Saturday 24 December 2022

154 kannadETidO vinnadETidO kAgaladika nEdO (కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో )

 ANNAMACHARYULU

154 కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో

(kannadETidO vinnadETidO kAgaladika nEdO) 

for Telegu (తెలుగు) Version press here 

 

Synopsis:  “Movement from being Me to being with God is a futile journey”

Summary of this Poem:

Chorus: What do I see?  What Do I Hear? Do not know what may happen here after. I do not know who I am. Do not know who you are. The life in between is starkly naked. Implied Meaning: O man, do you realise that “what you see and hear is your own echoes”. When you understand the falsity of this vulgar world and discard, you may come upon the truth.         

Stanza 1: Possibly by the power of your miracles, perhaps an end unknown to me; you exist here on this earth. I keep taking birth here. I know not what I would be. Neither know what I was. I keep witnessing regular rises and settings of the sun and moon continuously. Implied Meaning: O Man!  you keep oscillating between the known to the known. There is no separate place like heaven or hell. However, all such movement is a deadwood for it is steeped in the past. Such an existence is not life.  

Stanza 2:  O God! You may be an embodiment of intelligence. However, my ignorance could be even stronger. Your names are innumerable on steady observation. Is this entire visible world a dream or a reality? Is my nose a measuring jar for quantifying exhaling and inhalations? (To reflect my age).

 (To reflect my age). Implied Meaning: I am powerless to decide which way. You perplex me with your innumerable forms. I am unable distinguish truth from illusion. I neither understand time and infinity.

Stanza 3: I know not whether you had condescended to take compassionate view on me. Or it is due to the grace of teacher. Having accepted you as my inside dweller, now I can see/find you. I know not you are Lord of Vishnu or Lord Venkateswara. We know this world is your abode Vaikutham. (वैकुंठ). I find numerous servants of yours in all directions.

 

 

 

Detailed Presentation

Introduction: In this deeply enigmatic verse, you shall find Annamacharya is simply irresistible. He weaves of web of ambiguities to attract. Beyond that simplicity, he is virtually dragging us to explore. 

Greatness of Annamacharya is that his observations on life were reflected by western thinking long after his departure.   His questions are addressed directly to individuals to ponder. He does not quibble with words, rather attracting us to find the missing links.  

 

కీర్తన:

రాగిరేకు:  255-5  సంపుటము: 3-318

కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో
నన్నుం గానను నిన్నుం గానను నడుము బట్టబయలు ॥పల్లవి॥
 
నీమాయమహిమో నే నేరని కడమో
భూమిలోన నీవున్నాఁడవు నా పుట్టుగులుఁ గలవు
యేమి గాఁగలనో యింకా మీఁదట నిటకతొల్లి యేమైతినో
సోమార్కుల వుదయాస్తమయంబులు చూచుచునున్నాఁడను నేను ॥కన్న॥
 
జ్ఞానము నీవో అజ్ఞానంబే బలువో
నీనామంబులు అనంతకోట్లు నిలుకడగాఁ గాను
కానఁగల యీ ప్రపంచమెల్లా కలయో యిది నిజమో
కానరాని యీ ముక్కున నూర్పులు కాలముఁ గొలచేటి కుంచములు ॥కన్న॥
 
నీకు నీవే నను దయ దలఁచితివో నేనాచార్యుని నమ్మితినో
కైకొని నాయంతర్యామివి నినుఁ గంటినిపుడే నేను
శ్రీకాంతుఁడవో శ్రీవేంకటేశ్వర శ్రీవైకుంఠమే యీజగము
యేకడ చూచిన నీదాసులు నాయెదుటనే వున్నారు ॥కన్న॥
 

POEM

Copper Leaf:  255-5  Volume: 3-318

kannadETidO vinnadETidO kAgaladika nEdO
nannuM gAnanu ninnuM gAnanu naDumu baTTabayalu pallavi
 
nImAyamahimO nE nErani kaDamO
bhUmilOna nIvunnADavu nA puTTugulu galavu
yEmi gAgalanO yiMkA mIdaTa niTakatolli yEmaitinO
sOmArkula vudayAstamayaMbulu chUchuchununnADanu nEnu kanna
 
j~nAnamu nIvO aj~nAnaMbE baluvO
nInAmaMbulu anaMtakOTlu nilukaDagA gAnu
kAna@Mgala yI prapaMchamellA kalayO yidi nijamO
kAnarAni yI mukkuna nUrpulu kAlamu golachETi kuMchamulu kanna
 
nIku nIvE nanu daya dalachitivO nEnAchAryuni nammitinO
kaikoni nAyaMtaryAmivi ninu gaMTinipuDE nEnu
SrIkAMtuDavO SrIvEMkaTESvara SrIvaikuMThamE yIjagamu
yEkaDa chUchina nIdAsulu nAyeduTanE vunnAru kanna

 

Details and Explanations:

 

కన్నదేఁటిదో విన్నదేఁటిదో కాఁగలదిఁక నేదో
నన్నుం గానను నిన్నుం గానను నడుము బట్టబయలు ॥పల్లవి॥
 
kannadETidO vinnadETidO kAgaladika nEdO
nannuM gAnanu ninnuM gAnanu naDumu baTTabayalu pallavi 

Word to word meaning: కన్నదేఁటిదో (kannadETidO) = What do I see?  విన్నదేఁటిదో (vinnadETidO) =What Do I Hear? కాఁగలదిఁక నేదో (kAgaladika nEdO) = Do not know what may happen here after; నన్నుం గానను (nannuM gAnanu) = I do not find myself (I do not know who I am); నిన్నుం గానను (ninnuM gAnanu) = do not know who you are; నడుము (naDumu) = in the middle; బట్టబయలు (baTTabayalu) = quite open, quite naked, or evident. 

