తాళ్ళపాక అన్నమాచార్యులు
259 చదివి చదివి వట్టి జాలిఁబడు టింతేకాని
For English version press here
ఉపోద్ఘాతము
ఇది ఒక విస్ఫోటక కీర్తన. పదిహేనవ శతాబ్దపు కవి అన్నమాచార్యుల దృష్టి అపూర్వము, అపారము, అచింత్యము, అద్వితీయము. దీనిని చదువుతుంటే సముద్రాలకైనా లోతు తక్కువగానే అనిపిస్తుంది. మానవ సంకటస్థితిని ఇంత పదునైన ఖచ్చితత్వంతో, మన ప్రవర్తనను ఇంత సూటిగా ఆవిష్కరించిన కవి మరొకరు లేరు. శతాబ్దాలుగా మానవాళిని వెంటాడిన ప్రాథమిక ప్రశ్నలను ఇక్కడ ఆయన నేరుగా పాఠకుడి హృదయంలోకి తీసుకువస్తారు.
అధ్యాత్మ సంకీర్తన
|
రేకు: 321-4 సంపుటము: 4-121
|
చదివి చదివి వట్టి జాలిఁబడు
టింతేకాని
యెదుట నిన్ను గానఁగ నితరుల
వశమా ॥పల్లవి॥ ఆకాశముపొడవు ఆకాశమే యెరుఁగు
ఆకడ జలధిలేఁతు ఆ జలధే యెరుఁగు
శ్రీకాంతుఁడ నీ ఘనము చేరి
నీవే యెరుఁగుదు-
నీకడ నింతంతన నితరుల వశమా ॥చదివి॥ నదులయిసుకలెల్ల నదులే యెరుఁగును
కదలి గాలియిరవు గాలికే తెలుసు
అదన నాత్మగుణము లంతరాత్మ
నీవెరుగు-
దిదియదియనిచెప్ప నితరులవశమా
॥చదివి॥ శ్రీవేంకటేశ యిన్నిచింతలకు
మొదలు
యీ నీ శరణంటే యిటు నీవే యెరిగింతు
దైవమా నీ కల్పనలు తగ నీవే
యెరుఁగుదు-
వీవల నౌఁగాదన నితరుల వశమా ॥చదివి॥
|
Details
and Explanations:
Telugu
Phrase
|
Meaning
|
చదివి
చదివి వట్టి జాలిఁబడు టింతేకాని
|
మానవుడా!
నువ్వు చదివి చదివి చతికిలబడి నీపై నీవే జాలిపడతావే కానీ
|
యెదుట
నిన్ను గానఁగ నితరుల వశమా
|
దైవమా!
(ఇతరులకు నిన్ను చూపించుటకు నేను 'అన్నమయ్య'ను వుపయోగ పడనే). ఇతరులు వారివారికి ఎదురుగా
వున్న నిన్ను వారంతటవారు చూడవలసినదే కదా !
|
సూటి భావము:
మానవుడా!
నువ్వు చదివి చదివి అలసి, చతికిలబడి నీపై నీవే జాలిపడతావే కానీ;
దైవమా! (ఇతరులకు నిన్ను చూపించుటకు నేను 'అన్నమయ్య'ను వుపయోగ పడనే). ఇతరులు వారివారికి ఎదురుగా వున్న నిన్ను వారంతటవారు చూడవలసినదే
కదా !
గూఢార్థవివరణము:
ప్రజలకు నేరుగా అదలింపు: అన్నమాచార్యులు ఇక్కడ తాపసుల మాదిరిగా కాదు, గట్టి స్వరంలో మాట్లాడు తున్నారు. “చదివి చదివి ఏమి ప్రయోజనం పొందుదమని? ఏవైనా నీలోని నిన్ను( దైవాన్ని) ఎదుర్కో నంత వరకు వ్యర్థం.”
అధ్యయన
ఫలితము జాలి.
