ANNAMACHARYA
What is Illusion?
Introduction: In this deeply philosophical inward journey, Annamacharya is describing how one should pursue God. As ever, he remains exceptional and sophisticated.
Meditation is not a reminiscence of the past. It must be pursued with all one's might, as a child does, oblivious to the dangers, difficulties, and consequences.
ఉపోద్ఘాతము: అధునాతనము, అసాధారణము అనిపించు, అబ్బురము కలిగించు తాత్విక అంతర్గత ప్రస్థానములో,
అన్నమాచార్యులు భగవంతుడిని ఎలా అనుసరించాలో వివరించారు.
ధ్యానము / తపస్సు అంటే గతాన్ని స్మరించుకోవడం కానే కాదు. ప్రమాదాలు, కష్టాలు మరియు
పర్యవసానాలను పట్టించుకోకుండా, చిన్నపిల్లవాడిలాగా, భగవంతుడే లక్ష్యముగా దానిని పూర్తి
శక్తితో ప్రయత్నించాలి
అన్నారు.
కీర్తన:
గోవింద
ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవు
గలుగఁగ పిందె పుట్టె నింతే కాక ॥పల్లవి॥
బూమిలో
నిద్రించువాఁడు పొద్దువేళ యేఱిఁగీనా నీమాయలో
మునిఁగి నన్ను నెఱిఁగీనా
కామించి
నీవు నన్నుఁ గరుణించి యేలుకోఁగా
నీమఱఁగువాఁడ
నని నేఁ డంటీఁ గాక ॥గోవింద॥
సరి
చంటి బిడ్డఁడు సంసార చింత లెంచీనా గరిమ
నజ్ఞానుఁడు కైంకర్య మెంచీనా
నిరతి
దయ దలఁచి నీవు పెర రేఁపఁగా
కెరలి
నే నీకు మొక్కితిఁ గాక ॥గోవింద॥
తుద
కెక్క సన్యాసి తొంటి కర్మము సేసిన యిదివో
నిన్నుఁ దలఁచి యీతలఁ దడవేనా
యెదుట
శ్రీ వేంకటేశ యిహపరములు నీవై
పొదిగి
పాలార్చఁగాను పొడవైతిఁ గాక ॥గోవింద॥
|
gOviMda mukuMda kRshNa
gOpInAtha narahari bUmilO nidriMchuvADu
podduvELa yE~rigInA sari chaMTi biDDaDu
saMsAra chiMta leMchInA tuda kekka sanyAsi
toMTi karmamu sEsina |
Details and Explanations:
గోవింద ముకుంద
కృష్ణ గోపీనాథ నరహరి
పూవు గలుగఁగ
పిందె పుట్టె నింతే కాక ॥పల్లవి॥
gOviMda mukuMda kRshNa gOpInAtha narahari
pUvu galugaga piMde puTTe niMtE kAka ॥pallavi॥
Word to
Word meaning: గోవింద (gOviMda) = Govinda; ముకుంద
(mukuMda)=
Mukunda;
కృష్ణ (kRshNa) = Krishna; గోపీనాథ
(gOpInAtha)
= Gopinatha; నరహరి (narahari) = Narahari; పూవు (pUvu) = flower; గలుగఁగ (galugaga) = happen, been, born; పిందె (piMde) = a young berry, the fruit just formed after, the
flower;
పుట్టె (puTTe) = germinate,
born, happen; నింతే కాక (niMtE
kAka) = that’s all;
Literal meaning: Govinda, Mukunda, Krishna, Gopinatha, Narahari! As the flowers happen the fruits form. (Soft concepts, thoughts are transformed into solid actions, deeds, avocations)
Explanation: In this, Annamacharya compared the Ideas/thoughts to flowers. As the flowers transform to fruits, the thoughts result in material actions.
According to this chorus, the material world is the outcome of the psychological world, It's pointless to act on the physical body (which is a result, conclusion), but it's critical to act on the cause. Therefore, man must act on his intellect, which is the cause.
Annamacharya also intended that acting on the present state of mind is of no use as it is the result of certain past actions. Thus, our mind and thoughts are steeped in the past. Whatever action emanating from it, is having roots in the past, therefore there is nothing new in it.
The wording poMchi
SarIrapubhOgamu luDigina chuMchubAvamulu sukRtamulE#1 పొంచి శరీరపుభోగము లుడిగిన / చుంచుఁబావములు
సుకృతములే When
body enjoyment ceases only then nascent (or fresh) feelings actually will have
chance to flower is worth mentioning in this context.
Implied
meaning: O lord! I perceive that Ideas/thoughts results in actions. My
present state is due to certain past actions. Therefore, considering it as
fresh and clean is my foolishness. Therefore, I must discard all my associations
with it.
