Saturday 26 August 2023

T-179 అలర నుతించరో హరిని

 అన్నమాచార్యులు

179 అలర నుతించరో హరిని

for English Version press here

క్లుప్తముగా: "ఇది నా జీవితంలో జరగకూడదని నేను కోరుకుంటాను," ఆవేదనతో ఫ్రోడో అన్నాడు.

"ఔను నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అలాగే జీవించే వారందరూ అలాగుననే కోరుకుంటారు. కానీ అది వారు నిర్ణయించునది కాదు. మనకు (దైవము) ఇచ్చిన సమయంతో ఏమి చేయాలో మనమే నిర్ణయించుకోవాలి." అన్నాడు గండాల్ఫ్

- జె.ఆర్.ఆర్. టోల్కీన్, ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ 

Summary of this Poem:

పల్లవి: మానవులారా! కాలము మిమ్ము తన వశము గావించుకొని భ్రమయించును. కావున ఇప్పుడే హరిని సమ్మతించి నుతించరో.   

చరణం 1: మనుషులారా హరి చింత ఇకనైనా చేయుడీ. విడువుడీ  మీరు భుజించు రుచులమీఁద మనస్సు. ఈ దేహము అస్థిరము.  ఈ కలిమి కూడా అధ్రువము. మనము అనుభూతి చెందు కాలము తనంతట తాను పోవును కానీ అది గడచినకొద్దీ ఏమాత్రము మర్పు లేక అలానే వుండును. (దానిమీద ఎక్కి సవారి చేసి ముందుకు పోలేము. దాని మూలమున ఎటువంటి లాభము వుండదు). 

చరణం 2: మనుజులారా! హరికథలు మెచ్చరో! మదిలోన రివ్వున తిరుగాడు పొరపొచ్చెములను తొలగించరో. వదులుకోరో కోరికలను. ఈ పనులిచ్చు శుభములు యెల్లకాలముండును. 

చరణం 3: మానవులారా! కనులకు తృప్తిగా వేంకటపతిఁ  చూడరో! ఆతని స్తుతిని వినరో చెవులతో! శ్రీహరిచేతి మన్ననలు పొందరో! అయ్యలారా! ఇంద్రియముల ద్వారా తెలియు మీద దేనినైననూ బుద్ధిని నిలిపితే అసలు బుద్ధిని కాలము దాచి మాయజేయును. అన్వయార్ధము: మానవా! నీ ముందే యున్న సత్యమును కన్నులు తెలిచి చూచితివా. సత్యమునే కొలుచువారి మాటలు నీకు వినబడుచున్నవా? దివ్యము అపరూపమునగు కరుణచేత నీవు చుట్టబడితివా? లేక కాలమను మిధ్యలో తగిలి కొట్టుమిట్టాడు చుంటివా? 

విపులాత్మక వివరణము. 

ఉపోద్ఘాతము: కాలము ఆధ్యాత్మిక వేత్తలకు, తత్వవేత్తలకు తాము గాంచిన సత్యమును వెళ్ళడించుటకు ముఖ్యమైన ఆశ్రయములలో నొకటి. సత్యాన్వేషణలో సమయమొక కృత్రిమ మూలకము. "తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలము" అని అన్నమాచార్యులు కాలము సూక్ష్మముగా వూహల లోనికి ప్రవేశించి దృష్టి మరల్చునని అన్నారు. 

కీర్తన:

రాగిరేకు:  65-5 సంపుటము: 1-338

అలర నుతించరో హరిని
యెలయించి మిము భ్రమయించీనిఁ గాలముఅలర 

సేయరో మనుజులార చింత హరి నిఁకనైన
రోయరో మీభుజియించు రుచులమీఁద
కాయ మస్థిరము యీ కలి మధ్రువము చాలఁ
బోయఁబో యెందుకుఁ గాకపోయఁ గాలముఅలర 

మెచ్చరో మనుజులార మీరే హరికథలు
పుచ్చరో మీమదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు-
నిచ్చీని శుభములు యివి యెల్లకాలముఅలర 

కనరో వేంకటపతిఁ గన్నులు దనియఁగా
వినరో యీతని స్తుతి వీనులు నిండ
మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు
తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలముఅలర॥

 Details and Explanations:

అలర నుతించరో హరిని
యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము
అలర

 ముఖ్య పదములకు అర్ధములు: అలర = సంతోషముతో, సమ్మతించి, వికసించి; యెలయించి = లోనగునట్లు చేయుట, వశము గావించుట. 

