Tuesday 19 April 2022

117. మొక్కరో మీరు మోసపోక (mokkarO mIru mOsapOka)

 ANNAMACHARYA 

117. మొక్కరో మీరు మోసపోక

(mokkarO mIru mOsapOka)

                                                                                    

Introduction: Annamacharya in this amazing poem stated that demonical devotional rituals like self-infliction, such as piercing or walking on fire, and animal sacrifice do not take us anywhere. All over the world, there are many who believe in self Infliction as a token of their devotion. 

His contemporary outlook may be noted in the wording baggana yekkaDa DokkapaDunO yEmaravaddu (బగ్గన యెక్కడ డొక్కపడునో యేమరవద్దు= be circumspective on slipping back to normal ways). He said we miss the wood for trees.  

ఉపోద్ఘాతము: రీరాన్ని శూలాలతో పొడుచు కోవడం, నిప్పుల్లో నడవడం వంటి నిర్బంధ భక్తిని (రాక్షస భక్తిని) అన్నమాచార్యులు తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా, తమ భక్తికి చాటేందుకు తమనుతాము హింసించుకునేందుకు మూఢముగా వెనుకంజ వేయనివారు చాలా మంది ఉన్నారు. బదులుగా (భగవంతుడా) “ఊరకే మీవారమని వున్నఁ జాలు” అన్నారు. 

అన్నమాచార్యుల అత్యాధునిక దృక్పథం ‘బగ్గన యెక్కడ డొక్కపడునో యేమరవద్దు' (ఎప్పుడెప్పుడు నీ దారినుండి వెనుకకు మరలతానో అని అప్రమత్తంగా వుండు) అనడంలో గమనించవచ్చు. తీపి యని చేదును ఎంచుకుని మోస పోవద్దని హెచ్చరించారు. 

 

కీర్తన:

మొక్కరో మీరు మోసపోక - మీకు
దిక్కు దెసైన ఆదిదేవునికి॥పల్లవి॥
 

మారుచేతులీయవద్దు మారుగాళ్ళీయవద్దు
బీరాన గుండెలు గోసి పెట్టవద్దు
గోరపడి చిచ్చులోన  కొండాలు (
గుండాలు# ​)  చొఱవద్దు
ఊరకే మీవారమని వున్నఁ జాలు॥మొక్క॥
 

సిడిదలలియ్యవద్దు జీవాలఁ జంపవద్దు
బడి బడి పగ్గాలఁ బారవద్దు
సిడిమీఁద బిత్తరప బిమ్ములు చిమ్మఁగవద్దు
కడనుం
డి  శ్రీపతి దాసుల* దారి గన్నఁ జాలు ॥మొక్క॥ 

బగ్గన యెక్కడ డొక్కపడునో యేమరవద్దు
బగ్గివడ్డ యమబాధఁ బడవద్దు
ఎగ్గు సిగ్గులేక వేంకటేశుని దాసులఁజేరి
అగ్గలపు పాదరేణువైనఁ జాలు॥మొక్క॥
 

mokkarO mIru mOsapOka - mIku

dikku desaina AdidEvuniki         pallavi 

mAruchEtulIyavaddu mArugALLIyavaddu

bIrAna guMDelu gOsi peTTavaddu
gOrapaDi chichchulOna koMDAlu (guMDAlu#) cho~ravaddu
UrakE mIvAramani vunna jAlu    mokka 

siDidalaliyyavaddu jIvAla jaMpavaddu

baDi baDi paggAla bAravaddu
siDimIda bittarapa bimmulu chimmagavaddu
kaDanuMDi.SrIpati dAsula* dAri ganna jAlu mokka 

baggana yekkaDa DokkapaDunO yEmaravaddu

baggivaDDa yamabAdha baDavaddu
eggu siggulEka vEMkaTESuni dAsulajEri
aggalapu pAdarENuvaina jAlu    mokka


*ఇక్కడ రాగిరేకు విరిగి పోయినది. ఎఱ్ఱ అక్షరాలు పరిశోధకులు నిర్ణయించినది.

