ANNAMACHARYA
127 నాకు నాకే సిగ్గయ్యీని నన్ను జూచుకొంటేను
(nAku nAkE siggayyIni nannu jUchukoMTEnu)
Introduction: Behind
the innocent wording of this poem is a pensive mind dissecting your heart. The final
blow (coup de grace) must be surprising for the orthodox and conformists.
Annamacharya is simply asking us to introspect.
With honest reflection, do we ever dare the God to solve our problems? Our gullible
actions are as transparent as these plain words of the poem. It’s our conceptual
idiosyncrasies drive us to seek answers here and there. Wily Annamacharya is more of a crusader of
truth than proponent of tradition.
Both Annamacharya and Jiddu Krishnamurti made
the subject of God and Truth look easy. Feel easy. They dismantled complex
terminologies, numerous impediments in the form tradition, and secrecy. More
and more people, the so-called uninitiated, could now explore.
ఉపోద్ఘాతము: ఈ కీర్తనలో అందమైన సాదాసీదా
పదాల వెనుకదాగి మీ హృదయాన్ని చీల్చివెసే ఉపేక్షింపరాని సందేశముంది. ఆఖరి చరణం లోని
చివరి పదాలు ఛాందసులు, మూఢ భక్తులు జీర్ణించుకోలేనివే!
అన్నమాచార్యులు మనల్ని ఆత్మపరిశీలన
చేసుకోమని అడుగుతున్నారు. నిజాయితీగా ఆలోచిస్తే మన సమస్యలను పరిష్కరి౦చమని దేవుణ్ణి
ధైర్య౦గా అడగగలమా? సమాధానాల కోసం అటునిటు చూడడం ప్రకృతి, స్వభావముల ప్రభావముతో జరుగు
కలాపము. మన తెలివితక్కువ చర్యలు ఈ కీర్తనలోని సాదాసీదా పదాల వలె తేటతెల్లము. అన్నమాచార్యులు
సంప్రదాయ ప్రతిపాదకుడి కంటే సత్య సంచారకుడిగా గోచరిస్తాడు.
అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి
ఇద్దరూ భగవంతుడు, సత్యము అనే విషయాలను సులభంగా కనిపించేలా చేశారు. తేలికగా హృదయంలోకి
చొచ్చుకునేలా చేశారు. వారు సంక్లిష్టమైన పదజాలాన్ని; సంప్రదాయం, గోప్యత అనే అడ్డంకులను
తొలగించారు. ఈనాడు, మరింత ఎక్కువ మంది ప్రజలు, సామాన్యులు అని పిలువబడేవారు, అన్వేషణలో
పాలుపంచుకుంటున్నారు.
కీర్తన:
నాకు నాకే
సిగ్గయ్యీని నన్ను జూచుకొంటేను చేకొని నీవే
మన్నించఁ జెయ్యొగ్గేఁ గాని ॥పల్లవి॥
సేయరాని పాపములు
సేసివచ్చి యేనోర నాయెడ నిన్ను
వరములడిగేను
కాయముతో నింద్రియకింకరుఁడనై
యేమని
చేయార నీబంటనని
చెప్పుకొనేను ॥నాకు॥
వేగిలేచి సంసారవిధులకే
వొడిగట్టి యేగతిఁ గొసరి
నీపై నేఁట వేసేము
అగడపు బంగారుకాతుమనే
నమ్ముకొని
భోగపుమోక్షము
నెట్టు వొందించు మనేము॥నాకు॥
కలుపుట్టుగుబదుకు
కాంతలకు వెచ్చపెట్టి వలసి నేఁడెట్టు
నీవార మయ్యేము
నెలవై శ్రీవేంకటేశ
నీవే కరుణించితివి
బలిమిసేసి
నీకెట్టు భారము వేసేము ॥నాకు॥
|
nAku nAkE siggayyIni nannu
jUchukoMTEnu chEkoni nIvE manniMcha
jeyyoggE gAni ॥pallavi॥
sEyarAni pApamulu
sEsivachchi yEnOra nAyeDa ninnu varamulaDigEnu
kAyamutO
niMdriyakiMkaruDanai yEmani
chEyAra nIbaMTanani
cheppukonEnu ॥nAku॥
vEgilEchi saMsAravidhulakE
voDigaTTi yEgati gosari nIpai nETa
vEsEmu
agaDapu baMgArukAtumanE
nammukoni
bhOgapumOkshamu neTTu
voMdiMchu manEmu ॥nAku॥
kalupuTTugubaduku kAMtalaku
vechchapeTTi valasi nEDeTTu nIvAra
