ANNAMACHARYA
96. ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే
(eduTa nevvaru lEru yiMtA vishNumayamE)
Introduction: In this highly philosophical verse Annamacharya is asking the seekers of truth to dismantle the barriers within themselves to see the truth.
Poetry can't change man. So also the other avails. However poetry can compel the man to reach the door steps of the required change. That is the reason why poetry is closely linked with philosophy. Most Indian philosophy is in poetic form, be it Bagavadgita or Bhagavatam.
This is one of the most aptly worded verses. Annamacharya is no ordinary poet to resort to platitudes to cover up. He employs beautiful words to echo the accurate condition of man. The seamless integration of chorus with all the stanzas is a demonstration of great poetry.
ఉపోద్ఘాతము: ఈ అత్యంత మధురమైన తాత్విక కీర్తనలో అన్నమాచార్యులు మానవులను సత్యాన్ని దర్శించుటకు తమలో తామే ఏర్పాటు చేసుకున్న అడ్డంకులను తొలగించమని కోరాడు.
కవిత్వం మనిషిని మార్చలేదు. అలాగే ఇతర ఉపాయాలు కూడా. అయితే కవిత్వం మనిషిని అవసరమైన మార్పును తీసుకురాగల ద్వారం వరకు నడిపిస్తుంది. కవిత్వంతో తత్వశాస్త్రం ముడిపడి ఉండడానికి ప్రధాన కారణం అదే. భగవద్గీత అయినా భాగవతం అయినా, చాలా మటుకు భారతీయ తత్వశాస్త్రం కవితా రూపంలో ఉంటుంది.
ఇది చాలా సముచితమైన పదాలతో కూడిన కీర్తన.
కప్పిపుచ్చుకోవడానికి ఊతపదాలు, అరిగిపోయి, నలిగిపోయిన పదాలను
ఆశ్రయించడానికి అన్నమాచార్యులు మామూలు కవి కాదు. మనిషి యొక్క ఖచ్చితమైన
స్థితిని ప్రతిధ్వనించడానికి అతను అందమైన పదాలను ప్రయోగిస్తాడు. అన్ని చరణాలతో
పల్లవి భావము స్పురింపచేస్తూనే అతుకులు
లేకుండా సమ్మిళితమై పొతుంది. గొప్ప
కవిత్వానికి నిదర్శన యీ కీర్తన.
కీర్తన:
ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే వదలక హరిదాసవర్గమైనవారికి ॥పల్లవి॥
ముంచిననారాయణమూర్తులే యీజగమెల్ల అంచితనామములే యీయక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా
తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి ॥ఎదు॥
చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే భారపుయీ భూమెత నీపాదరేణువే
సారపుఁగర్మములు కేశవుని కైంకర్యములే
ధీరులై వివేకించి తెలిసేటివారికి ॥ఎదు॥
చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే
మత్తిలి యీతనికంటే మరి లే దితరములు
తిత్తి దేహపుబ్రదుకు తెలిసేటివారికి ॥ఎదు॥
|
eduTa nevvaru lEru yiMtA vishNumayamE vadalaka haridAsavargamainavAriki ॥pallavi॥
muMchinanArAyaNamUrtulE yIjagamella aMchitanAmamulE yIyaksharAlellA
paMchukonna SrIhariprasAda mIruchulellA
teMchivEsi mElu dA delisETivAriki ॥edu॥
chEri pArETinadulu SrIpAdatIrthamE bhArapuyI bhUmeta nIpAdarENuvE
sArapugarmamulu kESavuni kaiMkaryamulE
dhIrulai vivEkiMchi telisETivAriki ॥edu॥
chittamulO bhAvamellA SrIvEMkaTESuDE hattinaprakRti yellA nAtanimAyE
mattili yItanikaMTE mari lE ditaramulu
titti dEhapubraduku telisETivAriki ॥edu॥
|
Details and Explanations:
ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే
వదలక హరిదాసవర్గమైనవారికి ॥పల్లవి॥
eduTa
nevvaru lEru yiMtA vishNumayamE
vadalaka
haridAsavargamainavAriki ॥pallavi॥
Word to Word meaning: ఎదుట
(eduTa) = in front of
(you) నెవ్వరు (nevvaru) = none; లేరు (lEru) = exists; యింతా
(yiMtA)
= all this is; విష్ణుమయమే (vishNumayamE)
= is formed or full of Vishnu; వదలక (vadalaka) = without giving up; హరిదాసవర్గమైనవారికి (haridAsavargamainavAriki) =
who willingly takes up the devotional path of Hari.
