ANNAMACHARYA
128 ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవే
(innichEtalunu dEvuDichchinavE)
Introduction: Its
well known that choruses of Annamacharya are normally tough nuts to crack. The
easier they appear, the harder they are to comprehend. This one is a fine
example of simplest words creating widest gap in interpretation. The apparent meaning is created by the
innocent-looking freshly washed pearl-like letters. The other one hidden
behind, makes you sweat. When you arrive at it, still, you are not sure. The
meanings are as boundless as Annamacharya’s quest for truth.
He says only God will come to our rescue. I
doubt who will come to our rescue to decipher these black boxes?
ఉపోద్ఘాతము: సాధారణంగా అన్నమాచార్యుల పల్లవీలు కొరకరానికొయ్యలని
మనందరికీ తెలుసు. ఒక పట్టాన లొంగవు. అవి ఎంత
సరళంగా ఉంటాయో, వాటి అవగాహన కోసం అంత కష్టపడాలి. అమాయకంగా కనిపించే కడిగిన ముత్యాల్లాంటి
అక్షరాలు, అవి సృష్టించే అసలైన అర్ధాలు - ఒకటి వ్యక్తము, ఇంకొకటి అవ్యక్తము. ఏది సత్యమో
గ్రహించుట ఆయన తత్వాల లాగే అంతు చిక్కనివే.
ఈ కీర్తనలో దేవుడు మాత్రమే
మనల్ని రక్షించగలడని ఆయన చెప్పారు. అది నిజమో కాదో తెలియదు కానీ, ఈ పదాలు ధ్వనింపచేసే
మాయలనుంచి మనలను తప్పించుటకు ఎవరొస్తారో?
కీర్తన:
ఇన్నిచేఁతలును
దేవుఁడిచ్చినవే వున్నవారి
యీవులెల్ల నొద్దికయ్యీనా ॥ఇన్ని॥
తెగని యాపదలకు
దేవుఁడే కలఁడుగాక వగలుడుపఁ బరుల
వస మయ్యీనా
నొగిలి యితరలకు
నోళ్ళు దెరచిన
నగుఁబాటేకాక
మానఁగఁ బొయ్యీనా ॥ఇన్ని॥
అగ్గలపు దురితాలు
హరియే మానుపుఁ గాక బగ్గన నొక్కరు
వచ్చి పాపఁ బొయ్యేరా
తగ్గుముగ్గులైన
వేళ తలఁచినవారెల్ల
సిగ్గుఁబాటే
కాక తమ్ముఁ జేరవచ్చేరా ॥ఇన్ని॥
యెట్టు సేసినను
వేంకటేశుఁడే నేరుచుఁ గాక యిట్టే యేమడిగిన
నీతఁడే యొసఁగుఁ గాక
వుట్టిపడి
యెవ్వరైనా నూరడించేరా ॥ఇన్ని॥
|
innichEtalunu
dEvuDichchinavE vunnavAri yIvulella
noddikayyInA ॥inni॥
tegani yApadalaku dEvuDE
kalaDugAka vagaluDupa barula vasa
mayyInA
nogili yitaralaku nOLLu
derachina
nagubATEkAka mAnaga boyyInA ॥inni॥
aggalapu duritAlu hariyE
mAnupu gAka baggana nokkaru vachchi pApa
boyyErA
taggumuggulaina vELa talachinavArella
siggubATE kAka tammu
jEravachchErA ॥inni॥
yeTTu sEsinanu vEMkaTESuDE
nEruchu gAka yiTTE yEmaDigina nItaDE
yosagu gAka
vuTTipaDi yevvarainA
nUraDiMchErA ॥inni॥
|
[1] కడ + కడ = ‘కట్టకడ’.
ఇక్కడ అరసున్న విచార్యము. |
|
Details and Explanations:
ఇన్నిచేఁతలును
దేవుఁడిచ్చినవే
వున్నవారి
యీవులెల్ల నొద్దికయ్యీనా ॥ఇన్ని॥
innichEtalunu dEvuDichchinavE
vunnavAri yIvulella noddikayyInA ॥inni॥
Word to Word meaning: ఇన్నిచేఁతలును (innichEtalunu) = All these actions, deeds, arrangements; దేవుఁడిచ్చినవే (dEvuDichchinavE) = ప్రకృతి (దేవుఁడు) ఇచ్చినవే, are given / provided by Nature (God); వున్నవారి (vunnavAri) = those who are here in this world; యీవులెల్ల (yIvulella) = పారితోషికములెల్లా, బహుమానములెల్లా, All their honorary rewards, renumeration and gifts; నొద్దికయ్యీనా (noddikayyInA) = తోడ్పడునా, సాయపడునా, Are they of any use? are they of any support?
