Thursday, 9 June 2022

126 నారాయణాచ్యుతానంత గోవింద హరి (nArAyaNAchyutAnaMta gOviMda hari)

 

ANNAMACHARYA

126 నారాయణాచ్యుతానంత గోవింద హరి

(nArAyaNAchyutAnaMta gOviMda hari)

Introduction: Annamacharya juxtaposed many issues in this ostensibly simple poem; as happens in real life, making it difficult to unravel the mystery. We may think we understand at first, but as we get deeper into it, we realise we are completely lost.

There is no specific message in this poem. The sentences are incomplete, and the meaning can be interpreted as one may wish. This poem is used to demonstrate how our mind constructs the rest to suit its disposition. This is exactly how we live our lives. As a result, this poem is a true reflection of man's mental state.

ఉపోద్ఘాతము:  న్నమాచార్యులు సరళముగా కనిపించే ఈ కీర్తనలో,   నిజజీవితంలో జరుగునట్లుగా భిన్న విషయాలను ఒకదాని ప్రక్కనొకటి చేర్చి ఉద్దేశమును విప్పడం కష్టతరం చేసిరి. మొదట్లో మనకు అర్థమై౦దని అనిపించినా, ముందుకెళ్ళబోయి, అంతలోనే మన౦ దారి తప్పిపోయామని గ్రహిస్తా౦.

ఈ కవితలో నిర్దిష్ట సందేశమేమీ లేదు. వాక్యాలు అసంపూర్ణంగా ఉన్నాయి. కోరుకున్న విధంగా అర్థం అన్వయించుకోవచ్చు. మన మనస్సు తన స్వభావానికి అనుగుణంగా మిగిలిన వాటిని ఎలా ఊహిస్తుందో ప్రదర్శించడానికి ఈ కీర్తన ఉపయోగబడుతుంది. మనం సరిగ్గా ఇలాగే జీవిస్తాం. తత్ఫలితంగా, ఈ కీర్తన మనిషి యొక్క మానసిక స్థితికి సహజమైన ప్రతిబింబం.

కీర్తన:

నారాయణాచ్యుతానంత గోవింద హరి

సారముగ నీకు నే శరణంటినే              ॥పల్లవి॥ 

చలవయును వేఁడియును సటలసంసారంబు

తొలఁకు సుఖ మొకవేళ దుఃఖ మొకవేళ
ఫలము లివె యీరెండుఁ బాపములు పుణ్యములు
పులుసుఁ దీపునుఁ గలపి భుజియించినట్లు ॥నారా॥ 

పగలురాత్రులరీతి బహుజన్మమరణాలు

తగుమేను పొడచూపు తనుఁ దానె తొలఁగు
నగియించు నొకవేళ నలఁగించు నొకవేళ
వొగరుఁ గారపువిడె ముబ్బించినట్లు ॥నారా॥ 

ఇహముఁ బరమునువలెనె యెదిటికల్లయు నిజము

విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని
సహజ శ్రీవేంకటేశ్వర నన్నుఁ గరుణించి
బహువిధంబుల నన్నుఁ బాలించవే ॥నారా॥

 

nArAyaNAchyutAnaMta gOviMda hari

sAramuga nIku nE SaraNaMTinE pallavi 

chalavayunu vEDiyunu saTalasaMsAraMbu

tolaku sukha mokavELa dukha mokavELa
phalamu live yIreMDu bApamulu puNyamulu
pulusu dIpunu galapi bhujiyiMchinaTlu nArA 

pagalurAtrularIti bahujanmamaraNAlu

tagumEnu poDachUpu tanu dAne tolagu
nagiyiMchu nokavELa nalagiMchu nokavELa
vogaru gArapuviDe mubbiMchinaTlu nArA 

ihamu baramunuvalene yediTikallayu nijamu

vihariMchu bhrAMtiyunu vibhrAMtiyunu matini
sahaja SrIvEMkaTESvara nannu garuNiMchi
bahuvidhaMbula nannu bAliMchavE nArA

 

Details and Explanations:

నారాయణాచ్యుతానంత గోవింద హరి

సారముగ నీకు నే శరణంటినే     ॥పల్లవి॥

 

nArAyaNAchyutAnaMta gOviMda hari

sAramuga nIku nE SaraNaMTinE pallavi 

Word to Word meaning: నారాయణాచ్యుతానంత (nArAyaNAchyutAnaMta) = నారాయణ, అచ్యుత, అనంతా; nArAyaNA Achyuta AnaMta; గోవింద (gOviMda) = GOviMda; హరి (hari) = Hari; సారముగ (sAramuga) = completely, effectively, totally; నీకు (nIku) = to You; నే (nE) = I; శరణంటినే (SaraNaMTinE) = submitted. 

