Sunday 10 January 2021

15. కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు (kaMchUM gAdu peMchU gAdu kaDubeluchu manasu)

 

ANNAMACHARYA

15. కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు

Annamayya is describing the wayward nature of mind. The central idea of this verse is that we don’t understand this mind unless we submit to our will to GOD.

 

కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు

యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు ॥పల్లవి॥ ||

 

kaMchUM gAdu peMchU gAdu kaDubeluchu manasu
yeMcharAdu paMcharAdu yeTTidO yImanasu
pallavi 

Word to word meaning: కంచూఁ గాదు (kaMchUM gAdu) = it is neither bell metal; పెంచూఁ గాదు (peMchU gAdu) = neither your pet; కడుఁబెలుచు (kaDubeluchu) = కాఠిన్యము, దయలేమి, very hard, cruel; మనసు (manasu) = mind; యెంచరాదు (yeMcharAdu) = not possible to count/reckon/think/opinion/consider/judge/ imagine; పంచరాదు (paMcharAdu) = not possible to devide/share; యెట్టిదో (yeTTidO) = what kind of thing; యీ మనసు (yI manasu) = this mind. 

Literal Meaning: The vicious mind is neither made of bell metal nor can be compelled to be your pet. We can’t imagine what it is.  And not possible to share what’s going on in the mind.   

Implied Meaning: The cruel mind can’t be polished or made to behave as you want. Neither we can judge its depth nor share what’s going on in the mind. 

Comments: Annamcharya, five hundred years ago said, we don’t understand our mind. Probably, the same statement is being made even today. Therefore he is very accurate.   

Further, he says we cannot tutor it. This is a very significant observation. Probably, the single reason for the chaos in the world is human mind. Jiddu Krishnamurti very often said that meditation is order and all other activities are NOT. 

This is not an isolated statement. As we go along, you shall find many more comparable statements between Annamacharya and Krishnamurti.

భావము: మనిషి మనస్సు కంచూ కాదు, పెంపుడు జంతువులా పెంచడానికీ రాదు, చాలా కఠినమైనది, అది యేమో కూడా తెలియదు, ఇతరులతో పంచడానికీ వీలులేదు అని అన్నమయ్య అన్నారు

 

పట్టఁ బసలేదు చూడ బయలుగాదీమనసు

నెట్టనఁ బారుచునుండు నీరూఁ గాదీమనసు

చుట్టిచుట్టి పాయకుండుఁ జుట్టమూఁ గాదీమనసు

యెట్టనెదుటనే వుండు నేఁటిదో యీమనసు ॥కంచూఁ॥

 

paTTa basalEdu chUDa bayalugAdImanasu
neTTana bAruchunuMDu nIrU gAdImanasu
chuTTichuTTi pAyakuMDu juTTamU gAdImanasu
yeTTaneduTanE vuMDu nETidO yImanasu
kaMchU

 

Word to word meaning: పట్టఁ బసలేదు (paTTa basalEdu) = to catch it does not have residence; చూడ బయలుగాదీమనసు (chUDa bayalugAdImanasu)  to observe it does not get open;  నెట్టనఁ బారుచునుండు (neTTana bAruchunuMDu) = it may move/flow anyway/ any direction; నీరూఁ గాదీమనసు (nIrU gAdImanasu)  = yet it is not  water (a  liquid); చుట్టిచుట్టి పాయకుండుఁ  (chuTTichuTTi pAyakuMDu) =  it circles around Constantly (without intermission); జుట్టమూఁ గాదీమనసు = చుట్టమూఁ గాదీమనసు  (juTTamU gAdImanasu = chuTTamU gAdImanasu) = its neither your relation; యెట్టనెదుటనే వుండు yeTTaneduTanE vuMDu) = it’s in front of you; నేఁటిదో యీమనసు  (nETidO yImanasu) = what kind of thing is this mind?

 

Literal Meaning: We can’t catch, for it has no specific place of dwelling. It doesn’t reveal itself for inspection/introspection. It moves here and there and in all directions, yet it’s not a liquid. It circles your thoughts, but not a relation. It’s in front of you. But know not what kind of thing this mind is.

 

Comments: Observe that Annamacharya said is not possible to understand mind by introspection; Jiddu Krishnamurti also said the same thing. 


భావము: అది యెక్కడ వుంటుందో తెలియదు. తానేమో విశ్లెషణద్వారా బయటపెట్టదుఎటైనా వెళ్ళవచ్చు చెప్పలేము. నీరు కాకపోయినా, అన్ని వేళలా నిన్నే చుట్టి వుంటుంది. ఎట్ట యెదుటే వున్నా మనస్సేమో (మనిషికి) తెలియదు.

 

రుచు లెల్లాఁ గానుపించు రూపు లేదు మనసు

పచరించు నాసలెల్లాఁ బసిఁడి గాదీమనసు

యెచటాఁ గరఁగదు రాయీఁ గాదు మనసు

యిచటా నచటాఁ దానే యేఁటిదో యీమనసు ॥కంచూఁ॥

ruchu lellA gAnupiMchu rUpu lEdu manasu
pachariMchu nAsalellA basiDi gAdImanasu
yechaTA garagadu rAyI gAdu manasu
yichaTA nachaTA dAnE yETidO yImanasu
kaMchU


Word to word meaning: రుచు లెల్లాఁ గానుపించు (ruchu lellA gAnupiMchu) = it makes you aware of all the tastes;  రూపు లేదు మనసు (rUpu lEdu manasu) = yet it doesn’t have a shape; పచరించు నాసలెల్లాఁ (pachariMchu nAsalellA)  = (పచరించు = ఏర్పఱుచు, గోచరింపచేయు, తపించు)  rakes up all the desires; బసిఁడి గాదీమనసు (basiDi gAdImanasu) = yet is not gold; యెచటాఁ గరఁగదు (yechaTA garagadu) = it does not melt for any thing; రాయీఁ గాదు మనసు (rAyI gAdu manasu) = neither it is a stone;  యిచటా నచటాఁ దానే (yichaTA nachaTA dAnE) = it is here and there as well; యేఁటిదో యీమనసు  (yETidO yImanasu) = what kind of thing this mind is?

