Saturday 23 April 2022

118. ఎండలోని నీడ యీమనసు (eMDalOni nIDa yImanasu)

                                                          ANNAMACHARYA 

118. ఎండలోని నీడ యీమనసు

(eMDalOni nIDa yImanasu) 

The shadow you need to shed

                                                                                    

Introduction: In one of the most significant, original and unique observations, Annamacharya says the mind makes us feel isolated. He said our present life is like living on an island.  This 500 years old verse may be termed as the most advanced psycho analysis of Indian origin.  

Annamacharya dwells on his favourite subject ‘the mind’. He is very clear that mind is the root cause of the troubles for the man. This verse with full of rustic flavours and liberally interspersed with similes, is rather difficult to comprehend. 

This poem with its natural, novel, and accurate depiction on the state of mind of man may be considered as pinnacle of great poetry. Generations to come will find such high standards unsurmountable.  

ఉపోద్ఘాతము: కీలకమైన పరిశీలనలలో అన్నమాచార్యులు మనస్సు మనల్ని ఒంటరిగా ఒక ద్వీపం మీద ఉన్నట్లు భావించేలా చేస్తుంది అన్నారు. మనిషి కష్టాలకు మూలకారణం మనసేనని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 500 సంవత్సరాలు పైబడిన ఈ కీర్తన భారతీయ మూలాలో అత్యంత అధునాతనమైన మనో విశ్లేషణగా పేర్కొనవచ్చు.

ప్రతి పంక్తిలో సహజమైన, అతి సునిశితమైన, భావమును మరింత పరిమళింప చేసే విధముగా, ఆచితూచి వాడ బడిన ఉపమానములు 'న భూతో న భవిష్యతి' అని గర్వించ దగ్గ కవిత్వానికి గీటురాళ్ళు. భావి తరములకు అన్నమాచార్యులు అధిగమించడానికి సాధ్యముకాని ప్రమాణములను ఏర్పరిచారు. గ్రామీణ జీవితము నందు వాడు అనేక మాండలికములను చొప్పించి అర్థం చేసుకోవడానికి కష్టతరము చేశారు. 

కీర్తన:

ఎండలోని నీడ యీమనసు
పండు గాయ సేయఁ బనిలేదు మనసు ॥పల్లవి॥

వానచేతకములవలెనాయ మనసు
గోనెఁబట్టినబంకగుణమాయ మనసు
మానఁజిక్కినకోలమతమాయ మనసు
తేనెలోపలియీఁగ తెఱఁగాయ మనసు ॥ఎండ॥
 

గడిరాజుబదుకాయ కడలేని మనసు
నడివీది పెసరాయ నయమైన మనసు
గడకుఁగట్టినపాఁతగతి దోఁచె మనసు
అడుసులోపలికంబమై తోఁచె మనసు ॥ఎండ॥
 

తెరవుచూపినజాడఁ దిరుగు నీమనసు
మరుగఁజేసినచోట మరుగు నీ మనసు
తిరువేంకటేశుపైఁ దిరమైన మనసు
సిరిగలిగినచోటఁ జేరు నీమనసు ॥ఎండ॥

eMDalOni nIDa yImanasu
paMDu gAya sEya banilEdu manasu
pallavi 

vAnachEtakamula valenAya manasu
gOnebaTTinabaMkaguNamAya manasu
mAnajikkinakOla matamAya manasu
tEnelOpaliyIga te~ragAya manasu
eMDa 

gaDirAjubadukAya kaDalEni manasu
naDivIdi pesarAya nayamaina manasu
gaDakugaTTinapAtagati dOche manasu
aDusulOpalikaMbamai tOche manasu
eMDa 

teravuchUpina jADa dirugu nImanasu
maruga jEsina chOTa marugu nI manasu
tiruvEMkaTESupai diramaina manasu
sirigaliginachOTa jEru nImanasu
eMDa 

Details and Explanations:

 

ఎండలోని నీడ యీమనసు
పండు గాయ సేయఁ బనిలేదు మనసు
॥పల్లవి॥

 

eMDalOni nIDa yImanasu
paMDu gAya sEya banilEdu manasu
pallavi

 

Word to Word meaning: ఎండలోని (eMDalOni) = in the sunshine;  నీడ (nIDa) = shadow; యీమనసు (yImanasu) = this mind; పండు గాయ సేయఁ బనిలేదు (paMDu gAya sEya banilEdu) =  మాగు చేయ పనిలేదు =  కాయలను పండుటకు బియ్యములోను, ధాన్యములోను కొంతకాలము మాగు పెట్ట పనిలేదు​. Need not allow maturation (time) like green fruits (implying No need to allow time for maturing for the mind).    మనసు (manasu) = mind.

