Saturday, 12 March 2022

112. వేవేలు బంధములు విడువ ముడువఁబట్టె (vEvElu baMdhamulu viDuva muDuvabaTTe)

ANNAMACHARYA 

112. వేవేలు బంధములు విడువ ముడువఁబట్టె

(vEvElu baMdhamulu viDuva muDuvabaTTe)

                                                                                  

Introduction: This is one of the most rhythmic songs. However, The beauty of this poem lies not in beat but in the very expression. Annamacharya is not a philosopher. Not a poet. Not a linguist. Not a king or an emperor. He simply submitted his will to god.  From that ecstasy, he wrote these verses. Each and every verse is an instruction for understanding our state of mind. The natural beauty of flow in language and brevity are divine gifts to him.

Annamacharya said: “This world is so appealing that it draws back everyone like the feast on a table pulls the hungry. On the other-hand man knows the benefits of dissociation. O, strange God! You presented me with both options. I'm not sure of the right choice.” Thus, God gave the choice to man; the man inevitably falters, and forever, he stays in confusion.

ఉపోద్ఘాతము: చాలా లయబద్ధమైన కీర్తనలలో ఇది ఒకటి. అయితే, దీని అందం ప్రాసలో కంటే వ్యక్తీకరణలోనే ఉంది. అన్నమాచార్యులు తత్వవేత్త కాడు. కవి కాడు. భాషావేత్త కాడు. రాజు లేదా చక్రవర్తియో కాడు. అతను తన అంతరంగమును దేవుడికే సమర్పించాడు. ఆ పారవశ్యం నుండి ఉద్భవించిన ప్రతీ కీర్తన సామాన్య మానవుని మానసిక స్థితికి అద్దం పడుతుంది. భాషలో సహజ సౌందర్యం, పదములపై పటుత్వము మరియు సంక్షిప్తత అతడికి స్వతస్సిద్ధముగా  అబ్బినవి.   

“ఈ విశ్వము మనిషిని ఆకలితో ఉన్నవారిని వడ్డించిన విందు ఆకర్షించినట్లు లాగి బంధములలో పడవైచును. ​మరోవైపు మనిషికి వైరాగ్యముతో ప్రయోజనాలు స్పష్టంగా తెలుసు. విచిత్రమైన దేవుడా శ్రీవేంకటపతి వీటిలో ఏది అనుభవించాలయ్యా?” అని ప్రశ్నించారు.

అన్నమాచార్యులు "దేవుడు ఎంపిక మనిషికే వదలివేసినా, అతడు దైవము యొక్క ఆంతర్యము గ్రహించలేక తడబడతాడు.  గందరగోళం నుంచి బయటపడ" డన్నారు. 

 

కీర్తన:

వేవేలు బంధములు విడువ ముడువఁబట్టె

దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా    ॥పల్లవి॥ 

పారీ ముందటి భవపాశములు

తీరీఁ దొల్లిటితిత్తిలో పుణ్యము
వూరీఁ గోరిక లొకటొకటే
యేరీతి సుజ్ఞాన మెరిఁగేనయ్యా     ॥వేవే॥ 

పట్టీ నాకొంగు పంచేంద్రియములు

తొట్టీ బాపము తోడుతనే
పెట్టీ భ్రమలఁ బెరిగి నీమాయలు
అట్టే మోక్ష మెన్నఁ డందేమయ్యా ॥వేవే॥ 

విందై యిహము వెనకకుఁ దీసీ

అందీ వై రాగ్య మరచేతికి
కందువ శ్రీవేంకటపతి యీరెండు
బొందించితి వేది భోగింతునయ్యా ॥వేవే॥

 

vEvElu baMdhamulu viDuva muDuvabaTTe
daivamA ninneTTu tagilEmayyA
pallavi 

pArI muMdaTi bhavapASamulu
tIrI dolliTitittilO puNyamu
vUrI gOrika lokaTokaTE
yErIti suj~nAna merigEnayyA
vEvE 

paTTI nAkoMgu paMchEMdriyamulu
toTTI bApamu tODutanE
peTTI bhramala berigi nImAyalu
aTTE mOksha menna DaMdEmayyA
vEvE 

viMdai yihamu venakaku dIsI
aMdI vai rAgya marachEtiki
kaMduva SrIvEMkaTapati yIreMDu
boMdiMchiti vEdi bhOgiMtunayyA
vEvE

