Saturday, 24 April 2021

41 తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు (tanakEDa chaduvulu tanakEDa SAstrAlu)

ANNAMACHARYA

41 తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు 

Introduction: In this short, but significant verse, Annamacharya says, quest for knowledge should not be confused for the action required to liberate oneself. He compares, this hunt for more knowledge is akin to a blind dog going to market. 

Annamacharya does not beat around the bush to make his point. He is a crusader of truth. He is clear that pursuance of education & knowledge are not going to lead to path of liberation. 

Thus he is asking us to introspect and understand that the true knowledge is not gaining more, but to dissociate from the wrong knowledge/ notions/ conclusions.  He is talking of nascent state which is bereft of experience, where only intelligence has chance to shine. 

Indirectly he said that as long as we cling to transient things like our ideas, our conclusions, our idiocy mind continues to waver. Once we discover the permanent thing, the mind would calm down. 

ఉపోద్ఘాతము: భావగర్భితమైన చిన్ని కీర్తనలో మనసు యొక్క చంచలబుద్ధిని మాన్పలేని చదువులు, శాస్త్రాలు నిష్ప్రయోజనమని  కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు. 

అన్నమాచార్యులు సూటిగా స్పష్టంగా చెప్పడములో దిట్ట​. సత్యాన్వేషణలో దారికి అడ్డము వచ్చు నన్నింటిని పనికిరానివని ప్రకటిచుటకు వెనుకాడలేదు. ఇక్కడ చదువులు, జ్ఞాన సముపార్జన కూడా ప్రక్కదారి పట్టిస్తున్నాయని, అందుకే వ్యర్ధమని చెప్పారు. 

ప్రతీవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సత్యాన్వేషణ మరింత  జ్ఞానము పెంచుకొనుట కాదని, వ్యర్ధమగు అభిప్రాయములను, సిద్ధాంతములను ఊహలను, అనుమానములను, అర్ధహీనమగు హద్దులను చెరపివేయడమే అన్నారు. 

జాగ్రత్తగా గమనించిన మనిషి ఆరాటపడున వన్నీ తాత్కాలికములే. శాశ్వతమైన దానిని ప్రత్యక్షంగా తెలుసుకొన్నప్పుడు చంచలత్వము ఉండదని యీ కీర్తన సందేశము. 

తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు

మనసు చంచలబుద్ధి మానీనా          ॥పల్లవి॥ 

tanakEDa chaduvulu tanakEDa SAstrAlu

manasu chaMchalabuddhi mAnInA           pallavi 

Word to word meaning: తనకేడ (tanakEDa) = why? చదువులు(chaduvulu) = education/ training తనకేడ (tanakEDa ) = Why?  శాస్త్రాలు (SAstrAlu) = a sacred precept, spiritual injunction; మనసు (manasu) = mind; చంచలబుద్ధి (chaMchalabuddhi) = wavering nature;  మానీనా (mAnInA) = will it stop? 

Literal Meaning: What use is served by education and spiritual injunctions when they failed to stop the mind from wavering? 

Comments: Annamacharya is transparent that no use has been served by education and religious books, because they failed to correct the mind from wavering. 

Probably, he is asking what education is.  Quest for knowledge should not be confused for the action required to liberate oneself. 

Obviously he is stating that one has to leave everything he knows in the endeavour to reach God. What man does is the opposite of it? Therefore Annamacharya addresses him as stupid in this verse. 

భావము: చదువులు, శాస్త్రాలు దేనికో? అవి మనసు యొక్క చంచలబుద్ధిని మాన్పగలవా? 

వ్యాఖ్యలు మనసు యొక్క చంచలబుద్ధిని మాన్పలేని చదువులు, శాస్త్రాలు నిష్ప్రయోజనమని  కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు.

మానవుడు తనను తాను అను చెఱనుంచి విడిపించుకొను స్వతంత్ర ప్రయత్నము /ప్రార్ధన​/నివేదన​.

జ్ఞానాన్వేషణ మనిషి యేర్పరచుకున్న ఒక వ్యాసంగం, వ్యాపకం.   జ్ఞానాన్వేషణను భక్తితో పొరపడరాదు. అన్నారు. 