Literal meaning: Nature (God) is the source of all of these actions, works, and arrangements. Honours, remuneration, and gifts bestowed by people who live in this world, are of any value?
Explanation:
1. The term word ఇన్నిచేఁతలును (innichEtalunu) is encompasses the entirety of man's activity. These
are not isolated activities. It’s like, when we try to pull a creeper, often the
entire bush in which the creeper is entwined moves. Whether it's an old woman
sitting in a corner selling peanuts or the actions of heads of state that
affect millions, everything they do is linked. The entire interconnected world
can be viewed as a single collective consciousness
a.
When we get engaged in any activity,
expectation of reward is certainly implied. These rewards may be physical
rewards like gifts; renumeration, recognition in society. They also include
psychological rewards like satisfaction, coercion of hell, lure of heaven. That
is human nature.
b.
Who bestows (or confers) these
rewards? Evidently, Other humans. Therefore, Annamacharya is questioning vunnavAri yIvulella noddikayyInA వున్నవారి యీవులెల్ల
నొద్దికయ్యీనా Are they of any Value? Obviously
not. However, general perception is that a man who engages in profitless
activity is a fool.
2.
From Bhagavadgita 3-33 {सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि | प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति || 3-33||
sadṛiśhaṁ
cheṣhṭate svasyāḥ prakṛiter jñānavān api / prakṛitiṁ yānti bhūtāni nigrahaḥ kiṁ
kariṣhyati PURPORT: Even wise
people (worldly wise) act according to their natures; for all living beings are
propelled by their natural instincts. What will one gain by repression?} we may
infer that if a man tries to by repress all actions, such a man is still
working as per nature. Still, he shall receive a suitable reward.
3. This chorus implies more or less same as “Are you
here with a solution or are you part of the problem” (If you are not part of
the solution, you are part of the precipitate) - Leroy Eldridge Cleaver, USA.
Thus, the chorus implies that one must be (All Out) outsider to the present
activities going on in this planet. This is what Jiddu Krishnamurti said
very often. (Refer: 110. ముందరఁ
గలదని మోసపోతి నిదె#1 (muMdara galadani mOsapOti
nide.) Then implied meaning of the chorus could be as below:
Implied meaning 1: “O
man! Understand the activities that engage you are truly misleading. You shall choose
the path out of this activity”
Further Explanation:
1.
Further consider this saying
from Bhagava Gita कर्मण्यकर्म य: पश्येदकर्मणि च
कर्म य: | स बुद्धिमान्मनुष्येषु स युक्त:
कृत्स्नकर्मकृत् ||4-18|| karmaṇyakarma yaḥ paśhyed
akarmaṇi cha karma yaḥ / sa buddhimān manuṣhyeṣhu sa yuktaḥ kṛitsna-karma-kṛit
PURPORT: Those who see action in inaction
and inaction in action are truly wise amongst humans. Although performing all
kinds of actions, they are yogis and masters of all their actions.
a.
In what state a Man could
observe his actions? This is something to ponder. In our present state we may
think we are observing. But this is conditioned observation. Only when one is
neutral or equidistant from both action and reaction, i.e. one is really not
doing anything then one might.
b.
Reason for saying “one may” is
having roots in Bhagavad-Gita verse यततामपि
सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वत: yatatām api siddhānāṁ kaśhchin māṁ vetti tattvataḥ
(7-3) amongst those who have achieved
perfection, hardly one knows Me (GOD) in truth.
2. If you have determined the one who bestowed your life, then it is a blessing. Unfortunately, no one have the first-hand knowledge of who gave us life. Therefore, one has to put hard work to find that entity.
a.
Now Refer to the verse: చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి#2 chAla
novvi sEyunaTTi janmamEmi maraNamEmi = What is the use of living a life with
great effort; how is it different from death. Thus, we may conclude “The life
with all its hardships is not life at all”
b. Also deliberate on Annamacharya’s verse తహతహలిన్నిటికి
తానే మూలము గాన / సహజాన నూరకున్న సంతతము సుఖము#3 tahatahalinniTiki
tAnE mUlamu gAna / sahajAna nUrakunna saMtatamu sukham = Man is the root cause of all the flutter, agitation going on in his
mind and outside. Therefore, staying naturally quiet, equidistant from
accepting or rejecting the activities leads to perpetual comfort.
3. From the above 1 & 2 we get: one must be neutral or equidistant from both action and reaction, without effort.
4.