Literal meaning: What do I see?  What Do I Hear? Do not know what may happen here after. I do not know who I am. Do not know who you are. The life in between is starkly naked.

Explanation: I don’t know who I am. Therefore, all that I see, hear, and anticipate is futile exploration. Hence my claim that I know you is false. Annamacharya is quite clear that the life from birth to death is starkly naked to derive any comfort and engage in activities we do as now.

Thus, it translates to “movement from being me to being with you (God) is a futile journey”. This is also the meaning of Bhagavadgita verse below:

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत |
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना || 28||

avyaktādīni bhūtāni vyakta-madhyāni bhārata / avyakta-nidhanānyeva tatra kā paridevanā Purport: O Arjun, all created beings are unmanifest before birth, manifest in life, and again unmanifest on death. So why grieve?

Now let us examine a painting titled “The common place” (Le Lieu Commun) by Rene Magritte. In this picture we see an expressionless person on the left side coming out of an unknown background. On the right we see he is leaving the visible field, again into an unknown construct. We see a forest in between these characters. The forest here is indicative of hidden nature in spite of physical presence in front of us. Thus, Magritte is saying that the life is mysterious. Is not this picture reflecting this chorus?



Mere viewing with our sense organs is not seeing. We all are blind to the truth.

Implied Meaning: O man, do you realise that “what you see and hear is your own echoes”. When you understand the falsity of this vulgar world and discard, you may come upon the truth. 

        

నీమాయమహిమో నే నేరని కడమో
భూమిలోన నీవున్నాఁడవు నా పుట్టుగులుఁ గలవు
యేమి గాఁగలనో యింకా మీఁదట నిటకతొల్లి యేమైతినో
సోమార్కుల వుదయాస్తమయంబులు చూచుచునున్నాఁడను నేను ॥కన్న॥
 
nImAyamahimO nE nErani kaDamO
bhUmilOna nIvunnADavu nA puTTugulu galavu
yEmi gAgalanO yiMkA mIdaTa niTakatolli yEmaitinO
sOmArkula vudayAstamayaMbulu chUchuchununnADanu nEnu kanna

 

Word to word meaning: నీమాయమహిమో (nImAyamahimO) = by the power of your miracles; నే (nE) = my;  నేరని కడమో (nErani kaDamO) = unknown end; నా పుట్టుగులుఁ (nA puTTugulu) = my births; గలవు (galavu) = available;  యేమి (yEmi) = what; గాఁగలనో (gAgalanO) = can become; యింకా మీఁదటన్ (yiMkA mIdaTan) = beyond this; ఇటకతొల్లి యేమైతినో (niTakatolli yEmaitinO) = earlier what I was; సోమార్కుల (sOmArkula) = the sun and Moon’s; వుదయాస్తమయంబులు (vudayAstamayaMbulu) = regular rises and settings; చూచుచునున్నాఁడను (chUchuchununnADanu) = keep observing, keep counting;  నేను (nEnu) = me

Literal Meaning: Possibly by the power of your miracles, perhaps an end unknown to me; you exist here on this earth. I keep taking birth here. I know not what I would be. Neither know what I was. I keep witnessing regular rises and settings of the sun and moon continuously.

Explanation: సోమార్కుల వుదయాస్తమయంబులు చూచుచునున్నాఁడను sOmArkula vudayAstamayaMbulu chUchuchununnADanu (= keep watching rises and falls of moon and sun) is indicating that the man merely watches the passing of time. By declaring భూమిలోన నీవున్నాఁడవు (bhUmilOna nIvunnADavu = you exist on this earth) Annamacharya is asserting that the God is here on our planet. Thus, Annamacharya is saying that by merely being the people as we are today, we continue this journey perpetually and ineffectively.

యేమి గాఁగలనో యింకా మీఁదటన్ (yEmi gAgalanO yiMkA mIdaTan = what may I become here after) is psychological movement of expectation and anticipation. Annamacharya is denouncing this tendency.

This stanza and the next stanza are essentially same. I am providing more detailed explanation in the next one.

Implied Meaning: O Man!  you keep oscillating between the known to the known. There is no separate place like heaven or hell. However, all such movement is a deadwood for it is steeped in the past. Such an existence is not life. 