“జాలి” అన్న పదం కీలకం. అది కేవలం దుఃఖం కాదు, పనిలేని
శ్రమలతో జీవితాన్ని వృథా చేసుకున్న మనిషి దయనీయ స్థితి. అంతులేనన్ని చదువులు చివరికి
మనషికి తన లోపలి ఖాళీదనాన్ని గ్రహించడంలో సహాయం చేస్తాయే తప్ప దేవుని వైపుకి దారి చూపవు.
ఆ పరిస్థితిలో తనలోని ఖాళీ, అసహాయత్వం స్వీయజాలి వైపుకు మరలుతుంది.
ఎల్లప్పుడూ
ఎదుటే ఉన్న దైవము: ఇదే అంతుచిక్కని చిక్కుముడి.
“యెదుట నిన్ను” — దైవము నీ హృదయంలో, నీ శ్వాసలో ఎల్లప్పుడూ నీ ముందే ఉన్నాడు.
కాబట్టి పుస్తకాలు, గురువులు, ఆచారాల వెంట
కాదు పడవలసినది. నీలోనే గట్టిగా వెతుకు. నీకు ఆకలైతే ఇతరులు తింటే తృప్తి కలగనట్లు.
జిడ్డు
కృష్ణమూర్తితో సమాంతరాలు
జిడ్డు తరచూ అన్నది: “ప్రశ్నల కంటే మౌనం మేలుకాదు? నీలో నిజంగా నిశ్శబ్దం వుంటే, నీలో ఆవ్యాజమైన ప్రేమ అదే వస్తుంది, అరమరికలు లేని అందం వికసిస్తుంది.”
ఇద్దరూ ఇతరుల వద్ద నుండి సేకరించిన జ్ఞానాన్ని తిరస్కరించారు.
ఇద్దరూ సత్యం బయటనుంచి రాదని నొక్కి చెప్పారు.
ఇద్దరూ లోపలి నిశ్చలతలోనే యదార్థం దర్శనమవుతుందని బోధించారు.
ప్రధాన
సందేశం
మనిషి నిజంగా
తనకు తానుగా ఉండకుంటే — ఇతరుల బోధల బానిసగా ఉంటే — దేవుణ్ణి చూడలేడు. ప్రత్యక్ష దర్శనం
లేకుండా కూడబెట్టిన జ్ఞానం నిష్ప్రయోజనం మాత్రమే కాదు, విషాదకరమూ.
లోతైన
భావం
“యెదుట నిన్ను” అన్నది మరో అర్థమూ ఇస్తుంది:
“నా ముందు నేను నిన్నే (దైవమునే) చూచుచున్నాను” — అన్నమాచార్యుడి
సాక్ష్యం.
అదే సమయంలో “ఇతరుల వశమా” అంటే — ఆయనకు ప్రత్యక్ష దర్శనం ఉన్నా, ఆయన చుట్టూ ఉన్నవారు మాత్రం అన్నమాచార్యుడినే చూస్తారు, దైవమును కాదు. వారు బయట రూపానికే (సన్యాసులు, మాటలు, ఆచారం) లోనైపోతారు; ఆయన చూపిస్తున్న దిశను మాత్రం చూడలేరు.
ఇది
ముందటి కీర్తనతో అద్భుతంగా కలుస్తుంది: “తనిసి యలమేల్మంగఁ దాళిఁగా గట్టుకొనె
/ వెనుకొని యిదివో శ్రీవేంకటేశుఁడు”.
అలమేలు
మంగను తాళిగా (ఒక గుర్తుగా) కట్టుకొనె అనగా ఒకానొక భక్తునిని భార్యగా చేపట్టి అనగా
ఆమె రూపము వెనుక తానుండె ఇదిగో శ్రీవేంకటేశుఁడు.