Though may appear incongruous, request
you to consider this biblical statement:
Matthew
16:24–26 (NKJV) “Then Jesus said to His disciples, ‘If anyone desires to come
after Me, let him deny himself, and take up his cross, and follow Me. For
whoever desires to save his life will lose it, but whoever loses his life for
My sake will find it. For what profit is it to a man if he gains the whole
world, and loses his own soul? Or what will a man give in exchange for his
soul? Thus, the implied meaning of this chorus is as below.
Implied meaning 2: O man! What use is of rewards? This Life is the
greatest blessing. For the beauty of this life lies in submitting to the one
who bestowed it.
భావము: మానవుడా! నీ వొనరించు చేష్టలన్నింటికీ ప్రకృతియే (భగవంతుడే)
మూలము. లోకులిచ్చే గౌరవాలు, జీతభత్యాలు, బహుమతులు ఏరకంగా తోడ్పడుతాయో?
వివరణము:
1.
ఇక్కడ ఇన్నిచేతలును అనే పదం మానవుని
సమస్త కార్యకలాపాలను సూచించుచున్నది. ఈ చేతలు
ఏవీ ఐకిక చర్యలు కావు. ఏకాకి కార్యకలాపాలు కావు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు; ఓ
మూల కూర్చొని వేరుశెనక్కాయ లమ్ముతున్న ముసలి అవ్వ ఐనా కానివ్వండి, కోటానుకోట్లను ప్రభావితంచేసే
దేశాధ్యక్షులు కానివ్వండి; వీరి చర్యలన్నీ ముడిపడినవే. పరస్పర ఆధారితమైన ప్రపంచంమంతా
ఒక సామూహిక చైతన్యమని భావించవచ్చు.
a.
మన౦ ఏదైనా పనిలో నిమగ్నమైనప్పుడు,
ఆశించినా, ఆశించకపోయినా ప్రతిఫలం వస్తుంది. ఈ బహుమతులు డబ్బు, ధనము, పేరు, పదవులు,
గౌరవము, సన్మానము వంటివి కావచ్చు. లేదా సంతృప్తి, నరకంలోని శిక్షల నుంచి తప్పించుకొనుటకు, స్వర్గసుఖాల
వంటి మానసిక ప్రతిఫలాలను పొందుటకు కూడా మానవుడు కార్యకలాపాలలో ఇరుక్కోవచ్చు.
ఇది మానవ నైజము.
b.
ఈ పారితోషికములను ఎవరిస్తారు (లేదా
ప్రదానం చేస్తారు)? స్పష్ట౦గా, ఇతర మానవులే. అందువలన (ఉన్నవారి యీవులెల్ల నొద్దికయ్యీనా?) వారిచ్చిన కానుకలు భగవంతుని చేరుటకు ఏమాత్రమైనా
ఉపయోగపడతాయా? అని అన్నమాచార్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే, లాభాపేక్షలేని కార్యకలాపాల్లో
నిమగ్నమైన వ్యక్తి మూర్ఖుడని సాధారణ అవగాహన.
2.
భగవద్గీత ౩-౩౩ {సదృశం చేష్టతే స్వస్యాః
ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥ ౩౩ ॥ వివేకవంతులు
(లోక జ్ఞానము కలిగినవారు) కూడా తమ ప్రకృతి స్వభావము నుసరించి ప్రవర్తించుచున్నారు.
అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగానే నడుచుకుంటాయి. కావున నిగ్రహమేమి
చేయగలదు?} చర్య లేదా ప్రతిచర్య పరస్పరం ఆధారపడి
ఉంటాయని గమనించవచ్చు. అందువలన ప్రకృతికి అనుగుణంగా పనిచేయడం లేదా దాని అణచివేతను ఒకటిగానే
పరిగణించవచ్చు. ఒక వ్యక్తి అన్ని చర్యలను అణచివేయడానికి ప్రయత్నిస్తే, అటువంటి వ్యక్తి
ఇంకా ప్రకృతి ప్రకారం పనిచేస్తున్నాడని మనం ఊహించవచ్చు. కాబట్టి, అతను తగిన ప్రతిఫలాన్ని
పొందుతాడు.
3.
ఈ పల్లవి లెరోయ్ ఎల్డ్రిడ్జ్ క్లీవర్, USA చెప్పినట్లు "మీరు ఒక పరిష్కారంతో ఇక్కడ ఉన్నారా లేదా మీరే సమస్యలో
భాగమా" లాంటి అర్ధమును తెలుపుతోంది. అందువలన, పల్లవి ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రస్తుత
కార్యకలాపాలకు (మొత్తానికే) వెలుపల ఉండాలని సూచిస్తుంది. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి
చాలా తరచుగా చెప్పారు. ('ముందరఁ గలదని మోసపోతి నిదె'#1 అనే కీర్తన చూడండి.) అప్పుడు పల్లవి యొక్కఅంతరార్థం క్రింది విధంగా ఉండవచ్చు:
అన్వయార్ధము 1: "ఓ మానవుడా!