Literal meaning: There is none in front but lord Vishnu for the steadfast servants of the lord.
Explanation: What do we see? For most of us it is the imagination or figurine we have built about a person or a thing. Our relationship with the person or thing is with that imagery. Therefore, whatever you see is imagery created by your thought. That is the reason, philosophically it is proclaimed that the world is unreal.
But due to action of ignorance, we always embrace imagery and end up with sense of loss and misery. Normally a child does not have these previous experiences (pre-conceived notions) and images. Therefore, there will be no attempt to hide their true feelings from others. As the children grow older, they will start hiding certain inconvenient facts. We put on many cloaks to conceal our wrong sides to be accepted as civilized beings by others.
Now consider this saying by Rumi Jalalu'l-Din “Your task is not to seek for love, but merely to seek and find all the barriers within yourself that you have built against it.”
When you dismantle all the images, symbols, all the associations with them, then you find that you have none in front of you but the truth =“eduTa nevvaru lEru yiMtA vishNumayamE” (ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే). Now, I believe, you can appreciate how clear and Annamacharya is.
Bhagavad-Gita 6-29 states सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि sarva-bhūta-stham ātmānaṁ sarva-bhūtāni chātmani implying that a realised Yogi finds all living
beings in God and God in all living beings. Therefore such great men find God in front of them. There's no wonder,
Annamacharya could!
Implied meaning: O Man! What do You see in front of You? God or Overwhelmed by your own imagination?
భావము: వదలక హరిదాసవర్గమైనవారికి ఎదుట విష్ణువు కాక మరెవరూ లేరు.
వివరణము: మనం నిజంగా ఏమి చూస్తాము? మనలో చాలా మంది అనుభూతి చెందగలిగేది ఒక వ్యక్తి లేదా వస్తువు గురించి మనం నిర్మించుకున్న ఊహ లేదా గొప్ప దేవాలయాలు, ప్రసిద్ధ ప్రదేశాలకు సన్నిహితంగా ఉన్న భావన మాత్రమే. వ్యక్తి లేదా వస్తువుతో మన సంబంధం ఆ ఊహ లేదా బొమ్మతో ముడిపడి ఉంటుంది. అందువల్ల, మీరు చూసేది మీ ఆలోచన యొక్క చిత్రము. అందుకే, తాత్వికముగా ప్రపంచం అవాస్తవం అని ప్రకటించబడింది.
కానీ, మనం అజ్ఞానము ప్రభావంతో, తరచుగా ఆ ఊహా చిత్రాలను నిజముగా పొరపడి తీవ్రమైన అశాంతిని మరియు దుఃఖాన్ని పొందుతాము.
బాల్యంలో ఈ ఊహలు అస్పష్టంగా ఉండి, ఎదుటి వారి నుండి తమ వాస్తవ భావనలను కప్పిపుచ్చుటకు ప్రయత్నం ఉండదు. పెద్ద అవుతున్న కొలది పిల్లలలో ఈ కపటము పాలు పెరగడమూ గమనించి ఉంటాము. మనము ఇతరులకు నాగరీకులమని ప్రదర్శించబోయి ఇబ్బంది కలిగించే వాస్తవాలకు నగిషీలు చెక్కి (అనేక మేలి ముసుగులు కప్పుకుని) సత్యము నుంచి దూరమౌతాము.
