|
శృంగార సంకీర్తన
|
|
రేకు: 76-3
సంపుటము: 5-267
|
|
ముచ్చటకెవ్వరు లేరు మోహమిది బలుదూరు యెచ్చట నెవ్వరులేరు యేఁటికే నాపేరు ॥పల్లవి॥ మంచముపై నుండరాదు మలఁగుపైఁ బొద్దువోదు నించిన వుయ్యైలలోనా నిద్దుర రాదు అంచెలఁ గన్నుల నీరు ఆఁపరాదాతనిఁబాసి యించుకంత నిలువలే నెట్లు ధరియింతునే ॥ముచ్చ॥ పవ్వళించేటిల్లు చూచి ప్రాణము నిలుపరాదు దివ్వెచూచి తాలిమైనఁ దిప్పఁగరాదు దువ్వటపుఁ బయ్యదపైఁ దోఁగిన తట్టు పుణుఁగు పువ్వుటమ్ము బాసటమై పొక్కెనేమిసేతునే ॥ముచ్చ॥ చింతతో ధరించరాదు చెల్లఁ బో మేనైనఁ బోదు ఇంతటఁ జెలులకైన యెఱుక లేదు ఇంతలోనె వేంకటేశుఁడింతి మరుఁగుననుండి యెంతసేసెఁ గలికి వీఁడేమని చెప్పుదునే ॥ముచ్చ॥
|
|
శృంగార భావము
|
తాత్విక / భక్తి భావము
|
|
ప్రియుడి కోసం ఎదురుచూస్తూ, అతని ప్రేమలో మునిగిపోయిన ఒక నాయిక ఇలా విలపిస్తుంది: తన మనసులోని ప్రేమను
ముచ్చటగా చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. (ఎందుకంటే తాను ప్రేమిస్తున్నది దైవమును.
అది విని చెలులు నవ్వుతారేమోనని బిడియం) ఒక ప్రక్క తన ప్రియుడిని కలవాలి అన్న ఆకాంక్ష ఎంతో బలంగా, అధికంగా పెరిగిపోయింది.
|
భగవంతుని కోసం తపించే ఒక భక్తుని అంతరస్థితి: తనలో
ఉప్పొంగుతున్న ఈ అంతర్గత దైవాకాంక్షను పంచుకునే వారు ఎవరూ లేరు. (హితులు"ఏమయ్యా
దేవుడేమైనా దిగి వస్తాడా?" అని గేలిచేస్తారనే సంకోచం)
దైవసన్నిధి కోసం కలిగిన తపన మరింత గాఢంగా మారింది.
|
|
తన పరిస్థితిని అర్థం చేసుకునే వారు ఎక్కడా లేరు. (ఎవరని చెప్ప
గలదు?) అతని సన్నిధి లేకపోతే తనకు ఉనికే
లేదనిపిస్తుంది. “యేఁటికే నాపేరు”: ఆమెకు తన విభుని దూరము అనూహ్యము. అతడు లేని జీవితము అనవసరము అను భావనలో
'ఈ భూమి మీద తనపేరు వ్యర్దమని చెబుతోంది.
|
తనలో జరుగుతున్న ఈ అంతరంగిక పోరాటాన్ని చుట్టూ ఉన్నవారు గుర్తించరు.
(గుర్తించినా అపహాస్యం చేస్తారు) నాకు నీవు తప్ప మరెవ్వరూ కనిపించరు. అయినప్పటికీ
లోకంలో నాకో పేరు, ఒక వ్యక్తిత్వంతో కనబడుతోంది. అదే నాకూ నీకూ మధ్య
ఒక అడ్డా? “యేఁటికే నాపేరు” — నువ్వు నేను ఒక్కటే అయినప్పుడు
నీ సన్నిధిలో నేను ఇతరుడిగా ఎందుకు నిలవాలి? అదే ఈ విరహానికి
కారణమా? దానిని ఎలా తొలగించాలో నాకు తెలియదు.
|
|
శృంగార భావము |
తాత్విక / భక్తి భావము |
|
ప్రియుడి
విరహంతో ఉన్న నాయికకు ఎక్కడా శాంతి లేదు. మంచంపై పడుకున్నా విశ్రాంతి లేదు; మృదువైన పరుపుపైన ఉన్నా సుఖం కలగదు. |
భక్తుని మనస్సులో దైవముపై ఉన్న తపన, ప్రేమ పొంగుకొస్తున్నాయి. సహజంగానే విశ్రాంతి
లేదా నిద్ర లాంటివి దూరమవుతాయి.. |
|
మనము అనుభవించు నిద్రలో వెనుక మనస్సు పనిచేస్తూనే వుంటుంది.