#అర్ధము కోసము మార్చిన పదము

*The copper plate broke and wording in red letters is a guess by researchers.

#Indicates modified text to get meaningful word.

 

Details and Explanations:

మొక్కరో మీరు మోసపోక - మీకు
దిక్కు దెసైన ఆదిదేవునికి
॥పల్లవి॥

 

mokkarO mIru mOsapOka - mIku

dikku desaina AdidEvuniki         pallavi

 

Word to Word meaning: మొక్కరో (mokkarO) prostrate oneself, bow in respect, make an obeisance; మీరు (mIru) = you; మోసపోక (mOsapOka) = without getting deceived (here implying that do not fall into the illusions);  మీకు (mIku) = to you; దిక్కు దెసైన (dikku desaina) = దిక్కు, రక్షణ, దారి, ఆధారము, శరణము, అండ అను అర్థముల వాడఁబడు జంటపదము, A couplet used to mean direction, protection, way, basis, asylum and refuge,   ఆదిదేవునికి (AdidEvuniki) = the primordial lord;    

Literal meaning: O man! without falling into illusions, prostrate (with respect) to the primordial lord. He is the direction, protection, way, basis, asylum, and refuge (to us). 

Explanation: the word mOsapOka (మోసపోక = without getting deceived). Here, contextually Annamacharya cautioned us not to fall into the illusions particularly the ones created by the mind. 

Just see the picture below. You will find both the characters there are correct as per their perspective. Thus, it is very difficult to overcome the illusions which we feel are very true.



Illusions are created by the solidity that the ‘experience’ delivers. Man clings to his yesterday's experience despite the fact that it is a dead wood. That is the reason Annamacharya said  ‘niviri ninnaTivuniki nETiki galadA?’ (నివిరి నిన్నటివునికి నేటికి గలదా?) = today i.e. living present is not as discernible, verifiable as yesterday. (Therefore, one needs to put-in hard work.). Thus, the sannyasi-ship (monk-ship) is not sitting idle.  

Implied meaning: O Man! see thru the veils of ignorance and submit to God.

 

భావము: మానవులారా మోసపోకుండా మొక్కండి దిక్కు దెసైన ఆదిదేవునికి.

 

వివరణము: 'మోసపోక' అంటూ ఇక్కడ, అన్నమాచార్యులు సందర్భానుసారంగా  మనల్ని, ముఖ్యంగా మనస్సు సృష్టించు భ్రమలలో పడవద్దని హెచ్చరించాడు.

ఒకసారి క్రింద ఉన్న చిత్రాన్ని పరిశీలించండి. రెండు పాత్రలు కూడా వారివారి దృక్కోణం ప్రకారం సరైనవని మీరు కనుగొంటారు. అందువల్ల, మనం చాలా నిజమని భావించే భ్రమలను అధిగమించడం చాలా కఠినము. 



‘అనుభవం’ అందించే దృఢమైన ఋజుత్వంతో భ్రమలు ఏర్పడతాయి. పాసిపోయినదైనప్పటికీ  మనిషి తన 'నిన్న' అనే అనుభవానికి అతుక్కుపోతాడు. అందుకే అన్నమాచార్యులు 'నివిరి నిన్నటివునికి నేటికి గలదా?' {నేడు అంటే ప్రస్తుత క్షణములో జీవించడాన్ని నిన్నటిలా ధృవీకరించ గలమా? ఆనవాలు పట్టగలమా?} అని ప్రశ్నించారు. కాబట్టి, సన్యాసం అంటే ఖాళీగా కూర్చోడం కాదు, కష్టపడి పనిచేయవలసి ఉంటుంది.

అన్వయార్ధము: ఓ నరుడా! అజ్ఞానపు తెరలను తొలగవైచి భగవంతునికి సమర్పించుకో.


