ANNAMACHARYA
62. ఆటవారిఁ గూడి తౌరా
Introduction: In this simple verse Annamacharya described man as puppet moved by air. He said god joins the puppet show, making it difficult for people to recognise good from evil.
ఉపోద్ఘాతము: ఈ కీర్తనలో అన్నమచార్యులు మనిషిని గాలితో ఆడు ఒక కీలుబొమ్మ అని వర్ణించారు. దేవుడు కూడా ఆటగాళ్ళలో చేరడంతో మంచేదో చెడేదో నిర్ణయించడం కఠినమైందన్నారు.
కీర్తన
ఆటవారిఁ గూడి తౌరా
ఆటవారిఁ గూడి అన్నిచోట్ల బొమ్మ-
లాట లాడించ నధికుండవైతివి ॥పల్లవి॥
గురుతరమగు పెద్దకొట్టాములోపల
తిరుమైన పెనుమాయఁ దెరగట్టి
అరయ నజ్ఞానము లవి యడ్డముగఁ జేసి
పరగ సుజ్ఞానదీపములు ముట్టించి ॥ఆట॥
తోలుబొమ్మల దొరకొని గడియించి
గాలిచేత వానిఁ గదలించి
తూలేటి రసములు తొమ్మిది గడియించి
నాలుగు ముఖముల నలువున నాడించ ॥ఆట॥
నిన్నేమెత్తురుగాని
నీకేమి నీలేరు
మన్నించుదాతలు
మరిలేరు
యెన్నఁగఁ దిరువేంకటేశ్వర నీదాసు -
లున్నతులై నిన్ను నుబ్బించి పొగడఁగ ॥ఆట॥
Details and Explanations:
ఆటవారిఁ గూడి తౌరా
ఆటవారిఁ గూడి అన్నిచోట్ల బొమ్మ-
లాట లాడించ నధికుండవైతివి ॥పల్లవి॥
ATavAri gUDi taurA
ATavAri gUDi annichOTla bomma-
lATa lADiMcha nadhikuMDavaitivi ॥pallavi॥
Word to Word meaning: ఆటవారిఁ (ATavAri) = players; గూడి తౌరా (gUDi taurA) = Joined verily, oh indeed!!, ఆటవారిఁ (ATavAri) = players; గూడి (gUDi) = by joining; అన్నిచోట్ల (annichOTla) = in all the places; బొమ్మలాటలు (bomma-lATa) = puppet shows; ఆడించ (ADiMcha) = running; నధికుండవైతివి (nadhikuMDavaitivi) = you are exceedingly great.
Literal meaning and Explanation: Oh! Indeed you joined the players!! By joining players (invisibly) in all places, you had started the puppet show. Did you become great by these puppet shows?
By comparing the living beings with puppets. Annamacharya indicated that we remain dumb despite our cleverness for living. In a larger sense, he is referring this Bhagavad-Gita shloka तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् (14-8) tamas tv ajñāna-jaṁ viddhi mohanaṁ sarva-dehinām (O Arjun, tamo guṇa, which is born of ignorance, is the cause of illusion for the embodied souls).
A Notable point is that, the god joined the players making it harder to know who is ignorant. Thus he confounds the man.
భావము మరియు వివరణము: ఓహో! నువ్వూ ఆటగాళ్ళలో చేరావా? ప్రపంచమంతా ఉన్న ఆటగాళ్లలో (కనబడకుండా) చేరి తోలుబొమ్మలాట ఆడిస్తున్నావా? ఈ కీలుబొమ్మలను కదలించటం ద్వారా నువ్వు గొప్పవాడి వయ్యావా?
జీవులను తోలుబొమ్మలతో పోల్చి, మన ఇప్పటి బ్రతక నేర్చిన తెలివితేటలు పరము సాధించుటకు వ్యర్ధమని, అందుకనే మూఢులమని అన్నమయ్య సూచించారు. విశాల అర్ధములో చూచిన ఈ భగవద్గీత శ్లోకాన్ని సూచిస్తున్నాడు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ (14-8) (ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము.)
ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, దేవుడు ఆటగాళ్లతో కలసిపోయి, ఎవరు జ్ఞానియో తెలియుట కష్టతరము చేసేసాడు. మనిషిని గందరగోళంలో పెట్టేసాడు.
గురుతరమగు పెద్దకొట్టాములోపల
తిరుమైన పెనుమాయఁ దెరగట్టి
అరయ నజ్ఞానము లవి యడ్డముగఁ జేసి
పరగ సుజ్ఞానదీపములు ముట్టించి ॥ఆట॥
gurutaramagu
peddakoTTAmulOpala
Word to Word meaning: గురుతరమగు (gurutaramagu) = huge; పెద్దకొట్టాము (peddakoTTAmu) = a pent roofed house; లోపల (lOpala) = inside; తిరుమైన (tirumaina) = స్థిరమైన, constant; పెనుమాయఁ (penumAya) = large/great illusion; దెరగట్టి (deragaTTi) = arranged curtain; అరయ (araya) = proper consideration; నజ్ఞానము లవి (naj~nAnamu lavi) = those ignorant things; యడ్డముగఁ (yaDDamuga) = obstacle or hindrance; జేసి(jEsi) = making; పరగ (paraga) = agreeably, duly; సుజ్ఞానదీపములు (suj~nAnadIpamulu) = candle of knowledge; ముట్టించి (muTTiMchi) = lighted.
Literal meaning and Explanation: In this huge roofed house called world, He arranged a curtain of ignorance as hindrance of constant and great illusion. He has arranged the candle of light behind these curtains.
By calling this world కొట్టాము (a pent roofed house), Annamacharya indicated the entire world as one (as well the being in it). And this constant illusion is same for all the beings. We in our petty minds, without realising that his equanimity, keep blaming god that he has now provided me with this or not that endowment.