Literal meaning: NArAyaNA Achyuta AnaMta, GOviMda, Hari I have completely, effectively, totally submitted to You. 

Literal meaning: See the explanation for the third stanza. 

భావము: నారాయణ అచ్యుత అనంతా గోవిందా హరి సారముగా (సంపూర్ణముగా) నీకు నే శరణంటినే

వివరణము: మూడవ చరణం వివరణ చూడండి.

చలవయును వేఁడియును సటలసంసారంబు

తొలఁకు సుఖ మొకవేళ దుఃఖ మొకవేళ

ఫలము లివె యీరెండుఁ బాపములు పుణ్యములు

పులుసుఁ దీపునుఁ గలపి భుజియించినట్లు ॥నారా॥

 

chalavayunu vEDiyunu saTalasaMsAraMbu

tolaku sukha mokavELa dukha mokavELa

phalamu live yIreMDu bApamulu puNyamulu

pulusu dIpunu galapi bhujiyiMchinaTlu nArA

 

Word to Word meaning: చలవయును (chalavayunu) = cooling or comfortable;  వేఁడియును (vEDiyunu) = hot or uncomfortable; సటలసంసారంబు (saTalasaMsAraMbu) = సళుపు, వేదన, సంతాపములతో కూడిన సంసారము, this life (or world) with distress, pain and sorrow;  తొలఁకు (tolaku) = అతిశయించు, ప్రకాశించు, shine,  సుఖ (sukha) = comforting, pleasing; మొకవేళ (mokavELa) = at one time; దుఃఖ (dukha) = sorrow, grief;  మొకవేళ (mokavELa) = at one time; ఫలము (phalamu)= fruits;  లివె (live) = these; యీరెండుఁ (yIreMDu) = two బాపములు (bApamulu) = sins;  పుణ్యములు (puNyamulu) = virtues; పులుసుఁ (pulusu) =sour; దీపునుఁ (dIpunu) = sweet; గలపి (galapi) = mixing; భుజియించినట్లు (bhujiyiMchinaTlu) = like consuming; 

Literal meaning: This life (or world) of hardship, pain, and sadness feels comfortable at times and uncomfortable at other instances. When a person is pursuing two fruits, virtue and sin, it's like eating sour and sweet at the same time. (In the run for virtue and sin, man gets distorted and tired).

Explanation: Annamcahrya compared the life in this world as: jamunOrilO braduku saMsAramu chUDa#1/ chamuru dIsina divve saMsAramu / samayiMchu benudevulu saMsAramu chUDa / samaraMbulO saMsAramu (జమునోరిలో బ్రదుకు సంసారము చూడ / చమురు దీసిన దివ్వె సంసారము / సమయించుఁ బెనుదెవులు సంసారము చూడ / సమరంబులో నునికి సంసారము) = this family life is similar living inside the mouth of death god (meaning any time one can lose his life). You may take that life is parallel to a burning wick without oil. (Will get extinguished sooner than you expect!. A family man does not know what trouble will fall upon him). You are left with same time as a man suffering a terminal disease. (Meaning you have very little time left).  Life has ever been similar to living in active war zone. (Meaning anytime a calamity could fall on your head in a war zone.

In such short life, we try to pursue both virtue (because we are told it is good) and the sin because we love it. This is what Annamacharya is denouncing. Donot pursue something without understanding. valenanE dokamATa valadanE dokamATa / silugulI reMTikini chittamE guriYaUnu#2 (వలెననేదొకమాట వలదనేదొకమాట / సిలుగులీ రెంటికిని చిత్తమే గురియౌను) = One word is "Yes". Another is "No". The mind gets torn between these opposites Yes and No. Therefore, man continues in dual mode. 

Implied meaning: Oh, my goodness! Don't make the mistake of trying to acquire the best of both worlds. It's as if you're eating both sour and sweet at the same time.

