Sunday 5 February 2023

T-159 అప్పులవారే అందరును

 అన్నమాచార్యులు

159 అప్పులవారే అందరును

for English Version press here


అల్లకల్లోల ప్రపంచం.

సారాంశం: "ఈనాడు ప్రపంచం తీవ్రమైన హింసాత్మకంగా, విభజించబడి, ఉదాసీనంగా ఉంది. ఏదేమైనా, మనిషికి అతని అంతర్గత కలహాలు చాలా ముఖ్యమైనవి ".

 

Summary of this Poem:

పల్లవి: అప్పులవారమే అందరమూ. తీర్చుటకు త్రిప్పు ఆ అప్పిచ్చినవాడు ఎక్కడున్నాడో? అన్వయార్ధము:  ఓ మానవా, నీకై నీవు సృష్టించిన బానిసత్వపు గొలుసులను గుర్తించు.

చరణం 1: ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ చిక్కులు, చింతలు, ఉపద్రవములే కదా! జీవనమను యీ రాపిళ్ళలో, ఘర్షణలలో దిక్కు  దేవుఁడెఁకాక వేరెవరు? 

చరణం 2: ఏ రకముగా చూచినా, మానవ మనుగడలో కోరు సుఖాలు నిజమైన సూదులమూఁటలే. నువ్వు ఔనన్నా, కాదన్నా అడుగే లేని నీ మనస్సుచివరలకంటా చూడగలిగే పోదికాఁడు (హీరో) ఒక్కడే ఉన్నాడు. అన్వయార్ధము:  ఓ మానవా, చివరికి ముళ్ల సంచులుగా నిరూపించబడే ఆనందాలకు అతీతంగా, మీ హృదయంలోనే నివసిస్తున్న ఆ గొప్ప నిధిని కనుక్కో.

చరణం 3: నీవే యేర్పరచుకున్న యీ బంధములు యెన్నడూ వీడవు, ఎప్పుడూ వృద్ధినొందును. ఉన్నతి కలిగించి, ఒప్పుకొనదగునవి నేర్పు వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు. 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల కీర్తనలు చాలా వరకు సులభంగా మింగుడుపడనివే.   సత్యాన్ని, అసత్యాన్ని వేరుచేసే మన సామర్ధ్యాలకు సవాలు విసురుతున్నవి వీరి కీర్తనలు. ఆయన ఆచరణాత్మకత ద్యోతకమగు పరిశీలనలు  మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. వారు అంతుచిక్కని రహస్యం.

 

కీర్తన:

రాగిరేకు:  13-5 సంపుటము: 1-81

అప్పులవారే అందరును
కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ అప్పుల॥
 
ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ
జిక్కులు సిలుగులుఁ జింతలునే
దిక్కెవ్వరు యీ తీదీపులలో
దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక అప్పుల॥
 
యేది దలంచిన నేకాలంబును
సూదులమూఁటల సుఖములివి
కాదన నౌననఁ గడ గనిపించఁగ
పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే అప్పుల॥
 
యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీఁ
బన్నిన తమతమ బంధములు
వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ
వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు అప్పుల॥

Details and Explanations: 

అప్పులవారే అందరును
కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ అప్పుల॥

ముఖ్య పదములకు అర్ధములు: కప్పఁగఁ = అప్పుతీర్చుటకు;  దిప్పఁగఁ= త్రిప్పు;  గర్తలు = ఆ అప్పిచ్చినవాడు

భావము: అప్పులవారమే అందరమూ. తీర్చుటకు త్రిప్పు ఆ అప్పిచ్చినవాడు ఎక్కడున్నాడో?

వివరణము: ఇది చాలా చిన్న కీర్తన అయినప్పటికీ సీమటపాకాయ లాంటిది. మనల్ని అప్పులవారిగా మార్చిన అసలైన వ్యక్తిని కనుక్కోమని అడుగుతున్నాడు. ఇదొక్కటీ చేస్తే మనము ముఖ్యమైన రహస్యం ఛేదించినట్లే.

ప్రసిద్ధ లాటిన్ మేధావి & రచయిత పుబ్లియస్ సైరుస్ "ఋణం అనేది స్వతంత్రుల బానిసత్వం" అన్నాడు. ఇక్కడ అన్నమాచార్యులు మనమందరం ఋణగ్రస్తులమని చెప్పి ఒక రకంగా మనం స్వేచ్ఛగా లేమని అన్నారేమో.