భావము: గోవింద! ముకుంద! కృష్ణ! గోపీనాథ! నరహరి! పూవు గలుగఁగ పిందెలు
పుట్టుచున్నవి. (మృదు భావనలు ఘనమైన చర్యలుగా, కర్మలుగా, కార్యములుగా, వ్యాసంగములుగా
రూపాంతరము చెందుతాయి.)
వివరణము: ఇందులో అన్నమాచార్యులు భావనలను/ఆలోచనలను
పువ్వులతో పోల్చారు. పూలు ఫలాలుగా మారినట్లు, ఊహలు, చింతనలు, తలపులు భౌతిక చర్యలకు
దారితీస్తాయి.
ప్రస్తుత మన భౌతిక స్థితి కొన్ని మునుపటిచర్యల
ఫలితముగా ఏర్పడినదే. ఫలితంపై చర్య తీసుకోవడంలో ఎటువంటి ఉపయోగంలేదు. కానీ కారణంపై చర్య
తీసుకోవడం ముఖ్యం. భౌతిక ప్రపంచానికి కారణం మానసిక ప్రపంచం అని ఈ పల్లవి చెబుతోంది.
అందువలన, భౌతిక ప్రపంచమును ప్రయత్నించి మార్చినా ఉపయోగంలేదు.
మన మానసిక స్థితి కూడా కొన్ని గత చర్యల ఫలితమే. కనుక
ఆ మానసిక స్థితిని కూడా మార్చుటకు ప్రయత్నించడం
వల్ల ప్రయోజనం లేదని భావించవచ్చు. ఆ విధంగా, మన మనస్సు మరియు ఆలోచనలు గతంతోనే కలసి
వుంటాయి. వాటి నుండి వెలువడే ఏ చర్య అయినా గతంలో మూలాలను కలిగి ఉంటుంది, కాబట్టి అందులో
కొత్తదనము ఏమీ ఉండదు.
పొంచి శరీరపుభోగము లుడిగిన
/ చుంచుఁబావములు సుకృతములే#1 (=శరీర భోగముల కోసము ఎదురు చూపులు ఆగిపోయినప్పుడు మాత్రమే కొత్త (లేదా తాజా) భావాలు పుష్పించే అవకాశం ఉంటుంది) అని అన్నమాచార్యులు చెప్పినది ఉదాహరించడం సందర్భోచితముగా ఉంటుంది.
అన్వయార్ధము: ప్రభూ! ఊహలు, ఆలోచనలు చర్యలకు దారితీస్తాయని నేను గ్రహించాను.
అంటే ఇప్పటి 'నేను' అన్నది గత చర్యల కారణంగా ఏర్పడింది. అందుకే, గతంలో ఎప్పుడో పుట్టిన
'నేను' ఈ క్షణానికీ తాజాగా, శుభ్రమైన వానినని భావించడం నా మూర్ఖత్వం. (కాబట్టి, 'నేను'
అనుదానితో 'నా' అనుబంధాలన్నింటినీ విస్మరిస్తాను.)
బూమిలో నిద్రించువాఁడు
పొద్దువేళ యేఱిఁగీనా
నీమాయలో మునిఁగి
నన్ను నెఱిఁగీనా
కామించి నీవు
నన్నుఁ గరుణించి యేలుకోఁగా
నీమఱఁగువాఁడ నని
నేఁ డంటీఁ గాక
॥గోవింద॥
bUmilO nidriMchuvADu podduvELa yE~rigInA
nImAyalO munigi nannu ne~rigInA
kAmiMchi nIvu nannu garuNiMchi yElukOgA
nIma~raguvADa nani nE DaMTI gAka ॥gOviMda॥
Word to Word meaning: బూమిలో (bUmilO) = on the earth, in this world; నిద్రించువాఁడు (nidriMchuvADu) = the one sleeping; పొద్దువేళ (podduvELa) = time of the day? యేఱిఁగీనా (yE~rigInA) = does he know? నీమాయలో (nImAyalO) = in the illusion created by you; మునిఁగి (munigi) = by immersing; నన్ను (nannu) = self; నెఱిఁగీనా (ne~rigInA) = does he know? కామించి (kAmiMchi) = by love, by compassion; నీవు (nIvu) = you; నన్నుఁ (nannu) = me; గరుణించి (garuNiMchi) = by showeing mercy, compassion, grace; యేలుకోఁగా (yElukOgA) = having ruled my heart; నీమఱఁగువాఁడ (nIma~raguvADa) = the one behind your shadow; నని (nani) = thus; నేఁ డంటీఁ గాక (nE DaMTI gAka) = I proclaimed today.
Literal meaning: A sleeping person does not
know the time of the day; similarly, the one immersed in an illusion created by God cannot find God. By your grace, O
God! you have ruled my heart, just today I proclaimed to be your man.