mayyEmu
nelavai SrIvEMkaTESa nIvE
karuNiMchitivi
balimisEsi nIkeTTu bhAramu
vEsEmu ॥nAku॥
|
Details and Explanations:
నాకు నాకే
సిగ్గయ్యీని నన్ను జూచుకొంటేను
చేకొని నీవే
మన్నించఁ జెయ్యొగ్గేఁ గాని ॥పల్లవి॥
nAku nAkE siggayyIni nannu jUchukoMTEnu
chEkoni nIvE manniMcha jeyyoggE gAni ॥pallavi॥
Word to Word meaning: నాకు (nAku) = myself; నాకే (nAkE) = about myself; సిగ్గయ్యీని (siggayyIni) = felt ashamed; నన్ను (nannu) = me; జూచుకొంటేను (jUchukoMTEnu) = on observing; చేకొని (chEkoni) = accepting, granting, receiving; నీవే (nIvE) = you; మన్నించఁ (manniMcha) = forgiving, pardoning; జెయ్యొగ్గేఁ (jeyyoggE) = దోసిలిపట్టు, అంజలించు, ప్రార్ధించు, bow in respect, pray in respect; గాని (gAni) = except, unless.
Literal
meaning: On
observing myself, I bowed my head in shame. But for your blessings I would
not be your devotee. (Otherwise, I would have been left in the oblivion)
Explanation: With the education we received,
its not difficult find that life, like our stock markets, is interdependent. Most
unfortunate part is we are not sensitive enough to know that we are living at the
cost of somebody, particularly if that person happens to be in east Asia or Africa.
We often do
not realize that refusing food to those in need is a blot on the whole of mankind.
What Annamacharya saying is that when we realise our natural responsibility as humans, we find its impossible to discharge. In such situation, can a right-thinking person hold his head high? Fortunately, On the other hand, God is compassionate. He is ready to accept inwardly ugly beings as we are.
Implied
meaning: Sir, I understand my unenviable foolishness. Sure, its your
magnanimity to accept us as we are.
భావము: నన్ను నేను గమనించుకుని సిగ్గుతో తలవంచియున్న నన్ను నీవు దయతో అంగీకరించావు కాబట్టి, నీకు భక్తుడిని కాగలిగాను.
(లేకపోతే, నేను అలాగే మూఢుడిగా ఉండిపోయేవాడిని.)
ణము: మనము పొందిన విద్యతో, మన స్టాక్ మార్కెట్ల
వలె, జీవితం కూడా పరస్పరాధారితమైనది అని కనుగొనడం కష్టం కాదు. దురదృష్టకరమైన విషయం
ఏమిటంటే, మనం ఎవరి జీవితాన్నో పణంగా పెట్టి జీవిస్తున్నామని, ప్రత్యేకించి ఆ వ్యక్తి
తూర్పు ఆసియాలో లేదా ఆఫ్రికాలో ఉంటే, తెలియునంత సున్నితత్వము మనలో లేదు. అవసర౦లో ఉన్నవారికి
మన౦ ఆహారాన్ని నిరాకరి౦చడం, అది మొత్తం మానవాళికే మచ్చ అని గ్రహించము.
అన్నమాచార్యులు చెప్పేదేమిటంటే, మానవునిగా మన సహజ బాధ్యతను
గ్రహించినప్పుడు, దానిని నిర్వర్తించడం అసాధ్యం అని తెలుస్తుంది. అలా౦టి పరిస్థితిలో,
అత్మాభిమానం గల వ్యక్తి తన తలను పైకెత్తగలడా? అదృష్టవశాత్తూ, దేవుడు మనలా కాదు, దయదాక్షీణ్యాలు
చూపిస్తాడు. మానసిక వికలాంగ జీవులమైన మనము ఉన్నట్లుగానే అంగీకరించడానికి ఆయన సిద్ధంగా
ఉంటాడు.
అన్వయార్ధము: అయ్యా,
నా అచంచలమైన మూర్ఖత్వాన్ని నేను అర్థం చేసుకున్నాను. మేము ఎలా ఉన్నా అంగీకరించడం
ఖచ్చితంగా నీ ఉదారతయే.
