ANNAMACHARYA
97. ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు?
(ODaviDichi vadara vUrakEla paTTEvu?)
Introduction: In this complex poem, Annamacharya questions man's nature of seeking favours from others. He wonders when God is there to provide, what necessitates man to beseech others?
We think the God is there for our well being and protection. We take for granted that petty matters like ‘operating our bank accounts’; ‘property affairs’; ‘our little problems of adjustment with neighbours and colleagues’ are beyond the scope of the almighty. We ignore that our creator must be aware of our little problems.
This Chorus is very unusual and is bit hard to comprehend. On the first look there appears lack of coordination between the chorus and the stanzas. When we figure out that Annamacharya is criticising our imperfect faith in God, immediately we find great connect and beautiful sense in this poem.
As stated, many times before, his depth in use of tiny words to imply lofty sense is unsurpassed. His expansive work with uncompromising use of pure native telugu words (not Sanskrit) bespeaks limitations are not with the language, but with our skill to employ.
ఉపోద్ఘాతము: క్లిష్టమైన ఈ కీర్తనలో, అన్నమాచార్యులు ఇతరుల అనుగ్రహాన్ని కోరుకునే మనిషి యొక్క ప్రవృత్తిని ప్రశ్నించాడు. కావలసినవి అందించడానికి దేవుడే ఉన్నప్పుడు, ఇతరులను వేడుకోవలసిన అవసరం ఏమిటని అతను ఆశ్చర్యపోతాడు.
అంతర్లీనంగా దేవుడు మన శ్రేయస్సు మరియు రక్షణ కోసం మాత్రమే ఉన్నాడని మనం భావిస్తాము. బ్యాంక్ ఖాతాలను నిర్వహించడం; ఆస్తి వ్యవహారాలు; పొరుగువారితో మరియు సహోద్యోగులతో మన ప్రవర్తన వంటి చిన్న విషయాలను స్వయంగా నిర్వహించుకోగలమని, సర్వశక్తిమంతుని పరిధికి మించినవని మన సాధారణ అంచనా. మన చిన్న సమస్యల గురించి సృష్టికర్తకు తెలియకుండా వుంటుందా?
ఈ పల్లవి చాలా అసాధారణమైనది మరియు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగాను వుంది. మొదట్లో పల్లవి మరియు చరణాల మధ్య సమన్వయ లోపం అనిపిస్తుంది. అన్నమాచార్యులు భగవంతుడిని యందు మనిషి యొక్క యీ అసంపూర్ణ విశ్వాసమును విమర్శిస్తున్నరని అర్ధమైన తక్షణం గొప్ప అనుసంధానమును ఆస్వాదించెదరు.
ఇంతకు ముందు చాలాసార్లు చెప్పినట్లుగా, ఉన్నతమైన భావాలను సూచించడానికి చిన్న చిన్న పదాలను ఉపయోగించడంలో అతని లోతు ఎనలేనిది. సంస్కృత పదాలు కాకుండా, స్వచ్చమైన స్థానిక తెలుగు పదాలతో రాజీపడని దీక్షతో అంతుచిక్కని తలపులను కుప్పలు కుప్పలుగా మన ముందు కుమ్మరించి పరిమితులు భాషకు కాదు, కానీ వాటిని ఉపయోగించు మన నైపుణ్యానికే అని అన్నమాచార్యులు చాటిచెప్పారు.