పుట్టుక, జాతి, చదువుల కన్నా దైవముపై ప్రగాఢమైన విశ్వాసము/నిశ్చయము వుండడం ముఖ్యమని ధూర్జటి గారు క్రింది పద్యంలో సాలె పురుగు, పాము, ఏనుగు మరియు కన్నప్పల భక్తి ద్వారా వివరించారు. 

శా. వేదంబుఁ బఠించె లూత, భుజగంబే శాస్త్రముల్చూచెఁ దా

నే విద్యాభ్యసనంబొనర్చెఁ గరి, చెంచే మంత్రమూహించె, బో
ధావిర్భావనిధానముల్చదువులయ్యా! కావు! మీపాద సం
సేవాసక్తియె కాక జంతుతతికిన్శ్రీకాళహస్తీశ్వరా! 

భావముశ్రీకాళహస్తీశ్వరా ! సాలెపురుగు వేదాలు చదివింది? పాము ఏశాస్త్రాలు చదివింది? ఏనుగు విద్యాభ్యాసం చేసింది? చెంచు కన్నప్ప మంత్రము నేర్చాడు? నీ పాదాలు శ్రధ్దతో సేవించాలనే కోరికయే జంతు జాతికి నిజమైన చదువు. (గురువులు చెప్తే వచ్చే పాఠాలు చదువులు కావు అని గమనించండి. ఇక్కడ  ధూర్జటి గారు, అనేక మార్లు భగవద్గీతలోను మనిషిని జంతు జాతితో కలిపి చెప్పారు).

జడ్డుమానవుఁడు చదువఁజదువ నాస

వడ్డివారుఁగాక వదలీనా
గుడ్డికుక్క సంతకుఁబోయి తిరిగిన
దుడ్డుపెట్లే కాక దొరకీనా           ॥తన॥ 

jaDDumAnavuDu chaduvajaduva nAsa

vaDDivArugAka vadalInA
guDDikukka saMtakubOyi tirigina
duDDupeTlE kAka dorakInA            tana 

Word to word meaning: జడ్డు (jaDDu) =  జాడ్యము, Dulness, folly, stupidity; మానవుఁడు (mAnavuDu) = man;  చదువఁజదువ (chaduvajaduva) = after reading/educating much,  నాస (nAsa) = want, avarice;   వడ్డివారుఁగాక (vaDDivArugAka) = ఎక్కువగు, అధికమగు, increases multi fold;   వదలీనా (vadalInA) = does not go away;  గుడ్డికుక్క (guDDikukka) = a blind dog;  సంతకుఁబోయి (saMtakubOyi) = goes to market; తిరిగిన (tirigina) = moves around; దుడ్డుపెట్లే (duDDupeTlE) = receives only blows from a cudgel; కాక (kAka) = what else; దొరకీనా (dorakInA?) = will it  receive?

Literal Meaning: Stupid man even after much of education, only his wants become more  but never would get satisfied with what he has. This kind of pursuance (of education inturn more wants) is akin  blind dog going to market, only to get driven away by cudgels, what else one can expect? 

Comments: Is it fair to castigate man as stupid? Conventional answer is NO. However, please consider that both Jiddu Krishnamurti and Annamacharya mentioned multiple times about living with great intelligence. Here Annamacharya meant that with our present methods of living this great intelligence does not have chance to flourish. He is asking us to pursue totally different path. 

Now most of the people in the world are educated. Has it changed the situation for the man? He continues to face the same dilemma a man faced during the bible time. Thus erudition is no measure for this path of liberation. 

భావము: తెలివితక్కువతనం గల మానవుడు యెత చదివినా ఆశ అధికమగునే కానీ వదలివేయునా? గుడ్డికుక్క సంతకుఁపోతే  అక్కడి వాళ్ళు కర్ర పెట్టి కొడతారే కానీ వేరే యేమి దొరకునూ? 