సేయరాని పాపములు
సేసివచ్చి యేనోర
నాయెడ నిన్ను
వరములడిగేను
కాయముతో
నింద్రియకింకరుఁడనై యేమని
చేయార నీబంటనని
చెప్పుకొనేను ॥నాకు॥
sEyarAni pApamulu sEsivachchi yEnOra
nAyeDa ninnu varamulaDigEnu
kAyamutO niMdriyakiMkaruDanai yEmani
chEyAra nIbaMTanani cheppukonEnu ॥nAku॥
Word to Word meaning: సేయరాని (sEyarAni) = unthinkable; పాపములు (pApamulu) = sins; సేసివచ్చి (sEsivachchi) =having committed; యేనోర (yEnOra) = with what face; నాయెడ (nAyeDa) = in my favour; నిన్ను (ninnu) = you; వరములడిగేను (varamulaDigEnu) = seek favours; కాయముతో (kAyamutO) = with this body; నింద్రియకింకరుఁడనై (niMdriyakiMkaruDanai) = became a slave of the senses; యేమని (yEmani) = what way; చేయార (chEyAra) = చేతులార, by deeds; నీబంటనని (nIbaMTanani) = as if your servant; చెప్పుకొనేను (cheppukonEnu) = claim.
Literal meaning: I commit unthinkable sins on this side. How can I approach you to get favours? (no). I am a slave to my senses. Do I still have the audacity to call myself your servant? (not)
Explanation: There is no end to our hypocrisy. Annamacharya is asking us to be honest. When the God can read man’s mind, what profit man wants to derive by lying? Is it not plain foolishness? In a way this verse is similar to అమ్మేదొకటియు అసీమలోనిదొకటి#2 (ammE dokaTiyunu asimalOni dokaTi)
When man realises his mistakes, instead of taking it as his doing, finds some or the other causes or reasons. What Annamacharya is hinting is Can man after recognising his faults, admit them and remain calm?
Now consider this bible saying, “Let
no corrupting talk come out of your mouths, but only such as is good for
building up, as fits the occasion, that it may give grace to those who hear”.
(Ephesians 4:29)
భావము: ఈ వైపు చేయరాని పాపములు చేసి యేనోటితో నిన్ను వరములడిగేను (ఆడగలేను
కదా!). నేను ఇంద్రియాలకు బానిసను. ఇప్పటికే
బానిసనైన నేను చేతులార నీ సేవకుడిని అని చెప్పుకునే ధైర్యం నాకు ఇంకా ఉంటుందా? (ఉండదు!)
వివరణము: మన కపటానికి అంతమే లేదు. అన్నమాచార్యులు మనల్ని నిజాయితీగా ఉండమని
అడుగుతున్నారు. భగవంతునికి మానవుని మనస్సు స్పష్టమైనప్పుడు, అబద్ధం చెప్పడం ద్వారా
మానవుడు ఏ లాభాన్ని పొందాలనుకుంటాడు? ఇది సాఫీగా మూర్ఖత్వం కాదా? దీనికి ‘అమ్మేదొకటియు
అసీమలోనిదొకటి’#2 కీర్తనతో దగ్గర పోలికలుంటాయి.
మానవుడు తన తప్పులను గ్రహించినప్పుడు,
దానిని తన పనిగా భావించడానికి బదులుగా ఇతర కారణాలు లేదా పరిస్థితులను బాధ్యులుగా చేసి
తప్పించుకోజూస్తాడు. అన్నమాచార్యులు సూచిస్తున్నది ఏమిటంటే, మానవుడు తన లోపాలను గుర్తించిన
తరువాత, వాటిని తనవిగా అంగీకరించి, శాంతముగా, స్థిమితముగా ఉండగలడా?