 

జ్ఞానము నీవో అజ్ఞానంబే బలువో
నీనామంబులు అనంతకోట్లు నిలుకడగాఁ గాను
కానఁగల యీ ప్రపంచమెల్లా కలయో యిది నిజమో
కానరాని యీ ముక్కున నూర్పులు కాలముఁ గొలచేటి కుంచములు ॥కన్న॥
j~nAnamu nIvO aj~nAnaMbE baluvO
nInAmaMbulu anaMtakOTlu nilukaDagA gAnu
kAnagala yI prapaMchamellA kalayO yidi nijamO
kAnarAni yI mukkuna nUrpulu kAlamu golachETi kuMchamulu kanna

 

Word to word meaning: జ్ఞానము (j~nAnamu) = intelligence; నీవో (nIvO) = may be you are; అజ్ఞానంబే (aj~nAnaMbE) = may be the ignorance; బలువో (baluvO) = is stronger, is mightier; నీనామంబులు (nInAmaMbulu) = your names; అనంతకోట్లు (anaMtakOTlu) = billions; నిలుకడగాఁ గాను (nilukaDagA gAnu) = on steady ground; కానఁగల (kAnagala) =possible to find; యీ (yI) = this; ప్రపంచమెల్లా (prapaMchamellA) = entire world;  కలయో (kalayO) = is it a dream? యిది (yidi) = this; నిజమో (nijamO) = may be a fact; కానరాని (kAnarAni) = not possible to see; యీ (yI) = these; ముక్కున (mukkuna) = thru the nose; నూర్పులు (nUrpulu) = inhaling and exhaling; కాలముఁ (kAlamu) = time; గొలచేటి (golachETi) = measuring; కుంచములు (kuMchamulu) = jars;

 

Literal meaning: O God! You may be an embodiment of intelligence. However, my ignorance could be even stronger. Your names are innumerable on steady observation. Is this entire visible world a dream or a reality? Is my nose a measuring jar for quantifying exhaling and inhalations? (To reflect my age).

Explanation: Annamacharya is clear that tenacity of ignorance is stronger than magnetism of truth. Finally, man gets convinced that he knows the truth. While the great sages like Annamacharya, Jiddu Krishnamurti are in doubt, the fools feel they know the truth. What else can be more sheepish?

Let me continue with the Swan no 10, a 1915 painting by Hilma Af Klint. These Swans#1 in general are representing the picture of Consciousness. Now in this painting you find again an inverse astral plane reflection. Near things look far and far things nearer. Coloured hexagonal shape indicate our present position.



While the truth shines colourful and attractive, we get enticed by it. Little we realise that our present identity (hexagon) is not harmoniously mingling with the sea of consciousness. This hexagon is built by us. “To be in oneness with the truth is not a journey to the centre but dissolve the artificial boundaries we created” is the meaning of the painting.

Again, in the painting you see innumerable circles, indicating we are just a drop in the ocean of awareness. When one joins this ocean, an infinity, therefore, it makes no difference between death and existence.

A drop of ocean is also the ocean itself- therefore the wording నీనామంబులు అనంతకోట్లు (nInAmaMbulu anaMtakOTlu = your names innumerable) is true. But awareness of such reflection is not in realm of time is indicated by the wording నిలుకడగాఁ గాను (nilukaDagA gAnu = on steady ground = in silence).This is also the meaning of the Bhagavad-Gita verse below: 

तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् |
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते
|| 10-10||

tehā satata-yuktānā bhajatā prīti-pūrvakam / dadāmi buddhi-yogaṁ taṁ yena mām upayānti te Purport: O Arjun, whose minds are always united with Me in loving devotion, I give the divine knowledge by which they can attain Me.

Now compare it with the statement of Jiddu Krishnamurti: Now, please compare this statement with Jiddu Krishanmurti’s:  Only when the mind is still, not expecting or grasping or resisting a single thing, is it possible to see what is true. It is the truth that liberates, not your effort to be free.”

Therefore, readers will appreciate these words of Annamacharya are not mere beautiful compositions in praise of the lord, but deep reflections of a yogi.

 

Implied Meaning: I am powerless to decide which way. You perplex me with your innumerable forms. I am unable distinguish truth from illusion. I neither understand time and infinity.

 

నీకు నీవే నను దయ దలఁచితివో నేనాచార్యుని నమ్మితినో
కైకొని నాయంతర్యామివి నినుఁ గంటినిపుడే నేను
శ్రీకాంతుఁడవో శ్రీవేంకటేశ్వర శ్రీవైకుంఠమే యీజగము
యేకడ చూచిన నీదాసులు నాయెదుటనే వున్నారు ॥కన్న॥
 
nIku nIvE nanu daya dalachitivO nEnAchAryuni nammitinO
kaikoni nAyaMtaryAmivi ninu gaMTinipuDE nEnu
SrIkAMtuDavO SrIvEMkaTESvara SrIvaikuMThamE yIjagamu
yEkaDa chUchina nIdAsulu nAyeduTanE vunnAru kanna
 

Word to word meaning: నీకు నీవే (nIku (nIvE) may be on your own will; నను (nanu) = me; దయ దలఁచితివో (daya dalachitivO) = taking compassionate view; నేనాచార్యుని (nEnAchAryuni) = Or the teacher; నమ్మితినో (nammitinO) = might have believed;  కైకొని (kaikoni) = to undertake, to accept; నాయంతర్యామివి (nAyaMtaryAmivi) = my inside dweller; నినుఁ (ninu) = you; గంటినిపుడే (gaMTinipuDE) = found now; నేను (nEnu) = me; శ్రీకాంతుఁడవో (SrIkAMtuDavO) = may the lord of the wealth; శ్రీవేంకటేశ్వర (SrIvEMkaTESvara) = O Lord Venkateswara;  శ్రీవైకుంఠమే (SrIvaikuMThamE) = your great abode Viakuntha; యీజగము (yIjagamu) = this world;  యేకడ (yEkaDa) = in any direction; చూచిన (chUchina) = view; నీదాసులు (nIdAsulu) = your servants; నాయెదుటనే (nAyeduTanE) = in front of me; వున్నారు (vunnAru) = are there;

