ANNAMACHARYA
Introduction: This poem is a touchstone to understand why Annamacharya
is a great philosopher. Gentlemen! this verse is more like a scientific explanation of what man
is expected to do with his life. It has no reference to either gods, practices,
Hinduism, or any opinionated theories. This single little-known verse is a
demonstration of practical approach adapted by Annamacharya in dealing with the
human problems. I wonder how he could explore every single thread of our present
condition of 21st century.
Man tries to deflect rather than accept the reality. This verse is mainly
based on our internal resistance (deflection) to challenges.
It may appear as if Jiddu Krishnamurti
had studied Annamayya before his
pronouncement “I am concerning myself with only one essential
thing: to set man free. I desire to free him from all cages, from all fears, and not to found
religions, new sects, nor to establish new theories and new philosophies.” Interestingly
Annamayaa did that 500 years before.
ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు ఎంతటి గొప్ప దార్శనికుడో తెలుసుకోవడానికి ఈ కీర్తన ఒక గీటురాయి. మాష్టారు! ఈ కీర్తన మనిషి తన జీవితంలో ఏమి చేయవలెనో చెప్పు శాస్త్రీయ వివరణము వంటిది. ఇందులో దేవుళ్లు, ఆచారాలు, హిందూ మతం లేదా అభిప్రాయాలు, సిద్ధాంతాల ప్రస్తావనలేదు. అంతగా ప్రాచుర్యంలో లేని ఈ అనామక కీర్తన మానవ సమస్యలతో వ్యవహరించడంలో అన్నమాచార్యుల ఆచరణాత్మక విధానం ఉదాహరించ తగ్గది. 15వ శతాబ్దపు తపసి మన ప్రస్తుత స్థితికి సంబంధించిన అన్ని మూలమూలల్ని అతడు ఎలా అన్వేషించగలిగాడని నేను ఆశ్చర్యపోయాను.
మనిషి వాస్తవికతను అంగీకరించడానికి బదులు పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు. ఈ కీర్తన ప్రధానంగా జీవితం విసిరే సవాళ్లకు మన అంతర్గత ప్రతిఘటనను వివరిస్తుంది.
"నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాత్రమే
ఆలోచిస్తున్నాను: మనిషిని ఎటు వంటి షరతులూ లేకుండా విడిపించడం. నేను అతనిని
అన్ని పంజరాల నుండి, అన్ని భయాల నుండి విముక్తి చేయాలనుకుంటున్నాను. కొత్త సిద్ధాంతాలు మరియు కొత్త
తత్వాలను స్థాపించడానికి కాదు." అన్న జిడ్డు కృష్ణమూర్తి తన ప్రకటనకు ముందు
అన్నమయ్యను క్షుణ్ణంగా అధ్యయనం
చేసినట్లుగా అనిపిస్తుంది. అదృష్టవశాత్తూ అన్నమయ్య ఐదు వందల సంవత్సరాల క్రితమే ఆ
పని చేశేసాడు.
కీర్తన:
తహతహలిన్నిటికి తానే మూలము గాన సహజాన నూరకున్న సంతతము సుఖము ॥పల్లవి॥
భారమైన పదివేలు పనులు గడించుకొంటే సారెసారె నలయించకపోవు
తీరనియాసోదము దేహములో నించుకొంటే
వూరూరఁ దిప్పితిప్పి వొరయక మానవు ॥తహ॥
వుండివుండి కిందుమీఁదు వుపమఁ జింతించుకొంటే వుండుఁబో మంచముకింద నొకనూయి
కొండంతదొరతనము కోరి మీఁద వేసుకొంటే
నండనే యాబహురూప మాడకపోదు ॥తహ॥
మనసురానివైన మంచివి చేసుకొంటే తినఁదిన వేమైన దీపవును
తనిసి శ్రీవేంకటేశు దాసానదాసుఁడైతే
యెనయుచు నేపని కెదురే లేదు ॥తహ॥
|
tahatahalinniTiki tAnE mUlamu gAna sahajAna nUrakunna saMtatamu sukhamu ॥pallavi॥ bhAramaina padivElu panulu gaDiMchukoMTE
sAresAre nalayiMchakapOvu
tIraniyAsOdamu dEhamulO niMchukoMTE
vUrUra dippitippi vorayaka mAnavu ॥taha॥
vuMDivuMDi kiMdumIMdu vupama jiMtiMchukoMTE vuMDubO maMchamukiMda nokanUyi
koMDaMtadoratanamu kOri mIda vEsukoMTE
naMDanE yAbahurUpa mADakapOdu ॥taha॥
manasurAnivaina maMchivi chEsukoMTE tinadina vEmaina dIpavunu
tanisi SrIvEMkaTESu dAsAnadAsuDaitE
yenayuchu nEpani kedurE lEdu ॥taha॥
|
Details and Explanations:
తహతహలిన్నిటికి
తానే మూలము గాన
tahatahalinniTiki tAnE mUlamu gAna
Word to Word meaning: తహతహలు (tahatahalu) Flurry, agitation, flutter అన్నిటికి (anniTiki)= for all; తానే (tAnE) = self; మూలము (mUlamu)= root cause; గాన (gAna) = therefore; సహజానను (sahajAnanu) = naturally; ఊరకున్న (Urakunna) = మౌనము వహించు, stay quiet; సంతతము (saMtatamu) = perpetually; సుఖము (sukhamu) = comfort.
