Saturday, 26 June 2021

64. తప్పదు తప్పదు దైవము కృప యిది (tappadu tappadu daivamu kRpa yidi)

 

ANNAMACHARYA

64. తప్పదు తప్పదు దైవము కృప యిది 

Introduction: In this intensely philosophical verse, Annamacharya  is absolutely clear that there are no two worlds ( this world and the world of God). There is only one world, this very one.  He goes a step forward to declare that the fresh feelings generated after removing all the aberrations, are the true virtuous deeds in this world.

By the grace of God we are here in this world. However, by engaging in unnecessary optional (sensory) activities, Annamacharya laments  that we are merely passing the time without really knowing what life is.

ఉపోద్ఘాతము: ఈ ప్రగాఢమైన  తాత్విక కీర్తనలో, అన్నమాచార్యులు రెండు లోకాలు (ఈ  ప్రపంచం, దైవము యొక్క   ప్రపంచం) లేవని ఖచ్చితంగా చెప్పారు. ఉన్నది, ఒకే ప్రపంచం,  అదే మనమున్న ప్రపంచం.  మనస్సులోని శంకలను, వెక్కసపు చర్యలను అంతమొందించిన తరువాత ఉత్పన్నమయ్యే తాజా భావాలు ఈ ప్రపంచంలో నిజమైన సద్గుణమైన  చర్యలని (పుణ్యమని) అని ప్రకటించారు.

భగవంతుని అనుగ్రహము వల్ల మనమీ  లోకంలో ఉన్నాము. అయినప్పటికీ, అనవసరపు ఐచ్ఛిక (ఇంద్రియ) కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా జీవితమంటే యేమిటో తెలియకయే గడిపేస్తున్నామని వాపోయారు.  

కీర్తన

తప్పదు తప్పదు దైవము కృప యిది

ముప్పిరి నింతా ముకుందుఁడే         ॥పల్లవి॥ 

వెక్కసపుమతి వెలుతురుదీరిన-

నెక్కడ చూచిన నీశ్వరుఁడే
గుక్కక యాసలు గోసివేసినను
నిక్క మడుగడుగు నిధానమే ॥తప్ప॥ 

పొంచి శరీరపుభోగము లుడిగిన

చుంచుఁబావములు సుకృతములే
దంచెడివిషయపుతగులమిఁ బాసిన
యెంచిచూచినను యీహమే పరము          ॥తప్ప॥ 

శ్రీవేంకటపతిసేవే కలిగిన

వేవేలువగలు వేడుకలే
చేవదీరె సందియము లేదిదే
భావము నమ్మిన ప్రసన్నులకును   ॥తప్ప॥ 

Details and Explanations: 

తప్పదు తప్పదు దైవము కృప యిది

ముప్పిరి నింతా ముకుందుఁడే       ॥పల్లవి॥ 

tappadu tappadu daivamu kRpa yidi

muppiri niMtA mukuMduDE           ॥pallavi॥ 

Word to Word meaning: తప్పదు (tappadu) = unavoidable;  తప్పదు (tappadu) = unavoidable;  దైవము (daivamu) = God’s;  కృప (kRpa) = compassion, grace; యిది (yidi) = this one; ముప్పిరి (muppiri) = ( having three folds) the three worlds;  నింతా (niMtA) = All over;  ముకుందుఁడే (mukuMduDE)  = Lord Mukunda.   

Literal meaning and Explanation: Entire world is of Lord Mukunda. You are here because you already have the grace of God. 

By this statement, Ananamacharya is telling us that we are all blessed, but dissipating our energies in wasteful ways. We are all those prodigal children.  Probably all the great men said so. 

భావము మరియు వివరణము: ప్రపంచమంతా ముకుందుఁని తోనే నిండి ఉంది. దైవ కృప ఉంది కాబట్టె నువ్విక్కడ ఉన్నావు. 