ఇప్పుడు ఈ బైబిలు వాక్యమును పరిశీలి౦చ౦డి,
"జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు
కుమ్మరించును." (సామెతలు 15-2)
వేగిలేచి
సంసారవిధులకే వొడిగట్టి
యేగతిఁ గొసరి
నీపై నేఁట వేసేము
అగడపు
బంగారుకాతుమనే నమ్ముకొని
భోగపుమోక్షము
నెట్టు వొందించు మనేము ॥నాకు॥
vEgilEchi saMsAravidhulakE voDigaTTi
yEgati gosari nIpai nETa vEsEmu
agaDapu baMgArukAtumanE nammukoni
bhOgapumOkshamu neTTu voMdiMchu manEmu ॥nAku॥
Word to
Word meaning: వేగిలేచి (vEgilEchi)
= get up early in the morning; సంసారవిధులకే (saMsAravidhulakE) =
only for worldly duties; వొడిగట్టి (voDigaTTi)
= to commit, to resort; యేగతిఁ (yEgati) = what way; గొసరి (gosari) =
to demand; నీపై (nIpai) = on you; నేఁట వేసేము (nETa
vEsEmu) = భారమువేయు, put the responsibility; అగడపు
(agaDapu) =
ధరావత్తు, సంచకరువు, earnest money (or advance money); బంగారుకాతుమనే నమ్ముకొని (baMgArukAtumanE
nammukoni) = sold the Atman to the gold; భోగపుమోక్షము (bhOgapumOkshamu) = splendorous
liberation; నెట్టు (neTTu) = how; వొందించు
మనేము
(voMdiMchu
manEmu) = ask you to give us on a platter?
Literal
meaning: Every
day we get up early and get engaged with the worldly affairs. (We sleep in the
night. Sir, we don’t have time to take your name). How stupid are we to fix the
responsibility on you! We already paid earnest money and sold our Atman in
exchange of gold. How immature are we to expect the glorious liberation on a
silver platter?
Explanation: Most obvious thing is than man gets engaged in daily chores day after day. In this process he loses time and energy. Where is the time to think of God? This question is more valid now than for Annamacharya’ s time.
Inseparable connection man made
with money is expressed more accurately “we sold our soul for the Gold”.
This is true for almost all the recorded times of human existence. Also refer to Annamaharya’
s verse రూకలై మాడలై రువ్వలై తిరిగీని#1 (rUkalai mADalai ruvvalai tirigIni)
భావము: రోజూ ప్రొద్దున్నే లేచి సంసార విధులకే వొడిగడతాను. (రాత్రి నిద్రపోతాము.
ఇక నిన్ను తలిచేందుకు సమయమేది?) నీపై ఏ అధికారముతో భారము వేయగలము? ఇక బంగరంపై మమకారంతో
ధరావతు కట్టి అత్మలనే అమ్మేశాము. ఏం చూసుకొని భోగములతో కూడిన మోక్షము అందించమని ఆడగగలము?
వివరణము: మిత్రులారా చాలా స్పష్టమైన విషయం ఏమిటంటే, రోజువారీ పనుల్లో మునిగి
అతను సమయం మరియు శక్తిని కోల్పోతాడు. దేవుని గురి౦చి ఆలోచి౦చే సమయ౦ ఎక్కడ ఉ౦టుంది?
అన్నమాచార్యుల కాలం కంటే ఇరవైవొకటో శతాబ్దానికి ఈ వివరణ మరింత చెల్లుబాటు అవుతుంది.
మనిషి డబ్బుతో చేసిన విడదీయరాని సంబంధం బహు నిక్కచ్చిగా
వ్యక్తీకరించబడింది "అగడపు బంగారుకాతుమనే నమ్ముకొని" {బంగరంపై మమకారంతో ధరావతు కట్టి అత్మలనే అమ్మేశాము}. మానవచరిత్రలో అన్ని
కాలాలకు ఇది వర్తిస్తుంది. అన్నమాచార్యుల కీర్తన రూకలై మాడలై రువ్వలై తిరిగీని#1 కూడా చూడండి.
