Saturday, 24 April 2021

41 తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు (tanakEDa chaduvulu tanakEDa SAstrAlu)

ANNAMACHARYA

41 తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు 

Introduction: In this short, but significant verse, Annamacharya says, quest for knowledge should not be confused for the action required to liberate oneself. He compares, this hunt for more knowledge is akin to a blind dog going to market. 

Annamacharya does not beat around the bush to make his point. He is a crusader of truth. He is clear that pursuance of education & knowledge are not going to lead to path of liberation. 

Thus he is asking us to introspect and understand that the true knowledge is not gaining more, but to dissociate from the wrong knowledge/ notions/ conclusions.  He is talking of nascent state which is bereft of experience, where only intelligence has chance to shine. 

Indirectly he said that as long as we cling to transient things like our ideas, our conclusions, our idiocy mind continues to waver. Once we discover the permanent thing, the mind would calm down. 

ఉపోద్ఘాతము: భావగర్భితమైన చిన్ని కీర్తనలో మనసు యొక్క చంచలబుద్ధిని మాన్పలేని చదువులు, శాస్త్రాలు నిష్ప్రయోజనమని  కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు. 

అన్నమాచార్యులు సూటిగా స్పష్టంగా చెప్పడములో దిట్ట​. సత్యాన్వేషణలో దారికి అడ్డము వచ్చు నన్నింటిని పనికిరానివని ప్రకటిచుటకు వెనుకాడలేదు. ఇక్కడ చదువులు, జ్ఞాన సముపార్జన కూడా ప్రక్కదారి పట్టిస్తున్నాయని, అందుకే వ్యర్ధమని చెప్పారు. 

ప్రతీవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సత్యాన్వేషణ మరింత  జ్ఞానము పెంచుకొనుట కాదని, వ్యర్ధమగు అభిప్రాయములను, సిద్ధాంతములను ఊహలను, అనుమానములను, అర్ధహీనమగు హద్దులను చెరపివేయడమే అన్నారు. 

జాగ్రత్తగా గమనించిన మనిషి ఆరాటపడున వన్నీ తాత్కాలికములే. శాశ్వతమైన దానిని ప్రత్యక్షంగా తెలుసుకొన్నప్పుడు చంచలత్వము ఉండదని యీ కీర్తన సందేశము. 

తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు

మనసు చంచలబుద్ధి మానీనా          ॥పల్లవి॥ 

tanakEDa chaduvulu tanakEDa SAstrAlu

manasu chaMchalabuddhi mAnInA           pallavi 

Word to word meaning: తనకేడ (tanakEDa) = why? చదువులు(chaduvulu) = education/ training తనకేడ (tanakEDa ) = Why?  శాస్త్రాలు (SAstrAlu) = a sacred precept, spiritual injunction; మనసు (manasu) = mind; చంచలబుద్ధి (chaMchalabuddhi) = wavering nature;  మానీనా (mAnInA) = will it stop? 

Literal Meaning: What use is served by education and spiritual injunctions when they failed to stop the mind from wavering? 

Comments: Annamacharya is transparent that no use has been served by education and religious books, because they failed to correct the mind from wavering. 

Probably, he is asking what education is.  Quest for knowledge should not be confused for the action required to liberate oneself. 

Obviously he is stating that one has to leave everything he knows in the endeavour to reach God. What man does is the opposite of it? Therefore Annamacharya addresses him as stupid in this verse. 

భావము: చదువులు, శాస్త్రాలు దేనికో? అవి మనసు యొక్క చంచలబుద్ధిని మాన్పగలవా? 

వ్యాఖ్యలు మనసు యొక్క చంచలబుద్ధిని మాన్పలేని చదువులు, శాస్త్రాలు నిష్ప్రయోజనమని  కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు.

మానవుడు తనను తాను అను చెఱనుంచి విడిపించుకొను స్వతంత్ర ప్రయత్నము /ప్రార్ధన​/నివేదన​.

జ్ఞానాన్వేషణ మనిషి యేర్పరచుకున్న ఒక వ్యాసంగం, వ్యాపకం.   జ్ఞానాన్వేషణను భక్తితో పొరపడరాదు. అన్నారు. 