 

 

Details and Explanations:

 

వేవేలు బంధములు విడువ ముడువఁబట్టె

దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా  ॥పల్లవి॥

vEvElu baMdhamulu viDuva muDuvabaTTe
daivamA ninneTTu tagilEmayyA
pallavi 

Word to Word meaning: వేవేలు (vEvElu) = thousands and thousands (of): బంధములు (baMdhamulu) = connections; విడువ (viDuva) = to leave; ముడువఁబట్టె (muDuvabaTTe) = took time to foldup; దైవమా (daivamA) = O God; నిన్నెట్టు (ninneTTu) = How do we; తగిలేమయ్యా (tagilEmayyA)      = get engaged with you? 

Literal meaning: It took lot and lots of time to dismantle thousands of connections and foldup hands. O God! Where is the time to get engaged with you? 

Explanation: Annamacharya is explaining the nature of the action. There is only one step a man can take. That is to submit his will to God. Instead, the man tries to take up the responsibility of breaking the bondages.  We are unable to break numerous bonds, no matter how much we strive in our insignificant ways. 

It’s like, we keep commenting on each and every scene of a movie, in the process losing on not only the beautiful narration but also the director’s intentions. Neither do we enjoy the movie nor allow the people around to grasp it. Often, we feel that we could have made the movie better than that director! Further, in the case of life, we innately feel we can take the right decisions. This is the basic wrong assumption man makes. 

Do we believe in God so much so that we leave everything to God? This is the only question man must answer. This is where most of us falter. We leave some part to the god, keep some to ourselves. What is that discretion which made you to such presumption?   

Therefore, our belief being partial, we remain half-baked. Sir, you cannot derive satisfaction that I am now 80% better. In this examination of life, the only qualification is either you are on this side or the other side. If one knows which side he is, it’s clear that he is here in our muddy waters. This is the only tool available to us. 

The most important point to note in this chorus is “however hard we try to remove the bondages, our efforts are still within the ambit of incremental work”. Note the wording of this chorus, which indicates thousands and thousands of bonds, naturally shall take a long time to get liberated.   

From the words of Annamacahrya and Jiddu Krishnamurti, we can gather that metamorphosis does not take long.   Thus, they are talking of a radical transformation that is different and unrelated to our conventional gradual or step-by-step progression. This journey is not based on prediction and correction, as we do in science and mathematics. 

Implied meaning: Its impossible for me to break the bondages. O God! will I ever get connected with you? 

భావము: ఓ దేవా! వేవేల బంధములు ఒక్కొక్కటీ విడువడనికి, ముడవడానికి చాలా సమయము పడుతూ వున్నది. వీటిల్లో ఇరుక్కునే వుంటే నిన్నెట్టు తెలిసేమయ్యా?

వివరణము: అన్నమాచార్యులు చర్య స్వరూపాన్ని వివరిస్తున్నారు. మనిషి వేయగలిగేది ఒక్క అడుగు. అంటే తననితాను భగవంతునికి సమర్పించుకోవడం. బదులుగా, మనిషి తన బంధాలను విచ్ఛిన్నం చేసే బాధ్యతను చేపట్టడానికి ప్రయత్నిస్తాడు. మానవుడు ఎంత ప్రయత్నించినా బంధాలను తెంచుకోలేకపోవడనికి కారణం, చేపట్టగూడని  చర్య()కు పూనుకోవడమే.

మనం ఒక సినిమాలోని ప్రతి సన్నివేశంపై వ్యాఖ్యానిస్తూనే ఉంటే, అందమైన కథనమునే కాకుండా దర్శకుడి ఉద్దేశాలను కూడా గ్రహించలేము. సినిమాను ఆస్వాదించము; చుట్టుపక్కల వారినీ ఇబ్బందిపెడతాము. సినిమా విషయంలో దర్శకుడి కంటే ప్రతిభావంతంగా చూప గలమని మన నమ్మకం. అలాగే జీవితం విషయంలో, మనం సరైన నిర్ణయాలు తీసుకోగలమని సహజంగానే భావిస్తాము. ఇదే మనిషి వేసే ప్రాథమికమైన తప్పుటడుగు.