ప్రముఖ ఆంగ్ల రచయిత, తత్వవేత్త అలాన్ విల్సన్ వాట్స్ ఇలా అన్నారు. "మనము ఎక్కడినుంచో ప్రపంచంలోకి "వచ్చి పడలేదు"; మనము ఒక చెట్టు నుండి ఆకులు వలె బయటకు వస్తాము. సముద్రం నుంచి "అలలుగా" వచ్చినట్లుగా, విశ్వము నుండి "మనుషులు" వస్తున్నారు.

ఈ విశ్వంలోని అంతర్భాగమే మనము. విశ్వంలోని అంతరిక్షము (స్పేస్), కాలము,  శక్తి ప్రసరణ తరంగముల విన్యాసములతో మనము చెప్పలేనంతగా ముడిపడి ఉన్నాము. మనం సముద్రంలో అలల వంటి వారము. ఎల్లప్పుడూ మారుతూ, పరివర్తన చెందుతూ మారునది, మార్పుతెచ్చునది నిర్దిష్టంగా గుర్తించలేనంతగా కలసి వున్నాము. అందువలన మనం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రజలతో నిండిన లోకం నుండి వచ్చిన వారమని అంగీకరిస్తే  సహజంగానే మనం కూడా అప్పులవారమే.

ఋణగ్రస్తులు ఋణమెవ్వరికి తీర్చుకోవలె? దీనికి సమాధానము సరళముగా వుండి వుంటే, ఇన్ని మతములు, ఇంత మంది తత్వవేత్తల అవసరమముండేది కాదు. కావున ఋణమిచ్చినవానిని గుర్తించుట ముఖ్యమని అన్నమాచార్యుల భావము. ప్రఖ్యాత బెల్జియం కళాకారుడు రెనె మాగ్రిట్టే వేసిన 'ది కీ టు డ్రీమ్స్' (కలలకు సంకేతము) అనే అధివాస్తవిక పెయింటింగ్ సహాయంతో నేను దీన్ని వివరిస్తాను.  చిన్నప్పుడుఅ’ఆ’ఇ’ ‘ఈ’లను బొమ్మలను చూపి దాని క్రింద అక్షరము వ్రాసి  నేర్పించినట్లుగా వుండె చిత్రపటములో కొన్ని బొమ్మలు వాటి క్రింద పేరు ఇవ్వబడ్డాయి. ఐతే ఇక్కడ బొమ్మలకు క్రింద వ్రాసిన పేరుకు సంబంధము లేకుండా చేసి రెనే మాగ్రిట్ మనలను అయోమయంలోకి నెట్టి వెస్తాడు.


కలలకు సంకేతములు (కీ టు డ్రీమ్స్) అను చిత్రకవిత్వంలో ఏదైనా (పాత లేదా క్రొత్తల) ప్రతీకాత్మతకు ప్రాముఖ్యమే లేదన్నారు." కాబట్టిమనం విషయములను భావములను సంబంధము లేకుండా ముడిపెట్టి ప్రపంచంతో బంధించబడతాము” అని మాగ్రిట్ చెబుతున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చిన్నపిల్లలు నేర్చు బొమ్మను చూపి, ఈ రుగ్మత చాలా చిన్న వయస్సు నుండి ప్రారంభమవుతుంది అని సూచించారు, ఆలోచనలకు ఇదమిత్థమగు రూపమూహించక, దుస్సహవాసమునకు తావు లేకుండా ఉంటేనే సహజమగు వీక్షణకు (ముక్తికి) అవకాశం ఉంటుందని అతడి ప్రతిపాదన​.

అందువలన అన్నమాచార్యులు "నువ్వు  ఋణపడిలేవు" అని సూచిస్తున్నాడని మనం నిర్ధారణకు రావచ్చు. "కానీ పరిస్థితులు కల్పించు కపటపు భావనలతో (స్థితివ్యాజముతో) నిన్ను అలా అనుకునేలా చేస్తుంది" అంటున్నారని భావించవచ్చు. ఇది 3వ చరణంలో మరింత స్పష్టమవుతుంది.

అన్వయార్ధము:  ఓ మానవా, నీకై నీవు సృష్టించిన బానిసత్వపు గొలుసులను గుర్తించు.

ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ
జిక్కులు సిలుగులుఁ జింతలునే
దిక్కెవ్వరు యీ తీదీపులలో
దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక అప్పుల॥ 

ముఖ్య పదములకు అర్ధములు: సిలుగులుఁ = ఉపద్రవములు;  యీ తీదీపులలో = యీ రాపిళ్ళలో, ఘర్షణలలో.

భావము: ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ చిక్కులు, చింతలు, ఉపద్రవములే కదా! జీవనమను యీ రాపిళ్ళలో, ఘర్షణలలో దిక్కు  దేవుఁడెఁకాక వేరెవరు? 

వివరణము: ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ / జిక్కులు సిలుగులుఁ జింతలునే: బాబులారా, ఏరోజుదైనా ఒక వార్తాపత్రికలో శీర్షికలు చదవండి. తర్వాతిరోజేమి జరుగునోయని ప్రపంచం ఉద్విగ్నతతో వుందని మీరు కనుగొంటారు. అత్యున్నత వేదికలపై ప్రస్ఫుటంగా ఘర్షణ వైఖరి కొట్టొచ్చేలా చర్చలు, న్యాయమును కాల రాచుట కానవస్తున్నవి. అల్ల​కల్లోలం అనేది ఈనాటి నియమం.  అన్నమాచార్యులు తన వర్ణనలను చాలా సహజముగా చిత్రించెను అనడానికి ఇంకా సందేహం ఉందా?

ఈ సందర్భంగా​ గుయెర్నికా అన్న చిత్రమును పరీక్షగా వీక్షించమని విన్నపము. సుప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో జూన్ 1937లో పూర్తి చేసిన మ్యూరల్-సైజు తైలవర్ణ చిత్రం. బూడిద రంగు, నలుపు, తెలుపుల్లో చిత్రీకరించిన తైలచిత్రం పలువురు కళా విమర్శకుల నుంచి చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన యుద్ధ వ్యతిరేక కళాఖండంగా పేరొందింది. 11 అడుగుల 5 అంగుళల పొడవు, 25 అడుగుల 6 అంగుళాల వెడల్పుతో, విస్తారమైన పరిమాణంలోని మ్యూరల్ చిత్రం హింస, గందరగోళాల్లో ప్రజల బాధలను ప్రతిబింబిస్తుంది. 



చిత్రాన్ని ఉత్తర స్పెయిన్ లోని బాస్క్యూ ప్రాంతపు పల్లెటూరు అయిన గుయెర్నికాపై స్పానిష్ జాతీయవాదుల కోరికపై నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ యుద్ధ విమానాలు జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా సృజించారు. పూర్తయ్యాకా గుయెర్నికాను 1937లో ప్యారిస్’లో జరిగిన అంతర్జాతీయ ఫెయిర్’లో స్పానిష్ ప్రదర్శనలో ప్రదర్శించారు. 

బాధలు భరించలేక వికృతంగా అరుస్తున్న గుర్రం, ముఖము కకావికలమై జాలిగొలుపు ఎద్దు, చనిపోయిన శిశువును చేతుల్లోపెట్టుకుని దీనంగా అరుస్తున్న స్త్రీలు, శరీరము ఛిన్నాభిన్నమైన సైనికుడు, ఆకాశము వైపు నిస్సహాయంగా చేతులెత్తిన జీవులు అగ్నిజ్వాలలు కూర్పులో ముఖ్యమైనవి. మనలో రేగుతున్న అంతర్యుద్ధం కూడా గుయెర్నికా వంటిదే. 

చాలా ప్రసిద్ధి చెందినది కావడం వల్ల మీలో చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. దీనిపై మంచి వివరణ క్రింద చూపిన లింకులో చూడవచ్చు#1.  ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ / జిక్కులు సిలుగులుఁ జింతలునే అనునది గుయెర్నికాలో చూపినంత సముచితంగా మరెక్కడా చిత్రించబడలేదని గమనించ ప్రార్ధన​. అన్నమాచార్యులు సిద్ధాంతాన్ని ప్రతిపాదించు తత్వవేత్త కాడు. స్వయంగా భగవంతునితో ఏకత్వంచెంది, అనుభవపూర్వకముగాని స్థితిలో తన కళ్ళతో చూడగలిగినదాన్ని వ్రాశాడు. ఆయన ఒక రాజునో, ఒక వర్గాన్నో ప్రసన్నం చేసుకోవడానికి కవిత్వము వ్రాయలేదు. 