డాలీ
అధివాస్తవిక చిత్రం “Dreams on a Beach”తో
అనుసంధానం:
సముద్రతీరంలో ఒక రాతివేదికపై గుడ్డతో కప్పిన ఒక శిల్పం ఉంది. అది ఎప్పుడైనా పడిపోయే స్థితిలో ఉంది. ఒక వెదురు కర్ర లాంటిది బయటికి పొడుచుకొని వచ్చింది. దాని చివర గుడ్డ పేలికలు వేలాడుతున్నాయి. ఆ కర్రని స్థిరత్వం (బేలన్స్ చేయడానికి) చాపినట్లుంది. కానీ కర్రని తప్పుదిశలో చాచడంతో అస్థిరత మరింత పెరుగుతుంది.
శిల & విగ్రహం (శిల్పం) = పుస్తకజ్ఞానం: పైకి గొప్పగా కనిపించినా నిలదొక్కుకోలేని జ్ఞానం.
గుడ్డతో కప్పిన శిల్పం = తెలిసినట్టు భావన: తెలుసుకున్నామనుకుంటాం, కానీ అసలు సత్యం వీగిపోతుంది.
వెదురు కర్ర & గుడ్డ పేలికలు = తప్పుదిశలో శ్రమ; మన కృషి అప దిశలో. స్థిరత్వం మరింత తగ్గుతుంది.
ఈ
బొమ్మ సందేశం
అస్థిరమైన జీవితానికి కూర్చే స్థిరత్వం కృషి అంతా తప్పు దిశలోనే ఉంటుంది.
స్థిరములేని దానికి స్థిరత్వం కూర్చబోవడమే అవివేకం.
అస్థిరమును ఉన్నపళంగా స్వీకరించడమే వివేకం.
తన కృషి లేకుండానే ఆ ముసుగు తెరలు తొలగిపోతాయన్న నిశ్చయమే జ్ఞానం.
అనగా పనిలేని పనుల వంటి చదువులు చివరికి దుఃఖాన్నే తెస్తాయి.
వివరణ
డాలీ అస్థిర రూపాలు అన్నమయ్య చీవాట్లను ప్రతిబింబిస్తాయి.
మనుషులు పుస్తకాలపై పుస్తకాలను చదివి
తమ
పరిజ్ఞానాన్ని విస్తరించుకున్నామని అనుకుంటారు.
కానీ అక్కడే విశాల సముద్రంలా విస్తరించి ఉన్న దైవాన్ని మరచిపోతారు.
సరియైన
చూపుతో తనలోనికే తాను చూసి—
అనగా, తనను తాను ప్రపంచంలోని వేరొక వ్యక్తిగా
గమనించి,
“నేనూ ఇతరుల వలెనే” అని గ్రహించి,
ఆ స్థితిలో నిశ్చలంగా ఉండగలిగితే — అదే ధ్యానం.
లేకపోతే అది స్వీయజాలి క్రింద మారిపోవడం తప్పదు.
పరోక్ష జ్ఞానపు ప్రమాదం ఆలోచించండి:
పుస్తకాల ద్వారా లేదా ఇతరుల మాటల ద్వారా పొందిన జ్ఞానం ఎప్పుడూ రెండవ చేతిదే, పరోక్షమైనదే. కానీ మన కళ్లతో మనమే చూసి, మన అనుభవంతో గ్రహించిన జ్ఞానమే నిజమైన ప్రత్యక్ష జ్ఞానం. అన్నమాచార్యులూ, జిడ్డు కృష్ణమూర్తీ రెండవచేతి జ్ఞానాన్ని నమ్మకూడదని హెచ్చరించారు. గురువుల పాత్రను స్వీకరించకుండా, ప్రతివాడూ తనకు తానే అన్వేషకుడై, స్వయంగా కనుగొనాలని కోరారు.
భగవద్గీత
ఉదాహరణ తీసుకుందాం. చాలా మంది స్వయంగా అర్థం చేసుకోవడం కన్నా, వ్యాఖ్యాతల మాటలనే పునరావృతం చేస్తారు. ఈ అలవాటు తప్పక తగ్గాలి.
