Wednesday, 3 November 2021

94. నగవులు నిజమని నమ్మేదా (nagavulu nijamani nammEdA)

 

ANNAMACHARYA
94. నగవులు నిజమని నమ్మేదా
(nagavulu nijamani nammEdA) 

Introduction: This is very aptly worded poem. Deeply inward looking. It’s part soliloquy and partly addressed to God. It’s the condition of the normal man. He knows partly. Still man do not take firm decision which way he wants to go. Annamacharya is cautioning not to get carried away by the temporary comforts.   

At the outset, he says Man is not clear what to hold on. Then he said despite the legacy inheritance, he requested god to help him tide over the impinging desires and very tricks which baffle man from the morning to night. He declared that man can reach out to God easily by taking up the name of the god at the tip of his  tongue.

ఉపోద్ఘాతము: ది చాలా సముచితమైన కీర్తన​. లోతుగా మానవుని అంతరంగం లోపలికే దృష్టి సారించారు. ఇది పాక్షికంగా స్వగతం మరియు పాక్షికంగా దేవునికి ఉద్దేశించబడింది. ఇదే సాధారణ మనిషి పరిస్థితి. అతనికి పాక్షికంగా తెలుసు. అతను ఏ మార్గంలో వెళ్లాలనుకుంటున్నాడో ఎప్పటికీ గట్టి నిర్ణయం తీసుకోడు. 

నాలిక మన దేహములోనే ఉన్నది. దైవమును కూడా అంతే సులభముగా పొందవచ్చని 'నలి నీనామము నాలిక​ నుండఁగ' అని అన్నారు. అయినప్పటికీ మానవుడు ఇతరములను తడువ బోతాడు.  ఇది మనిషి సమస్యలన్నింటికీ కీలకాంశము. అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత ఊరకే పుట్టలేదు. 

కీర్తన:

నగవులు నిజమని నమ్మేదా

వొగి నడియాసలు వొద్దనవే           ॥పల్లవి॥ 

తొల్లిటికర్మము దొంతుల నుండఁగ

చెల్లబో యిఁకఁజేసేదా
యెల్లలోకములు యేలేటి దేవుఁడ
వొల్లనొల్ల నిఁక నొద్దనవే    ॥నగవు॥ 

పోయినజన్మము పొరుగులనుండఁగ

చీయనక యిందుఁ జెలఁగేదా
వేయినామములవెన్నుఁడ మాయలు
వోయయ్య యిఁకనొద్దనవే ॥నగవు॥ 

నలి నీనామము నాలికనుండఁగ

తలకొని యితరముఁ దడవేదా
బలు శ్రీవేంకటపతి నిన్నుఁగొలిచి
వొలుకుఁ జెంచలములొద్దనవే       ॥నగవు॥

nagavulu nijamani nammEdA

vogi naDiyAsalu voddanavE        pallavi 

tolliTikarmamu doMtula nuMDaMga

chellabO yiMkajEsEdA
yellalOkamulu yElETi dEvuDa
vollanolla nika noddanavE          nagavu 

pOyinajanmamu porugulanuMDaga

chIyanaka yiMdu jelagEdA
vEyinAmamulavennuDa mAyalu
vOyayya yikanoddanavE nagavu 

nali nInAmamu nAlikanuMDaga

talakoni yitaramu daDavEdA
balu SrIvEMkaTapati ninnugolichi
voluku jeMchalamuloddanavE     nagavu

 

 

Details and Explanations: 

నగవులు నిజమని నమ్మేదా

వొగి నడియాసలు వొద్దనవే         ॥పల్లవి॥

nagavulu nijamani nammEdA

vogi naDiyAsalu voddanavE    pallavi

Word to Word meaning: నగవులు (nagavulu) = smiles; నిజమని (nijamani) that they are true; నమ్మేదా (nammEdA) = should I believe/trust;  వొగిన్ (vogin) = క్రమేణ, క్రమముగా, Order, proper succession, డియాసలు (aDiyAsalu) = వట్టిది-ప్రమాణము లేని ఆశలు, వ్యర్ధపు ఆశలు, Vain/groundless hopes,   వొద్దనవే (voddanavE) = shun them.

Literal meaning: O God! Should I believe the smiles that light up my face momentarily as permanent? O man! Shun those successive baseless hopes! 