మారుచేతులీయవద్దు మారుగాళ్ళీయవద్దు
బీరాన గుండెలు గోసి పెట్టవద్దు
గోరపడి చిచ్చులోన  గుండాలు చొఱవద్దు
ఊరకే మీవారమని వున్నఁ జాలు
॥మొక్క॥

 

mAruchEtulIyavaddu mArugALLIyavaddu

bIrAna guMDelu gOsi peTTavaddu

gOrapaDi chichchulOna guMDAlu cho~ravaddu

UrakE mIvAramani vunna jAlu   mokka

 

Word to Word meaning: మారుచేతులీయవద్దు (mAruchEtulIyavaddu) =ప్రతీకారము తీర్చుకోవద్దు; do not be revengeful; మారుగాళ్ళీయవద్దు (mArugALLIyavaddu) = (నా ఊహ​:) నువ్వుకాని వానిలా నటించకు. (my guess is:) do not feign what you are not? బీరాన (bIrAna) = గొప్పలు పోతూ, bragging, boasting; గుండెలు (guMDelu) = your heart; గోసి పెట్టవద్దు (gOsi peTTavaddu) = donot cut and offer to God; గోరపడి (gOrapaDi) =దుర్మార్గంగా, భయంకరంగా, wickedly, perilously; చిచ్చులోన  (chichchulOna) = into fire; గుండాలు (guMDAlu​) = fire pits; చొఱవద్దు (cho~ravaddu)= rush into; break into; ఊరకే (UrakE) = Silently, merely, idly; మీవారమని (mIvAramani) = claim to be your (god’s) people; వున్నఁ జాలు (vunna jAlu) = just remain in such state.   

Literal meaning: O man! Don’t be revengeful; Don’t feign what you are not! Don’t brag and boast to cut and offer your heart (to God). Perilously don’t break into fire pits. Alas! Just claim to be his men and remain as such. 

Explanation: Annamacharya has repeatedly warned that there will be no result through forced conformity (coerced, demonic devotional practices) that make the body suffer, such as cutting hearts and walking in flames. For example, he said “pokkETikALLa puMDlu rEgaMga / dikkulanaMtaTa dirugaka“(పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగ / దిక్కులనంతటఁ దిరుగక) Don’t need to move much to suffer from blistered legs, donot have to circle the world to find God. 

Notable thing said is, instead, UrakE mIvAramani vunna jAlu (ఊరకే మీవారమని వున్నఁ జాలు) = Silently, merely, without doing anything just claim to be HIS men and remain in such state. Though Annamacharya made it look so trivial, factually is the thing required to do, is not so simple. What actually happens when one tries ‘not doing anything’ itself is an action and contradicts UrakE vunna (ఊరకే వున్న). That means man must find what action is and negate it naturally. This is the toughest thing ‘to do’. 

This Bhagavad-Gita verse (3-5) says man cannot refrain from action “न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् | कार्यते ह्यवश: कर्म सर्व: प्रकृतिजैर्गुणै:” || 3-5|| na hi kaśhchit kṣhaṇam api jātu tiṣhṭhatyakarma-kṛit kāryate hyavaśhaḥ karma sarvaḥ prakṛiti-jair guṇaiḥ  Purport: There is no one who can remain without action even for a moment. Indeed, all beings are compelled to act by their qualities born of material nature (the three guṇas). 

Implied meaning: O man! Don’t confuse liberty with coercion. Path liberty is not in physical action but avoiding action altogether in all its forms. 

భావము: మానవుడా ప్రతీకారము తీర్చుకోవద్దు; నువ్వుకాని వానిలా నటించకు;  గొప్పలు పోతూ గుండెలు గోసి పెట్టకు. దుర్మార్గంగా గుండాల చిచ్చులోన చొఱవద్దు. ఊరకే మీవారమని వున్నఁ జాలు.