నిఘంటువులు, అధ్యయనం వచనార్థాన్ని చూపగలవు; కానీ లోతైన భావం మాత్రం మన పరిశీలనలు, మన ఆలోచనలు
కలిసినప్పుడు మాత్రమే ప్రకాశిస్తుంది. నిజమైన అర్థం నేరుగా చూసినప్పుడు మాత్రమే
వికసిస్తుంది — ఇతరుల అధికారం మీద ఆధారపడినప్పుడు కాదు.
మొదటి చరణం:
ఆకాశముపొడవు
ఆకాశమే యెరుఁగు
జలధిలోతు ఆ జలధే యెరుఁగు
భువనంబు విస్తారంబు భువనమే యెరుఁగు
దేహంబు నెత్తురు దేహమే యెరుఁగు ॥చదివి॥
Telugu
Phrase
|
Meaning in
Telugu
|
ఆకాశముపొడవు ఆకాశమే యెరుఁగు –.
|
ఆకాశపు
పొడవు, పరిమాణం ఆకాశానికే తెలుసు
|
జలధిలోతు ఆ జలధే యెరుఁగు –.
|
సముద్రపు
లోతు సముద్రానికే తెలుసు
|
భువనంబు విస్తారంబు భువనమే యెరుఁగు
|
లోకపు
విస్తృతి లోకానికే తెలుసు.
|
దేహంబు నెత్తురు దేహమే యెరుఁగు –
|
శరీరంలోని
రక్తాన్ని శరీరమే తెలుసుకుంటుంది
|
సూటి భావము:
ఆకాశపు
పొడవు, పరిమాణం ఆకాశానికే తెలుసు. సముద్రపు లోతు సముద్రానికే తెలుసు. లోకపు విస్తృతి
లోకానికే తెలుసు. శరీరంలోని రక్తాన్ని శరీరమే తెలుసుకుంటుంది
గూఢార్థవివరణము:
ఇక్కడ
అన్నమాచార్యులు ఒక విప్లవాత్మక ఆలోచనను ప్రతిపాదిస్తున్నారు. మన సాధారణ
దృష్టిలో —
కానీ
అన్నమాచార్యులు ఈ చరణంలో చైతన్యము-జడములకు మధ్యగల సరిహద్దును దాటే
దృష్టి తో చెబుతున్నారు.
జీవితం – జడమన్న తేడా మనసులో వేసుకున్న గీత
మనం జీవం ఉన్నది, జీవం లేనిది అని విభజిస్తాం.
కానీ ఆకాశం తన పొడవు తెలుసుకోవడం, సముద్రం తన లోతు గ్రహించడం
—ఆయన చూపిస్తున్నది ఏంటంటే: అన్నీ చైతన్యం కలిగి ఉన్నాయి. సమస్తమును ఏకముచేయు చైతన్య
స్థితికి చేరుకున్నారని తెలియవచ్చును.
ప్రత్యక్ష జ్ఞానం – First
Hand Knowledge: మనం ఆకాశం పొడవు కొలుద్దాం,
సముద్రం లోతు కొలుద్దాం అని ఆలోచిస్తాం. అది బాహ్య జ్ఞానం కాదు ఉబలాటం. కానీ అన్నమయ్య చెబుతున్నది:
ఆకాశం తానే తనని “ఎరుగు” జలధి తానే తనని “ఎరుగు”. అంటే ఈ విశ్వంలోని ప్రతి వస్తువు
స్వయంజ్ఞానముతో నిండినదే. తెలుసుకుందా మనునది సంకల్పము. భవిష్యత్తులో చేయబోవు కార్యము.
“ఎరుగు" అనునది ఇప్పటికే వున్న జ్ఞానం. అనగా అన్నమాచార్యులు చేరుకున్న స్థితిలో
తెలుసుకుందామన్న జిజ్ఞాస(లేదా ఉత్సుకత) అను వేగిరపరచు శక్తి వుండదు. అదే సమస్థితి.
