Saturday, 10 December 2022

T-152 ఏణనయనల చూపులెంత సొబగైయుండు

 తాళ్లపాక అన్నమాచార్యులు

152 ఏణనయనల చూపులెంత సొబగైయుండు


for EnglishVersion press here

 

క్లుప్తముగా:  మన్మథుని బాణాలకు గురియయిన చిత్తము ఏదో వినగూడని రహస్యము వినపడినట్లు చెవులు నిక్కబెట్టుకొని దారిలో సాగిపోతుంది.

Summary of this Poem:

పల్లవి: సొగసుతో మంత్రముగ్ధులను చేసే అందమైన జింక (అమ్మాయిల​) కళ్ళ వలె ప్రాణసంకటములగు పనులు వాటి వైపు లాగుతాయి. 

చరణం 1: కోరికలు అడియాసలను రేపుతూ జీవితములో విరామం లేకుండా ఉక్కపోతను,  వేడిమిని నింపినట్లనిపింప చేస్తాయి. అంతులేని దుఃఖాన్ని దాచుతూ ప్రపంచం మెరుస్తూ అలరిస్తుంది. 

చరణం 2: అంతులేని ఆలోచనలతో మనస్సు నుండి చిరాకు, చింత, విచారములు వైదొలగవు. ఏదో రహస్యము చెబుతున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకొని విన్నట్లు చిత్తము మన్మథుని బాణాల దారిలో నిమగ్నమైపోతుంది.

చరణం 3: దేవుఁడొక్కఁడె యనెడి వివేకము వెంకటేశ్వరుని కృపతో సమానము.  భావోద్వేగాలను అర్థం చేసుకునే పరిపక్వత స్వేచ్ఛా సౌఖ్యమునకు సంకేతము. అన్వయార్ధము: అనుకంపము, దయ, అనుగ్రహము గల మనస్సుకు హద్దులుండవు. వాటి అవగాహనయే స్వేచ్ఛ (కైవల్యము).

 

విపులాత్మక వివరణ 

Introduction: అత్యంత గాఢమైన కీర్తనలో అన్నమాచార్యులు పాఠకుణ్ణి "స్వేచ్ఛలో వున్న మానసిక స్థితి ఏమిటో కనుగొనమని ప్రశ్నిస్తారు"? మనమందరం స్థితిని చేరుకొనుటకు భగవంతుని ఆశీస్సుల కోసం ఎదురుచూపులు చూస్తుంటాము.  "ఈశ్వరుని అనుగ్రహము లేకుండా, మనం ఒక్క క్షణమైనా మనగలమా?" అని అర్థం చేసుకోము. బదులుగా, మనకు అది లేదు, ఇది లేదని ఫిర్యాదులు చేస్తూనే ఉంటాము. 

 

ఒక విధంగా చూస్తే కీర్తనకు క్రింద యిచ్చిన భగవద్గీత శ్లోకం ఆధారమనిపిస్తుంది. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే 
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః 2-46 

భావము: ఒక చిన్న బావి ద్వారా ప్రయోజనం నెరవేరుతుందో అది సహజంగా పెద్ద సరస్సు ద్వారాను సమకూరును. అదేవిధంగా, వేదాలను అనుసరించిన యే శాంతి  ఆనందములను పొందుదుమో, వానినే, యోగి తనను తాను తెలియుట ద్వారా పొందుతాడు. 

