ANNAMACHARYA
106. వెన్నవట్టుక నేయి వెదకనేలా
(vennavaTTuka nEyi vedakanElA)
Introduction: In this soothing and soul filling song Annamacharya says you are just one step away from God. It takes only minute to get there.
Do you think it is as easy? It’s quite difficult to believe these sugar-coated words of Annamacharya. All these wisemen say so. He is as hard as ever in this heart-warming poem, but makes it appear very simple.
ఉపోద్ఘాతము: హృదయరంజకము, తృప్తి కలిగించు ఈ కవితలో అన్నమాచార్యులు మీరు భగవంతునికి అతి సమీపంలో ఉన్నారని చెప్పారు. అక్కడికి చేరుకోవడానికి కేవలం నిమిషమే పడుతుందంటూ ఊరిస్తున్నారు.
దైవమును చేరడం అంత సులభమేనా? అన్నమాచార్యుల చక్కెర కలిపిన మాటలను నమ్మడం కష్టసాధ్యమే`. ఐతే ఈ దార్శనీకులందరూ అలానే అంటున్నారు. హృదయాన్ని తాకే ఈ కీర్తనలో అతడు ఎప్పటిలాగే అంతర్లీనంగా దాదాపు అసాధ్యమైన దాన్నే చాలా సరళంగా కనిపించేలా చేస్తాడు.
కీర్తన:
వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు- నెన్ని వలసినను దమయేలెటివే కావా ॥పల్లవి॥ తలఁపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబు కలుగుటే కలుగువలెఁగాక వలనైన భోగములు వైభవంబులు మరియు కలవెల్ల తమయెదుటఁ గలిగినవె కావా ॥వెన్న॥ పదిలముగ హరినామపఠన మంత్రము నోరు కదియుటే కలుగవలెఁగాక తుదలేని సంపదలు తొలగని ముదంబులును కదలకెప్పుడుఁ దమకు గలిగినవె కావా ॥వెన్న॥ యించుకైనను వేంకటేశు గిరిశిఖరంబు కాంచుటే కలుగవలెఁగాక అంచితంబైన నిత్యానంద పదవులను మించి తమయెదుటఁ బ్రభనించినవె కావా ॥వెన్న॥
| vennavaTTuka nEyi vedakanElA mariyu- nenni valasinanu damayEleTivE kAvA ॥pallavi॥ talapunaku vishNuchiMtana nimishamAtraMbu kaluguTE kaluguvalegAka valanaina bhOgamulu vaibhavaMbulu mariyu kalavella tamayeduTa galiginave kAvA ॥venna॥ padilamuga harinAmapaThana maMtramu nOru kadiyuTE kalugavalegAka tudalEni saMpadalu tolagani mudaMbulunu kadalakeppuDu damaku galiginave kAvA॥venna॥ yiMchukainanu vEMkaTESu giriSikharaMbu kAMchuTE kalugavalegAka aMchitaMbaina nityAnaMda padavulanu miMchi tamayeduTa brabhaniMchinave kAvA ॥venna॥ |
Details and Explanations:
వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు-
vennavaTTuka nEyi vedakanElA mariyu-
Word to Word meaning: వెన్న(venna) = butter; వట్టుక (vaTTuka) = holding; నేయి (nEyi) = Ghee; వెదకనేలా (vedakanElA) = why search; మరియు (mariyu) = and -నెన్ని (nenni) = whatever; వలసినను (valasinanu) = needed; దమయేలెటివే కావా (damayEleTivE kAvA) = aren’t they under your reigns, aren’t they under your lordship.
Literal meaning: While holding butter, why do you search for ghee? Aren’t you the lord of the desires? {these things you desire are already present in front of you as per your visualisation. What’s new in what you are desiring?}
Explanation: Important thing to note is enni valasinanu damayEleTivE kAvA? (ఎన్ని వలసినను దమయేలెటివే కావా?). By this, Annamacharya said, “aren’t these desires are under your reigns?”. Who is controlling the desires? You? OR are you controlled by the desires?