యేది దలంచిన నేకాలంబును
సూదులమూఁటల సుఖములివి
కాదన నౌననఁ గడ గనిపించఁగ
పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే         అప్పుల॥

 

ముఖ్య పదములకు అర్ధములు: పోదికాఁడు = పోటుకాఁడు = meaning a capable person for combat; here and in some other verses also Annamacharya had used this word. This is a special word used by Annamacharya} = వీరుడు. 

భావము: ఏ రకముగా చూచినా, మానవ మనుగడలో కోరు సుఖాలు నిజమైన సూదులమూఁటలే. నువ్వు ఔనన్నా, కాదన్నా అడుగే లేని నీ మనస్సుచివరలకంటా చూడగలిగే పోదికాఁడు (హీరో) ఒక్కడే ఉన్నాడు. 

వివరణముగడ గనిపించఁగ: అంటే ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని దాని మూలాల నుండి ఇప్పటి వరకు కనుగొనవచ్చు. సామాన్యులమైన మనకు వాటిపై అవగాహనే వుండదు. హృదయమంతా భక్తితో నిండిన అన్నమాచార్యుల వంటి వారు జీవితం యొక్క సంపూర్ణతను అనుభవించగలరని చెబుతారు. 

‘పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే’ భగవద్గీతలోని శ్లోకాన్ని సూచించుచున్నది. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః । శరీరస్థోఽపి కౌంతేయ న కరోతి న లిప్యతే ।। 13-32 ।। భావము: ఓ కుంతీ తనయుడా,  నాశములేని పరమాత్మ దేహములోనే ఉన్నా భౌతిక లక్షణములతో ప్రభావము చెందక, నిర్వికారుడై ఏమాత్రం కళంకితుడు కాడు.

అందువలన ఈ చరణంలో అన్నమాచార్యులు మనిషిని సుఖాలపై కన్నెయకుండా తన హృదయంలో ఉన్న భగవంతుడిని కనుగొనమని  కోరుతున్నాడు.

అన్వయార్ధము:  ఓ మానవా, చివరికి ముళ్ల సంచులుగా నిరూపించబడే ఆనందాలకు అతీతంగా, మీ హృదయంలోనే నివసిస్తున్న ఆ గొప్ప నిధిని కనుక్కో.

యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీఁ
బన్నిన తమతమ బంధములు
వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ
వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు అప్పుల॥ 

ముఖ్య పదములకు అర్ధములు: యెన్నఁడు వీడీ = యెన్నడూ వీడని; నెప్పుడు వాసీఁ = ఎప్పుడూ వృద్ధినొందు.

భావము: నీవే యేర్పరచుకున్న యీ బంధములు యెన్నడూ వీడవు, ఎప్పుడూ వృద్ధినొందును. ఉన్నతి కలిగించి, ఒప్పుకొనదగునవి నేర్పు  వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు

వివరణము: ‘బన్నిన తమతమ బంధముల’ ద్వారా  బంధాలు పుట్టుకతో వచ్చేవి కావని, వయస్సుతో పాటు వ్యక్తి ద్వారా తెలియకుండానే సృష్టించబడతాయని సూచించారు. అందువలన మానవుడు బంధాలను యేర్పరచునది విచ్ఛిన్నం చేయగలిగినది కూడా  మనిషేనని అన్నమాచార్యులు స్పష్టం చేశారు. అయితే మానవుడు సత్వర ఫలితాలను కోరుకుంటాడు. గంటగంటకూ తన ఆధ్యాత్మిక ప్రయాణ పురోగతిని సమీక్షి౦చాలని ఆయన కోరుకు౦టున్నాడు. బంతి బంతికీ పురోగతిని అందించడానికి మానవ జీవితం క్రికెట్ మ్యాచ్ కాదా? కానీ దురదృష్టవశాత్తూ, దే మన నిజమైన వైఖరి.

