ANNAMACHARYA
107. వీనిఁ జూచియైన నేము
(vIni jUchiyaina nEmu)
On Wholeness of Life
Introduction: In this
distinctive and thought-provoking poem, Annamacharya comes down heavily on our
present living. He does not mince words to condemn our acts to bring fore the
fact that we don’t recognize what life is. Obviously, man do not learn by
observing others. He says,
systematically we slip from the path of life to spend it in dissipation.
Great philosopher Annamacharya said that we get
eluded by symbols. Particularly these signs relating to God and love become so
intertwined that we often miss the wood from the trees. Illusionary pursuit of
forms and shapes is mere waste of time.
Annamacharya’s unique observation is that man
makes a unitary pursuits like money, art etc as his motive in life instead of unifying
with the nature to unfold the wholeness of life.
ఉపోద్ఘాతము: ఆలోచింపజేసే ఈ విశిష్టమైన కీర్తనలో అన్నమాచార్యులు మన ప్రస్తుత జీవన శైలిపై తీవ్రంగా మండిపడ్డారు. జీవితం అంటే ఏమిటో మనం గుర్తించలేకున్నామనే కఠోర వాస్తవాన్ని ముందుకు తీసుకురావడానికి, మన అవివేకపు చర్యలను ఖండించడానికి ఆయన వెనుకాడడు. సహజంగానే, మనిషి ఇతరులను గమనించి నేర్చుకోడన్నారు. ఒక క్రమపద్ధతిలో మనం జీవిత మార్గం నుండి జారిపోయి పెడ త్రోవలు పడుతున్నామన్నారు.
ఈ గొప్ప తత్వవేత్త చిహ్నాలు, గుర్తులు మనల్ని భ్రమింప జేస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా భగవంతుడు, ప్రేమ, మరియు కరుణకు సంబంధించిన ఈ ఆనవాళ్ళు అనేక విషయానుభవములతో ముడిపడి, ఒక దాని నుండి మరొకటి విడతీయు పనిలో మునిగి అసలు విషయమును మరచుతామన్నారు అన్నమాచార్యులు. రూపాలు, ఆకారము మరియు శిల్పాలను పట్టుకొని వ్రేలాడడమే భ్రాంతియన్నారు.
మనిషి ప్రత్యేకించి జీవితం యొక్క సంపూర్ణతను కనుగొనడానికి
ప్రకృతితో మమేకం కాకుండా ధనము, కళలు, చదువు అను ఎదో ఒక రంధితో జీవితమంతా పాకులాడుతూ వృధా చేసుకుంటాడన్న
అన్నమాచార్యుల పరిశీలన గమనింప తగ్గది.
కీర్తన:
వీనిఁ జూచియైన నేము విరతిఁ బొందగలేము పూని మా బ్రదుకిందుఁ బోలదాయఁగా ॥పల్లవి॥
పరుల వేడఁగబోవు పరనిందకుఁ జొరవు పరపురుషార్థమే ఫలవృక్షతతులెల్ల
నరులమై ఘనులమై నానాబుద్ధు లెఱిఁగి
పొరి మాబ్రదుకు లిందుఁబోలదాయఁగా ॥వీనిఁ॥
కామక్రోధాదులు లేవు కామతత్వ మెఱఁగవు కామించినట్లవు నెక్కడనైనా శిల లివి
దీమసము గలిగియుఁ దెలివి గలిగియును
భూమిలో మాబ్రదు కిందుఁబోలదాయఁగా ॥వీనిఁ॥
వొకరిఁ గొలువఁబోవు వొకపంట సేయఁబోవు వొకమానిగడు చేరివుండు పక్షు లాడనాడ
వొక శ్రీ వేంకటపతి నమ్మియుండలేము
మొకెమో మాబ్రదు కిందుఁబోలదాయఁగా ॥వీనిఁ॥
|
vIni jUchiyaina nEmu virati boMdagalEmu pUni mA bradukiMdu bOladAyagA ॥pallavi॥
parula vEDagabOvu paraniMdaku joravu parapurushArthamE phalavRkshatatulella
narulamai ghanulamai nAnAbuddhu le~rigi
pori mAbraduku liMdubOladAyagA ॥vIni॥
kAmakrOdhAdulu lEvu kAmatatva me~ragavu kAmiMchinaTlavu nekkaDanainA Sila livi
dImasamu galigiyu delivi galigiyunu
bhUmilO mAbradu kiMdubOladAyagA ॥vIni॥
vokari goluvabOvu vokapaMTa sEyabOvu vokamAnigaDu chErivuMDu pakshu lADanADa
voka SrI vEMkaTapati nammiyuMDalEmu
mokemO mAbradu kiMdubOladAyagA ॥vIni॥