నిన్ను మురిపించి నిమగ్నం చేసే కార్యకలాపాలన్నీ నిజంగా తప్పుదోవ పట్టించేవే! వీటి
నుంచి బయటపడు మార్గము ఎంచుకో"
అదనపు వివరణము:
1.
భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని పరిశీలించండి.
కర్మణ్యకర్మ యః పశ్యేత్
అకర్మణి చ కర్మ యః । స బుద్దిమాన్మనుశ్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ॥4-18॥ భావము:
ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో
నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనేవున్నా, వారు యోగులు మరియు వారి సమస్త
కర్మలను చేయువారు.
a.
ఆలోచించాల్సిన విషయమేమిటంటే మనిషి తన చర్యలను ఏ స్థితిలో నిష్పాక్షికంగా గమనించగలడు?
మన ప్రస్తుతం స్థితిలో మనం గమనిస్తున్నామని అనుకోవచ్చు. కానీ ఇదిస్థితివ్యాజము (స్థితి
లేదా పరిస్థితి కలిగించు భ్రమ) కల్పించు అసంబద్ధ పరిశీలన. ఒక వ్యక్తి చర్య మరియు
ప్రతిచర్యలకు తటస్థంగా లేదా సమాన దూరంలో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఒక వ్యక్తి నిజంగా
ఏమీ చేయనప్పుడు మాత్రమే, అటువంటి పరిశీలన సాధ్యపడవచ్చు.
b.
భగవద్గీతలోని ఈ ప్రకటననుసరించి
"యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం
వేత్తి తత్త్వతః ॥7-3॥ అలా పరిపూర్ణ సిద్ది సాధించిన
వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు" సాధ్యపడవచ్చు అని వ్రాశాను.
2.
మీకు జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తిని
మీరు నిర్ణయించ గలిగినట్లయితే, అది ఒక అదృష్టము, వరము. దురదృష్టవశాత్తు, జీవితాన్ని
ఎవరు అనుగ్రహించారనే దానిపై ఎవరికీ ప్రత్యక్ష జ్ఞానం లేదు. అందువల్ల, ఆ అస్థిత్వాన్ని
కనుగొనడానికి కష్టపడాలి.
a.
ఇప్పుడు ఈ పల్లవిని చూడండి: చాల నొవ్వి
సేయునట్టి జన్మమేమి మరణమేమి#2 {= గొప్ప శ్రమతో, కష్టములతో జీవితాన్ని
గడపడం వల్ల ఉపయోగం ఏమిటి? జన్మమనగానేమి? మరణమనగానేమి?}. ఆ విధ౦గా, మన౦ "అన్ని
కష్టములతో గడుపు జీవితము జీవనము కాదు" అనే ముగి౦పుకు రావచ్చు.
b.
అలాగే అన్నమాచార్యుల కీర్తన తహతహలిన్నిటికి
తానే మూలము గాన సహజాన నూరకున్న సంతతము సుఖము#3 కూడా ఈ సత్యమునే వివరించుచున్నది.
c.
పైవాటి నుండి చర్య మరియు ప్రతిచర్యలలో
ఏదానివైపు మొగ్గకుండా తటస్థంగా లేదా సమాన దూరంలో ఉండి శ్రమ లేకుండా సాగించునదే అసలైన
జీవనము అనుకోవచ్చు. కానీ జీవనము అనునది తెలియుట అంత సులభం కాదు.
3.
అసంబద్ధంగా కనిపించినప్పటికీ, ఈ బైబిలు
ప్రకటనను పరిగణనలోకి తీసుకోండి: అప్పుడు యేసు తన శిష్యులను చూచి “ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును
రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును; నా నిమిత్తమై
తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించు కొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును (ఆత్మను) పోగొట్టుకొంటే అతనికేమి
ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ఆత్మకు ప్రతిగా నేమి యియ్యగలడు?” (ముత్తయి 16:24-26).
అన్వయార్ధము 2: ఓ
నరుడా! గౌరవములు, ప్రతిఫలములెందుకో? ఈ జీవితమే గొప్ప సన్మానము. ఆ బహుమతి లోని
అందము, ఆనందము ఆ ప్రదాతకు సమర్పించుకోవడంలోనే వుంది! తక్కినవన్నీ
నిష్ప్రయోజనములే.