Literal meaning: This mind is like (length of) shadow in the sun. Not necessary to wait  for its maturation.

Explanation: The mind (and thoughts) keeps varying with time. Do not wait in anticipation that they will stabilise. 

When you carefully note the wants of elderly, middle aged, young people, often you note that human minds are shallow, insipid and bitterly dissatisfied despite their material wealth and comforts. Therefore, whether one lives in wealthy or poor country, it doesn't matter; they largely remain wanting for more. As a result, assuming that the mind will mature with age is pointless. Therefore paMDu gAya sEya banilEdu (పండు గాయ సేయఁ బనిలేదు)

Man foolishly defers (in the hopes that they will settle), similar to the wording in verse muMdara galadani mOsapOti nide#1 (ముందరఁ గలదని మోసపోతి నిదె = Man procrastinates until he reaches a point when he can no longer do so) indicates this very situation. And he holds God and others responsible.

Implied meaning: Thoughts keep drifting. Never, ever expect a wavering mind to mature with time.

భావము: మనసు ఎండలోని నీడవలె హెచ్చుచు తగ్గుచు నుండును. మాగు చేయ పనిలేదు (కాయలను పండుటకు బియ్యములోను, ధాన్యములోను కొంతకాలము మాగు పెట్టునట్లు, ఈ మనసు అను కాయ పండుటకు వేచియుండు అవసరములేదు).

వివరణము: మనస్సు (మరియు దాని ఆలోచనలు) కాలానుగుణంగా మారుతూనే ఉంటవి. అవి క్రమముగా స్థిరపడతాయనే అపోహల్లో ఉండకండి.

 

దేశవిదేశాలలో మీరు వృద్ధులు, మధ్య వయస్కులు, యువకుల కోరికలను జాగ్రత్తగా గమనించితే, వయస్సుతో నిమిత్తం లేకుండా వారు ఇంకా ఏదో ఒకటి కావాలనే  ఆపేక్షిస్తుంటారు. సంపదలు మరియు సౌకర్యాలు ఉన్నప్పటికీ, వారు నిస్సత్తువగా మరియు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని తెలియవచ్చు. తత్ఫలితంగా, వయస్సుతో పాటు మనస్సు పరిపక్వం చెందుతుందని భావించడం అర్థరహితం. అందుకే ‘పండు గాయ సేయఁ బనిలేదు’ అన్నారు అన్నమాచార్యులు.

 

మనిషి మూర్ఖంగా దైవమును గురించిన ఆలోచనలను చివరి వరకు వాయిదా వేస్తాడు. ఇంతలో పరిస్థితి చేయిదాటి పోతుంది.    మనిషి తన దైన్యమునకు దైవమును మరియు ఇతరులను బాధ్యులుగా నిందిస్తాడు. అందువల్లనే   'ముందరఁ గలదని మోసపోతి నిదె'#1 అని హెచ్చరించారు అన్నమాచార్యులు. 

 

అన్వయార్ధము: ఆలోచనలు చుట్లు తిరుగుతూనే ఉంటాయి. కల్లోలమైన మనస్సు కాలంతో పాటు పరిపక్వం చెందుతుందని ఆశించవద్దు.