Explanation: Annamacharya cleverly inserted deep meaning in few words.  Man smiles when he is happy. With this single word nagavulu (నగవులు) Annamacharya indicated the transient comforts man revels in.

Equally beautiful is nijamani nammEdA? (నిజమని నమ్మేదా? should I believe?). The man knows he can be happy. Still doubts whether he should enjoy it or not Obviously such person can neither enjoy his life nor leave it. He permanently remains in the dilemma of which way to go? 

Observe that in just 3 words nagavulu nijamani nammEdA (నగవులు నిజమని నమ్మేదా), he made a world of difference! first you smile. Then don’t know whether to smile! What an artistry. What a depth. No magician would equal him. 

I don’t know how west reflected thinking of Annamacharya so accurately. See the  great words of May Sarton:  The moral dilemma is to make peace with the unacceptable.” 

Therefore, the essence of first line of this apparently trivial chorus is “DO you stand on your own?”. When you know the only action, you need to take is there; then there is no confusion in the mind, then there is no question of 'asking should I believe?'. it will be answered by yourself.  When you are looking for someone to tell you, then you have not touched the truth…. 

వొగి నడియాసలు is indicating that man actually builds his dreams successively, based on his inference he draws from his experiences. So, the man’s problem of rejecting these desires is not one time affair.  

By this measure, Alas all the planning man does is simply unprofitable. Man leans on crutches of hope for better tomorrow. What kind of philosopher this Annamacharya is? He simply taking away the ground on which we try to stand. He is simply impossible. He is posing the most difficult question a man should answer? 

Now consider the wording of May Sarton again: “We have to dare to be ourselves, however frightening or strange that self may prove to be.” 

Implied meaning: Do you stand on your own?  Do you dare to deny the successively generating hopes? 

భావము: ఓ దేవా! క్షణమాత్రము వెలిగి మరుగయ్యే నవ్వులు శాశ్వతమని నమ్మమంటావా? ఓ మానవుడా ప్రమాణము లేని వ్యర్ధపు ఆశలను వలదనవోయి.

వివరణము: అన్నమాచార్యులు చమత్కారంగా మూడే పదాలలో సముద్రమంత అర్థాన్ని చొప్పించారు. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాడు. ఈ ఒక్క పదంతో 'నగవులు'తో అన్నమాచార్య మనిషి ఆనందించే క్షణికమైన సుఖాలను సూచించాడు.

అన్నమాచార్యులు నిజమని నమ్మేదా? కూడా అంతే అందంగా మలచారు.  మనిషికి సంతోషంగా ఉండగలనని తెలుసు. కానీ, దానిని ఆస్వాదించాలా వద్దా అనే సందేహం కలిగితే, అలాంటి వ్యక్తి సహజంగానే తన జీవితాన్ని ఆస్వాదించలేడు అలాగని విడిచిపెట్టనూలేడు. అతను ఎటువైపు వెళ్లాలనే సందిగ్ధంలో శాశ్వతంగా ఇరుక్కుపోతాడు.

సాధారణ మానవులందరి స్థితి ఇదే. (భార్య బిడ్డలు సినిమాలో ఘంటసాల పాడిన) క్రింది ​ఆచార్య ఆత్రేయ గారి పాటలోని మాటలు కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు; అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు గుర్తుకు వస్తాయి. 

లేని బాట వెతుకుతున్న పేద వానికి
రాని పాట పాడుకున్న పిచ్చివానికి

బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు

దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో
దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో
కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు
అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు

బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు....



అన్నమయ్య​ కేవలం మూడే పదాలలో భావము తలక్రిందులు చేశేశాడని గమనించండి. మొదట నగవులు (సంతోషం). తరవాత నవ్వాలో లేదో తెలియదు! ఎంత కళాత్మకత. ఎంత లోతు. ఏ మాంత్రికుడూ అతనికి సమానం కాదు.