Literal meaning: I know not whether you had condescended to take compassionate view on me. Or it is due to the grace of teacher. Having accepted you as my inside dweller, now I can see/find you. I know not you are Lord of Vishnu or Lord Venkateswara. We know this world is your abode Vaikutham. (वैकुंठ). I find numerous servants of yours in all directions.

Explanation: There are many who believe in heaven and fear hell. For them, Annamacharya said, there are no other worlds man shall travel. The man remains along with truth in this world.

Now refer to the wording ఆకాశ పాకాశ మరుదైన కూటంబు#2 (AkASa pAkASa marudaina kUTaMbu = this untidy, disorderly world is an unusual cluster).  This ugly, chaotic world is an extraordinary congregation. In this world, there are many issues tyranny, inequality, and extortion. A rare natural order is hidden behind these impediments. The powers of thought and imagination cannot reach it. Accept the chaos as it is rather than trying to control it. The goal of meditation is the dissolution of the ego, not its accumulation.

When man reaches such state, will he not only find the beauty of this life and shower it on his fellow men?  

 

References and Recommendations for further reading:

 

#114. దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో (dibbalu veTTuchu dElina didivO) 

#2 142 ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా(Emi galadiMdu neMta penagina vRthA)

 

 

 

 

-X-The End-X-

 

 

Sunday 18 December 2022

T-153 దిమ్మరిమాట లాడీనే తిమ్మరాయఁడు

 తాళ్లపాక అన్నమాచార్యులు

153 దిమ్మరిమాట లాడీనే తిమ్మరాయఁడు

 

for EnglishVersion press here

 

Synopsis:  ప్రకాశము, తేజస్సు, కళల ద్వారా  ప్రభువు మనలను మంత్రముగ్ధులను చేసి అయోమయములో పెట్టును.

 

Summary of this Poem:

పల్లవి: తీసుకోమని వరములను గుప్పించుచునే భ్రమను, మత్తును కలిగించు మాటలతో కలవరపెడతాడు తిమ్మరాయఁడు అన్వయార్ధము: భగవంతుడు కోరికలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ  సిద్ధంగా ఉన్నప్పటికీ, ఏమి కోరుకోవాలో తెలియని అవివేకులము.

చరణము 1: చెలులారా! అదిగో సింహాసనము మీద నల్లవాఁడే (శ్రీకృష్ణుడే) కూర్చొని వున్నాడు. పొద్దొక సింగారాలను అనుభవించుచున్న భోగరాయఁడు మీకు అగపడుతున్నాడా? విలాసముగా ఇద్దరు సతులమీఁదా జేతులు చాఁచి తీయని మధురపు మాటలు చెబుతున్నాడే   సుగుడరాయఁడు. అన్వయార్ధము: మానవుడా, నీ ముందున్న సత్యాన్ని కనుగొంటున్నావా?  లేక తీపి మాటల భ్రమల లోకంలో నిమగ్నమవుతున్నావా?

చరణము 2: చక్కని మోవి నవ్వుల జాణరాయఁని మునివేళ్ళపై నిలబడి నిక్కిచూచెదరెందుకో వన్నెల నెలఁతలు? సొగసైన విభుడు, చెక్కులమీద చెమటతోడ చెలువరాయఁడు రాచరికపు గర్వంతో  విఱ్ఱవీఁగుతూ అలరించేనే.

చరణము 3: కోనేటిరాయఁడు మెండగు కళల వైభవాలను వ్యాపింపజేస్తాడు. ఉల్లాసకరమైన, ఆహ్లాదకరమైన శృంగారకరమైన మండలములను  సృష్టిస్తాడు. దండిగా నురము మీఁది తరుణి కౌగిలింతలో వాఁడే. మళ్ళీ, బంగారు భవనంలో, అతడే మా వెంకటేశ్వరుడు. అన్వయార్ధము: ప్రకాశము, బలము, తేజస్సు, కళల నైపుణ్యముతోను వల్లభుడు మనలను మంత్రముగ్ధులను చేస్తాడు. తన ద్వంద్వత్వంతో పరీక్ష పెడతాడు. విశ్వాన్ని చుట్టుముట్టిన ఏకత్వాన్ని గమనించారా? 

 

విపులాత్మక వివరణము​ 

ఉపోద్ఘాతము: కీర్తనలో గోపికలు యశోదకు చిన్ని కృష్ణుని ఆగడాలను చేప్పినట్లనిపిస్తుంది. కొంత చిరుకోపం, కొంచెం ఆదుర్దా, కుసింత అసహనాన్ని సూచిస్తూ అన్నమాచార్యులు స్వామిని ముద్దుగాతిమ్మరాయఁడు’ అని సంబోధిస్తాడు. 