ఈ పల్లవి ద్వారా, మనకందరికీ దైవము యొక్క ఆశిస్సులున్నా  కాని మన శక్తిని వ్యర్థ మార్గాల్లో చెడగొట్టు కుంటామని అన్నమాచార్యులు చెబుతున్నాడు. మనమంతా దారి తప్పిన పిల్లల లాగేనేమో.  బహుశా మహాత్ములందరూ అదే అర్ధమువచ్చే లాగే అన్నారు.  

వెక్కసపుమతి వెలుతురుదీరిన-

నెక్కడ చూచిన నీశ్వరుఁడే
గుక్కక యాసలు గోసివేసినను
నిక్క మడుగడుగు నిధానమే            ॥తప్ప॥ 

vekkasapumati veluturudIrina-

nekkaDa chUchina nISvaruDE
gukkaka yAsalu gOsivEsinanu
nikka maDugaDugu nidhAnamE  ॥tappa॥ 

Word to Word meaning: వెక్కసపు (vekkasapu) = disgusting మతి (mati)  = mind; వెలుతురుదీరిన-( veluturudIrina) = ( when light reigns) when exposed to light;   నెక్కడ nekkaDa) = wherever; చూచినను (chUchina) = see/look/observe (find); ఈశ్వరుఁడే (nISvaruDE) = god only; గుక్కక (gukkaka) = not stuffing, not cramming;  యాసలు (yAsalu) = desires; గోసివేసినను (gOsivEsinanu) = cut off; నిక్కము (nikkamu) = true, confirmed; అడుగడుగు (aDugaDugu) = everystep; నిధానమే (nidhAnamE) = treasure; 

Literal meaning and Explanation: this disgusting mind, when exposed to light, will find God everywhere. When you to donot stuff your mind with desires OR rather when you cut off the desires, you will find treasures in every step.

First, in almost every religion described god  as light. If there is light within our mind, what actually is making it hidden? We have been told it is a curtain of ignorance.

 

O! all of us are educated enough to remove any such aberrations in the mind!!  Therefore education is of no avail in this journey. Neither many clever people could do. Therefore it is not possible to unravel by tricks. 

Is it possible by isolation? Innumerable people go to Himalayas to meditate.  Is it wise to look elsewhere while the secret is your mind? 

The only tool available is your mind. May be it is like this. There is light at the bottom of large pond. If water is clear, we could see the light. Any attempt to make the water clear is creating ripples to fudge the view. Mind is the water. Our thoughts are the ripples. Our desires are the source of these thoughts. 

Please note that we pass through thousands of thoughts each day. Is it possible to have clear mind in such situation? 

భావము మరియు వివరణము: వెగటు పుట్టించే మనస్సు, కాంతిని చూచినప్పుడు, ప్రతిచోటా దేవుణ్ణి చూడగలుగుతుంది. మీరు మనస్సులో కోరికలను కుక్కకుండా వాటిని కోసివేస్తే, మీరు అడుగడుగునా నిధులనే కనుగొంటారు. 

దాదాపు ప్రతి మతంలో దేవుడిని కాంతిగా వర్ణించారు. మన మనస్సులో కాంతి ఉంటే, వాస్తవానికి దాన్ని దాచి ఉంచినదేమిటో? ఇది అజ్ఞానపు పరదా అని మనకు చెప్పారు.

 

మనమందరం మనస్సులో ఇలాంటి అపసవ్యతలను తొలగించేంత చదువుకున్నామే!! (పెద్ద పెద్ద డిగ్రీలున్నాయే మనకు! ఐనా ఇలా ఉన్నామే?). అందువల్ల ఈ ప్రయాణంలో విద్య వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తెలుస్తోంది. చాలామంది తెలివైన వ్యక్తులూ సాధంచ లేకున్నారు. అందువల్ల ఉపాయాల ద్వారా ఈ చిక్కును విప్పుట సాధ్యం కాదని తెలుస్తోంది.  