Literal meaning: Man is the root cause of all the flutter, agitation going on in his mind and outside. Therefore, staying naturally quiet leads to perpetual comfort.
Explanation: This verse most succinctly puts the actual situation of man. Probably all the religions say the same thing. Though, many may agree on the root cause as man, still most do not understand the wording sahajAna nUrakunna (సహజాన నూరకున్న) means to stay where you are and do nothing. Can we really? We shall examine.
Explanation for natural state : What is our natural state? For sure we are not in natural state. We stay in a world of concepts and symbols. To enunciate, take the word God. There is no unanimity on what constitutes God. Each one of us have different association with it. Though we understand English, still it connotes different things to people. Similarly, is the word Natural.
Here natural state is that which is not artificial. We are clever enough to feign natural looking artificial smile. Here Annamacharya is saying dismantle all those and stay as you actually are.
Kindly consider these wording of Marianne Williamson: “In our natural state, we are glorious beings. In the world of illusion, we are lost and imprisoned. Slaves to our appetites and our will to false power.”. Sir, please understand that the observations of Annamacharya are very deep, though he received little formal education.
Explanation for Inaction: Now Consider this verse from
Bhagavadgita. प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वश: |य: पश्यति तथात्मानमकर्तारं स पश्यति ||13-30|| prakṛityaiva cha karmāṇi kriyamāṇāni sarvaśhaḥ yaḥ paśhyati
tathātmānam akartāraṁ sa paśhyati
Purport: Who can actually observe that all actions (of the body) are
performed by material nature and takes no action is a true seer.
Comparison is a major psychological conflict man faces in life. These comparisons have great bearing on our outlook and lead us to suffocation. The solution shown in Bhagavad-Gita is to be aware (and yet not act upon) the internal reactions to various situations that happen in our life.
The Himalayan mountains Or Victoria Falls provide you a wonderful feeling for the first time. During the second time, you might have observed, the feel of the first time is somewhat dimmed! Because for the first time our intellect opens for perception of those things. From the second time onwards comparisons with the experience of the first-time creeps in the mind. Feelings like “Rainbow colours were brighter last time; “there is less snow than before” actually, influence and freshness of perception is robbed (due to the past experience stored in the mind).
Please note that during the first time, absence of internal reaction (or resistance) is much lower in scale compared to the second time. Man makes tremendous efforts against this internal resistance. What is underlined by Annamacharya in this verse is to remain naturally free (so that there is no resistance). DO you think it is easy?
In fact, every moment in life is special. But, in real life many things, as the comparisons affected the elegance of the Himalayan mountains in the example above, diminish the uniqueness of the moment and reduce it to below par level, disrupting the freshness of life and dulling the imagination. That’s why with age we become indifferent. Great artists remain active and vibrant till the very end.
In order to prevent that from happening, we have to dissolve the notions and specific opinions that have gone unnoticed in us. That is why Jiddu Krishnamurti propounded complete inaction as a solution. It appears similar to Annamacharya’s pronouncement and the above verse in the Bhagavad-Gita.