కీర్తన:
ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు గోడ గడుగ నడుసే కురిసీ నో మనసా ॥పల్లవి॥
చిత్తము లోపలనున్న చింతామణి యీహరి యిత్తలఁ గోరినవెల్లా నియ్యఁగాను
తత్తరించి తలఁచక దవ్వువోయి పరులకు
దెత్తివై యేల నోళ్లు దెరిచేవో మనసా ॥ఓడ॥
కన్ను లెదుటనే హరి కల్పవృక్షమై యుండి మన్నించి లోకమెరఁగ మనుపఁగాను
యెన్ని వలసిన మరి యీతనినే యడుగక
కన్నవారి నేలడుగఁ గటకటా మనసా ॥ఓడ॥
శ్రీవేంకటేశుఁడే మనచేతి పరుసమై యుండి తావున నిహపరాలు తానియ్యఁగాను
భావించి మొక్కక వేరే బద్ధులైన జీవులను
దావతిపడుచు నేల తగిలేవో మనసా ॥ఓడ॥
|
ODaviDichi vadara vUrakEla paTTEvu gODa gaDuga naDusE kurisI nO manasA ॥pallavi॥
chittamu lOpalanunna chiMtAmaNi yIhari yittala gOrinavellA niyyagAnu
tattariMchi talachaka davvuvOyi parulaku
dettivai yEla nOLlu derichEvO manasA ॥ODa॥
kannu leduTanE hari kalpavRkshamai yuMDi manniMchi lOkameraga manupagAnu
yenni valasina mari yItaninE yaDugaka
kannavAri nElaDuga gaTakaTA manasA ॥ODa॥
SrIvEMkaTESuDE manachEti parusamai yuMDi tAvuna nihaparAlu tAniyyagAnu
bhAviMchi mokkaka vErE baddhulaina jIvulanu
dAvatipaDuchu nEla tagilEvO manasA ॥ODa॥
|
Details and Explanations:
ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు
ODaviDichi vadara vUrakEla paTTEvu
Word to Word meaning: ఓడ (Oda) = ship, boat; విడిచి (viDichi) = leaving; వదర (vadara) = bottle gourd shell; వూరకేల (vUrakEla) = in vainly, for nothing, uselessly; పట్టేవు (paTTEvu) = to hold, to take up by force; గోడ (gODa) = wall; గడుగ (gaDuga) = cleaning with water; నడుసే (naDusE) = dirt; కురిసీ నో (kurisI nO) = rains down; మనసా (manasA) = O mind!
Literal meaning: O Man! You are like that proverbial fool who leaves the ship and holds onto a bottle gourd shell for safety while on sea called samsara. When you wash the walls, only dirt will shower.
Explanation: This is the toughest chorus I came across. Though, its daunting to explain such an open-ended statement, let me make an honest attempt.
Read Oda (ఓడ) as stable or permanent solution; vadara = bottle gourd shell; vadara vUrakEla paTTEvu (వదర వూరకేల పట్టేవు) as holding onto temporary solution. To cross the sea called samsaramu (the family life, the worldly life), easily available bottle gourd shells are useless. Actual need is a ship called SRIHARI. Thus ODaviDichi vadara vUrakEla paTTEvu (ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు) = is stating that man abandons permanent ones in preference to temporary things.
This is the factual position taken by man. He likes the attraction of immediate solutions. These makeshift arrangements absorb man's attention longer than required. And entrench him from moving away by hooking him up with solutions that appear like real ones.
The second line “gODa gaDuga naDusE kurisI nO manasA” (గోడ గడుగ నడుసే కురిసీ నో మనసా) = When You try to clean the walls, only shower of dirt befalls on you. This is indicating all efforts by man to clean up his act ends in adding more garbage. Its something like the ouroboros is an ancient symbol of a snake or serpent eating its own tail. Please consider the below statement by Jiddu Krishnamurti.
“It is rather complex. In learning about myself, I accumulate knowledge about myself and use that knowledge which is of the past to learn something more about myself. With the accumulated knowledge I have about myself I look at myself and try to learn something new about myself. Can I do that it is impossible. (Talk at Brandies University, in the book, YOU ARE THE WORLD).
I am giving below popular picture in circulation of social media which is capturing this chorus very accurately.
Combining these two statements ODaviDichi vadara vUrakEla paTTEvu / gODa gaDuga naDusE kurisI nO manasA (ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు / గోడ గడుగ నడుసే కురిసీ నో మనసా) means, there is no point in attempting correction without a fundamental change in attitude. All superficial corrections fall under temporary solutions. Therefore, O man! Do not attempt change, but remain as you naturally are and meditate on God. Thus, this is same as “sahajAna nUrakunna saMtatamu sukhamu" ‘సహజాన నూరకున్న సంతతము సుఖము’ ( refer to verse tahatahalinniTiki tAnE mUlamu)
Why did Annamacharya made such complicated Chorus is something to ponder. We people generally appreciate and believe in complex intellectual statements, with an assumption that they contain something intangible. Probably he wrote this for intelligentsia of his times. Many may revel in explaining such wording to exhibit their depth. Though Annamacharya didn't write for the elite, this one is demonstrating his effusive and immeasurable class.