భావము: సళుపు, వేదన, సంతాపములతో కూడిన సంసారములో సుఖ మొకవేళ దుఃఖ మొకవేళ కలుగుచున్నట్లు,  పాపపుణ్యముల వెంటబడు ఈ బ్రతుకు పుల్లని పులుసు, తీపి కలిపి భుజియించినట్లు. (పాపపుణ్యముల పరుగులాటలో నలిగి, అలసిపోవు అజ్ఞాని మానవుడు)

వివరణము: అన్నమాచార్యుడు లోకంలోని జీవితాన్ని ఇలా పోల్చాడు: జమునోరిలో బ్రదుకు సంసారము చూడ#1 / చమురు దీసిన దివ్వె సంసారము / సమయించుఁ బెనుదెవులు సంసారము చూడ / సమరంబులో నునికి సంసారము = భావము: సంసారము యముని నోటిలో బ్రదుకు వంటిది. తననోట జీవించువానిని యముడు క్షణమునందైన కబళింపవచ్చును. అట్లే సంసారమున నున్నవాడు ఎప్పుడైన ప్రమాదమునకు గురికావచ్చును. సంసారము చమురుదీసిన వత్తి వంటిది. దీపము చక్కగా వెలుగక ఆరిపోవుటకు సిద్ధముగానున్నట్లే. సంసారి సుఖస్థితి నొందక మృత్యుముఖమున బడుటకు సిద్ధముగా నుండును. సంసారము మందు లేని రోగము వంటిది. దినదినమునకు క్షీణింపజేసి చివరకు ప్రాణము దీయును. సంసారము గూడ జీవుని శమదమాది గుణములను హరించి స్వాతంత్ర్యహీనుని జేసి చివరకు మృత్యుముఖమున బడద్రోయును. సంసారము యుద్ధ భూమిలో  ఇల్లు వంటిది. రణరంగమున నున్నవాడు నలువైపులా శత్రువులచే ముట్టడింపబడి దెబ్బలు తినుచూనే ఉండును.

అలా౦టి స్వల్ప జీవిత౦లో, పుణ్యాలను (అవి మ౦చివని మనకు నూరిపోసినందువల్ల) మరియు పాపాలను (అవి మనకు ఇష్టం కాబట్టి) రె౦డూ పొ౦దడానికి ప్రయత్నిస్తా౦. అన్నమాచార్యులు ఖండిస్తున్నది ఇదే. అర్థం చేసుకోకుండా దేనినైనా వెంబడించవద్దు. వలెననేదొకమాట వలదనేదొకమాట / సిలుగులీ రెంటికిని చిత్తమే గురియౌను#2  (= వలెననేదొకమాట (YES). వలదనేదొకమాట (NO). సిలుగులు (కష్టములంటే) రెంటికి మధ్య ఈ భిన్నముల మధ్య మనస్సు నలిగిపోవడమే.) అందువలన మనిషి ద్వంద్వావస్థలో ఉండిపోతాడు.

అన్వయార్ధము: అయ్యో అవివేకీ! రెండు చేతులతో రెంటినీ పొందడానికి ప్రయత్నించ వద్దు. అది  పులుపు, తీపులను రెండింటినీ కలిపి తింటున్నట్లుగా అసమంజసమైనది.

పగలురాత్రులరీతి బహుజన్మమరణాలు

తగుమేను పొడచూపు తనుఁ దానె తొలఁగు

నగియించు నొకవేళ నలఁగించు నొకవేళ

వొగరుఁ గారపువిడె ముబ్బించినట్లు ॥నారా॥

 

pagalurAtrularIti bahujanmamaraNAlu

tagumEnu poDachUpu tanu dAne tolagu

nagiyiMchu nokavELa nalagiMchu nokavELa

vogaru gArapuviDe mubbiMchinaTlu nArA

 

Word to Word meaning: పగలురాత్రులరీతి (pagalurAtrularIti) = like the cycle of day and night; బహుజన్మమరణాలు (bahujanmamaraNAlu) = many births and deaths; తగుమేను (tagumEnu) = suitably in the body; పొడచూపు (poDachUpu) to appear, to become visible;  తనుఁ దానె (tanu dAne) = that by itself; తొలఁగు (tolagu) = disappear, step aside, recede;  నగియించు (nagiyiMchu) = make one happy; నొకవేళ (nokavELa) = at a time; నలఁగించు (nalagiMchu) = make one grieve; నొకవేళ (nokavELa) = at a time; వొగరుఁ (vogaru) = acrid, bitter; గారపు (gArapu) = pungent, hot to taste;  విడె ముబ్బించినట్లు (viDe mubbiMchinaTlu) = like consuming a Tambulam (mainly consisting of beetle nut and leaf) 

Literal meaning: Like the cycle of day and night, many births and deaths appear (become visible) in the body and recede by themselves. At one time it makes person Happy and at other times grieve. Its like consuming acrid and hot Tambulam at the same time. 

