అన్నమాచార్యులు
205.
రాతిఁ బతిమ సేసిన రామచంద్ర
రామభక్తి.
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి: "రాతిని నాతిగా
చేయగలిగినటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రా నన్ను నీ చేతిలో సమర్పించు కుంటున్నాను.
నువ్వేం చేద్దామనుకుంటే అది చేయి" అని అన్నమాచార్యులవారు తన స్వతంత్రమంతటినీ రామచంద్రునికి
అప్పచెప్పారు.
చరణము 1: రామచంద్ర మీకు అపకీర్తి కలిగేటట్టుగా నింద వచ్చేటట్టుగా
యథార్థముగా నన్ను దూరంగా పెట్టి మసలుకోకు. నీపై ఎంతో ప్రేమతో ఉన్నాను. నన్ను ఈ ప్రపంచపు
దుఃఖంలో ముంచివేయకు రామచంద్ర.
చరణము 2: విన్నపాలు వేలకొద్ది ఎలా రామచంద్ర? నా కన్నులకు నీవేకదా గురి! (నిన్ను కాక వేరెవరినీ ఆశ్రయించడం లేదు అని అర్ధం.) నన్ను వదిలిపెట్టకుండా ఉండు రామచంద్ర. నన్నే ఎంచుకొని ఉండరాదా రామచంద్ర.
చరణము 3: రామచంద్రా నా మర్మాలు అన్నింటినీ దాచుకోకుండా నీకు చెప్పేసాను. అపరిమిత బలముగల రామచంద్రా ఇక్కడ (ఈ లోకములో) మనిద్దరినీ కలిపేది ఒక్క సమయమే కదా! ఆ వైపు అనగా నేను మరణించిన తర్వాత మీ ఇంటి ముందటి సుగంధం ముక్కలాగా నేను నిల్చుంటాను. నీవు స్వయముగా వెంకటాద్రికి చెందినవాడివి రామచంద్రా.
ఉపోద్ఘాతం: అన్నమాచార్యుల వారు తనను తాను ఒక స్త్రీగా ఊహించుకుని రామచంద్రునికి చేసుకున్న విన్నపం.
అధ్యాత్మ కీర్తన: రాగిరేకు 262-5 సంపుటము: 3-359 |
రాతిఁ బతిమ సేసిన రామచంద్ర
నీ-
చేతిలోనిదాన నింతే శ్రీరామచంద్ర ॥పల్లవి॥ వట్టిరట్టు సేయ కిఁక వద్దు
రామచంద్ర
నెట్టన నే దూరనోప నిను
రామచంద్ర
వొట్టితిఁ బ్రేమము నీపై
వో రామచంద్ర మమ్ము
వట్టిజాలిఁ బెట్ట కిఁక
వద్దు రామచంద్ర ॥రాతిఁ॥ విన్నపాలు వేయునేల విను
రామచంద్ర మా-
కన్నులకు నీవె గురి ఘనరామచంద్ర
యెన్నిక నన్నుఁ బాయకు మిఁక
రామచంద్ర
నిన్ను నన్ను నెంచుకొమ్మీ
నీవు రామచంద్ర ॥రాతిఁ॥ ఆయము లంటితివి నెయ్యపురామచంద్ర
వొక్క-
పాయమే ఇద్దరికిని బలురామచంద్ర
ఆయెడ వావిలిపాటి హరిరామచంద్ర
చేయార శ్రీ వేంకటాద్రిఁ
జెందితి రామచంద్ర ॥రాతిఁ॥
|
Details and
explanations:
భావము: "రాతిని నాతిగా చేయగలిగినటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రా నన్ను నీ చేతిలో సమర్పించు కుంటున్నాను. నువ్వేం చేద్దామనుకుంటే అది చేయి" అని అన్నమాచార్యులవారు తన స్వతంత్రమంతటినీ రామచంద్రునికి అప్పచెప్పారు.
ముఖ్యపదములకు అర్ధములు: రట్టు = అపకీర్తి, నింద; నెట్టన = అనివార్యముగా, నిజముగా, యథార్థముగా; వొట్టితిఁ = పట్టితిఁ; వట్టిజాలిఁ బెట్ట = వట్టి దుఃఖపడునట్లు.
భావము: రామచంద్ర మీకు
అపకీర్తి కలిగేటట్టుగా నింద వచ్చేటట్టుగా యథార్థముగా నన్ను దూరంగా పెట్టి మసలుకోకు.
నీపై ఎంతో ప్రేమతో ఉన్నాను. నన్ను ఈ ప్రపంచపు దుఃఖంలో ముంచివేయకు రామచంద్ర.
ముఖ్యపదములకు అర్ధములు: బాయకు మిఁక = వదలిపెట్టవద్దు; నన్ను నెంచుకొమ్మీ = నన్నే ఎంచుకో.
భావము: విన్నపాలు వేలకొద్ది ఎలా రామచంద్ర? నా కన్నులకు నీవేకదా గురి! (నిన్ను కాక వేరెవరినీ ఆశ్రయించడం లేదు అని అర్ధం.) నన్ను వదిలిపెట్టకుండా ఉండు రామచంద్ర. నన్నే ఎంచుకొని ఉండరాదా రామచంద్ర.
వివరణము: నువ్వు ఎంచుకోకపోతే నా అంతటికి నేను కనుగొనలేను. కాబట్టి నువ్వే నన్ను రక్షించు.
ముఖ్యపదములకు అర్ధములు: ఆయము లంటితివి =
నా మర్మములన్నీ నీకు చెప్పేసితిని; నెయ్యపు = స్నేహశీలి; పాయమే = వయస్సే,
సమయమే; బలు = సమాసమందు బలువు శబ్దమున కేర్పడు రూపము;
వావిలిపాటి = ఒక సుగంధపు మొక్కలాగ; చేయార = చేతులార.
భావము: రామచంద్రా నా మర్మాలు అన్నింటినీ దాచుకోకుండా నీకు చెప్పేసాను. అపరిమిత బలముగల రామచంద్రా ఇక్కడ (ఈ లోకములో) మనిద్దరినీ కలిపేది ఒక్క సమయమే కదా! ఆ వైపు అనగా నేను మరణించిన తర్వాత మీ ఇంటి ముందటి సుగంధం ముక్కలాగా నేను నిల్చుంటాను. నీవు స్వయముగా వెంకటాద్రికి చెందినవాడివి రామచంద్రా.
వివరణము: మొదటి పల్లిలో పంక్తిలో తన దగ్గర రహస్యాలేమీ లేవు అని తాను స్వచ్ఛమైన
వాడిని అని ప్రకటించుకున్నారు అన్నమాచార్యులు. అనంతమగు ఈ జీవన ప్రయాణంలో మానవులకు స్పృహ
కలుగుతున్నది కొద్దిపాటి కాలము మాత్రమే (భగవద్గీత 2-28). రెండవ పంక్తిలో
తనకు కలిగిన ఈ కొద్దిపాటి సమయంలో కూడా తనను దూరము చేసి వుండవద్దు అని వేడుకొనుచున్నారు. అంతే కాదు తాను మరణించిన తర్వాత కూడా ఇదే రకంగా
ఒక సుగంధ మొక్కలాగ హరి కీర్తనలను సువాసనలను వెదజల్లుతూ వ్యాపింపజేస్తూ ఉంటాను అంటున్నారు.
-x-x-x-
No comments:
Post a Comment