వివరణము: గుండెలు కోసి పెట్టడం, నిప్పుల్లో నడవడం వంటీ శరీరాన్ని కష్టపెట్టే బలవంతపు (బలాత్కార​, రాక్షస) భక్తి విధానాల ద్వారా ఏ మాత్రమూ ఫలితం ఉండదని అన్నమాచార్యులు అనేకమార్లు హెచ్చరించారు. ఉదాహరణకుపొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగ / దిక్కులనంతటఁ దిరుగక / గక్కన తిరువేంకటగిరిపతిఁ గని / వొక్క మనసుతో నుండరొ ప్రజలు’ అంటూ నచ్చజెప్ప చూశారు. 

ప్రస్తావించిన ఉన్నతమైన​ విషయం 'ఊరకే మీవారమని వున్న జాలు'.  అన్నమాచార్యులు దీన్ని చాలా చిన్నవిషయంగా చూపించినప్పటికీ, నిజానికి చేయవలసిన పని యేమీ లేకపోయినా ఏమీ చేయకుండా ఉండడం సులభమేమీ కాదు. 'ఏమీ చేయకుండా' ప్రయత్నించినప్పుడు వాస్తవంగా జరిగేది ఆ చేయకుండా ఉండే ప్రయత్నమనే చర్య మరియు 'ఊరకే మీవారమని' ఉండలేక పోతాము. కాబట్టి మనిషి చర్య అంటే ఏమిటో స్వయంగా కనుక్కోవాలి మరియు దానిని సహజంగా తిరస్కరించాలి. ఇది చాలా కష్టమైన పని. 

చర్య అనునది చాలా చిక్కులతో కూడినది అని వివరించుతున్న యీ భగవద్గీత శ్లోకం చూడండి​. న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ / కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః (3-5) ప్రపంచమున ఎవ్వడైననూ ఒక్క క్షణకాలమైనను కర్మచేయక ఉండనేరడు. ప్రకృతివలన బుట్టిన గుణములచే ప్రతివారును బలాత్కారముగా కర్మలను చేయుచూ ఉందురు.

అన్వయార్ధము: ఓ నరుడా! స్వేచ్ఛను బలవంతపు మార్గాల్లో కనుగొనలేవు.  స్వేచ్ఛకు మార్గం భౌతిక చర్యలలో కాదు, అనేక రూపాల్లో నిబిడీకృతమైన​ (మరుగున దాగిన) చర్యను గమనించి నివారించడమే విడుదలకు మార్గము.


సిడిదలలియ్యవద్దు జీవాలఁ జంపవద్దు
బడి బడి పగ్గాలఁ బారవద్దు
సిడిమీఁద బిత్తరప బిమ్ములు చిమ్మఁగవద్దు
కడనుం
డి  శ్రీపతి దాసుల దారి గన్నఁ జాలు ॥మొక్క॥

 

siDidalaliyyavaddu jIvAla jaMpavaddu

baDi baDi paggAla bAravaddu

siDimIda bittarapa bimmulu chimmagavaddu

kaDanuMDi.SrIpati dAsula dAri ganna jAlu    mokka

 