అందువల్ల, సాధారణంగా అనిపించే ఈ పల్లవి మొదటి పంక్తి యొక్క సారాంశం "మీరు మీ స్వంత ఆలోచనల మీద నిలబడతారా?" మీరు తీసుకోవలసిన 1ఏకైక చర్య ఏదో తెలిసినప్పుడు మనసులో ఊగిసలాట ఉండదు. నిజమని నమ్మేదా?అన్న ప్రశ్నకు మీరే సమాధానం ఇవ్వగలరు. సమాధానం ఎవరైనా చెబుతారని చూస్తుంటే మాత్రం మీరు సత్యమును తాకలేదని తెలియండి.  

అన్నమాచార్యుల ఆలోచనను పాశ్చాత్యులు ఎంత ఖచ్చితంగా ప్రతిబింబించారో మే సార్టన్ చెప్పిన సూక్తిని పరిశీలించండి. నైతిక సందిగ్ధం అనేది ఆమోదయోగ్యం కాని దానితో సంధిని నెలకొల్పడమే.

వొగి నడియాసలు మనిషి తన అనుభవాల పరంపర నుండి తీసుకున్న 2అనుమితి ఆధారంగా తన కలలను క్రమేణా నిర్మించుకుంటాడని సూచిస్తుంది. కాబట్టి, మనిషి యొక్క సమస్య, ఈ కోరికలను ఒక్కమారు తిరస్కరించితే తీరే వ్యవహారం కాదు అని తెలిపారు.

అయ్యో, మనిషి చేసే ప్రణాళికలన్నీ దండుగ బేరమే. ఆశ అనే ఊతకర్రల​పై మనిషి భవిష్యత్తుకు ఉద్యమిస్తాడు. ఈ అన్నమాచార్యులు ఎలాంటి తత్వవేత్త? మనం నమ్మి నిలబడటానికి ప్రయత్నించే నేలనే అతను తొలిచివేస్తాడు. ఆశల సౌధాలను ఒక్క పెట్టులో కూల్చి వేస్తాడు. అతని మాటలు అసాధ్యం. మానవుడు (తనకితాను) సమాధానం చెప్పుకోవలసిన అత్యంత క్లిష్టమైన ప్రశ్నను అన్నమయ్య​ వేస్తున్నాడా?

ఇప్పుడు మే సార్టన్ ఇంకో సూక్తిని కూడా పరిగణిచండి: "అంతరాత్మ ఎంత తత్తర బిత్తరగా ఉన్నప్పటికీ, మనం మనంగా ఉండటానికి ఎంతో ధైర్యం కావాలి."

Footnotes:

1.    శ్లో || వ్యవసాయాత్మికా బుద్దిరేకేహ కురునందన । బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ।। 2-41 ।।భావము: అర్జునా! ఈ యొగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే యేక కారణంగా ప్రకాశిస్తుంది. నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానము అనేక భేదాలతో అనంత ముఖాలుగా వుంటుంది.​

విపులమైన వివరణకు క్రింది లింకు చూడండి https://chamartisreenivasa.blogspot.com/2020/05/2-41.html

2.    అనుమితి = knowledge gained by inference or reasoning.

అన్వయార్ధము: నువ్వు స్వంతంత్రంగా నిలబడ గలవా? క్రమేణ ఉత్పన్నమౌతున్న కోరికలను తిరస్కరించే ధైర్యం నీకు ఉందా? 

తొల్లిటికర్మము దొంతుల నుండఁగ

చెల్లబో యిఁకఁజేసేదా
యెల్లలోకములు యేలేటి దేవుఁడ
వొల్లనొల్ల నిఁక నొద్దనవే   ॥నగవు॥ 

tolliTikarmamu doMtula nuMDaMga

chellabO yiMkajEsEdA
yellalOkamulu yElETi dEvuDa
vollanolla nika noddanavE        nagavu 

Word to Word meaning: తొల్లిటికర్మము (tolliTikarmamu) = Original or former  actions and conducts; దొంతుల నుండఁగ (doMtula nuMDaMga)  = lying as a layers; చెల్లబో (chellabO) = Alas!  is It all over? యిఁకఁజేసేదా (yiMkajEsEdA) = Should I continue the same? యెల్లలోకములు (yellalOkamulu) = All the worlds; యేలేటి (yElETi) = ruling; దేవుఁడ (dEvuDa) = God; వొల్లనొల్లను (vollanollanu) = gently but firmly not accepting;  will not repeat, will not accept; ఇఁకను (ikanu) = henceforth; ఒద్దనవే (oddanavE) = shun them; 

Literal meaning: O Man! Consequences of original or former actions and conducts lying as pile of layers. Alas! Are they really over! Or will you continue the same? O God ruling all the worlds gently but firmly shun them. 

