ANNAMACHARYA
40 రూకలై మాడలై రువ్వలై తిరిగీని
Introduction: The depth to which Annamacharya wrote poetry is almost indescribable. However, in our little ways, let us examine this awesome verse on grace of goddess Lakshmi (wealth). He describes its nature as fickle, tremulous, volatile and slimy. Describing its tremendous influence on life of man he said money is “an unravelled vanity, an illusory asylum for the man, and makes man to act at its will”. He cautioned people that they are getting intoxicated by this virtual thing called money.
ఉపోద్ఘాతము: అన్నమచార్యుల ప్రతిభను బేరీజు వేయగల శక్తి నాకు లేదు. నాకు తెలిసినదానిని మీ ముందు ఉంచు ప్రయత్నమే యిది. సంపద (లక్ష్మీ విలాసమును) గురించి వ్రాసిన కీర్తనలో మనిషి పైకముపై మైకములో తనను తాను మరచి పోతున్నాడని హెచ్చరించారు. సంపదను (లక్ష్మిని) కుదురులేని దానిగాను, జారిపోవు దానిగాను హరించిపోయే దానిగాను, చపలమైన దానిగాను వర్ణించారు. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసి జంత్రగాడు బొమ్మలను ఆడించునట్లు ఆడించునని, లేనిగొప్పలు ఉన్నట్లు కల్పించి మనిషికి (మానసిక) శరణాలయముగా మారిపోయినదని చెప్పారు.
రూకలై మాడలై రువ్వలై తిరిగీని
rUkalai
mADalai ruvvalai tirigIni
Word to word meaning: రూకలై (rUkalai) = రూకలు+ ఐ = రూక రూపాయలో నాల్గవభాగము. చిన్న మెత్తు వెండిబంగారముల నాణెము; A currency in vogue in olden times (=1/4 rupee) ; మాడలై (mADalai) = మాడలు+ ఐ = అర వరహా విలువగల బంగారు నాణెము, A currency in vogue in olden times; (= ½ varahA); రువ్వలై (ruvvalai) = రువ్వలు+ ఐ = దమ్మిడి, A small value currency in vogue in olden times (=1/12 anna); తిరిగీని (tirigIni) = Keeps moving; దాకొని (dAkoni) = మరుగుపడి, hiding, steatly; వున్నచోటఁ (vunnachOTa) = Please it was kept; దా (dA) = that one; నుండ దదివో (nuMDa dadivO) = Does not stay.
Literal meaning: Wealth (goddess Lakshmi) does not allow to be hidden. She takes various forms, does not stay in one place and keeps circling the world.
భావము: కనకము (లక్ష్మి) ఉన్నచోట మరుగుపడియుండదు. అదిగో చూడుడు. అది రూకలుగా, మాడలుగా, రువ్వలుగా మారి పైకము లోకమంతట సంచరించు చుండును.
వొకరి రాజుఁజేసు నొకరి బంటుగఁ జేసు
vokari rAjujEsu nokari baMTuga jEsu
vokari kannekala vErokariki nammiMchu
vokachOTanunna dhAnya mokachOTa vEyiMchu
prakaTiMchi kanakamE bhramayiMchI jagamu ॥rUka॥
Word to word meaning: వొకరి (vokari) = a person; రాజుఁజేసు (rAjujEsu) make him king; నొకరి = వొకరి (vokari) = a person; బంటుగఁ జేసు (baMTuga jEsu) =- make him a servant (here meaning pauper); వొకరి (vokari) = a person; కన్నెకల (kannekala) = unmarried daughters; వేరొకరికి (vErokariki) = to someone else; నమ్మించు (=అమ్మించు, nammiMchu) = make sale; వొకచోటనున్న ధాన్యము (vokachOTanunna dhAnyamu) = Rice/grains (produced) in one place; ఒకచోట వేయించు (okachOTa vEyiMchu) = gets unloaded elsewhere; ప్రకటించి (prakaTiMchi) = by declaring; కనకమే (kanakamE) = the (goddess of) wealth భ్రమయించీ (bhramayiMchI) = make it believe; జగము (jagamu) = whole world.