ఈ సందర్భంగా జలాలుద్దీన్ రూమి మాటలు గుర్తు తెచ్చుకుందాం. “నీ పని ప్రేమకై వెంపర్లాడటం కాదు. ప్రేమపథము నందు నీకై నీవు సృష్టించుకున్న అవరోధాలను తొలగించడమే.”
మీరు ఇలాంటి సమస్త ఊహా చిత్రాలను, చిహ్నాలను, వాటితో ఉన్న అన్ని అనుబంధాలను కూల్చివేసినప్పుడు, మీ ముందు నిజం తప్ప మరొకటి లేదని మీరు కనుగొంటారు. ఇప్పుడు చెప్పండి, ఎదుట నెవ్వరు లేరు అన్నది ఎంత వాస్తవమో?
భగవద్గీత 6-29లో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని (భావము: అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసిన యోగులు సర్వ భూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వ భూతములయందును చూచెదరు.) అని అన్నారు. అనగా అటువంటి వారికి ఇతరులు కాక దైవమే ఎదురుగా కనపడును. ఇంక అన్నమాచార్యులు ఎదుట నెవ్వరు లేరు అనడంలో ఆశ్చర్యమేమీ?
ఇదే అర్ధము వచ్చే త్యాగరాజ కీర్తన:
ఎదురు తాననే ఇంగితం బెఱిఁగి
అన్వయార్ధము: మానవుడా!
ఎదుటనే ఉన్న భగవంతుని చూస్తున్నావా లేక నీలోని ఊహల్లోనే కొట్టుకుపోతున్నావా?
ముంచిననారాయణమూర్తులే
యీజగమెల్ల
muMchinanArAyaNamUrtulE yIjagamella
Word to Word meaning: ముంచిన (muMchina) = to immerse; నారాయణమూర్తులే (nArAyaNamUrtulE) = statues/replicas of Lord Narayana; యీజగమెల్ల (yIjagamella) = this universe; అంచిత (aMchita) = respectable, honourable; నామములే (nAmamulE) = names; యీయక్షరాలెల్లా (yIyaksharAlellA) = all these syllables; పంచుకొన్న (paMchukonna) = shared; శ్రీహరిప్రసాద (SrIhariprasAda) = Lord Shreehari’s sacred food; మీరుచులెల్లా (mIruchulellA) = all these tastes; తెంచివేసి (teMchivEsi) = by severing; మేలు (mElu) = good / benefit; దాఁ (dA) = by self; దెలిసేటివారికి (delisETivAriki) = knowing / understanding;
Literal meaning: For the one who is able to cut off action of ignorance / clear and bereft of doubt / and severe the attachment; such a person who understands the benefits of such actions could observe everyone else is like the Lord Narayana; Every syllable as sacred; Every taste is like the maha prasadam.
Explanation: Do not dismiss that everything is Vishnu ( omnipresent god) as a cliche. It simply means you; your imagination and this visible world is also Vishnu.
Let us examine the wording teMchivEsi mElu dA delisETivAriki (తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి). We already learnt that the world we know is made of karma (= loosely equals action to be performed), desire and affection. Many may agree or disagree with what we like in this world. Nowadays, on careful observation, one can find the opinions expressed by many people (on the Internet) on almost every subject (from suicide to assassination, from hair cutting to toenails, clothing, food, fashion, politics, international issues, philosophy) are largely unsubstantiated. To rely on such baseless opinions would be to perpetuate ignorance.
We have already learnt that the inner world within us is essentially the same as the real or the outer world. That is, the opinions that we hold on with great value are in reality are useless (in the path of self-realisation).
By wording “teMchivEsi” (తెంచివేసి) Annamacharya meant to dismantle the ignorance inside oneself (like the Bhagavad-Gita verse 15-3, असङ्गशस्त्रेण दृढेन छित्त्वा asaṅga-śhastreṇa dṛiḍhena chhittvā = cut down with a strong axe of detachment.)