Explanation: nidriMchuvADu (నిద్రించువాఁడు = person in sleep) is signifying tamas or ignorance. A very important thing said is we cannot find God while still staying inside the illusions created by HIM. The only way is to come out of the illusions is through cognition and negation of the same. This is certainly the most difficult task because while doing this one comes face to face with the self. How can anyone negate the self?
Now deliberate on the question raised by Annamachrya “techchina yIpachchaDamu dEhamidi veMTaveMTa / vachchIgAka tannudAne vaddanagavachchunA”#2 (తెచ్చిన యీపచ్చడము దేహమిది వెంటవెంట / వచ్చీఁగాక తన్నుఁదానె వద్దనఁగవచ్చునా = This bedsheet (euphemistically called body) I bought cannot be separated from me, it always follows me.) Now we understand the need to know and maintain that balance between this world and the other. This is the task (स्वधर्म, swadhrama, స్వధర్మ) God has assigned to the man. The man instead, prefers easier things and looks the other way.
kAmiMchi nIvu nannu garuNiMchi yElukOgA (కామించి నీవు నన్నుఁ గరుణించి యేలుకోఁగా) is indicating Annamacharya has no role, but God out of his compassion ruled his heart. It is important to note that man’s duty is to keep the doors open. Keep the heart Open, free of all the contamination.
భావము: భూమిలో నిద్రించువాఁడు పొద్దువేళ ఎఱగనట్లు నీమాయలో మునిఁగి నన్ను
తెలియగలమా? (లేము). ప్రేమతో నీవు నన్నుఁ గరుణించి (నా హృదయమును) యేలుకోఁగా నీమఱఁగువాఁడనని
ఇప్పటికి (ఇంతకాలానికి) అనగలిగాను.
వివరణము: నిద్రించువాఁడుతో తామసిక స్థితిని
సూచించిరి. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు సృష్టించిన భ్రమల్లో
ఉంటూనే మనం భగవంతుడిని కనుగొనలేమన్నారు అన్నమాచార్యులు. భ్రమలలో నుంచి బయటికి రావడానికి
ఏకైక మార్గం తాను కాని దానిని గుర్తించుట మరియు దానిని తిరస్కరించుట. ఇది ఖచ్చితంగా
చాలా కష్టమైన పని, ఎందుకంటే ఇలా చేస్తున్నప్పుడు
నీకు నువ్వే ఎదురౌతావు. మార్గాన్ని తప్పుతావు. ఎవరైనా తనను తాను ఎలా తిరస్కరించగలరు?
అందుకనే అన్నమాచార్యులు ఇలా అన్నారు. "తెచ్చిన యీపచ్చడము దేహమిది వెంటవెంట / వచ్చీఁగాక తన్నుఁదానె వద్దనఁగవచ్చునా"#2 {= నేను తీసుకురా గలిగినదంతా నన్నే. నాతో వచ్చిన ఈ దుప్పటి (సభ్యోక్తిగా దేహము అని పిలుస్తారు) నా నుండి వేరు చేయబడలేదు కాబట్టి ఎల్లప్పుడూ నన్ను అనుసరిస్తుంది.} దేవుడు మనిషికి అప్పగించిన వ్యాసంగము (లేదా పని) మన ఈ ప్రపంచానికి మరియు 'ఇతరము' అను దాని మధ్య సమతుల్యతను తెలుసుకోని మెలగుట. ఇదే భగవద్గీతలో (3-35) పేర్కొన్న స్వధర్మం. మనిషి బదులుగా, 'ఇతరము' అంటే ఏమిటో అన్న తహతహలో, దానిపై ఊహాగానములో కాలం గడుపుతాడు.
'కామించి నీవు నన్నుఁ గరుణించి యేలుకోఁగా' అన్నది అన్నమాచార్యులకు చేయుటకు ఎలాంటి
పాత్ర లేదని సూచిస్తుంది, కానీ దేవుడు కరుణతో అతని హృదయాన్ని పాలించాడు. తలుపులు తెరిచి
ఉంచడమే మనిషి విధి. ఏ కలుషితాలు లేకుండా హృదయాన్ని చాపి ఉంచండమే చేయగలిగినది.