 

వానచేతకముల వలెనాయ మనసు
గోనెఁబట్టినబంక గుణమాయ మనసు
మానఁజిక్కినకోలమతమాయ మనసు
తేనెలోపలియీఁగ తెఱఁగాయ మనసు
॥ఎండ॥

 

vAnachEtakamula valenAya manasu
gOnebaTTinabaMkaguNamAya manasu
mAnajikkinakOla matamAya manasu
tEnelOpaliyIga te~ragAya manasu
eMDa

 

Word to Word meaning: వానచేతకముల (vAnachEtakamula) = చాతకమను పక్షి వానరాకకై నిరీక్షించునట్లు, Like a kind of cuckoo which eagerly awaits rain; వలెనాయ (valenAya) = similar to; మనసు (manasu) = the mind; గోనెఁబట్టినబంక (gOnebaTTinabaMka) = like the gum stuck to the gunny bag ( it’s very difficult to remove gum stuck thus);  గుణమాయ (guNamAya) = similar in quality;  మనసు (manasu) = mind; మానఁజిక్కినకోల మతమాయ (mAnajikkinakOla matamAya) ={మానఁజిక్కినకోల (mAnajikkinakOla) తిరిగి పొంద శక్యము కానిది, the thing that cannot be easily retrieved,   మతమాయ (matamAya) = అభిప్రాయము, నిశ్చితముల వలె, similar opinion or conviction} = తిరిగి మార్పుటకు సాధ్యముకాని నిశ్చిత అభిప్రాయము వలె,  a strong belief or opinion that is difficult to modify; మనసు (manasu) = mind; తేనెలోపలియీఁగ (tEnelOpaliyIga) = it is like a fly on honey; తెఱఁగాయ (te~ragAya) =  వంటి విధము, a way similar to;  మనసు (manasu) = mind. 

 

Literal meaning: mind is similar to a kind (of bird) cuckoo that keeps waiting for the rain. It sticks like the gum (of trees) to the gunny bags. It forms a strong belief or opinion that is difficult to modify. Mind is like a fly on honey. 

Explanation: The mind is constantly anticipating something with unending ideas, which disturbs the tranquilly. It clings to ideas that have already formed, which are difficult to get over. 

Our life is like honey. However, our mind is like the bee. Even though we are in honey, our mind is engaged with something else. Instead of enjoying honey, mind tells us try to extricate and fly out. And this process of separation puts the man on the anvil of struggle. 

Thus, mind with it's afflictions may be considered as pollution. The way out of this is not further action (which breeds pollution) but total silence, total negation of action. Bhagavadgita defines it as अकर्तारं स पश्यति (13-30) (= Still Mind Perceives the Truth). Contamination of the heart (mind) prevents the honey-like experiences. 

Implied meaning: The mind is constantly anticipating one thing or another, (causing it to lose focus on the task at hand). It holds on to the ideas already formed. It's impossible to retract. The mind is corrupting and preventing man from comprehending the truth. 

 

భావము: చాతకము అను పక్షి వాన రాకకై ఎదురు చూచు నట్లు మనస్సు ఇంకా ముందేమి ఉందోయని ఆశపెట్టి నడుపుతుంది. గోనెఁ పట్టాకు పట్టిన బంక సులభంగా వదలనట్లు, మనసుకు పట్టినవి అంటుకునే ఉంటాయి. మనసు తిరిగి మార్పుటకు సాధ్యముకాని నిశ్చిత అభిప్రాయముల వలె ఉండును. తేనెలో వ్రాలిన ఈగ వంటిది మనస్సు.  

 

వివరణము: మనస్సు ఎప్పుడూ ఎడతెగని ఆలోచనలతో ఏదో ఒకదాని గురించి ఎదురుచూస్తూ శాంతికి అంతరాయం కలిగిస్తుంది. ఇది ఇప్పటికే ఏర్పడిన ఆలోచనలను బంక లాగా పట్టుకొనిఉంటుంది. ఉపసంహరించుకోవడం అసాధ్యం. హృదయమను కలుషితం తేనె లాంటి అనుభవమును నిరోధిస్తుంది. 

జీవితమన్నది తేనె లాంటిదే. అయితే, మన మనస్సు తేనెటీగ లాంటిది. మనం తేనెలోనే ఉన్నప్పటికీ, మన మనస్సు మరొక దానితో నిమగ్నమై ఉంటుంది. తేనెను ఆస్వాదించడానికి బదులుగా, దాని నుండి వెలివడుటకు ప్రయత్నమనే పోరాటంలో నిరంతరము మునిగి ఉంటుంది. 