తెగని యాపదలకు
దేవుఁడే కలఁడుగాక
వగలుడుపఁ బరుల వస
మయ్యీనా
నొగిలి యితరలకు
నోళ్ళు దెరచిన
నగుఁబాటేకాక
మానఁగఁ బొయ్యీనా ॥ఇన్ని॥
tegani yApadalaku dEvuDE kalaDugAka
vagaluDupa barula vasa mayyInA
nogili yitaralaku nOLLu derachina
nagubATEkAka mAnaga boyyInA ॥inni॥
Word to
Word meaning: తెగని (tegani) = for never ending; యాపదలకు
(yApadalaku) =
troubles; దేవుఁడే (dEvuDE) = God only; కలఁడుగాక (kalaDugAka)
= available; వగలుడుపఁ (vagaluDupa) = to remove the
illusion; బరుల (barula) =
others; వస మయ్యీనా (vasa
mayyInA) = is it possible for them? నొగిలి (nogili) =
feeling the pain; యితరలకు (yitaralaku) others; నోళ్ళు
దెరచిన
(nOLLu derachina)
= open your mouth (to seek help); నగుఁబాటేకాక (nagubATEkAka)
= gives chance to ridicule, mockery; మానఁగఁ బొయ్యీనా (mAnaga
boyyInA) = does it remove trouble?
Literal
meaning: God
is there to help you with all of your problems. Is it possible for someone else
to take care of your problems? When you're in agony, approaching people opens
the door to criticism and mockery, yet the problem stays the same.
Explanation: Thus, this poem simply asking the practitioner
to remain subdued, silently bear the brunt of the hardship. Annamacharya propounded
independency at any cost. Almighty knows your condition. His silence is a
message for you.
భావము: మీ ఆపదలన్నింటిలో మీకు సహాయం చేయడానికి భగవంతుడు ఉన్నాడు. వాటిని
పరిష్కరించడం పరుల వశమయ్యేనా? పొరపాటున నోరు తెరిచి అడిగితే, సమస్య అలాగే ఉంటుంది పైగా
పరుల అపహాస్యానికి తలుపులు తెరిచినట్టే!
వివరణము: ఈ చరణం అభ్యాసకుడిని కేవలం అణిగి వుండమని కోరుతుంది. నిశ్శబ్దంగా
కష్టాల భారాన్ని భరించండి. అన్నమాచార్యులు ఎట్టిపరిస్థితుల్లోనూ స్వతంత్రతను కాపాడుకోవాలని
ప్రతిపాదించారు. మన పరిస్థితి సర్వశక్తిమంతుడికి తెలుసు. అతని నిశ్శబ్దం మనకు ఒక సందేశం.
అగ్గలపు దురితాలు
హరియే మానుపుఁ గాక
బగ్గన నొక్కరు
వచ్చి పాపఁ బొయ్యేరా
తగ్గుముగ్గులైన
వేళ తలఁచినవారెల్ల
సిగ్గుఁబాటే కాక
తమ్ముఁ జేరవచ్చేరా ॥ఇన్ని॥
aggalapu duritAlu hariyE mAnupu gAka
baggana nokkaru vachchi pApa boyyErA
taggumuggulaina vELa talachinavArella
siggubATE kAka tammu jEravachchErA ॥inni॥
Word to
Word meaning: అగ్గలపు (aggalapu) =
vehement, intolerable; దురితాలు (duritAlu) = పాపములు, sins,
హరియే
(hariyE)
= Lord SriHari; మానుపుఁ (mAnupu) = heal, cure: గాక (gAka)
= unless; బగ్గన (baggana)
= చాలా
(చక్కగా అనే అర్ధములో) much (see the connect with word pApa boyyErA); నొక్కరు
(nokkaru)
= someone; వచ్చి (vachchi) = stand besides; పాపఁ బొయ్యేరా (pApa
boyyErA) = సహాయము చెస్తారా? Give
support till the pain recedes? తగ్గుముగ్గులైన వేళ (taggumuggulaina
vELa)
= తక్కువయెక్కువల వేళ, హెచ్చుతగ్గుల వేళ (ముఖ్యముగా ధనము లేదా మానము కోలుపోయిన వేళ),
during lows and High (here it is meant when one lost his money or face) తలఁచినవారెల్ల (talachinavArella)
= whoever you anticipated to be dependable; సిగ్గుఁబాటే (siggubATE)
= put you to shame; కాక
(kAka)
= except, but; తమ్ముఁ (tammu) = you; జేరవచ్చేరా (jEravachchErA) = going
to shoulder your pain?