Implied meaning: O man! Do not
attempt change; but remain as you naturally are and meditate on God.
భావము: ఓ మానవుడా స్థిరముగా నిలుచు ఓడను విడిచి (సులభముగా దొరుకుతోందని) సొరకాయ బుర్రను పట్టుకొని
సముద్రము లాంటి సంసారమును దాట ప్రయత్నించు వెర్రివి. గోడను కడుగబోతే అడుసే కదా నీ మీద కురిసేది.
వివరణము: ఇది నేను చదివిన అతి కష్టమైన పల్లవి ఇదే కావచ్చు. ఇటువంటి తలా తోక లేదనిపించే పల్లవిని వివరించడం సాహసమే ఐనప్పటికీ, నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను.
"ఓడ"ను స్థిరమైన లేదా శాశ్వత పరిష్కారంగా అనుకోండి; "వదర" = ఆనప/సొర కాయ = తాత్కాలిక పరిష్కారం. ఆనపకాయ బోర్ర సులభంగా దొరుకుతుంది. కానీ దాన్ని పట్టుకుని సముద్రాన్ని దాటలేము. ఆ విధంగా "ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు" = (సంసారమనే సముద్రమును దాటుటకు) మానవుడా తాత్కాలిక విషయాలకు ప్రాధాన్యతనిస్తూ శాశ్వతమైన వాటిని వదులుకుంటావెందుకో!
ఇది అత్యధికులు ఎంచుకునే వాస్తవ మార్గం. మనిషి తక్షణ పరిష్కారాల ఆకర్షణను ఇష్టపడతాడు. ఈ తాత్కాలిక ఏర్పాట్లు మనిషిని పట్టి ఉంచి, శ్రమము కలిగించి అవసరమైన దాని కంటే ఎక్కువ సమయాన్ని వెచ్చింప చేస్తాయి. మరియు నిజమైనవి లాగ అనిపించే పరిష్కారాల ద్వారా అతనిని కట్టిపడేస్తాయి.
రెండవ పంక్తి "గోడ గడుగ నడుసే కురిసీ నో మనసా" మనిషి తనను తాను శుద్ధీకరించు కునేందుకు చేసే అన్ని ప్రయత్నాలూ మరింత బురదను జోడించడంలో ముగుస్తాయని సూచిస్తుంది. ఇది ఒక రకంగా చూస్తే తన తోకను తానే తిను పాము వంటిది. ఇది సంక్లిష్టంగా ఉన్నప్పటికీ జిడ్డు కృష్ణమూర్తి చేసిన దిగువ ప్రకటనతో కలిపి చదివితే బోధపడేందుకు అవకాశం ఉంది.
"ఇది కొంత
గందరగోళంగా ఉంటుంది. నా గురించి తెలుసుకోవడానికి, నేను నా గురించి జ్ఞానాన్ని కూడగట్టుకుంటాను. ఆపై నా
గురించి మరింత తెలుసుకోవడానికి గతం మీద ఆధారమై ఉన్న ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తాను. నా
గురించి నాకున్న జ్ఞానంతో నన్ను నేను చూసుకుంటాను మరియు నా గురించి కొత్తగా
తెలుసుకోవాలని ప్రయత్నిస్తాను. అది అసాధ్యమేనా?" (బ్రాండీస్ యూనివర్సిటీలో మాట్లాడినది, యూ ఆర్ ది వరల్డ్ { నువ్వే
ప్రపంచం} అనే పుస్తకంలో).
ఈ మధ్య ప్రాచుర్యములో ఉన్న క్రింది పటము ఈ పల్లవి సారమును చక్కగా సూచించు చున్నది. అందరికీ సులభంగా అర్ధమయ్యేలా వివరించి చెప్పును.