"గద్దెమీద నల్లవాడే కంటిరటే?” అంటూ అమాయక పదాల మాటున {అతడి నల్లని రూపము నేపధ్యములో కలిసిపోయి గుర్తించుట అసాధ్యము} అనే పెద్ద విషయాన్ని దాచి వుంచుతాడు. దురదృష్టవశాత్తు, మనిషి తన బుద్ధి గ్రహించగల ఆకర్షణలకు లొంగిపోతాడు. మన ఇప్పటి నిశ్చల నిశ్చితాలు, గ్రహణశక్తులు అజ్ఞానం కంటే పెద్ద అవరోధాలను సృష్టిస్తాయి. 

 

కీర్తన:

రాగిరేకు:  1031-6  సంపుటము: 20-186

దిమ్మరిమాట లాడీనే తిమ్మరాయఁడు
కొమ్మని వరము లిచ్చీఁ గొండలరాయఁడు॥పల్లవి॥
 
గద్దెమీఁద నల్లవాఁడే కంటిరటే చెలులాల
పొద్దొక సింగారాల భోగరాయఁడు
యిద్దరు సతులమీఁదా నిమ్ములఁ జేతులు చాఁచి
సుద్దులు చెప్పీఁగదే సుగుడరాయఁడు ॥దిమ్మ॥
 
నిక్కిచూచీ నేఁటికో నెలఁత లదేమనరే
చక్కనిమోవినవ్వులజాణరాయఁడు
వెక్కసపు రాజసాన విఱ్ఱవీఁగీఁ గొలువులో
చెక్కుల చెమటతోడ చెలువరాయఁడు ॥దిమ్మ॥
 
మెండగు కళల మేని మెఱుఁగులు చల్లీని
నిండు సరసముల కోనేటిరాయఁడు
దండిగా నురము మీఁది తరుణికాఁగిట వాఁడే
వెండి పైఁడి మేడలో శ్రీవేంకటరాయఁడు ॥దిమ్మ॥

 

Details and Explanations:

దిమ్మరిమాట లాడీనే తిమ్మరాయఁడు
కొమ్మని వరము లిచ్చీఁ గొండలరాయఁడు ॥పల్లవి॥

ముఖ్య పదములకు అర్ధములు: దిమ్మరిమాటలు = భ్రమను, మత్తును కలిగించు మాటలు;  తిమ్మరాయఁడు = తింగరి వాడు = శ్రీవేంకటరాయఁడు; కొమ్మని = తీసుకోమని

భావము: తీసుకోమని వరములను గుప్పించుచునే భ్రమను, మత్తును కలిగించు మాటలతో కలవరపెడతాడు తిమ్మరాయఁడు. 

వివరణము: కొమ్మని వరము లిచ్చీఁ విచిత్రంగాను, నమ్మశక్యం కానిదిగాను అనిపించవచ్చు. అయితే, చరిత్రను పరిశీలిస్తే అనేక శతాబ్దాలుగా జీవన సౌకర్యాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలు దైవము నెరవేర్చకపోతే, ఇది నిజంగా జరిగేది కాదు. ఇప్పుడు క్రింది భగవద్గీత శ్లోకాన్ని చూడండి. 

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।

అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ॥3-10॥

భావము: సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు, మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు, " యజ్ఞములను ఆచరించటం ద్వారా వృద్ది చెందండి. ఇవే మీ సమస్త కోరికలను తీరుస్తాయి."

అనేకానేక మంది యజ్ఞముల వలె విజ్ఞన, వైద్య, సామాజిక శాస్త్రములందు చేసిన కృషివల్లనే ఇది సాధ్యమైనదని సులభముగా గుర్తించవచ్చు.

"దిమ్మరిమాట లాడీనే' ద్వారా అన్నమాచార్యులు యేమి చెప్పదలిచారో ఆలోచింతము. భ్రమను, మత్తును కలిగించు మాటలు అని అన్నమాచార్యులు మనము దైవాజ్ఞను స్పష్టంగా అర్థం చేసుకోలేమని సూచించారు, ఎందుకంటే దైవము మానవుడు తనకుగల వనరులన్నింటినీ సమాయుత్తము చేసి ఆయన చెప్పేది వినాలని ఆశిస్తాడు. మనం బాహ్య ప్రపంచం పట్ల ఆకర్షితులమై భగవంతుని సూచనలను సరిగ్గా పట్టించుకోము. ఫలితంగా, ప్రపంచంలోని గందరగోళాన్ని వ్యాపించువారమైతిమి.  

అర్జునుడు కూడా జనార్ధనా "వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే" (నీ అస్పష్టమైన ఉపదేశంతో నా మనస్సు అయోమయం లో పడిపోయింది, 3-2) అని భగవద్గీతలో వాపోతాడు.

అన్వయార్ధము: భగవంతుడు కోరికలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ  సిద్ధంగా ఉన్నప్పటికీ, ఏమి కోరుకోవాలో తెలియని అవివేకులము.