అన్నీ దేవుడికే వదిలేసే అంతగా దేవుణ్ణి నమ్ముతామా? మనిషి సమాధానం చెప్పాల్సిన ఏకైక ప్రశ్న ఇదే. ఇక్కడే మనలో చాలామంది తడబడతారు. మనం కొంత భాగాన్ని భగవంతునికి వదిలివేస్తాము; కొంత మనకై ఎంచుకుంటాము. అట్టి విచక్షణకు అధారముమేమి?

కాబట్టి, భగవంతునిపై మన విశ్వాసం పాక్షికమైనా, అయోమయంలో మాత్రము పరిపూర్ణులమే. స్నేహితులారా, నేను ఇప్పుడు 80% మెరుగ్గా ఉన్నానన్న సంతృప్తిని కేవలం భ్రమ​. జీవితం అనే పరీక్షలో, మీరు భగవంతుని వైపా? లేదా? అన్నది మాత్రమే నిర్ణయిస్తారు. వైపు ఉన్నాడో తెలిస్తే, అతడు ఇంకా బురద నీటిలోనే ఉన్నాడని స్పష్టమవుతుంది. ఇదొక్కటే మనకు అందుబాటులో ఉన్న కొలమానం.

పల్లవిలో వేవేల బంధాలను సూచించి సహజంగానే ఒక్కొక్కటిగా దశలవారీ పద్ధతిలో విముక్తి పొందడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. ప్రస్తావించిన సమయంలోనూ మనము ఇంకా కొన్ని బంధాలనూ ఏర్పరచుకుంటాం.   గమనించవలసినది ఏమిటంటే, "బంధాలను తొలగించడానికి మనం ఎంత కష్టపడినాప్రయత్నమనే పని పరిధిలోనే ఉంటాయి".

ఐతే అన్నమాచార్యులు మరియు జిడ్డు కృష్ణమూర్తి మాటల నుండి, రూపాంతరం చాలా కాలం పట్టదని మనం గ్రహించవచ్చు. అందువల్ల, వారు మన క్రమముగా లేదా ఇంచుకించుక దారికి  భిన్నమైన సమూల పరివర్తన గురించి మాట్లాడుతున్నారని తెలియవచ్చు. ప్రయాణం మనం విజ్ఞాన శాస్త్రములోనూ మరియు గణితంలోనూ ముందు ఉజ్జాయింపు వేసి అపై అంచనాల దిద్దుబాటు చేయునట్లుగా ఉండదు.

అన్వయార్ధము: ఈ వేలాది బంధాలను తెంపలేనే. ఓ దేవా! ఎప్పటికి నీతో ఒక్కటౌతానో?

పారీ ముందటి భవపాశములు

తీరీఁ దొల్లిటితిత్తిలో పుణ్యము

వూరీఁ గోరిక లొకటొకటే

యేరీతి సుజ్ఞాన మెరిఁగేనయ్యా    ॥వేవే॥

 

pArI muMdaTi bhavapASamulu
tIrI dolliTitittilO puNyamu
vUrI gOrika lokaTokaTE
yErIti suj~nAna merigEnayyA
vEvE

 

Word to Word meaning: పారీ (pArI) = పర్యాయము, తడవ​, ఆవృత్తి, a time, a repetition; ముందటి (muMdaTi) = previous; భవపాశములు (bhavapASamulu) = bondages of birth; తీరీఁ (tIrI) = delivered; ceased; దొల్లిటితిత్తిలో (dolliTitittilO) = in the previous body; పుణ్యము (puNyamu) = virtue; వూరీఁ (vUrI) = spring up; గోరిక (gOrika) = desire; లొకటొకటే (lokaTokaTE) = one by one; యేరీతి (yErIti) = in what way; సుజ్ఞాన (suj~nAna) = proper knowledge; మెరిఁగేనయ్యా (merigEnayyA) = I will learn;   

Literal meaning: Time and again, previous bondages come in the way. I have usurped my virtuous deeds. Whereas the desires keep springing up inside me. Is there a way for proper knowledge Sir?