కలుపుట్టుగుబదుకు
కాంతలకు వెచ్చపెట్టి
వలసి నేఁడెట్టు
నీవార మయ్యేము
నెలవై
శ్రీవేంకటేశ నీవే కరుణించితివి
బలిమిసేసి
నీకెట్టు భారము వేసేము ॥నాకు॥
kalupuTTugubaduku kAMtalaku vechchapeTTi
valasi nEDeTTu nIvAra mayyEmu
nelavai SrIvEMkaTESa nIvE karuNiMchitivi
balimisEsi nIkeTTu bhAramu vEsEmu ॥nAku॥
Word to Word meaning: కలుపుట్టుగుబదుకు (kalupuTTugubaduku) = పుట్టుకతోనే కామము, మోహముల బలహీనత కల బ్రతుకు, congenital weakness for love, desire; కాంతలకు (kAMtalaku) = to ladies (in general indicating desires); వెచ్చపెట్టి (vechchapeTTi) = ఖర్చుపెట్టు, చిందువందుచేయు, spend, peter away, wasted; వలసి (valasi) = intentionally, must; నేఁడెట్టు (nEDeTTu) = how today?, నీవార మయ్యేము (nIvAra mayyEmu) = we be your people; నెలవై (nelavai) = abode, acquaintance; శ్రీవేంకటేశ (SrIvEMkaTESa) = Lord Venkateswara; నీవే (nIvE) = you alone; కరుణించితివి (karuNiMchitivi) = have shown compassion / mercy; బలిమిసేసి (balimisEsi) = దాని నుంచి శక్తి పుంజుకొని, deriving strength; నీకెట్టు భారము (nIkeTTu bhAramu) = How can we put that responsibility; వేసేము (vEsEmu) = on you?
Literal
meaning: We spend all our
energies with congenital weakness for love and passion on ladies (desires). How
can we claim to be your people (being on your side)? O Lord Venkateswara by your mercy we find your
abode. Yet we are imprudent to throw this responsibility (of absolving us) on
you.
Explanation: What is the meaning of nIkeTTu bhAramu vEsEmu? (నీకెట్టు భారము వేసేమ?) is implying that the man should take the responsibility for his actions, not to leave it to God. We have been told since our childhood that there is God. He will take up your work in your upward travel. Is Annamacharya is denying it? Let us analyse this.
Refer to this Bhagavadgita verse: त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो
निराश्रय: | कर्मण्यभिप्रवृत्तोऽपि नैव
किञ्चित्करोति स: || 4-20|| tyaktvā karma-phalāsaṅgaṁ nitya-tṛipto nirāśhrayaḥ / karmaṇyabhipravṛitto
’pi naiva kiñchit karoti saḥ purport: Whosoever forsaketh the fruit of
his deeds, and hath forsaken his passion, and is satisfied continually, and
does not hide behind a ‘shelter’ to support his actions and is
independent; he
performs no fruitive action, although engaged in all kinds of undertakings.
Let us understand the word निराश्रय: (nirāśhrayaḥ నిరాశ్రయః) indicates who do not defend themselves
by hiding behind the shield of protection in the name of principles, pretexts, religion,
causes, secrecy. That is, by this nature, they become weak and vulnerable.
A middle-class family man derives lot of comfort by hiding behind the bank balance and the medical insurance. If you observe carefully, the average man will help our political and economic systems to support each other. And thus, the average man takes shelter of the system. By the wording vEgilEchi saMsAravidhulakE voDigaTTi “వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి” is indicating such mutual dependency or shelter becomes strong day after day.
The nirāśhrayaḥ mentioned here
do not take "refuge" or are not
looking for certain ‘safe haven’ called God! Such people do not put a
burden on God. Sir! Annamayya suggests that
those who have chosen this path will give in to suffering, hardships and poverty,
but will be on the side of God.
At the same time it is worthy remember the words of Annamacharya from another verse: yemmela puNyAlu sEsi yila nElavachchu gAka / kammi hari dAsuDu gAvachchunA#3 (ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక కమ్మి హరి దాసుఁడు గావచ్చునా) One can become king by doing good work. However, we do not know how to become a devotee by spreading God's devotion. This implies that no one can become a devotee by choice unless he is certain in his heart that it is the only path to take.
Why Annamacharya is
talking about wasting of energies? Please consider statement of Jiddu
Krishnamurti. “Every movement of thought every action demands energy.
Whatever you do or think needs energy, and this energy can be dissipated
through conflict, through various forms of unnecessary thought, emotional
pursuits and sentimental activities. Energy is wasted in conflict which arises
in duality, in the "me" and the "not-me", in the division
between the observer and the observed, the thinker and the thought. When this
wastage is no longer taking place there is a quality of energy which can be
called an awareness - an awareness in which there is no evaluation, judgement,
condemnation or comparison but merely an attentive observation, a seeing of
things exactly as they are, both inwardly and outwardly”
Implied
meaning: O Man! Instead of wasting energies elsewhere, can you
discover the benevolence of God independently?
