశపరుచుకునే అనుమతి తెలియకుండా ఇచ్చాము. ఇప్పుడా ఇంద్రియమనోబుద్దులనే నిజదోద్దారణ కోసం వినియోగించుకోవాలి.
అందువలన, ఇంద్రియములను తృప్తి పరచుటలో మానవులు
ములిగి వుండటంతో జీవుల వారి వారి జాడలను మరచిపోయారు.
ఇక్కడ ప్రస్తావించబడిన అహంకారం బాహ్యంగా కనిపించేదే కాక, నేను అను భావన కలిగించు అన్ని మూలకములూ కలుపుకొని వుండు
దానిని సూచించారు.
బలుశరణాగతి ప్రాణులు దలఁచఁగ
baluSaraNAgati prANulu
dalachaga
Word to Word meaning: బలు (balu) = strong; శరణాగతి (SaraNAgati) = seeking protection, refuge; ప్రాణులు (prANulu) = beings; దలఁచఁగ (dalachaga) = to consider; నెలవున (nelavuna) = a place, abode; నిలిపెను (nilipenu) = provided; నీకరుణ (nIkaruNa) = your largesse; ఇలపై (ilapai) = on this earth; శ్రీవేంకటేశ్వర (SrIvEMkaTESvara) = Lord Venkateswara; యిహ పరము (yiha paramu) = this and the other world; అలవడి (alavaDi) = accustomed; దొరకెను (dorakenu) = handed over; అరచేతికిని (arachEtikini) = to the hand.
Literal meaning: O Lord Venkateswara! On our prayers for protection, you have appeared here on this earth. We now understand what constitutes this world and the other. You handed this (the salvation) in our hands. (You made this very easy).
Explanation: Here Annamayya is summarising that on seeking refuge of the God with pure heart i.e., one discards what’s not true, that which forms the thing called “I or MYSELF’. He wants all of us to taste that state of pure bliss.
The word alavaDi (అలవడి = accustomed) is indicating that this bliss or state of ‘non I’ not a onetime affair, but continuous. This transformation of submitting the will to the God is irreversible.
భావము: మహాబలుడవైన శ్రీవేంకటేశ్వరా! ప్రాణులు శరణాగతిని దలఁచఁగా
నీ కరుణను
నిలిపితివి. ఇహ పరములు మాకు తెలిపి (మోక్షము) అరచేతిలో అందిచ్చితివి. (నువ్వు దీన్ని చాలా సులభం చేసావు).
వివరణము: “నేను” అని పిలువబడే
వస్తువును ఏర్పరుచు వానిన్నన్నింటినీ
విడిచివైచి, స్వచ్ఛమైన హృదయంతో
భగవంతుడిని ఆశ్రయించ మంటున్నాడు అన్నమయ్య. మనమందరమూ ఆ స్వచ్ఛమైన ఆనంద స్థితిని
పొందాలని ఆయన కోరుకుంటున్నాడు.
భగవంతునికి చిత్తాన్ని సమర్పించే ఈ పరివర్తన తిరిగి యధా స్థితికి
చేరుకోవడానికి వీలు లేనిదే. అలవడి (= అలవాటుపడిన) అనే పదం ఈ అంతులేని ఆనందం లేదా ‘నేను
కానిది’ అనే స్థితి నిరంతరంగా ఉంటుందని సూచిస్తుంది.
Summary of this Keertana:
O Ultimate! I am unable to find my bearings. I am unable to see what was before and what would be next. Keep me on right track. (Implied Meaning: O Man, do not waste time in pointless search. O Ultimate! Make us see the right path.)
The world (all human beings) stretched both the hands open to welcome extension of desires relentlessly. Many such successive births have ensured distancing ourselves from natural state (the original self).
The pride and arrogance spreads to the vital parts and they prevail. With it man is permanently deluded. Thus, mankind forgotten their traces (who they actually are).
O Lord Venkateswara! On our prayers for protection, you have appeared here on this earth. We now understand what constitutes this world and the other. You handed this (the salvation) in our hands. (You made this very easy).
కీర్తన సంగ్రహ భావము:
సర్వశక్తిమంతుడా! ఓ పరమాత్ముడా!
వెనక ముందరలు వెదకి వేసారితిమి. మేము దిక్కులను, స్వభావమును,
ఊతమును ఎఱుగకున్నాము. మమ్ము సరియైన పదమున నిలుపవే! (అన్వయార్ధము: ఓ మనిషి, ప్రయోజనములేని పరిశోధనలలో
సమయాన్ని వృథా చేయకు. ఓ అంతరాత్ముడా! మమ్ము సరియైన దారిన నిలుపుము.)
ప్రపంచం లోని
(జీవులందరూ) ఊరకనే (=నిమిత్తము లేకనే) కోరికలకు కొనలు సాగదీస్తూ (కోరికల
విస్తరణను) నిరాటంకంగా రెండు చేతులు బారలు చాచి స్వాగతించారు. ఇటువంటి ఎన్నో
జన్మలు గడవగా, గడవగా మనము మన సహజ స్థితినుండి దూరము
జరిగిపోయాము.
శరీరం నుంచి పుట్టిన అహంకారం
ముఖ్యమైన జీవస్థానములను కప్పివేసి తిష్టవేసుక్కూర్చుంది. దానితో మానవుడు శాశ్వతంగా
భ్రాంతికి లోనౌతాడు. అందువలన, జీవులు (తాము ఎవరనే) జాడలను
మరచిపోయారు.
మహాబలుడవైన శ్రీవేంకటేశ్వరా! ప్రాణులు
శరణాగతిని దలఁచఁగ నీకరుణ నిలిపితివి. ఇహ పరములు మాకు తెలిపి (మోక్షము) అరచేతిలో
అందిచ్చితివి. (నువ్వు దీన్ని చాలా సులభం
చేసావు).