సరి చంటి
బిడ్డఁడు సంసార చింత లెంచీనా
గరిమ నజ్ఞానుఁడు
కైంకర్య మెంచీనా
నిరతి దయ దలఁచి
నీవు పెర
రేఁపఁగా
కెరలి నే నీకు
మొక్కితిఁ గాక ॥గోవింద॥
sari chaMTi biDDaDu saMsAra chiMta leMchInA
garima naj~nAnuDu kaiMkarya meMchInA
nirati daya dalachi nIvu pera rEpagA
kerali nE nIku mokkiti gAka ॥gOviMda॥
Word to Word meaning: సరి (sari) = అంగీకారము తెలుపుట, to indicate agreement; చంటి బిడ్డఁడు (chaMTi biDDaDu) young kid, toddler; సంసార (saMsAra) = the worldly; చింతలు (chiMtalu) = troubles, tribulations; ఎంచీనా (eMchInA) = does he weigh or count (in his mind?) గరిమ నజ్ఞానుఁడు (garima naj~nAnuDu) = అహంకారం కొలది మూర్ఖుడు, out of vanity, the fool; కైంకర్యము (kaiMkaryamu) = divine service; ఎంచీనా (eMchInA) ) = does he weigh or count (in his mind?); నిరతి (nirati) = మిక్కిలి ఆసక్తి, Great eagerness; దయ దలఁచి (daya dalachi) = kindness in your heart; నీవు (nIvu) = you; పెర (pera) = అన్యము, Other, Another; రేఁపఁగా (rEpagA) = ఉసిగొల్పు, పురికొల్పు, to excite, to provoke; కెరలి (kerali) = ఉప్పొంగి, త్వరపడి, హద్దులేని ఆనందంతో ఎక్కడికో వెళ్ళిపోతిని, to be elated; to be transported with joy; నే (nE) = me; నీకు (nIku) = you; మొక్కితిఁ (mokkiti) = bowed; గాక (gAka) = (so) be it;
Literal
meaning: A
toddler doesn’t (rather can’t) weigh the pros and cons of worldly troubles and tribulations. (But still makes all-out effort to get what he lays his eyes upon).
Out of vanity, the fool cannot consider
doing the divine service. With great interest and kindness, you provoked the
Other in me. I got elated and bowed to you in joy.
Explanation: The first line sari chaMTi biDDaDu saMsAra chiMta leMchInA సరి చంటి బిడ్డఁడు సంసార చింత లెంచీనా is signifying that one must worship God like a child. A child in his pursuits (to get something), doesn’t consider the obstacles, troubles, and dangers, but concentrates only on what he is doing. (that’s why parents need to keep a constant watch). ##: Also refer to the story of Bilvamangala given at the end of the explanations.
Thus, this stanza is related to Bhagavad-Gita verse 2-41, व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन (vyavasāyātmikā buddhir ekeha kuru-nandana = O descendent of the Kurus, the intellect of those who are on this path of self-realisation is resolute, and their aim is one-pointed). The wording chiMta leMchInA చింత లెంచీనా is indicative of the Bhagavad-Gita verse 2-45 निर्योगक्षेम आत्मवान् (niryoga-kṣhema ātmavān, = without concern for material gain and safety, be situated in the self).
It is interesting to note that both Jiddu Krishnamurti and Annamacharya always used the word OTHER (not related to this world) పెర, పర to indicate a state of mind that is humanly possible, but not easily attainable.
భావము: చంటి బిడ్డఁడు సంసార చింతలు, అవరోధాలు, భయము ఎరుగక తనకు తోచిన
వస్తువును శత విధముల కైవసము చేయ ప్రయత్నించును. అహంకారం కొలది మూర్ఖుడు కైంకర్యము చేపట్టలేడు. మిక్కిలి ఆసక్తితో నీవు దయ దలఁచి నీవు 'పెర'(ఇతరము)ను
ప్రేరేపించగా (రేఁపఁగా), త్వరపడి, హద్దులేని ఆనందంతో ఉప్పొంగి ఎక్కడికో వెళ్ళిపోతిని;
అక్కడి నుండి నే నీకు మొక్కితి నంతే!
వివరణము: ఒక పిల్లవాడు
తను అనుకున్నది పొందడానికి అడ్డంకులు, ఇబ్బందులు, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకోకుండా,
కానీ వాడు చేస్తున్న పనిపై మాత్రమే ఏకాగ్ర దృష్టి పెడతాడు. (అందుకే తల్లిదండ్రులు నిరంతరం
నిఘా ఉంచాలి). మొదటి పాదం సరి సరి చంటి బిడ్డనుడు సంసార చింత లెంచీనా అనేది ఒక పిల్లవాడిలా
( క్షేమం, లాభనష్టాలు వదలి) భగవంతుని ఆరాధించాలి అని సూచిస్తుంది. ##: వివరణల ముగింపులో
ఇచ్చిన బిల్వమంగళుని కథను కూడా చూడండి.
ఈ విధంగా, ఈ చరణము భగవద్గీత 2-41 శ్లోకంలోని “వ్యవసాయాత్మికా
బుద్దిరేకేహ కురునందన” ను (= అర్జునా! ఈ యొగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే యేక కారణంగా
ప్రకాశిస్తుంది) సూచించు చున్నది.. చింత లెంచీనా
అనే పదముతో భగవద్గీత శ్లోకం 2-45 లోని “నిర్యోగక్షేమ ఆత్మవాన్” ను (= వారు భౌతిక లాభాలు,
క్షేమము, భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మ భావన యందే స్థితుడవై ఉండుము) భావగర్భితముగా
చొప్పించిరి.