భావము: పుట్టుకతోనే కామము, మోహముల బలహీనత కల బ్రతుకంతా (శక్తినంతా) మహిళల (కోరికలు) మీద ఖర్చు చేస్తాము. మేము నీవారమని ఎలా చెప్పుకోగలం? ఓ వేంకటేశ్వరా! నీ దయవల్ల నీ నివాసమెక్కడో తెలిసింది. అయినప్పటికీ మమ్మల్ని ముక్తులను చేసే ఈ బాధ్యతను నీపై వేయబోయే కొరమాలినవారము.
వివరణము: ‘నీకెట్టు భారము వేసేము’
యొక్క అర్థము ఏమిటి? మనిషి తన చర్యలకు తానే బాధ్యత వహించాలని, దానిని భగవంతుడికి వదిలేయకూడదని
సూచిస్తుంది. భగవంతుడు ఉన్నాడని అతడు పైలోక ప్రయాణంలో మనకు సహాయ పడతాడు అని
విన్నాం. అన్నమాచార్యులు దానిని నిరాకరిస్తున్నారా?
అలోచింతము.
ముందుగా ఈ భగవద్గీత శ్లోకం చూడండి. శ్లో॥ త్యక్త్వా కర్మఫలాసంగం / నిత్యతృప్తో
నిరాశ్రయః / కర్మణ్యభిప్రవృత్తోఽపి / నైవ
కించిత్ కరోతి సః (4-20). భావం: ఎవడు కర్మఫలము నందాసక్తిని విడనాడి, నిరంతరమూ
తృప్తిగలవాడై, దేనినీ ఆశ్రయించక ఉండునో; అట్టివాడు కర్మలందు ప్రవర్తించిననూ
ఒకింతైననూ చేయనివాడే అగును.
నిరాశ్రయః గురించి కొంచెం చెప్పుకోవాలి. ఏ సిద్ధాంతాల,
సూత్రాల, నెపముల, కారణముల, ఆసరాల రక్షణ గొడుగుల మాటున దాగనటువంటి వారు.
అనగా వారు రక్షణ కవచం వెనుక దాగి
తమని తాము సమర్ధించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ నైజము ద్వారా వారు బలహీనము,
దుర్బలు, దాడికి అనువైనవారు (vulnerable) ఔతారు.
ఓ మధ్య తరగతి కుటుంబీకుడు దాచుకున్న బ్యాంకు బేలన్స్,
తీసుకున్న ఆరోగ్య భీమా వెనుక దాగి ఎంతో
మనశ్శాంతిని పొందుతాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే, సగటు మనిషి మన రాజకీయ, ఆర్థిక
వ్యవస్థలు ఒకరికొకరు ఆసరాగా నిలిచి ఈ జీవన విధానాన్ని నిర్దిష్ట మార్గంలో
ప్రయాణించేందుకు దోహదమౌతారు. ఇక్కడ "ఆశ్రయము" రాను రాను విడదీయరానిది
అవుతుంది. “వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి”తో "ఆశ్రయము"మరింత
బలోపేతమగునని అన్నమాచార్యులు చెప్పిరి.
ఇక్కడ పేర్కొన్న నిరాశ్రయులు,
దైవమునుండీ "ఆశ్రయము" ఆశించరు కదా! అట్టివారు దైవము మీద భారము వేయరు కదా.
అయ్యా! ఈ మర్గము ఎంచుకున్నవారు బాధలకు, కష్టములకు, దారిద్ర్యమునకు తలొగ్గక
భగవంతుని వైపే వుందురని అన్నమయ్య సూచన.
‘ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ
గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా’#3 అన్నమాచార్యుల వాక్యము కూడా
ఉదాహరించదగ్గది. పుణ్యకార్యములు చేసి చక్రవర్తియై భూమిని పరిపాలించుటైన సులభమే కాని యే విధముగా భక్తిని పెంచుకొని
హరిదాసుడు కాగలడు? (హరికి దాసుడౌట
సులభసాధ్యమేనా? ఎవరూ కోరి భక్తులుకాలేరని, భక్తి తప్ప వేరు మార్గము లేదని గ్రహించినవారు తప్పించి అని అర్ధము).