Explanation: Let us try to understand this complex wording. tolliTikarmamu doMtula nuMDaMga (తొల్లిటికర్మము దొంతుల నుండఁగ). It exists in the mind. Is it a mere postulation? Truth seekers like Jiddu Krishnamurti have confirmed existence of various inheritance layers in the mind. We ignorant are not aware of these. 

Annamacharya also said about the existence of layers in verse Tolli kalavE iviyu తొల్లి కలవే ఇవియు. polasi matimaragunane puTTuTalu bOvuTalu / palu chaMchala vikArabhAva mI guNamu (“పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు / పలుచంచలవికారభావ మీ గుణము”) Purport: In the layers of the memory, these thoughts, birth and death exists due to reminiscence. Volatile mind creates (illusionary) inversions of our feelings to baffle. 

What is baffling how both Annamacharya and Jiddu Krishnamurti with little formal education have observed these layers.  Also you may note that these layers both philosophers talked about is collective human inheritance we received. Modern science still struggling to explain, whereas two philosophers have gone beyond mere observation. Sirs, the idea of writing this explanation is not an intellectual exercise, but a formidable fact one must face in finding the ultimate truth. 

However, sirs, please understand what can we do with these layers? They are, of course pulling us down to act inefficiently.   Possibly we cannot act on these layers. What Annamacharya is signifying in this stanza?  He is asking us to be aware that continuing those ignorant acts is not going to lead to liberation. Therefore, he is seeking the god to be kind, in this act of man to shun ignorance (explanation continued in the next stanza).    

భావము: మానవా! ముందరి జన్మలలో చేసిన కర్మ ఫలాలే దొంతులు పడి ఉండగా, 'అవి చెల్లిపోయాయి' అనుకొని ఇంకా చేసెదవా? సమస్త లోకాలు పాలించే దేవుడా! వీటి (తాకిడి) నుండి మమ్ములను విముక్తులను చేయవా?

వివరణము: ఈ సంక్లిష్ట పదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తొల్లిటికర్మము దొంతులు దొంతులుగా  మస్తిష్కంలో ఉన్నవి అని జిడ్డు కృష్ణమూర్తి వంటి సత్యాన్వేషకులు మనలోని వివిధ వారసత్వ పొరల ఉనికిని నిర్ధారించారు. అజ్ఞానులమైన మనకు వీటి స్పృహ ఉండదు.

అన్నమచార్యులు తొల్లి కలవే ఇవియు అను కీర్తనలో ఇలా పేర్కొన్నారు. “పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు / పలుచంచలవికారభావ మీ గుణము” భావము (=  జ్ఞాపకాల పొరల మరగుననే పుట్టుటలుఁ బోవుటలు అనునవి దస్తావేజుల వలె నిక్షిప్తమై ఉన్నవి. అస్థిరమైన మనస్సు,  మనొ భావాలకు అడ్డుపడేలా  భ్రమలతోను వాని విలోమాలతోను గందరగోళం సృష్టించి మానవ ప్రయత్నమును నిష్ఫలముచేయును. )

అంతగా చదువులు అబ్బని తత్వవేత్తలు అన్నమచార్యులు మరియు జిడ్డు కృష్ణమూర్తి ఇద్దరూ ఈ పొరలను ఎలా గమనించారనేది అవాక్కయ్యే విషయం.  ఈ పొరలు మనం అందుకున్న సామూహిక మానవ వారసత్వం.  ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పటికీ వివరించడానికి కష్టపడుతోంది, అయితే ఈ ఇద్దరు తత్వవేత్తలు కేవలం పరిశీలనకే పరిమితమవ్వలేదు. అయ్యలారా! ఇది మేధోపరమైన వివరణ కాదు, అంతిమ సత్యాన్ని దర్శించు దశలో మానవుడు ఎదుర్కొనే ఒక దుర్గమమైన​ వాస్తవాన్ని తెలపడానికి మాత్రమే.

