Saturday, 22 January 2022

105. కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను (kaninavADA gAnu kAnanivADA gAnu)

ANNAMACHARYA

105. కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను

(kaninavADA gAnu kAnanivADA gAnu) 

Introduction: In this unique and exemplary sonnet on life, Annamacharya talking about dual minded actions of the man born of impertinence. Man’s inability to align with the truth in each and every situation, makes him move away from God. Yet man in his effrontery goes on to preach others.

In this verse, Annamacharya said that we do not recognise and appreciate the natural order of this universe. He questions intelligence our pursuits.

Flexibility in conviction is the root cause of our troubles. We do not take final decisions. We would like it to get evolved. We wait. We dither. We look for more data. Unfortunately, man’s this wait and watch game has not paid off. Forever, he remains troubled.

Annamacharya’s message is that everyone can receive the blessings. However, Man must take those actions by careful examination of the world around him. You will witness his razor-sharp observations matching with the eminent personalities of more recent times.

ఉపోద్ఘాతము: ప్రత్యేకమైన మరియు అనుభవపూర్వకమైన ఈ కీర్తనలో అన్నమాచార్యులు మనిషి జీవితంలోని ప్రతియొక్క దశలోనూ సత్యంతో సరిపెట్టుకోలేకపోవడం, అతన్ని దైవమునకు దూరమయ్యెలా చేస్తుంది అన్నారు.  సత్యం పట్ల ద్వంద్వ నీతితో జనియించిన అవిధేయతతో మానవుడు ఇతరులకు నేర్పబోతాడు అన్నారు. 

ఈ విశ్వంలోని సహజ క్రమాన్ని మనం గుర్తించి గౌరవించము అన్నారు అన్నమాచార్యులు. వివేకించకనే, సన్నాహాలకు (ప్రయత్నాలకు) ఉసికొల్పు మానవుని మేధస్సును ప్రశ్నిస్తాడు. 

ధృఢ సంకల్పమును సడలించు చాపల్యమే మన కష్టాలకు మూల కారణం. మనము తుది నిర్ణయాలు తీసుకోము. వేచి ఉంటాము. మరింత డేటా కోసం ఎదురు చూస్తాము. దురదృష్టవశాత్తూ, అనాదిగా మానవుని ఈ ప్రతీక్షించు ధోరణి ఫలించలేదు. దుఃఖము నందే కొట్టుకొని పోవుచున్న మానవుని సమస్య తీరలేదు. 

అన్నమాచార్యులు దైవము యొక్క దీవెనలు అందరికీ లభిస్తాయన్నారు. అయితే, మనిషి తన చుట్టూవారి ప్రపంచాన్ని అత్యంత సునిశితముగా పరిశీలించడం ద్వారా చర్యలను చేపట్టవలెనన్నారు. అతడి వాడియైన పరిశీలనలు ఇటీవలి కాలంలోని ప్రముఖ వ్యక్తుల ప్రకటనలతో సరిపోలడాన్ని మీరు చూస్తారు. ​ 

 

కీర్తన:

కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను

పొనిఁగి వొరులకైతే బోధించే నేను        ॥పల్లవి॥ 

ధరణిఁ గర్మము గొంత తగినజ్ఞానము గొంత

సరికి సరే కాని నిశ్చయము లేదు
వొరిమె యెంచిచూచితే నొకటివాఁడాఁగాను
సరవి దెలియ కేమో చదివేము నేము ॥కని॥ 

యీతల నిహము గొంత యింతలోఁ బరము గొంత

చేతులు రెండు చాఁచే చిక్కుట లేదు
యీ తెరువులో నొకటి నేరుపరచుకోలేను
కాతరాన కతలెల్లా గఱచితి నేను         ॥కని॥ 

దైవిక మొకకొంత తగుమానుషము గొంత

చేవలుచిగురువలెఁ జేసేను
యీవల శ్రీవేంకటేశుఁ డిది చూచి నన్నుఁ గాచె
భావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను ॥కని॥