“Only complete inaction, only the complete negation of "what is". We do not see the great force that is in negation. If you reject the whole structure of principle and formula, and hence the power derived from it, the authority, that very rejection gives you the force necessary to reject all other structures of thought--and so you have the energy to change! The rejection is that energy.” (Freedom, Love, and Action: by J. KRISHNAMURTI)
“We shall understand the full significance of action when thought is free and unhindered. That is, when you have pierced through the false illusions, false values, which you have created, which have become your environment. your burden, then there is the flow of reality, of life, which is action itself. You have individually to begin to discern the significance of acquisitiveness upon which our whole structure of thought and action is based.”
“Action is that unimpeded
movement of intelligence, unhindered by fear, by compulsion, by the conflict of
self-protective choice. Such pure action is the very expression of life itself.
Now, this is not a philosophical answer to be treated merely as a theory,
impracticable in daily life. We are concerned with action every moment of the
day; and we shall know the ecstasy of this unimpeded action when the mind is
renewing itself through fulfilment.” ”. (Jiddu Krishnamurti)
భావము: మానవుడు తన లోనూ, తన చుట్టూనూ జరుగుచున్న తహతహలు అన్నిటికి తానే
మూలము గాన సహజముగా ఏమీచేయక ఊరకున్న సంతతము సుఖము.
వివరణము: ఈ
కీర్తన మనిషి యొక్క వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. చాలా మంది మనిషి కష్టాలకు
మనిషే మూలకారణమని అంగీకరించవచ్చు. బహుశా అన్ని మతాలు చెప్పేది అదేనేమో.
అయినప్పటికీ, ‘సహజాన నూరకున్న’ అన్నది సులభంగా
కొరుకుడు పడదు. మనం నిజంగా సహజంగా ఉంటున్నామా? పరిశీలించెదము.
సహజ స్థితి అంటే ఏమిటి? ఖచ్చితంగా
మనమైతే సహజ స్థితిలో లేము. మనము భావనలు మరియు చిహ్నాల ప్రపంచంలో విహరిస్తుంటాము.
ఉదాహరణకు, దేవుడు అనే
పదాన్ని తీసుకోండి. ఆ పదముతో మనలో ఒక్కొక్కరికి ఒక్కో అనుబంధం ఉంటుంది. భగవంతుడు
అంటే ఏమిటో ఏకాభిప్రాయం లేదు. దేవుడు అనేది ప్రజలకు భిన్నమైన విషయాలను
సూచిస్తుంది. అలాగే సహజము అన్న పదమూనూ.
ఇక్కడ సహజ
స్థితి అంటే కృత్రిమమైనది కాదు. కానీ, మనము సహజంగా అనిపించేటంత
కృత్రిమమైన చిరునవ్వుతో నటించగల సమర్థులము. ఇక్కడ అన్నమాచార్యులు కృత్రిమమైన
వాటన్నిటినీ పక్కనపెట్టి, మీరు
యధాతధంగా ఉండండి అన్నారు.
ఇప్పుడు మారియాన్ విలియమ్సన్ చెప్పిన మాటలను పరిశీలించండి. “మనము సహజ స్థితిలో, మనం మహిమాన్విత జీవులము. భ్రాంతి ప్రపంచంలో మనం తప్పిపోయి బంధించబడ్డాము. మనము ఆకలికి మరియు ఇష్టాయిష్టాలను సంకల్ప శక్తికి బానిసలము.” అంతగా చదువు అబ్బని అన్నమాచార్యుల పరిశీలనలు సముద్రము కంటే లోతుగా ఉంటాయని అర్థం చేసుకోండి.
ఏమీ చేయకుండుట అనగా నేమి? శ్రీ భగవానువాచ: శ్లో|| ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః । యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి ।।(13-30)।। భావం: (అర్జునా!!) ఎవడు కర్మలు అన్నివిధాలా ప్రకృతి స్వభావము చేత చేయబడుతున్నట్లు తెలియునో మరియు ఆత్మను కర్తగానివానిగా తెలియునో అతడే నిజముగా (సరిగ్గా) చూచుచున్నవాడని (ద్రష్ట అని) తెలియుము.
కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్న సమాచారమే బంధాలను బలోపేతం చేస్తాయని తెలుసుకున్నాం. జీవితంలో మనిషి ఎదుర్కొనే ముఖ్యమైన మానసిక సంఘర్షణ పోలిక. ఈ పోలికలు క్షణక్షణమూ ప్రభావితం గావించి, మనిషిని ఉక్కిరిబిక్కిరి యచేస్తున్నాయి. ఈ పోలికల నుంచి బయట పడేందుకు మార్గం పేర్కొన్నారు. అదే 'అకర్తారం స పశ్యతి'. ఎవరైతే బాహ్యంగా జరుగు క్రియలకు పై శ్లోకంలో చెప్పబడినట్లు తనయందు ప్రకృతి జనితమైన అంతర్గత ప్రతిక్రియ గమనించి కూడా, ఏమీ చేయకుండుటయే జ్ఞాన మార్గమని చెప్పారు.