Let us see the connection between thoughts and desire. Thought(s) emanate from memory which is made up by experience(s). Now see this Bhagavad-Gita verse:
श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञ: परन्तप |
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते || 4-33||
śhreyān dravya-mayād yajñāj jñāna-yajñaḥ parantapa
sarvaṁ karmākhilaṁ pārtha jñāne parisamāpyate
purport: O Arjun, sacrifice performed in knowledge is superior to any mechanical material sacrifice. Know that all sacrifices of work culminate in awareness, knowledge and memory.
Take for example the case of life insurance. After finding out all the details from the insurance company will find out them and deposit a few thousands or few lakhs. What did the person who deposited the money get? The only assurance that some money has been tied up for his family subsequent to his death. That is, the person "transferred" the money to barter certain assurance. Objectively this assurance is just a feeling in the mind. (His family may or may not get the money as no one can predict the future happenings with any certainty.)
Thus, all our acts mostly result in certain awareness or knowledge or memory. Hence, the thoughts based on this accumulated memory are due to conscious and sub- conscious experiences.
Desire is nothing but expectation of repeating an experience. This experience can be vicarious as well. Can you think of a desire which you have not felt before?
Therefore, Annamacharya implied {by enni valasinanu damayEleTivE kAvA?} that you put-out these thoughts (born of desire) so that the ‘Other’ (read as God) situated inside you takes over. He said, it is as easy as getting Ghee from Butter.
Combining with the statement in the previous verse (104), tolliTijanmAdula gAninararUpu / palliMchukonna yIbraduku (తొల్లిటిజన్మాదులఁ గానినరరూపు /పల్లించుకొన్న యీబ్రదుకు) It’s an accomplishment that you are in human form here. Now Annamacharya is saying that you are just one step away from salvation. Sirs understand, this is a golden opportunity.
Another thing is that butter has very short shelf life. Annamacharya is warning us that it’s better that we wake up before it is too late.
Implied meaning: O man you are on the penultimate step. Foolishly do not look here and there. Isn’t it already in your hands?
భావము: వెన్న పట్టుకుని నేయ్యి వెదికేవా? ఎన్ని కావలసినను తమరి ఆధీనము లోనివే కావా? (అందులో వింత/ కొత్త ఏమి ఉన్నది?)
వివరణము: ‘చంకలో పిల్లాణ్ణి పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నట్లు‘గా ఉంది మానవుని పద్ధతి అన్నారు అన్నమాచార్యులవారు.
ఎన్ని వలసినను దమయేలెటివే కావా? అంటూ నీవు కోరుకుంటున్నది నీ ఏలుబడిలోనిది కాదా? నీ ఆధీనములోనిది కాదా? అనగా కోరొకలు నిన్ను అదుపులో వుంచుతున్నావా? లేదా నువ్వు కోరొకలను అదుపులో వుంచుతున్నావా? అని ప్రశ్నిస్తున్నారు అన్నమాచార్యులవారు.
ఆలోచనలు మరియు కోరికల మధ్య సంబంధాన్ని చూద్దాం. ఆలోచన(లు) జ్ఞాపకశక్తి నుండి ఉద్భవించుతాయి. జ్ఞాపకములు అనుభవము(ల) ద్వారా పొందుతాము. ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకాన్ని చూడండి:
శ్రీ భగవానువాచ
భావం : (యాంత్రికముగా) బాహ్యంగా చేసే యజ్ఞము కన్నా మనసుతో చేసే యజ్ఞము ఏంతో శ్రేష్ఠమైనది. ఏదేమైనా, ఓ పార్థా, అన్ని యజ్ఞములు కర్మలని తెలుసుకో. అవి అన్నియు జ్ఞానమునందే పరిసమాప్తమగును. (అవి అన్నియు ఎరుక, స్పృహ, జాగృతి లోనివే. కావున అవి నిన్ను బంధములనుంచి విడిపించలేవు.)