వాస్తవం చెప్పాలంటే అలసట, విసుగుదల,
పరిశ్రమముల నుంచి ఉపశమనం పొందుతాము. మనము అనుభవించునది
ఆట విడుపు మాత్రమే. కానీ ఆట కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి సంపూర్ణ శాంతిని
పొందము. ఇక్కడ, నాయిక, భక్తుల పరిస్థితి
కూడా అదే. సాల్వడోర్ డాలీ వేసిన నిద్ర (స్లీప్) (1937) ఇదే విషయము చెబుతుంది. |
|
|
ఊయలలో
కూర్చున్నా నిద్ర రావడం లేదు. ప్రియుడి జ్ఞాపకమే మనసును అలుముకుంది.
|
మనస్సు
దైవస్మరణలో నిమగ్నమైతే విశ్రాంతి లేదా నిద్ర లాంటివి సహజంగా దూరమవుతాయి. అంతరంగం
ఒకే తపనలో నిలుస్తుంది.
|
|
ఇక్కడ
పేర్కొన్న ఊయల నాపై ప్రేమ ఉంది,
నాపై ప్రేమ లేదేమోల మధ్య నిరంతరం ఊగిసలాడే సందిగ్ధ ప్రేమ. |
అంతరిక్షపు
ఊయలకు సంకేతం. ఒక వైపు వ్యక్తము . ఇంకోవైపు అవ్యక్తముల మధ్య నిరంతరం ఊగిసలాడే
జీవన స్థితి
|
|
అంచెలఁ గన్నుల నీరు ఆఁపరాదాతనిఁబాసి ప్రియుడిని
తలచుకుంటూ కన్నీళ్లు ఆగవు. రెప్పల వెంట నీళ్లు జారుతూనే ఉంటాయి.
|
అంచెలఁ గన్నుల నీరు ఆఁపరాదాతనిఁబాసి తనకు
దైవానికి మధ్యగల అంతరము పూడ్చలేనిది. దైవముతో కలవలేనన్న భావన భరించరానిది. ఇక కన్నీళ్లు
ఆగవు కదా!
|
|
(ఇప్పుడు మాగ్రిట్ గారి "కోరుకున్న బందిఖానా"
(ఎలెక్టివ్ అఫినిటీస్)ని చూడండి. |
|
|
|
భక్తుని హృదయం దైవం పైనే వుంది. కానీ తనకు దైవానికి మధ్య చెప్పలేనంత దూరాన్ని అనుభవిస్తాడు. దైవమును చేరేదెలా అనే ఆరాటమే కానీ, సర్వసమర్ధుడగు దైవమునకు భక్తుని హృదయం తెలియదా! ఇక్కడే వుంది మర్మము. తానున్న స్థితిలో దైవంపై నమ్మకముంచి ఏమీ చేయక వుండుట. ఏమి చేసినా సంకల్పము లోనివే. అవి పని చేయుచున్నంత వరకు ముక్తి అసాధ్యము (BG6-2) |
|
యించుకంత నిలువలే నెట్లు ధరియింతునే ఇలాంటి స్థితిలో ఒక్క క్షణం కూడా
నిలబడలేను. ఈ విరహాన్ని ఎలా భరించాలో తెలియదు. |
యించుకంత నిలువలే నెట్లు ధరియింతునే దైవసన్నిధి కోసం కలిగిన పై తపనలో చిక్కుకున్న
మనస్సు నిలవదు. ఈ అంతర వేదనను భరించలేదు. |
|
శృంగార భావము
|
తాత్విక / భక్తి భావము
|
|
"పవ్వళించేటిల్లు చూచి ప్రాణము నిలుపరాదు"
పవ్వళించేటిల్లు = పడక గది; (తాత్వికముగా) దేహము
|
|
|
ఇది నాయికకు
ప్రియుడి విరహంలో విశ్రాంతి గది కూడా సేదతీరే స్థలంగా అనిపించకపోవడాన్ని సూచిస్తుంది; ప్రియుని కోసం ప్రాణమే నిలువదు అనే భావం వస్తుంది..