అందుకే అన్నమాచార్యులు ఎప్పుడూ సహనము, ఓపికలు పాటించాలని ఉద్భోదించారు.  {ఉదాహరణకు: వోపి నీ దాస్యము చేరి వొప్పెఁగాక: సహనంతో మరియు ఓర్పుతో నీ సేవలో పాల్గొనడం ద్వారా, నా ఆత్మకు ఎక్కువ తక్కువ తారతమ్యాల బాధ తొలగి ఒప్పింది.}

 

References and Recommendations for further reading:

#1 Picasso's Guernica: Great Art Explained - YouTube

-X-The End-X-

159 appulavArE aMdarunu (అప్పులవారే అందరును)

 ANNAMACHARYULU

159 అప్పులవారే అందరును

(appulavArE aMdarunu)

for Telegu (తెలుగు) Version press here

the tumultuous world

Synopsis:the world as it stands today is intensely violent, divided and apathetic. However, for the man, his internal strife is paramount”.   

Summary of this Poem:

Chorus: We all are debtors. Where is this doner who is circulating this debt? Implied Meaning: O man, recognise the chains of bondage you created.

Stanza 1: All over the world we see only troubles, complaints, and regrets. Who else but God can we hope for salvation and refuge in such hostilities of life?

Stanza 2: These pleasures we eye are genuinely thorny bags in every possible sense and in all periods of human existence. Believe it or not, there is only one hero who can fathom the depths of your heart (to find the end of your thinking). Implied Meaning: O man, beyond the pleasures which eventually prove to be thorny bags, find that great treasure residing in your heart.

Stanza 3: The bonds you have subconsciously planned will not go away. Instead, they keep getting stronger. To make you climb the heights and guide you to good deeds, Lord Vishnu in the form of Venkateshwara is there. 

Detailed Presentation. 

Introduction: Annamacharya’s poems are hard nuts to crack. This power packed poem challenges our abilities to differentiate truth from false. Practicality of his observations will continue to mesmerise. He is an enigma. 

కీర్తన:

రాగిరేకు:  13-5 సంపుటము: 1-81

POEM

Copper Leaf:  13-5 Volume: 1-81

అప్పులవారే అందరును
కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ అప్పుల॥
 
ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ
జిక్కులు సిలుగులుఁ జింతలునే
దిక్కెవ్వరు యీ తీదీపులలో
దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక అప్పుల॥
 
యేది దలంచిన నేకాలంబును
సూదులమూఁటల సుఖములివి
కాదన నౌననఁ గడ గనిపించఁగ
పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే అప్పుల॥
 
యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీఁ
బన్నిన తమతమ బంధములు
వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ
వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు అప్పుల॥
appulavArE aMdarunu
kappaga dippaga gartalu vErI appula
 
ekkaDa chUchina nI prapaMchamuna
jikkulu silugulu jiMtalunE
dikkevvaru yI tIdIpulalO
dikkumukkulaku dEvuDekAka appula
 
yEdi dalaMchina nEkAlaMbunu
sUdulamUTala sukhamulivi
kAdana naunana gaDa ganipiMchaga
pOdikADu talapuna gala DokaDE  appula
 
yennaDu vIDI neppuDu vAsI
bannina tamatama baMdhamulu
vunnati sEyaga voppulu nerapaga
vennuDu vEMkaTavibhuDE kalaDu appula

 

Details and Explanations: 

అప్పులవారే అందరును
కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ అప్పుల॥

appulavArE aMdarunu
kappaga dippaga gartalu vErI appula 

Word to word meaning: అప్పులవారే (appulavArE) = debtors; అందరును (aMdarunu) = all of us; కప్పఁగఁ (kappaga) = to cover; దిప్పఁగఁ (dippaga) = to rotate; గర్తలు (gartalu) = the doers; వేరీ (vErI) = where?

Literal meaning: We all are debtors. Where is this doner who is circulating this debt?

Explanation: Though this is a very short poem, still filled with force of a dynamite.  Annamacharya is asking us to find the real one who turned us the debtors. If we can, we would have solved the mystery of life.

Famous Latin thinker & writer Publilius Syrus said “Debt is the slavery of the free”. Annamacharya saying here that we all are debtors, in a way implying that we are not free.

English writer and philosopher, Alan Wilson Watts said that “We do not “come into” this world; we come out of it, as leaves from a tree. As the ocean “waves,” the universe “peoples.”

We’re not separate from this universe. We’re interwoven in the cosmos, a part of the energetic patterns of spacetime. We’re like waves in an ocean. Always changing, transforming, connected to more than merely ourselves. Thus, let us accept that we are from this world – from the debt-ridden people. So are we.