ఉదాహరణకు సాధారణమైన జీవన భీమా (life insurance) విషయమే తీసుకుందాం. భీమా సంస్థ వారినుంచి విషయాలన్ని వివరంగా తెలుసుకుని కొన్ని వేలో, కొన్ని లక్షలో జమ చేస్తాం. ఇందులో డబ్బులు జమ చేసిన వ్యక్తికి లభించినదేమిటి? తన తదనంతరం అతని కుటుంబానికి కొంత ధనం ముడుతుందనే భరోసా మాత్రమే. అంటే సదరు వ్యక్తి డబ్బుల్ని భరోసాతో "బదిలీ" చేసుకొనెను. నిష్పక్షపాతంగా చూస్తే ఈ భరోసా కేవలం మనసులోని భావం మాత్రమే. (అనగా ఆ భీమా పైకము అతని కుటుంబానికి లభించవచ్చు. లభించకపోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఎవరూ వూహించలేరు కదా!). ఇది తెలిసి కూడా భీమా చేసుకుంటాం.
కాబట్టి, మన చర్యలన్నీ ఎక్కువగా నిర్దిష్ట అవగాహన లేదా జ్ఞానం లేదా జ్ఞాపకములను కలిగిస్తాయి. సంచిత (accumulated) చేతన (conscious) మరియు ఉపచేతన (sub-conscious) అనుభవాల కారణంగా జ్ఞానం లేదా జ్ఞాపకములు సంభవిస్తాయి. వీటిపై ఆధారపడి ఆలోచనలు జనిస్తాయి.
కోరిక అనేది అనుభవాన్ని పునరావృతం చేయాలనే నిరీక్షణ తప్ప మరొకటి కాదు. ఈ అనుభవం తనను మరొకరి స్థానములో మారుగా వూహించు కున్నది కూడా కావచ్చు. మీరు ఇంతకు ముందు అనుభవించని కోరిక గురించి తలపోయగలరా?
కాబట్టి, మీరు ఈ కోరికతో జన్మించిన ఆలోచనలను వదలిపెట్టండి, తద్వారా మీ లోపల ఉన్న 'ఇతరము'నకు (దైవముగా చదవండి) అవకాశం కల్పించినట్టౌతుందని అన్నమాచార్యులు సూచించాడు. ఇది వెన్న నుంచి నెయ్యి తీసినంత తేలిక అని చెప్పాడు.
మునుపటి కీర్తన (104)లో 'తొల్లిటిజన్మాదులఁ గానినరరూపు' / 'పల్లించుకొన్న యీబ్రదుకు' = నువ్వు (కష్టపడి) ముందు జన్మల్లో లేని ఈ మానవరూపాన్ని సాధించావు అని అన్నమాచార్యులు చెబుతున్నాడు. ఇప్పుడు మీరు మోక్షానికి ఒకే అడుగు దూరంలో ఉన్నారని అంటున్నాడు. అంటే ఇంత కంటే మంచి అవకాశం రాదని అర్థం చేసుకోండి మాష్టారు.
గమనించ తగ్గ మరొక విషయం ఏమిటంటే వెన్న చాలా తక్కువ సమయమే నిలువ(షెల్ఫ్ జీవితం కలిగి) ఉంటుంది. ఆలస్యం కాకముందే మేలుకోవడం మంచిదని అన్నమాచార్యులు హెచ్చరిస్తున్నారు.
అన్వయార్ధము: ఓ మానవుడా! నువ్వు చివరి మెట్టుమీద ఉన్నావు. మూర్ఖంగా అక్కడా ఇక్కడా చూడకు. ఇప్పటికే నీ చేతుల్లో ఏముందో తెలియలేదా?
తలఁపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబు
talapunaku vishNuchiMtana nimishamAtraMbu
Word to Word meaning: తలఁపునకు (talapunaku) = in (your) thoughts విష్ణుచింతన (vishNuchiMtana) = Reflections on Lord Vishnu; నిమిషమాత్రంబు (nimishamAtraMbu) = in a minutes time; కలుగుటే (kaluguTE) = to happen; కలుగువలెఁగాక (kaluguvalegAka) = perchance should happen; వలనైన (valanaina) = encircling; భోగములు (bhOgamulu) = pleasures; వైభవంబులు (vaibhavaMbulu) = glories; మరియు (mariyu) = and; కలవెల్ల (kalavella)= whatever is existing; తమయెదుటఁ (tamayeduTa) = in front of you; గలిగినవె (galiginave) = are there; కావా (kAvA) = is it not?