|
భక్తుడు దేహముపై కలిగిన మమకారాన్ని సులభంగా విడిచిపెట్టలేడు. జీవితం
మీదున్న ఆపేక్ష అతనిని బంధించి ఉంచుతుంది.
|
|
"దివ్వెచూచి తాలిమైనఁ దిప్పఁగరాదు"
(దివ్వెచూచి= సూర్యుడు అస్తమించాడు. దీపాలు వెలిగించారు)
|
|
|
రాత్రి
ఐపోయింది. అతడు వస్తాడన్న ఆశా లేదు. ఇక ధైర్యం
కూడా తెచ్చుకోలేదు .
|
సంధ్యా
సమయం ఆసన్నమైంది. చరమ దశ కానవస్తోంది. మనస్తత్వ పరిశీలన:మనిషి తన జీవితంలో ఒక దశలో కాలం గడుస్తున్నదని స్పష్టంగా
గ్రహిస్తాడు. అయినప్పటికీ అతడు తన మమకారాలను విడిచిపెట్టలేడు. అన్నమాచార్యులు ఈ
మానసిక విరోధాన్ని అత్యంత సూక్ష్మంగా సూచిస్తారు.
|
|
"దువ్వటపుఁ బయ్యదపైఁ దోఁగిన తట్టు పుణుఁగు"
దువ్వటపుఁ = శాలువా వంటి
|
|
|
అలంకారంగా
మిగిలిన ప్రియుడి జ్ఞాపకాల పుణుగు పరిమళం
కూడా తొలగిపోతోంది.
|
హృదయంలో
దైవస్మరణకు సంబంధించిన చిన్న గుర్తులన్నీ తొలగిపోతున్నాయ
|
|
"పువ్వుటమ్ము బాసటమై పొక్కెనేమిసేతునే" పువ్వుటమ్ము - పుష్పబాణము
|
|
|
(ప్రియుడి
జ్ఞాపకాలు పోగా) ఆమె ఇప్పుడు మన్మధుని ప్రేరేపణకు బాసటగా నిలిచింది.
|
(దైవస్మరణ పోగా) మన్మధుని పుష్ప బాణాలకు తనువు అనుకూలమై లోలోనికి చొచ్చుకొని
పోతున్నాయి.
|
|
| |
|
శృంగార భావము
|
తాత్విక / భక్తి భావము
|
|
చింతతో ధరించరాదు చెల్లఁ బో మేనైనఁ బోదు
|
|
|
విభుని ప్రేమతో లేడు లేడని చింతతో వున్నా కాలము తానెట్లు బోవునో అట్లే నడచును. జీవితము
భారమై ఈ శరీరమైనా పోదేమీ అనిపిస్తుంది
|
భక్తునికి భగవంతుడు లేని చింత భారమై, భరించరానిదై దేహమైనా పోకూడదా అనిపించును.
|
|
శరీరము, దేహము లేక మానవునికి అస్తిత్వము ఉండదు.
అన్నమాచార్యులు "కర్మము దేహికిఁ గాణాచి" = సహజమైన కర్మము దేహికిఁ చిరకాలవాసస్థానము
= కర్మముతోనే దేహికిఁ మోక్షము కలుగు సంభవం అని అననే అన్నారు. కావున పైన కలిగిన భావము
అసహజమని కవి సూచన
|
|
|
ఇంతటఁ జెలులకైన యెఱుక లేదు
|
|
|
ఆమె చెలికత్తెలకైనా ఆ ఇంగితము లేకపోయె.
|
ఆ "కర్మము దేహికిఁ గాణాచి" అను జ్ఞానము
అతడికి, అతడి పక్కవారికి తెలియదాయె.
|
|
ఇంతలోనె వేంకటేశుఁడింతి మరుఁగుననుండి
|
|
|
(ఇప్పటి దాకా విరహ వేదనను అనుభవించిన ఆమె ఎవరో కాదు.
కవి అన్నమాచార్యులే. ఆయన ఇప్పుడు ఇలా అంటున్నారు.) ఎక్కడో రహస్య
స్థానము నుండి వేంకటేశుఁడు ఆమెను అవరించుకొనె.
|
|
|
యెంతసేసెఁ గలికి వీఁడేమని చెప్పుదునే
|
|
|
తనలో ఏర్పడిన అచింత్యానందమును మాటలలో తెలుపలేక
"వీఁడేమని చెప్పుదునే" అని అన్నారు.
|
|
X-X-The
END-X-X

No comments:
Post a Comment