The Other, ఇతర, పెర, పర
(ఈ ప్రపంచానికి, తెలిసినదానికి దేనికీ సంబంధించినది కాదు అన్న అర్ధములో) అనే పదాలను మానవీయంగా సాధ్యమయ్యే, కానీ సులభంగా
సాధించలేని మానసిక స్థితిని సూచించడానికి జిడ్డు
కృష్ణమూర్తి మరియు అన్నమాచార్యులు ఉపయోగించారని తెలుస్తోంది. ఒకరు శుద్ధ హిందూ సన్యాసి.
ఇంకొకరు పాశ్చాత్య విధానములలో విద్యాబుద్ధులు నేర్చిన ప్రపంచ మానవుడు. ఐనా ఎంత సారూప్యత!
తుద కెక్క
సన్యాసి తొంటి కర్మము సేసిన
యిదివో నిన్నుఁ
దలఁచి యీతలఁ దడవేనా
యెదుట శ్రీ
వేంకటేశ యిహపరములు నీవై
పొదిగి
పాలార్చఁగాను పొడవైతిఁ గాక ॥గోవింద॥
tuda kekka sanyAsi toMTi karmamu sEsina
yidivO ninnu dalachi yItala daDavEnA
yeduTa SrI vEMkaTESa yihaparamulu nIvai
podigi pAlArchagAnu poDavaiti gAka ॥gOviMda॥
Word to
Word meaning: తుద కెక్క (tuda kekka) = చిట్టచివరి వరకు,
ఆఖరి మెట్టు, till the very last moment, the final step; సన్యాసి (sanyAsi) = a monk; తొంటి కర్మము (toMTi karmamu) = తొల్లిటి, మునుపటి
కర్మము (ఇప్పుడు చేయవలసినది కాదు), work of earlier times, not the present work; సేసిన (sEsina) = having
performed; యిదివో
(yidivO) = God! నిన్నుఁ (ninnu) = you; దలఁచి (dalachi)= regarding
you, considering you; యీతలఁ
(yItala) = ఈవైపు, this side; దడవేనా (daDavEnA) = will he
grope? యెదుట
(yeduTa) = in front; శ్రీ వేంకటేశ
(SrI
vEMkaTESa) = Lord Venkateswara; యిహపరములు (yihaparamulu) = this world and the other
world; నీవై (nIvai) = being yours; పొదిగి (podigi) =వ్యాపించు, చుట్టుకొను,
encircling, spreading; పాలార్చఁగాను (pAlArchagAnu) = చన్నిచ్చు, ఉగ్గుపెట్టు {పాలార్చు: స.క్రి. పాలు
+ ఆఱుచు = పాలార్చు, బాధించు, క్రీడింపజేయు, చంపు, ఉపేక్షించు నశింప జేయు అను అర్థములు
స్పష్టమే. కానీ ఆ అర్థమిచ్చట సరిపడదు. కానీ ఈ కింది అన్నమయ్య కీర్తనల్లో ఆ అర్థం సరిపడదు.
.పాలు + ఆడించు పాలార్చు. తన పాలిదిగా చేయు అను అర్ధము సరిపడును. ( వేటూరి ఆనందమూర్తిగారు) దీనికి చన్నిచ్చు, ఉగ్గుపెట్టు, హితమైన- ఆహారమిచీ
పరిరక్షించు అనే అర్థాన్ని సూచించినారు. “పాలార్చి తొట్టెలలోఁ బండఁబెట్టు యశోద
/ నీలవర్లు
దొంగి చూచె నిద్దురోయని" “పంతగాడ విఁక మమ్ముఁ బాయకువయ్యా/ బంతిఁబెట్టుకొని మమ్ముఁ
బాలార్చవయ్యా" ఇక్కడ చన్నిచ్చు, ఉగ్గుపెట్టు అనే అర్థాలే సరిపోతాయి.} caring and
nourishing; పొడవైతిఁ గాక (poDavaiti gAka) = ఇక్కడ ఉబ్బిపోతిని అనే అర్ధములో వాడారు, I became taller (implying
that I became elated).
Literal meaning: How to climb the last step? Does the monk realise that he is continuing his past deeds? With such actions, how can one submit to the God? There is only one world that exists in front of us, the Lord Venkateswara the one who can bestow this world or the other, has spread in my heart, he cared and nourished me. And I am in ecstasy.