Literal
meaning: Overwhelming
sins can only be cured with Lord Srihari's assistance. No one else will step up
to lend a hand. In the hardships of life's highs and lows, those who you expect
to support, will embarrass you, but not carry the burden.
భావము: మితిమీరిన దురితాలు
శ్రీహరి సహాయంతో తప్ప ఎవ్వరో వచ్చి పాపఁ బొయ్యేరా? జీవితపు హెచ్చుతగ్గులను కష్టాలలో
నీవు తలఁచినవారెల్ల నిన్ను సిగ్గుమాలిన వాణ్ణి చేస్తారే కానీ మద్దతును భుజాన వేసుకోరే.
యెట్టు సేసినను
వేంకటేశుఁడే నేరుచుఁ గాక
కట్టఁగడవారెల్లఁ
గరుణించేరా
యిట్టే యేమడిగిన
నీతఁడే యొసఁగుఁ గాక
వుట్టిపడి
యెవ్వరైనా నూరడించేరా ॥ఇన్ని॥
yeTTu sEsinanu vEMkaTESuDE nEruchu gAka
kaTTagaDavArella garuNiMchErA
yiTTE yEmaDigina nItaDE yosagu gAka
vuTTipaDi yevvarainA nUraDiMchErA ॥inni॥
Word to
Word meaning: యెట్టు సేసినను (yeTTu sEsinanu)
= whatever way you do; వేంకటేశుఁడే
(vEMkaTESuDE)
= Lord Venkateswara; నేరుచుఁ
గాక (nEruchu
gAka) = సమర్థించును
గాక,
ఓపును
గాక, Support, accept; కట్టఁగడవారెల్లఁ (kaTTagaDavArella) = The last
ones (probably here meaning father or grandfather) గరుణించేరా (garuNiMchErA)
= Will they show mercy? Will they pardon you; యిట్టే (yiTTE)
= quickly; యేమడిగిన (yEmaDigina) =
whatever is desired; నీతఁడే (nItaDE) = this one alone; యొసఁగుఁ
గాక
(yosagu
gAka) = provides; వుట్టిపడి (vuTTipaDi) = ఆకస్మికముగా కలుగు,
be
manifested suddenly; యెవ్వరైనా
(yevvarainA) =
anyone; నూరడించేరా (nUraDiMchErA) = to
comfort, to console.
Literal
meaning: The
Lord Venkateswara accepts without condemning whatever you do. Definitely not
your parents and grandparents. He provides whatever you seek. Do you think a
bolt from the blue will comfort and console you?
Explanation: Annamacharya always said no one will
ever solve your problems. It’s for the man to take the gantlet. The wording వుట్టిపడి యెవ్వరైనా నూరడించేరా vuTTipaDi yevvarainA nUraDiMchErA is dismissing all
the stories about Phantom or Tarzan or Some superhero coming to the rescue. Setting
aside the deceptions, it’s the for the man to take the steps towards the truth.
యెట్టు సేసినను వేంకటేశుఁడే నేరుచుఁ
గాక yeTTu sEsinanu vEMkaTESuDE
nEruchu gAka is implying God speaks in silence. When our minds are chattering where
is the scope to listen to him? When you speak the language of God, nothing ever
needs to be sought.
Now contemplate on what Jiddu
Krishnamurti said: Do you want to ask any questions? Isn't this silence better
than questions? If you are inwardly quiet, isn't that better than any question
and answer? If you are really quiet, then you have love and beauty - the beauty
that is not in the building, in the face, in the cloud, in the wood, but in
your heart. That beauty cannot be described, it is beyond expression. And when
you have that, no question need ever be asked. (You
Are The World Chapter 7, 6th February 1969. 4th Public
talk at University of California, Berkeley)
Implied
meaning: When you have removed all the doubts, where is question of
seeking. When you stop seeking you will have the bliss of silence.
భావము: నీవు యెట్టు సేసినను వేంకటేశుఁడే సమర్థించును గాక! ఓపును గాక!
కట్టఁగడవారెల్లఁ గావఁబోయేరా! ఇట్టే యేమడిగిన నీతఁడే యొసఁగుఁ గాక! పైనుంచి వుట్టిపడి యెవ్వరైనా నిన్ను ఓదార్చుదురా?