హిమాలయ పర్వతాలు కానీ విక్టోరియా జలపాతం కానీ మొదటి సారి చూసినపుడు అద్భుతమైన భావన కలుగుతుంది. అవే, రెండో సారి చూసినపుడు, మొదటి సారి చూసినప్పటి లాంటి భావన ఎందుకు కలగదు? ఎందుకంటే మొదటి సారి మన మేధస్సు ఆయా విషయాలపై గ్రహింపుకై (ఆకళింపుకై) తెరుచుకుంటుంది. రెండో సారి నుంచి, మొదటి సారి చూసిన దానితో (మనసులో) బేరీజు వేసుకుని “ఇంతకుముందు కంటే తక్కువగా మంచు ఉంది”, లేదా “అప్పుడు ఇంకా ఎక్కువ ఎత్తు నీటి తుంపర ఉండేది” లాంటి పోలికలు ప్రవేశించి, ఆ క్షణంలో గ్రహింపును ప్రభావితం చేస్తాయి.
హిమాలయ పర్వతాలు కానీ విక్టోరియా జలపాతం కానీ మొదటి సారి చూసినపుడు అంతర్గత ప్రతిక్రియ లేకపోవడం గమనార్హం.
నిజానికి జీవితంలో ప్రతీ క్షణము ప్రత్యేకమే. కానీ, నిజ జీవితంలో అనేక విషయాలు, పై ఉదాహరణలో హిమాలయ పర్వతాల సొగసును పోలికలు ప్రభావితం చేసినట్లు, ఆయా క్షణము యొక్క ప్రత్యేకతను క్షీణింప చేసి సాధారణ స్థాయికి తగ్గించి, జీవితంలో క్రొత్తదనాన్ని భంగం చేసి, ఊహలను మొద్దుబారుస్తాయి. అందుకే వయసుతో పాటు పట్టీపట్టనట్టు తయారవుతాము. గొప్ప కళాకారులు "తమను తాము రీఇన్వేంట్ చేసుకోవడము ద్వారా" చివరి వరకు చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటారు.
అలా జరగకుండా ఉండాలంటే, మనలో పేరుకు పోయిన ఊహలూ, నిర్దిష్ట అభిప్రాయాలూ కరిగిపోవాలి. అందుకే అంతర్గత ప్రతిక్రియను గురించి జిడ్డు కృష్ణమూర్తి గారు, భగవద్గీతలో పేర్కొన్న పై శ్లోకాన్ని, కీర్తనను ప్రతిబింబిస్తూ ఇలా అన్నారు. "ప్రతిచర్య " యొక్క పూర్తి తిరస్కరణమే పూర్తి నిష్క్రియాత్మకత. ఐతే నిరాకరణలో ఉన్న గొప్ప శక్తిని మనం గ్రహించలేము. మీరు ఒక ఆలోచన మరియు దాని యొక్క మొత్తం నిర్మాణాన్ని తిరస్కరిస్తే, దాని నుండి పొందిన శక్తితో సమస్తమైన ఆలోచనలతో ప్రేరేపితమైన ఇతర నిర్మాణాలను తిరస్కరించడానికి అవసరమైన సామర్థ్యము పొందుతారు - దానితో మిమ్మల్ని మీరు మార్చకోగల బలిమి కలిగి ఉంటారు! తిరస్కరణ నుంచి పుట్టిందా శక్తి.
చర్య
అంటే భయం లేని, బలవంతం కాని, స్వీయ-రక్షణ
కాని, సంఘర్షణల ఆటంకం లేని మేధస్సు యొక్క కదలిక. అటువంటి
స్వచ్ఛమైన చర్యయే జీవితానికి వ్యక్తీకరణ. ఇది కేవలం సిద్ధాంత పరంగా చెప్పిన తాత్విక సమాధానం కాదు. రోజువారీ
జీవితంలో ఆచరణ సాధ్యమే! రోజులోని ప్రతి క్షణం చర్యలతో నిండి ఉంటుంది; ఏ విధమైన అవరోధం
లేని చర్యలతో మనస్సును సఫలీకృతం చేయడం ద్వారా నిజమైన తన్మయత్వము తెలుసుకుంటాము. (జిడ్డు కృష్ణమూర్తి).