|
Details and Explanations:
వీనిఁ జూచియైన నేము విరతిఁ
బొందగలేము
vIni jUchiyaina nEmu virati boMdagalEmu
Word to Word meaning: వీనిఁ (vIni) = these things; జూచియైన (jUchiyaina) = watching నేము (nEmu) = we; విరతిఁ(virati)= dispassionate; బొందగలేము (boMdagalEmu) = do not become; పూని (pUni) = intentionally taking up; మా (mA) = our; బ్రదుకిందుఁ (bradukiMdu)= life here; బోలదాయఁగా (bOladAyagA)= became incomparable;
Literal meaning: Even after watching these things we do not strive to be dispassionate. By our intentional acts, incomparable life gets reduced to dissipation.
Explanation: What is meant by these? We know
Siddhartha on seeing a sick man, an old man and a corpse learnt that life is
not full of roses. Watching these made young prince to renounce the world and
seek the truth operating from which, man do not get touched by sorrow.
It will not be out of place to cite a beautiful
poem by poem by Bhadrachala Ramadasu:
Dorasina
kāyamulmudimi tōcinam̐jūci prabhutvamulsirul
Purport: O Rama! The sea of Compassion! What is the fate of
those who witness these stark truths every day, however are not freed from the
bondage of passion?
He does not notice his ascending age and continues
to think he will uphold the Monarchy, Power & Wealth for ever.
Do not recognise the old age in body though it swells
like the salt flakes on beautiful walls with the progress of time.
Takes pride in his own permanency notwithstanding his fellow beings repeatedly vanishing from the face of the earth
Important word used is పూని (pUni), indicating purposefully taking up wrong activity. Annamacharya says we do not understand this beautiful opportunity called life and persistently man is reducing it to indulgence and pleasure seeking.
Implied meaning: O man! You don’t learn from the
collective experiences. Childishly you diminish the great opportunity called
life to a punishment.
భావము: కనీసము ‘వీటిని’ చూచికూడా విరతిని పొందము.
పూనుకొని మన ఇక్కడి బదుకును అసలు ‘జీవితం’తో పోలకుండా చేసుకుంటున్నామే!
వివరణము: ‘వీటిని’ అంటే ఏమిటో? అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని, వృద్ధుడిని మరియు శవాన్ని చూసిన సిద్ధార్థుడు జీవితం పూలపానుపు కాదని తెలుసుకున్నాడు. ‘వీటిని’ చూసి ఆ యువరాజు ప్రపంచాన్ని
త్యజించి, మనిషిని దుఃఖం తాకకుండా ఉంచు సత్యాన్ని
అన్వేషించేలా చేసింది.
ఇదే అర్ధమిచ్చు భద్రాచల రామదాసు
విరచిత దాశరథీ శతకము నుండి క్రింది పద్యాన్ని చూడండి.
ఉ. దొరసిన కాయముల్ముదిమి
తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్
తాత్పర్యము :
గోడలు ఉప్పు ఊరి పెచ్చులు ఊడిపోయి అందవికారముగా
తయారైనట్లే శరీరము లోని ముసలితనము బయటపడుట చూచి;
రాచఱికము, అధికారము, సంపదలు ప్రకాశముగా భావించి;
మరి భూమిమీద తమ తోటివారు తమ కళ్ళ ముందు పరమపదించుట
పలుమార్లు చూచి కూడా;
తరుగుచున్న ఆయువును గమనింపక;
మోహము, బంధముల నుండి విముక్తులు కాకుండా వున్నవారి కేమి గతి? దాశరథీ! కరుణాపయోనిధీ!