 

kaninavADA gAnu kAnanivADA gAnu

ponigi vorulakaitE bOdhiMchE nEnu pallavi

dharaNi garmamu goMta taginaj~nAnamu goMta

sariki sarE kAni niSchayamu lEdu
vorime yeMchichUchitE nokaTivADAgAnu
saravi deliya kEmO chadivEmu nEmu     kani

yItala nihamu goMta yiMtalO baramu goMta

chEtulu reMDu chAchE chikkuTa lEdu
yI teruvulO nokaTi nEruparachukOlEnu
kAtarAna katalellA ga~rachiti nEnu         kani

daivika mokakoMta tagumAnushamu goMta

chEvaluc higuruvale jEsEnu
yIvala SrIvEMkaTESu Didi chUchi nannu gAche
bhAviMchalEka yinnALLu bhramasiti nEnkani

 

Details and Explanations: 

కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను

పొనిఁగి వొరులకైతే బోధించే నేను         ॥పల్లవి॥ 

kaninavADA gAnu kAnanivADA gAnu

ponigi vorulakaitE bOdhiMchE nEnu pallavi 

Word to Word meaning: కనినవాఁడాఁ (kaninavADA) = see, discern; గాను (gAnu) = not; కాననివాఁడాఁ గాను (kAnanivADA gAnu) = cannot confirm I have not; పొనిఁగి (ponigi) = యత్నముసన్నాహము, by effort, tend to; వొరులకైతే (vorulakaitE) = to others; బోధించే (bOdhiMchE) = teach; నేను (nEnu) = me. 

Literal meaning: I have not seen (the truth); Neither I can confirm I have not. Still I tend to teach others. 

Explanation: Annamacharya criticising common tendency of people to teach others, without establishing themselves in truth. We often take ourselves to be on side of truth, without being aware on what side we indeed are. Particularly in case of religion this propensity (of man) has been proven, beyond doubt. This resulted in so many wars. And unfortunately, we continue with it.   

On careful observation you will find that this predominant predisposition of man to teach others is one of the chief causes of the chaos we witness in the world. 

The most important thing said in this chorus is that the truth is in front of everyone. We can see it, however, we turn blind eye on it, as we are occupied in judging others. This is the fundamental wrong step man takes. Many poets including Annamacharya have attributed this propensity to layers of ego.   That’s why Thygaraja said: tera tIyaga rAdA mada matsaramanu tera tIyaga rAdA lOni tirupati venkaTaramaNa (O Tirupati Venkata Ramana, remove the layers of ignorance born of ego and envy). 

Reading further into the chorus, this activity of judgement we indulge, may be termed as chatter. Beyond this chatter, untouched by the trivialities, lies the silence. Obviously, silence is not the absence of sound.  

Implied meaning: With half-baked knowledge, I go about correcting the world. 

భావము: సత్యమును తెలిసినవాడనూ కాను. అట్లని (అస్సలు) తెలియనివాడనూ కాను. ఐతే, ఇతరులకు బోధించుటకు వెనుకాడను.

 

వివరణము: అన్నమాచార్యులు  ప్రజలు సత్యము నెరుగక​, మిడిమిడి జ్ఞానంతో ఇతరులకు బోధించే  ధోరణిని విమర్శించాడు. మనం నిజంగా ఏ వైపు ఉన్నామో తెలియకుండానే, మనం తరచుగా సత్యం వైపు వున్నామనుకుంటాము. ప్రత్యేకించి మతం విషయంలో  (మనిషిలోని) ఈ ప్రవృత్తి నిస్సందేహంగా నిరూపించబడింది. అందుకే ఇన్ని యుద్ధాలు జరిగాయి. దురదృష్టవశాత్తు ఇది ఈనాటికీ యదార్థమే.

జాగ్రత్తగా గమనిస్తే, ఇతరులకు బోధించాలని ఉవ్విళ్ళూరే మనిషి యొక్క ఈ తపన ప్రపంచంలోని గందరగోళానికి ప్రధాన కారణమని మీరు గమనించే ఉంటారు. అందుకే అన్నమాచార్యులు సూటిగా దీనిని ప్రస్తావించారు.