భారమైన పదివేలు
పనులు గడించుకొంటే
bhAramaina padivElu panulu gaDiMchukoMTE
Word to Word meaning: భారమైన (bhAramaina) = heavy; పదివేలు (padivElu) = ten thousand; పనులు (panulu)= works, errands; గడించుకొంటే (gaDiMchukoMTE) = earn, acquire, gain; సారెసారె (sAresAre) = time and again; నలయించకపోవు (nalayiMchakapOvu) = తప్పక ఆయాసపెట్టు, తప్పక శ్రమపెట్టు, definitely make you tired; తీరని (tIrani) = insatiable; యాసోదము (yAsOdamu) = ఆచోద్యము, శరీరమున కనిపించు గాఢ భావన, that questionable thing; దేహములో (dEhamulO) = in the body; నించుకొంటే (niMchukoMTE) = సంపాదించు కొంటే, if we take up; వూరూరఁ (vUrUra) = takes us places; దిప్పితిప్పి (dippitippi) = make you go round and round; వొరయక మానవు (vorayaka mAnavu) = ఒరిపిడి/ఘర్షణ కలిగించక మానవు, will cause friction/resistance;
Literal meaning: When man takes up ten thousand works definitely, he does get tired. That insatiable & questionable hunger for work, if taken up, then it makes one to go round and round. This ultimately results as resistance in the mind.
Explanation: Nobleman, please note that Annamacharya is no idyllic poet, but great thinker. His modernity of writing is discernible in every poem. He is very clear in the mind that modern man engages himself in thousands of avocations. We really do not know how people were in 15th century. But surely his descriptions match of the man of 21 century.
Annamacharya continuing that man due to his pursuits suffocates himself. Therefore, he does not find enough time to ponder on the God. Do you think he saw our life so clearly in 15th century itself?
భావము: భారమైన పదివేలు పనులు తలపై వేసుకుంటే మాటిమాటికి అలపురాకుండా ఉంటుందా? ఎప్పటికీ తీరని ఆచోద్యము మనస్సులో నింపుకుంటే వూరూరఁ దిప్పితిప్పి ఒరిపిడి (లేదా ఘర్షణ) కలిగించక మానవు.
వివరణము: మాష్టారు!
గమనించండి అన్నమాచార్యులు పేరుగాంచిన కవి మాత్రమే కాదు, గొప్ప
ఆలోచనాపరుడు. ఆధునికత ఆయన ప్రతి కవితలోనూ కనిపిస్తుంది. ఆధునిక మానవుడు
వేలకొద్దీ విన్యాసాలలో తనని తాను నిమగ్నం చేసుకుంటున్నాడని అతను చాలా స్పష్టంగా
చెప్పాడు. 15వ శతాబ్దంలో ప్రజలు ఎలా ఉండేవారో మనకు నిజంగా
తెలియదు. కానీ అతని వివరణలు 21శతాబ్దపు వ్యక్తికి ఖచ్చితంగా సరిపోతాయి.
వేలకొలది పనులు
నెత్తిన వేసుకుని సతమతమౌతూ దైవమును స్మరించుటకు కూడా వీలు చిక్కని మన ఇప్పటి
జీవితాన్ని 15
శతాబ్దంలోనే దర్శించాడని
అనిపిస్తుంది.
వుండివుండి
కిందుమీఁదు వుపమఁ జింతించుకొంటే
vuMDivuMDi kiMdumIMdu vupama jiMtiMchukoMTE
Word to Word meaning: వుండివుండి (vuMDivuMDi)
= continuing (our thinking); కిందుమీఁదు (kiMdumIMdu) = తలక్రిందులగు, somehow (contextually take it as tricky); వుపమఁ (vupama) = comparison; జింతించుకొంటే (jiMtiMchukoMTE) = if we imagine; వుండుఁబో
(vuMDubO) = probably exists; మంచముకింద
నొకనూయి (maMchamukiMda nokanUyi) = కనబడని పొంచియున్న
ప్రమాదము, a great danger lurking in the shadows; కొండంత (koMDaMta)
= as big as mountain; దొరతనము (doratanamu) =
ప్రభుత్వము, రాజత్వము, అధికారము, పాలనము, Governance,
rule reign; కోరి మీఁద వేసుకుంటే (kOri mIda vEsukoMTE) = taken up intentionally; నండనే (naMDanE)=
immediately next to it; యా
(yA) = that; బహురూపము (bahurUpamu) = ఊసరవెల్లి (రంగులు
మార్చు తొండ) = a chameleon, changing colours to suit the situation ; ఆడకపోదు
(mADakapOdu) = likely to happen;
Literal meaning: Continuing the tricky comparisons, you will
find some lurking danger in everything. If you take up governance/reign intentionally,
in all likelihood you will turn a chameleon (to change colours to suit the
situation).