అందువల్ల, అనేక బాధలతో కూడిన మనస్సును కాలుష్యంగా పరిగణించవచ్చు. ఈ పరిస్థితి నుండి బయటపడే మార్గం ఇంకొక చర్య కాదు. (అది కాలుష్యాన్ని పెంచుతుంది). పూర్తి నిశ్శబ్దం. చర్యల పూర్తి నిరాకరణ. సంపూర్ణ ఉపసంహరణము. భగవద్గీత దీనిని అకర్తారం స పశ్యతి (13-30) (= నిశ్చలమైన మనస్సు సత్యాన్ని గ్రహిస్తుంది) అని నిర్వచించింది. హృదయం (మనస్సు) కలుషితం కావడం వల్ల తేనె వంటి జీవితాన్ని విడిచి దుఃఖములో మునుగుతున్నాడు మానవుడన్నారు. 

అన్వయార్ధము: మనస్సు ఎప్పటికప్పుడు ఏదో ఒకదానికై (చేతవున్నదానిని విడిచి) నిరీక్షిస్తూ ఉంటుంది. ఇది ఇప్పటికే ఏర్పడిన ఆలోచనలను మార్చుకొనవచ్చునని గ్రహించదు. ఉపసంహరించుకోవడం అసాధ్యము చేసి, మనస్సును మసక పరిచి, మనిషిని సత్యమును గ్రహించకుండా నిరోధిస్తుంది.

గడిరాజుబదుకాయ కడలేని మనసు
నడివీది పెసరాయ నయమైన మనసు
గడకుఁగట్టినపాఁతగతి దోఁచె మనసు
అడుసులోపలికంబమై తోఁచె మనసు
॥ఎండ॥

 

gaDirAjubadukAya kaDalEni manasu
naDivIdi pesarAya nayamaina manasu
gaDakugaTTinapAtagati dOche manasu
aDusulOpalikaMbamai tOche manasu
eMDa

 

Word to Word meaning: గడిరాజుబదుకాయ (gaDirAjubadukAya)  = (గడిరాజు = శూరుడు) బతుకు గడిరాజు (ఒక శూరుని) లాగ (ప్రమాదకరంగా మారినప్పటికీ పోరాటం కొనసాగించు శూరునిలాగ​) like a dogged fighter (continue fighting even if it becomes difficult or dangerous), like a fearless warrior as if war is the only object of life);   కడలేని (kaDalEni) = అంతులేని, with no end,  మనసు (manasu) = mind; నడివీది పెసరాయ (naDivIdi pesarAya) = అందరికి లభ్యమగునది (ప్రత్యేకించి ఎంపిక చేసుకున్న కొద్దిమందికి మాత్రమే లభించునది కాదు), available to anyone (nothing special, not privy to chosen few); నయమైన (nayamaina) = నెమ్మదిపడిన​, శాంతపడిన, after recovery, after quietening, after composure;   మనసు (manasu) = mind; గడకుఁగట్టినపాఁతగతి (gaDakugaTTinapAtagati) = (పొడవైన​) గడకు కట్టిన పాత గుడ్డ గాలి వీచునప్పుడు రెపరెపలాడు లాగ; చంచలమైనది;  like the old cloth that flutters (due to wind) when attached to the end of a long pole; wavering;  దోఁచె (dOche) = appear like;  మనసు (manasu) = mind; అడుసులోపలికంబమై (aDusulOpalikaMbamai) = మురికి కూపము మధ్యలోని స్థంబము లాగ, Like the pillar (rock) in the middle of the dirty coop; తోఁచె (tOche) = appears like; మనసు (manasu) = mind; 

Literal meaning:  This is a dogged fighter’s life. The calm and composed mind is a common thing. (However,) the mind flutters like, a cloth tied to high mast. The mind make life feel like a rock in the middle of a dirty coop.

Explanation: This man's persistent will to fight is a foolish decision. Man, on the other hand, rather than squirming his way out of his struggles and into a state of tranquilly, desires to continue (to live) in his current state. (refer: pADaina yiMdulO bradukugOrI brANi / vIDadannuka chaneDi veravu ganalEDu పాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణి /వీడఁదన్నుక చనెడి వెరవు గనలేఁడు) ## Also refer to explanation on stanza 3.