బాబులూ, దయచేసి ఈ పొరలతో మనం ఏమి చేయగలమో అర్థం చేసుకోండి? మనం అసమర్థంగా వ్యవహరించడానికి ఖచ్చితంగా ఇవి దోహదం చేస్తాయి.  బహుశా మనము ఈ పొరలని ఏమీ చేయలేము. మరైతే అన్నమచార్యులు ఈ చరణంలో వాటిని ఎందుకు పేర్కొన్నారు?  అవే అజ్ఞానపు చర్యలను కొనసాగించడం వల్ల విముక్తి లభించదని మనం తెలుసుకోవాలని ఆయన కోరారు. అందువల్ల, మనిషి అజ్ఞానాన్ని దూరం చేయు చర్యలలో కృప చూపాలని దైవమును వేడుకొంటున్నాడు.   (వివరణ తరువాతి చరణములో కొనసాగించబడినది.)

పోయినజన్మము పొరుగులనుండఁగ

చీయనక యిందుఁ జెలఁగేదా
వేయినామములవెన్నుఁడ మాయలు
వోయయ్య యిఁకనొద్దనవే           ॥నగవు॥ 

pOyinajanmamu porugulanuMDaga

chIyanaka yiMdu jelagEdA
vEyinAmamulavennuDa mAyalu
vOyayya yikanoddanavE           nagavu 

Word to Word meaning: పోయినజన్మము (pOyinajanmamu) = last life; పొరుగులనుండఁగ (porugulanuMDaga) = existing close by; చీయనక (chIyanaka) = without despising; యిందుఁ జెలఁగేదా (yiMdu jelagEdA) = still ravish in the same? వేయినామముల (vEyinAmamula) = THousanmd names: వెన్నుఁడ (vennuDa) = Lord Vishnu; మాయలు (mAyalu) = tricks; వోయయ్య (vOyayya) = O Lord! యిఁక (yika) = henceforth; నొద్దనవే (noddanavE)            = shun them. 

Literal meaning: O Man! Don’t you realise that the last life is so recent? Without despising that wretched existence, do you still ravish in sin. Vishnu!  God with thousand names! Sir, say no more to these tricks! (Free me from these bonds) 

Explanation: Who can dare to declare that the last life is close by? For us this is merely a postulation. They say, the liberated knew, the life (not this birth) from the beginning. This you will find Jiddu Krishnamurti repeating many times. 

How these wisemen knew it? Do you need to be born with special skills? For This Annamacharya already said duritadEhulE tolliyunu SrI-/ hari bhajiMchi nityAdhikulairi (దురిత దేహులే తొల్లియును శ్రీ / హరి భజించి నిత్యాధికులైరి purport: Ordinary mortals, being in meditation of SRI HARI became eternally great.) Therefore sirs, do not try avoid meditation with pretexts. 

What one must do? Remember the wording ta~rida~ri brEmaputallidaMDrulanu ye~ra ganidE kulahIna tadi (తఱిఁదఱిఁ బ్రేమపుతల్లిదండ్రులను యెఱఁ గనిదే కులహీన తది purport: Not recognising your parents (support provide by God) is unbeing of your caste (you are not worth). A new born child knows the support given by mother without knowledge of language, environment and cognitive capabilities. Where did those primary capabilities vanished in man? We must accept we became less sensitive, less genuine.   One should be sensitive enough to catch various signs emanating. If we are concerned with other things, then, our urgency for truth gets obliterated. 

Further consider these wordings: poMchi SarIrapubhOgamu luDigina chuMchubAvamulu sukRtamulE (పొంచి శరీరపుభోగము లుడిగిన చుంచుఁబావములు సుకృతములే Purport: When body enjoyment ceases only then nascent (or fresh) feelings actually will have chance to flower. They are the truly virtuous things). Thus, one need to have childlike innocence. Childlike urgency to observe. 

All this is like keeping the doors (of house) open. Whether wind will come inside the house is a difficult question. For sure, if you aren't prepared, there is no way you will experience truth. If we are sensitive enough to feel the last birth, we will not engage in this confusion called world. If we feel intelligent enough to know the truth, we are still ignorant. 

Thus, sirs, the wordings of this poem are significant observations of one of the greatest philosophers the world has seen. Though appear hackneyed for most Indians, they are not repetition from a holy book, but facts to be dealt seriously. 