Explanation: Gentlemen, please understand, Annamacharya is absolutely crystal clear in his mind that if you analyse anything thread bare, some lurking danger or the other can be unearthed. There can be no avocation without peril. Therefore, he does not advise analysis. You may note that both Annamacharya & Jiddu Krishnamurti do not approve an analysis.
Analysis thus takes long time. Probably that is the reason, they are saying instead of wasting time in analysis, better do not attempt doing anything. Therefore the relevance of the wording sahajAna nUrakunna (సహజాన నూరకున్న).
If one takes up governance in his hands, because of the nature of the job, one has to show different colours at different times. This Annamayya does not approve. So also Krishnamurti.
భావము: ఏ విషయములోనైనా
మాటిమాటికి (అనేక పర్యాయములు) గ్రుచ్చి
గ్రుచ్చి చూసుకుంటే కనబడని పొంచియున్న
ప్రమాదము కనబడవచ్చు. పెద్ద పెద్ద దొరతనము కోరి మీఁద వేసుకొంటే దానితోపాటే
ఊసరవెల్లిలా (రంగులు మార్చు తొండలా)
మారకుండా వుండవు.
వివరణము: అయ్యవారూ, దయచేసి
అన్నమాచార్యులు తన మనస్సులో ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నారని అర్థం చేసుకోండి. మీరు
ఏదైనా విషయన్ని పోఁగులు పోఁగులు అగు వరకు విశ్లేషిస్తే, దాని వెనుక దాగి
ఉన్న ప్రమాదం లేదా మరొకటి బయటపడవచ్చు. అంటే
ప్రమాదము, కష్టము లేని
విషయాలే లేవనే చెప్పవచ్చు. అందువల్ల, అన్నమాచార్యులు
& జిడ్డు
కృష్ణమూర్తి ఇద్దరూ విశ్లేషణను ఆమోదించలేదని మీరు గమనించవచ్చు.
కాబట్టి
విశ్లేషణకు చాలా సమయం పడుతుంది. బహుశా అదే కారణం కావచ్చు, విశ్లేషణలో
సమయాన్ని వృథా చేయకుండా, ఏమీ చేయకపోవడమే
(సహజాన నూరకున్న) మంచిదని వారు అంటున్నారు.
ఎవరైనా పాలనను
(కొండంత దొరతనమును) తన చేతుల్లోకి తీసుకుంటే, ఆ ఉద్యోగం యొక్క స్వభావం కారణంగా, వివిధ సమయాల్లో
వివిధములుగా ఊసరవెల్లిలా వ్యవహరించవలసి ఉంటుంది. అందుకే, ఇది ఆయన
ఆమోదించడు. అలాగే కృష్ణమూర్తినూ.
మనసురానివైన
మంచివి చేసుకొంటే
manasurAnivaina maMchivi chEsukoMTE
Word to Word meaning: మనసురానివైన (manasurAnivaina) = even if the mind does not accept; మంచివి (maMchivi) = good habits; చేసుకొంటే (chEsukoMTE) = if practiced; తినఁదిన వేమైన దీపవును (tinadina vEmaina dIpavunu) = slowly and steadily becomes easy and finally appears natural to perform like that. తనిసి (tanisi) = తృప్తిపొంది, being satisfied; శ్రీవేంకటేశు (SrIvEMkaTESu) = Lord Venkateswara; దాసానదాసుఁడైతే (dAsAnadAsuDaitE) = become servant of servants; యెనయుచు (yenayuchu) = సరిపోలు, పొందు, equal; నేపని (nEpani) = Any work; కెదురే లేదు (kedurE lEdu) = ఎదిరించుటకు లేదా ప్రతిఘటించుటకు ఏదీ ఉండదు, there is nothing to resist.