మనిషి సత్యము తన కళ్ళ ఎదుటే ఉన్నప్పటికీ, చూసీచూడని చూపుతో నిర్లక్ష్యము చేసి  పెడత్రోవ పట్టునని అంతర్లీన సందేశము. అతడు తనలోని వెలితిని గమనించే బదులు ఇతరులలోని లోపాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిద్దామ నుకుంటాడు. ఇదే మానవుడు పట్టు తప్పుటడుగు​. అన్నమాచార్యులతో సహా చాలా మంది కవులు ఈ ప్రవృత్తిని అహం/మదపు పొరలుగా అభివర్ణించారు.  దీనినే ఎత్తి చూపుతూ తెరతీయగ రాదా ..మద మత్సరమను తెర తీయగ రాదా లోని తిరుపతి వేంకట రమణఅన్నారు త్యాగరాజు.

ఈ పల్లవిని మరింత మధించితే, మనం చేసే (ప్రమాణ భూయిష్టమైన) విశృంఖల తీర్పులు రొల్లుడు / వాగుడు (శుష్క వాదములు) అని తెలియును. ఈ అసంబద్ధమైన విషయాలను దాటి, అల్ప విషయాలచే తాకబడని ప్రశాంతత (నిశ్శబ్దం) ఉంటుంది. సహజంగానే, ప్రశాంతత అనేది (రణగొణ​) ధ్వని లేకపోవడమే కాదు. ​

అన్వయార్ధము: అరకొర జ్ఞానంతో, నేను ప్రపంచాన్ని సరిదిద్దబోతాను. 

ధరణిఁ గర్మము గొంత తగినజ్ఞానము గొంత

సరికి సరే కాని నిశ్చయము లేదు
వొరిమె యెంచిచూచితే నొకటివాఁడాఁగాను
సరవి దెలియ కేమో చదివేము నేము   ॥కని॥ 

dharaNi garmamu goMta taginaj~nAnamu goMta

sariki sarE kAni niSchayamu lEdu
vorime yeMchichUchitE nokaTivADAgAnu
saravi deliya kEmO chadivEmu nEmu           kani 

Word to Word meaning: ధరణిఁ (dharaNi) = corporeal, earthly; గర్మము (garmamu) = deeds;  గొంత (goMta) = to some extent; తగినజ్ఞానము (taginaj~nAnamu) = appropriate knowledge;  గొంత (goMta) = to some extent; సరికి సరే (sariki sarE) = దేనికది, సరిసమానము, let them be there;  కాని (kAni) = but, still;  నిశ్చయము (niSchayamu) = determination, conviction; లేదు (lEdu) = not there; వొరిమె యెంచి (vorime yeMchi) = {ఒరిమకు రూపాంతరం =ఐకమత్యంతో కలియు} సందర్భం ప్రకారం ఏకరూపమైన విచారణ, on careful and harmonious consideration, on orderly consideration; చూచితే (chUchitE) = పరిశీలన, పరీక్షగా చూచుట​, seeing, observation;  నొకటివాఁడాఁగాను (nokaTivADAgAnu) = I am not one, but many; సరవి (saravi) = వరుస,  క్రమము, regularity, Order (of universe);  దెలియ కేమో (deliya kEmO) = perhaps not knowing, not appreciating; చదివేము (chadivEmu) = venture to study venture to examine; నేము (nEmu) = we. 

Literal meaning: Some earthly deeds, some amount knowledge are essential for the path of God. However, primary obstacle is that man does not make up his mind. He does not have the conviction to take up the path. On careful and harmonious contemplation, I find that I am not one (but many). Without appreciating this fundamental order of this universe, we venture to examine, venture to study “some thing”.   