భావము: మానవులారా! కాలము మిమ్ము తన వశము గావించుకొని భ్రమయించును. కావున ఇప్పుడే హరిని సమ్మతించి నుతించరో.   

వివరణము: యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము: దీనిని 1933లో వచ్చిన లా రెస్పోన్సే ఇంప్రెవ్యూ (ఊహించని సమాధానం) అనే ఒక తమాషా అయిన పెయింటింగ్ మాధ్యమముగా అర్ధము చేసుకుందాము. మనకు చక్కగా నగిషి చేయ బడ్డ నిగనిగలాడే ద్వారము కనబడును. అంతగా ప్రచారములో లేని ఈ చిత్రము మాగ్రిట్ గారి కళానైపుణ్యమునకు ఇది పరాకాష్ట.


ఆ ద్వారములో  ఏమిటో తెలియని నిర్దుష్టమైన ఆకారము లేని ఒక కటౌట్ లాంటిది కనబడుతుంది. దాని ద్వారా అవతలి ద్వారం అవతలి వైపుకు కొంచమే వెలుతురు పడుతున్నట్లు కనబడుతుంది. ఆవల వున్నది సత్యమో, మరణమో, కాలమో ఎవరికి ఎరుక​? మనిషి ఆరాటము కొద్దీ చేయు ప్రయత్నములను  అస్పష్టమైన కటౌట్ నిర్ధారిస్తుంది.

అంత పెద్ద కన్నము వేసినా మొత్తనికి ద్వారము చెక్కుచెదరకుండా ఏ మాత్రమూ పట్టువదలక మునుపు తానున్నట్టే వుంది. పరీక్షించి చూడగా, ఆ ద్వారము తెరచిన కానీ అటువైపు వున్నవి తెలియ లేమని తెలుస్తుంది. దొంగలా కన్నమువేసి అటువైపు వానిని తెలియ ప్రయత్నము సఫలము కావని; కొద్ది మేర మాత్రమే ఆవలికి విస్తరించిన  కాంతిని బట్టి తెలియవచ్చు. 

ఇంకొంచెం ముందు కెళ్ళి, అగపడుదానిని పరికించి చూస్తే, ద్వారము ఆవల​, ఈవల వున్నది ఒకటేనని కూడా గ్రహించవచ్చు. కేవలము అక్కడ ద్వారము వుంచడం వల్ల వచ్చిన కుతూహలము అటువైపు ఏమీ లేదని తెలిస్తే వుండదు. అనగా అక్కడి ద్వారము నామమాత్రమే. కానీ మనలో చెలరేగు భావనలెన్నెన్నో. మూసిన గుప్పిటిలో ఎముందో ఎవరికి తెలుస్తుంది.

పై బొమ్మలో చూపిన ద్వారము మాదిరిగానే సత్యము, మరణము, సమయములు తామున్న స్థితిని నిర్దారింపక  కాలమును వెళ్ళబుచ్చును. మానవుడు తాను వీటిని ఎప్పటికైనా గ్రహించగలననే భ్రాంతిలో మునిగి వుంటాడని అన్నమాచార్యుల భావము. 

కానీ అక్కడ ఆవలివైపు, పర్వతాలకు అవతల, మరణము తర్వాత ఏదో వున్నదని భావించటమే భ్రాంతి. స్పేస్ (మానసిక దూరము), కాలము మనసు సృష్టించిన భ్రమలే. ఉదాహరణకు ఒక మంచి అనుభవము (చక్కటి కాఫీ అనికోండి) అయిపోయిన వెంటనే తిరిగి అది పొందుటకు మనసు ఉవ్విళ్ళూరుతూ, ఎదురుచూస్తూ, ఆరాటపడుతూ కల్పించు భావనయే కాలము.  ఈ రకంగా పై చిత్రము (ఊహించని సమాధానము), "యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము"ల యొక్క భావము ఒకటే.