కీర్తన:

రాగిరేకు:  16-5  సంపుటము: 1-99

ఏణనయనల చూపులెంత సొబగైయుండు
ప్రాణసంకటములగు పనులు నట్లుండు    ఏణ॥
 
ఎడలేని పరితాప మేరీతిఁ దానుండు
అడియాస కోరికలు నటువలెనె యుండు
కడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండు
అడరు సంసారంబు నట్లనే వుండు           ఏణ॥
 
చింతాపరంపరలఁ జిత్తమిది యెట్లుండు
వంతఁ దొలఁగని మోహవశము నట్లుండు
మంతనపుఁ బనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గముల గతి యట్లనుండు      ఏణ॥
 
దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు
శ్రీవేంకటేశు కృపచేత లట్లుండు
భావగోచరమైన పరిణతది యెట్లుండు
కైవల్యసౌఖ్యసంగతులు నట్లుండు            ఏణ॥

 

Details and Explanations: 

ఏణనయనల చూపులెంత సొబగైయుండు
ప్రాణసంకటములగు పనులు నట్లుండు           ఏణ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఏణ = పెద్దకన్నులు గల నల్లయిఱ్ఱి (కృష్ణవర్ణ జింక). 

భావము: సొగసుతో మంత్రముగ్ధులను చేసే అందమైన జింక (అమ్మాయిల​) కళ్ళ వలె ప్రాణసంకటములగు పనులు వాటి వైపు లాగుతాయి. 

వివరణము:  ఇక్కడఏణ నయనల చూపులేంత సొబగైయుండు’ అన్నది మనలోని ఊహాత్మక ఆలోచనలను సూచిస్తుందే తప్ప వాస్తవమును కాదు.

సినిమాల్లో మనం విలన్'ని సులభంగా గుర్తిస్తాం. అయితే నిజజీవితంలో ఒక సమస్య నుండి ఇంకో సమస్య; దాని నుంచి మరొకటి అలా అలా అగాథములో ఇరుక్కుపోతాము.  సినిమాలు, నాటకలు చూస్తున్నప్పుడు వున్న లక్ష్య దృష్టిని (objective outlook), నిజ జీవితంలో ఉపయోగించక నిర్ణయములు మనసుతో చూసి నిర్ధారిస్తాము. 

 

ఎడలేని పరితాప మేరీతిఁ దానుండు
అడియాస కోరికలు నటువలెనె యుండు
కడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండు
అడరు సంసారంబు నట్లనే వుండు       ఏణ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: అడరు = వర్థిల్లు, ప్రకాశించు. 

భావము: కోరికలు అడియాసలను రేపుతూ జీవితములో విరామం లేకుండా ఉక్కపోతను,  వేడిమిని నింపినట్లనిపింప చేస్తాయి. అంతులేని దుఃఖాన్ని దాచుతూ ప్రపంచం మెరుస్తూ అలరిస్తుంది. 

వివరణము: పల్లవిని విడమరుస్తూ అన్నమాచార్యులు మనము వ్యర్థమైన ఆశలతో లాగబడతామన్నారు. తళుకుబేళుకుల బయటి ప్రప౦చ౦ ఆశల సౌధాన్ని నిర్మింప చేస్తుంది. దానితో మానవుడు ప్రాపంచిక వ్యవహారాలలో మునిగిపోతాడు.   

చింతాపరంపరలఁ జిత్తమిది యెట్లుండు
వంతఁ దొలఁగని మోహవశము నట్లుండు
మంతనపుఁ బనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గముల గతి యట్లనుండు  ఏణ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: చింతాపరంపరలఁ = అంతరాయం లేని ఆలోచనల; వంతఁ = చిరాకు/విచారం; మంతనపుఁ = రహస్యాలోచన; కంతుశరమార్గముల = మన్మథుని బాణాల దారిలో. 

భావము: అంతులేని ఆలోచనలతో మనస్సు నుండి చిరాకు, చింత, విచారములు వైదొలగవు. ఏదో రహస్యము చెబుతున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకొని విన్నట్లు చిత్తము మన్మథుని బాణాల దారిలో నిమగ్నమైపోతుంది. ​ 

వివరణము: రెనె మాగ్రిట్టే వేసిన "చూచు ఆలోచన రూపము" (“the thought which sees”) అనే శీర్షికతో ఉన్న పెయింటింగ్'ను చూడమని పాఠకులకు అభ్యర్థన​. చిత్రంలో మనం ఒక వ్యక్తిని వెనుక నుండి చూస్తాము. దానితోపాటు వ్యక్తి యొక్క నీడ కూడా మనకు కనబడుతుంది. ఇది దృశ్య క్షేత్రంలో కొంత భాగాన్ని కప్పివేస్తుంది.