Literal meaning: Perchance your transformation into the fold of Lord Vishnu may happen in a minute’s time. The personal pleasures, glories and whatever else existing aren’t they already there in front of you?
Explanation: Continuing the theme of chorus, Annamacharya is saying it takes only a minute for this transformation. It’s natural to take decisions on deliberation. However, for the issues relating to the God which lie beyond the thought. Because thought is born of material, and it makes us bound to material knowledge.
Man is always surrounded by the thoughts. These spiral of thoughts makes you think of the next moment, keeps you on the edge and confounds you from taking decisions relating to God. Thus, decision should be taken based on feeling, not thought. Therefore, it should happen quickly. This metamorphosis is partly celestial, partly in the hands of man. If this is so easy, why not everyone is trying to achieve this. We shall deliberate on this a bit.
Now ponder on the word ‘another’ in Sigmund Freud’s statement “The Individual does carry on a double existence. One designed to serve his own purposes and another as a link in a chain, in which he serves against, Or at any rate without, any volition of his own”
The ‘other’ does not come into play as long as former is engaged in trifling activities of our present daily existence. Sir, the meaning of this stanza is to remain in mediation so that the other has chance to flower, therefore the necessity of meditation.
Meditation is not a prayer. It’s an act of dissolving the self-centred activity. In that act, holding on to our present ideas is not tenable. It’s a decision. A final and irrevocable commitment.
The meaning of the word kalavella tamayeduTa galiginave kAvA కలవెల్ల తమయెదుటఁ గలిగినవె కావా = whatever you are desiring, is it not already there in front of you? This implies that you know what you are desiring and achieving it. You are only moulding your life as per your desires. What’s new in that? Your present satisfaction with such gratification will get eroded quickly leaving you desiring for more.
Implied meaning: O man! It takes very little time for this transformation. Do not let the encircling personal pleasures, glories and whatever else to distract you.
భావము: తలపులో విష్ణుచింతన నిమిషమాత్రముననే కలుగ వలె గాక. ఈ భోగములు వైభవంబులు మరియు మిగిలినవన్ని తమ ఎదుట కలిగినవే కదా!
వివరణము: పల్లవిలో చెప్పినదే కొనసాగిస్తూ అన్నమాచార్యులు యధా స్థితినుండి హరిదాసుడను పరిణామమునకు, వెన్న నుండి నేయి తీయుటలా, నిముష మాత్రము చాలన్నారు. ఆలోచించి చేయు నిర్ణయములు లోకరీత్యా సహజములు. కానీ దైవము అలోచనలకు అవతలి విషయము. అలోచనలు మనలను ముందే తెలిసిన, అప్పటికే యెదుటఁ గలిగిన విషయములపై కట్టి ఉంచును.
పై పల్లవిలోని ఉదాహరణలో లాగే, మనిషి తన జీవితమును వెచ్చించి తను అనుకున్నవి సాధిస్తాడు అంటూ ‘కలవెల్ల తమయెదుటఁ గలిగినవె కావా’ అని ప్రశ్నించారు? తను సాధించబోయేది ముందే తెలుసు కనక అందులో వింత ఏమి ఉన్నది? ఒక రకముగా ఆలోచించిన అది మనిషి తనను తాను ఆలోచనలు అభిప్రాయాలు అనే మూస లోనికి ఘనీభవించుకుంటు జీవితాన్ని వ్యర్ధము చేసుకుంటున్నా డన్నమాట.