పుట్టుక, జాతి, చదువుల కన్నా దైవముపై ప్రగాఢమైన విశ్వాసము/నిశ్చయము వుండడం ముఖ్యమని ధూర్జటి గారు క్రింది పద్యంలో సాలె పురుగు, పాము, ఏనుగు మరియు కన్నప్పల భక్తి ద్వారా వివరించారు. 

శా. వేదంబుఁ బఠించె లూత, భుజగంబే శాస్త్రముల్చూచెఁ దా

నే విద్యాభ్యసనంబొనర్చెఁ గరి, చెంచే మంత్రమూహించె, బో
ధావిర్భావనిధానముల్చదువులయ్యా! కావు! మీపాద సం
సేవాసక్తియె కాక జంతుతతికిన్శ్రీకాళహస్తీశ్వరా! 

భావముశ్రీకాళహస్తీశ్వరా ! సాలెపురుగు వేదాలు చదివింది? పాము ఏశాస్త్రాలు చదివింది? ఏనుగు విద్యాభ్యాసం చేసింది? చెంచు కన్నప్ప మంత్రము నేర్చాడు? నీ పాదాలు శ్రధ్దతో సేవించాలనే కోరికయే జంతు జాతికి నిజమైన చదువు. (గురువులు చెప్తే వచ్చే పాఠాలు చదువులు కావు అని గమనించండి. ఇక్కడ  ధూర్జటి గారు, అనేక మార్లు భగవద్గీతలోను మనిషిని జంతు జాతితో కలిపి చెప్పారు).

జడ్డుమానవుఁడు చదువఁజదువ నాస

వడ్డివారుఁగాక వదలీనా
గుడ్డికుక్క సంతకుఁబోయి తిరిగిన
దుడ్డుపెట్లే కాక దొరకీనా           ॥తన॥ 

jaDDumAnavuDu chaduvajaduva nAsa

vaDDivArugAka vadalInA
guDDikukka saMtakubOyi tirigina
duDDupeTlE kAka dorakInA            tana 

Word to word meaning: జడ్డు (jaDDu) =  జాడ్యము, Dulness, folly, stupidity; మానవుఁడు (mAnavuDu) = man;  చదువఁజదువ (chaduvajaduva) = after reading/educating much,  నాస (nAsa) = want, avarice;   వడ్డివారుఁగాక (vaDDivArugAka) = ఎక్కువగు, అధికమగు, increases multi fold;   వదలీనా (vadalInA) = does not go away;  గుడ్డికుక్క (guDDikukka) = a blind dog;  సంతకుఁబోయి (saMtakubOyi) = goes to market; తిరిగిన (tirigina) = moves around; దుడ్డుపెట్లే (duDDupeTlE) = receives only blows from a cudgel; కాక (kAka) = what else; దొరకీనా (dorakInA?) = will it  receive?

Literal Meaning: Stupid man even after much of education, only his wants become more  but never would get satisfied with what he has. This kind of pursuance (of education inturn more wants) is akin  blind dog going to market, only to get driven away by cudgels, what else one can expect? 

Comments: Is it fair to castigate man as stupid? Conventional answer is NO. However, please consider that both Jiddu Krishnamurti and Annamacharya mentioned multiple times about living with great intelligence. Here Annamacharya meant that with our present methods of living this great intelligence does not have chance to flourish. He is asking us to pursue totally different path. 

Now most of the people in the world are educated. Has it changed the situation for the man? He continues to face the same dilemma a man faced during the bible time. Thus erudition is no measure for this path of liberation. 

భావము: తెలివితక్కువతనం గల మానవుడు యెత చదివినా ఆశ అధికమగునే కానీ వదలివేయునా? గుడ్డికుక్క సంతకుఁపోతే  అక్కడి వాళ్ళు కర్ర పెట్టి కొడతారే కానీ వేరే యేమి దొరకునూ? 

వ్యాఖ్యలు ఇక్కడ మనిషిని తెలివితక్కువ వాడు అని వ్రాయడము సబబేనాసాధారణ జవాబు కాదు. నిజానికి మనము ఉపయోగిస్తున్న తెలివితేటలు పైపైన ఉన్నవే. అన్నమాచార్యులు, జిడ్డు క్రిష్ణమూర్తి గారలు చెప్పిన గొప్ప మేధస్సు ఇప్పటి మన విధానాలతోటి మొలకెత్తలేదు అని సూచిస్తూ తెలివితక్కువ వాడు అని వ్రాసారు. అందుకనే మనిషిని గుడ్డికుక్కతో  పోల్చారు. దైవమును పొందుటకు మనిషి చర్యలు కాకుండా వేరేవి చేపట్టవలెనని సూచన​. 