Explanation: what is this order (saravi = వరుస) Annamacharya is mentioning.  For those unfamiliar with the game of chess, the pieces on the board may appear to be cluttered. However the player who is combining the movement of the pieces knows their order. (For example, Kasparov's moves baffle even exceptionally talented players as well). 

Normally (for us) the world appears haphazard, and the underlying order is not evident. Every living being has a specific objective (swadharma). Unaware of this, but acting differently, we add to the disorder (in the world). Action without anticipation (Nishkama karma) is an attempt to know the specified life objective (Swadharma) mentioned in Bhagavad-Gita (3-35). 

Still the value of a pawn in the game of chess will depend on the player’s ability to use it. If used appropriately it can be more powerful than the most pieces. Therefore, it does not matter what role we bequeathed.  How well we played it matters. 

Lastly on this topic of Order, let me present the statement of James Prescott Joule. “Order is manifestly maintained in the universe governed by the sovereign will of God….After the knowledge of, and obedience to, the will of God, the next aim must be to know something of His attributes of wisdom, power and goodness as evidenced by His handiwork.”. This remarkably matches with what Annamacharya said. 

nokaTivADAgAnu (నొకటివాఁడాఁగాను = I am not one, but many) means in that careful and harmonious contemplation, Annamacharya saw not oneself but more. Jiddu Krishnamurti also said the whole world is there within oneself. Also consider the statement by Neville Goddard “The world is a mirror forever reflecting what you are doing with in yourself.” 

Now ponder on the word ‘another’ in Sigmund Freud’s statement “The Individual does carry on a double existence. One designed to serve his own purposes and another as a link in a chain, in which he serves against, Or at any rate without, any volition of his own” 

Implied meaningMan disregarding the basic order established in this universe, forges ahead to act.  Action sans firm conviction to find truth is meaningless. WIthout freeing oneself from the internal conflicts and stablishing onself in silence, it is foolish to express opinion on others and the world.  

When a person reaches such a state, I do not think he will ever criticise others. We ordinary mortals thrive in this mudslinging. 

భావము: దైవ మార్గ మందు కొంత జ్ఞానం, కొన్ని  పనులు అవసరమే. అయితే, ప్రాథమిక అడ్డంకి ఏమిటంటే, మనిషి తన మనస్సును ఏర్పరచుకోలేడు. మార్గాన్ని చేపట్టాలనే దృఢ విశ్వాసం అతనికి లేదు. సావధానమైన మరియు సామరస్యపూర్వకమైన పరిశీలనలో, నేను ఒకడిని కానని (చాలా మంది అని)  గుర్తించాను. ఈ విశ్వం యొక్క ఈ ప్రాథమిక క్రమాన్ని మెచ్చుకోకుండా, మనము "ఏదో ఒక విషయం" అధ్యయనం చేయడానికి, పరిశీలించడానికి సాహసం చేస్తాము.

వివరణము: అన్నమాచార్యులు పేర్కొన్న సరవి (వరుస,  క్రమము) అను పదము గురించి ఆలోచింతము. చదరంగం ఆట తెలియని వారికి అందులోని పావులు చిందరవందరగా అగుపించును. ఐతే పావులు కలిపే ఆటగాడికి వాని క్రమం తెలియును. (ఉదాహరణకు కాస్పరోవ్ వేయు ఎత్తులు అసాధారణ ప్రతిభ గల ఆటగాళ్ళ అంచనాలకే మించి ఉంటాయి. ఇక సామాన్యుల విషయం చెప్పనక్కర్లేదు).

సాధారణంగా (మనకు) ప్రపంచము అస్తవ్యస్తంగా అగుపడి అంతర్లీన క్రమం కనబడదు. ప్రతీ ప్రాణికి నిర్దేశిత ధర్మం {భగవద్గీతలో చెప్పబడిన స్వధర్మం 3-35}  వుండును. అది పాటించక పోతే  ప్రపంచమున అయోమయం అధికమగును.  స్వధర్మం తెలుసుకునే ప్రయత్నమే నిష్కామ కర్మ.