Explanation:. In this stanza, Annamacharya is saying that we faithfully carry bondages in the life as well. If we are concerned with our present life, we must find a way to dissociate from them. 

Desires are fuelled by the material nature. This current existence has no meaning without the material body. The ultimate question is where we draw the line between staying alive and gaining intelligence. This is the balance mentioned in Bhagavad-Gita verse 2-48. योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय | सिद्ध्यसिद्ध्यो: समो भूत्वा समत्वं योग उच्यते (yoga-stha kuru karmāṇi saga tyaktvā dhanañjaya siddhy-asiddhyo samo bhūtvā samatva yoga uchyate) Purport:.Be steadfast in the performance of your duty, O Arjun, abandoning attachment to success and failure. Such equanimity is called Yoga. 

Man's duty to find that balance. Instead, he goes in search of God.  What kind of intelligence is this? Each one of us is unique. Therefore, there is no single method/instructions, by which one can possibly get liberated. It’s a journey a man must undertake all by himself. All other movements are circular, i.e., we go back to the point where we started. This is the only journey outside. 

భావము: పదే పదే, మునుపటి బంధాలు అంతరాయములు కలిగిస్తున్నాయి. పుణ్యాలను ఏజన్మకాజన్మలోనే (ఎప్పటికప్పుడు) చెల్లించేసుకుంటాను (తీర్చేసుకుంటాను). అయితే కోరికలు ఊరుతూనే ఉంటాయి. ఇక​ సుజ్ఞాన మెలా తెలిసేదయ్యా?

వివరణము: ఈ చరణంలో అన్నమాచార్య జీవితంలో పూర్వపు కూడా బంధాలను నిష్ఠగా మోస్తాము అన్నారు. మానవుడు ప్రస్తుత జీవితం గురించి నిజంగా ఆందోళన చెందుతుంటే, బంధాలను నుండి విడిపోవడానికి ఖచ్చితంగా ఒక మార్గాన్ని కనుక్కోవాలి.

భౌతిక ప్రకృతి కోరికలకు మూలం. శరీరం లేకుండా ప్రస్తుత జీవితానికి అర్థం లేదు. జీవిస్తూనే సుజ్ఞానమును పొందుటకు కొన్ని కోరికలకు తావు ఇవ్వవలసినదే. ఐతే ఏది అనుభవించ తగ్గది, ఏది కాదో అను జ్ఞానమే భగవద్గీత శ్లోకం 2-48లో ప్రస్తావించబడిన సంతులనం. “యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ । సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే”  (భావము: జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము, ఓ అర్జునా! ఇటువంటి సమత్వ బుద్దియే యోగము అనబడుతుంది).

సమత్వ బుద్ధిని (Equilibrium of mind) కాపాడుకొనుట ఎట్లు? మనస్సును దాటి ఆత్మయందు నిలుకడకలిగినపుడు మాత్రమే అట్టి స్థితి చేకూరగలదు. అదియే యోగస్థితి. మనస్సు ఆత్మల యొక్క కలయికయే యోగము. జీవ పరమాత్మల యొక్క సంయోగమే యోగము. అట్టి యోగస్థితియందే ఈనిర్వికార సమస్థితి ఉదయించును. గావున దానికిన్ని యోగమను పేరిచట పెట్టబడెను. కావున యోగమునందుండి అనగా ఆత్మయందు నిలుకడగలిగి దృశ్యముతో సంగము (Attachment) ను త్యజించి ఫలము యొక్క ప్రాప్తా ప్రాప్తాములందు సమభావముగ కార్యములను జేయుమని భగవాను డానతిచ్చుచున్నాడు. (గీతామకరందము నుండి). 