పుట్టెడిదొకటే పోయెడిదొకటే“ “పరమనేదొకటే ప్రపంచమొకటే“ “మున్నిటి జగమే మున్నిటి లోకమే“  “చిత్తము నాఁటిదే చింతలు నాఁటివే“ అని అన్నమాచార్యులు పదేపదే చెప్పిన దిదియే. 

సేయరో మనుజులార చింత హరి నిఁకనైన
రోయరో మీభుజియించు రుచులమీఁద
కాయ మస్థిరము యీ కలి మధ్రువము చాలఁ
బోయఁబో యెందుకుఁ గాకపోయఁ గాలము
అలర 

ముఖ్య పదములకు అర్ధములు: రోయరో = రోఁతపడరో, విడువరో; 

భావము: మనుషులారా! హరి చింత ఇకనైనా చేయుడీ. విడువుడీ  మీరు భుజించు రుచులమీఁద మనస్సు. ఈ దేహము అస్థిరము.  ఈ కలిమి కూడా అధ్రువము. మనము అనుభూతి చెందు కాలము తనంతట తాను పోవును కానీ అది గడచినకొద్దీ ఏమాత్రము మర్పు లేక అలానే వుండును. (దానిమీద ఎక్కి సవారి చేసి ముందుకు పోలేము. దాని మూలమున ఎటువంటి లాభము వుండదు.) 

వివరణము:  సమయము మనకు కనబడుతూ వూరించు ఒక కృత్రిమ ధాతువని ఆచార్యుల భావన​. హరి చింతనను భోజనానంతరమునకు; దేహము నశించిపోవుచున్నదని తెలిసి దానిని అడ్దగించుటకు; ధనము సంపాదించిన పిదప హరిని భజించుటకు నిరంతరము ప్రోత్సహించు కాలమునకు తెలియకయే  వశమౌదుము. 

మెచ్చరో మనుజులార మీరే హరికథలు
పుచ్చరో మీమదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు-
నిచ్చీని శుభములు యివి యెల్లకాలము
అలర

 

ముఖ్య పదములకు అర్ధములు: పుచ్చరో = తొలగించరో; పొరలు = దొర్లు, ప్రవర్తిల్లు; కొచ్చరో = వదలుకొరో. 

భావము: మనుజులారా! హరికథలు మెచ్చరో! మదిలోన రివ్వున తిరుగాడు పొరపొచ్చెములను తొలగించరో. వదులుకోరో కోరికలను. ఈ పనులిచ్చు శుభములు యెల్లకాలముండును. 

కనరో వేంకటపతిఁ గన్నులు దనియఁగా
వినరో యీతని స్తుతి వీనులు నిండ
మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు
తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలము
అలర॥ 

ముఖ్య పదములకు అర్ధములు: తనమీఁది మది = మనసు తనమీదే నిలిపితే. 

భావము: మానవులారా! కనులకు తృప్తిగా వేంకటపతిఁ  చూడరో! ఆతని స్తుతిని వినరో చెవులతో! శ్రీహరిచేతి మన్ననలు పొందరో! అయ్యలారా! ఇంద్రియముల ద్వారా తెలియు మీద దేనినైననూ బుద్ధిని నిలిపితే అసలు బుద్ధిని కాలము దాచి మాయజేయును.

వివరణము: కనరో వేంకటపతిఁ గన్నులు దనియఁగా: అని చెప్పుట ఏదో కీర్తనలు/యజ్ఞములు/తపస్సులు చేసి పుణ్య లోకములకు మార్కులు కొట్టేయమని కాదు, కన్నుల ముందున్న లోకమును తెలియమని. "వినరో యీతని స్తుతి వీనులు నిండ" "మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు" అనునవియూ ఈ కోవకు చెందినవే. అవి ప్రత్యక్షముగా ఎఱుకలోనికి వచ్చుననియే ఆచార్యుల భావము.

అన్నమాచార్యులు తత్వవేత్త కానీ, వేదాంతుల ఇండ్లలోనో పుట్టిన జ్ఞానియో కాదు. తనకు  స్వయముగా ప్రజ్ఞలోనికి వచ్చిన అనుభవములను వారు తెలిపిరి. అనగా "పరమనేదొకటే ప్రపంచమొకటే" అనునది పరమ సత్యము. రెండు లోకములు లేవని వారు పదేపదే చెప్పిరి. ఈ లోకముననే మానవుడు తన బుద్ధిని వుపయోగించి అజ్ఞానమును విడువవలెనని వారి వాదము.