The words mElu dA delisETivAriki (మేలు దాఁ దెలిసేటివారికి) are indicative of the Bhagavad-Gita wording तत: पदं तत्परिमार्गितव्यं tataḥ padaṁ tat parimārgitavyaṁ (15-4) = (After cutting off the ignorance) the practitioner must realise what is important to know.
Thus, the wording teMchivEsi mElu dA delisETivAriki eduTa nevvaru lEru yiMtA vishNumayamE (తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే) means that for a person with such understanding, everyone else is like the Lord Narayana; Every syllable is sacred.
భావము: అజ్ఞానము/భవ బంధము/ సంశయములను తెంచివేసి, అందువలన కలుగు మేలు తనకై తానే దెలిసేటివారికి సంపూర్ణముగా నారాయణ మూర్తులే యీ జగమంతా; పూజింపదగు నామములే యీ అక్షరములెల్లా; పంచుకొన్న శ్రీహరిప్రసాదములే యీ రుచులెల్లా.
వివరణము: ఇదేదో పాత చింతకాయ పచ్చడి అని కొట్టి పారేయకండి. సర్వం జగన్నాథం అనండి; అంతా విష్ణుమయమే అనండి. అంటే, నీవు, నీ ఊహలు, ఈ కనబడే ప్రపంచం కూడా విష్ణుమయమే.
"తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి ఎదుట నెవ్వరు లేరు" ను పరిశీలించెదము. కర్మలు, ఆసక్తి, అనురాగము మొదలగు వానితో బంధము/మోహము ఏర్పడుతుందని మరియు వీనితోనే తయారైనదే మనకు తెలిసిన ప్రపంచమని ముందే అనుకున్నాము.
ఈ ప్రపంచంలో మనకు ఇష్టమైన వాటితో ఏకీభవించే వారు లేదా వ్యతిరేకించేవారు కోకొల్లలు. ఈరోజుల్లో, జాగ్రత్తగా గమనిస్తే, తగునని, తగదని విచక్షణ లేకుండా ప్రతీ విషయం (ఆత్మహత్యల నుండి, ఘాతుకాల వరకు, తల వెంట్రుకల నుండి కాలి గోళ్ళ వరకు, దుస్తులు, ఆహారం, ఫ్యాషన్, రాజకీయాలు, అంతర్జాతీయ సమస్యలు) పై అనేకానేక మంది (అంతర్జాలములో) వ్యక్త పరుస్తున్న అభిప్రాయాలన్ని దాదాపు ప్రమాణం లేనివే.
అటువంటి నిరాధారమైన అభిప్రాయాల మీద ఆధారపడి వుంటే అది అజ్ఞానమును కొనసాగించడమే అవుతుంది. మనలోని అంతర్గత ప్రపంచము, బహిర్గత ప్రపంచముల నైజాము/ప్రవృత్తి ఒకటే. అనగా, మనం ఎంతగానో విలువైనవి అనుకొనే అభిప్రాయాలూ కొరగానివే.
“తెంచివేసి”తో సాధకుడు, తనకు అవరోధంగా ఉన్న అజ్ఞానము/భవబంధము/ సంశయములను భగవద్గీతలో చెప్పినట్లు అసంగశస్త్రేణ ధృడేన ఛిత్త్వా (15-3) వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి అని నిష్కర్షగా చెప్పారు.
“మేలు దాఁ దెలిసేటివారికి”తో ఆ రకంగా ఖండించిన తర్వాత దేనిని (సత్యమును) తెలియుట ముఖ్యమో గ్రహించి (భగవద్గీత 15-4లో తతః పదం తత్పరిమార్గితవ్యం అని చెప్పిన విధముగా) దానికై సాధకుడే మార్గం వెతకవలె అని అన్నమాచార్యులు అనిరి.