లేదా ఏకాంతముతో సాధ్యమా? సాధ్యం కాదు. అసంఖ్యాక ప్రజలు ధ్యానం చేయడానికి హిమాలయాలకు పోతున్నారే? గుట్టు మనస్సులో పెట్టుకొని ఎక్కడో వెతకడం తెలివేనా? 

మనిషికి అందుబాటులో ఉన్న ఏకైక సాధనం మనస్సు. ఇది ఇలా ఉంటుందేమో. పెద్ద చెరువు అడుగున కాంతి ఉంది. నీరు స్పష్టంగా ఉంటే, మనము కాంతిని చూడగలం. నీటిని స్పష్టంగా చేసే ప్రయత్నమైనా అలలు సృష్టించి దృష్టి మసకబారడానికి కారణమౌతుంది. మనస్సు నీరు అనుకుంటే, మన ఆలోచనలే అలలు. మన కోరికలు ఆలోచనలకు మూలం అనేమో! 

ప్రతి రోజు వేలాది ఆలోచనలు మన మదిని దాటుతున్నామని దయచేసి గమనించండి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మలమైన మనస్సు ఉండడం సాధ్యమేనా? ​ 

పొంచి శరీరపుభోగము లుడిగిన

చుంచుఁబావములు సుకృతములే
దంచెడివిషయపుతగులమిఁ బాసిన
యెంచిచూచినను యీహమే పరము         ॥తప్ప॥ 

poMchi SarIrapubhOgamu luDigina

chuMchubAvamulu sukRtamulE
daMcheDivishayaputagulami bAsina
yeMchichUchinanu yIhamE paramu        ॥tappa॥           

Word to Word meaning:  పొంచి (poMchi) =lurking like hunter; శరీరపు (SarIrapu) = body భోగములు (bhOgamulu) = enjoyments; ఉడిగిన (uDigina) = cease, halt, stop; చుంచుఁ (chuMchu) = an infant, nascent; బావములు (bAvamulu) = feelings;  సుకృతములే (sukRtamulE) = virtuous deeds; దంచెడి (daMcheDi) = pounding; విషయపు (vishayapu) = senses; తగులమిఁ (tagulami) = engagement;  బాసిన (bAsina) =( becomes stale=) stay away; avoided; యెంచి (yeMchi) = గణించు. లెక్కించు, విమర్శచేయు, appropriate consideration, proper investigation;  చూచినను (chUchinanu) = on seeing, on verification; యీహమే (yIhamE) = this world (is); పరము (paramu) = the other world. 

Literal meaning and Explanation: When body enjoyment ceases only then nascent (or fresh) feelings actually will have chance to flower. They are the truly virtuous things. When the mind is free from the sensory enjoyment, you will have chance for proper investigation to find that there are no two worlds, this is the only world. 

Obviously Ananamacharya’s these words are truly revelatory. These words of Ananamacharya were repeated umpteen times by Jiddu Krishnamurti. 

Most important statement made is one should be free to examine. While mind is ceased with thousands of activities, where is the space for knowing god? 

The freshness of freedom  emanates from innocence Second it is highly vulnerable (most of us are afraid of the vulnerability. We build walls of security). The security walls are a deterrent for innocence. 

Entire world, irrespective of religious affiliations, believe that there are two worlds.  Our mind derives a consolation that after this life (which we know painfully that we are wasting) “I can go there to the other world.” What a phenomenal trick the mind plays!! We go to extent of fighting with the anyone who pulls away our this illusionary comfort

Annamacharya did not mince words to declare that there are no two worlds, this is the only world where we live. 

భావము మరియు వివరణము: శరీర భోగములు కోసము ఎదురు చూపులు ఆగిపోయినప్పుడు మాత్రమే కొత్త (లేదా తాజా) భావాలు పుష్పించే అవకాశం ఉంటుంది. అవే నిజంగా సద్గుణమైన విషయాలు. ఇంద్రియ క్రియల నుండి మనస్సు విముక్తి పొందినప్పుడు మాత్రమే నిష్పాక్షికమైన దర్యాప్తుకు అవకాశం ఉంటుంది. అప్పుడు రెండు ప్రపంచాలు లేవని ఉన్నది ఏకైక ప్రపంచమని తెలుసుకోంటారు. 