 

రెనే మాగ్రిట్టే ఇలా అంటాడు "మనం చూసే ప్రతిదీ మరొక విషయాన్ని దాచిపెడుతుంది; మనం చూసేదాని ద్వారా దాచినదాన్ని చూడాలని మనం ఎల్లప్పుడూ కోరుకుంటాము. ఏది దాగి ఉందో, ఏది మనకు కనిపించదో దానిపై ఆసక్తి ఉంటుంది. ఆసక్తి చాలా తీవ్రమైన భావన, ఒక రకమైన సంఘర్షణ రూపంలో ఉంటుంది, ఇది దాగి ఉన్న దృశ్యానికి మరియు కనిపించేదానికి మధ్య ఒక రకమైన సంఘర్షణగా చెప్పవచ్చు."

మాగ్రిట్ తత్వవేత్త కాదని గుర్తుంచుకోండి, కానీ అతను తన పరిశీలనలను పంచుకుంటున్నాడంతే. "ఆలోచన అనేది జ్ఞాపకశక్తి యొక్క ప్రతిస్పందన, అందువల్ల అది మనిషికి విముక్తి కలిగించదని" జిడ్డు కృష్ణమూర్తి తరచుగా చెప్తుండేవారు. విధంగా అన్నమాచార్యులు, ఆధునిక తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి, చిత్రకారుడు మాగ్రిట్టేలు ముగ్గురూ "ఆలోచన మనిషిని విముక్తం చేయజాలదని" చెబుతున్నారు. పైగా ఆలోచన అడ్డంకులను సృష్టిస్తుందని వారు నొక్కి చెప్పారు. 

దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు
శ్రీవేంకటేశు కృపచేత లట్లుండు
భావగోచరమైన పరిణతది యెట్లుండు
కైవల్యసౌఖ్యసంగతులు నట్లుండు        ఏణ॥ 

భావము: దేవుఁడొక్కఁడె యనెడి వివేకము వెంకటేశ్వరుని కృపతో సమానము.  భావోద్వేగాలను అర్థం చేసుకునే పరిపక్వత స్వేచ్ఛా సౌఖ్యమునకు సంకేతము. 

వివరణము: అన్నమాచార్యులు చిన్న చరణంలో అనేక విషయాలను ప్రస్తావించారు. దైవానుగ్రహము లేక మన జీవనముండదని గ్రహించము. కృపను గుర్తించ లేమంతే. అందువల్ల, మనల్ని మనం కాపాడుకునే చర్యలను అవలంభిస్తాం. ఇవియే అజ్ఞానపుటడుగులు. 

అందువలన, "దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు" అంటే మనం భగవంతుని ఉనికిని పగటి వెలుగులో నీడను చూసినంత కరాఖండిగా తెలుసుకోలేము అని అర్ధము. విధంగా మొదటి రెండు పంక్తుల సారాంశము భగవంతుని దయ ప్రత్యక్ష అనుభవమున తెలియలేమని సూచిస్తున్నాయి. 

భావోద్వేగాలపై మన ప్రస్తుత అవగాహన ఉపరితల స్థాయిలో ఉంటుంది. మొదట భావోత్పన్నము. తర్వాత కదలికను  గుర్తించడం ద్వారా అవగాహన పొందుతాము. అందువల్ల, ఏళ్ళు పైబడి కూడా మనం అపరిపక్వంగానే ఉంటామని విమర్శిస్తూపెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము#1  అని అన్నమాచార్యులు అన్నారు. అటువంటి అపరిపక్వమైన మనస్సుతో మనం స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియబోతాము. ఫలితాలు అందుకు తగ్గట్టుగానే ఉంటాయి.