Explanation: Annamacharya warning that this tasteless insipid life we are living remains same unless special efforts are made.  To understand the statement bahujanmamaraNAlu tagumEnu poDachUpu (బహుజన్మమరణాలు తగుమేను పొడచూపు = many births and deaths appear in the body like the cycle of day and night). Let me present a Bhagavad-Gita poem. बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन / तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप (4-5) bahūni me vyatītāni janmāni tava chārjuna / tānyahaṁ veda sarvāṇi na tvaṁ vettha parantapa Purport: O Arjun Both you and I have had many births,. You have forgotten them, while I remember them all. 

Let us recollect that Annamacharya is not a philosopher. He is presenting what he could feel in that meditative state. These words came out of his mind as an expression of his state of mind. 

A statement like ‘many births’ is a secondary or tertiary knowledge for us. For the liberated, it’s a first-hand knowledge. Jiddu Krishnamurti also stated various layers of past existence. Their statements are merely indicating to the practitioner that he has to break the cycle to reach God. It serves no purpose to derive vicarious satisfaction that “I was a king” and remain sheepishly happy. 

Sir, we are so insensitive that we watch news, most often while consuming food or drink. The News generally is on certain tragic incidents in some part of the world. While the person screams, we consume food. Same way the statement of breaking the cycle may appear trivial and inconsequential, kindly remember in the history of mankind very few like Annamacharya, Jiddu Krishnamurti did it. Therefore, it’s an important and landmark statement.

These feelings (even birth and death) recede on their own.  Annamacharya often considered body is like a thermometer indicating presence of life. Sir, what do we use this instrument for? Aren’t our actions, beyond its very purpose are ignorant actions? Do you use a thermometer to drive a nail?

The serious reader might have noted that the meaning of this stanza is entirely different from the simple wording.  Annamacharya is merely stating that you remain an observer of this being with its conscious as well unconscious feelings, not assume the ownership of this body.

Implied meaning: Rise from the ignorance. O man! Break this monotonous and oblivious cycle.

భావము: పగలు మరియు రాత్రి యను ఆవృత్తి (చక్రము) వలె అనేక జననాలు మరియు మరణాలు శరీరంలో తగిన విధంగా అగపడి వాటంతట అవే వెనక్కి మళ్ళుతాయి. ఇది కొన్ని సమయాల్లో (వ్యక్తికి) సంతోషాన్ని మరియు ఇతర సమయాల్లో దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది ఒకే సమయంలో వగరు, కారము కలిపిన తాంబులం తినడం లాంటిది.

 

వివరణము: స్వాదమెరుగని అవివేక జీవితం ప్రత్యేక ప్రయత్నము లేకఎప్పటికీ మారదని అన్నమచార్యులు హెచ్చరిస్తున్నారు. “బహుజన్మమరణాలు తగుమేను పొడచూపు” అన్నది అర్ధము చేసుకోవడానికి ముందుగా ఈ భగవద్గీత శ్లోకాన్ని చూడండి. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున  తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప (4-5) భావము:  అర్జునా నీకును, నాకును ఇంతవరకనేక  జన్మలు గడచినవి. వాటినన్నింటినీ నేనె నెఱుంగుదును​. నీవెఱంగవు.

అన్నమాచార్యులు తత్త్వవేత్త కాడని గుర్తుంచుకోవాలి. ఆ సమాధి స్థితిలో తాను అనుభూతి చెందినదాన్ని వ్యక్తపరచుచున్నాడు. ఈ మాటలు అతని మానసిక స్థితి యొక్క వ్యక్తీకరణగా అతని మనస్సు నుండి బయటకు వచ్చాయి అనుకోవచ్చు.

ఇటువంటి (అనేక జననాలు..) ప్రకటన మనకు పరోక్ష జ్ఞానం. విముక్తులకు, ఇది ప్రత్యక్ష జ్ఞానం. జిడ్డు కృష్ణమూర్తి కూడా గత ఉనికి యొక్క వివిధ పొరలున్నట్లు పేర్కొన్నారు. వారి ప్రకటనలు భగవంతుణ్ణి చేరుకోవడానికి జనన మరణాలవిష వలయాన్ని విచ్ఛిన్నం చేయవలసి ఉందని అభ్యాసకుడికి సూచిస్తున్నాయి కానీ "నేను గత జన్మలో రాజుననే" శుష్కానందము పొంది ప్రయోజనం లేదు.