వ్యాఖ్యలు ఇక్కడ మనిషిని తెలివితక్కువ వాడు అని వ్రాయడము సబబేనాసాధారణ జవాబు కాదు. నిజానికి మనము ఉపయోగిస్తున్న తెలివితేటలు పైపైన ఉన్నవే. అన్నమాచార్యులు, జిడ్డు క్రిష్ణమూర్తి గారలు చెప్పిన గొప్ప మేధస్సు ఇప్పటి మన విధానాలతోటి మొలకెత్తలేదు అని సూచిస్తూ తెలివితక్కువ వాడు అని వ్రాసారు. అందుకనే మనిషిని గుడ్డికుక్కతో  పోల్చారు. దైవమును పొందుటకు మనిషి చర్యలు కాకుండా వేరేవి చేపట్టవలెనని సూచన​. 

రోజున ప్రపంచములో దాదాపు అందరూ చదువుకున్నవాళ్ళే. ఐనప్పటికీ, ఈనాటి మనిషి కూడా రామాయణ కాలమునాటి సమస్యలనే ఎదుర్కొంటున్నాడు. అనగా పాండిత్యము మనిషిని బంధాల నుండి విడిపించదని అర్ధము. 

దేవదూషకుఁడై తిరిగేటివానికి

దేవతాంతరము తెలిసీనా
శ్రీవేంకటేశ్వరుసేవాపరుఁడుగాక
పావనమతియై పరగీనా           ॥తన॥ 

dEvadUshakuDai tirigETivAniki

dEvatAMtaramu telisInA
SrIvEMkaTESvarusEvAparuDugAka
pAvanamatiyai paragInA       tana 

Word to word meaning: దేవదూషకుఁడై (dEvadUshakuDai) = దైవాన్ని  నిందించుచు, resorting blasphemy తిరిగేటివానికి (tirigETivAniki) = spends time in it; దేవతాంతరము (dEvatAMtaramu) = Difference between God and Man; (what makes god different from man); తెలిసీనా (telisInA) = can he ever comprehend?  శ్రీవేంకటేశ్వరుసేవాపరుఁడుగాక (SrIvEMkaTESvarusEvAparuDugAka) = unless in deep devotional service of Lord Venkateswara;  పావనమతియై (pAvanamatiyai) = being clear in mind; పరగీనా (paragInA) = can he be in that state? 

Literal Meaning: A person indulging in blasphemy would be unable to fathom difference between the man and God. Without being the true devotee of Lord, he shall not become clear in mind. Such a person can never experience truth. 

Comments: A man daring to criticise God will not fear to criticise his circumstances and his fellow beings. Thus he tends to waste time. 

Let us try to understand who is a true devotee. As stated in  Bhagavadgita शरीरस्थोऽपि कौन्तेय करोति लिप्यते śharīra-stho ’pi kaunteya na karoti na lipyate(13-32) Although situated within the body, the Atman neither acts, nor is It tainted by material energy. This means that the devotee must find god within himself. This requires very high degree of one-ness with the nature.  This one-ness is the remedy for the wavering nature.

భావము: దైవాన్ని  నిందించుచు తిరుగువాడు, దైవముకు మనిషికి ఉన్న అంతరాన్ని గమనించలేక, నిజమైన శ్రీవేంకటేశ్వరుని సేవాపరుఁడు కాకుండా నిర్మలుడు  కాలేడు. ఆట్టివాడు సత్యమును గ్రహించ లేడు.

వ్యాఖ్యలు : దైవాన్ని నిందించువాడు తోటివారినీ విమర్శించును. అట్టీవాడు సత్యమును గ్రహిపలేక కాలము వృధా చేసికొనునని ఆంతర్యము 

శ్రీవేంకటేశ్వరుని సేవాపరుఁడుఅన్న విషయాన్ని కొంత పరిశీలిద్దాము. భగవద్గీతలో అన్నట్లు శరీరస్థోఽపి కౌంతేయ కరోతి లిప్యతే (13-32) దైవము దేహములోనే స్థితమై ఉన్నా, ఆయన ఏమీ చేయడు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాడు. ఆనగా నిజమైన సేవాపరుఁడు శ్రీవేంకటేశ్వరుని హృదయములోనే దర్శించును. దర్శనమునకు అత్యత కఠినమైన ఏకాగ్రత కావలెను. ఏకాగ్రతతో చంచలబుద్ధి మానునని తెలియవచ్చు.

 

zadaz

Reference: copper leaf 32-3, volume: 1-198 

No comments:

Post a Comment

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...