Literal meaning: By gradual practice even unwanted good things can be performed with natural ease. When you are internally satisfied, become servant of the servants of Lord Venkateswara, there is nothing equal to that in this world. In such state, All your actions become free (without any resistance).
Explanation: Annamcharya does not use words to fill space. He is cautioning us that we may take unnatural things (which otherwise we do not want, but social requirement is to adapt it) as natural because we are adept at it due to practice. These should not be mistaken as being natural.
By
this we find ourselves to be greedy, insensitive, compulsively competing,
terribly violent. Sir, it is no good to act. Realising or knowing what one
truly is very more serious business than to engage in cover up. please
understand the act of cover up is internal resistance.
Implied meaning: Please understand what is natural and
what is artificial to you. When you realise your actual natural state, in that
free state you will experience ecstasy.
భావము: క్రమంగా సాధన చేయడం
వల్ల ఇష్టములేని మంచి పనులు కూడా సులభంగా
సహజంగా చేయగలుగుతాము. మీరు అంతర్గతంగా సంతృప్తి చెందినప్పుడు, వేంకటేశ్వరుని (దాసానదాసుఁడైతే) సేవకుల సేవకుడిగా
మారినప్పుడు, ఈ ప్రపంచంలో దానికి సమానమైనది ఏదీ
లేదు. అటువంటి స్థితిలో, మీ చర్యలన్నీ (ఎటువంటి ప్రతిఘటన
లేకుండా) అవధులే లేని పరవశత్వము నిచ్చును.
వివరణము: అన్నమాచార్యులు
ఖాళీలను పూరించడానికి పదాలను ఉపయోగించరు. అభ్యాసం వల్ల మనం నిష్ణాతులమౌతాము.
కాబట్టి అసహజమైన విషయాలను (మనకు అక్కరలేని, కానీ సామాజిక అవసరం దృష్ట్యా అలవరచుకున్నవి) కూడా సహజంగా
పొరపాటు పడ వచ్చని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు.
ఈ మేలి ముసుగులు
తొలగిస్తే మనకి మనము అత్యాశాపరులుగాను, సున్నితత్వం లేనివారిగాను, బలవంతంగా
పోటీపడేవారిగాను, భయంకరమైన
హింసావాదులుగాను కనిపిస్తాము. మంచిగా నటించడం మనకి మంచిది కాదు సార్. కప్పిపుచ్చుకోవడం కంటే నిజాన్ని
గ్రహించడం ముఖ్యమని తెలియండి. దయచేసి కప్పిపుచ్చే చర్య అంతర్గత ప్రతిఘటన అని అర్థం
చేసుకోండి.
అన్వయార్ధము: మీకు ఏది
సహజమో మరియు ఏది కృత్రిమమో యదార్థముగా తెలుసుకోండి. మీరు అసలు సహజ స్థితిని
చేరుకున్నప్పుడు, ఆ స్వేచ్ఛా స్థితిలో
మీరు పారవశ్యాన్ని అనుభవిస్తారు.
Summary of this Keertana:
Man is the
root cause of all the flutter, agitation going on in his mind and outside.
Therefore, staying naturally quiet leads to perpetual comfort.
When man takes up ten thousand
works definitely, he does get tired. That insatiable & questionable hunger
for work, if taken up, then it makes one to go round and round. This ultimately
results as resistance in the mind.
Continuing
the tricky comparisons, you will find some lurking danger in everything. If you
take up governance/reign intentionally, in all likelihood you will turn a
chameleon (to change colours to suit the situation).
By gradual practice even unwanted
good things can be performed with natural ease. When you are internally
satisfied, become servant of the servants of Lord Venkateswara, there is
nothing equal to that in this world. In such state, All your actions become
free (without any resistance). ! (Implied meaning: Please understand what
is natural and what is artificial to you. When you realise your actual natural
state, in that free state you will experience ecstasy.)
కీర్తన సంగ్రహ భావము:
మానవుడు తన లోనూ, తన చుట్టూనూ జరుగుచున్న తహతహలు అన్నిటికి తానే
మూలము గాన సహజముగా ఏమీచేయక ఊరకున్న సంతతము సుఖము.