భావాలు (పుట్టుక కూడా) వాటంతట అవే అణగిపోతాయి.  అన్నమాచార్యులు శరీరం ఒక థర్మామీటర్ వంటి పరికరం అని భావించారు. అది జీవం యొక్క ఉనికిని సూచిస్తుంది. దాని ప్రయోజనానికి వ్యతిరేకముగా దానిని ఉపయోగించితే అవి అజ్ఞానపు చర్యలు కావా? మేకును కొట్టడనికి మీరు థర్మామీటర్ ఉపయోగిస్తారా?

మనము చాలా మొద్దువారము. సాధారణంగా ఆహారం లేదా పానీయం తీసుకునేటప్పుడు వార్తలు చూస్తాము. వార్తలు తరచుగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో నెలకొన్న విషాద సంఘటనలపై ఉంటుంది. వ్యక్తి ఆక్రందనలను వింటూ ఆహారాన్ని తీసుకుంటాము. అందువల్ల, చాలామందికి జనన మరణాలచక్రాన్ని విచ్ఛిన్నం చేసే ప్రకటన అల్పమైనదిగాను, నిష్ప్రయోజనంగాను కనిపించవచ్చును. మానవజాతి చరిత్రలో అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి అతికొద్దిమంది మాత్రమే స్థితికి చేరగలిగారు. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోదగిన ప్రకటనయే.    

లోతుగా పరీక్షించే పాఠకులు చరణం యొక్క అర్థం, సరళమైన పదాలకు పూర్తిగా భిన్నమైనది అని గ్రహించుతారు.  అన్నమాచార్యులు మానవుడు జన్మకు శరీరానికి యజమానిగా కాకుండా కేవలం పరిశీలకుడిగా ఉండి, దాని చేతనాచేతన భావాలను గమనించుతూ ఉండమంటున్నారు. 

అన్వయార్ధము: ఓ మానవుడా మేలుకో.  ఏకధాటిగా నడచుచున్న ఈ విస్మృతి వలయాన్ని విచ్ఛిన్నం చేయి.

 

ఇహముఁ బరమునువలెనె యెదిటికల్లయు నిజము

విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని

సహజ శ్రీవేంకటేశ్వర నన్నుఁ గరుణించి

బహువిధంబుల నన్నుఁ బాలించవే ॥నారా॥

 

ihamu baramunuvalene yediTikallayu nijamu

vihariMchu bhrAMtiyunu vibhrAMtiyunu matini

sahaja SrIvEMkaTESvara nannu garuNiMchi

bahuvidhaMbula nannu bAliMchavE nArA

 

Word to Word meaning: ఇహముఁ (ihamu) = this world; బరమును (baramunu) = the other world; వలెనె (valene) = like; యెదిటి (yediTi) = the one present before; కల్లయు (kallayu) = lie, untrue, false; నిజము (nijamu) = truth; విహరించు (vihariMchu) = roaming, wandering, moving; భ్రాంతియును (bhrAMtiyunu) = illusion; విభ్రాంతియును (vibhrAMtiyunu) = ఊహించనిది జరిగినప్పుడు కలిగే ఆశ్చర్యమును,    మతిని (matini) = in the mind; సహజ (sahaja) = natural; శ్రీవేంకటేశ్వర (SrIvEMkaTESvara) = lord Venkateswara;  నన్నుఁ (nannu) = me; గరుణించి (garuNiMchi) = by blessing;  బహువిధంబుల (bahuvidhaMbula) = in many ways; నన్నుఁ (nannu) = me; బాలించవే (bAliMchavE) = rule.

 

Literal meaning: We are unable to determine the one present before us is this world or the other world due to illusion created wavering mind. I am pleasantly surprised O Lord! I shall allow the Nature to rule my heart whatever ways deem fit. 

Explanation: Annamacharya declared many times before, that there are no two worlds#3. Whatever is; this world that exists. Nothing else.  It’s our perception or aberration that there is some other world where we go after liberation. Let me quote from Bhagavatam (3rd Chapter) 

When his mother Devahuti inquired about achieving mukti (freedom), the Lord in the form of Kapila replied, "Mukti and moksha are desires, but the saints are content to remember God without desire, to discuss his glories with one another, and to offer whatever they are to God. This is the practised devotion...! ". 