అన్నమాచార్యులు ‘పూని’ అని చెప్పి, జీవితం అనే ఈ అందమైన అవకాశాన్ని మనం అర్థం చేసుకోలేక మనము పూనుకొని మరీ దానిని భోగలాలసతతోనూ మరియు ఆనందాన్వేషణతోనూ నింపి నేలపాలు చేసుకుంటున్నామని అన్నారు.
అన్వయార్ధము: ఓ మానవుడా! నువ్వు నీ చుట్టూవున్న వారిని చూచి నేర్వవేమి? తెలిసీతెలియని పిల్లల్లా కావాలని యీ సువర్ణావకాశాన్ని ఒక శిక్షలా మార్చుకోకు.
పరుల వేడఁగబోవు పరనిందకుఁ జొరవు
parula vEDagabOvu paraniMdaku joravu
Word to Word meaning: పరుల (parula) = others; వేడఁగబోవు (vEDagabOvu) = implores for favours; పరనిందకుఁ (paraniMdaku) = blaming others; జొరవు (joravu) = goes on to; పరపురుషార్థమే (parapurushArthamE) = helping others; ఫలవృక్షతతులెల్ల (phalavRkshatatulella) = all the fruit bearing and other trees; నరులమై (narulamai) = being humans; ఘనులమై (ghanulamai) = being great; నానాబుద్ధు లెఱిఁగి (nAnAbuddhu le~rigi) = having much knowledge; పొరి (pori) = క్రమముగా, Duly, regularly, మా (mA) = our; బ్రదుకు లిందుఁ (braduku liMdu) = life here; బోలదాయఁగా (bOladAyagA) =not equal;
Literal meaning: Man implores for favours from others. He does not feel shy to blame others. The fruit bearing and other trees teach us that helping others is the aim of life. We humans, despite having intelligence, duly and invariably slip out to an existence not equal to life.
Explanation: In a remarkable statement, Annamacharya by using word pori (పొరి= క్రమముగా = systematically) said that we degenerate ourselves definitely and gradually away from the path of life. Thus, this deterioration is not accidental, but due to intentional foolish acts of man.
Just imagine, from the morning to night, we are seeking favours from others, like expecting sops from government, reduction in taxes from local authorities, better medical facilities for free etc., The less we talk about our ability to criticise others, the better it is.
Now consider the wise saying in Sanskrit
below:
छायामन्यस्य कुर्वन्तं तिष्ठन्ताम् स्वयमातपे |
फ़लानार्पय परार्थाय वृक्षाः सतपुरुषाः इव
||
Purport: Trees provide cool shade to others but themselves stand in the scorching heat of the Sun and provide their fruits for the benefit of others. Noble and righteous persons are also like the trees and live their life for the benefit of mankind.
There is no wonder in Annamacharya saying that man is missing the aim of life i.e., serving others.
Implied meaning: Man, instead of serving others expects benefits from others. He does not think before criticising others. Thus, he systematically deviates from the path of life to run down into tasteless existence.
భావము: మనిషి పరులను వేడబోతాడు. పరనిందకుఁ జంకడు. ఫలము నందించు వృక్షములను చూచి పరపురుషార్థమే జీవితమని ఎంచడు. నరుడై, ఘనుడై నానాబుద్ధులుండి కూడా అసలు ‘జీవితం’ఎరుగక, దానితో సాటికిరాని మనుగడ సాగిస్తున్నాడు.
వివరణము: విశేషమైన ప్రకటనలో, అన్నమాచార్యులు పోరి (= క్రమముగా) అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా మనం
ఖచ్చితంగాను మరియు క్రమక్రమంగాను అసలైన జీవన మార్గానికి దూరమౌతున్నామని చెప్పారు.