Word to Word meaning: సిడిదలలియ్యవద్దు (siDidalaliyyavaddu) కొఱతవేయ్యవద్దు, ఒకరినొకరు పొడుచుకోకండి; Please don't impale each other, do not drive spears into one another;  జీవాలఁ  (jIvAla) = animals; జంపవద్దు (jaMpavaddu) = do not sacrifice; బడి బడి (baDi baDi) = అధికముగా, excessively;  పగ్గాలఁ బారవద్దు (paggAla bAravaddu) = బంధములలో చిక్కుకోవద్దు, do not get tied up in bonds; సిడిమీఁద బిత్తరప బిమ్ములు చిమ్మఁగవద్దు (siDimIda bittarap bimmulu chimmagavaddu) = {సిడి = బండి మీఁద ఎత్తుగా గట్టిన నొగ వంటి కఱ్ఱ; బిత్తరప = తళుకైన, ప్రకాశించే; బిమ్ములు = రాజముద్రికలుండు బొమ్మలు ( డబ్బులు)??;  చిమ్మఁగవద్దు =  చిమ్మఁవద్దు; } = ఎత్తుగా గట్టిన నొగ వంటి కఱ్ఱ వద్ద (అంటే ధ్వజస్తంబము వద్ద)​  తళుకుతళుకుమను రాజముద్రికలుండు బొమ్మలు (డబ్బులు) చిమ్మఁవద్దు}  donot throw glittering things at the Dhwaja Sthambham;  కడనుండి  (kaDanuMDi) = దూరమునుండి, from a distance;  శ్రీపతి దాసులదారి (SrIpati dAsula dAri) = the way of the devotees of Sripati (God);  గన్నఁ జాలు. (ganna jAlu) = it’s just sufficient to find. 

Literal meaning: O Man! don't impale each other. Do not sacrifice animals (and offer to God). Do not engage excessively and get tied up in bonds (of relationship). Do not throw glittering things at Dhwaja Sthambham. it’s just sufficient to find the path to the devotees of the lord from distance.

Explanation: Annamacahrya is advising people to avoid those mindless actions (such as fighting, animal sacrifice) like the meticulous modern gurus. For God knows what is in your mind. You cannot resort to foolery to please God. 

In this world full of duplicity and hypocrisy it's certainly difficult to find genuine devotees. Obviously, they aren't sitting in monasteries and ashrams. Annamacharya is a tough task master. He hides the actual assignment behind innocent wording. How will you find a pious soul with unclean heart? 

Implied meaning: O People! Don’t fight; Lord prohibits animal sacrifice; Offering money and gold is pointless. Stay where you are and find what a noble heart is. 

భావము: (జనులారా) ఒకరినొకరు కొఱతవేయ్యవద్దు, పొడుచుకోవద్దు. జీవాలఁ జంపవద్దు. అధికముగాబంధములలో చిక్కుకోవద్దు. ఎత్తుగా గట్టిన నొగ వంటి కఱ్ఱ వద్ద (అంటే ధ్వజస్తంబము వద్ద)  తళుకుతళుకుమను రాజముద్రికలుండు బొమ్మలు (డబ్బులు) చిమ్మఁవద్దు. దూరమునుండి శ్రీపతి దాసుల దారి గన్నఁ జాలు.  

వివరణము: అన్నమాచార్యులు ఒక ఆధునిక గురువుల్లాగే వంటి బుద్ధిహీనమైన చర్యలకు (కొఱతవేయ్యడం, పొడుచుకోవడం. జీవహింస వంటి వాటికి) దూరంగా ఉండాలని ప్రజలకు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే నీ మనసులో ఏముందో దేవునికి తెలుసు.  అవివేకమైన పనులు చేసి దైవమును పొందలేమన్నారు.

మోసంతోను కపటంతోను నిండిన ఈ ప్రపంచంలో, నిజమైన భక్తులను కనుగొనడం ఖచ్చితంగా కష్టమే. అన్నమాచార్యులు 'కడనుండి  శ్రీపతి దాసులదారి గన్నఁ జాలు' అని చెప్పినది ఏమాత్రమూ సులభమైనది కాదు. తేటగాలేని హృదయముతో (పరి) శుద్ధులైన భక్తులను తెలియుటెట్లు?

అన్వయార్ధము: ప్రజలారా! పోరాడవద్దు; జంతుబలివ్వద్దు; ధనము, బంగారాన్ని అందించ వద్దు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి మరియు నిర్మలమైన హృదయం ఏమిటో కనుగొనండి.