రోజున ప్రపంచములో దాదాపు అందరూ చదువుకున్నవాళ్ళే. ఐనప్పటికీ, ఈనాటి మనిషి కూడా రామాయణ కాలమునాటి సమస్యలనే ఎదుర్కొంటున్నాడు. అనగా పాండిత్యము మనిషిని బంధాల నుండి విడిపించదని అర్ధము. 

దేవదూషకుఁడై తిరిగేటివానికి

దేవతాంతరము తెలిసీనా
శ్రీవేంకటేశ్వరుసేవాపరుఁడుగాక
పావనమతియై పరగీనా           ॥తన॥ 

dEvadUshakuDai tirigETivAniki

dEvatAMtaramu telisInA
SrIvEMkaTESvarusEvAparuDugAka
pAvanamatiyai paragInA       tana 

Word to word meaning: దేవదూషకుఁడై (dEvadUshakuDai) = దైవాన్ని  నిందించుచు, resorting blasphemy తిరిగేటివానికి (tirigETivAniki) = spends time in it; దేవతాంతరము (dEvatAMtaramu) = Difference between God and Man; (what makes god different from man); తెలిసీనా (telisInA) = can he ever comprehend?  శ్రీవేంకటేశ్వరుసేవాపరుఁడుగాక (SrIvEMkaTESvarusEvAparuDugAka) = unless in deep devotional service of Lord Venkateswara;  పావనమతియై (pAvanamatiyai) = being clear in mind; పరగీనా (paragInA) = can he be in that state? 

Literal Meaning: A person indulging in blasphemy would be unable to fathom difference between the man and God. Without being the true devotee of Lord, he shall not become clear in mind. Such a person can never experience truth. 

Comments: A man daring to criticise God will not fear to criticise his circumstances and his fellow beings. Thus he tends to waste time. 

Let us try to understand who is a true devotee. As stated in  Bhagavadgita शरीरस्थोऽपि कौन्तेय करोति लिप्यते śharīra-stho ’pi kaunteya na karoti na lipyate(13-32) Although situated within the body, the Atman neither acts, nor is It tainted by material energy. This means that the devotee must find god within himself. This requires very high degree of one-ness with the nature.  This one-ness is the remedy for the wavering nature.

భావము: దైవాన్ని  నిందించుచు తిరుగువాడు, దైవముకు మనిషికి ఉన్న అంతరాన్ని గమనించలేక, నిజమైన శ్రీవేంకటేశ్వరుని సేవాపరుఁడు కాకుండా నిర్మలుడు  కాలేడు. ఆట్టివాడు సత్యమును గ్రహించ లేడు.

వ్యాఖ్యలు : దైవాన్ని నిందించువాడు తోటివారినీ విమర్శించును. అట్టీవాడు సత్యమును గ్రహిపలేక కాలము వృధా చేసికొనునని ఆంతర్యము 

శ్రీవేంకటేశ్వరుని సేవాపరుఁడుఅన్న విషయాన్ని కొంత పరిశీలిద్దాము. భగవద్గీతలో అన్నట్లు శరీరస్థోఽపి కౌంతేయ కరోతి లిప్యతే (13-32) దైవము దేహములోనే స్థితమై ఉన్నా, ఆయన ఏమీ చేయడు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాడు. ఆనగా నిజమైన సేవాపరుఁడు శ్రీవేంకటేశ్వరుని హృదయములోనే దర్శించును. దర్శనమునకు అత్యత కఠినమైన ఏకాగ్రత కావలెను. ఏకాగ్రతతో చంచలబుద్ధి మానునని తెలియవచ్చు.