భావము: మానవా! ఇప్పుడే కదా గడచిన జన్మము ముగిసినది! ఈ జన్మలోనూ 'చీ' అంటూ అసహ్యించుకోకుండా తిరిగి వాటిల్లోనే (పాపాలలోనే) చెలరేగుతావా? వేయి నామముల వెన్నుఁడ!  (విష్ణువా!) ఓ అయ్యా! ఈ మాయలు  ఇకనైనా వొద్దనవే! (ఈ బంధాలనుండి విముక్తి కలిగించు.)

వివరణము: ఇంత​ ధైర్యంగా పోయిన జన్మము చాలా దగ్గరగా ఉందని ఎవరు ప్రకటించగలరు? ఇది ఊహ మాత్రమేనా? జ్ఞానులైనవారికి జీవితంపై (ఈ జన్మ మాత్రమే కాదు) మొట్ట మొదటి నుండి స్పృహ ఉంటుందని జిడ్డు కృష్ణమూర్తి చాలాసార్లు వచించడం మనకు కనిపిస్తుంది.

అది ఈ ఇద్దరు తత్వవేత్తలకు ఎలా తెలిసింది? వీరేమైనా ప్రత్యేక నైపుణ్యాలతో పుట్టారా? లేదే! అందుకే అన్నమాచార్యులు ఇలా చెప్పారు. దురిత దేహులే తొల్లియును శ్రీ / హరి భజించి నిత్యాధికులైరి (= పూర్వము సామాన్య మానవులే శ్రీహరిని తెలుసుకొని, పూజించి శాశ్వత కీర్తిని సంపాదించారు.) కాబట్టి మాష్టారు! కుంటి సాకులతో ధ్యానం  వాయిదా వేయ ప్రయత్నించకండి.

మనిషి ఏమి చేయవలె? అన్నమచార్యులు చేప్పిన మాటలు 'తఱిఁదఱిఁ బ్రేమపుతల్లిదండ్రులను యెఱఁ గనిదే కులహీన తది' (భావము: తల్లిదండ్రుల (భగవంతుని) ప్రేమను, వారిచ్చు సహాయమును గుర్తించనిదే కులహీనత​.) అప్పుడే పుట్టీన (నవజాత) శిశువుకు భాష, పర్యావరణం మరియు గుర్తుపట్టు సామర్థ్యాలు  లేకుండానే తల్లి అందించే ప్రేమను, రక్షణను అనుభూతి చెందగలడు. మనిషిలో ఆ ప్రాథమిక సామర్థ్యాలు పెద్ద అవుతున్నకొలదీ ఎక్కడకు పోతాయో? మనం సూక్ష్మగ్రాహ్యుల నుండి స్థూలగ్రాహ్యులగాను, కృత్రిమముగాను మారామని అంగీకరించాలి. వెలువడుతున్న వివిధ సంకేతాలను గ్రహింౘుకొను కోమలత్వం ఉందా? మనం ఇతర విషయాల గురించి ఆందోళన చెందుతుంటే, కేవలం సత్యమే నిష్టగా గల​ రహదారి నుంచి తప్పుకున్నట్లే.

పొంచి శరీరపుభోగము లుడిగిన / చుంచుఁబావములు సుకృతములే శరీర భోగములు కోసము ఎదురు చూపులు ఆగిపోయినప్పుడు మాత్రమే కొత్త (లేదా తాజాభావాలు పుష్పించే అవకాశం ఉంటుంది నిజమైన సద్గుణములు అవే.) కాబట్టి చంటి బిడ్డ వంటి నిష్కాపట్యము; అమాయకత్వము కలిగి ఉండాలి. పరాకు లేకుండా గమనించడమే ధ్యానముగా ఉండు పిల్లవాని వంటి ఏకాగ్రత కావలెను.

ఇదంతా (ఇంటి) తలుపులు తెరిచి ఉంచడం లాంటిది. ఇంట్లోకి గాలి వస్తుందా అనేది చాలా కష్టమైన ప్రశ్న. ఖచ్చితంగా, మీరు సిద్ధంగా లేకుంటే, మీరు సత్యాన్ని అనుభవించే మార్గం లేదు. గత జన్మను ఆనవాలు పట్టేంత సున్నిత మనస్కులమతే, ఈ సంసారమనే గందరగోళంలో మనం మునిగిపోము. సత్యాన్ని తెలుసుకునేంత మేధావులమని భావిస్తే, మనం ఇంకా అజ్ఞానులమే.