ఇకపోతే, అదే చదరంగంలో ఒక బంటు విలువ (ఆటగాడి) వుపయోగించే సామర్థ్యాన్ని బట్టి అశేషంగా వుంటుంది. కాబట్టి ఈ మానవ జన్మలో మనకు లభించిన పాత్ర  చిన్నదాపెద్దదా అన్నది ప్రధానమే కాదు

ఇది చివరగా  క్రమము (ఆర్డర్) అన్న అంశం జేమ్స్ ప్రెస్కాట్ జౌల్ గారి మాటలలో తెలుసుకుందాం. విశ్వంలో దేవుని సార్వభౌమ సంకల్పం ద్వారా క్రమము (ఆర్డర్) నిర్వహించబడుతుంది. దేవుని మనోరథమును అనుసరించు తెలివివిధేయత, క్రమములను ఎరిగిన తర్వాతనే అతడు సృజించిన   జ్ఞానం, శక్తి మరియు మంచితనం అనే అతని గుణాలను తెలుసుకోగలుగుతాము. ఇది అన్నమాచార్యులు పై చరణంలో చెప్పిన దానితో సరిగ్గా పోలుతోంది.

నొకటివాఁడాఁగాను అంటూ  శ్రద్ధ మరియు సమభావముగల ధ్యానంలో అన్నమాచార్యులు తనలో ఒకరిని కాదు మరెందరినో చూశారు. జిడ్డు కృష్ణమూర్తి కూడా ప్రపంచమంతా ప్రతీవ్యక్తిలోనూ దాగుందని చెప్పారు. నెవిల్ గొడ్దార్డ్ యొక్క ప్రకటనను కూడా పరిగణించండి "ప్రపంచమొక అద్దం; అది మీరు మీలో ఏమి చేస్తున్నారో ప్రతిబింబిస్తూ ఉంటుంది."

సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన క్రింది మాటలలోని 'మరొకటి' ఏమిటో ఆలోచించండి?  ​"వ్యక్తి నిజానికి ద్వంద్వ ఉనికిని కలిగి ఉంటాడు: ఒకటి తన స్వంత ప్రయోజనాల కోసం రూపొందించబడింది మరియు మరొకటి గొలుసులో లంకెగా రూపొందించబడింది. అతడు తన స్వంత ప్రమేయము లేకుండానే దానికి వ్యతిరేకంగానో లేదా అనుకూలంగానో పని (సేవ) చేస్తాడు"

 

అన్వయార్ధము: మానవుడు ఈ విశ్వము నందు దైవము ఏర్పరిచిన ప్రాథమిక క్రమమును లెక్కచేయక వెర్రిగా ఏదో చదువ బోతాడు. నిశ్చయములేని అన్వేషణ అర్ధములేనిదే. అంతర్గత ఘర్షణలతో సతమతమౌతూ ప్రశాంత లేని హృదయముతో ఈ ప్రపంచముపై, ఇతరులపై అభిప్రాయము వ్యక్తీకరించుటయే అవివేకము.  ​

యీతల నిహము గొంత యింతలోఁ బరము గొంత

చేతులు రెండు చాఁచే చిక్కుట లేదు
యీ తెరువులో నొకటి నేరుపరచుకోలేను
కాతరాన కతలెల్లా గఱచితి నేను           ॥కని॥ 

yItala nihamu goMta yiMtalO baramu goMta

chEtulu reMDu chAchE chikkuTa lEdu
yI teruvulO nokaTi nEruparachukOlEnu
kAtarAna katalellA ga~rachiti nEnu kani 

Word to Word meaning: యీతల (yItala) = ఈవలి ప్రదేశము, this side; నిహము (nihamu) = wordly; గొంత (goMta) = some extent;  యింతలోఁ (yiMtalO) = around the same time;  బరము (baramu) = about the other world;  గొంత (goMta) = to some extent; చేతులు (chEtulu) = hands; రెండు (reMDu) = both; చాఁచే (chAchE) = stretched;  చిక్కుట లేదు (chikkuTa lEdu) = unable to hold, unable to take in grip;  యీ తెరువులో (yI teruvulO) = of these two paths; నొకటి (nokaTi) = one; నేరుపరచుకోలేను (nEruparachukOlEnu) = unable to separate (more precisely unable to decide); కాతరాన (kAtarAna) = భయముతో, పిఱికితనముతో, out of fear, out of cowardice;  కతలెల్లా (katalellA) = all the stories (not facts); గఱచితి (ga~rachiti)  = learnt; నేను (nEnu)  = me. 