 

గద్దెమీఁద నల్లవాఁడే కంటిరటే చెలులాల
పొద్దొక సింగారాల భోగరాయఁడు
యిద్దరు సతులమీఁదా నిమ్ములఁ జేతులు చాఁచి
సుద్దులు చెప్పీఁగదే సుగుడరాయఁడు ॥దిమ్మ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: గద్దెమీఁద = ఎత్తు ప్రదేశములో, ఆసనము మీద; నల్లవాఁడే = నల్లని దేహము కలవాడు, శ్రీకృష్ణుడు; కంటిరటే= చూచితిరా? కనపడుచున్నాడా? సుద్దులు చెప్పీఁగదే = తీయని మధురపు మాటలు చెప్పీఁగదే;  సుగుడరాయఁడు = సరసుల్లో శ్రేష్టుడు; 

భావము: చెలులారా! అదిగో సింహాసనము మీద నల్లవాఁడే (శ్రీకృష్ణుడే) కూర్చొని వున్నాడు. పొద్దొక సింగారాలను అనుభవించుచున్న భోగరాయఁడు మీకు అగపడుతున్నాడా? విలాసముగా ఇద్దరు సతులమీఁదా జేతులు చాఁచి తీయని మధురపు మాటలు చెబుతున్నాడే   సుగుడరాయఁడు.

వివరణము: గద్దెమీఁద నల్లవాఁడే కంటిరటే?” అని అన్నమాచార్యులు “నేస్తములారా  సింహాసనం మీద నేపథ్యంతో కలిసి కనిపించీ కనిపించని ఆ నల్లనివానిని చూడగలుగుతున్నారా?  మీకు సత్యము అగపడుచున్నదా లేక ఇతరములా” అని ప్రశ్నిస్తున్నాడు. 

చరణం సరళంగా కనిపించినప్పటికీ, అన్నమాచార్యులు పల్లవిలోని గూఢార్ధమును కొనసాగిస్తున్నారు. కావున అన్వయార్ధమును కొంత విశదముగా పరిశీలించవలసి ఉంటుంది. వాస్తవానికి మానవుల మనస్సులోని సందిగ్ధతను సూచించుతూ దైవము ఇద్దరు భార్యల మీద చేతులు చాపినట్లు కనిపిస్తుందన్నారు.  

ఆలోచనల కదలికలకు సంబంధించి ఇంతకు ముందు ఇచ్చిన వివరణలలోని చర్చలను మననము చేసుకోండి. ప్రతీ కదలిక దాని స్వంత ప్రతిబింబాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు, ప్రపంచములో ఇంకా తగిన గుర్తింపులేని చిత్రకారిణి హిల్మా ఆఫ్ క్లింట్ యొక్క ఒక గొప్ప పెయింటింగ్'ను పరిశీలిద్దాం. ఆమె హంసలపై (1914-1915) అనేక చిత్రాలను రూపొందించింది. ​అన్నమాచార్యులు తన కవిత్వంలో హంసల గురించి దాదాపు 20 కీర్తనలలో ప్రస్తావించారు. వారు "గుదికొన్న బ్రహ్మాండాల గుడ్లఁ బెట్టే హంస" అని అన్నప్పుడు, ఖచ్చితంగా అది సాధారణ హంస కాదని, దైవికమైనదనీ తెలియవచ్చు. 



తొమ్మిదవ హంస చిత్రాన్ని క్రింద ఇస్తున్నాను. చిత్రంలో స్పష్టంగా లేని సన్నని రేఖ ఉంది. పెయింటింగ్ రేఖకు ఇరువైపులా సౌష్టవంగా ఉంటుంది​.  పెయింటింగ్ యొక్క కుడి వైపున అక్షానికి అటూయిటూ పెద్ద స్ఫటికాలు కనిపిస్తాయి, ఇది మన ప్రస్తుత జీవితాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదని మనం అర్థం చేసుకున్నప్పటికీ, స్ఫటికం యొక్క పెద్దదనం మనకు రుజువు కావాలి, సాక్ష్యం కావాలి, ‘నాకు తెలిసినదే సత్యము, ఇతరములు కావు’ వంటి మూర్ఖత్వానికి, ఘనీభవించిన​, మార్పును స్వాగతించలేని నైజమునకు ప్రమాణము. మనము సమత్వ అక్షానికి, సత్యమునకు చాలా దూరంగా ఉన్నాం. ఇది మరొక సమతలంపై సమాన ప్రతిచర్యను సృష్టిస్తుంది. చర్య, ప్రతిచర్యలను గమనించుటలో కాలము వెళ్ళబుచ్చి మనము నిస్సారమైన అవగాహనతో జీవితాన్ని గడుపుతాము. 

మనం చిత్రములో కుడి నుండి ఎడమ వైపుకు వెళ్తున్నప్పుడు స్ఫటికాల పరిమాణం తగ్గుతుంది మరియు అక్షం నుండి వాటి దూరం తగ్గుతుంది. ఆలోచనను అనుభవించే అన్ని జీవరాశులు, ఎల్లప్పుడూ సరిపోయే ప్రతిబింబాన్ని కలిగి ఉంటాయి, అందువల్ల గందరగోళానికి, సందిగ్ధతకు లోనవుతాయి. మనస్సులో ప్రశాంతతను సాధించడానికి ధ్యానం, తపస్సు వంటివి చేపట్టి ఆచరించిననూ స్వాతంత్రము సంభవించదు, ఎందుకంటే అక్షానికి ఇరువైపులా వున్న విభిన్న స్ఫటికాలు పరిమాణములో చిన్నవైననూ, వాని నైజము అట్లేవుండును. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు "రేఖ కవతలి వారంతా నేఱగాళ్ళు". రేఖకు ఎటు వైపునున్నా ఇదే వర్తిస్తుంది. అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తిలు చెప్పినట్లు సత్య దర్శనము ఒక మార్గముననుసరించి పోవుటకు సాధ్యపడనిదే. 