ఇప్పుడు రెనే మాగ్రిట్టే వేసిన ది  ల్యాండ్ స్కేప్ ఆఫ్ బౌసిస్  (Le Paysage De Baucis) అనే చిత్రాన్ని చూడమని పాఠకులను విన్నపము. ఓవిడ్ రచించిన మెటామార్ఫోసెస్ (Ovid's Metamorphoses) నుండి ఒక పౌరాణిక వ్యక్తి బౌసిస్. ఒక విధ౦గా, బౌసీస్, ఆయన భార్య ఫిలేమోను అదృశ్య౦గా ఉ౦డడ౦ ద్వారా దేవుళ్ళను తమలో నివసి౦చడానికి అనుమతి౦చారు. తమ హృదయపు వాకిళ్ళను మూసివేసిన ఇతరులు నాశనమయ్యారు.

పెయింటింగ్ శీర్షికలో పేర్కొన్న ప్రకృతి దృశ్యం (landscape) వీక్షకుడితో సహా కనుపాఱునంత క్షేత్రము. పై చిత్రంలో మనం బౌసిస్ యొక్క కళ్ళు, ముక్కు మరియు పెదవులను మాత్రమే చూస్తాము. మిగిలిన చిత్రం బట్టలు, టై మరియు టోపీ వంటి బాహ్య అచ్ఛాదనలు అతనికి (బౌసిసె'కి) రూపాన్ని కల్పిస్తున్నాయి. అతడి కళ్ళు, ముక్కు, పెదవులు మరియు టోపిల మధ్య ఖాళీ చూపి అతని జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని అందించడానికి మాత్రమే పనిచేస్తున్నాయి, అతడి మనస్సు ఖాళీగా చూపటంతో అందుకున్న సమాచారము పరావర్తనము, వక్రీకరణము చెందక ఋజు మార్గమును అనుసరించును అని తెలిపిరి. అటువంటి ఋజువర్తనముగల బౌసిస్ హృదయంలో దేవతలు (సత్యము) వసించారంటే ఆశ్చర్యమేమీ?    మన మనస్సులు అనుభవం మరియు ఇష్టాయిష్టాలు అనే పదార్థాలతో నిండినప్పుడు, అవి అందుకున్న సమాచారమును ఋజు మార్గము నుండి మరలించును. రకంగా మనము సత్యమును పక్కకు మళ్ళిస్తున్నాముమనవ౦టి వారికి విమోచన ఎక్కడు౦టుంది? 

మనము ప్రకృతిని సమర్ధవంతముగా పనిచేయనివ్వక జోక్యము చేసుకుంటాము. మనము "నేను" అను అభేద్యమైన కోటను నిర్మించబోతాము.   భగవద్గీతలో పేర్కొన్న సమత్వము "నేను" మరియు 'ప్రకృతి' మధ్య సమతుల్యత. సమతుల్యత పుస్తకాలు చదివియో, అభ్యాసము చేసియో సాధించునది కాదు. 

అందువల్ల, చివరి రెండు పంక్తులు ఆలోచన ద్వారా కల్పించని, ఇష్టాయిష్టాలతో సంబంధము లేని మరియు తానున్న స్థితిని కూడా గుర్తించలేని మనస్సుకు మాత్రమే స్వేచ్ఛ అను స్పృహ కలుగును. మనము ఉవ్విళ్ళూరి సంపాదించు జ్ఞానం ఒక శాపమే కానీ ఆనందం కాదు. అందుకే అన్నమాచార్యులు "ఎఱుఁగుటకంటే నెఱఁగమే మేలు / మఱి తెలివికంటే మఱుపే శుభము" అన్నారు. 