జిడ్డు కృష్ణమూర్తి తో పోలిక:
జిడ్డు కూడా జీవితం–మరణం మధ్య తేడా గురించి చెబుతూ — “మనం
పెట్టుకున్న విభజనే సమస్య” అన్నాడు.
అన్నమయ్య ఇక్కడ centuries ముందుగానే అదే
చెప్పాడు: జడ / చైతన్యం అనేవి మన పరిమిత అవగాహనలో వేసుకున్న సరిహద్దులు మాత్రమే.
మానవాళికి సందేశం: మనం ప్రపంచాన్ని జడముగా చూస్తున్నంతవరకు అది వేరేగా ఉంటుంది. కానీ
ఒకసారి మన లోపలి చైతన్యం ఈ విశ్వ చైతన్యాన్ని తాకినప్పుడు,
ఆకాశం, సముద్రం, భూమి,
శరీరం — ఇవన్నీ జీవముగానే అనుభవమవుతాయి. అప్పుడు జీవితం–మరణం అనే
విభజన కరిగిపోతుంది.
భగవద్గీతతో అనుసంధానము:
సర్వ భూతేషు
యేనైకం భావమవ్యయమీక్షతే ।
అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం ।। 18-20 ।।
అర్జునా! ఎవరు విభజింపబడి వేఱువేఱుగా కాన్పట్టు సమస్త భూతములను చరాచర ప్రాణులందును ఒక్కటే నాశరహితమగు ఆతవస్తువును (దైవము యొక్క ఉనికిని) విభజింపబడక (ఏకముగా) నున్నట్లు ఏ జ్ఞానముచే ఎఱుగుచున్నారో అట్టి జ్ఞానము సాత్వికని తెలియుము.
అన్నమాచార్యులు
ఈ శ్లోకములో చెప్పినట్లు వేఱువేఱుగా కనబడు
చరాచర భూతములను ఏ సూత్రమైతే ఒకటిగా కలిపియున్నదో అట్టిదాని దర్శనమును పొందిరని తెలియవచ్చును.
ఆ స్థితిలో చరాచరములకు జీవాజీవములకు చైతన్యము-జడములకు మధ్యగల అంతరమును అధిగమించి ఆ జ్ఞానముతో
ఏకత్వమును కలిగి యున్న క్షణములలో కలిగిన అనుభూతిని మనకు తెలియజెప్పుతున్నారు. ఈ మన
ప్రపంచములో సమస్తము (మనకు తెలియని రీతిలో) చైతన్యమును కలిగి వున్నవని;
అద్దానిని మనమున్న స్థితిలో నుండి ఏవిధముగాను ఉజ్జాయింపు కూడా వేయలేమని
గ్రహించ వలెను. మిడిమిడి జ్ఞానముతో స్వర్గమని, మోక్షమని,
పరమపదమని చెప్పు బోధనలు కేవలము ఊహాజనితములని గ్రహించవలెను. ఈ ప్రపంచమున ఉన్నది సత్యము ఒక్కటే. తక్కినవన్నీ భ్రమలే.
రెండవ చరణం:
Telugu
Phrase
|
Meaning in
Telugu
|
నదులయిసుకలెల్ల
నదులే యెరుఁగును
|
నదుల
ఇసుకను — నదులే తెలుసుకుంటాయి.
|
కదలి గాలియిరవు
గాలికే తెలుసు
|
గాలి
కదలికను — గాలియే తెలుసుకుంటుంది.
|
అదన నాత్మగుణము
లంతరాత్మ నీవెరుగు-
|
ఆత్మ
గుణములను — అంతరాత్మయే గ్రహించగలదు
|
దిదియదియనిచెప్ప
నితరులవశమా
|
ఇవన్నీ
ఇతరులు నీకెలా చెప్పగలరు?
|
సూటి భావము:
నదుల ఇసుకను — నదులే
తెలుసుకుంటాయి.