As a result, we learn that Bhakti (devotion), Mukti (freedom), and Moksha (liberation) are all synonymous. Now see the connect with the Pallavi (chorus) that says "full, effective, and entire (100%) submission." Why do we seek God without such devotion? Who are we attempting to deceive? 

Hence the wording yediTikallayu nijamu / vihariMchu bhrAMtiyunu vibhrAMtiyunu matini (యెదిటికల్లయు నిజము / విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని)   states that Do you know what is in front of you? #4  When we remove all the layers of ignorance, whatever we see is the truth. Let me repeat the statement of Sherlock Holmes “when you have eliminated the impossible, whatever remains, however improbable, must be the truth? (In the book The Sign of the Four). 

As a result, Sir, we realise that this Annamacharya is simply impossible. He is not requesting that you be religious. He simply wonders if we can look at the world without all of our preconceived notions, visual and perceptual distortions. 

It will not be out of context to include this quote from Shakespeare’s Hamlet “There is nothing either good or bad, but thinking makes it so” (from Act II, Scene 2). Therefore, its for the man to act prudently. 

I shall take up discussion on word సహజ (natural) in later verses. 

Implied meaning: O Man! Can you find what is in front of you without an iota of doubt?  O God! Into such a natural state let the man be delivered. 

భావము: ఇహము(నిజము) పరము (కల్ల / ఊహ) అను భ్రాంతిలో కొట్టుకొని పోకుండా, సహజ స్థితి నుండి, నీ కనుల ముందరనున్న ప్రపంచాన్ని చూడు. ప్రభూ! శ్రీవేంకటేశ్వర నన్నుఁ గరుణించి బహువిధంబుల నన్నుఁ బాలించవే.

 

వివరణము: అన్నమాచార్యులు ఇంతకు ముందు చాలాసార్లు రెండు లోకాలు లేవని ప్రకటించాడు. ఏది ఉన్నా; ఉనికిలో ఉన్న ప్రపంచమే. మరేదీ లేదు. పరము వేరొకచోటఁ బాఁతి యున్నదా?#3 అని ప్రశ్నించాడు. భాగవతం (తృతీయ స్కంధము) నుండి యీ సంభాషణ చూడండి.

ఏ విధంగా ముక్తి శ్రీ లభిస్తుందో తెలియ చేయుమని తన తల్లి దేవహూతి ప్రశ్నింపగా కపిలుని రూపములోని విష్ణువు - “ముక్తి, మోక్షం ఇవి ఒక కోరికను తెలిపే విషయాలు కాని మహాత్ములైన వారు ఏ కోరికా లేకుండా నన్ను స్మరిస్తూ నా మహిమలను పరస్పరం చర్చించుకుంటూ తమ సర్వస్వాన్నీ నాకే సమర్పించి సంతోషంతో ఉంటారు. ఇది అమలిన భక్తి...!" అని వివరిస్తాడు.

. అమలినభక్తిఁ గొందఱు మహాత్ములు మచ్చరణారవింద యు

గ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై యితరేత రానులా
పముల మదీయ దివ్యతనుపౌరుషముల్ కొనియాడుచుండి మో
క్షము మదిఁ గోర నొల్ల రనిశంబు మదర్పిత సర్వకర్ములై. (3-878) 

పైన దానిని అన్వయించుకుంటే, భక్తి, ముక్తి (స్వేచ్ఛ), మోక్షం  అన్నీ పర్యాయపదాలు అని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు పల్లవిని మరోసారి చదవండి. అది "పూర్తి, ప్రభావవంతమైన మరియు సంపూర్ణ (100%) సమర్పణ" అని చెబుతుంది. అలాంటి భక్తి లేకుండా మనం భగవంతుణ్ణి ఎందుకు అన్వేషిస్తాం? మనం ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాం? 

“యెదిటికల్లయు నిజము / విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని”   అనే పదముల అల్లికకు అర్ధము “మీ ముందు ఏముందో మీకు తెలుసా?#4  అజ్ఞానపు పొరలను తొలగించినప్పుడు కదా! సత్యమును వీక్షించుట​​. షెర్లాక్ హోమ్స్ (ది సైన్ ఆఫ్ ది ఫోర్) అనే పుస్తకంలోఇలా అంటాడు "మీరు అసాధ్యాన్ని తొలగించినప్పుడు, ఏది మిగిలి ఉన్నా, అదెంత యుక్తివిరుద్ధమైనా, అసంభావ్యమైనా, అతర్కితమైనా, నిజం అయి ఉండాలి."