చరణం దివ్య స్థితి యొక్క అత్యద్భుత వ్యక్తీకరణ, స్థితికి చేరిన వ్యక్తి క్రింది భగవద్గీతలో చెప్పినట్లుగా ఇది వెలుపల, ఇది లోపల అను వ్యత్యాసాన్ని మరచును: ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున । సుఖం వా యది వా దుఃఖం యోగీ పరమో మతః ।। 6-32 ।। భావము: ఓ అర్జునా!  సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ (తన ఆత్మవంటిదే తక్కినవారి ఆత్మయనెడు భావముతో), ఇతరుల సుఖమునుగాని, దుఃఖమునుగాని తనకే చెందినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. 

కాబట్టి తత్వవేత్తలు కోవకు (ప్రాగ్-పశ్చిమాల) చెందినవారైనా, వారు ప్రకటించిన సత్యమొక్కటే (దేవుఁడొక్కఁడె). అన్నమాచార్యులు ఇంత ప్రగాఢమైన ప్రకటన చేయుటకు మానవులకు సాధ్యమగు అన్ని హద్దులను దాటి వుంటారు. ఆత్మను సత్యంతో నిజంగా ఏకము చేయకుండా అటువంటి భాష సాధ్యం కాదని నేను నమ్ముతున్నాను. సత్యమును వాస్తవముగా స్పృశించిన అన్నమాచార్యులను మహర్షి మన మధ్య నివసించారని రాబోయే తరాలు గుర్తుంచుకుంటారని నేను ఖచ్చితంగా భావిస్తాను. 

అన్వయార్ధము: అనుకంపము, దయ, అనుగ్రహము గల మనస్సుకు హద్దులుండవు. వాటి అవగాహనయే స్వేచ్ఛ (కైవల్యము).

References and Recommendations for further reading: 

#1 35. పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము (pe~rugaga be~rugaga beddalamaitimi nEmu)

  

 

-X-The End-X-

Friday, 9 December 2022

152 ENanayanala chUpuleMta sobagaiyuMDu (ఏణనయనల చూపులెంత సొబగైయుండు)

 

ANNAMACHARYULU

152 ఏణనయనల చూపులెంత సొబగైయుండు

(ENanayanala chUpuleMta sobagaiyuMDu)

 

for Telegu (తెలుగు) Version press here

 

Synopsis:  The mind focuses on the path taken by Cupid's arrow, as if listening to a secret counsel.

Summary of this Poem:

Chorus: Actions that lead to adversity / misfortune pull towards them like the beautiful and mesmerising eyes of a beautiful lady. 

Stanza 1: Vain hopes are similar to sorrow without interval; the rising (or shining) world is similar to endless grief. 

Stanza 2: Uninterrupted thoughts are unending submission to illusion. The mind focuses on the paths traced by Cupid's arrows as if it were secret advice. 

Stanza 3: The wisdom that knows that the God is one is similar to the compassion of the Lord Venkateswara. The maturity that understands the emotions are similar to the exhilarations of freedom. Implied meaning: A compassionate mind knows no boundaries. Freedom is awareness of that benevolence.   

 

Detailed Presentation

Introduction: In one of the most deep poems Annamacharya asks the reader to find what is state of mind in freedom? All of us are looking for blessings of the lord to be in that state.  Do we ever understand that without the blessings of the Lord,  "shall we be the beings as we are?" Instead, we keep complaining that we lack this, we lack that. 

In a way this poem is based on the Bhagavad-Gita verse below.

यावानर्थ उदपाने सर्वत: सम्प्लुतोदके |
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत: ||2-46||

yāvān artha udapāne sarvataḥ samplutodake
tāvānsarveṣhu vedeṣhu brāhmaṇasya vijānataḥ 

Purport: Whatever purpose is served by a small well of water is naturally served in all respects by a large lake. Similarly, Whatever peace/bliss is attained following the Vedas, the yogi has all that peace/bliss in self knowledge.