Literal meaning: Sometimes I occupy in worldly work. In another moment, into the other world. I stretch both by hands (to grab both). I fail to do so. I am unable to decide which path should I follow. But in this endeavour, out of cowardice, spent my time sifting the untruths. 

Explanation: Annamacharya is clear that one must decide which way one may like to go. What is purpose of this statement? Is there any other way? (Refer to verse okaTi suj~nAnamu okaTi aj~nAnamu ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము One thing is Proper Knowledge. The other is ignorance. O prudent people!! Declare and adapt one of these. Just see his game plan in this. Can a right-thinking person would adapt the ignorant ways?) The path of God is not a formula to follow. See the poem from Bhagavatam below.

Prahlad said unto Hiranyakasipu : O king of demons, Just as a blind man following another blind man does not see anything significant, some people thinking that actions such as sacrifices are adequate and get tied to such actions and can never find Vishnu. Only those who believe in being on Vishnu's side, setting aside everything else and remain in Meditation only can find him.

భావము: కొన్నిసార్లు నేను ప్రాపంచిక పనిలో నిమగ్నమై ఉంటాను. మరో క్షణంలో, ఇతర ప్రపంచంలోకి. నేను రెండు చేతులనూ సాగదీస్తూ (రెండింటిని పట్టుకోవడంలో) విఫలమయ్యాను. నేను ఏ మార్గాన్ని అనుసరించాలో నిర్ణయించుకోలేకపోతున్నాను. కానీ ఈ ప్రయత్నంలో, పిరికితనంతో, అవాస్తవాలను ఏరుకుంటూ నా సమయాన్ని వృధా చేసుకున్నాను. ​

వివరణము: మీకు సందేహం ఉన్నప్పుడు, మీరు ఏ మార్గంలో వెళ్లాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవడం మంచిదన్నారు అన్నమాచార్యులు. రెంటికీ చెడ్డ రేవడి కాకూడదు. ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము అనే కీర్తన చూడండి దీనిలో అన్నమయ్య​ ప్రణాళిక చూడండి. సరైన ఆలోచనాపరుడైన ఎవరైనా అజ్ఞాన మార్గాలను స్వీకరించగలడా? కానీ దైవమును పొందుటకు మాత్రం సూత్రం అంటూ లేదు.  దిగువ భాగవతంలోని పద్యం చూడండి.

 

ప్రహ్లాదుడు :

ఉ. కాననివానినూతగొని కాననివాడు విశిష్టవస్తువుల్

కాననిభంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై
కానరు విష్ణు కొందరట గందురకించిన వైష్ణవాంఘ్రి సం
స్థానరజోభిషిక్తులగు సంహృతకర్ములు దానవేశ్వరా.  (7-182)

 

(ఓ రాక్షసరాజా, గుడ్డివాడు గుడ్డివానిని అనుసరించిన వారిరువురికీ క్రొత్తవి, విశిష్టమైనవి అగుపించవు. కొందరు కర్మములు, నిష్ఠలు పాటించి, అంతమాత్రమునకే హరిదర్శనము పొందవలెననుకొనుట అవివేకము. ఎవరైతే విష్ణువు వైపే వున్న భావనను బాహ్య, అంతరంగములలో నిలిపి, కర్మములు, నిష్ఠలకు మించిన భక్తితో హరిని వెతికిన కనిపించగలడు.)