 

zadaz

Reference: copper leaf 32-3, volume: 1-198 

Thursday, 22 April 2021

Take away from the verses 31-40

 ANNAMACHARYA the Ultimate Philosopher

Take away from the  verses 31-40

Take away from the last 10 submissions presented here so that we can recapitulate from the freshness of our memory. So far we covered the following verses:

31.          చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి

32.             అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము

33.          గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ

34.             ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది

35.             పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము

36.             ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె

37.             కలలోని సుఖమే కలియుగమా

38.             కడలుడిపి నీరాడగా తలచువారలకు

39.             అదిగాక నిజమతంబది గాక యాజకం

40.         రూకలై మాడలై రువ్వలై తిరిగీని 

Few Notable statements in these verses throw light on the philosophy of Annamacharya.  These are: It is worth noting that Annamcharya’s observations are quite independent and accurately describing the situations faced by humans. Of course, they are as relevant today as they were when propounded by him. Thus he remains very modern relevant even today. 

1.  What is the use of living a life with great effort; how is it different from death. చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి (chAla novvi sEyunaTTi janmamEmi maraNamEmi verse 31)

2.  Is it not better to dissolve/reduce one’s own ego? (మాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా mAlugalapi doratanaMbu mAnpu TiMta chAladA verse 31)

3.    What is a sinful act? What is virtuous act? Aren’t  both these causing myriad bonds? పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు కడపరానిబంధములకుఁ గారణంబులైనవి puDami bApakarmamEmi puNyakarmamEmi tanaku kaDaparAni baMdhamulaku gAraNaMbulainavi verse 31)

4.    It doesn't matter, whether the chains are made of gold or iron. Anyway they are pulling you from seeing upwards  యెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమి / మెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి yeDapakunna pasiDi saMkelEmi yinupasaMkelEmi meDaku dagiliyuMDi yepuDu mIduchUDarAnivi  verse 31)

5.    Will you derive satisfaction because of receiving a blow/hit from a gold staff or an iron staff, while you continue to groan in pain? యెలమిఁ బసిఁడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు ములుగ ములుగఁ దొలితొలి మోఁదు టింత చాలదా yelami basiDigudiyayEmi yinupagudiyayEmi tanaku muluga muluga dolitoli mOduTiMta chAladA verse 31)

6.   Whether a man is performing rightful duty, wrong duty; eying a tiny fraction of the fruits of action is sufficient to chain him.  కర్మియైనయేమి వికృతకర్మియైననేమి దనకు కర్మఫలముమీఁదకాంక్ష గలుగు టింత చాలదా karmiyainayEmi vikRtakarmiyainanEmi danaku karmaphalamumIda kAMksha galuguTiMta chAladA verse 31)

7.    When everything is embedded in us, why do we look outside side? Oh mind, note this is the true illusion which is not known before. అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము / యెన్నఁడు గాననిమాయ యెరఁగవో మనసా anniyu nAlO nuMDaga navvala nEmi chUchEmu yennaDu gAnanimAya yeragavO manasA      verse 32)

8.    While our life itself is an enchantment, it’s paradoxical that we attend Magic shows. While our own bondages are very many, it’s ironical that we keep enjoying performances of a person enacting many faces in the same breath. యీడనే సంసార మిదె యింద్రజాలమై యుండఁగ / యేడకైనాఁ జూడఁ బోయే మింద్రజాలము /పాడితో నా పట్టుగులే బహురూపాలై యుండఁగ /వేడుకయ్యీ బహురూపవిద్యలు చూడఁగను    yIDanE saMsAra mide yiMdrajAlamai yuMDaga / yEDakainA jUDa bOyE miMdrajAlamu / pADitO nA paTTugulE bahurUpAlai yuMDaga / vEDukayyI bahurUpavidyalu chUDaganu verse 32)

9.      While our day to day life itself is akin to Drama, it is surprising that we repeatedly go and watch a drama to trick ourselves. The dispensations of providence in themselves are trickery; yet we are inclined to witness these practices of trickery exhibited by professionals నటన దినదినము నాటకమై యుండఁగాను / సటవట నాటకాలు సారెఁ జూచేము / ఘటన మాయలెదుటఁ గనుకట్టై వుండఁగాను /అటమటపువిద్యలు అన్నియుఁ జూచేము         naTana dinadinamu nATakamai yuMDagAnu / saTavaTa nATakAlu sAre jUchEmu / ghaTana mAyaleduTa ganukaTTai vuMDagAnu / aTamaTapuvidyalu anniyu jUchEmu verse 32)

10. We grapple constantly with the virtuous and sinful deeds all the while; still we crave to see the plays full of innuendos. పాపపుణ్యములు రెండు బారివిద్య లుండఁగాను / కోపుల నాటలవారిఁ గోరి చూచేము pApapuNyamulu reMDu bArividya luMDagAnu / kOpula nATalavAri gOri chUchEmu verse 32)