 

బగ్గన యెక్కడ డొక్కపడునో యేమరవద్దు
బగ్గివడ్డ యమబాధఁ బడవద్దు
ఎగ్గు సిగ్గులేక వేంకటేశుని దాసులఁజేరి
అగ్గలపు పాదరేణువైనఁ జాలు
॥మొక్క॥

 

baggana yekkaDa DokkapaDunO yEmaravaddu

baggivaDDa yamabAdha baDavaddu

eggu siggulEka vEMkaTESuni dAsulajEri

aggalapu pAdarENuvaina jAlu   mokka 

Word to Word meaning: బగ్గన (baggana) = బాగుగా, చాలా, clearly, lot of; యెక్కడ (yekkaDa) = where; డొక్కపడునో (DokkapaDunO) = వెనుదీయు, గొంకు, take backstep, fear;  యేమరవద్దు (yEmaravaddu) = do not be oblivious, (absent minded);  బగ్గివడ్డ (baggivaDDa) = దుమ్ముపడు, covered with dust and dirt; (indicating wrong action); యమబాధఁ (yamabAdha) = too much of trouble; బడవద్దు (baDavaddu) = do not get involved;  ఎగ్గు సిగ్గులేక (eggu siggulEka) = అపరాధ భావము, లజ్జ, బిడియము లేకుండా, leave the modesty and faulty (sinned) feeling; వేంకటేశుని (vEMkaTESuni) = lord Venkateswara’s; దాసులఁజేరి (dAsulajEri) = approach the disciples;  అగ్గలపు (aggalapu) = పూనికగా, ఉత్సాహముగా, with vigour; పాదరేణువైనఁ (pAdarENuvaina) = a tiny particle at their feet; జాలు (jAlu) = sufficient. 

Literal meaning: do not be oblivious of the backsteps you may take. Donot take the trouble (put effort) to stay in the dirty place (called this world); Leave the modesty and sinned feeling. Approach the disciples of the Lord and happily be a tiny particle at their feet.  

Explanation: as explained earlier, this journey (of choosing the god as life) is voluntary decision. Therefore, there is always a possibility to turn back. Hence the caution by Annamacharya. Like life is an irreversible journey.  So is the journey to the God. Imagine the fruits of staying in this dirty world? 

The wording eggu siggulEka {ఎగ్గు సిగ్గులేక = Leave your humility and false (sinned) feelings behind} is essentially implying that fear and guilt are founded on information obtained through experience. It’s a baggage, therefore unnecessary to carry. Exercise intelligence and avoid them on priority is the message. 

Use of word pAdarENuvaina (పాదరేణువైనఁ = a tiny particle at their feet) is indicating the importance of humility. Now see the statement of Jalaluddin Rumi: "Would you become a pilgrim on the road of love? The first condition is that you make yourself humble as dust and ashes."

 

Implied meaning: O people, leave the baggage’s of this dirty world. Humbly become the insignificant particle of this universe to relish the significance of life.

 

భావము: ఎక్కడ డొక్కపడునో (=వెనుదీయుదునో) అని యేమరవద్దు (చాలా జాగరూకతతో ఉండు). దుమ్ముపడిన ఈ లోకములో ఉండుటకు యమబాధలు పడవద్దు. ఎగ్గు సిగ్గులేక (అపరాధ భావము, లజ్జ, బిడియము లేకుండా) వేంకటేశుని దాసులఁజేరి ఉత్సాహముగా వారి పాదరేణువైనఁ జాలు.

వివరణము: ఇంతకు ముందు వివరించినట్లుగా, ఈ ప్రయాణం (దేవుణ్ణి జీవితంగా ఎన్నుకోవడం) స్వచ్ఛంద నిర్ణయం. అందువల్ల, వెనక్కి తిరిగివెళ్ళే అవకాశం ఎప్పుడూ కాచుకుని ఉంటుంది. అందుకే అన్నమాచార్యులు 'యేమరవద్దు' అని  హెచ్చరించిరి.  జీవితం ఒక తిరిగిరాని ప్రయాణం లాంటిది. అలాగే భగవంతుని వైపు ప్రయాణం కూడా. ఈ మురికి ప్రపంచంలో ఎంత కాలమున్నా కలిగే ప్రయోజనమేమిటి?