మానవుడు సహజ స్థితిలో కాకుండా అలోచనల వలయములలో చిక్కుకుని ఉండుటచేత తరువాతి క్షణము ఏమి జరుగునోయని ఆదుర్దాతో నిర్ణయము తీసుకొనుటకు ఎప్పటికప్పుడు తటపాయించును. కాబటి ఈ నిర్ణయము ఆలోచించి కాకుండా, అనుభూతి చెంది వేయు ముందటడుగు. కావుననే కొంత సహజమూ, కొంత దైవికమూనగు ఈ మార్పు నిముష మాత్రముననే జరుగవలెనని అన్నమాచార్యులు సెలవిచ్చిరి. ఇది ఇంత సులభమైతే, అందరూ ఎందుకు ప్రయత్నించడంలేదని పిస్తుంది. దీనిపై కొంత విచారింతము.
ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన క్రింది మాటలలోని 'మరొకటి' ఏమిటో ఆలోచించండి? "వ్యక్తి నిజానికి ద్వంద్వ ఉనికిని కలిగి ఉంటాడు: ఒకటి తన స్వంత ప్రయోజనాల కోసం రూపొందించబడింది మరియు మరొకటి గొలుసులో లంకెగా రూపొందించబడింది. అతడు తన స్వంత ప్రమేయము లేకుండానే దానికి వ్యతిరేకంగానో లేదా అనుకూలంగానో పని (సేవ) చేస్తాడు"
మనము దైనందిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నంత కాలం 'మరొకటి' మరుగుననే వుండును. అయ్యలారా, ఈ చరణం యొక్క అంతరార్ధమేమంటే, 'మరొకటి'కి పుష్పించే అవకాశం ఇవ్వడనికే ధ్యానము/తపస్సు చేయ వలె.
ధ్యానము ప్రార్థన కాదు. ఇది స్వీయమే కేంద్రముగా గల కార్యాచరణను రద్దు చేసే చర్య. ఆ చర్యలో, మన ప్రస్తుత ఆలోచనలకు సరళికి తిలోదకాలు పలకల్సీందే. ఇది ఒక నిర్ణయం. ఆఖరి మరియు తిరిగిరాని ఏకమార్గప్రయాణం. ఈ నిశ్చయము చేయుటకు నిముషము కంటే ఎక్కువ పట్టదు అని అన్నమాచార్యులు అన్నారు.
గొప్ప ఋషులు జీవితాంతం తపస్సును కొనసాగించడాన్ని గమనించే ఉంటాము. సర్వదా భగవంతుని వైపు వుండు తపనయు, ప్రయత్నములే తపస్సు. ఏదో ఆశించి చేయునది వ్యాపారము.
అన్వయార్ధము: ఓ మానవుడా! ఈ ప్రస్థానమునకు చాలా తక్కువ సమయం పడుతుంది. చుట్టుముట్టి చీకాకు పరచు వ్యక్తిగత ఆనందాలు, కీర్తి వగైరాలు నీ దృష్టిని మరల్చనివ్వవద్దు.
పదిలముగ హరినామపఠన మంత్రము నోరు
padilamuga harinAmapaThana maMtramu nOru
Word to Word meaning: పదిలముగ (padilamuga) = carefully, consciously; హరినామ (harinAma) పఠన (paThana) = study; మంత్రము (maMtramu) = mantra; నోరు (nOru) = mouth; కదియుటే (kadiyuTE) = to join; కలుగవలెఁగాక (kalugavalegAka) == perchance should happen; తుదలేని (tudalEni) = endless; సంపదలు (saMpadalu) = wealth; తొలగని (tolagani) = never departing; ముదంబులును (mudaMbulunu) = happiness; కదలకెప్పుడుఁ (kadalakeppuDu) = never moving away; దమకు (damaku) = to you; గలిగినవె (galiginave) = already showered; కావా (kAvA) = is it not?
Literal meaning: It's a great opportunity to recite the name of Srihari. For this endless wealth, never fading smiles you are already the owner.
Explanation: Annamacharya is underlining the importance of taking the name of Lord Srihari with mind, body, and intent in singular unification. Its not that you take his name by rote. When you take this final step with complete attention, the actual transition takes place in a minute.