అందువల్ల, ఈ క్షీణత
ప్రమాదవశాత్తు కాదు ఉద్దేశపూర్వకమైన మనిషి యొక్క (మొదటి రెండు పంక్తుల్లో చెప్పిన) అవివేకపు చర్యల
ఫలితమే అనుకోవచ్చు.
ఒక్కసారి ఊహించండి, ఉదయం నుండి రాత్రి వరకు, మనం ఇతరుల నుండి ఎలాంటి సహాయాన్ని కోరుతున్నామో!
ప్రభుత్వం నుండి ఉచిత పధకాలను ఆశించడం, స్థానిక అధికారులను పన్నులు తగ్గించడని వేడుకోవడము, ఉచితంగా మెరుగైన వైద్య సదుపాయాలు కావాలనుకోవడం వగరాలు. ఇతరులను విమర్శించే
మన సామర్థ్యం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
క్రింది సంస్కృత సుభాషితమును చూడండి.
శ్లో. ఛాయామన్యస్య కుర్వంతి
తిష్ఠంతి స్వయమాతపే
భావము. వృక్షాలు తమ నీడను
అన్యులకు ఇస్తూ , తాము స్వయంగా ఎండలో
నిలబడుతున్నాయి. సత్పురుషుల వలె తమ ఫలములను కూడా పరులకే ఇస్తున్నాయి.
కాబట్టి, అన్నమాచార్యులు పరపురుషార్థమే ఫలవృక్షతతులెల్ల అనడంలో పెద్ద ఆశ్చర్యము లేదు.
అన్వయార్ధము: మనిషి, ఇతరులకు సేవ చేయడానికి బదులు ఇతరుల నుండి ప్రయోజనాలను ఆశిస్తాడు. ఇతరులను విమర్శించే ముందు మరొక మారు ఆలోచించడు. అందువలన, అతడు క్రమపద్ధతిలో జీవిత మార్గం నుండి స్థాయికి-విలువకు దూరమయ్యి రుచిలేని ఉనికిలోకి తప్పుకుంటాడు.
కామక్రోధాదులు లేవు కామతత్వ
మెఱఁగవు
kAmakrOdhAdulu lEvu kAmatatva me~ragavu
Word to Word meaning: కామక్రోధాదులు (kAmakrOdhAdulu) = desires and angers; లేవు (lEvu) = not there; కామతత్వ మెఱఁగవు (kAmatatva me~ragavu) = nor understand nature of desires; కామించినట్లవు (kAmiMchinaTlavu) = appears to be desiring; నెక్కడనైనా (nekkaDanainA) = at any rate, anyway; శిల లివి (Sila livi) = these are only forms and symbols; దీమసము (dImasamu) = ఉపాయము, నేర్పు, Cleverness; a contrivance, a stratagem; గలిగియుఁ (galigiyu) = having; దెలివి (delivi) = intelligence; గలిగియును (galigiyunu) = having; భూమిలో (bhUmilO) = on this earth; మాబ్రదు కిందుఁ (mAbradu kiMdu) = our life here; బోలదాయఁగా (bOladAyagA) = not a match;
Literal meaning: Truly the desires and angers does not exist outside you. However, man unwittingly, gets entangled in swirl of desires without understanding the nature of desire. In every sense, he gets eluded by forms and symbols; regardless of the cleverness and intelligence, on this earth our present subsistence is not a match with thing known as life.
Explanation: Greatest illusion is the forms and symbols. Careful look shows that language and alphabets are only symbols. But we fight over these things incessantly.
God is a symbol. The sculptures on God are intensely contested and the world has been divided. Recent blowing up of the Buddhas of Bamiyan is a glaring example. Mans mind creates these psychological structures made up the symbols, the statues and deludes him.
We created mental forms, particularly of woman. And this has been exploited by marketing agencies over many centuries.
Another great observation made by Annamacharya is that the desires and the anger felt by us are not external to us. They our internally generated feelings.
Implied meaning: O! Man!! You get deceived by conceptual formations of your own mind. Your great intelligence and wit are no avail in the face of illusionary power of the symbolic things. You continue your dull earthly existence.
భావము: కామక్రోధాదులు నీ నుంచి విడిగా లేవు.