 

కీర్తన:

రాగిరేకు:  16-5  సంపుటము: 1-99

POEM

Copper Leaf:  16-5 Volume: 1-99


ఏణనయనల చూపులెంత సొబగైయుండు
ప్రాణసంకటములగు పనులు నట్లుండు    ఏణ॥
 
ఎడలేని పరితాప మేరీతిఁ దానుండు
అడియాస కోరికలు నటువలెనె యుండు
కడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండు
అడరు సంసారంబు నట్లనే వుండు           ఏణ॥
 
చింతాపరంపరలఁ జిత్తమిది యెట్లుండు
వంతఁ దొలఁగని మోహవశము నట్లుండు
మంతనపుఁ బనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గముల గతి యట్లనుండు      ఏణ॥
 
దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు
శ్రీవేంకటేశు కృపచేత లట్లుండు
భావగోచరమైన పరిణతది యెట్లుండు
కైవల్యసౌఖ్యసంగతులు నట్లుండు            ఏణ॥

ENanayanala chUpuleMta sobagaiyuMDu
prANasaMkaTamulagu panulu naTluMDu ENa
 
eDalEni paritApa mErIti dAnuMDu
aDiyAsa kOrikalu naTuvalene yuMDu
kaDalEni du@hkhasaMgati yeTlu dAnuMDu
aDaru saMsAraMbu naTlanE vuMDu ENa
 
chiMtAparaMparala jittamidi yeTluMDu
vaMta dolagani mOhavaSamu naTluMDu
maMtanapu banulapayi manasu mari yeTluMDu
kaMtuSaramArgamula gati yaTlanuMDu ENa
 
dEvuDokkaDe yaneDi telivi danakeTluMDu
SrIvEMkaTESu kRpachEta laTluMDu
bhAvagOcharamaina pariNatadi yeTluMDu
kaivalyasaukhyasaMgatulu naTluMDu ENa 


Details and Explanations: 

ఏణనయనల చూపులెంత సొబగైయుండు
ప్రాణసంకటములగు పనులు నట్లుండు           ఏణ॥

ENanayanala chUpuleMta sobagaiyuMDu
prANasaMkaTamulagu panulu naTluMDu ENa

Word to word meaning: ఏణ (ENa) = a black buck (here it is indicating a beautiful lady); నయనల (nayanala) = eyes; చూపులెంత (chUpuleMta) = looks/glances; సొబగైయుండు (sobagaiyuMDu) = appear beautiful; ప్రాణసంకటములగు (prANasaMkaTamulagu) = leading to calamity / adversity; పనులు (panulu) = deeds, work; నట్లుండు (naTluMDu) = are that way; 

Literal meaning: Actions that lead to adversity / misfortune pull towards them like the beautiful and mesmerising eyes of a beautiful lady. 

Explanation: In movies, we easily recognise the villain. Whereas in real life we simply fall the side which pulls further into it. While watching movies, we are, in general objective. While in life, we are mostly subjective.

Here wording ఏణ నయనల చూపులెంత సొబగైయుండు (ENanayanala chUpuleMta sobagaiyuMDu) indicates the thoughts conceived in the mind, not necessarily true, but appears to be true. 

ఎడలేని పరితాప మేరీతిఁ దానుండు
అడియాస కోరికలు నటువలెనె యుండు
కడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండు
అడరు సంసారంబు నట్లనే వుండు       ఏణ॥
 
eDalEni paritApa mErIti dAnuMDu
aDiyAsa kOrikalu naTuvalene yuMDu
kaDalEni du@hkhasaMgati yeTlu dAnuMDu
aDaru saMsAraMbu naTlanE vuMDu ENa 

Word to word meaning: ఎడలేని (eDalEni) = without interval; పరితాప (paritApa) = sorrow;  మేరీతిఁ (mErIti) = like; దానుండు (dAnuMDu) = it being; అడియాస (aDiyAsa) = vain hope; కోరికలు (kOrikalu) = desires; నటువలెనె (naTuvalene) = they in a similar way; యుండు (yuMDu) = being; కడలేని (kaDalEni) = endless;  దుఃఖసంగతి (du@hkhasaMgati) = grief-stricken matter; యెట్లుఁ (yeTlu) = how; దానుండు (dAnuMDu) = it being; అడరు (aDaru) = rising, shining; సంసారంబు (saMsAraMbu) = this world; నట్లనే (naTlanE) = that way; వుండు (vuMDu) = stays; 

Literal meaning: Vain hopes are similar to sorrow without interval; the rising (or shining) world is similar to endless grief. 