Implied meaning: These transient things you indulge can be achieved by effort. But taking the name of Srihari is once in a life opportunity. When you take the name of the lord, no desire ever be there to be fulfilled. You will lead a wholesome life, not a fragmented existence.
భావము: హరినామపఠన మంత్రము నీకు పుణముకొద్ది దొరొకిన దొరుకుగాక. నీ మనస్సులోని తుదలేని సంపదలు, చెరగని సుఖములు నీ యందే లేవా?
వివరణము: మనస్సు, శరీరం మరియు ఉద్దేశ్యములు మమేకము (త్రికరణ శుద్ధిగా) చేసి శ్రీహరి నామాన్ని ఉచ్చరించమని అన్నమాచార్యులు నొక్కిచెబుతున్నారు. యాంత్రికముగానో, ఊతపదముగానో పలకడము కాదు. మీరు పూర్తి శ్రద్ధతో ఈ చివరి అడుగు వేసినప్పుడు, అసలు పయనము ఒక నిమిషంలో మోదలౌతుంది. ఇప్పటి కదలిక గమ్యములేని ప్రయాణము.
అన్వయార్ధము: మీరు జీవితపర్యతము ఆశపడే ఈ క్షణికమైన విషయాలు ప్రయత్నం ద్వారా సాధించబడతాయి. కానీ శ్రీహరి నామ జపము జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. మీరు భగవంతుని వైపున్నప్పుడు, పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతారు. నేటి, ఖండ ఖండములైన ఉనికి ఉనికే కాదు.
యించుకైనను వేంకటేశు గిరిశిఖరంబు
yiMchukainanu vEMkaTESu giriSikharaMbu
Word to Word meaning: యించుకైనను (yiMchukainanu) = even an iota of; వేంకటేశు (vEMkaTESu) = Lord Venkteswara’s; గిరిశిఖరంబు (giriSikharaMbu)
– peaks of the hill; కాంచుటే (kAMchuTE) = witnessing; కలుగవలెఁగాక (kalugavalegAka) = should happen; అంచితంబైన (aMchitaMbaina) = suitable for Worship & reverence; నిత్యానంద (nityAnaMda) = forever; పదవులను (padavulanu) = resulting position in hierarchy; మించి (miMchi) = beyond; తమయెదుటఁ (tamayeduTa) = in front of you; బ్రభనించినవె (brabhaniMchinave) = are they not born; కావా (kAvA) = is it not?
Literal meaning: Beyond the corporeal happiness we long for, that life which could witness the truly existing peak of great hill called Venkatagiri even for very short while is complete.
Explanation: Intuition creates many veils to confuse man and obstructs him from seeing the truth and divinity. A visionary is who can see through these illusions.
That’s why Annamacharya said ‘avala vennelOne allu nErELliMtE / niviri ninnaTivuniki nETiki galadA?’ (‘అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే / నివిరి నిన్నటివునికి నేటికి గలదా?’) Like the salutation performed in moonlight is not clear to others, today i.e. living present is not as discernible, verifiable as yesterday. Therefore, one needs to put-in hard work.
Implied meaning: A life that has witnessed truth even for a minute is worth.
భావము: పుణ్యములతో సంపాదించిన నిత్య ఆనందములకు మించినది, తమ ఎదుట ప్రభవించినదీయగు వెంకటేశ్వరుని గిరి శిఖరము ఒక లిప్త మాత్రము చూచునదియే జీవితము.
వివరణము: అంతఃప్రకృతి కల్పించు అనేక పరదాలు మనిషికి తన కళ్ళ ఎదుటే ఉన్న సత్యమును, దైవమును మరగు పరచి భ్రాంతిని కలిగించును. వాటిని దాటి చూడగలిగినవాడే ద్రష్ట.
అందుకే అన్నమాచార్యులు ఇలా అనిరి ‘అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే / నివిరి నిన్నటివునికి నేటికి గలదా?’ (=వెన్నెలలో చేయు నమస్కార ప్రతి నమస్కారములు స్పష్టంగా గోచరించనట్లు, సత్యమును కూడా అస్పష్టమునందే దర్శించుట జరుగును.) అందుకే మనిషి తనకుగల సమస్తమును ఒకే కోణములో నిల్పుటకు చేయు ప్రయత్నమే తపస్సు.