 

Annamacharya said that we live on a safe island formed by thoughts. The mud he referred is ignorance. Thus, reaching out to others involves a journey thru the mud and we prefer to stay where we are.  This creates (psychological) distance between man to man which is the root cause of the man’s struggle.   

Now consider this quote “We live on an island surrounded by a sea of ignorance. As our island of knowledge grows, so does the shore of our ignorance”- John Archibald Wheeler. Annamacharya with little formal education, appears to have known the actual mind like the modern scientists with all their equipment and poche of knowledge. 

Implied meaning: Life is a never-ending fight. Every passing notion causes the mind to flutter. Your thinking isolates you from others (as if you were living on a rock surrounded by muck). How can calm and composed mind can prevail in such circumstances? 

భావము: గడిరాజు (శూరుని) లాగ అంతము లేని జీవిత పోరాటము యీ మనస్సు. నడివీది పెసర లాగ నయమైన (బాగుపడిన) మనసు అందరికి లభ్యమగును. గడకు కట్టిన పాత గుడ్డ గాలి వీచునప్పుడు రెపరెపలాడు విధముగా చంచలమైనది మనస్సు. తన చుట్టునున్నవి తనకు తగినవి కావని బురద లోపల కంబములాగ తన మనస్సే తనకు రక్షణ అనిపింప చేస్తుంది. 

 

వివరణము: పోరాటాన్ని కొనసాగించాలనే నిర్ణయం వ్యక్తి యొక్క మొండి (వెర్రి) పట్టుదలకు సూచన​. మనిషిని తన కష్టాల నుండి బయటపడే మార్గమును వెదుకుటకు బదులు తన ఇప్పటి వైఖరినే కొనసాగించడానికి ఇష్టపడతాడు. అందుకే "పాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణి / వీడఁదన్నుక చనెడి వెరవు గనలేఁడు" (పాడైపోయినా, ఆ శరీరములోనే బ్రదుకు కొనసాగించ కోరి దేహాభిమానము కళ్లుగప్పగా శాంతమను స్థితికి  బాట కనుగొనలేకపోతాడు#2) అని అన్నమాచార్యులు అన్నారు.

 

ఆలోచనలతో ఏర్పడిన సురక్షితమైన ద్వీపంలో మనం జీవిస్తున్నామని అన్నమాచార్యులు చెప్పారు. అతడు ప్రస్తావించిన బురద అజ్ఞానం. ఆ విధంగా, ఇతరులను చేరుకోవడం అనేది బురద గుండా ప్రయాణం చేయ వలసి ఉంటుంది. అందుకే, మనం ఎక్కడున్నామో అక్కడే ఉండడానికి ఇష్టపడతాము. ఇది మనిషికి మనిషికి మధ్య దూరాన్ని సృష్టిస్తుంది, ఇదే మనిషి యొక్క పోరాటాలకు మూల కారణం.

ఇప్పుడు జాన్ ఆర్చిబాల్డ్ వీలర్ చెప్పిన సూక్తిని పరిగణించండి "మనం చుట్టూ అజ్ఞాన సముద్రం  ఉన్న ఒక ద్వీపంలో నివసిస్తున్నాము. మన జ్ఞాన ద్వీపం పెరుగుతున్న కొద్దీ, మన అజ్ఞానం యొక్క తీరం కూడా పెరుగుతుంది." చాలా తక్కువ విద్య అభ్యసించినప్పటికీ అన్నమాచార్యులు ఆధునిక శాస్త్రవేత్తల వలె వారు నిరంతర కృషితో, పరికరాలతో గ్రహించిన సూక్ష్మాతిసూక్ష్మ విషయాలను ఆ తాదాత్మ్య స్థితిలో  ఆకళింపు చేసుకున్నట్లు కనిపిస్తాడు.

 

“వ్యత్యాసం” అనే కవితలో శ్రీశ్రీ

"ఇదివరకే ఏర్పడిందా గది .

అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం .

నిశ్చల నిశ్చితాలు మీవి .

మంచిని గురించి,

మర్యాద ,మప్పితం గురించి,

నడతా , నాణ్యం, విలువల విషయం

నిశ్చల నిశ్చితాలు మీవి"

అనడంలోని ఆంతర్యమిదే.