అన్నమాచార్యులు సహజంగానే మౌలికమైన సత్యాన్ని బహిర్గతం చేసారు. అన్నమాచార్యుల మాటలను జిడ్డు కృష్ణమూర్తి పదేపదే పునరావృతం చేశారు. 

వారు చేసిన అతి ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే పరిశీలించడానికి స్వేచ్ఛ కావాలి.  వేలాది కార్యకలాపాలలో మనస్సు మునిగి ఉంటే, దేవుణ్ణి తెలుసుకోవటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? 

స్వేచ్ఛ యొక్క తాజాదనం నిష్కాపట్యము నుండి ఉద్భవించును. రెండవది మనిషి దుర్బలుడౌతాడు (మనలో చాలా మంది దుర్బలత్వానికి భయపడతారు. అందుకే భద్రతా వలయాలను నిర్మిస్తాము). భద్రతా వలయాలు నిష్కాపట్యమును హరించును. 

మొత్తం ప్రపంచం, మతాలతో సంబంధం లేకుండా, రెండు ప్రపంచాలు ఉన్నాయని నమ్ముతుంది. జీవితం (బాధాకరమైనా, మనం వృధా చేస్తున్నామని మనకు  తెలిసినా) తరువాత నేను అక్కడ మరో ప్రపంచానికి వెళ్ళగలను; (అక్కడ ఇంతకంటే బాగుంటాను;) అనే భరోసా మనస్సుకు ఓదార్పునిస్తుంది. మనస్సు ఎంత అద్భుతమైన నాటకం ఆడుతుందో!!  మన భావనలను కాదన్నవారితో విరొధము పేట్టుకోవడానికి కూడా జంకము. 

అన్నమాచార్యులు రెండు ప్రపంచాలు లేవని ప్రకటించడానికి వెనుకాడలేదు. మనిషి ఊహాత్మక లొకాన్ని భగ్నం చేస్తూ మనం నివసించే ఏకైక ప్రపంచం ఇదేనని వాస్తవాన్ని ధృవీకరించారు. 

శ్రీవేంకటపతిసేవే కలిగిన

వేవేలువగలు వేడుకలే
చేవదీరె సందియము లేదిదే
భావము నమ్మిన ప్రసన్నులకును ॥తప్ప॥ 

SrIvEMkaTapatisEvE kaligina

vEvEluvagalu vEDukalE
chEvadIre saMdiyamu lEdidE
bhAvamu nammina prasannulakunu      ॥tappa॥ 

Word to Word meaning:  శ్రీవేంకటపతి (SrIvEMkaTapati) = Lord Venkateswara; సేవే (sEvE) = service; కలిగిన (kaligina) = being;  వేవేలు (vEvElu)  = thousands of; వగలు (vagalu) = మాయలు, illusions; వేడుకలే (vEDukalE) =వినోదము, entertainment;  చేవదీరె (chEvadIre)= ధైర్యముతో ; సందియము లేదిదే (saMdiyamu lEdidE) = without doubts;  భావము (bhAvamu) = mind, soul; నమ్మిన (nammina) = believe; ప్రసన్నులకును (prasannulakunu) = pleased or delighted person;          

Literal meaning and Explanation: For the devotee who is brave, without doubts, has complete belief in himself, in service of Lord Venkateswara, these thousands of illusions are part of entertainment. 

The four qualities described above brave, without doubts, complete belief in himself and in service of the lord are themselves great qualities. Therefore such devotee will achieve liberation. 