ఆలోచనల కదలికలు నిలిపివేయడంతో మనస్సు సత్యంతో అనుసంధానం కావడం ప్రారంభమవుతుంది. ఇంకా ఎడమ వైపుకు ముందుకు వెళితే, రెండు చిన్నవే కానీ గుర్తించగల చుక్కలు కనిపిస్తాయి. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి తనను వుద్యుక్త పరచు  ఆలోచనలను కోల్పోతాడు. స్ఫటికములు కరిగి తనను తాను మరచును. వీనినే అన్నమాచార్యులు దిడ్డితెరువు (చిన్న ద్వారము) అని పిలిచి "గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక / దొడ్డతెరువువంక తొలఁగుమీ#1" అన్నారు. దీనిని బైబిల్ (మత్తయి సువార్త 7: 13) లోను ప్రస్తావించిరి. అదే ముక్తికి ప్రారంభ బిందువు. వెనుదీయుటకు రాని మార్గము. చిత్రకారిణి హిల్మా మానవుడు సత్యంతో తనను తాను ఏకీకృతం చేయుట యందలి వైభవాలను రంగులలో చిత్రీకరించి మరింత స్పష్టం చేసింది. 

ఇప్పుడు కంటిరటే’ అనే పదాన్ని ఇంకొంచెం విశ్లేషిద్దాం. అది చర్య, చూచుట​, అర్థం చేసుకోనుట స్పేస్, మరియు సమయముల ఏకీకృతమైన స్థితిని సూచిస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి పేర్కొన్న సంపూర్ణమైన చర్య కూడా ఇదే.  చర్య యొక్క భౌతిక పార్శ్వాన్ని దాని ప్రతిస్పందనతో ఏకీకృతం చేసి పెయింటింగ్ ఎడమ భాగంలో చూపబడింది. భగవద్గీతలో అనేకమార్లు చెప్పబడిన "యః పశ్యతి పశ్యతి" (= విధముగా చూచువాడే ద్రష్ట) భావము కూడా యిదియే. 

జిడ్డు కృష్ణమూర్తి ఇలా అన్నారు: "బాహ్యంగానూ, అంతర్గతంగానూ అన్ని విభజనలు విరోధమును పెంపొందిస్తాయి. కాబట్టి సమస్య తలెత్తుతుంది. దేనినైనా "నేను" సొంతం చేసుకున్న మరుక్షణం ఘర్షణ  సృష్టించ బడుతుంది. యాజమాన్య భావన (కర్తృత్వ భావన) లేని  చోట పూర్తిగా వేరే దృష్టి కోణం ఉండదా? అందువల్ల స్వేచ్ఛ ఉంటుంది." 

 "..అంటే మెదడును పూర్తి నిశ్శబ్దం ఆవరించినప్పుడు, దాని ప్రతిస్పందనలు, దాని ప్రతిచర్యలు అతి వేగంగా ఉంటాయి. స్థితిలో మాత్రమే అది తనను, తన ప్రతిబింబమును ఏక కాలములో గ్రహించి ఏకీకృత చర్యకు మార్గము సుగమము చేయును. సంభవించును. ఇదికాక వేరు చర్యలన్నియు ఘర్షణకు దారులు తీయును" (You are the World, a talk at Brandeis University, 18th October 1968). 

విధంగా, చరణంలో అన్నమాచార్యులు శ్రోతలను సత్యాన్ని చూసే చాతుర్యాన్ని కనుగొనమని అడుగుతున్నారు, లేకపోతే వారుదిమ్మరిమాటల మత్తులో పడి పోగలరని హెచ్చరించారు. 

 

సంక్షిప్త చీటీ: హిల్మా క్లింట్ ఒక స్వీడిష్ కళాకారిణి మరియు ఆధ్యాత్మికవేత్త. ఆమె చిత్రాలు పాశ్చాత్య కళా చరిత్రలో మొట్టమొదటి నైరూప్య లేఖనములుగా పరిగణించబడతాయి. ఆమె పెయింటింగ్స్ చేసింది, కానీ ఆమె జీవితంలో వాటిని ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఆమె మరణించిన 20 సంవత్సరాల తరువాత ఆమె విల్లులో వ్రాసిన విధముగా బయటకు తీసుకువచ్చారు. 