వివరణము: అన్నమాచార్యులు ఎప్పుడూ మీ సమస్యలను మీరు తప్ప వేరెవరూ
ఎవరూ పరిష్కరించరని చెప్పారు. ఇది భగవంతుడిచ్చిన
అనుధావనము. 'వుట్టిపడి
యెవ్వరైనా నూరడించేరా'తో ఫాంటమ్ లేదా టార్జాన్ లేదా సూపర్ మ్యాన్ లేదా దేవదూతలు వంటి
హీరోలు వచ్చి మనకు సహాయము చేసెదరన్న కథలన్నింటినీ
కొట్టిపారేసారు అన్నమాచార్యులు. వీటి భ్రమల నుంచి తొలగి సత్యమువైపు అడుగులు వేయడం మనిషి
బాధ్యత.
‘యెట్టు సేసినను వేంకటేశుఁడే నేరుచుఁ గాక’ భగవంతుడు మౌనంగా మాట్లాడతాడు అని సూచిస్తోంది. మన మనస్సులు ఉబుసుపుౘ్చు కబుర్లలో మునిగియుంటే, ఆయన చెప్పేది
వినే అవకాశ౦ ఎక్కడ ఉ౦టుంది? మీరు దేవుని భాషను మాట్లాడ గలిగినప్పుడు, దేనినీ వెతకాల్సిన
అవసరం లేదు.
ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి మౌనము గురించి ఏమి చెప్పాడో ఒక్క క్షణం
ఆలోచించండి: “మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? నిశ్శబ్దం ప్రశ్నలను మించినది
కాదా? మీరు వాస్తవంగా అంతర్గతంగా నిశ్శబ్దంగా ఉంటే, ఏవైనా ప్రశ్నలు ఉత్పన్నమౌతాయా?
నిజమైన నిశ్శబ్దం మీరనుభవించి ఉంటే, మీరు కారుణ్యము మరియు సౌందర్యములను స్పృశించినట్లే - మీ హృదయంలో లేని అందం, ఆ భవనంలోకానీ, ఆ ముఖంలోకానీ, ఆమేఘంలోకానీ, ఆ అడవిలోకానీ లేదు. ఆ అందాన్ని వర్ణించలేము,
ఆ మాధుర్యము వ్యక్తీకరణకు అందనిది. మీకు అది ఉన్నప్పుడు, సందేహాలకు తావేలేదు.” (You Are The World, Chapter 7, 6th February 1969. 4th
Public talk at University of California, Berkeley)
అన్వయార్ధము: మీ
సందేహాలన్నీ పటాపంచలైతే, ఇక వెదకడమే వుండదు. మీరు వెతకడం ఆపివేసినప్పుడు మీకు
నిశ్శబ్దంలోని మాధుర్యం లభిస్తుంది.
References and Recommendations
for further reading:
#1 110.
ముందరఁ గలదని మోసపోతి నిదె (muMdara galadani mOsapOti nide)
#2 31. చాల
నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి (chAlanovvi sEyunaTTi janmamEmi maraNamEmi)
#3 95. తహతహలిన్నిటికి
తానే మూలము (tahatahalinniTiki tAnE mUlamu)
Summary of this Keertana:
Chorus: Nature (God) is
the source of all of these actions, works, and arrangements. Honours,
remuneration, and gifts bestowed by people who live in this world, are of any
value? Implied meaning 1: “O man! Understand the activities that engage
you are truly misleading. You shall choose the path out of this activity” Implied meaning 2: O man! What use is of rewards? This Life is the
greatest blessing. For the beauty of this life lies in submitting to the one
who bestowed it.
Stanza 1: God is there to help you with all of your problems. Is it possible for
someone else to take care of your problems? When you're in agony, approaching
people opens the door to criticism and mockery, yet the problem stays the same.
Stanza 2: Overwhelming sins
can only be cured with Lord Srihari's assistance. No one else will step up to
lend a hand. In the hardships of life's highs and lows, those who you expect to
support, will embarrass you, but not carry the burden.
Stanza 3: The Lord
Venkateswara accepts without condemning whatever you do. Definitely not your
parents and grandparents. He provides whatever you seek. Do you think a bolt
from the blue will comfort and console you? Implied meaning: When
you have removed all the doubts, where is question of seeking. When you stop seeking
you will have the bliss of silence.
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి: మానవుడా! నీ వొనరించు చేష్టలన్నింటికీ ప్రకృతియే (భగవంతుడే) మూలము. లోకులిచ్చే గౌరవాలు, జీతభత్యాలు, బహుమతులు ఏరకంగా తోడ్పడుతాయో? అన్వయార్ధము 1: "ఓ మానవుడా! నిన్ను మురిపించి నిమగ్నం చేసే కార్యకలాపాలన్నీ నిజంగా తప్పుదోవ పట్టించేవే! వీటి నుంచి బయటపడు మార్గము ఎంచుకో" అన్వయార్ధము 2: ఓ నరుడా! గౌరవములు, ప్రతిఫలములెందుకో? ఈ జీవితమే గొప్ప సన్మానము. ఆ బహుమతి లోని అందము, ఆనందము ఆ ప్రదాతకు సమర్పించుకోవడంలోనే వుంది! తక్కినవన్నీ నిష్ప్రయోజనములే.