ఆ సమత్వం కనుగొనడమే మనిషి విధి. బదులుగా, అతడు దేవుడిని వెతక బోతాడు. ఇదేనా తెలివి అంటే? మనలో ప్రతి ఒక్కరు ప్రత్యేకమే. అందువల్ల, విముక్తి పొందడానికి సామాన్య పద్ధతిగాని/సూచనలుగాని లేవు. ఇది మనిషి తనంతట తానుగా సాగించవలసిన ప్రయాణం. ఇతర చలనములన్ని వృత్తాకారంలో ఉంటాయి, అనగా, మనము ప్రారంభించిన చోటికే తిరిగి వెళ్తాము. మోక్షమొక్కటే బయటకు ప్రయాణం. 

అందుకనే సుజ్ఞానము తక్క మిగిలినవాటిని వలయవిద్యలన్నారు. వలయము = గుండ్రనిది, వృత్తం; వలయవిద్య = ఎక్కడ మొదలు పెట్టామో అక్కడకే చేర్చు విద్య = అజ్ఞానము, అవిద్య (సంస్కృతం).

పట్టీ నాకొంగు పంచేంద్రియములు

తొట్టీ బాపము తోడుతనే

పెట్టీ భ్రమలఁ బెరిగి నీమాయలు

అట్టే మోక్ష మెన్నఁ డందేమయ్యా            ॥వేవే॥

 

paTTI nAkoMgu paMchEMdriyamulu
toTTI bApamu tODutanE
peTTI bhramala berigi nImAyalu
aTTE mOksha menna DaMdEmayyA
vEvE

 

Word to Word meaning: పట్టీ (paTTI) = to hold, to catch, to contain;  నాకొంగు (nAkoMgu) = the hem, border of a garment. {పట్టీ నాకొంగు (paTTI nAkoMgu) = కొంగుపట్టుకొని తిరుగు Kogupaṭṭukoni tirugu =విధేయుఁడై యుండు, “become obedient”} పంచేంద్రియములు (paMchEMdriyamulu) = five sense organs;  తొట్టీ (toTTI = తొట్టికొను = వ్యాపించు) = spread; బాపము (bApamu) = sins; తోడుతనే (tODutanE) = immediately, forthwith; పెట్టీ (peTTI) = causing; భ్రమలఁ (bhramala) = illusions; బెరిగి (berigi) = increase; నీమాయలు (nImAyalu)  = your tricks;  అట్టే (aTTE) = just like that, so easily;  మోక్షము (mOkshamu) = liberation; ఎన్నఁ డందేమయ్యా (enna DaMdEmayyA)           = when will we get? 

Literal meaning: I am obedient to these (five) sense organs. The sins spread very quick. They cause illusions. They in turn multiply your tricks. O God! Is there an easy way to get liberation? 

Explanation: aTTE (అట్టే = just like that, so easily) is a very important word used by Annamacharya. We are now used to quick ways. So was the case of man 500 years ago. Man wants to find shortcuts to God. Just imagine, during our college days, we used to rely on books titled ‘Electronics made easy’, Word power made easy’ and books by ‘Khurmi’. Because the word easy attracts us more than anything. I'm not saying the above titles are bad, but I'm referring to the general attitude displayed. 

The height of these shortcuts can be observed in India during the rituals, involving incantations of the names of the god (generally by a priest) on our behalf. We just stay there with folded hands ‘with the intention to grab all the virtue out of this exercise’.  Thus, outsourcing began in the world long back thru the priests.  A credulous man derives satisfaction out of such gullible acts.  Sir, Annamacharya did not write these poems to provide comfort. These magnificent poems are emphasising our stupidity.

భావము: పంచేంద్రియముల కొంగు పట్టుకుని తిరుగుతుంటాను. దానితో వెంటనే పాపములు వ్యాపించుతాయి. వాటితో నీ మాయలు, భ్రమలు పెరిగిపోతాయి. మానవుడా! కష్టపడకుండా అట్టే మోక్షము ఎలా కలుగుతుందయ్యా?