Explanation: Continuing the intent of the chorus, Annamcharya says, we get dragged by futile hopes. The world outside shines to provide substance to such hopes. Hope after hope takes the attention away and man gets submerged in the worldly affairs.   

చింతాపరంపరలఁ జిత్తమిది యెట్లుండు
వంతఁ దొలఁగని మోహవశము నట్లుండు
మంతనపుఁ బనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గముల గతి యట్లనుండు  ఏణ॥
 
chiMtAparaMparala jittamidi yeTluMDu
vaMta dolagani mOhavaSamu naTluMDu
maMtanapu banulapayi manasu mari yeTluMDu
kaMtuSaramArgamula gati yaTlanuMDu        ENa 

Word to word meaning: చింతాపరంపరలఁ (chiMtAparaMparala) = of uninterrupted thoughts;  జిత్తమిది (jittamidi) = this mind;  యెట్లుండు (yeTluMDu) = is similar to; వంతఁ (vaMta) = vexation/ regret; దొలఁగని (dolagani) = does not step aside; that does not recede; మోహవశము (mOhavaSamu) = submitting to illusion; నట్లుండు (naTluMDu) మంతనపుఁ (maMtanapu) = secret counsel, secret consultation;  బనులపయి (banulapayi)  = on deeds; మనసు (manasu) = mind; మరి (mari) = still, further; యెట్లుండు (yeTluMDu) = how it remains;  కంతుశరమార్గముల (kaMtuSaramArgamula) = on the paths made by arrows of cupid;  గతి (gati) = movement; యట్లనుండు (yaTlanuMDu) = stays that way.

Literal meaning: Uninterrupted thoughts are unending submission to illusion. The mind focuses on the paths traced by Cupid's arrows as if it were secret advice.

Explanation: Request readers to have a look at the painting titled “the thought which sees” by Rene Magritte. In this picture we see a man from behind, looking away from us. We also see a shadow of that person was cast which is partly covering the field of view.



Rene Magritte said “Everything we see hides another thing; we always want to see what is hidden by what we see. There is an interest in that which is hidden and which the visible does not show us. This interest can take the form of a quite intense feeling, a sort of conflict, one might say, between the visible that is hidden and the visible that is present.”

Remember Magritte is not a philosopher, but he is simply sharing his observations. Jiddu Krishnamurti also often said thought is a response of memory and hence cannot liberate man. Thus, modern day philosopher Jiddu Krishnamurti, artist Magritte and Annamacharya are saying that thought cannot liberate man. Rather they assert that thought creates obstacles.

దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు
శ్రీవేంకటేశు కృపచేత లట్లుండు
భావగోచరమైన పరిణతది యెట్లుండు
కైవల్యసౌఖ్యసంగతులు నట్లుండు        ఏణ॥
 
dEvuDokkaDe yaneDi telivi danakeTluMDu
SrIvEMkaTESu kRpachEta laTluMDu
bhAvagOcharamaina pariNatadi yeTluMDu
kaivalyasaukhyasaMgatulu naTluMDu ENa 

Word to word meaning: దేవుఁడొక్కఁడె (dEvuDokkaDe) = God is one (used in the sense of truth is only thing that survives); యనెడి (yaneDi) = said; తెలివి (telivi) = wisdom; దనకెట్లుండు (danakeTluMDu) = how one can feel; శ్రీవేంకటేశు (SrIvEMkaTESu) = Lord Venkateswara; కృపచేత (kRpachEta) = by his compassion; లట్లుండు (laTluMDu) = impresses that way;  భావగోచరమైన (bhAvagOcharamaina) = that can be felt by the emotions; పరిణతది (pariNatadi) = maturity; యెట్లుండు (yeTluMDu) = how to know; కైవల్యసౌఖ్యసంగతులు (kaivalyasaukhyasaMgatulu) = the exhilaration of freedom felt; నట్లుండు (naTluMDu)         = are that way.           