ఈ రెండు పంక్తులను కలపితే ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు / గోడ గడుగ నడుసే కురిసీ నో మనసా = వైఖరిలో ప్రాథమిక దృక్పధములో మార్పు లేకుండా దిద్దుబాటుకు ప్రయత్నించడంలో అర్థం లేదు. పైపై దిద్దుబాట్లన్నీ తాత్కాలిక పరిష్కారాల క్రిందకు వస్తాయి. అందుచేత ఓ మానవుడా! మార్పుకు ప్రయత్నించకు, నువ్వు సహజంగా ఉండునట్లే ఉండి భగవంతుని ధ్యానించు. అందుచేత ఇదే "సహజ నూరకున్న సంతతము సుఖము" ( తహతహలిన్నిటికితానే మూలము అన్న కీర్తన చూడండి)
అన్నమాచార్యులు ఇంత సంక్లిష్టమైన పల్లవి ఎందుకు వ్రాశారో అనేది ఆలోచించాల్సిన విషయం. సాధారణ మనిషి మేధో ప్రకటనలకు తలొగ్గుతాడు. బహుశా అతడు తన కాలంలోని మేధావుల కోసం దీనిని వ్రాసాడు అనుకోవచ్చు. పలువురు దీనిని అన్నమాచార్యుల కీర్తనల మీద తమకు గల లోతును ప్రదర్శించడానికి మచ్చుతునకగా వాడవచ్చు. చాలామంది అలాంటి క్లిష్టమైన పదాలను ఇతరులకు వివరించడాన్ని కూడా ఆస్వాదించవచ్చు. అన్నమాచార్యులు ఉన్నత వర్గాల కోసం వ్రాయనప్పటికీ, అతడు తన చురుకైన మరియు అపరిమితమైన కౌశలాన్ని ప్రదర్శించాడు అన్నది నిర్వివాదాంశం.
ఇంతకు
ముందు చాలాసార్లు చెప్పినట్లుగా, అటువంటి
ఉన్నతమైన భావాలను సూచించడానికి చిన్న చిన్న పదాలను ఉపయోగించడంలో అతని లోతు
ఎనలేనిది. సంస్కృత పదాలు కాకుండా, స్వచ్చమైన
స్థానిక తెలుగు పదాలతో రాజీపడని దీక్షతో
అంతుచిక్కని తలపులను కుప్పలుకుప్పలుగా మన ముందు కుమ్మరించి పరిమితులు భాషకు కాదు, కానీ వాటిని
ఉపయోగించు మన నైపుణ్యానికే అని చాటిచెప్పారు.
అన్వయార్ధము: అందుచేత ఓ
మానవుడా! మార్పుకు ప్రయత్నించకు, నువ్వు సహజంగా ఉండునట్లే ఉండి భగవంతుని ధ్యానించు.
చిత్తము లోపలనున్న చింతామణి
యీహరి
chittamu lOpalanunna chiMtAmaNi yIhari
Word to Word meaning: చిత్తము (chittamu) = mind; లోపలనున్న (lOpalanunna) = existing inside; చింతామణి (chiMtAmaNi) = panacea, a fabulous gem supposed to yield to its possessor whatever is desired, the philosopher's stone; యీహరి (yIhari) = this Hari; యిత్తలఁ (yittala) = this side ( for we earthly things); గోరినవెల్లా (gOrinavellA) = what ever is desired; నియ్యఁగాను (niyyagAnu) = provides; తత్తరించి (tattariMchi) = త్వరపడి, urgency, seriousness; తలఁచక (talachaka) = without cosidering; దవ్వువోయి (davvuvOyi) = move away, distance yourself; పరులకు (parulaku) = others; దెత్తివై (dettivai) = దెయ్యం లాగా, భూతము లాగా, like a devil, like a demon; యేల (yEla) = why; నోళ్లు (nOLlu) = your mouths (to beg many times)); దెరిచేవో (derichEvO) = open; మనసా (manasA) = O Mind;
Literal meaning: The God Sri Hari existing inside your mind is like the fabulous gem (chiMtAmaNi) to yield whatever is desired. You don’t show the urgency to reach out to him. In fact, you distance yourself from him. Yet why do you often pester and importune others for favours.
Explanation: tattariMchi తత్తరించి is indicating our reaction to environment is not immediate. To live in the immediate present, you cannot be working with big baggage of ‘yesterday’. Unfortunately, we are saddled by our experience, our enthusiasm to be active actually interfere (against the said principle of natural inaction సహజాన నూరకుండుట) and make us dull. Any attempt to consciously remain inactive is still an action of consciousness and therefore counterproductive.
The word talachaka తలఁచక = do not consider actually indicating either man is unaware that he is provided with whatsoever he needs or he fails to recognise the provider. Now consider the famous saying of Henri Bergson: “The Eye Sees Only What the Mind Is Prepared to Comprehend” Now you can measure how contemporary the works of Annamacharya are.