Therefore, the right action is to dissociate from “what connects us with this world”. Most perplexing thing is that when things are so clear, why man cannot come out of the debt? Let me explain this with the help of a surrealist painting titled the Key to Dreams by famous Belgian artist Rene Magritte. As a child, we were taught 'A', 'B', 'C' by taking a picture and showing the corresponding letter below it. But here, in this painting, René Magritte confuses us by making the name written below the pictures irrelevant.

The poetry of this image Key to Dreams dispenses with any symbolic significance, old or new.” Thus, Magritte is saying that we associate wrong things and wrong notions and get chained to this world. Another significant implied in this painting is that this conditioning starts from very young age, i.e even before we start learning alphabets.  Only when we dispense with metaphorical thinking and free of association, there exists a possibility for liberation. 

This is also the meaning of Bhagavad-Gita verse:  ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् | ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ||4-24|| brahmārpaṇaṁ brahma havir brahmāgnau brahmaṇā hutam / brahmaiva tena gantavyaṁ brahma-karma-samādhinā Purport: The act, the ladle, the offering, the fire, the doer, the offered are Brahman. It means that everything in this world is sacred. However, it’s our conditioning (ignorance) that says something as ‘sacred’ and some as ‘not’. Therefore, the implied meaning follow as below.

Therefore, we may conclude that Annamacharya is suggesting “man find if you are in debt. But your conditioning makes you think so”. This becomes clearer in 3rd stanza.

Implied Meaning: O man, recognise the chains of bondage you created. 

ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ
జిక్కులు సిలుగులుఁ జింతలునే
దిక్కెవ్వరు యీ తీదీపులలో
దిక్కుముక్కులకు దేవుఁడెఁకాక అప్పుల॥

ekkaDa chUchina nI prapaMchamuna
jikkulu silugulu jiMtalunE
dikkevvaru yI tIdIpulalO
dikkumukkulaku dEvuDekAka appula

Word to word meaning: ఎక్కడ (ekkaDa) = anywhere; చూచిన (chUchina) = observe;  నీ ప్రపంచమునఁ (nI prapaMchamuna) = in our this world; జిక్కులు (jikkulu) = problems; సిలుగులుఁ (silugulu) = inconveniences; జింతలునే (jiMtalunE) = only grievances, only regrets; దిక్కెవ్వరు (dikkevvaru) = who we can look forward to save; యీ తీదీపులలో (yI tIdIpulalO) = in these acrimonies;    దిక్కుముక్కులకు (dikkumukkulaku) = saviour, provide refuge; దేవుఁడెఁకాక (dEvuDekAka) = except the God. 

Literal meaning: All over the world we see only troubles, complaints and regrets. To whom else but God can we hope for salvation and refuge in such hostilities of life?

Explanation: ekkaDa chUchina nI prapaMchamuna / jikkulu silugulu jiMtalunE (ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ / జిక్కులు సిలుగులుఁ జింతలునే) Sir, read the headings of any newspaper. You will find the world is in tension to face tomorrow. So many hostile discussions in the highest forums. Obviously, truth is being twisted. Wars happening. Turmoil is the rule of the day.  Is there any doubt that Annamacharya is very accurate in his description? 

Let me present a painting titled Guernica by famous painter Pablo Picasso. It is one of his best-known works, regarded by many art critics as the most moving and powerful anti-war painting in history. 



The grey, black, and white painting, on a canvas 3.49 meters tall and 7.76 meters across, portrays the suffering wrought by violence and chaos. Prominent in the composition are a gored horse, a bull, screaming women, a dead baby, a dismembered soldier, and flames. 

Dear friends, the world as it stands today is more intensely violent, more divided and more apathetic, than the times faced by Picasso. The internal strife we feel is similar to Guernica painting. 

Being so famous, most of you may be knowing Guernica already. More details can be found in the video link given in the reference section#1. We shall limit our discussion to ekkaDa chUchina nI prapaMchamuna / jikkulu silugulu jiMtalunE (ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁ / జిక్కులు సిలుగులుఁ జింతలునే) is never more appropriately depicted as in Guernica. This Annamacharya is not philosopher to expound a theory. He wrote what he could see with his eyes in that oneness with God. He did not write the poems to appease a king or a section of people. 