కావున దైవము అనునది నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చేరుకోగల తీరము కాదు. జాగ్రత్తగా గమనించిన సృష్టిలో కూడా ఎంత దగ్గరి పోలికలు కనబడినా కూడా అనంత చైతన్యము నుండి ఉద్భవించినదియే కానీ పరిణామము చెంది ఏర్పడినది కాదు. కాలముతో బాటు మనసు పరిపక్వత వైపుగా పరిణామము చెందునని భావించుటయే అవిద్య​.

నాకు చేతనైనంత వరకు ఈ విషయమును విశద పరచ యత్నింతును. హిల్మా యాఫ్ క్లింట్ వేసిన క్రింది ఐదవ హంసను చూడండి. అన్ని హంసలలో మాదిరిగానే దృశ్యాదృశ్యములను వేరుపరచుచూ అడ్దముగా ఒక గీత వున్నది. దానికి ఇరువైపులావున్న తలములు బాహ్యమును, అంతరంగమును చూపును. క్రింది ఎడమవైపు వున్న నల్లను హంస మనమున్న స్థితిని తెలుపును.


ఆ నల్లని హంస తదేక ధ్యాసతో తన రెక్కలు, మనసు, ముక్కు, వెలుపల వానితోనూ లోపలి వాటితోనూ కూడిన చెల్లా చెదురుగానున్న​ ఆలోచనలను ఒక్కత్రాటి పై తెచ్చినట్లు మానవుడు అంతర్వీక్షణమునకు ఉద్యమించ వలెనని తెలుపును. అన్నమాచార్యులు చిత్త మంతర్ముఖము సేసుకొన నేర్చెనా / అత్తల నతఁడు యోగియనఁబడును అను పదములతో చెప్పినదిదియే.

ఆ ధ్యాన స్థితినుండి వుత్పన్నమగు ప్రకంపనములే గాలిలో స్వేచ్ఛగా ఎగురుతున్న తెల్లని హంసగా రూపాంతరము చెందిన వికసిత రూపము.​ బుద్ధుని జీవిత చరిత్ర గమనించినా కూడా,  ఆరేళ్ళ కఠోర​ తపస్సు వలన తనకు లబించినది కొంచెమేనని తెలిసి ధ్యానమును చేపట్టిన కొలది వారములలోనే సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది.

తెల్లని హంసగా ఎగురుటను నల్ల హంస అంతర్ముఖము చేసుకొనుటను ఒకే బొమ్మలో చూపి వాటి మధ్య వ్యత్యాసము లేదని చూపిరి. ఈ రకముగా ఈ రూపాంతరము నందు సమయము అనునది పెద్ద విషయము కాదని తేల్చిరి. ఈ విధముగా క్రమక్రమముగా పరిపూర్ణత చెందుననుట కేవలము ఊహాజనితము. అందుమూలమున "తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలము" అనునది ఎంతయునూ విచారించ తగ్గ విషయము. 

అన్వయార్ధము: మానవా! నీ ముందే యున్న సత్యమును కన్నులు తెలిచి చూచితివా. సత్యమునే కొలుచువారి మాటలు నీకు వినబడుచున్నవా? దివ్యము అపరూపమునగు కరుణచేత నీవు చుట్టబడితివా? లేక కాలమను మిధ్యలో తగిలి కొట్టుమిట్టాడు చుంటివా? 

-x-x-x-

Tuesday 22 August 2023

178 kalagannachOTikini gaMpa yettinayaTlu (కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు)

 ANNAMACHARYULU

178 కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు

(kalagannachOTikini gaMpa yettinayaTlu)

 ఈ వివరణను తెలుగులో చదువుటకు ఇక్కడ నొక్కండి

Summary of this Poem:

Chorus: O dear lady! Wherefore, contemplating what, dost thou endeavour in futility? What dost thou seek in the shadows? Implied meaning: Oh, feeble one! Even place and time elude your grasp! Why exhaust yourself in aimless endeavours when you could instead seek solace in God's presence?

Stanza 1: Once upon a time, the Lord, descending to grace this woman, bestowed a captivating sidelong gaze. Recalling that moment, this beauty smoulders with fervent desire to unite. The heat of these thoughts leaves her weary. How can she remain unaffected? 