హిల్మా ఆఫ్ క్లింట్ తన చేయి ఒక అదృశ్య శక్తిచే మార్గనిర్దేశం చేయబడినదని భావించింది. ఆమె తన నోట్  బుక్'లో ఇలా వ్రాసి౦ది: " చిత్రాలు నేరుగా నా ద్వారా, ప్రాథమిక ఉజ్జాయింపు చిత్రాలు లేకుండా, గొప్ప శక్తి సహాయముతో చిత్రి౦చబడ్డాయి. పెయింటింగ్స్ ఎలా వర్ణించాలో; దేనికోసమో కూడా  నాకు తెలియదు. అయినప్పటికీ నేను ఒక్క బ్రష్ స్ట్రోక్ కూడా మార్చకుండా వేగంగా మరియు నిర్దిష్టంగా పనిచేశాను."  

క్లింట్ యొక్క పలు చిత్రలేఖనములు జిడ్డు కృష్ణమూర్తి ప్రసిద్ధ ప్రకటనలకు చాలా మునుపే వేయబడ్డాయి.

 
అన్వయార్ధము: మానవుడా, నీ ముందున్న సత్యాన్ని కనుగొంటున్నావాలేక తీపి మాటల భ్రమల లోకంలో నిమగ్నమవుతున్నావా?

 

నిక్కిచూచీ నేఁటికో నెలఁత లదేమనరే
చక్కనిమోవినవ్వులజాణరాయఁడు
వెక్కసపు రాజసాన విఱ్ఱవీఁగీఁ గొలువులో
చెక్కుల చెమటతోడ చెలువరాయఁడు ॥దిమ్మ॥

ముఖ్య పదములకు అర్ధములు: నిక్కిచూచీ = మునివేళ్ళపై నిలబడి; 

భావము: చక్కని మోవి నవ్వుల జాణరాయఁని మునివేళ్ళపై నిలబడి నిక్కిచూచెదరెందుకో వన్నెల నెలఁతలు? సొగసైన విభుడు, చెక్కులమీద చెమటతోడ చెలువరాయఁడు రాచరికపు గర్వంతో  విఱ్ఱవీఁగుతూ అలరించేనే. 

వివరణము: భౌతిక ప్రకృతి స్వభావము మనలో ఆసక్తిని సృష్టించి దాని అనంత రూపాల్లో మనల్ని నిమగ్నం చేయడం అతి సమర్థవంతంగా చేస్తుంది. 

మన మనస్సులలో నాటిన ఆకర్షణ భ్రమను సత్యంగా భావించేలా చేస్తుంది. (నేర్చినదానిని) మఱచిపోవుట అనేది విభిన్న (లేదా తెలియని) మైండ్ ఫ్రేమ్ లతో పనిచేయడం కాదు, అలా౦టి నిర్మాణాలకు వెలుపలకు రావడమే. అటువంటి ఆకృతులను కూలదోయడమే ధ్యానము లేదా తపస్సు.

మెండగు కళల మేని మెఱుఁగులు చల్లీని
నిండు సరసముల కోనేటిరాయఁడు
దండిగా నురము మీఁది తరుణికాఁగిట వాఁడే

వెండి పైఁడి మేడలో శ్రీవేంకటరాయఁడు ॥దిమ్మ॥

ముఖ్య పదములకు అర్ధములు: మెండగు = ఆధిక్యము, అతిశయము; 

భావము:: కోనేటిరాయఁడు మెండగు కళల వైభవాలను వ్యాపింపజేస్తాడు. ఉల్లాసకరమైన, ఆహ్లాదకరమైన శృంగారకరమైన మండలములను  సృష్టిస్తాడు. దండిగా నురము మీఁది తరుణి కౌగిలింతలో వాఁడే. మళ్ళీ, బంగారు భవనంలో, అతడే మా వెంకటేశ్వరుడు. 

వివరణము: మళ్ళీ అన్నమాచార్యులు బంగారు కట్టడాన్ని ప్రస్తావించడం లేదు. అలాంటి భవనాలను మనమే మన మనస్సుల్లో నిర్మిస్తాం. అన్నమాచార్యుడు సూచించిన దైవము ఇంద్రియ జ్ఞానానికి అతీతుడు. ఆయన బహుశా ఒక దండను కలుపు దారం వలె మొత్తం ప్రపంచాన్ని ఏకం చేసే సత్యాన్ని సూచిస్తున్నాడు అనుకోవచ్చు.   

విభుని తేజస్సు గొప్ప కళల కూటము. మనము వానితో ఐక్యం కావడానికి అతను విశ్వవ్యాప్తంగా వెదచల్లిరి. కానీ, మనం ఏమి చేస్తాము? ఆయా కళలలో నిష్ణాతులమిని నిరూపించు కొనుటకు స్పర్ధలు పెంచుకుంటాము. అడ్డదారులూ ఎంచుకొంటాము.  కళలకు గుత్తాధిపత్యము వహింప జూస్తాము.  మనకు ప్రృకతి ఇచ్చిన కళతో వ్యాపారం చేయాలనుకుంటాము. 

అన్వయార్ధము: ప్రకాశము, బలము, తేజస్సు, కళల నైపుణ్యముతోను వల్లభుడు మనలను మంత్రముగ్ధులను చేస్తాడు. తన ద్వంద్వత్వంతో పరీక్ష పెడతాడు. విశ్వాన్ని చుట్టుముట్టిన ఏకత్వాన్ని గమనించారా?

References and Recommendations for further reading:

 

#1 93. ఊరికిఁ బోయెడి వోతఁడ (Uriki bOyeDi vOtaDa)

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...