యేది దలంచిన నేకాలంబును
సూదులమూఁటల సుఖములివి
కాదన నౌననఁ గడ గనిపించఁగ
పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే         అప్పుల॥

yEdi dalaMchina nEkAlaMbunu
sUdulamUTala sukhamulivi
kAdana naunana gaDa ganipiMchaga
pOdikADu talapuna gala DokaDE         appula 

Word to word meaning: యేది (yEdi) whatever; దలంచిన (dalaMchina) = thought or imagination; నేకాలంబును (nEkAlaMbunu) = any period; సూదులమూఁటల (sUdulamUTala) = bags of thorns; సుఖములివి (sukhamulivi) = these pleasures;  కాదన నౌననఁ (kAdana naunana) = Either to confirm or contradict; గడ గనిపించఁగ (gaDa ganipiMchaga) = to see/observe the end;  పోదికాఁడు = పోటుకాఁడు = meaning a capable person for combat; here and in some other verses also Annamacharya had used word. This is a special word used by Annamacharya} = వీరుడు, our hero; తలఁపునఁ (talapuna) = in the mind; గలఁ డొకఁడే (gala DokaDE) = there exists is only one.

Literal meaning: These pleasures we eye are genuinely thorny bags in every possible sense and in all periods of human existence. Believe it or not, there is only one hero who can fathom the depths of your heart (to find the end of your thinking).

Explanation: gaDa ganipiMchaga గడ గనిపించఁగ: means that a person can find his life journey from its origins to till now. We ordinary people have no access to such information. It is said the liberated souls could feel wholeness of life.

pOdikADu talapuna gala DokaDE (పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే):  is related to this verse in Bhagavad-Gita अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्यय: | शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते || 13-32|| anāditvān nirguṇatvāt paramātmāyam avyayaḥ śharīra-stho ’pi kaunteya na karoti na lipyate Purport: O son of Kunti, the imperishable Supreme Being situated within the body. He is not affected by material qualities and remains neutral. 

Thus, in this stanza, Annamacharya is asking the man to discontinue the pursuance of pleasure and find the God situated in his heart.

Implied Meaning: O man, beyond the pleasures which eventually prove to be thorny bags, find that great treasure residing in your heart. 

యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీఁ
బన్నిన తమతమ బంధములు
వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ
వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు అప్పుల॥
 
yennaDu vIDI neppuDu vAsI
bannina tamatama baMdhamulu
vunnati sEyaga voppulu nerapaga
vennuDu vEMkaTavibhuDE kalaDu appula

Word to word meaning: యెన్నఁడు వీడీ (yennaDu vIDI) = when will they go away; నెప్పుడు (neppuDu) = always; వాసీఁ (vAsI) = increasing, becoming stronger; బన్నిన (bannina) = planned; తమతమ (tamatama) = your; బంధములు (baMdhamulu) = bonds; వున్నతి (vunnati) = heights; సేయఁగ (sEyaga) =to scale;  వొప్పులు (voppulu) = appropriate things, virtuous deeds; నెరపఁగ (nerapaga) = నెఱవేర్చు, to fulfil; వెన్నుఁడు (vennuDu) = Lord Vishnu; వేంకటవిభుఁడే (vEMkaTavibhuDE) = Lord Venkateswara; కలఁడు (kalaDu) = exists.

Literal meaning: The bonds you have subconsciously planned will not go away. Instead, they keep getting stronger. To make you climb the heights and guide you to good deeds, Lord Vishnu in the form of Venkateshwara is there.

Explanation: By the wording bannina tamatama baMdhamulu బన్నిన తమతమ బంధములు is indicating that the bonds are not congenital but created with age by the person. Therefore, Annamacharya is clear that man can break the bonds and it’s for the man to break the bonds.

However, Man wants quick results. He likes to review his progress of spiritual journey hour by hour. Is human life a cricket match to provide ball by ball progress? But regrettably, this is our actual displayed attitude. For that Annamacharya always advised patience. {example: vOpi nI dAsyamu chEri voppegAka వోపి నీ దాస్యము చేరి వొప్పెఁగాక) = By participating in your devotional service with patience and forbearance, my soul is persuaded to transcend these variations of high and low}

 

References and Recommendations for further reading:

#1 Picasso's Guernica: Great Art Explained - YouTube

-X-The End-X-

 

 


 

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...