కోరికల తత్వమును నీ వెరగవు. కానీ కామించినట్లనిపించును. జీవితము స్పృశించు అన్ని
కోణాలలోను ఆకారాలు, రూపాలు మరియు చిహ్నాలను వాస్తవమగు విషయములతో
పొరపడి, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ఉపాయము, నేర్పు, తెలివి కలిగికూడా మన యిప్పటి ప్రయాణము
నిజమైన జీవితానికి తూగలేదు.
వివరణము: శిల్పాలు, రూపాలు మరియు చిహ్నాలు గొప్ప భ్రమలోనికి నెట్టే
విషయములు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే
భాష మరియు వర్ణమాలలు చిహ్నాలు మాత్రమే అని తెలిసినా కానీ మనము వీటితో నిరంతరం సతమతమౌతాము.
దేవుడు ఒక ప్రతీక (అనగా ఒక ఊహ) మాత్రమే. భగవంతునిపై ఉన్న శిల్పాలు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి. ఎవరికివారు తమ అభిప్రాయాలకు తగ్గట్లుగా
ప్రపంచాన్నే విభజించేసుకున్నారు. ఇటీవల 2001లో ఆఫ్ఘనిస్థాన్ లోని బమియాన్‌లో
బుద్ధుల విగ్రహాలను పేల్చివేయడం ఒక అద్భుతమైన ఉదాహరణ. మనిషి మనస్సు చిహ్నాలు, విగ్రహాలతో రూపొందించబడిన ఈ మానసిక నిర్మాణాలను సృష్టించి మోసం చేస్తుంది.
ముఖ్యంగా స్త్రీ యొక్క రూపాన్ని సామాన్యుని
బలహీనతగా గ్రహించి, అనేక దశాబ్దాలుగా మార్కెటింగ్
ఏజెన్సీలచే మానవుల దోపిడీకి వాడబడింది.
అన్నమాచార్యులు చేసిన మరో గొప్ప పరిశీలన ఏమిటంటే, మనకు కలిగే కోరికలు మరియు కోపం బయట నుంచి మనలో ప్రవేశించినవి కావు. అవి మనలో
అంతర్గతంగా సృష్టించబడిన ప్రతిక్రియలు మాత్రమే.
అన్వయార్ధము: ఓ! నరుడా!! నువ్వు మనస్సు యొక్క ఊహాత్మక
నిర్మాణాల ద్వారా మోసపోతావు. నీ గొప్ప తెలివితేటలు యుక్తులు, నేర్పులు ప్రతీకాత్మక విషయాల
యొక్క కపట శక్తి ముందు వీగిపోవును. భూమి మీద నిస్తేజమైన ఉనికిని కొనసాగిస్తున్నావు.
వొకరిఁ గొలువఁబోవు వొకపంట
సేయఁబోవు
vokari goluvabOvu vokapaMTa sEyabOvu
Word to Word meaning: వొకరిఁ (vokari) = one; గొలువఁబోవు (goluvabOvu) = tends to pray, serve; వొకపంట (vokapaMTa) = one crop; సేయఁబోవు (sEyabOvu) = inclines to do; వొకమానిగూడు (vokamAnigUDu) = one nest of a tree; చేరివుండు (chErivuMDu) = gathers around; పక్షు లాడనాడ (pakshu lADanADa) = incessant movement of birds; వొక (voka) = one; శ్రీ వేంకటపతి (SrI vEMkaTapati) = Lord Venkateswara; నమ్మియుండలేము (nammiyuMDalEmu) మొకెమో (mokemO) {మొకమొకాలు చూచుకొను : ఒకరి మొఖము ఇంకొకరు చూచుట; మొకమోడు: ఓడిపోవడం వలన వచ్చే సిగ్గుతోటి కూడిన మొగముతో; వీటినించి మొకెమో = నీ ముఖమురా! అని అనుకోవచ్చు}= ‘నీ ముఖమురా’ లాగ, ‘వెర్రివాడా’ అని something like ‘you fool’; మాబ్రదుకిందుఁ (mAbradu kiMdu) = our life here; బోలదాయఁగా (bOladAyagA) = not essentially same;
Literal meaning: Man tends to serve one person. One fruition. Ventures to perform one crop. Like the birds’ chirp and crowd on one tree, men look for safety of nest. He cannot stay put by believing in one Lord Venkateswara. O fool! Your present survival is essentially not the same as life.