మన శక్తినంతా మహిళల (లేదా కోరికల) మీద ఖర్చు చేస్తాము
అని ఎందుకన్నారో ఒకసారి పరికించెదము. ఈ జిడ్డు కృష్ణమూర్తి యొక్క ప్రకటనను పరిగణనలోకి
తీసుకోండి. "ఆలోచన యొక్క ప్రతి కదలికకు ప్రతి చర్యకు శక్తి అవసరం. మీరు ఏ పని
చేసినా, ఏమనుకుంటున్నారో దానికి శక్తి అవసరం. సంఘర్షణ ద్వారా, అనవసరమైన ఆలోచనలు,
భావోద్వేగ అన్వేషణలు, భావోద్వేగ కార్యకలాపాల వివిధ రూపాల ద్వారా ఈ శక్తిని
వెదజల్లవచ్చు. ద్వంద్వత్వంలో, "నేను", "నేను కాదు"లో,
పరిశీలకుడికి, పరిశీలించినవారికి, ఆలోచనాపరుడికి, ఆలోచనకు మధ్య విభజనలో తలెత్తే
సంఘర్షణలో శక్తి వృధా అవుతుంది. ఈ వృధా ఇకపై జరగనప్పుడు 'శక్తి' యొక్క గుణం
ఉంటుంది, దానిని "ఎరుక" అని పిలవవచ్చు - విలువల నిర్ధారణ, తీర్పు, ఖండన
లేదా పోలికలు లేకుండా కేవలం శ్రద్ధగా పరిశీలించడం, అంతర్గత మరియు బాహ్య విషయాలను
సరియగు దృక్కోణములో చూడటమే"
అన్వయార్ధము: ఓ మానవుడా! నీ శక్తులను
వృధా చేసే బదులు బదులు, స్వతంత్రంగా, నీ అంతట నీవుగా దేవుని దయాగుణాన్ని, అపారమైన
కరుణను గుర్తించగలవా?
References and Recommendations
for further reading:
#1 40 రూకలై
మాడలై రువ్వలై తిరిగీని (rUkalai mADalai ruvvalai tirigIni)
#2 2 అమ్మేదొకటియు (ammE dokaTiyu)
#3 47 ఛీ
ఛీ నరుల దేఁటి జీవనము(chI chI narula dEMTi jIvanamu)
Summary of this Keertana:
On observing myself, I bowed my head in shame. But for your blessings
I would not be your devotee. (Otherwise, I would have been left in the
oblivion) Implied meaning: Sir,
I understand my unenviable foolishness. Sure, its your magnanimity to accept us
as we are.
I commit unthinkable sins on
this side. How can I approach you to get favours? (no). I am a slave to my
senses. Do I still have the audacity to call myself your servant? (not)
Every day we get up early and get engaged with the worldly affairs. (We
sleep in the night. Sir, we don’t have time to take your name). How stupid are
we to fix the responsibility on you! We already paid earnest money and sold our
Atman in exchange of gold. How immature are we to expect the glorious
liberation on a silver platter?
We spend all our
energies with congenital weakness for love and passion on ladies (desires). How
can we claim to be your people (being on your side)? O Lord Venkateswara by your mercy we find your
abode. Yet we are imprudent to throw this responsibility (of absolving us) on
you.
Implied
meaning: O Man! Instead of wasting energies elsewhere, can you
discover the benevolence of God independently?
కీర్తన సంగ్రహ భావము:
నన్ను
నేను గమనించుకుని సిగ్గుతో తలవంచియున్న నన్ను నీవు దయతో అంగీకరించావు కాబట్టి, నీకు భక్తుడిని కాగలిగాను.
(లేకపోతే, నేను అలాగే మూఢుడిగా ఉండిపోయేవాడిని.) అన్వయార్ధము: ఓ మానవుడా! నీ శక్తులను
వృధా చేసే బదులు బదులు, స్వతంత్రంగా, నీ అంతట నీవుగా దేవుని దయాగుణాన్ని, అపారమైన
కరుణను గుర్తించగలవా?
ఈ వైపు చేయరాని పాపములు చేసి యేనోటితో నిన్ను వరములడిగేను (ఆడగలేను
కదా!). నేను ఇంద్రియాలకు బానిసను. ఇప్పటికే
బానిసనైన నేను చేతులార నీ సేవకుడిని అని చెప్పుకునే ధైర్యం నాకు ఇంకా ఉంటుందా? (ఉండదు!)