"తెంచివేసి మేలు
దాఁ దెలిసేటివారికి” యీ జగమంతా నారాయణ మూర్తులే; యీ అక్షరములెల్లా పూజింపదగు నామములే; రుచులెల్లా
శ్రీహరిప్రసాదములే.
చేరి పారేటినదులు
శ్రీపాదతీర్థమే
chEri pArETinadulu SrIpAdatIrthamE
Word to Word meaning: చేరి (chEri) = approaching; పారేటినదులు (pArETinadulu) = flowing revers; శ్రీపాదతీర్థమే (SrIpAdatIrthamE) = water became sacred by touching the feet of the lord; భారపుయీ (bhArapuyI) = this great heavy; భూమెత (bhUmeta) = this earth; నీపాదరేణువే (nIpAdarENuvE) = a tiny particle stuck to your feet; సారపుఁగర్మములు (sArapugarmamulu) = all the karmas; కేశవుని (kESavuni) = Lord Kesavba’s; కైంకర్యములే (kaiMkaryamulE) = duty/service; ధీరులై (dhIrulai) = brave; వివేకించి (vivEkiMchi) = using discretion; తెలిసేటివారికి (telisETivAriki) = knowing/ perceiving.
Literal meaning: For the one who is fearlessly takes the path of intelligence, every flowing river is full of holy water; this world is a tiny part of the timeless existence. All the errands being performed are part of the divine work.
Explanation: Annamacharya has underlined the fact that this path of liberation is not for the cowards by the word "Dheerulai (ధీరులై =brave)". Now consider the below poem by vemana which again states that the fear is true ignorance.
Bhayamusumī yajñānamu
Purport: Oh! Learned Vema!! Fear is the true ignorance. Once the fear is driven out, you will come upon the ultimate. The body will perish (with time). The one inside is the only truth.
"vivekimchi" is signifying that by taking up the path intelligence which is simply avoiding ignorance! Therefore, there is great need to be cautious against slipping into foolishness.
భావము: ధీరులై వివేకించి తెలియువారికి పారేటినదులు శ్రీపాదతీర్థమే; భారపుయీ భూమాత అనంతుడికి పాదరేణువే; సారపుఁగర్మములు కేశవుని కైంకర్యములే.
వివరణము: "ధీరులై" అనే పదం ద్వారా ఈ విముక్తి మార్గం పిరికివాళ్లకు కాదని అన్నమాచార్యులు నొక్కిచెప్పారు.
"వివేకించి" అనేది కేవలం అజ్ఞానాన్ని పారద్రోలు ప్రజ్ఞను సూచిస్తుంది! కావున ఎల్లవేళలా మూఢత్వం లోనికి జారిపోకుండా జాగ్రత్తగా ఉండవలసిన అవసరానికి సంకేతంగా వర్తమాన కాలాన్ని ఉపయోగించారు.
"ధీరులై వివేకించి తెలిసేటివారికి ఎదుట నెవ్వరు లేరు" అంటూ గమనింప తగ్గ ప్రకటన చేశారు అన్నమాచార్యులు. క్రింది పద్యంలో కూడా భయమే అజ్ఞానమునకు మూలకారణమన్నారు వేమన.
క. భయముసుమీ యజ్ఞానము
(ఉడిగిన = తగ్గిన; లయము = నశించునది; జయము = సాఫల్యము)
భావము:భయమే నిజమైన అజ్ఞానం. భయం తొలగిపోయిన తర్వాత, మీరు అంతిమ స్థితికి వస్తారు. శరీరం నశిస్తుంది (కాలంతో పాటు). లోపల ఉన్నవాడొక్కడే సత్యము (నిజము) అని తెలియర వేమా.