అయ్యా, ఈ కీర్తనలోని పదజాలము అరిగిపోయిన ఛాందసపు మాటలగా అనిపించే అవకాశం ఉనప్పటికీ అన్నమాచార్యులు స్వతంత్రంగా వీటిని అనుభూతి చెంది ప్రకటించిన పరిశీలనలు అని తెలియండి. ప్రపంచం గుర్తించని గొప్ప తత్వవేత్త అనుధావనమును చదివి తెలియండి.

నలి నీనామము నాలికనుండఁగ

తలకొని యితరముఁ దడవేదా
బలు శ్రీవేంకటపతి నిన్నుఁగొలిచి
వొలుకుఁ జెంచలములొద్దనవే    ॥నగవు॥ 

nali nInAmamu nAlikanuMDaga

talakoni yitaramu daDavEdA
balu SrIvEMkaTapati ninnugolichi
voluku jeMchalamuloddanavE nagavu 

Word to Word meaning: నలి (nali) = యుక్తము, అధికము, Suitable, countless; నీనామము (nInAmamu) = your name;  నాలికనుండఁగ (nAlikanuMDaga) = at the tip of tongue; తలకొని (talakoni) = intentionally take up;  యితరముఁ (yitaramu) = other things; దడవేదా (daDavEdA) = should I  grope (literal), Should I consider (contextual); బలు (balu) = great, strong;  శ్రీవేంకటపతి (SrIvEMkaTapati) = Lord Venkateswara; నిన్నుఁగొలిచి (ninnugolichi) = by praying you;  వొలుకుఁ (voluku) = చిందు, కాఱు, spill, drip;  జెంచలములు (jeMchalamulu) = unsteady, unstable;  ఒద్దనవే (oddanavE) = shun these;            

Literal meaning: When well deserving your name can readily be taken at the tip of the tongue, what profit is to grope other things? O great God! Let my mind be in your prayer and shun these unsteady and unstable avocations. 

Explanation: By the wording nali nInAmamu nAlikanuMDaga నలి నీనామము నాలికనుండఁగ, Annamacharya indicating that though we are very close to God, still we rather grope with the other things. This is the crux of the problem of man. 

How is this stanza connected with the rest of the song? At the outset, he says Man is not clear what to hold on. Then he said despite the legacy inheritance, he requested god to help him tide over the impinging desires and very tricks which baffle man from the morning to night. He continued his advise that man should shun unsteady things and take up the name of God at the tip of his tongue.

భావము: ఓ దేవా! యుక్తమైన నీ పేరు నాలుక చివర ఉన్నా కూడా, ఇతర విషయాలను తడువ బోతాను.  ఓ శ్రీవేంకటపతి! నీ ధ్యానములో ఉన్న నాపై ఈ చిందుల చంచలములను నిలువరించవయ్యా! 

వివరణము: నాలిక మన దేహములోనే ఉన్నది. దైవమును కూడా అంతే సులభముగా పొందవచ్చని 'నలి నీనామము నాలిక​ నుండఁగ' అని అన్నారు. అయినప్పటికీ మానవుడు ఇతరములను తడువ బోతాడు.  ఇది మనిషి సమస్యలన్నింటికీ కీలకాంశము. అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత ఊరకే పుట్టలేదు.

ఈ చరణం మిగిలిన పాటతో ఎలా అనుసంధానించ బడింది? ప్రారంభంలో, మనిషి సహజమైన ఊగిసలాటలో ఏమి చేయాలో నిర్ధారించలేడని చెప్పారు. తరవాత ! ముందరి జన్మలలో చేసిన కర్మ ఫలాలే దొంతులు పడి ఉండగా, 'అవి చెల్లిపోయాయి' అనుకొని ఇంకా అవే చేయబోతాడు అన్నారు. మనిషిని ఇబ్బంది పెట్టే కోరికలను, మాయలు  అధిగమించడానికి సహాయం చేయమని దేవమును అభ్యర్థించాడు. మనిషి అస్థిరమైన విషయాలను విస్మరించి, తన నాలుక చివరన భగవంతుని నామాన్ని స్వీకరించాలని అతను తన సలహాను కొనసాగించాడు.