వివరణము: మన కాలేజి రోజుల్లో 'ముప్పై రోజుల్లో ఇంగ్లీష్' 'వర్డ్ పవర్ మేడ్ యీజి'  వంటి పుస్తకాలు లోకప్రియంగా ఉండేవి. ఈ పుస్తకాలు మనకు బాగా ఉపయోగ పడ్డప్పటికీ మన ధోరణిని సూచించుతున్నవి. మనిషి అన్నీ సులభముగా సంపాదించాలని అనుకుంటాడు. అలాగే, మోక్షము కూడా. అందుకే అన్నమాచార్యులు "అట్టే మోక్ష మెన్నఁ డందేమయ్యా" అంటూ మన వైఖరిని గేలి చేశారు.

భారతదేశంలో ఈ అడ్డదారులకు పరాకాష్ట  యజ్ఞములు, యాగములు, తంతులప్పుడు  గమనించవచ్చు. మన తరపున దేవుడి నామావళినో,  మంత్రాలనో  (సాధారణంగా బ్రాహ్మలు) చదువుతారు. మనము పక్కన నిలబడి,  చేతులు జోడించి ఉండి పుణ్యము కొట్టేద్దామనుకుంటాము. అందువలన, ఔట్సోర్సింగ్ (పొరుగు సేవలు) ప్రపంచంలో చాలా కాలం క్రితమే పూజారుల ద్వారా ప్రారంభమైంది. వెర్రివాడు!  మానవుడు ఇటువంటి నామమత్రపు పనులతో భగవంతునికి చేరువలో ఉన్నాననే తృప్తిని సాధించ జూస్తాడు. అయ్యలారా, అన్నమాచార్యులు ఈ అద్భుతమైన చరణములలో మన మూర్ఖత్వాన్ని ఎత్తి చూపారు.

విందై యిహము వెనకకుఁ దీసీ

అందీ వై రాగ్య మరచేతికి

కందువ శ్రీవేంకటపతి యీరెండు

బొందించితి వేది భోగింతునయ్యా         ॥వేవే॥

 

viMdai yihamu venakaku dIsI
aMdI vai rAgya marachEtiki
kaMduva SrIvEMkaTapati yIreMDu
boMdiMchiti vEdi bhOgiMtunayyA
vEvE 

Word to Word meaning: విందై (viMdai) = become feast; యిహము (yihamu) = this world; వెనకకుఁ దీసీ (venakaku dIsI) = pulls back; అందీ (aMdI) = to reach, to obtain, to meet; వైరాగ్యము (vairAgyamu) = freedom from all desires, dispassion, asceticism, అరచేతికి (arachEtiki) = get hold of, with in reach;  కందువ (kaMduva) = జాడ, వింత గొలుపు, trace of, peculiar;  శ్రీవేంకటపతి (SrIvEMkaTapati) = Lord Venkateswara; యీరెండు (yIreMDu) = these two;   బొందించితి (boMdiMchiti) = bestowed, conferred; వేది (vEdi) = which one; భోగింతునయ్యా (bhOgiMtunayyA) = should I enjoy?  

Literal meaning: This world is so appealing that it draws back everyone like the feast on a table pulls the hungry. On the other-hand man knows the benefits of dissociation. O, strange God! You presented me with both options. I'm not sure of the right choice. 

Explanation: the word కందువ has many meanings. Some of them are 1. token, mark, track, place, locality, quarter; 2. Side; 3. season of the year; 4. trick, artifice; 5. skill; 6. Fashion, artificial; 7. false, fictitious; 8. petty, insignificant. Thus, by the wording కందువ శ్రీవేంకటపతి he meant many things here. It primarily means 'tricky/peculiar god' in this context, implying bewilderment in man's thinking. 

Annamacharya meant that God gave choice to man; the man inevitably falters and forever, he stays in confusion. Thus, this poem is rather a criticism of man’s exhibited nature than giving us many insights.

 

This poem in a way similar to inni chaduvanEla yiMtA vedakanEla (ఇన్ని  చదు ల  ఇంత వెదకనేల =  man gets torn between the opposites of YES (worldly pleasures) and NO (path to salvation). 

భావము: ఈ విశ్వము మనిషిని ఆకలితో ఉన్నవారిని వడ్డించిన విందు ఆకర్షించినట్లు లాగి బంధములలో పడవైచును. ​మరోవైపు మనిషికి వైరాగ్యముతో ప్రయోజనాలు స్పష్టంగా తెలుసు. విచిత్రమైన దేవుడా శ్రీవేంకటపతి వీటిలో ఏది అనుభవించాలయ్యా?