Explanation: Life is not learning an art alone. Life is not pursuit of pleasures alone. Life is not achieving certain things. Therefore, the significant thing said is that our pursuits are camouflaging our natural life. Whereas Annamacharya is talking of wholeness of life. These unitary pursuits are belonging to fragmented existence.
However, we have been preached all along, that struggles are part of life. Kindly appreciate that these struggles are only reactions, and they cannot possibly free the man. Annamacharya is saying instead of spending time on these battles, man should do it on meditation and penance.
Noteworthy thing said is that we donot believe in God and stay put where we have been left leaving everything to the God. Instead, we try to take the ‘dharma’ or ‘law’ into our hands like the heros of Indian cinema. Intelligence mentioned in previous stanza is knowing we are reacting instead of being in natural state. We know we have the sensitivity to know, but we don’t exercise it.
Implied meaning: Man due to his disbelief in God5, cannot hold himself in his natural state. Instead, he acts to make solace his life with unitary acts lie amassing money and arts. He continues his wretched existence.
భావము: ఒకరిని కొలువబోతాడు. ఒక పంట చేయబోతాడు. ఒకమాను గూడు చేరు పక్షుల వలె సందడి చేయును. (ఆ పక్షుల్లాగ ఒక గూటి రక్షణ కోరుకుంటాడు). ఐనప్పటికీ, ఒక్క శ్రీ వేంకటపతి నమ్మియుండలేడు. ఓ మూర్ఖమానవుడా! నీ ప్రస్తుత మనుగడ జీవితంతో సమానం కాదు.
వివరణము: జీవితం ఒక్క కళను నేర్చుట కాదు.
జీవితం కేవలం ఆనందాల కోసం మాత్రమే కాదు. జీవితం అంటే కొన్ని విషయాలను సాధించడమూ
కాదు. ఈ వృత్తి, వుద్యోగములు, ప్రయత్నములు మానవుని అసహజ చర్యలను సూచిస్తున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన యీ సాధనలు మన సహజ జీవితాన్ని పక్కనపెడుతున్నాయి.
కాగా అన్నమాచార్యులు సంపూర్ణ జీవితం
గురించి మాట్లాడుతున్నారు.
అయితే, పోరాటాలు జీవితంలో ఒక భాగమని
మనకు ఎప్పటి నుంచో బోధిస్తూవచ్చారు. అయ్యలారా! పోరటమనునది ఒక సహజ నైజమునకు
వ్యతిరేకముగా చేయు యత్నము. అది మనిషిని బంధాల నుండి విడిపించలేదు. అందువల్ల అన్నమాచార్యులు మనిషి
తన సమయాన్ని పోరాటాలలో కాకుండా ధ్యానం మరియు తపస్సులలో వెచ్చించాలి అని
చెబుతున్నాడు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, అన్నీ వదిలిపెట్టి మనం ఒక్క శ్రీ వేంకటపతిని నమ్మియుండలేము. దేవుణ్ణి విశ్వసించము మరియు దేవుడికే న చోటనే
ఉండిపోతాము. బదులుగా, మనము 'ధర్మం' లేదా 'చట్టం'ని సినిమా హీరోల వలె మన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. మునుపటి చరణంలో పేర్కొన్న తెలివితేటలు మనం సహజ
స్థితిలోఉండకుండా ప్రతిస్పందిస్తున్నామని తెలుసుకోవడమే. మనకు తెలుసుకోగల
సున్నితత్వం ఉందని తెలుసు, కానీ మనము దానిని ఉపయోగించము.