Summary of this Keertana:

O God! Should I believe the smiles that light up my face momentarily as permanent? O man! Shun those successive baseless hopes! (Implied meaning: Do you stand on your own?  Do you dare to deny the successively generating hopes? ) 

O Man! Consequences of original or former actions and conducts lying as pile of layers. Alas! Are they really over! Or will you continue the same? O God! ruling all the worlds, gently but firmly shun them. 

O Man! Don’t you realise that the last life is so recent? Without despising that wretched existence, do you still ravish in sin. Vishnu! God with thousand names! Sir, say no more to these tricks! (Free me from these bonds) 

O God!  When well deserving your name can readily be taken at the tip of the tongue; what profit is to grope other things? O great God! Let my mind be in your prayer and shun these unsteady and unstable avocations.

 

కీర్తన సంగ్రహ భావము:

ఓ దేవా! క్షణమాత్రము వెలిగి మరుగయ్యే నవ్వులు శాశ్వతమని నమ్మమంటావా? ఓ మానవుడా ప్రమాణము లేని వ్యర్ధపు ఆశలను వలదనవోయి. (అన్వయార్ధము:: నువ్వు స్వంతంత్రంగా నిలబడ గలవా? క్రమేణ ఉత్పన్నమౌతున్న కోరికలను తిరస్కరించే ధైర్యం నీకు ఉందా?.)

మానవా! ముందరి జన్మలలో చేసిన కర్మ ఫలాలే దొంతులు పడి ఉండగా, 'అవి చెల్లిపోయాయి' అనుకొని ఇంకా చేసెదవా? సమస్త లోకాలు పాలించే దేవుడా! వీటి (తాకిడి) నుండి మమ్ములను విముక్తులను చేయవా? 

మానవా! ఇప్పుడే కదా గడచిన జన్మము ముగిసినది! ఈ జన్మలోనూ 'చీ' అంటూ అసహ్యించుకోకుండా తిరిగి వాటిల్లోనే (పాపాలలోనే) చెలరేగుతావా? వేయి నామముల వెన్నుఁడా!  (విష్ణువా!) ఓ అయ్యా! ఈ మాయలు  ఇకనైనా వొద్దనవే! (ఈ బంధాలనుండి విముక్తి కలిగించు.) 

ఓ దేవా యుక్తమైన నీ పేరు నాలుక చివర ఉన్నా కూడా, ఇతర విషయాలను తడువ బోతాను.  ఓ శ్రీవేంకటపతి! నీ ధ్యానములో ఉన్న నాపై ఈ చిందుల చంచలములను నిలువరించవయ్యా!

 

 

Copper Leaf: 360-3  Volume 4-353

3 comments:

  1. స్వగతంతో బాటు,భగవంతుడికి ఉద్దేశించబడిన ఈ అన్నమయ్య
    కీర్తనలోని అంతరార్థమును చాలా స్పష్టంగా వ్యాఖ్యనించారు
    శ్రీనివాస్ గారు. ప్రాపంచిక సుఖములు క్షణికములని,నిరంతరం ఉద్భవించెడు కోరికలను,ఆశలను వదలిపెట్టమని హితవు పలికే
    పల్లవి; అనంతమైన సంచిత కర్మల ఫలములు అనుభవించవలసి యుండగా, ఈ జన్మలో క్రొత్త కర్మల తాకిడి నుంచి విముక్తి
    నొసగుమని;గతజన్మలో చేసిన పాపములను ఏవగించకుండా,ఈ
    జన్మలోనూ కొనసాగనీయకుండా విముక్తిని కలిగించమని;శ్రీహరి
    ధ్యానచింతనలో నిమగ్నమైయున్న నన్ను ఈ ప్రాపంచిక బంధముల చిందులు నన్నంటకుండా నిలువరించు మయ్యా యని ఆవేదన చెందే ఒక సగటు మానవుని మానసిక స్థితిని ఈ కీర్తనలో అన్నమయ్య అద్భుతంగా ఆవిష్కరించాడు. వ్యాఖ్యానం అలరించింది.

    ReplyDelete
  2. కృష్ణ మోహన్
    విశాఖపట్నం

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...