ఎగ్గు సిగ్గులేక అనే పదం (గత) అనుభవములు వదలివెళ్ళిన ఆనవాళ్ళు, జాడలపై అధారపడి సంకోచము, తప్పుచేసిన భావములు ఏర్పడతాయని సూచిస్తుంది. అవి 'అనవసరపు మోత​' అని గ్రహించి, తెలివి ఉపయోగించి అవశ్యముగా వదలిపెట్టండి అంటున్నారు.  

'పాదరేణువైనఁ జాలు' అని వినయము, విధేయతల ప్రాముఖ్యమును సూచించిరి. ఇదే విషయమై జలాలుద్దీన్ రూమీ గారు “(విశ్వ)ప్రేమ మార్గంలో యాత్రికుడు అవ్వడానికి మీరు ధూళిలాగా మరియు బూడిదలాగా అణకువగా ఉండుట నేర్వండి” అనిరి.  ​

అన్వయార్ధము: ప్రజలారా, ఈ మురికి ప్రపంచంలోనే పాత సామాను మెలుకువతో వదిలివేయండి. 'అసలు జీవితాన్ని' ఆస్వాదించడానికి వినయంతో ఈ విశ్వంలో గణనకురాని కణం అవ్వండి.

Recommendations for further reading:

5. చదువులోనే హరిని జట్టిగొనవలెగాక ( chaduvulOnE harini jaTTigonavale gAka)

97. ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు? (ODaviDichi vadara vUrakEla paTTEvu?)

 

Summary of this Keertana:

 

O man! without falling into illusions, prostrate (with respect) to the primordial lord. He is the direction, protection, way, basis, asylum, and refuge (to us). Implied meaning: O Man! see thru the veils of ignorance and submit to God.

 

O man! Don’t be revengeful; Don’t feign what you are not! Don’t brag and boast to cut and offer your heart (to God). Perilously don’t break into fire pits. Alas! Just claim to be his men and remain as such. Implied meaning: O man! Don’t confuse liberty with coercion. Path liberty is not in physical action but avoiding action altogether in all its forms.

 

O Man! don't impale each other. Do not sacrifice animals (and offer to God). Do not engage excessively and get tied up in bonds (of relationship). Do not throw glittering things at Dhwaja Sthambham. it’s just sufficient to find the path to the devotees of the lord from distance. Implied meaning: O People! Don’t fight; Lord prohibits animal sacrifice; Offering money and gold is pointless. Stay where you are and find what a noble heart is.

 

Do not be oblivious of the backsteps you may take. Donot take the trouble (put effort) to stay in the dirty place (called this world); Leave the modesty and sinned feeling. Approach the disciples of the Lord and happily be a tiny particle at their feet.  Implied meaning: O people, leave the baggage’s of this dirty world. Humbly become the insignificant particle of this universe to relish the significance of life.

 

 

 

కీర్తన సంగ్రహ భావము:

 

మానవులారా మోసపోకుండా మొక్కండి దిక్కు దెసైన ఆదిదేవునికి. అన్వయార్ధము: ఓ నరుడా! అజ్ఞానపు తెరలను తొలగవైచి భగవంతునికి సమర్పించుకో.

భావము: మానవుడా ప్రతీకారము తీర్చుకోవద్దు; నువ్వుకాని వానిలా నటించకు;  గొప్పలు పోతూ గుండెలు గోసి పెట్టకు. దుర్మార్గంగా గుండాల చిచ్చులోన చొఱవద్దు. ఊరకే మీవారమని వున్నఁ జాలు. అన్వయార్ధము: ఓ నరుడా! స్వేచ్ఛను బలవంతపు మార్గాల్లో కనుగొనలేవు.  స్వేచ్ఛకు మార్గం భౌతిక చర్యలలో కాదు, అనేక రూపాల్లో నిబిడీకృతమైన​ (మరుగున దాగిన) చర్యను గమనించి నివారించడమే విడుదలకు మార్గము.