గాలి కదలికను — గాలియే తెలుసుకుంటుంది.
ఆత్మ గుణములను — అంతరాత్మయే గ్రహించగలదు.
ఇవన్నీ ఇతరులు నీకెలా చెప్పగలరు?
గూఢార్థవివరణము:
ఇక్కడ అన్నమాచార్యులు ఒక
అడుగు ముందుకు వేస్తారు.
నీకు నీవు ఎవరో ఇతరులు
చెప్పలేరు.
పుస్తకాలు కాదు, గురువులు కాదు, ఆచారాలు కాదు.
ఆత్మజ్ఞానము
ఎప్పటికీ పరోక్షంగా రాదు.
జ్ఞానము ప్రత్యక్షం:
ఈ చరణం ప్రత్యామ్నాయం
అసాధ్యము అని చెబుతుంది.
జిడ్డు కృష్ణమూర్తితో పోలిక:
కృష్ణమూర్తి
తరచూ అనేవాడు:
“సత్యం
మార్గంలేని గమ్యం. ఎవరూ నిన్ను దానివైపు నడిపించలేరు.”
ఆయన గురువుల
మీద, శాస్త్రాల మీద, సంప్రదాయాల
మీద ఆధారపడకండి అని హెచ్చరించాడు.
ఆత్మజ్ఞానం
వర్ణనల ద్వారా కాదు — ప్రత్యక్షంగా చూచూట (దర్శనం) ద్వారానే వస్తుంది.
అదే మాట
అన్నమాచార్యులు అయిదు శతాబ్దాల ముందే చెప్పారు:
“ఇతరులు
నీకు ‘నీవు ఎవరో’ చెప్పలేరు.
నీవెవరో
తెలుసుకోవగలది నీ అంతరాత్మ మాత్రమే.”
ఆధ్యాత్మిక సందేశం:
ఈ చరణం
ఆశ్రయములను, ఆధార ఊత ములను కూల్చేస్తుంది
సాధకుడు
లోనికి తిరగి — మౌనంతో, స్పష్టతతో చూడగలగాలి.
లేకపోతే, సేకరించిన పదజాలం ఎంతైనా కూడా ఆ అగాథాన్ని పూడ్చలేవు.
మూడవ చరణం:
శ్రీవేంకటేశ
యిన్నిచింతలకు మొదలు
యీ నీ శరణంటే యిటు నీవే యెరిగింతు
దైవమా నీ కల్పనలు తగ నీవే యెరుఁగుదు
వీవల నౌఁగాదన నితరుల వశమా ॥ చదివి ॥
Telugu
Phrase
|
Meaning
|
శ్రీవేంకటేశ
యిన్నిచింతలకు మొదలు |
శ్రీవేంకటేశ! – ఈ
అంతులేని చింతలకు ఆరంభమూ, నీవే.
|
యీ నీ
శరణంటే యిటు నీవే యెరిగింతు
|
నిన్ను
నేను శరణంటే ఆవైపు నీవే తెలియజేస్తావు
|
దైవమా
నీ కల్పనలు తగ నీవే యెరుఁగుదువు
|
దైవమా!
నీ యోచనలు, నీ లీలలు ఎవరూ గ్రహించలేరు;
వాటి యుక్తి నీకే తెలుసు.
|
ఈవల
నౌఁగాదన నితరుల వశమా
|
ఇటువైపు
"ఔను" "కాదు" అనడం ఇతరుల వశమా? (కాదే)
|
సూటి భావము:
శ్రీవేంకటేశ! – ఈ అంతులేని చింతలకు ఆరంభమూ, అంతమూ నీవే.
యీ
నీ శరణంటే – నీ శరణు తీసుకోవడం అంటే, దాని ఫలితాన్ని కూడా నువ్వే నిర్ణయిస్తావు.
దైవమా!