అన్వయార్ధము: దేవునిపై అపనమ్మకంతో మనిషి, తన సహజ స్థితిలో తనను తాను
ఉంచుకోలేక పోతాడు. బదులుగా,
అతడు జీవితంలో
ఎంతోకొంత సాంత్వన పొందేందుకు డబ్బు మరియు కళలను కూడబెట్టజూస్తాడు. అతడు తన హేయమైన
ఉనికిని గుర్తించడు.
Recommendations for further reading:
95. తహతహలిన్నిటికి తానే మూలము (tahatahalinniTiki
tAnE mUlamu)
Summary of this Keertana:
Even after watching these things, we do not strive to be dispassionate. By our intentional acts, incomparable life gets reduced to dissipation. Implied meaning: O man! You don’t learn from the collective experiences. Childishly you diminish the great opportunity called life to a punishment.
Man implores for favours from others. He does not feel shy to blame others. The fruit bearing and other trees teach us that helping others is the aim of life. We humans, despite having intelligence, duly and invariably slip out to an existence not equal to life. Implied meaning: Man, instead of serving others expects benefits from others. He does not think before criticising others. Thus, he systematically deviates from the path of life to run down into tasteless existence.
Truly the desires and angers does not exist outside you. However, man unwittingly, gets entangled in swirl of desires without understanding the nature of desire. In every sense, he gets eluded by forms and symbols; regardless of the cleverness and intelligence, on this earth our present subsistence is not a match with thing known as life. Implied meaning: O! Man!! You get deceived by conceptual formations of your own mind. Your great intelligence and wit are no avail in the face of illusionary power of the symbolic things. You continue your dull earthly existence.
Man tends to serve one person. One
fruition. Ventures to perform one crop. Like the birds’ chirp and crowd on one
tree, men look for safety of nest. He cannot stay put by believing in one Lord
Venkateswara. O fool! Your present survival is essentially not the same as
life. Implied meaning: Man due to his disbelief in God, cannot
hold himself in his natural state. Instead, he acts to make solace his life
with unitary acts lie amassing money and arts. He continues his wretched
existence.
కీర్తన సంగ్రహ భావము:
కనీసము ‘వీటిని’ చూచికూడా విరతిని పొందము. పూనుకొని మన ఇక్కడి బదుకును అసలు ‘జీవితం’తో పోలకుండా చేసుకుంటున్నామే! అన్వయార్ధము: ఓ మానవుడా! నువ్వు నీ చుట్టూవున్న వారిని చూచి నేర్వవేమి? తెలిసీతెలియని పిల్లల్లా
కావాలని యీ సువర్ణావకాశాన్ని ఒక శిక్షలా మార్చుకోకు.
మనిషి పరులను వేడబోతాడు.
పరనిందకుఁ జంకడు. ఫలము నందించు వృక్షములను చూచి పరపురుషార్థమే జీవితమని
ఎంచడు. నరుడై, ఘనుడై నానాబుద్ధులుండి కూడా అసలు ‘జీవితం’ఎరుగక,
దానితో సాటికిరాని మనుగడ సాగిస్తున్నాడు.
అన్వయార్ధము: మనిషి, ఇతరులకు సేవ చేయడానికి బదులు ఇతరుల నుండి
ప్రయోజనాలను ఆశిస్తాడు. ఇతరులను విమర్శించే ముందు మరొక మారు ఆలోచించడు. అందువలన, అతడు క్రమపద్ధతిలో జీవిత మార్గం
నుండి స్థాయికి-విలువకు దూరమయ్యి రుచిలేని ఉనికిలోకి తప్పుకుంటాడు.
కామక్రోధాదులు నీ నుంచి విడిగా
లేవు. కోరికల తత్వమును నీ వెరగవు. కానీ కామించినట్లనిపించును. జీవితము స్పృశించు
అన్ని కోణాలలోను ఆకారాలు, రూపాలు
మరియు చిహ్నాలను వాస్తవమగు విషయములతో పొరపడి, ఆ ప్రవాహంలో
కొట్టుకుపోతాడు. ఉపాయము, నేర్పు, తెలివి
కలిగికూడా మన యిప్పటి ప్రయాణము నిజమైన జీవితానికి తూగలేదు. అన్వయార్ధము: ఓ! నరుడా!! నువ్వు మనస్సు యొక్క ఊహాత్మక
నిర్మాణాల ద్వారా మోసపోతావు. నీ గొప్ప తెలివితేటలు యుక్తులు, నేర్పులు ప్రతీకాత్మక విషయాల
యొక్క కపట శక్తి ముందు వీగిపోవును. భూమి మీద నిస్తేజమైన ఉనికిని కొనసాగిస్తున్నావు.