Explanation: Annamacharya always said there are only two states. One is in meditation or not. There are not many steps to reach God. The song vennavaTTuka nEyi vedakanElA”#3 (వెన్నవట్టుక నేయి వెదకనేలా! O man you are on the penultimate step.) is a good example. But a clear, final, and irrevocable decision to be on the side of God is all that is needed.
God is not related to our material world; it is absolutely foolish to extrapolate our present deeds into the other state. Just imagine, almost all hotels do not allow you to eat food prepared outside their premises. If a mundane thing like a hotel prohibits you from outside things, the other state obviously proscribes the present state's deeds
Thus, man has only one tool in his hand to know his present condition. If he knows what state he is in, he is not there in the Other. That’s why Jiddu Krishnamurti often said, “those who say they know, do not know.” The happenings in the early life of Jiddu Krishnamurti demonstrate his extraordinary achievement in freeing himself from the many hands that clutched at him in an endeavour to force him into the role of traditional Messiah. (Refer to the books Years of awakening and Years of Fulfilment by Mary Lutyens.)
Similarly, traditionally brought up Annamacharya must have made
astounding efforts to free himself. Both have claimed that they are no
extraordinary beings but have worked hard to reach the said position.
భావము: ఓ సన్యాసి చివరి మెట్టు ఎలా యెక్కుతావో? ఇక్కడి కర్మములు అక్కడా
చేసెదనని తలచితివా, యెదుట ఉన్న శ్రీ వేంకటేశుని ఎలా తడివెదవో? శ్రీ వేంకటేశుడు యిహపరములు
తానై చన్నిచ్చి, ఉగ్గుపెట్టగాను ఉబ్బిపోతిని.
వివరణము: అన్నమాచార్యులు ఎప్పుడూ రెండు స్థితులు మాత్రమే వున్నవన్నారు.
ఒకటి ధ్యానంలో ఉండడం లేదా లేకపోవడం. భగవంతుడిని చేరుకోవడానికి ఎన్నో మెట్లు లేవు. అందుకే
"వెన్నవట్టుక నేయి వెదకనేలా?"#3 (= ఓ మానవుడా! నువ్వు చివరి మెట్టుమీద ఉన్నావు.) అని
ఉద్భోదించారు. కానీ దేవుని పక్షాన ఉండాలనే స్పష్టమైన, అంతిమము మరియు తిరుగులేని నిర్ణయం
అవసరం. అక్కడే తటపాయిస్తాడు మానవుడు.
దైవము మన భౌతిక ప్రపంచానికి సంబంధించినవాడు కాదు; ఆయన
ఎప్పటీకప్పుడు ఉద్భవించు అధునాతన స్థితి చెందినవాడు. అక్కడ కూడా ఇక్కడి ప్రపంచపు పనులను
మోసుకెళ్ళడం అవివేకము కాదా? దాదాపు అన్ని హోటళ్లు తమ ప్రాంగణానికి వెలుపల
తయారుచేసిన ఆహారాన్ని తినడానికి మిమ్మల్ని అనుమతించవు. హోటల్ వంటి సాధారణ ప్రాపంచిక
విషయమే బయట వస్తువులను నిషేధిస్తే, ఆ అరుదైన,
అత్యద్భుతమైన ‘ఇతర’ స్థితి స్పష్టంగా అనుమతించదు.
కాబట్టి, మనిషి తన ప్రస్తుత స్థితిని తెలుసుకోవడానికి అతని చేతిలో ఒకే ఒక సాధనం ఉంది. తనకు ఏ స్థితిలో ఉన్నాడో తెలిస్తే, అతను 'అక్కడ లేడు' అని తెలియవచ్చు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి “తమకు తెలుసు అని చెప్పేవాళ్ళకు తెలియదు” అని తరచూ అంటుంటాడు. జిడ్డు కృష్ణమూర్తి యొక్క ప్రారంభ జీవితంలో జరిగిన సంఘటనలలో, అనేక శక్తులు సంప్రదాయ మహాపురుషుని (లేదా అభిషిక్తుని) పాత్ర బలవంతంగా అతనిపై రుద్దబోగా వాటి నుండి తననుతాను విముక్తి చేసుకోవడం అతని అసాధారణ విజయానికి నిదర్శనము. (Refer the books Years of awakening and Years of Fulfilment by Mary Lutyens.)
అదేవిధంగా సాంప్రదాయకంగా పెరిగిన అన్నమాచార్యులు తనను తాను బంధాల నుండి విడిపించుకోవడానికి
అద్భుతమైన ప్రయత్నాలు, సాహసాలు చేసి ఉండాలి. ఇద్దరూ, తమను తాము అసాధారణమైన వ్యక్తులము కాదని పేర్కొన్నారు, అయితే
ఆ స్థానము విశేషమైన తెగువ, తెగింపు, ఓరిమి, క్షమ లేకుండా అసాధ్యము.