భావము మరియు వివరణము: ప్రపంచమని పిలువబడే ఈ పెద్ద కొట్టాములో, అతను అజ్ఞానమనే పరదాను స్థిరమైన మరియు గొప్ప భ్రమకు అడ్డంకిగా ఏర్పాటు చేశాడు. ఆ తెరల వెనుక జ్ఞాన దీపాన్ని వెలిగించి ఊంచాడు.
ప్రపంచాన్ని కొట్టాము అని పిలిచి ఈ జగత్తు అంతా (మరియు అందులోని జీవులూ) ఒకటేనని అన్నమయ్య చెప్పారు. ఈ స్థిరమైన భ్రమ సమస్త జీవజాలానికి సమానం. ఆ మహనీయుని సర్వసమానత్వము గ్రహియింపక, మన పిదప ఆలోచనలతో, "నాకది ఇవ్వలేదు, ఇది ఇచ్చాడు" అంటూ దేవుడిని నిందిస్తూ కాలము గడిపేస్తాము.
తోలుబొమ్మల దొరకొని గడియించి
గాలిచేత వానిఁ గదలించి
తూలేటి రసములు తొమ్మిది గడియించి
నాలుగు ముఖముల నలువున నాడించ ॥ఆట॥
tOlubommala dorakoni
gaDiyiMchi
Word to Word meaning: తోలుబొమ్మల (tOlubommala) = leather toys; దొరకొని (dorakoni) =ఆరంభించు, to commence; గడియించి (gaDiyiMchi) = gain; గాలిచేత (gAlichEta) = with air; వానిఁ (vAni) = they; గదలించి (gadaliMchi) = make them move; తూలేటి (tUlETi) = intoxicating, the one that does not allow man remain steady; రసములు (rasamulu) =flavours తొమ్మిది (tommidi) = nine; (9 flavours: 1. శృంగారము, sensual; 2. హాస్యము, laughter, 3. కరుణము, compassion, 4. రౌద్రము violent, 5. వీరము , chivalry, bravery 6. భయానకము fearful, 7. బీభత్సము, Horror, disgust 8. అద్భుతము amaze, surprise; 9. శాంతము, patience, calm); గడియించి (gaDiyiMchi) = gained; నాలుగు (nAlugu) = four; ముఖముల (mukhamula) = directions; నలువున (naluvuna) = efficiently, effectively, beautifully; నాడించ (nADiMcha) = make them play.
Literal meaning and Explanation: you made the substrate of leather bodies move by infusing air in them. You make them unsteady in pursuance of nine flavours. You enjoy the game of moving them in all directions.
This is the standard platitude description set by Annamcacharya about five centuries back remain in vogue till date.
భావము మరియు వివరణము: ఈ తోలుబొమ్మలను పొషించి వానిలో గాలి ఊది పాణమిచ్చి; నవ రసముల ఉత్పత్తితో వాటిని అస్థిరములు గావించి; నలు దెసలా ఆడించి వినోదింతువు.
ఐదు శతాబ్దాల క్రితం అన్నమాచార్యులు నిర్దేశించిన యీ సాధారణ వివరణ ప్రామాణికమై ఇప్పటి వరకు వాడుకలో ఉంది.
కొన్ని
సినిమా పాటల ఉదాహరణలు:
1. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా - ఆడించుచున్నాడు బొమ్మలాగా
2. ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
3. కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
నిన్నేమెత్తురుగాని నీకేమి నీలేరు
మన్నించుదాతలు మరిలేరు
యెన్నఁగఁ దిరువేంకటేశ్వర నీదాసు -
లున్నతులై నిన్ను నుబ్బించి పొగడఁగ ॥ఆట॥
ninnEmetturugAni
nIkEmi nIlEru
Word to Word meaning: నిన్నే (nine) = only you; మెత్తురుగాని (metturugAni) = they praise; నీకేమి (nIkEmi) = to you; నీలేరు (nIlEru) = cannot offer; మన్నించుదాతలు (manniMchudAtalu) = respectable donors; మరిలేరు (marilEru) = they do not exist; యెన్నఁగఁ (yennaga) = by proper దిరువేంకటేశ్వర (diruvEMkaTESvara) = Lord Venkateswara; నీదాసులు (nIdAsulu) = your devotees; ఉన్నతులై (unnatulai) = after getting elevated position (liberation) నిన్ను (ninnu) = you; నుబ్బించి (nubbiMchi) = extoll; పొగడఁగ (pogaDaga)= shower praises.
Literal meaning and Explanation: People can only glorify you for they cannot offer you anything else in praise of your greatness. O Lord venkateswara! you made your devotees attain higher position called liberation. They shower admiration in return of your largesse.
One notable thing is that man is so frail; he cannot offer anything to the god. But god showers his kindness to all the beings.
భావము మరియు వివరణము: అందరూ నీ గొప్పతనాన్ని మెచ్చుకుంటారు. కానీ నీకు ఏమీ ఇచ్చుకోలేని ప్రజలు నీ మహిమను ప్రశంసిస్తారు. శ్రీవేంకటేశ్వర నీ భక్తులకు మోక్షము వంటి ఉన్నత పదవులిచ్చి గౌరవిస్తావు. వారు ఉబ్బిపోయి నిన్ను పొగడ్తల్లో ముంచెత్తుతారు.
మనిషి చాలా మనిషి బలహీనుడు; అతడు దేవునికి ఏమీ అర్పించలేడు. కానీ దేవుడు తన దయను అన్ని జీవులపై కురిపిస్తాడు అన్నది గమనార్హము.
zadaz
Reference:
Copper Leaf: 27-2, Volume: 1-163