నీ కల్పనలు తగ నీవే యెరుఁగుదు – నీ యోచనలు, నీ
లీలలు ఎవరూ గ్రహించలేరు; వాటి యుక్తి నీకే తెలుసు.
వీవల నౌఁగాదన నితరుల వశమా – అవి అవునా, కాదా అని చెప్పే శక్తి మనకుండదు. మనకో, ఇతరులకో వశం కాదు.
గూఢార్థవివరణము:
ఇక్కడ ‘యీ’ అనే పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. సాధారణంగా ఇది “ఎదుటనుండుదానిఁ దెలుపును” అనే భావాన్ని సూచిస్తుంది. కానీ ఇక్కడ అన్నమాచార్యులు తననే ఉద్దేశిస్తున్నారు. అందువల్ల “యిన్నిచింతలకు మొదలు యీ” అనే పదబంధం — ఈ చింతలు మానవ మనసులోనే ఆరంభమవుతాయని (దేవుడు సృష్టించినవి కావని) సూచిస్తోంది.
హిల్మా ఆఫ్ క్లింట్ యొక్క Swan No. 9 (1915):
ఈ చిత్రంలో వ్యూహాత్మకముగా జననము మరణము అను విరుద్ధ విషయములను ఒక రేఖకు అటు ఇటు చూపారు. కుడి నుండి ఎడమ వైపుకు పోతున్న ఈ గీత క్రమంగా కనుమరుగై ఏకత్వంలో కలిసిపోతుంది. అనగా ఆ విరుద్ధములు ఆ స్థితిలో ఒకటేనని అర్ధము. కానీ, ఈ భిన్నములు జీవితాన్ని తమ వైపు లాగుతూనే వుంటాయి. వాటిధాటికి తట్టుకుని సమస్థితిలో నిలబడడం, ఆ మధ్య వున్న రేఖవెంబడి ప్రయాణం. ఇది అన్నమాచార్యుల మాటలతో సమంగా ఉంది. మానవ జీవితానికి పరమార్ధము సత్యముతో కలిసి ప్రయాణమే. ఆ రేఖ కాక తక్కిన మార్గములు ప్రపంచములో సుఖదుఃఖములకు లోనౌతూ గడుపు సాధారణ జీవితం. అదే విషయమును హిల్మా ఆఫ్ క్లింట్ & అన్నమాచార్యులు వెల్లడించారు. హిల్మా ఆఫ్ క్లింట్ బొమ్మపై మరింత విశదీకరణకు ఇక్కడ నొక్కండి.
హిల్మా ఈ చిత్రాన్ని 1915లో వేశారు. జిడ్డు కృష్ణమూర్తి తన ఆలోచనలను బహిరంగంగా చెప్పడం 1929 లో తరువాత. కానీ అన్నమాచార్యులు ఐదు శతాబ్దాల క్రితమే ద్వంద్వాన్ని దాటి ఏకత్వాన్ని ప్రత్యక్షానుభవంతో చూపించారు.
ఇది
అన్నమాచార్యుల దృష్టి ఒకానొక చెదురుమదురు ఆధ్యాత్మిక వాదమేమీ కాదని సూచిస్తోంది.
యుగాలూ, సంస్కృతులలోనూ — ప్రత్యక్షానుభవాన్ని తాకినవారు
ఒకే సత్యాన్ని తమ తమ భాషలో వ్యక్తం చేస్తున్నారు.
ఈ
కీర్తన ముఖ్య సందేశం
“సిద్ధాంతాలకోసం, ఇతరులు చెప్పిన అర్థాల కోసం జీవితాన్ని
వృధా చేయకు. జీవితమును మొట్టమొదటగా స్పృశిస్తున్నట్లు, ఈ లోకాన్ని
తొలిసారి చూస్తున్నట్టుగా — నూతనంగా, నిజాయితీతో — నీలోని దైవాన్ని
ఆవిష్కరించుము.”
X-X-The
END-X-X