Literal meaning: It makes someone as king; it make someone else as pauper; compels a person to sell (=marry) his daughters (for consideration of certain money, a practice known as kanyasulkamu, కన్యాశుల్కము) to unsuitable grooms. Someone make efforts to produce grains and someone else enjoys them. People all over the world are made to believe in money.
Comments:
1. 1. Just see what Shakespeare states thru SALANIO (on Shylock’s greed for money). It depicts the state of confusion in the mind of man.
I never heard a passion so confused,
So strange, outrageous, and so variable,
As the dog Jew did utter in the streets:
'My daughter! O my ducats! O my daughter!
Fled with a Christian! O my Christian ducats!
Justice! the law! my ducats, and my daughter!
A sealed bag, two sealed bags of ducats,
Of double ducats, stolen from me by my daughter!
And jewels, two stones, two rich and precious stones,
Stolen by my daughter! Justice! find the girl;
She hath the stones upon her, and the ducats.'
2. 2. Thru this stanza, he criticised the mal practice of kanyasulkamu, కన్యాశుల్కము.
భావము: ఒకరిని రాజుని, ఇంకొకరిని పేదగాను చేయును. ఒకరు తన కూతుళ్ళను ఇంకొకరికి (బలవంతముగా) కన్యాశుల్కమునకు అమ్ము దురవస్థల పాలు చేయును. ఒకరు కష్టపడి సాగు చేసిన పంటను ఇంకొకరు అనుభవిస్తారు. ఈ సంపద కనబడుతుండగానే ప్రపంచమంతటినీ మైకమున కమ్మివేయును.
వ్యాఖ్యలు :
1.
క్రింది సుమతీ శతక పద్యము ఇక్కడ తెలిపిన లోకం పోకడ బాగా తెలియజేస్తోంది
క. వేసరఁపు జాతి గానీ
వీసముఁ దాఁ జేయనట్టి వెంగలి గానీ
దాసికొడుకైనఁ గానీ
కాసులు గలవాఁడె రాజు గదరా సుమతీ.
2. ఆనాడు సమాజములో ఊన్న కన్యాశుల్కమను దురాచారమును విమర్శించారు అన్నమచార్యులు.
కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు
koMdarijALelu niMDu koMdariki sommulavu
koMdariki puNyulajEsu goMdari pApulajEsu
koMdarikoMdarilOna koTlATa veTTiMchu
paMdemADinaTuvale bachariMchu pasiDI ॥rUka॥
Word to word meaning: కొందరి (koMdari) = for some; జాళెలు (jALelu) = నాణెములు పోయు సంచులు, money bags; నిండు (niMDu) = become full; కొందరికి (koMdariki) = for some; సొమ్ములవు = become jewellery; కొందరికి (koMdariki) = for some; పుణ్యులఁజేసుఁ (puNyulajEsu) = makes them more pious; గొందరి (=కొందరి koMdari) = for some పాపులఁజేసు (pApulajEsu) = make them more avarice; కొందరికొందరిలోన (koMdarikoMdarilOna) = between people; కొట్లాట(koTlATa) = quarrel; వెట్టించు(veTTiMchu) = reason for; పందెమాడినటువలెఁ (paMdemADinaTuvale) = as if challenged to be in race; బచరించు (=పచరించున్, bachariMchu) = తిరుగును, moves around; పసిఁడీ (pasiDI) = gold ( meaning money).
Literal meaning: For some it gives plenty. For some it becomes jewellery. Some become humble on getting money. Makes some people perverted to becoming rich. It is the cause of strife in population. It makes the whole world go around in circles.
Comments: Please consider the statement of Shakespeare as
below and see the relevance of Annamacharya’s statements.