చిత్తములో
భావమెల్లా శ్రీవేంకటేశుఁడే
chittamulO bhAvamellA SrIvEMkaTESuDE
Word to Word meaning: చిత్తములో (chittamulO) = in the mind/heart; భావమెల్లా (bhAvamellA) = all the feelings;, శ్రీవేంకటేశుఁడే (SrIvEMkaTESuDE) = are Lord Venkateswara; హత్తిన (hattina) = feel by touch; ప్రకృతి (prakRti) = the nature; యెల్లా (yellA) = all / everything; నాతనిమాయే (nAtanimAyE) = illusion created by Lord; మత్తిలి (mattili) = intoxicating; యీతనికంటే (yItanikaMTE) = beyond him; మరి లే దితరములు (mari lE ditaramulu) = there is none; తిత్తి (titti) = bellows ( of a furnace) దేహపుబ్రదుకు (dEhapubraduku) = life in the body; తెలిసేటివారికి (telisETivAriki) = knowing/ perceiving.
Literal meaning: Those who understand that life is similar to fireplace furnaces that produces heat only when bellows are blowing; they truly realise that all the feelings in side own self, the intoxicating illusions are actually part of the lord Venkateswara and cannot be separated.
Explanation: Transcendental is not an empty word. We are actually part of the God, but distance ourselves from the truth with unbridled affection to the body and thoughts. We are living like frogs in a well, assuming that we know a great deal. Therefore, Annamacharya warned us to wake up before the time runs out (= titti dEhapubraduku = the furnace burns as long as the bellows blow, and these bellows can stop at any time).
Implied meaning: Those who can feel the transience of life comprehend that the illusions caused by the body feelings and transcend it.
భావము: కొలిమి దగ్గర తిత్తి వంటిది ఈ దేహపు బ్రదుకు అని తెలిసేటివారు చిత్తము లోని సర్వ భావములును, మత్తు కలిగించే ప్రకృతి మాయను, శ్రీవేంకటేశుఁడే అని; అవి ఈతని కంటే వేరుకాదు అని ఎరుగుదురు.
వివరణము: "యీతనికంటే మరి లేదితరములు తిత్తి
దేహపుబ్రదుకు తెలిసేటివారికి ఎదుట నెవ్వరు లేరు"
అయ్యలారా! సర్వాంతర్యామి అన్నది శుష్క వాక్యము కాదు. దేవుని లోని భాగమైన మనము, వల్లమాలిన
అభిమానము మరియు ఆలోచనలతో మనని మనము సత్యము నుంచి దూరం చేసుకొనుట విదితమే. మనకు
తెలిసినదే ప్రపంచ మనుకొంటూ నూతిలోని కప్పల్లా బతికేస్తున్నాము. సమయం మించిపోక
ముందే (తిత్తి దేహపుబ్రదుకు =గాలి ఊదినంత సేపే కొలిమి మండునని, ఈ తిత్తి
ఎప్పుడైనా ఆగిపోవచ్చునని భావం) మేలుకోమని అన్నమాచార్యులు హెచ్చరించారు.
అన్వయార్ధము: జీవితం
యొక్క అస్థిరతను అనుభవించగలిగిన వారు శరీర భావాల వల్ల కలిగే భ్రమలను గ్రహించి
దానిని అధిగమిస్తారు.
Summary of this Keertana:
There is none in front but Vishnu for the steadfast servants of the lord. Implied meaning: O Man! What do You see in front of You? God or Overwhelmed by your own imagination?
For the one who is able to cut off action of ignorance / clear and bereft of doubt and / severe the attachment; such a person who understands benefits of such actions could observe everyone else is like the Lord Narayana; Every syllable is sacred; Every taste is like maha prasadam.
For the one who is fearlessly takes the path of intelligence, Every flowing river is full of holy water; this world is a tiny part of the timeless existence. All the errands being performed are part of the divine work.
Those who understand that life is similar to fireplace furnaces that produces heat only when bellows are blowing; they truly realise that all the feelings in side own self, the intoxicating illusions are actually part of the lord Venkateswara and cannot be separated. ! (Implied meaning: Those who can feel the transience of life comprehend that the illusions caused by the body feelings and transcend it.