Recommendations for further reading:
#1 64.
తప్పదు తప్పదు దైవము కృప యిది (tappadu tappadu daivamu kRpayidi)
#2 116. చవి నోరి కేడఁ దెత్తు సంపదేడఁ దెత్తు (chavinOri kEDa dettu saMpadEDa dettu)
#3 106.
వెన్నవట్టుక నేయి వెదకనేలా (vennavaTTuka nEyi vedakanElA)
#4 Years
of Awakening by Mary Lutyens
#5 Years of
Fulfilment by Mary Lutyens
Summary of this Keertana:
Govinda, Mukunda, Krishna, Gopinatha, Narahari! As the flowers
happen the fruits form. (Soft concepts, thoughts are transformed into solid actions, deeds, avocations)
Implied
meaning: O lord! I perceive that Ideas/thoughts results in actions. My
present state is due to certain past actions. Therefore, considering it as
fresh and clean is my foolishness. Therefore, I must discard all my associations
with it.
A sleeping person does not
know the time of the day; similarly the one immersed in an illusion created by God cannot find God. By your grace, O God! you have
ruled my heart, just today I proclaimed to be your man.
A toddler doesn’t (rather can’t) weigh the pros and cons of worldly troubles and tribulations. (But still makes an all-out effort to get what he lays his eyes upon). Out of vanity, the fool cannot consider doing the divine service. With great interest and kindness, you provoked the ‘Other’ in me. I got elated and bowed to you in joy.
How to climb the last step? Does
the monk realise that he is continuing his past deeds? With such actions, how
can one submit to God? There is only one world that exists in front of us,
the Lord Venkateswara the
one who can bestow this world or the other, has spread in my heart, he cared
and nourished me. And I am in ecstasy.
కీర్తన సంగ్రహ భావము:
గోవింద!
ముకుంద! కృష్ణ! గోపీనాథ! నరహరి! పూవు గలుగఁగ పిందెలు పుట్టుచున్నవి. (మృదు భావనలు ఘనమైన చర్యలుగా, కర్మలుగా, కార్యములుగా,
వ్యాసంగములుగా రూపాంతరము చెందుతాయి.) అన్వయార్ధము: ప్రభూ! ఊహలు, ఆలోచనలు చర్యలకు దారితీస్తాయని నేను గ్రహించాను.
అంటే ఇప్పటి 'నేను' అన్నది గత చర్యల కారణంగా ఏర్పడింది. అందుకే, గతంలో ఎప్పుడో పుట్టిన
'నేను' ఈ క్షణానికీ తాజాగా, శుభ్రమైన వానినని భావించడం నా మూర్ఖత్వం. (కాబట్టి, 'నేను'
అనుదానితో 'నా' అనుబంధాలన్నింటినీ విస్మరిస్తాను.)
భూమిలో నిద్రించువాఁడు పొద్దువేళ ఎఱగనట్లు
నీమాయలో మునిఁగి నన్ను తెలియగలమా? (లేము). ప్రేమతో నీవు నన్నుఁ గరుణించి (నా హృదయమును)
యేలుకోఁగా నీమఱఁగువాఁడనని ఇప్పటికి (ఇంతకాలానికి) అనగలిగాను.
చంటి బిడ్డఁడు సంసార చింతలు, అవరోధాలు, భయము ఎరుగక తనకు తోచిన
వస్తువును శత విధముల కైవసము చేయ ప్రయత్నించును. అహంకారం కొలది మూర్ఖుడు కైంకర్యము చేపట్టలేడు. మిక్కిలి ఆసక్తితో నీవు దయ దలఁచి నీవు 'పెర'(ఇతరము)ను
ప్రేరేపించగా (రేఁపఁగా), త్వరపడి, హద్దులేని ఆనందంతో ఉప్పొంగి ఎక్కడికో వెళ్ళిపోతిని;
అక్కడి నుండి నే నీకు మొక్కితి నంతే!
ఓ సన్యాసి చివరి మెట్టు ఎలా యెక్కుతావో? ఇక్కడి
కర్మములు అక్కడా చేసెదనని తలచితివా, యెదుట ఉన్న శ్రీ వేంకటేశుని ఎలా తడివెదవో? శ్రీ వేంకటేశుడు యిహపరములు
తానై చన్నిచ్చి, ఉగ్గుపెట్టగాను ఉబ్బిపోతిని.
Additional notes:
Story
of Bilvamangala
Bilvamangala
was a womaniser. The prostitute is all his world. One day he had to stay home
due to religious rites for the elders. Somehow he controlled and completed the rituals
and straight away headed for the brothel.
That
evening he got a meal packed for the prostitute. Now his mind is completely engrossed in the
prostitute and he moved as fast as he could. On the way, a yogi was meditating with his
eyes closed. Bilvamangala, blinded by the amorous thoughts, trampled the yogi.