“Whiles I am a beggar, I will rail and say there is no sin but to be
rich; and being rich, my virtue then shall be to say there is no vice but
beggary.”(The
Life and Death of King John, Act 2 Scene 1)
భావము: కొందరి ఇళ్ళలో బస్తాలలో నిండి ఉంటుంది. కొందరి దేహాలపై ఆభరణాలుగా ఉంటుంది. కొందరిని పుణ్యాత్ములను చేయును. ఇంకొందరిలో పాప బుధ్ధి పుట్టించును. మనుషుల మధ్య కొట్లాట పెట్టించును. ఈ లక్ష్మి అనే సంపద పంతము కొద్ది మనుషులను త్రిప్పుచూ తానూ తిరుగుతోంది.
వ్యాఖ్యలు : “పోవునపుడు మన ఇనప్పెట్టె మనతో వచ్చు వీలులేకుండ చేసిన బ్రహ్మకి మతి ఉందంటారా? “ అంటాడు వరవిక్రయం నాటకంలో పిసినారి సింగరాజు లింగరాజు
నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు
niganigamanuchuMDu nikshEpamai yuMDu
tagili SrIvEMkaTESu taruNiyai tA nuMDu
teganimAyai yuMDu dikku desayai yuMDu
nagutA mApAla nuMDi naTiyiMchu basiDI ॥rUka॥
Word to word meaning: నిగనిగమనుచుండు(niganigamanuchuMDu) = it keeps glittering; నిక్షేపమై యుండు (nikshEpamai yuMDu) = A buried treasure ( here it means treasured trove); తగిలి (tagili) = get entangled; శ్రీవేంకటేశు (SrIvEMkaTESu) = Lord of Seven Hills; తరుణియై తా నుండు (taruNiyai tA nuMDu) = known as his lady; తెగనిమాయై యుండు (teganimAyai yuMDu) = a permanently unravelled secret; remains unrelenting puzzle; దిక్కు దెసయై యుండు (dikku desayai yuMDu) = అభయమై, శరణమై, becomes shelter, asylum, refuge; నగుతా(nagutA) = నవ్వుచు. (Here the true meaning is ధిక్కరించుచు, తిరస్కరించుచు, treat contemptuously, to scorn); మాపాల నుండి (mApAla nuMDi) = on our behalf; on our side; నటియించు (naTiyiMchu) = to make someone act; బసిఁడీ (=పసిఁడీ, basiDI = pasiDI) = gold (= money).
Literal meaning: it coquets admiration (implying attracting interest) without serious intention. Fascinates man to look for hidden treasured troves, (even God is not an exception, finally it became his wife), remains unrelenting puzzle to man, overwhelm mankind’s attention so much that it takes the masses under its asylum. It’s making man to dance with a camouflaged grin.
Comments: In the beginning it was stated will not stay in one place. In this stanza the wealth is said to be hidden in troves. This is not a contradiction. In all probabilities, the treasure troves do not serve their purposes, but end up in someone else hands. This simply proves the statement of first stanza “Someone makes efforts to produce (grains) and someone else enjoys them”.
it will not be out of context to introduce a
new word AFFLUENZA a portmanteau of
affluence and influenza, defined as a “painful, contagious, socially
transmitted condition of overload, debt, anxiety, and waste, resulting from the
dogged pursuit of “more”. That is what the implied meaning of this verse is. I feel Annamacharya effectively captured the
impact of wealth in man’s life by this single verse.
భావము: తళతళమని మనిషిని మురిపించుచూ, గుప్త నిధి అనిపిస్తూ, చివరకు ఆ భగవంతుణ్ణీ కూడా తన వైపు త్రిప్పుకున్నదని {సూచిస్తూ వెంకటెశ్వరుని తరుణియై} అన్నారు. విరామ మెరుగని కలవరము రేపి మనిషికి దిక్కు తోచకుండా చేసి (తనను) శరణము పొందేలా చేస్తోంది. తిరస్కరించే నవ్వుతో మానవజాతిని చేరి ఆడిస్తోంది.