11. On this horseless vehicle, without any hesitation, with pride (that he knows or  he can tackle), man takes up the journey of life. గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ / విఱ్ఱవీఁగుచుఁ దీసీని వేడుకతో జీవుఁడు gu~r~rAla gaTTani tEru koMka keMdainA bArI / vi~r~ravIguchu dIsIni vEDukatO jIvuDu verse 33)

12. No purpose is served for being human, without truly believing and submitting one's will at God's disposal. ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది / నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బిఁకనూ ekkaDi mAnushajanmaM bettina phalamE munnadi / nikkamu ninnE nammiti nI chittaM bikanU   verse 34)

13. Oh! God!! The spell you cast makes me overlook (hard learnt) philosophy, teachers, good learning. Yet I don't forgo tasty food, worldly pleasures and engagement with senses. విడువనుఁ బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు / విడువను మిక్కిలి యాసలు విష్ణుఁడ నీ మాయా / విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును / విడిచెద నాచారంబును విష్ణుఁడ నీ మాయా viDuvanu bApamu puNyamu viDuvanu nA durguNamulu / viDuvanu mikkili yAsalu vishNuDa nI mAyA / viDicheda shaTkarmaMbulu viDicheda vairAgyaMbunu / viDicheda nAchAraMbunu vishNuDa nI mAyA verse 34)

14. Sir, under the spell of illusion, I keep holding my firm views on sin and virtue. Neither I let slip my wrong obsessions nor curtail my wants. Yet, I am ready to relinquish long practiced aceticism, six good habits. విడువనుఁ బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు /విడువను మిక్కిలి యాసలు విష్ణుఁడ నీ మాయా / విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును / విడిచెద నాచారంబును విష్ణుఁడ నీ మాయా / viDuvanu bApamu puNyamu viDuvanu nA durguNamulu / viDuvanu mikkili yAsalu vishNuDa nI mAyA / viDicheda shaTkarmaMbulu viDicheda vairAgyaMbunu / viDicheda nAchAraMbunu vishNuDa nI mAyA verse 34)

15. I always get hooked to lustful pleasures and bondages. Yet, my thoughts even for iota of time, never got hooked to the path liberation. తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల / తగులను మోక్షపుమార్గము తలఁపున యెంతైనా tagileda bahulaMpaTamula tagileda bahubaMdhaMbula / tagulanu mOkshapumArgamu talapuna yeMtainA verse 34)

16. We are elders only in age, not in maturity. Life got wasted in grunting; We have not grown tall to see the path to salvation. పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము / కఱకఱలే కాని కడగంట లేదు / pe~rugaga be~rugaga beddalamaitimi nEmu / ka~raka~ralE kAni kaDagaMTa lEdu verse 35)

17. Man is conditioned to possess everything he sees.  Actions having roots in selfish gains are sinful. ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె / వేదు విడిచిన కూడు వెదకినను లేదు Edi jUchina damaku yinniyunu niTuvalene / vEdu viDichina kUDu vedakinanu lEdu verse 36)

18. No one is lonely even in isolation for his thoughts, particularly the sorrowful ones, surround him. Man cannot cherish even a little comfort like loneliness unless he has resolved all his sorrows. ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు / పైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాక EkAMtasaukhyaMbu lekkaDivi prANulaku / paikonnadu@hkhamula pAlupaDe gAka  verse 36)

19. Man due to his stupidity attempts virtuous deeds, instead of dissociating from the corruption and contamination.   యేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికి / కైకొన్నదురితములు కలపాటిగాక  yEkamagu puNyaMbu lEDAgala viMdariki / kaikonnaduritamulu kalapATigAka verse 36)

20. Humans get disturbed due to separation (from the society). In order to get solace from this unhindered sorrow of separation, they search for beneficial belongingness (which does not exist). హితవైనమమకార మెందుఁగల దిందరికి / ప్రతిలేని విరహతాపము కొలఁదిగాక hitavainamamakAra meMdugala diMdariki / pratilEni virahatApamu koladigAka verse 36)