అన్వయార్ధము: సత్యమును లిప్త మాత్రమైననూ సందర్శించిన జీవితమే ధన్యము.
Recommendations for further reading:
47 ఛీ ఛీ నరుల దేఁటి జీవనము (chI chI narula dEMTi jIvanamu)
5. చదువులోనే హరిని జట్టిగొనవలెగాక ( chaduvulOnE harini jaTTigonavale gAka)
Summary of this Keertana:
While holding butter, why do you search for ghee? Aren’t you the lord of the desires? {these things you desire are already present in front of you as per your visualisation what’s new in what you are desiring?} Implied meaning: O man you are on the penultimate step. Foolishly do not look here and there. Isn’t it already in your hands?
Perchance your transformation into the fold of Lord Vishnu may happen in a minute’s time. The personal pleasures, glories and whatever else existing aren’t they already there in front of you? Implied meaning: O man! It takes very little time for this transformation. Do not let the encircling personal pleasures, glories and whatever else to distract you.
It's a great opportunity to recite the name of Srihari. For this endless wealth, never fading smiles you are already the owner. Implied meaning: These transient things you indulge can be achieved by effort. But taking the name of Srihari is once in a life opportunity. When you take the name of the lord, no desire ever be there to be fulfilled. You will lead a wholesome life, not a fragmented existence.
Beyond the corporeal happiness we long for, that life which could witness the truly existing peak of great hill called Venkatagiri even for very short while is complete. Implied meaning: A life that has witnessed truth even for a minute is worth.
కీర్తన సంగ్రహ భావము:
వెన్న పట్టుకుని నేయ్యి వెదికేవా? ఎన్ని కావలసినను తమరి ఆధీనము లోనివే కావా? (అందులో వింత/ కొత్త ఏమి ఉన్నది?) అన్వయార్ధము: ఓ మానవుడా! నువ్వు చివరి మెట్టుమీద ఉన్నావు. మూర్ఖంగా అక్కడా ఇక్కడా చూడకు. ఇప్పటికే నీ చేతుల్లో ఏముందో తెలియలేదా?
తలపులో విష్ణుచింతన నిమిషమాత్రముననే కలుగ వలె గాక. ఈ భోగములు వైభవంబులు మరియు మిగిలినవన్ని తమ ఎదుట కలిగినవే కదా! అన్వయార్ధము: ఓ మానవుడా! ఈ ప్రస్థానమునకు చాలా తక్కువ సమయం పడుతుంది. చుట్టుముట్టి చీకాకు పరచు వ్యక్తిగత ఆనందాలు, కీర్తి వగైరాలు నీ దృష్టిని మరల్చనివ్వవద్దు.
హరినామపఠన మంత్రము నీకు పుణముకొద్ది దొరొకిన దొరుకుగాక. నీ మనస్సులోని తుదలేని సంపదలు, చెరగని సుఖములు నీ యందే లేవా? అన్వయార్ధము: మీరు జీవితపర్యతము ఆశపడే ఈ క్షణికమైన విషయాలు ప్రయత్నం ద్వారా సాధించబడతాయి. కానీ శ్రీహరి నామ జపము జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. మీరు భగవంతుని వైపున్నప్పుడు, పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతారు. నేటి, ఖండ ఖండములైన ఉనికి ఉనికే కాదు.
పుణ్యములతో సంపాదించిన నిత్య ఆనందములకు మించినది, తమ ఎదుట ప్రభవించినదీయగు వెంకటేశ్వరుని గిరి శిఖరము ఒక లిప్త మాత్రము చూచునదియే జీవితము కదా! అన్వయార్ధము: సత్యమును లిప్త మాత్రమైననూ సందర్శించిన జీవితమే ధన్యము.
Copper Leaf: 33-1 Volume 1-202