 

అన్వయార్ధము: జీవితమంటే అంతులేని పోరాటం అనిపింప చేస్తుంది. గడిచే ప్రతి భావన మనసును కుదిపేస్తుంది. మీ ఆలోచనలే సురక్షితమైన ద్వీపంలో ఉన్నట్లు మరపించి మిమ్మల్ని ఇతరుల నుండి వేరు చేస్తాయి. (మీరు బురదతో చుట్టుముట్టబడిన రాతిపై నివసిస్తున్నట్లు). అటువంటి పరిస్థితులలో ప్రశాంతమైన మనస్సు కుదురుతుందా?

తెరవుచూపినజాడఁ దిరుగు నీమనసు
మరుగఁజేసినచోట మరుగు నీ మనసు
తిరువేంకటేశుపైఁ దిరమైన మనసు
సిరిగలిగినచోటఁ జేరు నీమనసు
॥ఎండ॥

 

teravuchUpina jADa dirugu nImanasu
maruga jEsina chOTa marugu nI manasu
tiruvEMkaTESupai diramaina manasu
sirigaliginachOTa jEru nImanasu
eMDa

 

Word to Word meaning: తెరవుచూపిన జాడఁ (teravuchUpina jADa) = (ముందు నడచిన) అడుగులగుఱుతు గల​ మార్గములోనే,  the paved path (a path that is already visited or known);  దిరుగు (dirugu) = తిరుగును, moves around; నీమనసు (nImanasu) = this mind; మరుగఁజేసినచోట (maruga jEsina chOTa) = అలవాటుపడిన చోటులలో, పరిచితమగు చోటులలో, places accustomed to, places addicted to; మరుగు (marugu) = ఆశించు, ఆశపడు, get used to; నీ (nI) = your;  మనసు (manasu) = mind; తిరువేంకటేశుపైఁ (tiruvEMkaTESupai) = on the Lord Venkateswara; దిరమైన (diramaina) = స్థిరముగా ఉన్న, pegged to;​ మనసు (manasu) = the mind;  సిరిగలిగినచోటఁ (sirigaliginachOTa)  = where the goddess (of wealth) Lakshmi lives, (alternatively, where there is money); జేరు (jEru) = follows;  నీమనసు (nImanasu) = this mind;

Literal meaning: This mind always moves around the paved path (a path that is already visited or known). It likes (to visit again and again) the places accustomed to, places it gets addicted to. The mind that is fixed on to the Lord Venkateswara is the still mind. It naturally gravitates to places where there is wealth (and comforts). 

Explanation: You must have noted people all over the world would like to consume their native food even while staying in the foreign lands. Of course, Annamacharya is not talking these kinds of traits. Nevertheless, it proves the point. A-cosmopolite-in-a-café by O Henry is also a good example of how inseparably we get related to our native lands, despite our claims otherwise. 

The most important thing said by Annamacharya is that mind keeps you pegged to the known. Mind makes one feel the transpositions of the known as ‘new’. There is nothing new in what you already know. This shall tire the man sooner than later. That’s why he wrote a verses titled  “unna vichAramulEla vOvO saMsArulAla” (ఉన్న విచారములేల వోవో సంసారులాల =  O Man of this world! why existing thoughts/worries?) and unnachOTanE mUDulOkA lUhiMchi chUchitE nIvE (ఉన్నచోటనే మూఁడులోకా లూహించి చూచితే నీవే = Stay where you are and find the states of the mind). Also Jiddu Krishnamaurti wrote a book titled “Freedom from the Known”. These titles themselves give abundant proof for this stanza.

Annamacharya observed that our thoughts percolate, rather precipitate towards wealth. This entire world is divided into ‘haves’ and ‘have-nots’. Major transactions of nations is largely on economy. What else to say that Annamacharya is precise? Now request the reader to refer to song  rUkalai mADalai ruvvalai tirigIni#4 (రూకలై మాడలై రువ్వలై తిరిగీని =wealth takes various forms, does not stay in one place and keeps circling the world).