వ్యాఖ్యలు : క్రింది భర్తృహరి శ్లోకాన్ని
చూడండి
ఇహ తురగ శతై: ప్రయాంతు మూఢా: ధనరహితాస్తు బుధా: ప్రయాంతు పద్భ్యాం గిరిశిఖరగతా2పి కాక పంక్తి: పులినగతై ర్న సమత్వమేతి హంసై:
లోకంలో విద్య, సంస్కారాలు ఎంత మాత్రమూ లేని వారు, రసహీనులు ఏనుగుల మీద, గుర్రాల మీద, రధాల మీద ఊరేగుతూ ఉంటారు. మహా పండితులు, పరమ యోగ్యులు, ధార్మికులు మాత్రం నిరు పేదలవడం వలన కేవలం కాలి నడకన పోతూ ఉంటారు. కాకులను చూడండి. పర్వత శిఖరాల మీద బారులు తీర్చి కూర్చుని ఉంటాయి. మరి హంసలో ? నేల మీద నదుల, సరస్సులతలాలలో తిరిగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ హంసలతో కాకులు సాటి రాజాలవు కదా !
నిజమే కదా, ఉన్నతులు నిగర్వులై, నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఉండడం, ఇడుములు పడుతూ ఉండడం, కుసంస్కారుల చేత నిదాదరణ. తిరస్కారాలు పొందుతూ ఉండడం మనం తరుచుగా చూస్తూనే ఉంటాం. అలాగే, అధములు ఆడంబర జీవనం గడపడమూ మనకి తెలిసినదే. నిజానికి ఈ పాడు లోకంలో అలాంటి వారికే మన్నన ఎక్కువగా ఉండడం బాధాకరం. కాని, అది లోక రీతి.
zadaz
Reference:
copper leaf 6-5, volume: 1-40
లక్ష్మీ దేవి యొక్క విలాసము గురించిన ఈ కీర్తనలో అన్నమయ్య మనిషి జీవితంలో సంపద యొక్క ప్రభావము,దానికి మనిషి తెలియని దాసుడెట్లగుచున్నాడో,లక్ష్మీ దేవి చంచలత్వం,సాంఘిక దురాచారమైన కన్యాశుల్కం వల్ల కలిగే అనర్ధాలను ఎంతో చక్కగా వివరించారు.
ReplyDeleteచివరకు లక్ష్మీ దేవి భర్తయైన వేంకటేశ్వరుణ్ణి తన చుట్టూ త్రిప్పుకొంటున్నదని, ఇంక సామాన్యుడి విషయం ఏమి చెప్పాలి?అంటున్నారు అన్నమయ్య.
శ్రీవేంకటేశ్వరుడి తరుణి అంటే ఆయన్ని తనవైపుకు తిప్పుకుంది అని కాదు, ఆయన అధీనంలో ఉంటుంది అని అర్థం. ఇది సంపదకు మాత్రమే కాదు, సమస్త ప్రపంచానికీ వర్తిస్తుంది.
ReplyDeleteతర్వాత పాదంలో మాయగా చెప్తారు. మాయ ఎప్పుడూ భగవంతుడి అధీనంలో ఉండేదే కదా?
అన్నమాచార్య సంప్రదాయంలో లక్ష్మీదేవి భగవంతుడి దయకి ప్రతీక. జగన్మాత. ఒక ధనానికో మరొక పోర్టుఫోలియో కో దేవత కాదు.
ఇక్కడ చెప్పబడింది ధనం విషయం. ధనానికి కూడా మీరు అన్నట్టుగానే లక్ష్మి అనే పదం వర్తిస్తుంది, హరి అంటే కోతి అన్నట్టుగా! - Vishnu