దైవిక మొకకొంత తగుమానుషము గొంత

చేవలుచిగురువలెఁ జేసేను
యీవల శ్రీవేంకటేశుఁ డిది చూచి నన్నుఁ గాచె
భావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను        ॥కని॥

daivika mokakoMta tagumAnushamu goMta

chEvaluchiguruvale jEsEnu
yIvala SrIvEMkaTESu Didi chUchi nannu gAche
bhAviMchalEka yinnALLu bhramasiti nEnu kani 

Word to Word meaning: దైవిక మొకకొంత (daivika mokakoMta) = some part on the side of God; తగుమానుషము గొంత (tagumAnushamu goMta) = some part on the side of man; చేవలు (chEvalu) = essence, core;  చిగురువలెఁ (chiguruvale) = made delicate and tender; జేసేను (jEsEnu) = done; యీవల (yIvala) = this side; శ్రీవేంకటేశుఁ డిది (SrIvEMkaTESu Didi) = Lord Venkateswara; చూచి (chUchi) = on observing this; నన్నుఁ nannu) = me;  గాచె (gAche) = saved; భావించలేక (bhAviMchalEka) = unable to think in right direction;  యిన్నాళ్ళు (yinnALLu) = so many years;  భ్రమసితి (bhramasiti) = remained under illusion; నేను (nEnu) = me. 

Literal meaning: There are some parts for the man. Some for the God to perform. I made my core very delicate and tender. On watching my condition, Lord Venkateswara saved me. For long time I were unable think in right direction and hence remained under illusion. 

Explanation:  the word chEvalu chiguruvale (చేవలుచిగురువలెఁ) is indicating the body of the practitioner should become sensitive to receive tiniest whisper and observe slightest changes. This is what happened to Jiddu Krishnamurti. This is well documented in a book titled “Years of Awakening”. 

Discount the part of god and understand the part of man.  Finding that inner harmony essential. Even Annamacharya, as we understand from this stanza, it took long time to find that delicate balance. 

Thus sir, the first and only step required to be on the path of God is determination. We with our flexible conviction(s), where do we stand? 

భావము: దైవము కొంత మానవుడు గొంత చేయవలె.  నా హృదయాన్ని చిగురువలెఁ జేసితిని. శ్రీవేంకటేశుఁ డిది చూచి నన్నుఁ గాచెను. చాలా కాలంగా నేను సరైన దిశలో దైవమును భావించ లేకపోయాను, అందుకే భ్రమలో ఉండిపోయాను.

వివరణము: చేవలుచిగురువలె అనేది చీమల కాళ్ళు విరుగుతున్న చప్పుడు కూడా వినగలిగే అంత సున్నితంగాను మరియు స్వల్పమైన మార్పులను గమనించడానికి అలవడవలెనని సూచిస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి శరీరంలో కూడా మొదట్లొ అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి ఇయర్స్ ఆఫ్ అవేకనింగ్ అనే పుస్తకములో విస్తారంగా ప్రస్తావించారు.

దేవుని భాగాన్ని వదిలి మరియు మనిషి చేయవలసిన భాగాన్ని అర్థం చేసుకోండి. అంతర్గత సామరస్యాన్ని కనుగొనడం అవసరం. అన్నమాచార్యులకు కూడా, ఈ చరణాన్ని బట్టిఆ సున్నితమైన సమతుల్యతను కనుగొనడానికి చాలా సమయం పట్టింది.

ఈ విధంగా అయ్యలారా!, భగవంతుని మార్గంలో ఉండేందుకు కావాల్సిన మొదటి మరియు ఏకైక అడుగు సంకల్పం. ఎప్పటికప్పుడు అనువుగా నిశ్చయాలను మార్చుకునే  మనం ఎక్కడ నిలబడతాం?    

Recommendations for further reading:

84. తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను (telisinavADA gAnu teliyanivADA gAnu)

99 వెదకినఁ దెలియదు వెనక ముందరలు (vedakina deliyadu venaka muMdaralu) 

 

Summary of this Keertana:

I have not seen (the truth); Neither I can confirm I have not. Still, I tend to teach others. Implied Meaning: With half-baked knowledge, I go about correcting the world. 