 

భావము: ఈ మనస్సు (ముందు నడచిన) అడుగుల గుఱుతు గల మార్గములోనే తిరుగుటకు ఇష్టపడును. అలవాటుపడిన, పరిచితమగు చోటులలోనే తచ్చాడుటకు ఆశపడును.  తిరువేంకటేశుపైఁననే ఉండు మనస్సు స్థిరమైన (నిశ్చలమైన) మనస్సు. నీరు పల్లమెరుగు రీతిగా సిరిగలిగినచోటఁకే చేరుటకు ఈ మనసు ఉవ్విళ్ళూరును.

వివరణము: ప్రపంచవ్యాప్తంగా  ప్రజలు, విదేశాలలో ఉంటున్నప్పటికీ కూడా వారు వారి స్థానిక ఆహారాన్ని తినాలనుకుంటారు. ఓ హెన్రీ రచించిన a-cosmopolite-in-a-café అన్న కధ​ మనము ఏరకంగా బయటకు చెప్పుకున్నప్పటికీ, మన జన్మస్థలములతో ఎంత విడదీయరాని సంబంధం కలిగి ఉంటామో సూచించును. ఈ ఉదాహరణలు మనకు తెలిసిన విషయములనే పదేపదే కోరుకుంటామనడానికి రుజువులు.

అన్నమాచార్యులు చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనస్సు మనల్ని తెలిసిన వాటితో కట్టి ఉంచుతుంది.  (తెలిసిన) వాటి పరివర్తనలను మనస్సు 'కొత్త' అనిపింప చేస్తుంది. కొత్త సీసాలో పాత సారా పోస్తే కొత్తవుతుందా! వీటితో మనిషి త్వరగా అలసిపోతాడు. ఉన్న విచారములేల వోవో సంసారులాల? (ఓ మానవులారా! ఉన్న ఆలోచనలు / ఆందోళనలు ఎందుకో?)  ఉన్నచోటనే మూఁడులోకా లూహించి చూచితే నీవే (=ఉన్నచోటనే ఉండి మరియు మనసు గతిని కనుక్కో) అనే కీర్తనలే  నిదర్శనము. జిడ్డు కృష్ణమూర్తి గారు "తెలిసిన వాటినుండి స్వేచ్ఛ” (Freedom from the Known) అనే పుస్తకాన్ని రాశారు.

అన్నమాచార్యులు మన ఆలోచనలు సంపద వైపు అనుకోకుండానే లాక్కెళతాయి అన్నారు. గమనిస్తే ఈ ప్రపంచమే 'ఉన్నవారు' మరియు 'లేనివారు'గా విభజించబడింది. దేశాల మధ్య ప్రధాన లావాదేవీలు ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ మీదనే ఆధారపడి వుంటాయి. విశ్వమంటే అన్నమాచార్యులకు గల పదునైన పరిశీలనలకు ఇంతకంటే సాక్ష్యమేమివ్వగలం? ‘రూకలై మాడలై రువ్వలై తిరిగీని’#4 అను కీర్తనను (= సంపద​ రూకలుగా, మాడలుగా, రువ్వలుగా మారి పైకము లోకమంతట సంచరించు చుండును.) ఉల్లేఖనంగా తీసుకోవచ్చు.

Recommendations for further reading:

110. ముందరఁ గలదని మోసపోతి నిదె (muMdara galadani mOsapOti nide)

12 ఏఁటివిజ్ఞాన మేఁటిచదువు (ETivij~nAna mETichaduvu)

108. గోనెలె కొత్తలు కోడెలెప్పటివి (gOnele kottalu kODeleppaTivi)

40 రూకలై మాడలై రువ్వలై తిరిగీని (rUkalai mADalai ruvvalai tirigIni)

 

Summary of this Keertana:

 

This mind is like (length of) shadow in the sun. Not necessary to wait  for its maturation. Implied meaning: Thoughts keep drifting. Never, ever expect a wavering mind to mature with time.

mind is similar to a kind (of bird) cuckoo that keeps waiting for the rain. It sticks like the gum of trees to the gunny bags. It’s a strong belief or opinion that is difficult to modify. Mind is like a fly on honey. Implied meaning: The mind is constantly anticipating one thing or another, (causing it to lose focus on the task at hand). It holds on to the ideas already formed. It's impossible to retract. The mind is corrupting and preventing man from comprehending the truth.  