The yogi became angry and shouted, "Ah, you seem to have closed your eyes.
You are trampling on me while I am meditating."
Bilvamangala,
other wise a well-behaved person, immediately realised his mistake and sought
mercy. The Yogi blessed him. Then
queries the yogi “I am blinded by the prostitute. That is the reason for not
noticing you on my way. But Sir you claim you are in meditation and I see you
are still in conscious state?
Bilvamangala
hurried ahead without waiting for the yogi's response. He kept thinking about
the encounter. "I was so enthralled by an ordinary whore," he
thought, "that had I exhibited the same commitment to God, I would be
liberated." He also realised at that time that his thoughts will be tied
to god beyond that yogi. He believed he will not be alienated by external
happenings. He considered the prostitute who had absorbed his mind had taught
him how to seek God.
Then
he arrived at her home. "Mother!" he said as he prostrated himself in
front of her. You made me realise how much one must yearn for God. "You
are my teacher." He paid her respects and, instead of returning to his
home, he remained in meditation, leaving behind all of his worldly ties.
Additional notes:
బిల్వమంగళుని కధ
రామకృష్ణ పరమహంసగారు చెప్పిన క్రింది బిల్వమంగళుని కధ యీ కీర్తనను అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
2. బిల్వమంగళుడు ఒక వేశ్యాలోలుడు. ఆమె తోటిదే లోకమనుకుంటూ
కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకసారి అతడి తల్లిదండ్రుల తద్దినాలు వచ్చాయి. అందువల్ల ఆ రోజు
సాయంత్రం దాకా ఇంటిలోనే ఉండవలసి వచ్చింది.
ఆ రోజు సాయంత్రం వేశ్య కోసమని భోజనం పిండి వంటలు మూటకట్టుకుని చీకటిలో ఆ వేశ్యా గృహానికి వెళుతున్నాడు. మనసు పూర్తిగా ఆ వేశ్యపై లగ్నమై ఉండడం వల్ల అతడు ఎటు పోతున్నాడో తెలియని స్థితిలో అడుగులు వేస్తున్నాడు. ఆ దారిలో ఒక యోగి కళ్ళు మూసుకుని భగవద్ధ్యానము చేస్తూ ఉన్నాడు. ఒళ్ళు మరిచిపోయి నడుస్తున్న బిల్వమంగళుడు ఆ యోగిని తొక్కుకుంటూ వెళ్ళాడు. ఆ యోగి కోపం తెచ్చుకుని "ఏమోయీ నీకు కళ్ళు మూసుకుని పోయినట్లు ఉన్నాయి. భగవద్ధ్యానము చేసుకుంటున్న నన్ను తొక్కుకుంటూ వెళుతున్నావు" అని గద్దించాడు.
బిల్వమంగళుడు ఆ మాటకు తుళ్ళి పడ్డాడు. తన తప్పు తెలుసుకుని ఆ యోగిని క్షమించమన్నాడు. ఆ తర్వాత యోగితో అయ్యా! నాదొక ప్రశ్న "నేను వేశ్య మీద మనసుతో ఒళ్ళు మరిచిపోయి నడుస్తున్నాను; కానీ మీరు భగవద్ధ్యానము చేస్తూ కూడా బాహ్యప్రజ్ఞలోనే ఉన్నారే? ఇదేమి ధ్యానమండి?" అని అడిగాడు.
బిల్వమంగళుడు ఇంకా ముందుకు వెళుతూ, "ఒక వేశ్యను గురించి ఆలోచిస్తేనే తాను పరవశంలో మునిగి పోతున్నాను కదా! నిజంగా భగవంతుణ్ణి ధ్యానిస్తే నాకు తప్పక ముక్తి కలుగుతుంది" అన్న విషయం స్ఫురించింది. ధ్యానాన్నే పనిగా పెట్టుకున్న ఆ యోగి కన్నా తానే ఎక్కువ ఏకాగ్రత కలవాడిని అతనికి అనిపించింది. తన మనసును పూర్తిగా లాగి వేసిన ఆ వేశ్యే తనకి గురువు అని కూడా అతనికి తోచింది.
దానితో అతనికి వైరాగ్యం కలిగింది. వేశ్యా గృహం చేరుకున్నాడు.
ఆ వేశ్యతో "అమ్మ! నీవే నా గురువు! భగవంతుని కోసం మనసు ఏ విధంగా వ్యాకులపడాలో
నీవు నాకు నేర్పావు" అని నమస్కరించి, అటునుంచి అటే ఆమెను, సంసారాన్ని కూడా
త్యజించి భగవద్ధ్యానములో మునిగిపోయాడు.
Copper Leaf: 33-3 Volume 15-186