చరణం 1: మీ
ఆపదలన్నింటిలో మీకు సహాయం చేయడానికి భగవంతుడు ఉన్నాడు. వాటిని పరిష్కరించడం పరుల వశమయ్యేనా?
పొరపాటున నోరు తెరిచి అడిగితే, సమస్య అలాగే ఉంటుంది పైగా పరుల అపహాస్యానికి తలుపులు
తెరిచినట్టే!
చరణం 2: మితిమీరిన
దురితాలు శ్రీహరి సహాయంతో తప్ప ఎవ్వరో వచ్చి
పాపఁ బొయ్యేరా? జీవితపు హెచ్చుతగ్గులను కష్టాలలో నీవు తలఁచినవారెల్ల నిన్ను సిగ్గుమాలిన
వాణ్ణి చేస్తారే కానీ మద్దతును భుజాన వేసుకోరే.
చరణం 3: నీవు
యెట్టు సేసినను వేంకటేశుఁడే సమర్థించును గాక! ఓపును గాక! కట్టఁగడవారెల్లఁ గావఁబోయేరా!
ఇట్టే యేమడిగిన నీతఁడే యొసఁగుఁ గాక! పైనుంచి
వుట్టిపడి యెవ్వరైనా నిన్ను ఓదార్చుదురా? అన్వయార్ధము: మీ
సందేహాలన్నీ పటాపంచలైతే, ఇక వెదకడమే వుండదు. మీరు వెతకడం ఆపివేసినప్పుడు మీకు
నిశ్శబ్దంలోని మాధుర్యం లభిస్తుంది.
Copper Leaf: 34-3; Volume 1-210
మనం చేసే సమస్త కార్యకలాపములకు మూలం మనలోనున్న పరమాత్మ యొక్క చైతన్యాంశంయే.*ఇన్ని చేతలును* అనుటలో అన్నమయ్య చెప్పేది జీవుల యొక్క సమస్తమైన చర్యలకు చైతన్యాన్నిచ్చేది మూలప్రకృతి అంటే ఆ పరమాత్మయే.
ReplyDeleteజీవుడు మాయ (భ్రమ)లో పడి, ఇహలోక, పరలోక భోగములందు అనురక్తుడై, లౌకికమైన కార్యకలాపములలో నిమగ్నుడై, సర్వశక్తిమంతుడైన అట్టి దైవాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నాడు. తాత్కాలికమైన ఈ లౌకిక సుఖములకొరకు పరమార్థాన్ని గ్రహించుటలేదు.ఇటువంటి అశాశ్వతమైన భోగములు నిష్ప్రయోజనములే. అవి దైవాన్ని చేరనివ్వగలవా? (అసంభవమని భావం) యని అన్నమయ్య ప్రశ్నిస్తున్నాడు.
కర్మలను చేసినా కర్మ యందు అకర్మను, ఆకర్మలో కర్మను దర్శించే మానవులు యోగులని భగవద్గీతలో భగవానుడు ఉపదేశించాడనే విషయాన్ని శ్రీనివాస్ గారు ఈ సందర్బంగా విశదీకరించి విషయాన్ని సులభగ్రాహ్యము చేశారు.
*కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః ।*
*స బుద్దిమాన్మనుశ్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ।। 18 ।।*(4-18)
"ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనేవున్నా, వారు యోగులు మరియు వారి సమస్త కర్మలను చేయువారు."
పైవిధంగా కాక లౌకిక కర్మల నాచరించువాడు ఇహపర భోగాలను అనుభవిస్తాడు కాని, భగవంతుడిని పొందజాలరు.
భగవంతు డొక్కడే దయతో చేసిన పాపములను క్షయపరచి, పాపవిముక్తిని ప్రసాదించగల సమర్థుడు. వేరెవ్వరికీ అది ఆసాధ్యమని అన్నమయ్య భగవదర్పణము చేసికొనుటయే ముక్తికి మార్గమని జ్ఞానమార్గాన్ని చూపిస్తున్నాడు ఈ దివ్యమైన, భవ్యమైన కీర్తనలో.
ఓమ్ తత్ సత్ 🙏
కృష్ణ మోహన్
Excellent commentary and also very good comment above by Sri Krishna Mohan
ReplyDelete