ఒకరిని కొలువబోతాడు. ఒక పంట
చేయబోతాడు. ఒకమాను గూడు చేరు పక్షుల వలె సందడి చేయును. (ఆ పక్షుల్లాగ ఒక గూటి
రక్షణ కోరుకుంటాడు). ఐనప్పటికీ, ఒక్క శ్రీ వేంకటపతి నమ్మియుండలేడు. ఓ
మూర్ఖమానవుడా! నీ ప్రస్తుత మనుగడ జీవితంతో
సమానం కాదు. అన్వయార్ధము: దేవునిపై అపనమ్మకంతో మనిషి, తన సహజ స్థితిలో తనను తాను
ఉంచుకోలేక పోతాడు. బదులుగా,
అతడు జీవితంలో
ఎంతోకొంత సాంత్వన పొందేందుకు డబ్బు మరియు కళలను కూడబెట్టజూస్తాడు. అతడు తన హేయమైన
ఉనికిని గుర్తించడు.
Copper Leaf: 81-1 Volume 1-388
A beautiful keertana with an equally beautiful explanation💐💐💐
ReplyDeleteమనిషి కావాలని ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని,
ReplyDeleteఅధికారం,భోగానుభవం ఆనందాన్వేషణలో జీవితాన్ని వృధా చేసికొంటున్నాడు.
ఎందుకంటే ప్రాపంచిక విషయాలు తాత్కాలికమైన ఆనందాన్ని మాత్రమే యిచ్చి, చివరకు దుఃఖమునే మిగిలిస్తాయి. ఈ సంగతి తెలిసి కూడా మనిషి అసలైన పారమార్థిక జీవితాన్ని చేజార్చుకొంటున్నాడు.ఫలవృక్షములు లోకానికి చేసే సేవను చూచి అయినా మనిషి జీవన విధానాన్ని మార్చుకొనలేకున్నాడు.
తులసీదాసు యొక్క క్రింది దోహాలో ఆయన ఈ విధంగా అంటాడు:
तुलसी’ संत सुअंब तरु, फूलि फलहिं पर हेत।
इतते ये पाहन हनत, उतते वे फल देत||
సజ్జనులు, రసాలనిచ్చే ఫలవృక్షాలు లోకం కోసం పుష్పించి ఫలాలనిస్తాయి.ఒక ప్రక్క నుంచి రాళ్లతో కొట్టినా, అవమానించినా కాని వృక్షములు,సాధువులు లోకకళ్యాణం కోసం తినే ఫలాలను,జ్ఞానఫలాలను అందిస్తున్నాయి. పరోపకార బుద్ధితో అందరికీ హితమొనర్చు చున్నవి.
ఇన్ని చూచిననూ మనిషి పరోపకారం లేక పరనింద చేస్తూ,అరిషడ్వర్గములను నియంత్రించలేక,, జీవిత
పరమార్థమును తెలిసికొనలేక వ్యర్థజీవితమును గడుపుచున్నాడు కదా!యని అన్నమయ్య ఆలోచనలను రేకెత్తించు ఈ అద్భుతమైన కీర్తనలో
శ్రేయోమార్గమును లోకానికి నిర్దేశిస్తున్నాడు.
ఆణిముత్యం వంటి ఈ కీర్తనకు శ్రీనివాస్ గారి భావార్థము, వ్యాఖ్యానము, రామదాసు కీర్తన,సంస్కృత శుభాషితములతో అన్వయము బహు లెస్సగా నున్నవి.
ఓం నమో వేంకటేశాయ 🙏
కృష్ణ మోహన్