Some earthly deeds, some amount knowledge are essential for the path of God. However, primary obstacle is that man does not make up his mind. He does not have the conviction to take up the path. On careful and harmonious contemplation, I find that I am not one (but many). Without appreciating this fundamental order of this universe, we venture to examine, venture to study “some thing”. Implied Meaning: Man disregarding the basic order established in this universe, forges ahead to act.  Action sans firm conviction (to find truth) is meaningless.  Without freeing oneself from internal conflicts and establishing oneself in silence, It is foolish to express an opinion on others and the world. 

Sometimes I occupy in worldly work. In another moment, into the other world. I stretch both by hands (to grab both). I fail to do so. I am unable to decide which path should I follow. But in this endeavour, out of cowardice, spent my time sifting the untruths. 

There are some parts for the man. Some for the God to perform. I made my core very delicate and tender. On watching my condition, Lord Venkateswara saved me. For long time I were unable think in right direction and hence remained under illusion.

 

 

కీర్తన సంగ్రహ భావము:

సత్యమును తెలిసినవాడనూ కాను. అట్లని (అస్సలు) తెలియనివాడనూ కాను. ఐతే, ఇతరులకు బోధించుటకు వెనుకాడను. అన్వయార్ధము: అరకొర జ్ఞానంతో, నేను ప్రపంచాన్ని సరిదిద్దబోతాను

దైవ మార్గ మందు కొంత జ్ఞానం, కొన్ని  పనులు అవసరమే. అయితే, ప్రాథమిక అడ్డంకి ఏమిటంటే, మనిషి తన మనస్సును ఏర్పరచుకోలేడు. మార్గాన్ని చేపట్టాలనే దృఢ విశ్వాసం అతనికి లేదు. సావధానమైన మరియు సామరస్యపూర్వకమైన పరిశీలనలో, నేను ఒకడిని కానని (చాలా మంది అని)  గుర్తించాను. ఈ విశ్వం యొక్క ఈ ప్రాథమిక క్రమాన్ని మెచ్చుకోకుండా, మనము "ఏదో ఒక విషయం" అధ్యయనం చేయడానికి, పరిశీలించడానికి సాహసం చేస్తాము. అన్వయార్ధము: మానవుడు ఈ విశ్వము నందు దైవము ఏర్పరిచిన ప్రాథమిక క్రమమును లెక్కచేయక వెర్రిగా ఏదో చదువ బోతాడు. నిశ్చయములేని అన్వేషణ అర్ధములేనిదే. అంతర్గత ఘర్షణలు లేని ప్రశాంత లేని హృదయముతో ఈ ప్రపంచముపై, ఇతరులపై అభిప్రాయము వ్యక్తీకరించుటయే అవివేకము.  ​

కొన్నిసార్లు నేను ప్రాపంచిక పనిలో నిమగ్నమై ఉంటాను. మరో క్షణంలో, ఇతర ప్రపంచంలోకి. నేను రెండు చేతులనూ సాగదీస్తూ (రెండింటిని పట్టుకోవడంలో) విఫలమయ్యాను. నేను ఏ మార్గాన్ని అనుసరించాలో నిర్ణయించుకోలేకపోతున్నాను. కానీ ఈ ప్రయత్నంలో, పిరికితనంతో, అవాస్తవాలను ఏరుకుంటూ నా సమయాన్ని వృధా చేసుకున్నాను. ​

దైవము కొంత మానవుడు గొంత చేయవలె.  నా హృదయాన్ని చిగురువలెఁ జేసితిని. శ్రీవేంకటేశుఁ డిది చూచి నన్నుఁ గాచెను. చాలా కాలం నేను సరైన దిశలో దైవమును భావించ లేకపోయాను, అందుకే భ్రమలో ఉండిపోయాను.

 

Copper Leaf: 99-2  Volume 1-496 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...