Annamacharya
propounded fiercely independent mind. Liberation of man with free mind is his
basic tenet. He always dissuaded seeking
any favours from fellow beings. No wonder he continued the same here.
భావము: ఓ మనసా! చిత్తము లోపలనున్న చింతామణి లాంటి యీ హరిని గుర్తించక, యీవైపు నీవు గోరినవెల్లా
ఇస్తున్నా కూడా చలించకుండా దూరము జరిగి
పరులను దెయ్యం లాగా, భూతము లాగా నోళ్లు తెరిచి ప్రాధేయపడుతూ
వేధించి పీడించుతావు.
వివరణము: "తత్తరించి" అన్నది మనను చుట్టివున్న
పరిస్థితులపై మన ప్రతిచర్య తక్షణమే లేదని సూచిస్తుంది. మీమ్మల్ని 'నిన్న' అనే పెద్ద గుది బండ వెనుకకు
లాగుతూ వుంటే తక్షణ వర్తమానంలో జీవించ లేరు. దురదృష్టవశాత్తూ, మన అనుభవం అనే కారాగారములో బందీలయి ఉన్నాము.
చురుకుగా ఉండాలనే మనలోని ఉత్సాహం మాటిమాటికి జోక్యం చేసుకుంటుంది (సహజ నూరకుండుటకు
వ్యతిరేకంగా). ఇవి మనలలను కాలము గడిచేకొద్దీ మొద్దుబరుస్తాయి. స్పృహతో క్రియారహితంగా ఉండటానికి చేసే ఏ
ప్రయత్నమైనా సచేతన చర్య కావున నిష్ఫలమే.
"తలఁచక" అనే పదం మనిషికి తనకు అవసరమైనవి
అందించబడినదని గుర్తించడంలో లేదా వాటి
ప్రదాతని గుర్తించడంలోని విఫలతను సూచించును. ఇప్పుడు హెన్రీ బెర్గ్‌సన్ యొక్క
ప్రసిద్ధ సామెతను పరిశీలించండి: “మనస్సు గ్రహించడానికి సిద్ధంగా ఉన్న దానిని మాత్రమే కనులు చూస్తాయి” అన్నమాచార్యుల రచనలు ఎంత ఆధునికంగా ఉన్నాయో
ఇప్పుడు మీరు లెక్కించవచ్చు.
అన్నమాచార్యులు చాలా స్వతంత్రమైన మనస్సును
ప్రతిపాదించారు. స్వేచ్ఛా మనస్సుతో మనిషి విముక్తి అతని ప్రాథమిక సిద్ధాంతం. అతడు
తోటి జీవుల నుండి ఎటువంటి సహాయాన్ని అర్ధించడాన్ని నీరసించేవాడు. ఇక్కడ కూడా అదే
కొనసాగించడంలో ఆశ్చర్యం లేదు.
కన్ను లెదుటనే హరి కల్పవృక్షమై
యుండి
kannu leduTanE hari kalpavRkshamai yuMDi
Word to Word meaning: కన్ను లెదుటనే (kannu leduTanE) = in front of your eyes; హరి (hari) = Lord Sri Hari; కల్పవృక్షమై (kalpavRkshamai) = one of the trees of Indra's paradise which is said to yield whatever is desired; యుండి (yuMDi) = being; మన్నించి (manniMchi) = to take care, to respect, to honour; లోకమెరఁగ (lOkameraga) = the whole world knows; మనుపఁగాను (manupagAnu) = పోషించు, బ్రతికించు, To cause to live, to nourish, to take care of, protection; యెన్ని (Yenni) = whatever; వలసిన (valasina) = need; మరి (mari) = still, further; యీతనినే (yItaninE) = this one only; యడుగక (yaDugaka) = seek; కన్నవారి (kannavAri) = parents; నేలడుగఁ (nElaDuga) = why seek? Why beseech; గటకటా (gaTakaTA) = అయ్యో!, alas; మనసా (manasA) = O mind.
Literal meaning: While Lord Sri Hari is there in front of your eyes like the Kalpavriksha (one of the trees of Indra's paradise which is said to yield whatever is desired); the whole world knows he is the cause to live. Yet Alas! You don’t seek additional favours from him but annoy your parents.