Literal meaning: The wisdom that knows that the God is one is similar to the compassion of the Lord Venkateswara. The maturity that understands the emotions are similar to the exhilarations of freedom. 

Explanation: Annamacharya had filled many things in this small stanza. Do we know that we are receiving the grace of the god all the time? Because we donot recognise those blessings, we feel we are left to fend for ourselves. This is the action of ignorance. 

Thus, by the wording దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు dEvuDokkaDe yaneDi telivi danakeTluMDu  means that we shall never know existence of God consciously. Thus the first two lines implies that the implicit  benevolence of god is intangible for experience. 

Our present understanding of the emotions are through the recognition after the movement at superficial level. Therefore, Annamacharya said  we are remain immature despite aging. He said పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము#1 {pe~rugaga be~rugaga beddalamaitimi nEmu We are elders only by age}. With such immature mind we go about to measure what freedom is? Results are obvious. 

Now request the readers to refer to a picture titled the of Baucis’s landscape (Le Paysage De Baucis) by Rene Magritte. Baucis, is a mythical figure from Ovid's Metamorphoses. In a way, Baucis and his wife Philemon allowed the gods to reside in them by being invisible. Others who shut their doors were destroyed.


 

The landscape mentioned in the title of the painting is the entire field of vision including the viewer. In the above picture we see only eyes, nose and lips of the Baucis’s figure. Rest of the figure is made up of external coverings like clothes, tie and hat. For Baucis, the sense organs are working only to provide information, his mind being empty do not lead to reactive atmosphere like in our mind. For such person, the very seeing is the action.  Idea of this painting is that when we are full of substance called experience and knowledge, we are not allowing the truth to reside, rather deflecting it. For such people, like us, where is the deliverance? 

Without accepting the nature to act on its own, we interfere to build a castle called “I”. Equanimity talked in Bhagavadgita is the balance between this “I” and nature. This balance is not a forced or practiced equilibrium of knowledge and judgement we make, but outside it. 

Therefore, the last two lines are stating the mind that is not put together by thought, non-judgemental and unaware of its own state only may know what freedom is. Cognition is rather a curse, not a bliss. Hence Annamacharya said ఎఱుఁగుటకంటే నెఱఁగమే మేలు /మఱి తెలివికంటే మఱుపే శుభము​ e~ru@MguTakaMTE ne~ra@MgamE mElu /ma~ri telivikaMTE ma~rupE Subhamu Rather not knowing is better / forgetting (oblivion) is better than consciousness. 

This stanza is an ultimate expression of a state, in which the person does not feel difference between outside and inside as stated in Bhagavadgita below: आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन | सुखं वा यदि वा दु:खं स योगी परमो मत: || 6-32|| Purport: God said "I regard him to be perfect yogi who feel the true equality of all living beings and respond to the joys and sorrows of others as if they were his own." 

Thus sirs, truth, as envisioned by eastern or western philosophers, remain one and the same (దేవుఁడొక్కఁడె). Annamacharya crossed all the boundaries to give such a profound statement. I wonder, such language would not be possible without truly uniting the self with the truth. For the generations to come, I am sure, will remember that a sage Annamacharya lived amongst us who has truly touched by the truth. 

Implied meaning: A compassionate mind knows no boundaries. Freedom is awareness of that benevolence.   

 References and Recommendations for further reading: 

#1 35. పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము (pe~rugaga be~rugaga beddalamaitimi nEmu)

 

 

-X-The End-X-

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...