21. Oh Man!! The real comforts are similar to the dreams, are short-lived.  How do you expect butter on fermented rice water ( beer)? కలలోని సుఖమే కలియుగమా, వెన్న కలిలో నెక్కడిదె కలియుగమా kalalOni sukhamE kaliyugamA – venna / kalilO nekkaDide kaliyugamA verse 37)

22. You are occupied in worrying about the next meal all the time; there is no point in going deeper into the engagement with senses, as they only lead to more dubious activities. All the conscious activities undertaken only tire you out. Know not how long you will be present in this world. కడిగడి గండమై కాలము గడపేవు / కడుగఁగడుగ రొంపి కలియుగమా / బడలికె వాపవు సరమేదో చూపవు / గడిచీటియును నీవు కలియుగమా kaDigaDi gaMDamai kAlamu gaDapEvu / kaDugagaDuga roMpi kaliyugamA /baDalike vApavu saramEdO chUpavu / gaDichITiyunu nIvu kaliyugamA verse 37)

23. OH man!! Why do you engage in villainy? Deceive yourself in possessing. Do not stop grunting. The way (to liberation) is hidden only by a curtain. Why do you close your way and waste your time? కరపేవు కఱతలే మఱపేవు మమతలే / కరకఱ విడువవు కలియుగమా / తెరచీర మఱఁగింతే తెరువేల మూసేవు / గరుసేల దాఁటేవో కలియుగమా           karapEpu ka~ratalE ma~rapEvu mamatalE / ka~raka~ra viDuvavu kaliyugamA /terachIra ma~ragiMtE teruvEla mUsEvu / garunEla dATEvO kaliyugamA verse 37)

24. You always approve and enjoy what you should not; you always hoodwink; కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు / కానీలే కానీలే కలియుగమా kAnide mechchEvu kapaTAlE yichchEvu / kAnIlE kAnIlE kaliyugamA verse 37)

25. Those waiting for the thoughts to abnate to take up the path of liberation are like those waiting at seashore for the waves to subside to take bath.  కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు / కడలేని మనసునకుఁ గడమ యెక్కడిది kaDaluDipi nIrADagA dalachuvAralaku / kaDalEni manasunaku gaDama yekkaDidi verse 38)      

26. By surrendering to quench the thirst (passion), how a person can find philosophy behind it, hence cannot ascertain true cause. As long as the body exists, obviously due to its inherent nature, passion is inevitable. Therefore how can anyone get true happiness? దాహమణఁగినవెనుక తత్వమెరిఁగెదనన్న / దాహమేలణఁగు తా తత్వ మే మెరుఁగు / దేహంబుగలయన్ని దినములకుఁ బదార్ఢ- /మోహమేలుడుగు దా ముదమేల కలుగు / dAhamaNaginavenuka tatvamerigedananna / AhamElaNagu tA tatva mE merugu / dEhaMbugalayanni dinamulaku badArDha- / mOhamEluDugu dA mudamEla kalugu verse 38)      

27. The other state is beyond the pretty imagination, beyond the methods of sacrifice, not a comforting theory to your heart. అదిగాక నిజమతం బదిగాక యాజకం-/ బదిగాక హృదయసుఖ మదిగాక పరము adigAka nijamataM badigAka yAjakaM- / badigAka hRdayasukha madigAka paramu verse 39)   

28. The principal (the beast of) obstruction to the clear knowledge is the man’s determination. అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు-/ నమరినది సంకల్పమను మహాపశువు amalamagu vij~nAnamanu mahAdhvaramunaku-/ namarinadi saMkalpamanu mahapaSuvu verse 39)

29. Wealth (goddess Lakshmi) does not allow to be hidden. She takes various forms, does not stay in one place and keeps circling the world. రూకలై మాడలై రువ్వలై తిరిగీని / దాకొని వున్నచోటఁ దా నుండ దదివో rUkalai mADalai ruvvalai tirigIni / dAkoni vunnachOTa dA nuMDa dadivO verse 40)

30. Wealth ( money) remains unrelenting puzzle to man, overwhelm mankind’s attention so much that it takes the masses under its asylum.  It’s making man to dance ( to its tune) with a camouflaged grin. తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు నగుతా మాపాల నుండి నటియించు బసిఁడీ teganimAyai yuMDu dikku desayai yuMDu / nagutA mApAla nuMDi naTiyiMchu basiDI verse 40)

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...