(జనులారా) ఒకరినొకరు కొఱతవేయ్యవద్దు, పొడుచుకోవద్దు. జీవాలఁ జంపవద్దు. అధికముగా బంధములలో చిక్కుకోవద్దు. ఎత్తుగా గట్టిన నొగ వంటి కఱ్ఱ వద్ద (అంటే ధ్వజస్తంబము వద్ద)  తళుకుతళుకుమను రాజముద్రికలుండు బొమ్మలు (డబ్బులు) చిమ్మఁవద్దు. దూరమునుండి శ్రీపతి దాసుల దారి గన్నఁ జాలు.  అన్వయార్ధము: ప్రజలారా! పోరాడవద్దు; జంతుబలివ్వద్దు; ధనము, బంగారాన్ని అందించ వద్దు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి మరియు నిర్మలమైన హృదయం ఏమిటో కనుగొనండి.

ఎక్కడ డొక్కపడునో (=వెనుదీయుదునో) అని యేమరవద్దు (చాలా జాగరూకతతో ఉండు). దుమ్ముపడిన ఈ లోకములో ఉండుటకు యమబాధలు పడవద్దు. ఎగ్గు సిగ్గులేక (అపరాధ భావము, లజ్జ, బిడియము లేకుండా) వేంకటేశుని దాసులఁజేరి ఉత్సాహముగా వారి పాదరేణువైనఁ జాలు. అన్వయార్ధము: ప్రజలారా, ఈ మురికి ప్రపంచంలోనే పాత సామాను మెలుకువతో వదిలివేయండి. 'అసలు జీవితాన్ని' ఆస్వాదించడానికి వినయంతో ఈ విశ్వంలో గణనకురాని కణం అవ్వండి.

 

 

Copper Leaf: 105-1 Volume 4-593

2 comments:

  1. Annamayya is a real reformist. He condemned the superstitious actions and shown a beautiful path for salvation. That's why his grandson praised him ఈతడే ముక్తిదోవ ఇతడే మా ఆచార్యుడు/ఈతడు కలుగబట్టి ఇందరు బ్రదికిరి...

    Excellent explanation Srinivas garu. Thank you very much.

    ReplyDelete
  2. సాంఘిక దురాచారాలు,అంధ విశ్వాసాలు, మూఢ నమ్మకాలను ఖండించిన మహనీయుడు, సంస్కర్త అన్నమాచార్యులు.
    భ్రమలను,అజ్ఞానపు తెరలను త్రెంచుకొని,మూఢ విశ్వాసములు,
    శరీరాన్ని హింసించుకోవటం,
    పశుబలులు వంటి తామసిక చర్యలవల్ల మోక్షం రాదు. బంధకారకములైన విషయాలలో తగులుకోక, నిర్మల చిత్తముతో,
    సతతము దైవచింతన చేస్తూ,ఈశ్వరుడికి శరణాగతివియై ఆత్మసమర్పణము చేసికొని ముక్తిని వొందుమని అన్నమయ్య ఈ కీర్తనలో లోకులకు ముక్తిమార్గమును చూపించుచున్నాడు.

    శ్రీనివాస్ గారు ప్రతీ పదం యొక్క భావం, కీర్తనలో నిమిడియున్న ఆధ్యాత్మిక సందేశాన్ని చక్కటి వివరణతో సులభగ్రాహ్యం చేశారు.
    వారికి ధన్యవాదములు, నతులు.
    ఓం తత్ సత్ 🙏

    కృష్ణమోహన్ పసుమర్తి

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...