వివరణము: కందువ’కు అనేకార్ధములు గలవు. అవి: జాడ; సంకేతస్థలము ఋతువు; ఏకాంతము; మాయచమత్కారము; సామర్థ్యము; ప్రదేశము; (ఈ పదాన్ని విశేషణంగా ఉపయోగించడానికి కొన్ని ఉదాహరణలు: కందువ మాటలు a quibble: a play upon words. కందువ పద్మము a fairy lily, not a real one. కందువ రాజులు mere pretenders: mock warriors.) కందువ శ్రీవేంకటపతి = ‘గమ్మత్తైన/విచిత్రమైన దేవుడు' అనే అర్ధములో వాడారు.

అన్నమాచార్యులు "దేవుడు ఎంపిక మనిషికే వదలివేసినా, అతడు దైవము యొక్క ఆంతర్యము గ్రహించలేక తడబడతాడు.  గందరగోళం నుంచి బయటపడ" డన్నారు. ఆ రకంగా, ఈ కీర్తన మనిషి నిజముగా ప్రదర్శించు స్వభావాన్ని విమర్శించింది.

 

Recommendations for further reading:

4. ఇన్ని చదవనేల (inni chaduvanEla)

15. కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు (kaMchUM gAdu peMchU gAdu kaDubeluchu manasu)

 

Summary of this Keertana:

It took a lot and lots of time to dismantle thousands of connections and fold up hands. O God! Where is the time to get engaged with you? Implied meaning: Its impossible for me to break the bondages. O God! will I ever get connected with you?

Time and again, previous bondages come in the way. I have usurped my virtuous deeds. Whereas the desires keep springing up inside me. Is there a way for proper knowledge Sir? 

I am obedient to these (five) sense organs. The sins spread very quickly. They cause illusions. They in turn multiply your tricks. O, God! Is there an easy way to get liberation? 

This world is so appealing that it draws back everyone like the feast on a table pulls the hungry. On the other-hand man knows the benefits of dissociation. O, strange God! You presented me with both options. I'm not sure of the right choice. 

 

 

కీర్తన సంగ్రహ భావము:

ఓ దేవా! వేవేల బంధములు ఒక్కొక్కటీ విడువడనికి, ముడవడానికి చాలా సమయము పడుతూ వున్నది. వీటిల్లో ఇరుక్కునే వుంటే నిన్నెట్టు తెలిసేమయ్యా? అన్వయార్ధము: ఈ వేలాది బంధాలను తెంపలేనే. ఓ దేవా! ఎప్పటికి నీతో ఒక్కటౌతానో?

పదే పదే, మునుపటి బంధాలు అంతరాయములు కలిగిస్తున్నాయి. పుణ్యాలను ఏజన్మకాజన్మలోనే (ఎప్పటికప్పుడు) చెల్లించేసుకుంటాను (తీర్చేసుకుంటాను). అయితే కోరికలు ఊరుతూనే ఉంటాయి. ఇక​ సుజ్ఞాన మెలా తెలిసేదయ్యా?

పంచేంద్రియముల కొంగు పట్టుకుని తిరుగుతుంటాను. దానితో వెంటనే పాపములు వ్యాపించుతాయి. వాటితో నీ మాయలు, భ్రమలు పెరిగిపోతాయి. మానవుడా! కష్టపడకుండా అట్టే మోక్షము ఎలా కలుగుతుందయ్యా?

ఈ విశ్వము మనిషిని ఆకలితో ఉన్నవారిని వడ్డించిన విందు ఆకర్షించినట్లు లాగి బంధములలో పడవైచును. ​మరోవైపు మనిషికి వైరాగ్యముతో ప్రయోజనాలు స్పష్టంగా తెలుసు. విచిత్రమైన దేవుడా శ్రీవేంకటపతి వీటిలో ఏది అనుభవించాలయ్యా?

 

 

Copper Leaf: 208-4  Volume 3-46

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...