దీన్నిబట్టి, అయ్యా, అన్నమాచార్యులు అసాధ్యమైనది అడుగుచున్నారని ఇట్టే గ్రహిస్తాము. ‘మతములు, నమ్మకములకు అతీతంగా ఊహలు, దృశ్య, గ్రహణాత్మక వక్రీకరణలు లేకుండా ప్రపంచాన్ని మనం చూడగలమా?’ అని అతడు మానవులందరినీ అభ్యర్ధిస్తున్నాడు. 

సందర్భోచితముగా ఉంటుందని షేక్స్పియర్ గారి హామ్లెట్ నుండి ఈ ప్రకటనను జతపరుస్తున్నాను "ప్రపంచంలో ప్రత్యేకంగా మంచి లేదా చెడు అంటూ ఏమీ లేదు, కానీ మన ఆలోచన అలా అనిపింప చేస్తుంది" (యాక్ట్ 2, సీన్ 2) 

తరువాయి కీర్తనలలో సహజమను విషయంపై చర్చిద్దాం.

 

అన్వయార్ధము: నరుడా! సందేహాలకు తావు లేకుండా నీ ముందు ఉన్నదాన్ని నీవు కనుగొనగలవా?  ఓ దేవా! అటువంటి సహజ స్థితిలో మనిషిని వర్తించనీ.

 

References and Recommendations for further reading:

#1 44 సడిబెట్టెఁ గటకటా సంసారము (saDibeTTe gaTakaTA saMsAramu)

#2 4. ఇన్ని చదవనేల (inni chaduvanEla)

#3 60. పరము వేరొకచోటఁ బాఁతి యున్నదా (paramu vErokachOTa bAti yunnadA)

#4 96. ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే (eduTa nevvaru lEru yiMtA vishNumayamE)

Summary of this Keertana:

 

NArAyaNA Achyuta AnaMta, GOviMda, Hari I have completely, effectively, totally submitted to You.

 

This life (or world) of hardship, pain, and sadness feels comfortable at times and uncomfortable at other instances. When a person is pursuing two fruits, virtue and sin, it's like eating sour and sweet at the same time. (In the run for virtue and sin, man gets distorted and tired). Implied meaning: Oh, my goodness! Don't make the mistake of trying to acquire the best of both worlds. It's as if you're eating both sour and sweet at the same time.

 

Like the cycle of day and night, many births and deaths appear (become visible) in the body and recede by themselves. At one time it makes person Happy and at other times grieve. Its like consuming acrid and hot Tambulam at the same time. Implied meaning: Rise from the ignorance. O man! Break this monotonous and oblivious cycle.

 

We are unable to determine the one present before us is this world or the other world due to illusion created wavering mind. I am pleasantly surprised O Lord! I shall allow the Nature to rule my heart whatever ways deem fit. Implied meaning: O Man! Can you find what is in front of you without an iota of doubt?  O God! Into such a natural state let the man be delivered.


 

కీర్తన సంగ్రహ భావము:

నారాయణ అచ్యుత అనంతా గోవిందా హరి సారముగా (సంపూర్ణముగా) నీకు నే శరణంటినే.

సళుపు, వేదన, సంతాపములతో కూడిన సంసారములో సుఖ మొకవేళ దుఃఖ మొకవేళ కలుగుచున్నట్లు,  పాపపుణ్యముల వెంటబడు ఈ బ్రతుకు పుల్లని పులుసు, తీపి కలిపి భుజియించినట్లు. (పాపపుణ్యముల పరుగులాటలో నలిగి, అలసిపోవు అజ్ఞాని మానవుడు) అన్వయార్ధము: అయ్యో అవివేకీ! రెండు చేతులతో రెంటినీ పొందడానికి ప్రయత్నించ వద్దు. అది  పులుపు, తీపులను రెండింటినీ కలిపి తింటున్నట్లుగా అసమంజసమైనది.

 

పగలు మరియు రాత్రి యను ఆవృత్తి (చక్రము) వలె అనేక జననాలు మరియు మరణాలు శరీరంలో తగిన విధంగా అగపడి వాటంతట అవే వెనక్కి మళ్ళుతాయి. ఇది కొన్ని సమయాల్లో (వ్యక్తికి) సంతోషాన్ని మరియు ఇతర సమయాల్లో దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది ఒకే సమయంలో వగరు, కారము కలిపిన తాంబులం తినడం లాంటిది. అన్వయార్ధము: ఓ మానవుడా మేలుకో.  ఏకధాటిగా నడచుచున్న ఈ విస్మృతి వలయాన్ని విచ్ఛిన్నం చేయి.