భారమైన
పదివేలు పనులు తలపై వేసుకుంటే మాటిమాటికి అలపురాకుండా ఉంటుందా? ఎప్పటికీ తీరని ఆచోద్యము
మనస్సులో నింపుకుంటే వూరూరఁ దిప్పితిప్పి ఒరిపిడి (లేదా ఘర్షణ) కలిగించక మానవు.
ఏ
విషయములోనైనా మాటిమాటికి (అనేక పర్యాయములు)
గ్రుచ్చి గ్రుచ్చి చూసుకుంటే
కనబడని పొంచియున్న ప్రమాదము కనబడవచ్చు. పెద్ద పెద్ద దొరతనము కోరి మీఁద
వేసుకొంటే దానితోపాటే ఊసరవెల్లిలా (రంగులు మార్చు తొండలా) మారకుండా వుండవు.
క్రమంగా సాధన చేయడం వల్ల
ఇష్టములేని మంచి పనులు కూడా సులభంగా
సహజంగా చేయగలుగుతాము. మీరు అంతర్గతంగా సంతృప్తి చెందినప్పుడు, వేంకటేశ్వరుని
(దాసానదాసుఁడైతే) సేవకుల సేవకుడిగా మారినప్పుడు, ఈ ప్రపంచంలో
దానికి సమానమైనది ఏదీ లేదు. అటువంటి స్థితిలో, మీ చర్యలన్నీ
(ఎటువంటి ప్రతిఘటన లేకుండా) అవధులే లేని
పరవశత్వము నిచ్చును. (అన్వయార్ధము:: నువ్వు మీకు ఏది సహజమో మరియు ఏది కృత్రిమమో యదార్థముగా
తెలుసుకోండి. మీరు అసలు సహజ స్థితిని చేరుకున్నప్పుడు, ఆ స్వేచ్ఛా స్థితిలో మీరు పారవశ్యాన్ని
అనుభవిస్తారు..)
Copper Leaf: 86-1 Volume
1-417
Excellent explanations!!
ReplyDeleteA great keertana indeed. Only a realized sage can say this.
ReplyDeleteSahaja samadhi as explained by Bhagavan Ramana throws more light on the state of 'sahajana urakunna'.
అద్భుతమైన కీర్తన! మానవుడు ప్రాపంచిక విషయాలపై వెంపర్లాడుతూ పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ, విశ్లేషణ చేస్తూ ఉన్న కారణంగా మానసిక ఆశాంతికి, ఘర్షణకి తనకు తానే కారణమగుచున్నాడు.తన సహజస్థితి అంటే అవికారమైన,నిర్మలమైన,స్వేచ్ఛాయుతమైన చిత్తస్థితిని కోల్పోయి,కృత్రిమమైన అట్టి స్థితిని కొని తెచ్చుకొంటున్నాడు.ఆనందమయం,పరమ సుఖదాయకం అయిన తన సహజ స్థితి నుంచి కృత్రిమము,దుఃఖదాయకము,బంధకారకము అయిన
ReplyDeleteస్థితిని తనకు తానే ఆహ్వానించుకొని సంసార పంకిలంలో కొట్టుమిట్టాడుచున్నాడు.అంతఃకరణములపై నియంత్రణను కఠినమైన సాధన ద్వారా సాధించి, శ్రీనివాసునికి దాసుడవై,అంతులేని ఆనందపారవశ్యమును, అలౌకిక స్థితిని చేరుకొన వచ్చునని అన్నమాచార్యుల వారీ కీర్తనలో మానవాళికి పరమార్థమును, పారమార్థిక స్థితిని చేరుకొనే మార్గమును చూపిస్తున్నాడు. 🙏
కృష్ణ మోహన్ పసుమర్తి
ReplyDeleteవిశాఖపట్నం
ఓంశ్రీసాయినాధాయనమః అద్భుతమైన అన్నమాచార్య కీర్తన. ఒక గ్రంధమును పలుసార్లు అదే ఆశక్తితో చదవాలి అంటే ఆగ్రంధ పఠనము ప్రేమాస్పదమయినపుడు సద్గురువు లేదా భగవంతుని కృప తోడయి నపుడు మాత్రమే సఫలీకృతమగును. This is what Sadguru Sai asked Kusa Bhavu to read Sri Gurucharitra 108 times. Amazing story i learnt from Ekkirala Bharadwajas books.
ReplyDeleteExcellent explanation . Keep it up.
ReplyDelete