Stanza 2: In a distant past, on a day now unclear, it seems the Lover hastily spoke words that caused her pain. Since that very moment, this woman has been enveloped in the blaze of sorrow, her condition eroding over time to reach its present stage. How could she possibly remain untouched? Implied meaning: The recollections of both suffering and love linger in our minds like bubbles, clouding our ability to see clearly. 

Stanza 3: Since that day till the present, they've been joyfully united. While the exact moment eludes her memory, tenderly the Lord has become an inseparable part of her consciousness. What a delightful and mischievous play by Lord Venkateswara! What more could anyone ask for? Implied meaning: When people willingly let go of their desires and submit to the ways of nature, they become connected to a greater awareness that exists everywhere, even if they don't realize it.

 

Detailed Presentation

Introduction: In this poem, Annamacharya takes on the persona of another woman, revealing the diverse emotions churning within her thoughts. This marks another level of creativity. Annamacharya blends spirit and nostalgia to craft a potent love potion, a gem born from unusual imagination. It holds relevance because it reflects Annamacharya's sense of earthly connection and spirituality. 

కీర్తన:
రాగిరేకు:  11-3 సంపుటము: 5-64
POEM
Copper Leaf:  11-3 Volume: 5-64
కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు
అలవు మీఱిన దెట్లనమ్మా ॥పల్లవి॥
 
ఎలయింపుఁ గడకంట నెన్నఁడో వొకనాఁడు
చెలఁగి తను నతఁడు చూచినవాఁడట
పొలిఁతి యదిదలఁచి యిప్పుడు మదనవేదనల-
నలసీ నిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥
 
ఎఱుకయును మఱపుగా నేఁటికో వొకనాఁడు
కెఱలి తను నొవ్వఁ బలికినవాఁడట
తఱినదియె చెలి యిపుడు దలఁచి పరితాపాగ్ని-
నఱగీ నిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥
 
ఇయ్యకోలుగఁ గలసి యెప్పుడో యిదెనేఁడు
నెయ్యమున చెలిలోన నెలకొనెనట
తియ్యముల సటకాఁడు తిరువేంకటేశ్వరుఁడు
అయ్యో యిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥ 
kalagannachOTikini gaMpa yettinayaTlu
alavu mI~rina deTlanammA pallavi
 
elayiMpu gaDakaMTa nennaDO vokanADu
chelagi tanu nataDu chUchinavADaTa
politi yadidalachi yippuDu madanavEdanala-
nalasI nikaneTlanammA kalaganna
 
e~rukayunu ma~rapugA nETikO vokanADu
ke~rali tanu novva balikinavADaTa
ta~rinadiye cheli yipuDu dalachi paritApAgni-
na~ragI nikaneTlanammA kalaganna
 
iyyakOluga galasi yeppuDO yidenEDu
neyyamuna chelilOna nelakonenaTa
tiyyamula saTakADu tiruvEMkaTESvaruDu
ayyO yikaneTlanammA kalaganna

 

Details and Explanations:

కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు
అలవు మీఱిన దెట్లనమ్మా ॥పల్లవి॥

kalagannachOTikini gaMpa yettinayaTlu
alavu mI~rina deTlanammA pallavi 

Word to word meaning: కలగన్నచోటికిని (kalagannachOTikini) = to go to a place in dream = to desire an unreal thing;  గంప యెత్తినయట్లు (gaMpa yettinayaTlu) = literal meaning: to lift the basket; figurative: to try doing what one conceived in the mind; అలవు మీఱిన (alavu mI~rina) = great effort; దెట్లనమ్మా (deTlanammA) = how is it possible? How can I go to a place in dream? how do I reach it? All my efforts going in vain!   

Literal meaning: O dear lady! Wherefore, contemplating what, dost thou endeavour in futility? What dost thou seek in the shadows? 

Explanation: కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు (kalagannachOTikini gaMpa yettinayaTlu): Let us decipher this expression through the aid of the renowned artwork “The Difficult Crossing” by Rene Magritte. Coincidentally, this painting too possesses an ethereal quality. The bilboquet or baluster (resembling a chess bishop) commands the spotlight. The bilboquet has been provided an anthropomorphic semblance of an eye, seemingly perplexed about its surroundings. 