Explanation: Though this is appearing simple, the underlying meaning is, we think the God is there for our well being and protection. We take for granted that petty matters like operating our bank accounts; property affairs; our little problems of adjustment with neighbours and colleagues; are beyond the scope of the almighty. We ignore that our creator must be aware of our little problems.
Let me explain a dialogue from a movie titled “muthyala muggu”. One fellow with an eye on usurping father in law’s property, prays and Brahma appears. Our hero seeks the boon “to grow some hair in ears of his father-in-law” (with hair in his ears father in law’s ability to listen will be impaired and this fellow will have his way in manipulation of property in his favour.) Thus Sirs, this sums up our actual faith in God. Our partial faith in the God is the root cause of our travails.
భావము: ఓ మనసా! కన్ను లెదుటనే శ్రీ హరి
కల్పవృక్షమై యుండి లోకమంతటిని (మనందరిని)
మన్నించి పోషించి, బ్రతికించుచున్నాడు. ఇంకా యెన్ని కావసిన తిరిగి శ్రీ హరినే యడుగక, అయ్యో! కన్నవారి నేల పీడించుతావో?
వివరణము: ఇది సరళంగా కనిపిస్తున్నప్పటికీ, అంతర్లీనంగా దేవుడు మన శ్రేయస్సు మరియు రక్షణ కోసం మాత్రమే ఉన్నాడని మనం భావిస్తాము. బ్యాంక్ ఖాతాలను నిర్వహించడం; ఆస్తి వ్యవహారాలు; పొరుగువారితో మరియు సహోద్యోగులతో మన ప్రవర్తన వంటి చిన్న విషయాలను స్వయంగా నిర్వహించుకోగలమని, సర్వశక్తిమంతుని పరిధికి మించినవని మన సాధారణ అంచనా. మన చిన్న సమస్యల గురించి సృష్టికర్తకు తెలియకుండా వుంటుందా?
ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావు చెప్పిన ‘వెనకటికి మామ ఆస్తి కాజేయాలని ఒకడు బెమ్మదేవుడుని వేడుకుంటే ఆయన పెత్యక్షమై ఏమి కావాలంటే "మా మామ చెవిలో వెంట్రుకలు మొలిపించు. మిగతాది నేను చూసుకుంటా" అన్నాడట’ డైలాగ్ మన నిజమైన అంతఃస్థితికి అద్దం పడుతుంది. మనము భగవంతుడిని పూర్తిగా నమ్మము అన్నదానికి యీ సంభాషణ కంటే వేరే యేమి ఎక్కువ వివరించగలదు? భగవంతుని యందు మనిషి యొక్క యీ అసంపూర్ణ విశ్వాసమే అతని బాధలకు మూలము.
శ్రీవేంకటేశుఁడే మనచేతి పరుసమై
యుండి
SrIvEMkaTESuDE manachEti parusamai yuMDi
Word to Word meaning: శ్రీవేంకటేశుఁడే (SrIvEMkaTESuDE) = Lord venkateswara; మనచేతి (manachEti) = in hand; పరుసమై (parusamai) = A stone that can transform any base metal into gold, philosopher’s stone; యుండి (yuMDi) = being; తావున (tAvuna) = place; నిహపరాలు (nihaparAlu) = this world and the one beyond it; తానియ్యఁగాను (tAniyyagAnu) = he has provided; భావించి (bhAviMchi) = to imagine, to feel; మొక్కక (mokkaka) = to bow, to regard, to prostrate; వేరే ((vErE) = other; బద్ధులైన (baddhulaina) = bonded; జీవులను (jIvulanu) = beings; దావతిపడుచు (dAvatipaDuchu) = మిక్కిలి ప్రాధేయపడి, imploring; నేల (nEla) = why? తగిలేవో (tagilEvO) = get hooked; మనసా (manasA) = O mind.
Literal meaning: O mind! While Srivenkateswara is like the parasavedi (philosopher’s stone) in our hands; he has provided us this world and the one beyond it. Ignoring him, why you implore other human beings (who are also captives in samsara like you) for favours?
Explanation: Each of the stanzas are stating that man should seek favours from the God not from the fellow beings. Since the God is not directly or consciously approachable, the implied meaning of the stanzas is that man should not react and remain naturally quiet. That is the central idea of the chorus.