భావము మరియు వివరణము: ధైర్యవంతుడు, సందేహాలు లేనివాడు, , తనపై పూర్తి నమ్మకం ఉన్నవాడు, వెంకటేశ్వరుని సేవలో ఉన్న భక్తుడికి, వేలాది భ్రమలు వినోదంలో అంతర్భాగం. 

ఇన్ని మంచి గుణాలుంటే  మోక్షము లభించడంలో సందేహమెందుకు?    

 

zadaz

 

 

Reference: Copper Leaf: 78-2, Volume: 1-371

3 comments:

  1. Chala baga vivarincharu,prapanchamlo manushula reethi gurunchi

    ReplyDelete
  2. Great rendition by Annamayya and equally great is the commentary. There is no other world, we need to remove our safety walls and illusions of another world, then devotion for Lord Balaji would take us to HIS feet, to the only one world and HIS world.

    ReplyDelete
  3. ఈ జగత్తు అంతా దైవం చేత నింపబడి యున్నది. ఉన్నది ఒకటే లోకం. అదే మనం నివశించుచున్న ఈ లోకం.భగవంతుడు జగత్తంతా నిండియున్నాడు.

    ఈశావాస్య ఉపనిషత్తు లోని ఈ మంత్రాలలో చెప్పబడినది ఇదియే.

    *ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే|*
    *పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే||*
    ఓం శాంతిః శాంతిః శాంతిః.
    (ఈశా.శాంతి మంత్రం)

    దేవుడి నుంచి ఉద్భవించటం వలన ఈ జగత్తు కూడా భగవంతుని అంశ లేక భగవంతునిచే నిండియున్నదని
    ఈ మంత్రము యొక్క సారాంశం.

    దైవానుగ్రహమున్నది కనుకనే
    మనమీ లోకమందున్నాము. అజ్ఞానవశమున మనస్సు లౌకిక విషయములందు,కోరికల యందు చిక్కుకొనుట వలన మనయందే యున్న దైవాన్ని చూడలేకున్నాము.కోరికలను ఇంద్రియనిగ్రహం వలన అడ్డుకొని, మనస్సులో చొరబడకుండా చేసినచో, అడుగడునా భగవంతుని ప్రకాశమును మనం చూడగలుగుతాము.అంతటా దేవుని నిధానమే కాననగును. అంటే అజ్ఞానమనే తిమిరము నుంచి బయటపడి, జ్ఞానమనే ప్రకాశమును దర్శించగలం.

    శరీరం భోగవాసనల యెడ ఆసక్తిని సంపూర్ణంగా వీడినప్పుడే నవజాత భావము లుదయించి, వికసిస్తాయి. సద్గుణములు పరిమళిస్తాయి.ఇంద్రియక్రియల నుంచి ఎప్పుడైతే మనస్సు విముక్తి పొంది, పరిశుద్ధమౌతుందో అప్పుడే చిత్తము భగవంతుని అన్వేషణ యందు ఏకాగ్రమై,లగ్నమై ఉంటుంది.అప్పుడే ప్రపంచ మొక్కటే యని, రెండు లేవని గ్రహించుట సాధ్యం. శ్రుతివాక్యమైన
    *ఏకమేవా ద్వితీయమ్* అనే భావన, అనుభూతి స్థిరపడుతుంది.

    ధీరత్వము కలిగిన వాడు,సందేహములకు ఏమాత్రం తావు ఈయనివాడు,భగవంతుని యందు పరిపూర్ణ భక్తివిశ్వాసములు కలిగినవాడు అయిన శ్రీవెంకటేశ్వరుని భక్తుడికి
    ఈ సమస్తమైన భ్రమలు,మాయలు అనునవి అతడి వినోదంలో అంతర్భాగములే. అంటే
    అవేమీ శ్రీనివాసుని భక్తుడిని ఏవిధంగానూ ప్రభావితం చేయాజాలవు. వాటన్నిటికీ అతడు అతీతుడై, భగవంతుడి సన్నిధిలో రమిస్తూ ఉంటాడు కాబట్టి.
    🙏🙏

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...