ఇహము(నిజము) పరము (కల్ల / ఊహ) అను భ్రాంతిలో కొట్టుకొని పోకుండా, సహజ స్థితి నుండి, నీ కనుల ముందరనున్న ప్రపంచాన్ని చూడు. ప్రభూ! శ్రీవేంకటేశ్వర నన్నుఁ గరుణించి బహువిధంబుల నన్నుఁ బాలించవే. అన్వయార్ధము: నరుడా! సందేహాలకు తావు లేకుండా నీ ముందు ఉన్నదాన్ని నీవు కనుగొనగలవా?  ఓ దేవా! అటువంటి సహజ స్థితిలో మనిషిని వర్తించనీ.

 

 

Copper Leaf: 184-3;  Volume 2-423

6 comments:

  1. Wow! Great wisdom! Thank you for uncovering deeper meaning

    ReplyDelete
  2. Thank you for uncovering deeper meaning

    ReplyDelete
  3. Compare to first charanam 2nd one was explained very easily to understand.you brought out the meaning, what Annamacharya trying to convey to the people..yes it is very difficult to understand the meaning of ones life.keep it up

    ReplyDelete
  4. అన్వయార్ధము: ఓ మానవుడా మేలుకో. ఏకధాటిగా నడచుచున్న ఈ విస్మృతి వలయాన్ని విచ్ఛిన్నం చేయి.- ఇక్కడ మాత్రం వారి ఆలోచన భిన్నంగా ఉంటుంది. మానవుడు ఇలా స్వప్రయత్నం వల్ల చేసుకోలేడు. కేవలం భగవంతుడి నిర్హేతుక కృప వల్లే జరుగుతుంది అనుకుని అప్పటి వరకూ విరహంతో ఉన్న నాయికలాగా ఆయన గుణ గణాల్ని కీర్తిస్తూ భాగవత సేవ పేరుతో సమాజ సేవ చెయ్యడమే జీవుడి స్వరూపం. ఇది కూడా మోక్ష మార్గం కాదు. - Vishnu Vinjamuri

    ReplyDelete
    Replies
    1. Vishnu Garu,

      I am trying give the method by Annamacharya went about explaining the “appropriate thing” to do. See the below చరణం. Based on this I wrote the way I mentioned.
      చ|| పుట్టెడిదొకటే పోయెడిదొకటే
      తిట్టమై రెంటికిని దేహమే గురియౌను
      పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
      వొట్టి విజ్ఞానులకు వుప మిది వొకటే ||ఇన్ని||
      Literal meaning: Birth is one. Death is one. Body is subjected to these inevitable facts. Rebirth is doubtful. Death is certain. The learned that know there is only one path.


      Implied meaning:
      The material body is subjected to transformation from Birth to death. Death is certain, but not rebirth. Therefore the learned KNOWS THAT THERE IS ONLY A WAY i.e. to escape rebirth. (Such a person would want to avoid this vicious cycle of life and death). Verily, the learned can clearly see this truth.


      Comments: Annamacharya used the word ఒట్టి విజ్ఞానులు (voTTi vij~nAnu) to indicate pure, unaldultrated, disinterested viewer. Of course such persons are very rare. (Refer to books of Jiddu Krishnamurti, who also stressed most of his time on pure, unadulterated observation)

      I am open for discussion.

      For detailed text you may refer to the link: https://annamacharyapracticalphlosopher.blogspot.com/2020/12/annamacharya-4.html

      Delete
  5. సుఖదుఃఖమయమైన ఈ జీవితంలో పాపపుణ్యముల వెంబడి నీ ప్రయాణం అసమంజసమైన తీపి,పులుపుల మిశ్రమాహారమని ఎఱుగక అజ్ఞానంలో(భ్రమ)పడి అలసిపోయి సత్యాన్ని తెలిసికొనలేక జననమరణ చక్రభ్రమణములో కొట్టుకుపోకుండా అజ్ఞానమనే భ్రమను వీడి కంటికి ముందున్న
    నీ నిజస్వరూపమును గుర్తించి పరమాత్మ కృపకు పాత్రులు కమ్మని అన్నమయ్య ఈ కీర్తనలో మానవాళికి బోధ చేస్తున్నట్లుగా నాకనిపించుచున్నది.

    ఓం తత్ సత్

    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...