కీర్తన సంగ్రహ భావము:
వదలక హరిదాసవర్గమైనవారికి ఎదుట విష్ణువు కాక మరెవరూ లేరు. అన్వయార్ధము: మానవుడా! ఎదుటనే ఉన్న భగవంతుని చూస్తున్నావా లేక నీలోని ఊహల్లోనే కొట్టుకుపోతున్నావా?
అజ్ఞానము/భవ బంధము/ సంశయములను తెంచివేసి, అందువలన కలుగు మేలు తనకై తానే దెలిసేటివారికి సంపూర్ణముగా నారాయణ మూర్తులే యీ జగమంతా; పూజింపదగు నామములే యీ అక్షరములెల్లా; పంచుకొన్న శ్రీహరిప్రసాదములే యీ రుచులెల్లా.
ధీరులై
వివేకించి తెలియువారికి పారేటినదులు శ్రీపాదతీర్థమే; భారపుయీ భూమాత అనంతుడికి పాదరేణువే; సారపుఁగర్మములు కేశవుని
కైంకర్యములే.
కొలిమి దగ్గర తిత్తి వంటిది ఈ
దేహపు బ్రదుకు అని తెలిసేటివారు చిత్తము
లోని సర్వ భావములును, మత్తు కలిగించే
ప్రకృతి మాయను, శ్రీవేంకటేశుఁడే అని; అవి
ఈతని కంటే వేరుకాదు అని ఎరుగుదురు. అన్వయార్ధము: జీవితం
యొక్క అస్థిరతను అనుభవించగలిగిన వారు శరీర భావాల వల్ల కలిగే భ్రమలను గ్రహించి
దానిని అధిగమిస్తారు.
వందలాది సంకీర్తన ఆణిముత్యాల్లో ఈ సంకీర్తన ఒకటి. నాకు చాలా ఇష్టమైన సంకీర్తన. జీవి అనుసరించాల్సిన జీవన తత్వాన్ని అన్నమయ్య అతి సులభమైన మాటల్లో మనకి అందించారు. శ్రీనివాస్ గారు, మీరు మీ సరళమైన వ్యాఖ్యానంతో ఎన్నో నిగూఢమైన తత్వ సంబంధిత విషయాలు, భగవద్గీత తో అనుసంధానం చేసి, వేమన గారి వాక్కును కూడా జోడించి, మాకందించారు. అద్భుత:. ధన్యవాదములు.
ReplyDeleteExcellent
ReplyDeleteయోగసిద్ధి పొందినవాడు సమస్తభూతాలపట్ల సమభావం కలిగి సర్వభూతాలలో తన ఆత్మనూ, తన ఆత్మలో సర్వభూతాలనూ సందర్శిస్తాడు అనే భగవద్గీత శ్లోకభావాన్ని అన్నమయ్య
ReplyDeleteఅద్భుతమైన కీర్తనలలో ఒకటైన ఈ తత్త్వసంబంధమైన
కీర్తనతో అనుసంధానం చేసి చక్కని వివరణ నిచ్చిన
శ్రీ చామర్తి శ్రీనివాస్ గారికి అభినందనలు, నమస్సులు.
ఎంతో గహనమైన కీర్తనను సులభంగా అర్థమయ్యే రీతిలో
వ్యాఖ్యనము నందించిన వారికి ధన్యవాదములు. 🙏
ఓం శ్రీ సాయినాథాయనమః
ReplyDeleteశ్రీ సాయి షట్చరిత్ర 20 వ అధ్యాయములో దాసగణు కు ఈశావాస్యోపనిషత్తుకు అర్థము తెలియ చేయుచు ప్రతి జీవి యందు గల ఆత్మ ను చూడక పోవుటయే మన భావములను తప్పు దారి పట్టించునని అద్భుతముగా వివరించ బడినది.
చాలా చక్కని రీతి లో వ్యాఖ్యానం వ్రాశారు.
ReplyDeleteBeautiful description by Srinivas garu.
ReplyDelete