This is a dogged fighter’s life. The calm and composed mind is a common thing. (However,) the mind flutters like, a cloth tied to high mast. The mind make life feel like a rock in the middle of a dirty coop. Implied meaning: Life is a never-ending fight. Every passing notion causes the mind to flutter. Your thinking isolates you from others (as if you were living on a rock surrounded by muck). How can calm and composed mind can prevail in such circumstances?

 

This mind always moves around the paved path (a path that is already visited or known). It likes (to visit again and again) the places accustomed to, places it gets addicted to. The mind that is fixed on to the Lord Venkateswara is the still mind. It naturally gravitates to places where there is wealth (and comforts).

 

కీర్తన సంగ్రహ భావము:

 

మనసు ఎండలోని నీడవలె హెచ్చుచు తగ్గుచు నుండును. మాగు చేయ పనిలేదు (కాయలను పండుటకు బియ్యములోను, ధాన్యములోను కొంతకాలము మాగు పెట్టునట్లు, ఈ మనసు అను కాయ పండుటకు వేచియుండు అవసరములేదు). అన్వయార్ధము: ఆలోచనలు చుట్లు తిరుగుతూనే ఉంటాయి. కల్లోలమైన మనస్సు కాలంతో పాటు పరిపక్వం చెందుతుందని ఆశించవద్దు.

 

చాతకము అను పక్షి వాన రాకకై ఎదురు చూచు నట్లు మనస్సు ఇంకా ముందేమి ఉందోయని ఆశపెట్టి నడుపుతుంది. గోనెఁ పట్టాకు పట్టిన బంక సులభంగా వదలనట్లు, మనసుకు పట్టినవి అంటుకునే ఉంటాయి. మనసు తిరిగి మార్పుటకు సాధ్యముకాని నిశ్చిత అభిప్రాయముల వలె ఉండును. తేనెలో వ్రాలిన ఈగ వంటిది మనస్సు. అన్వయార్ధము: మనస్సు ఎప్పటికప్పుడు ఏదో ఒకదానికై (చేతవున్నదానిని విడిచి) నిరీక్షిస్తూ ఉంటుంది. ఇది ఇప్పటికే ఏర్పడిన ఆలోచనలను మార్చుకొనవచ్చునని గ్రహించదు. ఉపసంహరించుకోవడం అసాధ్యము చేసి, మనస్సును మసక పరిచి, మనిషిని సత్యమును గ్రహించకుండా నిరోధిస్తుంది.

 

గడిరాజు (శూరుని) లాగ అంతము లేని జీవిత పోరాటము యీ మనస్సు. నడివీది పెసర లాగ నయమైన (బాగుపడిన) మనసు అందరికి లభ్యమగును. గడకు కట్టిన పాత గుడ్డ గాలి వీచునప్పుడు రెపరెపలాడు విధముగా చంచలమైనది మనస్సు. తన చుట్టునున్నవి తనకు తగినవి కావని బురద లోపల కంబములాగ తన మనస్సే తనకు రక్షణ అని పింప చేస్తుంది. అన్వయార్ధము: జీవితమంటే అంతులేని పోరాటం అనిపింప చేస్తుంది. గడిచే ప్రతి భావన మనసును కుదిపేస్తుంది. మీ ఆలోచనలే సురక్షితమైన ద్వీపంలో ఉన్నట్లు మరపించి మిమ్మల్ని ఇతరుల నుండి వేరు చేస్తాయి. (మీరు బురదతో చుట్టుముట్టబడిన రాతిపై నివసిస్తున్నట్లు). అటువంటి పరిస్థితులలో ప్రశాంతమైన మనస్సు కుదురుతుందా?

ఈ మనస్సు (ముందు నడచిన) అడుగుల గుఱుతు గల మార్గములోనే తిరుగుటకు ఇష్టపడును. అలవాటుపడిన, పరిచితమగు చోటులలోనే తచ్చాడుటకు ఆశపడును.  తిరువేంకటేశుపైఁననే ఉండు మనస్సు స్థిరమైన (నిశ్చలమైన) మనస్సు. నీరు పల్లమెరుగు రీతిగా సిరిగలిగినచోటఁకే చేరుటకు ఈ మనసు ఉవ్విళ్ళూరును.

 

 

 

 

Copper Leaf: 65-4 Volume 1-337

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...