Near the bilboquet stands a table. On its top, a hand cut from a mannequin is holding a red bird, as if clutching it gently. The dove looking forward to the bilboquet (to help).  The front right leg of the table resembles a human leg. Here and there are wooden planks leaning on the walls of the room. Square spaces are seen in these planks. The right-sideboard holds, the screen to the walls to give better view of the room.
 

Another prevalent characteristic of Magritte's pieces evident in this artwork is the uncertainty between windows and paintings. Towards the rear of the room, there's an illustration of a boat about to capsize amidst a thunderstorm, yet the observer is left pondering whether it's a painted scene or an actual view through a window. Magritte further intensified this notion in his series inspired by "The Human Condition," where depictions of "outdoor" paintings and windows emerge, even intertwining at times. The gaze of the bilboquet's eyes is baffled, as though uncertain of its next course. 

The leg of man supporting the table indicates that our views of the outside world are partly built by our imagination connecting some missing information. Thus, we see things made up by our mind, but not necessarily reality. In other words, it is generous but not essential to rescue the pigeon stuck in mannequin’s hand. 

Bilboquet is like a human. It cannot decide whether to save the bird in front of it or to step forward to enter the ocean to take part in the tumultuous and uncertain life ahead. Fear dominates our decisions. 

Despite the curtains being drawn back by the passage of human history, revealing greater unobstructed view, the square openings within the wooden planks on either side cast shadows of uncertainty. This implies that decisions made by humans often stem from incomplete knowledge. On closer examination, the walls, the timber panels, the curtains, the pigeon, and even the room are man-made constructs. We come to realize that every element within that space is embellished by the strokes of our imagination. 

The same is implied by ‘kalagannachOTikini gaMpa yettinayaTlu’ (కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు). In this way, the truth that remains somewhat beyond our grasp is comparable to the faintly captured human figure in the photograph below.

Implied meaning: Oh, feeble one! Even place and time elude your grasp! Why exhaust yourself in aimless endeavours when you could instead seek solace in God's presence?

ఎలయింపుఁ గడకంట నెన్నఁడో వొకనాఁడు
చెలఁగి తను నతఁడు చూచినవాఁడట
పొలిఁతి యదిదలఁచి యిప్పుడు మదనవేదనల-
నలసీ నిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥ 
 
elayiMpu gaDakaMTa nennaDO vokanADu
chelagi tanu nataDu chUchinavADaTa
politi yadidalachi yippuDu madanavEdanala-
nalasI nikaneTlanammA kalaganna 

Word to word meaning: ఎలయింపుఁ (elayiMpu) = "gaze of enchantment" or "bewitching glance’;  గడకంట (gaDakaMTa) = looking from the corner of eye, side glance; నెన్నఁడో వొకనాఁడు (nennaDO vokanADu) = long back; చెలఁగి (chelagi) = to occur, to happen; తను (tanu) = of the lady; నతఁడు (nataDu) = HE; చూచినవాఁడట (chUchinavADaTa) = gave a look; పొలిఁతి (politi) = this beauty; యదిదలఁచి (yadidalachi) = remembering this; యిప్పుడు (yippuDu) = now; మదనవేదనల- (madanavEdanala) = intense feeling to join/meet; నలసీ (nalasI) = got tired; నిఁకనెట్లనమ్మా (nikaneTlanammA) = how can she be like that? 

Literal meaning: Once upon a time, the Lord, descending to grace this woman, bestowed a captivating sidelong gaze. Recalling that moment, this beauty smoulders with fervent desire to unite. The heat of these thoughts leaves her weary. How can she remain unaffected? 

Explanation:  We find ourselves drawn to the enchanting heroines of old movies. Even after two or four decades, we vividly remember their faces and the way they captivated us. This leads us to perpetually seek positive emotions, yet we avoid confronting the reality of daily life. We rarely scrutinize to distinguish between truth and falsehood in events. Nonetheless, out of apprehension, we readily grasp onto pleasure to distract ourselves from fear. Annamacharya skilfully elucidates the inner workings of our minds.