రోజూ
ప్రొద్దున్నే లేచి సంసార విధులకే వొడిగడతాను. (రాత్రి నిద్రపోతాము. ఇక నిన్ను తలిచేందుకు
సమయమేది?) నీపై ఏ అధికారముతో భారము వేయగలము? ఇక బంగరంపై మమకారంతో ధరావతు కట్టి అత్మలనే
అమ్మేశాము. ఏం చూసుకొని భోగములతో కూడిన మోక్షము అందించమని ఆడగగలము?
పుట్టుకతోనే కామము, మోహముల బలహీనత కల బ్రతుకంతా
(శక్తినంతా) మహిళల (కోరికలు) మీద ఖర్చు చేస్తాము. మేము నీవారమని ఎలా చెప్పుకోగలం? ఓ వేంకటేశ్వరా! నీ దయవల్ల నీ నివాసమెక్కడో తెలిసింది.
అయినప్పటికీ మమ్మల్ని ముక్తులను చేసే ఈ బాధ్యతను నీపై వేయబోయే కొరమాలినవారము.
అన్వయార్ధము: ఓ మానవుడా! నీ శక్తులను
వృధా చేసే బదులు బదులు, స్వతంత్రంగా, నీ అంతట నీవుగా దేవుని దయాగుణాన్ని, అపారమైన
కరుణను గుర్తించగలవా?
Copper Leaf: 301-2; Volume 4-2
మొదటిలో ఆత్మని నమ్ముకోవద్దు అని, అమ్ముకోవద్దు అని కాదు! ఆత్మని తెలుసుకుంటే మోక్షం వస్తుంది అనే సిద్ధాంతానికి కూడా అన్నమాచార్యులు వ్యతిరేకం. పరమాత్మ వల్ల ఆత్మకి మోక్షం వస్తుంది తప్పించి తనని తాను నమ్ముకుంటే రాదు అని భావం.
ReplyDeleteఆఖరిలో ఇన్ని బంధాలతో ఉన్నా, నీ అంతటికి నీవే కరుణించావు అనడం గమనార్హం. హరి కృపకి ఆయన తలుచుకోవడం తప్ప మన అర్హత అంటూ ఏమీ లేదు అన్నది అన్నమయ్య సంప్రదాయంలో సిద్ధాంతమ్. - Vishnu
బంగారుకాతుమనే నమ్ముకొని = బంగారుకు + ఆతుమను + ఏను + అమ్ముకొని Look at the contextual meaning: Context says "man sold his soul for gold” Therefore I wrote that way. అగడపు బంగారుకాతుమనే నమ్ముకొని = I paid the earnest money for gold in exchange of the soul.
DeleteOther things we shall discuss on phone. Meanwhile consider the wording: కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు / యిందరిలోపల నీ వెడమాయలు యేగతిఁ దెలిసే నేనయ్యా. For detailed explanation you may see the link below: https://annamacharyapracticalphlosopher.blogspot.com/2022/03/111-komdari-kivi-sammatiyaite-komdari.html
ఇంద్రియలోలురమై,అరిషడ్వర్గాలకు బానిసలమై, సంసారబంధంలో చిక్కుకొని, కాంతాకనకముల కొరకు ఆత్మదృష్టిని విడిచిపెట్టి బాహ్యోన్ముఖులమై యెన్నెన్నో పాపకార్యములు చేసి అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసికొని యిప్పుడు ఆత్మపరిశీలన ద్వారా మేమెంతటి అజ్ఞానులమో గ్రహించి నిన్ను సేవకులముగా స్వీకరించమని,ముక్తిభాగ్యన్ని కలిగించమని యేరీతిని అడుగగలము? అయినా కాని కరుణాసముద్రుడవైన నీవు నాయందు దయజూపి నన్ను భక్తునిగా అనుగ్రహించావు.
ReplyDeleteఅపారదయానిధి వైన నీవు నీయొక్క కృపాకటాక్షములను వర్షించి యుండకపోతే మేము ఎప్పటికీ అజ్ఞానులముగానే మిగిలియుండెడివారమని ఈ కీర్తనలో అన్నమయ్య సత్యస్వరూపమైన భగవంతుడికి నివేదించుచున్నాడు.తద్వారా మానవాళికి ఉపేక్షింప నలవికాని అమూల్యసందేశాన్నిచ్చాడు.
ఓం తత్ సత్ 🙏
కృష్ణ మోహన్