భావము: ఓ మనసా! శ్రీవేంకటేశుఁడే మనచేతిలోని పరుసవేది లాగ వుండగా; అతడే నిహపరాలు ఇస్తుండగా, అతనిని మనసులో భావించి మొక్కకుండా, నీలాగే సంసారములో బందీలైన ఇతర మానవులను మిక్కిలి ప్రాధేయపడుచు ఏల తగులుకుంటావో?
వివరణము: మనిషి తోటి జీవుల నుండి కాకుండా భగవంతుని నుండి తనకు వలసినవి పొందాలని అన్ని చరణాలు పేర్కొంటున్నాయి. భగవంతుని ప్రత్యక్షంగా లేదా స్పృహతో చేరుకోలేము కాబట్టి, "మనిషి ప్రతిచర్య చూపకుండా సహజాన నూరకుండ వలెనని తెలియవలె" అని చరణాల యొక్క తాత్పర్యం. అదే పల్లవి యొక్క అంతరార్ధమూనూ.
Summary of this Keertana:
O Mind! You
are like that proverbial fool who leaves the ship and holds onto a bottle gourd
shell for safety while on sea called samsara. (O
Man! How foolish of you to take up temporary things Leaving the permanent one.)
When you
wash the walls, only dirt will shower. Implied meaning: O man! Do not attempt change; but remain as you naturally are and meditate
on God.
The God Sri Hari existing inside your mind is like the fabulous gem (chiMtAmaNi) to yield whatever is desired. You don’t show the urgency to reach out to him. In fact, you distance yourself from him. Yet why do you often pester and importune others for favours.
While Lord Sri Hari is there in front of your eyes like the Kalpavriksha (one of the trees of Indra's paradise which is said to yield whatever is desired); the whole world knows he is the cause to live. Yet Alas! You don’t seek additional favours from him but annoy your parents.
O mind! While Srivenkateswara is like the parasavedi (philosopher’s stone) in our hands; he has provided us this world and the one beyond it. Ignoring him, why you implore other human beings (who are also captives in samsara like you) for favours?
Read Keertana for further understanding: ఛీ ఛీ నరుల దేఁటి జీవనము (chI chI narula dEMTi jIvanamu)
కీర్తన సంగ్రహ భావము:
ఓ మానవుడా! స్థిరముగా
నిలుచు ఓడను విడిచి (సులభముగా దొరుకుతోందని) సొరకాయ బుర్రను పట్టుకొని సముద్రము లాంటి సంసారమును దాట ప్రయత్నించు వెర్రివి. గోడను కడుగబోతే అడుసే కదా నీ మీద
కురిసేది. అన్వయార్ధము: అందుచేత ఓ
మానవుడా! మార్పుకు ప్రయత్నించకు, నువ్వు సహజంగా ఉండునట్లే ఉండి భగవంతుని ధ్యానించు.
ఓ మనసా! చిత్తము
లోపలనున్న చింతామణి లాంటి యీ హరిని గుర్తించక, యీవైపు నీవు
గోరినవెల్లా ఇస్తున్నా కూడా చలించకుండా దూరము జరిగి పరులను దెయ్యం లాగా, భూతము
లాగా నోళ్లు తెరిచి ప్రాధేయపడుతూ వేధించి పీడించుతావు.
ఓ మనసా! కన్ను లెదుటనే శ్రీ హరి కల్పవృక్షమై యుండి లోకమంతటిని (మనందరిని) మన్నించి పోషించి, బ్రతికించుచున్నాడు. ఇంకా యెన్ని కావసిన తిరిగి శ్రీ హరినే యడుగక, అయ్యో! కన్నవారి నేల పీడించుతావో?
ఓ మనసా! శ్రీవేంకటేశుఁడే
మనచేతిలోని పరుసవేది లాగ వుండగా; అతడే నిహపరాలు
ఇస్తుండగా, అతనిని మనసులో భావించి మొక్కకుండా, నీలాగే
సంసారములో బందీలైన ఇతర మానవులను మిక్కిలి ప్రాధేయపడుచు ఏల తగులుకుంటావో?
ఇంకా ఎక్కువ అవగాహనకు ఛీ ఛీ నరుల దేఁటి జీవనము అనే కీర్తన కూడా చూడండి.