ఎఱుకయును మఱపుగా నేఁటికో వొకనాఁడు
కెఱలి తను నొవ్వఁ బలికినవాఁడట
తఱినదియె చెలి యిపుడు దలఁచి పరితాపాగ్ని-
నఱగీ నిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥ 

e~rukayunu ma~rapugA nETikO vokanADu
ke~rali tanu novva balikinavADaTa
ta~rinadiye cheli yipuDu dalachi paritApAgni-
na~ragI nikaneTlanammA kalaganna

 

Word to word meaning: ఎఱుకయును (e~rukayunu) = active memory; మఱపుగా (ma~rapugA) = forgotten thing; నేఁటికో వొకనాఁడు (nETikO vokanADu) = uncertain of the day; కెఱలి (ke~rali) = in haste;  తను నొవ్వఁ (tanu novva) = hurt her; బలికినవాఁడట (balikinavADaTa) = looks that he uttered; తఱినదియె (ta~rinadiye) = from that very moment; చెలి (cheli) = this lady; యిపుడు (yipuDu) = now (also); దలఁచి (dalachi) = recollecting; పరితాపాగ్ని- (paritApAgni) = fire of sorrow; నఱగీ (na~ragI) = got reduced; నిఁకనెట్లనమ్మా (nikaneTlanammA) = how can she be like that?

Literal meaning: In a distant past, on a day now unclear, it seems the Lover hastily spoke words that caused her pain. Since that very moment, this woman has been enveloped in the blaze of sorrow, her condition eroding over time to reach its present stage. How could she possibly remain untouched?

Explanation: Experiences plant many things, that yield pain and suffering. These emotions hold the ability to pull us in their direction. The more we revisit them, the more profound the agony grows. Eventually, they etch themselves permanently into the mind, leaving a lasting scar. René Magritte's painting titled "Memory," depicted below, captures this very essence.



Implied meaning: The recollections of both suffering and love linger in our minds like bubbles, clouding our ability to see clearly. 

ఇయ్యకోలుగఁ గలసి యెప్పుడో యిదెనేఁడు
నెయ్యమున చెలిలోన నెలకొనెనట
తియ్యముల సటకాఁడు తిరువేంకటేశ్వరుఁడు
అయ్యో యిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥ 
 
iyyakOluga galasi yeppuDO yidenEDu
neyyamuna chelilOna nelakonenaTa
tiyyamula saTakADu tiruvEMkaTESvaruDu
ayyO yikaneTlanammA kalaganna 

Word to word meaning: ఇయ్యకోలుగఁ గలసి (iyyakOluga galasi) = agreeably blissful; యెప్పుడో యిదెనేఁడు (yeppuDO yidenEDu) = that day, even today; నెయ్యమున (neyyamuna) = friendly, affectionately; చెలిలోన (chelilOna) = inside her (mind); నెలకొనెనట (nelakonenaTa) = to be, to stay, to become firm; తియ్యముల (tiyyamula) = very sweetish; సటకాఁడు (saTakADu) = trickster, cheater; తిరువేంకటేశ్వరుఁడు (tiruvEMkaTESvaruDu) = Lord Venkateswara; అయ్యో (ayyO) = alas! యిఁకనెట్లనమ్మా (yikaneTlanammA) = = how can he be like that?

Literal meaning: Since that day till the present, they've been joyfully united. While the exact moment eludes her memory, tenderly the Lord has become an inseparable part of her consciousness. What a delightful and mischievous play by Lord Venkateswara! What more could anyone ask for?

Explanation: The most blissful thing in this world is union of consciousness with the Lord. Refer to Bhagavad-Gita shloka:  उदारा: सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् | आस्थित: स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ||7-18|| udārāḥ sarva evaite jñānī tvātmaiva me matam āsthitaḥ sa hi yuktātmā mām evānuttamāṁ gatim Purport: Arjun! indeed, those who hold unwavering devotion towards me are truly virtuous souls. However, it is those endowed with profound understanding, steadfast resolve, and minds attuned to my essence, who have chosen me as their supreme goal, that I regard as an embodiment of my very self.

Hence, let us grasp that Annamacharya's awareness merged with that of the Lord. He drew so near that he felt free to playfully dub him a trickster, a deceiver. Beyond these portrayals, the poet asserted that life surpasses the boundaries of sensory perceptions, a magnificence of existence beyond the grasp of this realm.

Implied meaning: When people willingly let go of their desires and submit to the ways of nature, they become connected to a greater awareness that exists everywhere, even if they don't realize it.

-x-x-x-

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...