 

Literal Meaning: The mind makes aware of all the tastes; yet it does not have a shape. Though not made of gold, it rakes up the desires. It does not melt for anything, neither it is stone. It’s there everywhere for the beholder. What kind of thing this mind is?  

Comments: See how clear the mind of Annamcharya is! 


భావము: రూపు లేదు కానీ రుచులకు రూపమిస్తుంది. బంగారము కాకపోయినా ఆశలను రేకెత్తిస్తుంది. దేనికీ కరగదు, అట్లని రాయీ కాదు. అక్కడా ఇక్కడా తానేయై మనిషిని భ్రమింపజేస్తుంది. 

 

తప్పక నాలోనుండు దైవముఁ గాదు మనసు

కప్పిమూఁటగట్టరాదు గాలీఁ గాదు మనసు

చెప్పరాని మహిమల శ్రీవేంకటేశుఁ దలఁచి

యిప్పుడిన్నిటా గెలిచె నేఁటిదో యీమనసు

tappaka nAlOnuMDu daivamu gAdu manasu
kappimUTagaTTarAdu gAlI gAdu manasu
chepparAni mahimala SrIvEMkaTESu dalachi
yippuDinniTA geliche nETidO yImanasu
kaMchU 

Word to word meaning: తప్పక నాలో నుండు (tappaka nAlO nuMDu) = I know it is inside me; దైవముఁ గాదు మనసు (daivamu gAdu manasu) = I know it is not god; కప్పిమూఁటగట్టరాదు  (kappimUTagaTTarAdu) = it can’t covered ( by a blanket etc.) and folded into a bundle; గాలీఁ గాదు మనసు (gAlI gAdu manasu) = its not air; చెప్పరానిమహిమల (chepparAni mahimala) = (with the help of) indescribable miracles of; శ్రీవేంకటేశుఁ దలఁచి (SrIvEMkaTESu dalachi) = by remembering lord Venkateswara;  యిప్పుడిన్నిటా గెలిచె (yippuDinniTA geliche) = I am able to win; నేఁటిదో యీమనసు (nETidO yImanasu) = what kind of thing this mind is?

 

Literal Meaning: I know it is inside me, but it’s not god. It can’t be covered (by a blanket etc.) and folded into a bundle, but it’s not air. (With the help of) indescribable miracles by remembering lord Venkateswara (the GOD), I am able to win. Yet I know not what kind of thing this mind is.

 

Comments: This verse alone can be show cased as great observation powers of Annamacharya.

 భావము: మనస్సు నాలోనే వుండేదిదైవము కానిదిమూటగట్టరానిదీ అట్లని శూన్యమూ కాదు. శ్రీవేంకటేశుని మహిమల వలన ఎన్నో తెలుసుకుంటిని గానీ మనస్సు ఏమో తెలియదు.

zadaz

 

 

Reference: Copper Leaf: 104-3, Volume: 2-21

 

 

 

 

3 comments:

  1. The description of "Manasu" with such clarity is amazing.👍😊

    ReplyDelete
  2. Interesting read , thank you for sharing the meaning

    ReplyDelete
  3. అంతరింద్రియమైన మనసు కఠినమైనది. అలాగని కంచు కాదు.అలాగే పెంపుడు జంతువు వలె నీవు చెప్పినట్లు వినునది కూడ కాదు.దాని లోతును నీవు ఊహించనూలేవు.
    మనసును పట్టియుంచలేవు.
    ఏలయన ఆది చంచలమైనది, స్థిరంగా ఒక చోట ఉండెడిది కాదు. అలాగని ద్రవపదార్ధం కాదు.
    ఆత్మపరిశీలనకు అందనిది.అది నీకు అతి సమీపంలోనే ఉంటుంది కాని అది గ్రహించబడనిది/ తెలియబడనిది.
    రూపు లేనిది కాని రుచులకు రూపునిచ్చునది. అంటే మనసుకు ఒక రూపమైతే లేదు కాని దానికి అన్ని రుచులు తెలుసు. జ్ఞానేంద్రియముల ద్వారా పంచ తన్మాత్రలు అనగా శబ్ద,స్పర్శ, రూప,రస, గంధములను అనుభవించునది.అది స్వర్ణము కాకున్నా,కోరికలకు బీజం వేస్తుంది మనసు.పలుచోట్ల పరిభ్రమిస్తూ,మనిషిని భ్రమింపజేస్తుంది.అది కరుగనిదైనా పాషాణము కాదు. అదేమిటో అంతుపట్టనిది.

    అంతరింద్రియమై నాలోనే యున్న మనసు దైవం కాదు.దానిని కప్పియుంచలేము. అలాగే మూట కట్టలేము.

    శ్రీ వేంకటేశ్వరుడి అనుగ్రహం వలన చాలా విషయములను తెలిసికొంటిని కాని మనసును మాత్రం తెలియకున్నాను అని అన్నమయ్య మనసు యొక్క క్లిష్టతను(complexity) ఈ కీర్తనల్లో లోకులకు చెబుతున్నారు
    🙏

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...